శ్లో|| ఆపదర్థే ధనం రక్షేద్దారాన్ రక్షేద్ధనైరపి*
*ఆత్మానం సతతం రక్షేద్దారైరపి ధనైరపి* . . . . . 19
*--పంచతంత్రం. కా.కీ.2-87.*
అపద వస్తే ఉపయోగపడడానికి ధనం సంపాదించాలి. అటువంటి ధనం ద్వారా భార్యను రక్షించుకోవాలి. అలాగే, భార్య వలన, ధనం వలన తనను తాను నిత్యం రక్షించుకోవాలి.
శ్లో === లోష్టమర్ధీ తృణ చ్చెదీ నఖఖాదీ చ యోనరః |
శ్లో === నశ్యత్యనాయకం కార్యం తధైవ శిశునాయకమ్
స్త్రినాయకం తధోన్మత్త నాయకం బహునాయక మ్ ...... 44
భావము === యజమాని లేని పని జెసిననూ చెడిపోవును. పిల్లల పిత్తనంగల పనిని గాని, స్త్రీ యజమానిగా గల కార్యము గాని, పిచ్చి ప్రభుత్వమూ నందలి పనులు గాని, పెక్కుమంది నాయకులు యజమానిగానున్న కార్యము గాని చెడిపోవును. కావున వీరు యజమానులుగా గల కార్యములు వదిలి వేయవలెనని, దీని అర్ధము, చేసినను చెడిపోవును.
--((**))--
శ్లో|| ఆపదర్థే ధనం రక్షేద్దారాన్ రక్షేద్ధనైరపి*
*ఆత్మానం సతతం రక్షేద్దారైరపి ధనైరపి* . . . . . 19
*--పంచతంత్రం. కా.కీ.2-87.*
అపద వస్తే ఉపయోగపడడానికి ధనం సంపాదించాలి. అటువంటి ధనం ద్వారా భార్యను రక్షించుకోవాలి. అలాగే, భార్య వలన, ధనం వలన తనను తాను నిత్యం రక్షించుకోవాలి.
బహిర్భ్రమతి యః కశ్చిత్ త్యక్త్వా దేహస్థ మీశ్వరం
తన దేహమందే ఉన్న దైవాన్ని వదలి, బయట దైవంకోసం వెతుకుతూ తిరిగేవాడు , తన ఇంటిలో ఉన్న పాయసాన్ని విడిచి పరగృహాల్లో బిచ్చమెత్తుకునే మతిహీనుడు.
షడేతే యాత్ర తిష్టంతి తత్ర దేవో పి తిష్టతి || ............... ........3
భావము === ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి , పరాక్రమము, అను ఈ ఆరును గల వాని యందే దేవుడు కూడా వసించి యుండును.
--((**))--
ప్రియం చ నానృతం బ్రూయా| దేశధర్మస్సనాతనః || ......... 13
భావము === నిజమునే చెప్పవలెను. అదియును ప్రియముతో చెప్పవలెను. ప్రియము కాని సత్యమును చెప్పరాదు. ప్రియమైన అబద్దము లాదరాడు . పూర్వ కాలము నుండి వచ్చే ధర్మ మిదియే .
--((**))--
శ్లో === విప్రాణాం జ్ఞానతో జ్యైష్ట్యం క్షత్రియాణంతు విర్యతః
వైశ్యానాం ధన ధన్యాభ్యాం శూడ్రాణా మేవ జన్మతః || ......... 14
భావము === బ్రాహ్మణులలో పండితుడును, రాజులలో బలవంతుడు వైశ్యులలో ధనవంతుడు, శూద్రులలో వయస్సు వచ్చినవారు పెద్ద వారగుదురు.
--((**))--
శ్లో === ఉత్తమా కులవిధ్యాచ మాధ్యమా కృషి వాణిజౌ|
అదమా సేవకావృత్తి ర్మ్రుత్యు శ్చౌర్యోప జీవనమ్ || ....... ....... 5
భావము === సొంత కుల వృత్తిచే జీవించుట ఉత్తమమైనది. వ్యాపార, వర్తకము వలననూ కృషివలననూ జీవించుట మధ్యమము. ఒకరి క్రింద పనిచేసి జీవించుట అధమము. దొంగిలించుట మృత్యువును కొని తెచ్చుకొనుట యేయని ఎరుగ వలెను. దొంగతనము కంటే మరణమే మేలు.
--((**))--
శ్లో === రాజవట్ పంచ వర్షాణి దశ వర్షాణి దాసవట్ |
ప్రాప్తేతు షోడశే వర్షే పుత్త్రం మిత్త్రవ దాచరేట్ || ......... 6
భావము === కొడుకుని అయిదెండ్లవరకు రాజువలె ను. పడెండ్లవరకు నౌకరుగాను, పదహారవ ఏట నుండి స్నేహితుని వలెను చూచి పెంచవలెను.
--((**))--
శ్లో === ఉపకారేన నీచానా మపకారో హి జాయతే |
పయః పాణం భుజ నాం కేవలం విషవర్ధనమ్ || .... ...... 7
భావము === నీచులకు ఉపకారము చేసిననూ అది అపకారమే అగును. పామునకు పాలిపోసి పెంచినను. దానివిషము తగ్గునా? వృద్ది చెందును.
--((**))--
శ్లో === నా గచ్చేద్రాజ యుగ్మంచ నా గచ్చేద్ర్భాహ్మణ త్రయం
చతుశ్మూద్రా నా గాచ్చేయ ర్నగ చ్చే ద్వైశ్య పజ్జకం || .... ...... 8
భావము === ఇద్దరు రాజులు, ముగ్గురు బ్రాహ్మణులు,నలుగురు శూద్రులు, ఐదుగురు వైశ్యులు కలిసి పనికి పోరాదు.
--((**))--
...................................
జ్ఞాన లభ్యం పరం మోక్షం ప్రాహు: తత్వార్థ చింతకాః
తద్ జ్ఞానం భక్తిమూలం హి భక్తి: కర్మవతాం తథా ....... 15
తా:--పరమ పదమైన మోక్షము జ్ఞానము వలన లభ్యమైనదే నని తత్వచింతకులందురు.
ఐతే ఆ జ్ఞానమేమో భక్తి లేనిదే లభ్యము కాదనిన్నీ, ఆ భక్తి కూడా కేవలం కర్మవల్లే
సాధ్యమనిన్నీ మర్చిపోకూడదు. అనగా కర్మలే పునాదిగా వుంటున్నవని తాత్పర్యము.
--((**))--
ఆదరేణ యథా స్తవుతి ధనవంతం ధనేచ్ఛయా
తథా చే ద్విశ్వకర్తారం కో న ముచ్యేత బంధనాత్ ...... 16
తా:--ధనము మీది ఆశచేత సంపన్నుని ఆశ్రయించి, వానిని స్తుతి చేస్తారు కదా! దాని
కన్నాసమస్త జగత్పతి యైన పరమేశ్వరుని స్తుతి చేసినచో సంసారబంధనములనుండి ముక్తి బొందును కదా!
--((**))--
భావము === ఒకరు ధరించిన పాదరక్షలు, వస్త్రములు, యజ్ఞోపవితము ఆభరణాలంకారములు, పూలమాలలు, కమండలములు మరియొకరు ధరిమ్పరాడు.
శ్లో === లోష్టమర్ధీ తృణ చ్చెదీ నఖఖాదీ చ యోనరః |
త్రైలోక్య దిపకో ధర్మః సుపుత్రః కులదిపకః ..... 45
భావము === చంద్రుడు రాత్రియందు వెలుగు నిచ్చును, పగటి యందు సూర్యుడు వెలుగు నిచ్చును, ముల్లోకములను ప్రకాశింప జేసేది ధర్మ మొక్కటే అట్లే కుమారుడు మంచి వాడై నచో ఆ కులము ప్రకాశించును.
--((**))--
శ్లో === గీతే వాద్యే తదానృత్యే సంగ్రామ రిపుసంకటే
ఆహారే వ్యహదాహరే చ త్యక్తలజ్జః సుఖిభవేట్ ........ 46
భావము === పాడుతున్నపుడు గాని, వాద్యము వాయించు నప్పుడు గాని, ఆడునప్పుడు గాని, యుద్దము చేయునప్పుడు గాని, శత్రువులకు చిక్కులు కలిగినప్పుడు గాని, భోజనము చేయునపుడు గాని, వ్యవహారము చేయు నప్పుడు గాని, సిగ్గు విడిచిన వారికి సుఖము ప్రాప్తించును.
--((**))--
ఆయూంషి విధ వాహన్తి సర్వం హన్తి పరాజ్గానా || ..... ........9
భావము === దాసిదానితో సంగ మించుట వలన మానభంగము కలుగుతుంది. వేశ్యతో కూడుత వలన ధనము పోతుంది. విధవా స్త్రీతో రమించుట వలన ఆయువు తగ్గి పోతుంది. ఇతర స్త్రీలతో రమించుట వలన సర్వస్వము పోగొట్టుకొందురు.
శ్లో === ఋణాను బంధురూపేణ పశుపత్నీ సుతా లయాః|
ఋణ క్షయే క్షయం యాన్తి కాతత్ర పరివేదనా || .... ....... 10
భావము === పశువులు, భార్యలు, కొడుకులు, ఇండ్లు, వీరందరూ మన ఋణానుబంధముగా కలుగుతారు. ఋణము తిరిపోగానే ఎవరిమటుకు వారు కనుమరుగవుదురు .దీనికి ఇంత విచారమేల?
