రామకృష్ణ గీత .. ప్రాంజలి ప్రభ 13--



రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ.. (01)

రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (02)

హృదయ పరిశుద్ధత కలిగిన దైవనామ స్మరణ, ప్రార్ధన దేహానికి ఆరోగ్యాన్ని, మనస్సుకు ఆనందాన్ని కలుగ చేయుటే బొమ్మలాట

*ప్రాణులకు దైవము చేయునది* 

స్తోత్రము చేయువారి వాక్కులను, స్తుతి సమర్థములుగా చేయును, ధ్యనించు వారి చిత్తమును 
వికసింప చేయును, మంత్ర జపము చేయువారి శక్తిని విజృంభింప చేయును, నమస్కరించు వారి యొక్క పాపములను, నశింప చేయును. 

అగ్ని నుండి వాక్కులను ఉపదేశించును, మెఱపు నుండి ప్రాణము నడిపించును, చంద్రుని నుండి కోరికలను పెంపొందించును, సూర్యుని నుండి బుద్ధులను ప్రేరేపించును 

శ్రమజీవిగా, పిసినారిగా, భక్తుడిగా, యుక్తుడిగా, క్షేమకా రిగా, సైనికుడుగా, కార్యదక్షుడుగా, సవ్యసాచిగా, బాటసారిగా, అన్నగా, తమ్ముడుగా, తండ్రిగా, తాతగా, చెప్ప బోధలు, చేష్టలు నీవి కావు దేవుడు ఆడించే బొమ్మలాట అందరం నిమిత్తమాతృలమే.

చం.మెదడుకు వేదనమ్ముయు సమోక్షమనేటిది మార్గనేస్తమై 
అదును సకామబుద్దియు సహాయ  సమర్ధత ప్రేమ హృద్యమై 
హృదయనినాద మార్గము సహృద్యపులక్ష్య సుఖార్థ భావమై 
అదిఎవరోధమ్ముయు వినమ్ర విధాన మనస్సు పంచుటే

కాలం నీదైతే నీమాటలు వేదమే కానిచో బూతువాక్కులు సందర్బముగా ప్రవర్తన మనుష్యులను ఆడించే బొమ్మలాట తప్పోప్పులు తెలిపే హక్కు నీకెక్కడిది నీదు యుక్తి శక్తి భక్తి

చం.పెదవులు దేహకవాటము నీలపురంగగు ఆత్మ వాక్కులే 
నిదురకు దేహవాంఛలుసమీప వికర్ష ముకుందతత్వ వాక్కులే 
చదువులు కావు సంబరపు చేష్టల ఆశలు తీర్చ వాక్కులే
మధువును గ్రోలి తుమ్మెద సకామము పంచియు నిద్ర పంజరం

తే. గీ.దూరమే దగ్గరవుటకై స్ఫూర్తి యగుట
నిశ్చయానిశ్చిత పలుకు నీడ యగుట
పుణ్య పాపము విడిపోక పువ్వు లాగ
తృప్తి సంతృప్తి మధ్యన తపన జీవి

ఎవరికి ఎవరు ఏ నిముషాన ఏకమైన ఆనిముషాన అర్ధంకాని ఆవేదనకు లోనవుదురు, ఆదిఎవరివలనన్నా, దే నికన్నా అంతా యిది మార్పుకోరు, విధి విధానమని భావించాలి, దేవుడు ఆడించే బొమ్మలాట

రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (03)

అచలరూపుడైనా పరమేశ్వరుడు అనేకం అవ్వాలనే సంకల్పంతోటే, చలనరూపుడై చేసిన తాండవమే ఈ ప్రపంచం. సముద్రమే అనేక కెరటాలుగా లేచి పడుతున్నట్లు -  పరమేశ్వరుడే అనేక జన్మలు ఎత్తి లయిస్తున్నాడు.

తే. గీ.నిప్పు గాలి నీరు ప్రకృతి  నేల ధారి 
సేద్య మొసగు శక్తి నిడుచు జీవ ధారి 
సహన సాక్షిగా సందర్బ చరిత ధారి 
కండ్ల కెదురు నిలచినట్టి కర్మసాక్షి!

ప్రాణులలో అంతరాత్మగా ఉన్న భగవంతుని గుర్తింపక, బాహ్యముగానున్న భేదములను దర్శించు దురభిమాని అనవరతము రాగద్వేష దూషితుడగు చుండును. అందువలన, అతడు ఇతరులను ద్వేషించు చుండును. అట్లొనర్చుట తనలోనున్న భగవంతుని ద్వేషించుటే యగును. అట్టివానికి ఎన్నడును మనశ్శాంతి లభింపదు. చూపుల తేటగీతి మాల చదవండి.

పాపపుణ్యా లెవరుచేయు ప్రకృతి చూపు, నిత్య పరమాత్మ చూస్తూనే నీడ చూపు 
చంద్రసూర్యుల నేత్రాలు చెలిమి చూపు, జలజనాభుడు చూస్తునే జపము చూపు 

చూడలేదెవరని కన్య చూపు కలియు, నాల్గుగోడల మధ్యన దాగు చూపు 
కర్మ తెలుపేటి చూపుల కంట నీరు, ప్రకృతి రూపుడు చూస్తూనె ప్రతిభ చూపు 
          
అండపిండ బ్రహ్మాండ ఆశ్రయముచూపు, జీవు లందరి లోననూ గీత చూపు
మెలగుతువెలుగుతూ నుండుమేలు చూపు, తానుచేసిన కర్మలె తపనచూపు
 
ధాత్రినెవ్వరు చూడకే ధర్మ చూపు, మానవుడు పాపములచేయు మౌని చూపు 
జీవితములోన సుఖమనే నిప్పు చూపు, దుష్టకృత్యములెపుడునూ దూర చూపు

