రామకృష్ణ గీత .. ప్రాంజలి ప్రభ 13--
రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ.. (01) * రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (02) హృదయ పరిశుద్ధత కలిగిన దైవనామ స్మరణ, ప్రార్ధన దేహానికి ఆరోగ్యాన్ని, మనస్సుకు ఆనందాన్ని కలుగ చేయుటే బొమ్మలాట *ప్రాణులకు దైవము చేయునది* స్తోత్రము చేయువారి వాక్కులను, స్తుతి సమర్థములుగా చేయును, ధ్యనించు వారి చిత్తమును వికసింప చేయును, మంత్ర జపము చేయువారి శక్తిని విజృంభింప చేయును, నమస్కరించు వారి యొక్క పాపములను, నశింప చేయును. అగ్ని నుండి వాక్కులను ఉపదేశించును, మెఱపు నుండి ప్రాణము నడిపించును, చంద్రుని నుండి కోరికలను పెంపొందించును, సూర్యుని నుండి బుద్ధులను ప్రేరేపించును శ్రమజీవిగా, పిసినారిగా, భక్తుడిగా, యుక్తుడిగా, క్షేమకా రిగా, సైనికుడుగా, కార్యదక్షుడుగా, సవ్యసాచిగా, బాటసారిగా, అన్నగా, తమ్ముడుగా, తండ్రిగా, తాతగా, చెప్ప బోధలు, చేష్టలు నీవి కావు దేవుడు ఆడించే బొమ్మలాట అందరం నిమిత్తమాతృలమే. చం.మెదడుకు వేదనమ్ముయు సమోక్షమనేటిది మార్గనేస్తమై అదును సకామబుద్దియు సహాయ సమర్ధత ప్రేమ హృద్యమై హృదయనినాద మార్గము సహృద్యపులక్ష్య సుఖార్థ భావమై అదిఎవరోధమ్ముయు వినమ్ర విధాన మనస్సు పంచుటే...