శ్లో === వృద్దార్కో హోమ దుమశ్చ బాలాస్త్రి నిర్మలోదకమ్
రాత్రే క్షిరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధి ర్దినే దినే || .... ..... 11
భావము === సాయంకాలపు ఎండ, హోమంపొగ , తన వయస్సు కంటే తక్కువ వయస్సు దానితో సంగమము, స్వచ్చమైన నీరు సేవించుట రాత్రులందు పాలుపోసుకుని అన్నము తినుట ఇవి ఆయువును దినడినా భివ్రుద్ది చేయును.
శ్లో === ఉపాన హౌచ వాసశ్చ ధృత న్యైర్ణ ధారయేట్|
ఉపవిత మలంకారం శ్రాజం కరకమేవ చ.|| ...... 12
భావము === ఒకరు ధరించిన పాదరక్షలు, వస్త్రములు, యజ్ఞోపవితము ఆభరణాలంకారములు, పూలమాలలు, కమండలములు మరియొకరు ధరిమ్పరాడు.
శ్లో === ఋణం చయాచ్నా వృద్దత్వం జారచోర దరిద్రతా |
రోగశ్చ భుక్త శేషశ్చా ప్యష్టకష్టః ప్రకీర్తితాః || . . . . . . . . . 17
భావము === అప్పులపాలగుట, యాచనము, ముసలితనము, జారత్వము కలిగి యుండుట, దొమ్గాగుట, దరిద్రుదగుట, రోగము, ఒకరు తినగా మిగిలిన భోజనము తినుట యను నీ ఎనిమిదింటిని అష్టకష్టులందురు.
శ్లో === అమృతం సద్గుణా భార్యా అమృతం బాల భాషితమ్ |
అమృతం రాజసమ్మాన మమృతం మాన భోజనమ్ || . . . . . . 18
భావము === సుగుణములు గల భార్య, పిల్లలపలుకులు, రాజుల గౌరవము , మిత భోజనము[లేక ఆదరనతో పెట్టిన హోజనము ] అమ్రుతముతో సమానమని భావము.
అల్పవస్తవునందును మిక్కలి వీర్యవంతమగు ఔషధము నందు వలెనే పెధ్ద గుణము కానవచ్చును
పెరుగుట విరుగుట కొఱకే
గుడ్డివాడునూతిలోపడగా వాడిననుసరించవచ్చువారలును నూతియందునపడిరి. రెంటికీ ఒకే అర్థము.
అధకస్యాధికం ఫలం20
పాపపుఫలమే ఎక్కవగాకలుగును సందర్భాన్నిబట్టి వాడవలయును.
భావము -== డబ్బు, చుట్టరికాలు, వయస్సు , కర్మము, విద్య, ఈ యైదును పూజ జియమైనవి. గౌరవించదగినవి. ఇవి ఒకదాని కంటే మరొకటి ఉన్నతము. ధనము కంటే బంధుత్వము, బంధుత్వము కంటే, వయస్సు, వయస్సు కంటే క ర్మము, కర్మము కంటే విద్యయు శ్రేష్టమైనవి. కావున విద్యావంతుడు. అందరికంటే మిన్నాయని చెప్పదగును.
శ్లో === లోభశ్చేదగుణే నకిం? పిశునతాయద్యస్తి కిం పాతకై?
స్సత్యం చేత్తపసా చ కిం ? శుచి మనో యద్యస్తి తిర్దేనకిమ్ ?
సౌజన్యం యది కిమ్బలేన ? మహియా యద్వాస్తి కిం మండనై ?
సద్విద్యా యది కిం ధనై ? రపయశో యద్యస్తి కిం మృత్యునా ? ....... 41
భావము -=== లోభి తనము కన్నను చెడ్డ గుణము, ఇతరులపై నిందలు వేయుట కన్న మహాపాపము, సత్య ము కంటే తపస్సు, స్వచ్చమైన మనస్సు కంటే తీర్ధము, సౌజన్యము కంటే బలము, గొప్ప దానము కన్న అలంకారము, మంచి విద్య కంటే ధనము, అపకీర్తి కన్న మృత్యువు లేవు.
--((**))--
న చ శత్రురవజ్ఞేయః దుర్బలో౽పి బలీయసా |
అల్పో౽పి హి దహ్యత్యగ్నిః విషమల్పం హినస్తి చ ||
(మహాభారతం)
తానెంతో బలవంతుడైనా, శత్రువు ఎంత బలహీనుడైనాకాని వానిని కించపరచరాదు.
అగ్ని కొంచెమే అయినా అంతటినీ దహించేస్తుంది. కొద్దిపాటిదైనా విషం ప్రాణాన్ని తీసివేస్తుంది.
న ద్విషంతి న యాచంతే పరనిందాం న కుర్వతే |
అనాహూతా న చాయాంతి తేనాశ్మానోఽపి దేవతాః ||
(సుభాషితరత్నభాండాగార)
ద్వేషించరు; యాచించరు; ఇంకొకరిని నిందించరు; పిలువకపోతే రారు; ఈ కారణాలవల్ల శిలలు కూడ దేవతలే!
మణినా వలయం వలయేన మణిః మణినా వలయేన విభాతి కరః |
కవినా చ విభుర్విభునా చ కవిః కవినా విభునా చ విభాతి సభా |
శశినా చ నిశా నిశయా చ శశీ శశినా నిశయా చ విభాతి నభః |
పయసా కమలం కమలేన పయః పయసా కమలేన విభాతి సరః ||
(సుభాషితరత్న-భాండాగార)
"మెరుస్తున్న ముత్యం ఉంగరంతో మరింత అందంగా అనిపిస్తుంది; అలాగే ఉంగరం ముత్యం వల్ల మరింత అందంగా తయారవుతుంది. ముత్యం, ఉంగరం—ఈ రెండింటి కలయిక చేతిని రెట్టింపు అందంగా చూపిస్తుంది. కవితో రాజుకు, రాజుతో కవికి, ఈ రెండు కారణాల వల్ల సభకు అందం పెరుగుతుంది. చంద్రుడు రాత్రిని శోభింపజేస్తాడు, రాత్రి చంద్రుణ్ణి మరింత అందంగా చేస్తుంది. చంద్రుడు, రాత్రి—ఈ రెండింటి కలయిక వల్ల ఆకాశం మరింత శోభిల్లుతుంది. నీటితో కమలం అందంగా కనబడుతుంది, కమలంతో ఆ నీరు కూడా మరింత ఆకర్షణీయంగా మారుతుంది. నీరు, కమలం—ఈ రెండింటి సహవాసం సరస్సును మరింత మలచి అందంగా చేస్తుంది."
ఒకదానితో మరొకటి మిళితమైతే రెండు భాగాలూ పరస్పరం అందాన్ని పెంచుకోవటమే కాక, వాటి సమస్త రూపాన్ని కూడా మరింత ఆకర్షణీయంగా మార్చుకుంటాయి. దీని నిరూపణకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
చెట్టు, తీగ - ఇవి ఒకదానితో మరొకటి పరిపూర్ణతను పొందుతాయి. వాస్తవానికి వీటి పరస్పర సహకారం ఒక సుందరమైన భావన. కనుచూపున కనిపించే దాని కంటే లోతైన తాత్త్వికత మరింత లోనికి తీసుకెళ్తుంది.
జానపద పరమార్థం:
వనవాస సమయంలో రాముడు, సీత, లక్ష్మణుడు చిత్రకూటంలో ఉన్నారు. లక్ష్మణుడు కందమూలఫలాలను తీసుకురావడానికి వెళ్లాడు. రామ, సీతలు పెద్ద చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ చెట్టు కాండంపై ఒక అందమైన తీగ చుట్టుకుని ఉంది.
సీత చెప్పింది: "ఈ తీగ ఎంత అదృష్టవంతమైనది! ఇంత గొప్ప చెట్టు ఆధారం దొరికింది!"
రాముడు మృదువుగా సమాధానమిచ్చాడు: "కాదు, సీత! ఇంత మనోహరమైన తీగ తన చుట్టూ పెరిగినందువల్ల ఈ చెట్టే అదృష్టవంతమైనది!"
ఇది పరోక్షంగా రాముని గురించి సీతయూ, సీతను గురించి రాముడూ అంతరంగంలో పొందివున్న భావంయొక్క సాంకేతిక ప్రకటన అని వివరించనక్కర లేదు!
ఇంతలో లక్ష్మణుడు తిరిగి వచ్చాడు. వారు నిర్ణయించమని అడిగారు.
లక్ష్మణుడు చిరునవ్వుతో చెప్పాడు: "నేను తీర్పు చెప్పలేను. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను: అదృష్టవంతుడు చెట్టూ కాదు, వల్లీ కాదు. నిజమైన అదృష్టవంతుడు - ఈ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్న నేను!"
ప్రథమా ప్రతిమా పూజా౦ జపస్తోత్రాది మధ్యమా |
ఉత్తమా మానసీ పూజా సోఽహంభావోత్తమోత్తమా ||
ప్రారంభంలో ప్రతిమా పూజ. దానికంటె మేలైనది జపం, స్తోత్రం ఇత్యాదులు.
ఉత్తమమైనది భగవద్రూపాన్ని ధ్యానించడం. ఇంకా అత్యుత్తమమైనది ʼఅతడు నేనేʼ
(సః+అహం = సోఽహం = అతడు నేనే) అని భావించడం.
వ్యసనానంతరం సౌఖ్యం స్వల్పమప్యధికం భవేత్ |
కాషాయరసమాస్వాద్య స్వాద్వతీవాంబు విందతే ||
(సుభాషితరత్నభాండాగారం)
దుఃఖాన్ని అనుభవించిన పిదప వచ్చే అల్ప సౌఖ్యమూ కూడా అతిశయంగా సుఖకరంగా ఉంటుంది. చేదైన ఔషధాన్ని సేవిసించినవాడికి నీళ్ళు కూడ చాల రుచికరంగా కనిపిస్తుంది!
యో మే గర్భగతస్యాపి వృత్తిం కల్పితవాన్ ప్రభుః |
శేషవృత్తివిధానాయ స కిం సుప్తోఽథవా మృతః ||
(అలంకార మణిహారః)
ఏ పరమాత్ముడు నేను గర్భంలో ఉండినప్పటికీ నా జీవితపు సంరక్షణను చేపట్టాడో, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన నిద్రించేవాడు కాదు, మరణించేవాడు కూడా కాదు అని ఉన్నప్పుడు, నా జీవితంపై నేను ఎందుకు చింతించాలి?
దమూలమిదం జ్ఞానం భార్యామూలమిదం గృహమ్ |
కృషిమూలమిదం ధాన్యం ధనమూలమిదం జగత్ ||
(నరసింహ సుభాషితం)
జ్ఞానానికి మూలం వేదమైతే, గృహానికి మూలం భార్య. ధాన్యానికి మూలం కృషి లేక వ్యవసాయం. ఈ ప్రపంచం మొత్తం నడవడానికి మూలం ధనం.
న మాతా శపతే పుత్రం న దోషం లభతే మహీ |
న హింసాం కురుతే సాధుః న దేవో సృష్టినాశకః ||
తల్లి తన కుమారుడిని శపించదు. నాశనం చేసినా భూమి నాశనమవ్వదు. సజ్జనులు పరహింస చేయరు. దేవుడు తన సృష్టిని విధ్వంసం చేయడు.
విపదో నైవ విపదః సంపదో నైవ సంపదః |
విపద్ విస్మరణం విష్ణోః సంపన్నారాయణస్మృతిః ||
విపత్తులు విపత్తులు కావు; ఐశ్వర్యాలు ఐశ్వర్యాలు కావు; విష్ణువును మరచిపోవడమే నిజమైన విపత్తు; ఆయనను స్మరించుకోవడమే నిజమైన సంపద.
వాసుదేవే భగవతి భక్తిముద్వహతాం నృణామ్ |
జ్ఞానవైరాగ్యవీర్యాణాం నేహ కశ్చిద్వ్యపాశ్రయః ||
(భాగవతం)
భగవంతునిపై దృఢమైన భక్తి ఉన్న మనుషులు జ్ఞానము, వైరాగ్యం, శక్తి కలవారు. వారికి ఈ లోకంలో ఎవరి ఆశ్రయమూ అవసరం లేదు.
నాభ్యుత్థానక్రియా యత్ర నాలాపా మధురాక్షరా |
గుణదోషకథా నైవ తత్ర హర్మ్యే న గమ్యతే ||
(పంచతంత్రం)
నిలచి స్వాగతించని వాడి తీపి మాటలు పలకని వాడి కష్ట సుఖాలను విచారించని వాడి
ఇంటికి వెళ్ళకూడదు.
అణురప్యసతాం సంగః సద్గుణం హంతి విస్తృతమ్ |
గుణరూపాంతరం యాతి తక్రయోగాద్యథా పయః ||
మంచివారిగానే ఉండాలంటే మంచివారి సహవాసమే చేయాలి. ఒక్కసారి అయినా చెడ్డవారి సహవాసం కలిగినా నశించటం ఖాయం. పాలు ఎంత శుద్ధంగా ఉన్నా, ఎంత పరిమాణంలో ఉన్నా, అందులో కొంచెమే మజ్జిగ కలిసినా, వాటి గుణం, స్వరూపం, రుచి, లక్షణం అన్నీ పూర్తిగా మారిపోతాయి కదా?
కృతే పాపేఽనుతాపో వై యస్య పుంసః ప్రజాయతే |
ప్రాయశ్చిత్తం తు తస్యోక్తం హరిసంస్మరణం పరమ్ ||
(విష్ణుపురాణం)
పాపకృత్యమును చేసిన పిదప ఏ మనిషికి దానివల్ల పశ్చాత్తాపమౌతుందో అతనికి శ్రీహరిస్మరణ ఉత్తమమైన ప్రాయశ్చిత్తమవుతుంది
నేటి ప్రాంజలి ప్రభ కొత్త కీర్తన
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
నిన్ను నమ్మే హనుమాన్
నన్ను మార్చే భగవాన్
మన్ను మిన్నూ పదిలమ్ -- ప్రార్ధనే రామా
సమ్మ తమ్మే సమానమ్
సామదానం సహాయమ్
ప్రేమ దారే వినోదమ్ -- సౌఖ్యమే రామా
సేవ భావమ్ సమానమ్
దైవ పూజా ప్రధానమ్
హావ భావం ప్రభావమ్ - ప్రాంతమే రామా
విద్య దానం విధానమ్
మంద బుద్దే వినాశమ్
వేద పాఠం సహాయమ్ - విశ్వమే రామా
ఈ విశాల ప్రపంచమ్
ఈ విధానం నిబద్ధమ్
ఈ వినాశం ప్రయత్నమ్ -- హావమే రామా
సఖ్య తన్ మూ గనైతిన్
ఆకలిన్ ఆశనైతిన్
వాకిలిన్ మార్పుకోరిన్ --- వాదమే రామా
మాట మంచే జయమ్మున్
మంచి దారే వివాహమ్
కాల మాయే నిదానమ్ - శాంతమే రామా
ప్రేమ భావమ్ము గాదా
ప్రేమ దైవమ్ము గాదా
ప్రేమ జీవమ్ము గాదా -- దైవమే రామా
నిత్య జీవమ్ము గీతా
సత్య ప్రాణమ్ము గీతా
ముత్యమై వెల్గు గీతా -- భగవాన్ రామా
నిన్ను నమ్మే హనుమాన్
నన్ను మార్చే భగవాన్
మన్ను మిన్నూ పదిలమ్ -- ప్రార్ధనే రామా
6. కదలికలుగా సఖ్యతే మదన కళగా రమ్యతే
శ్లో॥సుఖస్యానన్తరం దుఃఖం దుఃఖస్యానన్తరం సుఖమ్!
ద్వయమేతద్ధి జన్తూనామలంఘ్యం దినరాత్రివత్!!
సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తరువాత సుఖం తప్పకుండా వస్తుంటాయి. ఏ ప్రాణీ కూడా వీటినుండి తప్పించుకోలేదు. ఇవి దివారాత్రాలంత సహజంగా వరుసక్రమంలో వస్తూనే ఉంటాయి. విచారంనుండి తప్పించుకోవాలంటే సంతోషంలోకి వచ్చితీరాలి. సంతోషం వద్దనుకుంటే విచారం వచ్చి తీరుతుంది. ఈ ద్వంద్వాలలో దేనిని కోరినా నిరాకరించినా రెండవది తప్పకుండా ఉండనే ఉంటుంది. సముద్రంలో తిన్నగా వెళుతున్న కొద్దీ తరంగాలను తప్పించుకోలేం.
శ్లో॥ దివ్యచ్ఛాయా పథస్తత్ర నక్షత్రాణ్యను మండలం
దృశ్యతే భాసురా రాత్రా దేవీ త్రిపధగా తుసా..
ఆదియుగాలలో దేవతలు భూమి మీదకు తరచుగా వచ్చి ఎక్కువ కాలం ఉండి వెళుతుండేవారు. మొదటవారు దేవికా నదీతీరంలో దిగినారని పురాణాల ఉద్ఘాటన.హిమాలయాలు వారి నిత్యవిహార భూములు. కాళిదాస మహాకవి ఈ పర్వతాన్ని దేవతాత్మ అని వర్ణించాడు..
శ్లో॥ అస్త్యుత్తరాస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః
పూర్వాపరౌ వారినిధీ విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండ:
తూర్పు పడమర సముద్రాల మధ్య భూమిని కొలిచే మానదండం (కొలబద్ద వలె ఉన్నది హిమాలయం. ఆది దేవతలకు ఆత్మస్థానం. అందులోనిది మానస సరస్సు. భారతంలో ఈ సరస్సుకు బిందు సరస్సని పేరుంది.
శ్లో𝕝𝕝 నాస్తి మేఘసమం తోయం నాస్తి చాత్మసమం బలమ్|
నాస్తి చక్షుఃసమం తేజో నాస్తి ధాన్యసమం ప్రియమ్||
తా𝕝𝕝 మేఘ జలముతో సమానమైన శుద్ధజలము లేదు.....ఆత్మ బలముతో సమానమైన బలము శరీరములో కాని పృథివిలో కాని రెండవది లేదు....కన్నుతో సమానమైన తేజస్సు గల యింద్రియము శరీరములో మఱొకటి లేదు..... ధాన్యముతో (అన్నముతో) సమానమైన వస్తువు మఱొకటి లేదు.
శ్లో॥ పద్మసంభవారాధితం ప్రభుం మర్మయోగినాం మంత్రసిద్ధిదం
వ్యాఘ్రవాహనం మృత్యువారణం వజ్రభైరవం దేవమాశ్రయే.
వజ్రయాన తాంత్రిక సాధనలలో వజ్రభైరవునకు, వజ్రయోగిని లేక వజ్రవారాహికి ప్రాధాన్యం ఎక్కువ.
వజ్రభైరవుని వలెనే మరో యిద్దరు భైరవ మూర్తులకు హిమాలయాలలో ప్రాముఖ్యo.పశుపతినాధుడు , మానస సరోవ ఆదిదేవుడు అమరభైరవుడని పేరు.
శ్లో𝕝𝕝 కిమప్యస్తి స్వభావేన సున్దరం వాప్యసున్దరమ్|
యదేవ రోచతే యస్మై భవేత్ తత్తస్య సున్దరమ్||
తా𝕝𝕝 ఈ లోకంలో ఏదైనా స్వభావరీత్యా అందంగా ఉన్ననూ లేకున్ననూ, ఎవరికైతే ఏదైతే నచ్చుతుందో అది అందంగా లేకున్ననూ అదే వారికి అందంగా తోస్తుంది.
శ్లో॥ దివ్యచ్ఛాయా పథస్తత్ర నక్షత్రాణ్యను మండలం
యథా వ్యాలగలస్థో౬పి భేకో దంశానపేక్షతే!
తథా కాలాహినా గ్రస్తో లోకో భోగానశాశ్వతాన్!!
పాము నోట చిక్కిన కప్ప, తన మృత్యువును తెలియక ఈగలను తినుటకు కోరినట్లుగా, జనులు కాలరూపము అగు సర్పము నోట చిక్కిననూ తమ అస్థిరతను తెలియక అనిత్యమైన భోగములకై ప్రాకులాడుచుందురు.
*శ్లో𝕝𝕝 ఆదౌ చిత్తే తతః కాయే* *సతాం సంపద్యతే జరా|*
*అసతాం తు పునః కాయే* *నైవ చిత్తే కదాచన||*
*తా𝕝𝕝|| సజ్జనులకు ముందుగా మనస్సులోను, ఆ తరువాత శరీరమునందును వార్ధక్యం వస్తుంది.... దుర్జనులకు మాత్రం శరీరంలో వార్ధక్యం వస్తుందేగానీ మనస్సుకు ఎన్నడూ వార్ధక్యం రాదు... {పెద్దరికం రాదు}.*
*తత్త్వం బ్రువాణాని పరం పరస్మాత్ మధు క్షరంతీవ సతాం!
ఫలాని ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే నామాని నారాయణ గోచరాణి!!*
*భావం:-*
*ఓ జిహ్వా! దోసిలి యొగ్గి ప్రార్థించుచున్నాను. పరతత్వమగు నారాయణుని ప్రతిపాదించుచు, సత్పురుషులకు అమృతమును స్రవించు ఫలముల వంటివైన నామములను మరల మరల ఉచ్చరింపుము.*
*మనిషి పరిపూర్ణ విజయం, ఆనందం వెనుకవున్న గొప్ప రహస్యం: పూర్తి నిస్వార్ధత, ప్రతిఫలాన్ని ఆశించకపోవడమే.*
*తనపై తనకు నమ్మకం లేనివాడే అసలైన నాస్తికుడు.*
*నా చైతన్య విమానంలో పైన, క్రింద, కుడి, ఎడమ, లోపల, బయట అంతటా విహరించి, నా అంతరిక్ష గృహంలో, మూలమూలనా ఎల్లప్పుడూ, నా పరమపిత పబిత్ర సన్నిధిలోనే ఉన్నానని కనుగొన్నాను.*
*న యుజ్యమానయా భక్త్యా భగవత్య ఖిలాత్మని ।*
*సదృశోఽస్తి శివః పన్థా యోగినాం బ్రహ్మసిద్ధయే 9 *
*టీకా:-*
న = లేదు; అఖిల ఆత్మని భగవతి = అన్ని ప్రాణులలో ఆత్మగా యున్న భగవంతుని;
యుజ్యమానాయ భక్త్యా = భక్తి కలిసినట్లుగా; సదృశ్యః అస్తి = సమానముగా ఉండు; శివః పంథాః = పవిత్రమైన మార్గము; యోగినాం = ఆధ్యాత్మిక సాధకులకు; బ్రహ్మసిద్ధయే = భగవంతుని పొందుటకొరకు.
*భావం:-*
ఆధ్యాత్మిక సాధకులకు భగవంతుని పొందుటకు భక్తిని మించిన పవిత్రమైన మార్గము మరియొకటి లేదు. అన్ని ప్రాణులలో ఆత్మగా యున్న పరమాత్ముని చేర్చునది భక్తియే.
శ్లో|| వాసనా ఏవ సంసార ఇతి సర్వా విముంచ తాః |
తత్త్యాగో వాసనా త్యాగాత్ స్థితిరద్య యథా తథా | 8.
*టీకా*
వాసనా ఏవ = వాసనలే, సంసారః = సంసారము, ఇతి = ఇట్లని, జ్ఞాత్వా = తెలిసికొని, తాః సర్వాః = ఆ వాసనలన్నింటినీ, విముంచ = విడువుము, వాసనా త్యాగాత్ = వాసనాత్యాగమువలన, తత్త్యాగః = ఆ సంసార త్యాగము గూడా అగుచున్నది, అద్య = ఇట్లయిన పిదప, యథా = ప్రారబ్ధ మెట్లున్నదో, తథా = తదనుసారమే, స్థితిః = శరీరస్థితి యగుచున్నది.
*వివరణ:-*
కోరికల చేతనే ఈ ప్రపంచమంతా నిర్మింపబడి నడుపబడుతుంది. కాబట్టి కోరికలను త్యజించు, కోరికలను విడివగలిగితే ప్రపంచాన్ని విడచినట్లే. ఈ స్థితిలో నీవు ఎక్కడ నివసించినా ఒకటే, సమానమే.
బన్ధోహి వాసనా బన్ధో మోక్షః స్యాద్ వాసనాక్షయః
వాసనాస్త్వం పరిత్యజ్య మోక్షార్థిత్వమపిత్యజ. (యోగవాశిష్టం)
బధం అంటూ ఉంటే అది మన వాసనలే. ఈ వాసనలు లేకపోవడమే ముక్తి. ముందుగా వాసనలన్నిటినీ క్షయింపజేసుకుని తరువాత ముక్తి కావాలనే కోరికను కూడా విడచి పెట్టు, నీ లక్ష్యాన్ని సాధించి గమ్యాన్ని చేరినట్టే.
***
పద్యం యద్యపి విద్యతే బహు సతాం హృద్యం విగద్యం నతత్
గద్యం చ ప్రతిపద్యతే న విజహత్పద్యం బుధాస్వాద్యతాం ౹
ఆదత్తే హి తయోః ప్రయోగ ఉభయోరామోద భూమోదయం
సంగ: కస్య హి న స్వదేశ మనసే మాధ్వికమృద్వికయోః ౹౹
పద్యం చాలా గొప్పగా ఉంటుంది,కావాల్సినంత రసం ఉంది.రసికులకు గద్యము లేక పద్యం అంతగా సౌందర్యమనిపించదు.గద్యము కూడా పద్యం లేకుండా పండితులకు ఇష్టంగా అనిపించదు.ఈ రెండూ కలుస్తేనే ఎక్కువ ఆనందమవుతుంది.తేనె మరియు ద్రాక్ష కలిసిన రుచి ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందా?
***
భోగేషు ప్రసరో యస్యా మనోవృత్తేశ్చ దీయతే
సాప్యాదావేవ హన్తవ్యా విషస్యేవాఙ్కురోద్గతిః।
(భోగతృష్ణవలన) ఏ మనోవృత్తికి భోగములందు ప్రవేశ మివ్వబడుచున్నదో, దానిని విషాంకురముయొక్క గతినివలె మొదటనే ఛేదించి వేయవలెను।
పూర్ణస్తు ప్రాకృతోఽ ప్యన్యత్పునరప్యభివాఞ్ఛతే
జగత్పూరణ యోగ్యామ్బుర్గృహ్ణాత్యేవార్ణవో జలమ్
జగత్తును కూడ నింపుటకు యోగ్య మైనప్పటికిని సముద్రము నద్యాదుల జలమును గ్రహించుచునే యుండునట్లు నిగ్రహింపబడని పామరమనస్సు పదార్థములచే పూర్ణమై యున్నప్పటికిని ఆశవలన ఇంకను కోరుచునే యుండును।
హస్తం హస్తేన సంపీడ్య దన్తైర్దన్తాన్విచూర్ణ్య చ
అఙ్గాన్యఙ్గైరివాక్రమ్య జయేచ్చేన్ద్రియశాత్రవాన్।
చేతిని చేతితో నలిపి, పండ్లను పండ్లచే కొఱికి అవయవములను అవయవములచే నాక్రమించి ఏ విధముగ నైనను (సర్వప్రయత్నములచే) ఇంద్రియములను శత్రువులను జయించవలెను।
***
గౌర్గౌః కామదుఘా సమ్యక్ప్రయుక్తా స్మర్యతే బుధైః!
దుః ప్రయుక్తా పునర్గోత్వం ప్రయోక్తుః సై వ శంసతి!!
వాక్కు గోవు వంటిది. దానిని సదుపయోగము చేసినచో కామధేనువు వలె అభీష్టములనీడేర్చును. కానీ, దురుపయోగము చేసినచో, అట్లు చేసినవానికి గోత్వమును (పశుత్వమును) కలిగించును.
***
ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్ లేక రాకా నిశా
రాజశ్రీ సఖ మైన మోమున పటాగ్రం బొత్తి యెల్గెత్తి యా
రాజీవానన యేడ్చె గిన్నెర రాజత్కారాంభోజ కాం
భోజీ మేళ విపంచికా రవ సుధా పూరంబు తోరంబు గాన్
ఆ జాబిల్లి వెలుగుతో కలిగిన విరహాన్ని భరించలేక తన చంద్రుని లాంటి ముఖము పై చీర చెరగు యొత్తుకొని ఆ తామరపువ్వు వంటి ముఖముగల ఆమె కిన్నెరలు వీణ పై కాంభోజీ రాగమాలపించి నారో యన్నట్టుగా అమృతము చిందు నట్టుగా ఎలుగెత్తి యేడ్చేను.
ఈ ఏడుపునే రామకృష్ణుడు భట్టుమూర్తి బావురుమని యేడ్చె యని వ్యాఖ్యానించాడు.
స్నానేన సంగమేశం చ స్మృత్యం గౌరీశ్వరంశివం
పిండ ప్రదానం కర్తవ్యమ్ పితృ ణాం మోక్ష దాయకం.
అర్థము:--నదీ సంగమం లో పుష్కర స్నానం చేసి శంకరుడిని తలుచుకొనడం,పిండ ప్రదానం చేయడం పితరులకు మోక్ష దాయకము.యిది విధి. ఈ ఉదాత్త ఆశయాన్ని అపహాస్యం చేయకుండా శ్రద్ద గా నిర్వర్తించండి. ఈ స్నానఘట్టం లోనే స్నానం చెయ్యాలి అని మూఢ నమ్మకాలు పెట్టుకోకుండా పుష్కరుడు ప్రవేశించిన నది ఎక్కడవున్నా అక్కడ స్నానం చెయ్యవచ్చు.12 దినాలలో ఏరోజైనా స్నానం చేయవచ్చు.
ఈ పద్యం ఎటువైపునుండీ చదివినా అదే వస్తుంది..
రాధా నాధా తరళిత
సాధక రధ తా వరసుత సరస నిధానా
నాధాని సరసత సురవ
తాధర కధ సా తళిరత ధానా ధారా!!
***
కోకిలానాం స్వరో రూపం పాతివ్రత్యంతు యోషితాం
విద్యారూపం విరూపాణాం క్షమా రూపం తపస్వినాం
అర్థము: కోకిలకు స్వరమే అందము.మహిళలకు పా తివ్రత్యమే అందము.
కురూపులకు విద్యయే అందము.యతులకు(మునులకు) క్షమ,శాంతము లే అందము.(సూక్తిముక్తావళి)
విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి: పరేషాం పర పీడనాయ
ఖలస్య సాధో ర్విపరీత మేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయః
అర్థము: దుర్మార్గునికి విద్య వితండ వాదము చేయుటకును, ధనము గర్వ పడుట కును, శక్తి పరులను బాధించుటకును,ఉపయోగ పడును. అదే సజ్జనులకు విద్య జ్ఞానమునకు, ధనము దానము చేయుటకును, శక్తీ పరులను రక్షించుటకును ఉపయోగపడును
***
క్రోధో మూల మనర్థానాం ; క్రోధః సంసార బంధనం
ధర్మ క్షయకరః క్రోధః ; తస్మాత్ క్రోధం విసర్జయేత్
అర్థము:--- అనర్థము లన్నింటికి కోపమే మూల కారణము. కోపమే సర్వ బంధనములకు హేతువు. అది ధర్మమును నాశనం చేస్తుంది. కనుక ముందుగా అందరూ కోపమును విడిచి పెట్టిన సుఖపడ గలరు
.
క్రోధో వైవస్వతో రాజా ; ఆశా వైతరణీ నదీ
విద్యాం కామ దుఘా ధేను: సంతుస్టో నందనం వనం
అర్థము:-- క్రోధము యమధర్మ రాజు వంటిది (అంటే మనుష్యున్ని చంపేది)ఆశ యనునది వైతరణీ నది వంటిది(దాటడానికి సాధ్యము కానిది) విద్య అన్ని కోరికలను తీర్చు కామధేనువు వంటిది. సంతోషమే నందనవనము వంటిది (మనసుకు ఆహ్లాదము కలిగించునది)
***
ఇది ఒకచమత్కార శ్లోకం.
కేశవం పతితం దృష్ట్వా,పాండవా హర్ష మాప్నుయు:
రుదంతి కౌరవాస్సర్వే,హా,హా కేశవ కేశవ
అర్థము:-కేశవుడు (కృష్ణుడు) యుద్ధము లో పడిపోయినాడట.దాన్ని చూసి పాండవులు సంతోషం తో ఎగిరారట.కౌరవులందరూ కేశవా కేశవా అని ఏడుస్తున్నారట.ఇది అసంబద్ధంగా వుంది. పదాలు కొన్నింటికి అర్థాలు మార్చుకోవాలి.కొన్ని విడదియ్యాలి.శవం=ఒక శవమును,కే=నీటియందు, పతితం=పడిపోయి వుంటే, దృష్ట్వా=చూసి, పాండవాః=గ్రద్దలు,హర్షం=ఆనందమును, ఆప్నుయు:= పొందినవి. హా హా కేశవ =నీటిలో శవము, నీటిలో శవము అని సర్వే కౌరవాః=నక్కలన్నీ ,రుదంతి=ఏడ్చుచున్నవి
.యుద్ధసమయం లో ఒక శవము నీటిలో పడి కొట్టుకువచ్చింది. గ్రద్దలు శవాన్ని ఎక్కడ వున్నా తినగలవు కనుక అవి ఆనందించినవి,నక్కలు నీటిలోకి వెళ్లి శవాన్ని తినలేవు కాబట్టి అవి ఏడుస్తూ వున్నాయి.పాండవాః =గ్రద్దలు,కౌరవా అంటే నక్కలు అని అర్థము తీసుకుంటే సరిపోతుంది.
***
ఒకసారి విద్వాన్.కావ్యతీర్థ .మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్యం గారు యిలా అనుకున్నారు
'నీతో' 'నాతో' తనతో', మనతో అనే తెనుగు విభక్తి తో గూడిన తెనుగు పదముల నిమిడ్చి సంస్కృత శ్లోకం వ్రాయ వీలగునా యనుకొని ఇట్లు శ్లోకం వ్రాసినారు.
నీతో గురు సన్నిధి మక్షరాప్తై
నాతో ధికం వస్తు తవాస్తి కించిత్
కారుణ్య దృక్పాతనతో గురూణా
మధీహి భో రామ! నతోఖిలం త్వం
తా:--రామునితో దశరథుడు అన్నట్లు ఓ రామా!త్వం=నీవు , అక్షరాప్తై=అక్షరాప్రాప్తి కొరకు (చదువు కొరకు) గురో సన్నిధిం =గురువుగారి యొద్దకు, నీతః =చేర్పబడినావు., తవ=నీకు, అతః =యింతకంటే అధికం=అధిక మైన, వస్తు=వస్తువు, కించిత్=కొంచెము కూడా, నాస్తి=లేదు, గురూణాం= గురువులయొక్క కారుణ్య దృక్పాత నతః = వాత్సల్య పూరితమైన చూపులప్రసారము వలన నతః=నమ్రత గాల వాడవై అఖిలం =సమస్త విద్యలను,అధీహి= చదువుము
***
***
వెలయాలు శిశువ ల్లుడు
నిలయేలిక యాచకుండు నేగురు ధరలో
గలిమియు లేమియు దలపరు
కలియుగమునం గీర్తికామ! కాటయవేమా!
అతిథి ర్బాలక శ్చైవ స్త్రీ జనో నృపతి స్తధా
ఏతే విత్తం న జానంతే జామాతా చైవ పంచమః
అర్థము:--అతిథి, పిల్లలు స్త్రీలు, ప్రభువు (రాజుపన్నులు విధిస్తాడు) వీరంతా గృహస్తు దగ్గర తగిన ధనం ఉందా లేదా అని ఆలోచించరట. కోరికలు తీర్చమని
అడుగు తుంటారట. వీరిలో అల్లుడు ఐదవ వాడుగా చెప్పబడినాడు. ఇది ఎప్పుడో మనువు చెప్పినది. అయినా అందరూ అలా వుంటారని కాదు. లోక రీతి ఇలా వుంటుందని, "జామాతా దశమ గ్రహః" అనే నానుడి కూడా వుంది కదా!
***
దూష కశ్చ క్రియా శూన్యో నికృ స్టో దీర్ఘ కోపనః
చత్వారః కర్మ చండాలా జాతి చండాల ఉత్తమః
అర్థము: ఇతరులను దూషించువాడు ఏ పని చేయక సోమరిగా ఉండెడి వాడు లోభము గలవాడు దీర్ఘ క్రోధము (అంటే కోపము చాల రోజుల వరకు మనసులో పెట్టుకోనువాడు)గల వాడు వీరు నలుగురు కర్మ చండాలురు . వీరికంటే జాతి చండాలుడు ఉత్తముడు.
ఉత్తమే క్షణ కోపస్యాత్ మధ్యమే ఘటికా ద్వయం
అధమేస్యాత్ దహోరాత్రం పాపిస్టే మరణాంతకం
అర్థము:ఎవరి మీదైనా కోపము వచ్చినప్పుడు ఉత్తమునియందు ఒక క్షణ కాలము మాత్రమే ఉండును మధ్యముని యందు రెండు ఘడియలు మాత్రమే యుండును
అధముని యందు యొక ఆహోరత్రముండును (ఒక రాత్రి ఒక పగలు)
చచ్చేంత వరకు కోపము మనసులో పెట్టుకొని యుండు వాడు
పాపి స్టుడు అని అనబడుతాడు (అధమాధముడు)
ఉమాదేవి జంధ్యాల 9-8-16
అమ్మ! మీఁగడపాలు తెమ్ము లే లెమ్మని, పాణిపంకజమునఁ బైఁటఁబట్టి
తిగిచినమోము నొద్దికచూచి ముద్దాడి, గిలిగింతలిడుచుఁ గౌఁగిటను జేర్చి
ఔనుర కృష్ణ! నీ వాఁకలి గొన్నావు, బువ్వపెట్టెద నని యవ్వధూటి
మీఁగడపాలతో మేళగించినయోగి, రముఁ దవనీయపాత్రముననునిచి
చేతి కందీయ మెసఁగినకౌతుకంబుఁ
దలఁచి వర్ణింప నెవ్వరి కలవియగునె
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల
ఏమిరా కృష్ణ! మ న్నేఁటికిఁ దిన్నావు?, అమ్మ! నేఁ దినలేదు అయ్యతోడు
చిన్నవాండ్రందఱు చెప్పిరి గదవోయి, నీవు వారలమాట నిజము జేసి
విందువా నేనంతవెఱ్ఱినా శిశువునా!, ఆఁకొంటినా! చూడవమ్మ నోటి
వాసన యనుచును వక్త్రంబుఁ దెఱచి లో, నా యశోదకును బ్రహ్మాండభాండ
పంక్తులెల్లను దొంతులపగిదిగాను
బెంపుచేసిననిన్ను వర్ణింప దరమె?
సురుచిరాకార ఉన్నవపురవిహార
రాజగోపాల రాధామనోజఖేల
సర్వథా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనం ౹
అనిత్యాత్వాత్తు చిత్తనాం మతిరల్పేపి భిద్యతే ౹౹
మిత్రుడుని పొందడం సులభం.అయితే అది నిలుపు కోవడం చాలా కష్టం.మనస్సు ఎప్పుడూ చంచలంగా ఉండటం వల్ల కేవలం చిన్న కారణమునకు స్నేహ భావం చెడిపోతుంది.
షడ్దోషాః పురుషణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా ౹
నిద్రా తంద్రా భయం క్రోధః ఆలస్యం దీర్గసూత్రతా ౹౹
యశస్సు,అభివృద్ధిని ఇష్టం పడే పురుషుడు నిద్ర,మగతతో తూగేది,భయం,కోపం,సోమారితనం,ఆలస్యం ఈ ఆరు దోషాలను విడిచిపెట్టాలి.
మూలచ్చేదం రిపో:, కుర్యాదథవా న ప్రకోపయేత్ ౹
అన్యథాసౌ వినాశాయ పాడస్ప్రుష్ట ఇవోరగః ౹౹
శత్రువుని వేళ్ళతో సహా నాశనం చెయ్యాలి.లేకపోతే అతన్ని రెచ్చకొట్టరాదు. అలాగేదైనా అయితే కాలితో త్రొక్కి పాములా మన వినాశనమునకు కారణం అవుతాడు.
మూలచ్చేదం రిపో:, కుర్యాదథవా న ప్రకోపయేత్ ౹
అన్యథాసౌ వినాశాయ పాడస్ప్రుష్ట ఇవోరగః ౹౹
శత్రువుని వేళ్ళతో సహా నాశనం చెయ్యాలి.లేకపోతే అతన్ని రెచ్చకొట్టరాదు. అలాగేదైనా అయితే కాలితో త్రొక్కి పాములా మన వినాశనమునకు కారణం అవుతాడు.
అనిత్యాని దేహాణి విభవో నైవ శాశ్వతః ౹
నిత్యం సన్నిహితో మృత్యు : కర్తవ్యో ధర్మ సంగ్రహః ౹౹
మన దేహాలు నాశనము అవుతాయి.సంపత్తు శాశ్వతం కాదు మరియు చావు ఎల్లప్పుడు దగ్గరగా ఉంటుంది.అందువల్ల మనం తక్షణం పుణ్య కార్యలలో పాల్గొనాలి.
పితా రత్నాకరో యస్య లక్ష్మీర్యస్య సహోదరీ ౹
శంఖో రోధితి భిక్షార్థీ నదత్తాముపతిష్టతే ౹౹
రత్నాకరుడైన సముద్రుడు శంఖానికి తండ్రి.లక్ష్మీదేవి సహోదరి,అయినా శంఖము భిక్ష కోసం రోధన చేస్తుంది.దానం చెయ్యనిది ఏది తనకి లభ్యమవ్వదు.
హస్తస్పర్శాదివాంధేన విషమే పథి దావతా ౹
అనుమానప్రధానేన వినిపాతోన దుర్లభః ౹౹
గుడ్డివాడు తన చేతులతో ముట్టి చూస్తూ దారిలో ఎలా ముందుకు సాగునో అలా అనుమానం ముఖ్యంగా చేసుకొని ముందుకు నడిస్తే బోల్తాపడేది నిజం.
దోషభీతేరనా రాంభస్తత్యాపురుషులక్షణం ౹
కైరజీర్ణాభయాద్దాతర్భోజనం పరిహీయతే ౹౹
దోషం జరుగుతుంది అనే భయంతో పనినే ఆరంభం చెయ్యనిదే ఉండేది అల్ప మనిషి లక్షణం.అజీర్ణం అవుతుందని ఎవారైనా భోజనం వదులుతారా ?
కర్మణ్యేవాధికారాస్తే మా ఫలేషు కదాచన ౹
మా ర్మఫలహేతుర్భూ : మా తే సంగోsస్త్వ కర్మణి ౹౹
కర్తవ్య కర్మంలో నీకు ఎప్పటికీ అధికారం ఉంటుంది.ఫలితాలలో నీకు అధికారం ఉంటుంది.ఫలాన్ని పొందాలని కర్మలు చేయకుండా ఉండు.కర్మం చెయ్యకూడదు అనే
నిరాశక్తి కూడా నీకు వద్దు.
యథాశ్చ రథహీనాస్తు రాథో వాశ్చైర్యథా వినా ౹
ఏవం తపోsప్య విద్యస్య విద్యావాsప్య తపస్వినః ౹
రథమే లేని గుఱ్ఱాల్లా,గుఱ్ఱాలు లేని రథంలా విద్య లేనివాడు తపస్సు,తప్పస్సు లేని విద్య అన్నీ వ్యర్థమైనవి.
ఏకః క్షమావతాం దోషో ద్వితీయో నోపపద్యతే ౹
యదేన క్షమయా యుక్తమశక్తం మాన్యతే జనః ౹౹
సహనం ఉన్నవారిలో ఒక దోషం ఉంది.ప్రజలు తమ వైపే ఆశక్తులు అని భావిస్తారు.ఇదికాకుండా వారిలో ఏ దోషం ఉండదు.
ఉచ్చైరుచ్చరితవ్యం యత్కించిదజానతాపి పురుషేణ ౹
మూర్ఖా బహు మాన్యంతే విదుషామపి సంశయో భవతి ౹౹
ఏమి తెలియనివాడు కూడా చెప్పేది గట్టిగా ఉచ్చరించాలి. అది విన్న మూర్ఖరు మాన్యతను ఇస్తారు. ఆఖరికి విద్వాంసులకు సహా అది సరేనా అనే అనుమానం వస్తుంది.
ఉచ్చైరుచ్చరితవ్యం యత్కించిదజానతాపి పురుషేణ ౹
మూర్ఖా బహు మాన్యంతే విదుషామపి సంశయో భవతి ౹౹
ఏమి తెలియనివాడు కూడా చెప్పేది గట్టిగా ఉచ్చరించాలి.అది విన్న మూర్ఖరు మాన్యతను ఇస్తారు.ఆఖరికి విద్వాంసులకు సహా అది సరేనా అనే అనుమానం వస్తుంది.
స్తూతారః కే భవిష్యంతి మూర్ఖస్య జగతీతలే ౹
న స్తౌತಿ చేత్ స్వయం చ స్వం కదా తస్యాస్తు నివృతిః ౹౹
మూర్ఖుడు సొంతంగా తనకు తాను పొగుడుకోకపొతే ప్రపంచంలో ఎవరు పొగుగడుతారు?అతనికి మరి సంతోషం దొరికేది ఎలా ?
ద్వివిధో జాయతే వ్యాధి : శారీరో మానాశస్తథా ౹
పరస్పరం తాయోర్జన్మ నిర్ద్వంద్వం నోపలభ్యతే ౹౹
శారీరిక మరియు మానసిక అనే రెండు విధమైన రోగాలు పుడతాయి.ఆ రెండు ఒకటికి ఒకటి పరస్పరం ఆశ్రయించుకొని ఉంటాయి.ఇవి శరీరం,మానసిక రోగాలు.మానసికంగా బాధ ఉంటే శరీరానికి రోగం ఉంటుంది.
స బంధుర్యో విపన్నానాం ఆపదుద్ధరణక్షమః ౹
న తు దుర్విహితాతీతవస్తూ పాలంభ పండితః ౹౹
ఆపత్తులో చిక్కుకున్నవారిని ఉద్ధరించడానికి ఎవరు సమర్థులో అతనే నిజమైన బంధు.జరిగిపోయిన విషయాల గురించి నిందించువాడు బంధువుకాదు.
ఉత్తమోsప్యధమస్య స్యాద్యాచజ్ఞానమ్రకరః క్వచిత్ ౹
కౌస్తుభాదీని రత్నాని యయాచే హరిరంభుధిం ౹౹
ఉత్తమమైనవాడు ఎప్పుడూ కూడా అధమ దగ్గరకూడా చేతులు చాచడు.భగవంతుడైన శ్రీహరి కూడా కౌస్తుభ మరియు వేరే రత్నాల కోసం సముద్రాన్ని యాచించాడు కదా !.
సుఖామాపతితం సేవేద్దు : ఖామాపతితం సహేత్ ౹
చక్రవత్పరివర్తo తే దుఃఖాన్ని చసుఖాని చ ౹౹
దొరికిన సుఖాన్ని అనుభవించాలి.అలాగే వచ్చిపడిన దుఃఖాన్ని సహా సహించుకోవాలి.దుఃఖాలు మరియు సుఖాలు చక్రాలాంటివి ఒకటి అయ్యాక ఒకటి తిరుగుతూ ఉంటాయి.
స్మరంతి సుకృతాన్యేవ న వైరాణి కృతాన్యపి ౹
సంతః పరార్ధం కుర్వాణా నావేక్షంతే ప్రతిక్రియామ్ ౹౹
సజ్జనులు మంచిని మాత్రం స్మరించుకుంటారు.ఎవరు చెడ్డపని చేసినా జ్ఞాపకం ఉంచుకోరు.సజ్జనులు పరరికి ఉపకారాన్ని చేసేవారేకాక ఎవరి నుంచి ప్రత్యుపకారాన్ని కోరరు.
కష్టం ఖలు మూర్కత్వం కష్టం ఖలు యౌవనేషు దారిద్య్రం ౹
కష్టాత్ కష్టతరం కిం పరగృహవాసః పరాన్నం చ ౹౹
మూర్ఖత్వం అనేది కష్టం.యవ్వన సమయంలో బీదతనం అనేది కష్టమే అయి ఉంటుంది.అటువంటప్పుడు ఈ కష్టానికన్నా ఎక్కువ కష్టమనేది ఏముంది? పరగృహ నివాసము మరియు పరాన్నము ఇవి కష్టమైనవి.
సంపత్తౌ కర్కశం చిత్తం ఖలస్యాపది కోమలం ౹
శీతలం కఠినం ప్రాయస్తప్తం మృదు భవత్యయః ౹౹
దుష్టుడైన వాడి మనస్సు సంపద ఉన్నప్పుడు కర్కశంగా,విపత్తులు వచ్చినపుడు కోమలంగా,చల్లగా ఉన్నప్పుడు ఇనుములా కఠోరంగా,వేడి ఉన్నప్పుడు మృదువుగా ఉంటుంది.
జగతి నరజన్మ తస్మిన్ వైదుష్యం తత్ర సత్యవితా ౹
కవితాయాం పరిణామో దుష్ట్రాపః పుణ్యహినేన ౹౹
జగత్తులో మనిషి జన్మ దుర్లభమైనది.అందులో విద్వశక్తి అందులో అత్యుత్తమ కవనాశక్తి,కవితల్లో కూడా ప్రాముఖ్యత,ఇవన్నీ పుణ్య హీనులకు దొరకవు.
మార్జాల భక్షితే దుఖః యాదృశం గృహాకుక్కుటే ౹
న తాదృజ్ మమతాశూన్యే కలవింకేsథ మూషకే ౹౹
పిల్లి ఇంట్లో పెంచిన కోడిని తిన్నప్పుడు ఎంత దుఃఖం అవుతుంది.అయితే అంత దుఃఖం పిచుకను,ఎలుకను పిల్లి తింటే ప్రజలకు ఏ దుఃఖం అవ్వదు.దీనికి కారణం మమతలు లేకపోవడమని అర్థం.
ఆత్మానమనుశోచ త్వం కిమన్యమనుశోచసి ౹
ఆయస్తే క్షీయతే యస్య స్థితస్య చ గతస్య చ ౹౹
నీకోసం నువ్వు ఆలోచించు.వేరే వారి కోసం బాధపడేది ఎందుకు? నువ్వు మౌనంగా ఉన్నా లేక పనులు చేస్తున్నప్పుడు నీ ఆయుష్ ప్రతి క్షణం క్షీణిస్తూ ఉంటుంది.
భవత్యేకసలే జన్మ గంధస్తే షాo పృథక్ పృథక్ ౹
ఉత్వలస్య మృణాలస్య మత్స్యస్య కుముదాస్య చ ౹౹
ఒకచోటనే జన్మని పొందినా వాళ్ళ గుణాలను వేరేవేరే ఉంటాయి.ఎలా అంటే ఒకటే పుట్టిన కమలం అంటే మైథిలి, మృణాల అంటే తామరపువ్వు వేరు,మత్స్య అంటే మరియు పువ్వుయొక్క సువాసన వేరేవేరేగా అయ్యి ఉంటాయి.
గుణవత్తరపాత్రేణ ఛాద్యంతే గుణినాం గుణా : ౹
రాత్రౌ దీపశిఖాకాంతిర్న భానావుదితే సతి ౹౹
గుణవంతులైన వాళ్ళ గుణాలు,మరింత గుణశాలులైన వారి నడతలతో మెరుగులు పొందుతాయి.రాత్రి పూట దీపం వెలుగు కనబడుతుంది అంతేకాని సూర్యుడు ఉదయించినపుడు ఉండదు.
అధిత్య చతురో వేదాన్ వ్యాకృత్యాష్టాదశ స్మృతిః ౹
అహో శ్రమస్య వైఫల్యం ఆత్మాపి కలితో న చేత్ ౹౹
నాలుగు వేదాలను అధ్యాయనం చేసి,వాటితో పాటు పద్దెనిమిది స్మృతులను వ్యాఖ్యానం చేసినా ఆత్మజ్ఞానం పొందకపోతే అంత శ్రమా విఫలమైనట్టే.
గీర్భిర్గురూణాం పరుషాక్షరాభిః తిరస్కృతా యాంతినరాఃమహత్త్వమ్
అలబ్ధశాణోత్కపణా నృపాణాం న జాతు మౌలౌ మణయో వసంతి ౹౹
గురువులు నిందించే ,కఠినమైన మాటలతో తిరస్కరింబడిన ప్రజలు మహత్త్వ స్థితిని పొందుతారు.సాన పెట్టకుండా రత్నాలు మహారాజుల శిరస్సు పైన ఎప్పటికీ రాణించవుగదా.
చలంతి గిరియః కామం యుగాంతపవనాహతాః ౹
కృచ్రేయైsపి న చలత్యేవ ధీరాణాం నిశ్చలం మనః ౹౹
ప్రళయంలా గాలి కూడా ఎక్కువగా వీచినప్పుడు చెట్లుకూడా కదులుతాయి.ఎటువంటి కష్టమైన పరిస్థితిలలో కూడా ధైర్యుడి మనస్సు చలించకుండా నిశ్చలంగా ఉంటుంది.
ప్రాయః సంప్రతి కోపాయ సన్మార్గ స్యూపదేశనం ౹
విలూననాసికస్యేవ యద్వదాదర్శ నామ్ ౹౹
సన్మార్గంలో నడవాలని చెపితే కోపం వస్తుంది.ముక్కును పోగొట్టుకున్న వాడికి అద్దం చూపెట్టడం అపరాధమే అవుతుంది.
సంయతం కోమలం చిత్తం సాధోరాపది కర్కశం ౹
సుకుమారం మధౌ పత్రం తరౌ : స్యాత్ కఠినం శుచౌ ౹౹
సజ్జనుల మనస్సు సహజంగానే మృదువుగా ఉంటుంది.అయితే కష్ట సమయంలో కఠినంగా మారుతుంది.వసంతమాసంలో సుకుమారంగా ఉండే వృక్షం ఆకులు చిగురించి మండే ఎండలో మాడిపోయి మొరటుగా అవుతాయి.
నారుంతుదః స్యాదార్తోsపి న పరద్రోహకర్మధీ : ౹
యథాsస్యోద్విజతే వాచా నాలోక్యాం తాముదీరయేత్ ౹౹
మనం బాధతో ఉన్నా అన్యులకు నొప్పించే రీతిలో మాట్లాడకూడదు.పరరికి ద్రోహం చేసే పని,బుద్దిలాంటివి ఉండకూడదు.వేరేవారికి చింతకలిగేలా,లోకంలో అలవాటులేని ,లేక అనుచితంగా మాటలను చెప్పరాదు.
వరం పర్వతాదుర్గేషు భ్రాoతం వనచరైః సహ : ౹
న మూర్ఖజనసంపర్కకః సురేంద్రభవనేశ్వపి ౹౹
వనంలో సంచారం చేసే ప్రాణులతో,పర్వతం పైన దుర్గమైన ప్రాంతాలలో తిరిగేది మంచింది.అయితే ఇంద్రుడి భవనంలోనైనా సరి మూర్ఖులతో స్నేహం మాత్రం వద్దు.
శ్రోత్రం శ్రుతనైవ న కుండలేన దాననే పాణిర్న తు కంకణేన ౹
విభాతి కాయః కరుణాపరాణాం పరోపకారైర్న తు చందనేన ౹౹
శాస్త్ర శ్రవణముతో చెవులు శోభించును.చేతులు కంకణముతో కాదు, దానం చెయ్యడం వల్ల శోభించును.దయ కలవాడు పరోపకారముతో శోభిస్తాడే కానీ శ్రీచందనం పూసుకోవడము వల్లకాదు.
సుఖమధ్యే స్థితం దుఃఖం దుఃఖమధ్యే స్థితం సుఖం౹
ద్వయమన్యోన్య సంయుక్తం ప్రాచ్యతే జలపంకవత్ ౹౹
సుఖాల మధ్య దుఃఖాలు, దుఃఖాల మధ్య సుఖాలు ఉండే ఉంటాయి.నీళ్లు బురద ఒకటికి ఒకటి అంటుకొని ఉన్నట్టు.
న యస్య చేష్టితం విద్యాన్న కులం నపరాక్రమం ౹
న తస్య విష్వసే త్ప్రాజ్ఞ: యది చ్చేచ్చ్రి యమాత్మనః ౹
తనకు శ్రేయస్సు అవ్వాలని కోరినవాడు లేక తెలిసినవాడు ఎవరైనా,ఎవరి ప్రవర్తన,కులం,పరాక్రమాన్ని తెలియకపోతే అటువంటి వ్యక్తిపైన నమ్మకం పెట్టుకోరాదు.
యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః ౹
సమృద్దిరసమృధ్ధిర్వా స వై పండిత ముచ్యతే ౹౹
ఎవరు చేసే పనులకు శీతలం ఉష్ణం అంటే చలి,సెగ,భయం,ప్రేమ,సిరి పేదతనాలు అడ్డం కావో అటువంటివారిని పండితులని అంటారు.
ఇదం లబ్దంమిదం నష్టమిదం లప్స్యే పునర్ధియా ౹
ఇదం చింతాయతామేవ జీర్ణామాయుః శరీరిణామ్ ౹౹
ఇది లభ్యమైంది,ఇది నష్టమైంది,దీన్ని మళ్ళీ బుద్దిశక్తితో పొందుతాను,అనే ఇలాంటి ఆలోచనలతో ప్రజలు ఆయుష్షు క్షిణించి పోతుంది.
దోషోsపి గుణతాం యాతి ప్రభోsర్భవతి చేత్కృపా ౹
అంగహినోsపి సూర్యేణ సారథ్యేయోజితోsరుణః ౹౹
ప్రభువు కృప ఉన్నచో దోషము కూడా గుణమే అవుతుంది.సూర్యుడు అంగవిహీనుడైన అరుణుడిని సారథిగా నియమించుకున్నాడు కదా అలా...!!
సుఖం న కృషితోsన్యత్ర యది ధర్మే వర్తతే ౹
అవస్త్రత్వం నిరన్నత్వం కృషితో నైవ జాయతే ౹౹
వ్యవసాయం వదిలితే సుఖః ఉండదు.ధర్మాంగా నడుచుకుంటే వ్యవసాయదారుడికి ఎప్పటికీ అన్నం బట్టల కొరత ఉండదు.
యేనాస్య పితరో యాతో యేనయాతా పితామహః ౹
తేన యాయాత్సతాం మార్గం తేన గచ్ఛన్ న రిష్యతే ౹౹
తండ్రి తాతలు నడిచి వచ్చిన దారిలో నడిస్తే కష్టాలు రావు.ఏ అధర్మానికి అవకాశం ఉండదు.
అనిత్యాని దేహాణి విభవో నైవ శాశ్వతః ౹
నిత్యం సన్నిహితో మృత్యు : కర్తవ్యో ధర్మ సంగ్రహః ౹౹
మన శరీరం నాశనం మవుతాయి.సంపద శాశ్వతం కాదు.మరణం ఎప్పుడు మనకు దగ్గరగా ఉంటుంది.కావున మనం తక్షణం పుణ్య కార్యాలు చెయ్యడంలో ముందుకు రావాలి.
సేవితవ్యూ మహావృక్ష : ఫలచ్చాయా సమన్వితః ౹
యది దైవాత్ఫలం నాస్తి ఛాయా కేననివార్యతే ౹౹
ఎప్పుడూ ఫలాలు నిండుగా పొందినది మరియు కొమ్మలతో నీడ పొందిన పెద్ద వృక్షాన్నే ఆశ్రయించాలి.హఠాత్తుగా పండ్లు లేకపోయినా,చెట్టు ఇచ్చే నీడను ఎవరూ తప్పించ లేరు.
ఇహ యత్ క్రియతే కర్మ పరత్రై వూపభుజ్యతే ౹
సిక్తమూలస్య వృక్షస్య ఫలం శాఖాసు దృశ్యతే ౹౹
ఇహ లోకంలో ఏ కర్మ చేస్తాడో పరలోకంలో కూడా అదే అనుభవిస్తారు.చెట్టు వేరుకు నీళ్లు పోస్తేనే పండ్లు కొమ్మల్లో కనబడతాయి.
తదాత్వే నూతనం సర్వం ఆయత్వం చ పురాతనం ౹
నదోషాయైతాదు భయం న గుణాయ చ కల్పతే ౹౹
ఆ ఆ కాలాలకు ప్రతి ఒకటి క్రొత్తగా కాలం జరుగుతోంటే పాతవిగా మారుతాయి. అలా అయ్యిన కొత్తది కానీ పాతది కాని వాటి గుణ దోషాలవల్ల మారవని తెలుసుకోవాలి.
ఆజ్ఞా : సుఖమారాధ్యసుఖ తరమారాధ్యతే విశేషాజ్ఞ : ౹
జ్ఞానలవదుర్విదగ్ధంబ్రహ్మాపి నరం న రజయతి ౹౹
తెలియనివాడికి సులభంగా తెలపచ్చు.చక్కాగ తెలిసినవారికి సమాధానం చెప్పడం సులభము.కొంచం జ్ఞానం ఉండి నేనే సర్వజ్ఞుడని గర్వపడువానికి సృష్టి కర్త అయిన బ్రహ్మకూడా రంజింపలేడు.
మనః ప్రీతికరః స్వర్గ : నరకస్తద్విపర్యయః ౹
నరకస్వర్గసఙ్నే వై పాపపుణ్యే ద్విజోత్తమః : ౹౹
మనస్సుకు సంతోషం కలిగించేదే స్వర్గం.దుఃఖమే నరకం.ఈ నరకం మరియు స్వర్గాలకు పాప పుణ్యమని పేరు.
స్వర్గో ధనం వా ధాన్యం వా విద్యా : పుత్రాసుఖాని చ ౹
గురువృత్తనురోధేన న కించదపి దుర్లభం ౹౹
స్వర్గమైనా,ద్రవ్యమైనా, ధ్యానమైనా,విద్యఅయినా,పిల్లలైనా,సుఖమైనా,ఏదైనా అవ్వనీ గురుభక్తి ఉన్నవారికి ఏది కష్టం కాదు.
శత్రౌ స్వాత్వం ప్రతీకారః సర్వరోగేషు భేషజః ౹
మృత్యోమృత్యుఓ జయధ్యానం దారిద్ర్యేతు న కించన ౹౹
సమాధానంతో శత్రువుని సంతోషం పెట్టవచ్చు.అన్ని వ్యాధులకు మందు ఉంది.మృత్యువుకు మృత్యుంజయ ధ్యానంతో ఫలితం ఇవ్వచ్చు.అయితే దరిద్రానికి మాత్రం ఏ పరిస్కారం లేదు.
ప్రాయః సంప్రతి కోపాయ సన్మార్గస్యోపదేశనం ౹
విలోననాసికస్యేవ యద్వదాదర్శదర్శనమ్ ౹౹
సన్మార్గంలో నడు అని చెపితే కోపం వస్తుంది.ముక్కు పోగొట్టుకున్న వాడికి అద్దం చూపెట్టడం తప్పు అవుతుంది.
బాలో వా యది వా వృద్ధో యువా వా గృహమాగతః ౹
తస్య పూజా విధాతవ్యా సర్వత్రభ్యాగతో గురుః ౹౹
బాలుడు అవ్వనీ,ముసలివాడవ్వనీ,యువకుడవ్వనీ ఇంటికి వచ్చినవాడికి సేవలు చెయ్యాలి.అభ్యాగుడైన వాడు ఎప్పుడూ గురువు సమానము.
🌺అణుమాత్రం మనస్తస్మాత్ ఆశా నామ లతోద్గతా |
తస్యా నాలముపఘ్నాయ భువనాని చతుర్దశ ||
(ఆశ్చర్యచూడామణి వ్యాఖ్యా)
మనస్సు ఒక అణువు. దానితో ఆశ అనే తీగ పుట్టింది. అది వ్యాపించడానికి పధ్నాల్గు లోకములూ చాలవు.
అఘం స కేవలం భుంక్తే యః పచత్యాత్మకారణాత్ |
*యజ్ఞశిష్టాశనం హ్యేతత్* *సతామన్నం విధీయతే ||*
(మనుస్మృతి)
ఎవరు కేవలం తనకోసం వంట చేసుకొని భోజనం చేస్తాడో వాడు తన పాపాన్నే తిన్నట్లు. సత్పురుషులకు అన్నం వడ్డించిన పిదప భోజనం చేస్తే యజ్ఞశేషాన్ని తినడానికి సమానం.
Comments
Post a Comment