మనసు నేత్రములు కలలు మాయ చూపు,  ఉదరము కొరకు చూపెడి ఉమ్ము చూపు 
చితికి చేరేవరకు బత్కు చిన్న చూపు, బాధ పెడుతు భయ పెడుతూ బంధ చూపు 
   
ఒకరి జయము అసూయమై ఓర్పు చూపు, ఒకరి జయము ప్రేరణ చూసి వోడ చూపు 
ఆత్మవిశ్వాసమును పొంది ఆట చూపు, కాల నిర్ణయానికి మెచ్చు కామ్య చూపు

*****
రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (04)
ఓ ప్రేయసీ! నామనసు నీది నీమనసు నాది తేటగీతమాల

గీ.నామనసు పిచ్చి ఆలోచనలు కథ లగు, సతమతమవుతూ కదిలెడి సమర మేను
నామనసు మట్టిఅక్షర నాన్యత యిది, సేద్య మునుచెయ్యమంటుంది చిత్ర మైన 

గీ.నామనసు అద్దమై బింబమంత్ర మగుట, నామనసు పక్షి గాలిలో నటనజూప
నామనసు పృథ్విఓర్పుగా నానుడి యగు, నామనసు నీరు కదలికే  నడక సాగు

గీ.నామనసు నిప్పు దాహమై బాధ పెంచు, నామనసు అనురాగము నాట్య మాడు 
ప్రేమతో ప్రాణమిస్తాను ప్రీతి గాను, నామనసుగాలి జీవికినాంది గాను 

గీ.నామనసు జ్ఞాన నిధిగాను నయన పిలుపు, నామనసు వెలుగులదివ్వె సాగు కాంతి
నామనసు భయముపరిధి నాడి బతుకు, నామనసు ఒకకోతిగా నమ్మ బలుకు

గీ.నామనసు మార్గదర్శిగా న్యాయ తీర్పు, నామనసు చిలకపలుకుగాను సాగె 
నామనసు మల్లెపువ్వుగా ఆశ ఇ దియు, నామనసు ఒకకవిగాను రాతలాగు

గీ. మనసువిప్పనా సమరమే కాల మందు, ముందు ఓర్పు చూపెట్టనా ముగ్గు వేసి 
నిదుర లేవనా నీదరి నీడ మల్లె , నిన్నుతలచనా కథలుగా నియమ మౌను 

గీ. చెంతకు కళలు కథలుగా చెలిమి చేరు, చెలిమి కోరనా సంపద చేష్టలు చేరు 
కన్నుతెరవనా విధిగాను కాల మౌను, చూపునిలుపనా నీపైన సూత్రమౌను 

గీ.అందముకననా ఆశ్చర్య ఆట కాదు , స్పందనతెలుపనానేను సమయ మందు 
ఇపుడు ఆనందమనుబుద్ధి ఇష్టమౌను, అతిశయమ్ముగా విజయము అశ్రిత మౌను 

గీ. పువ్వునవ్వినా గంధము పూజ్య మౌను, ప్రేమచాటనా సుఖముయే సేతు ఔను 
కోర్కెచెప్పనా నిజముగా కోపమొద్దు , తీర్చమందునా ఇప్పుడే తీపి గుర్తు 

గీ. పెదవివిప్పనా గుట్టును పిలుపు వెంట, మాట చెప్పనా నీతోడు మాయ కాదు 
నవ్వు విసరనా ఏడ్పుయే నటన ఏల, మోమువెలిగించనా విధి మోక్ష మౌను 

గీ. ఆశలేపనా నీలోన అలుక వద్దు , దారికి తెచ్చుకోనా నిన్ను బాధ లేదు 
తీర్పు చెప్పనా ఓర్పుగా తేట తెలుగు , అమలు చెయ్యనా నీమాట ఆత్ర మేల 

గీ.ఆలోచించవా నామాట బావనైన, ప్రశ్నకు జవాబు లివ్వవా ప్రేమ నాది 
చెంతకొస్తవా సేవలు చేయ గలను, సమ్మతిస్తవా సహకార సహన మిదియు 

గీ.చేయి పట్టనా ఇప్పుడే చింత వలదు, సరస మాడనా హాయిగా సమయ మిదియు 
చేర దీయనా ఇప్పుడే చేష్ట లాపు , నిలిచి పొమ్మందునా నిన్ను నేటి రాత్రి 
...
ఒకరికొకరు ఆనంద పారవశ్యంతో ఆడే నాట్యం ఆది దంపతులై
ఉ.నామది నీదుభక్తిగను నాయనవై ననుయేలుకోవవా
నీమనసేను సర్వమయ నీడగ నేస్తము ఎల్లరందునా 
నామది నీజపమ్ముగను ఆశయ సిద్ధికి దారి జూపవా
నీమమతే గతీ విధియు ఈశ్వరి గంగతొ మమ్ము జూడుమా
......

రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (21)

సీస పద్య మాల... సినారే కవితా వెల్లువ

అత్యంత గూఢమై ఆనంద దాయకం
అర్థంబుగానిసం ఆది కవిత 

దర్భంబు కవితలు ధనము కొందఱకునె
బంధమ్ము కవితలే భాగ్య కవిత

సరవి విశ్రుత పూర్వ శబ్ద ప్రయోగముల్ 
సమయ సంతృప్తియె సమర కవిత

చెరిగిన కవిత కొందఱకు  బ్రియము గాను  
మలుపులే కథలుగా మమత కవిత 

పోడిమి రెట్టింప వాడికి మాటలు
తరచైన చిత్రమే తనువు కవిత

కొందఱకు బ్రియము, కొత్త కవిత్వము 
సెలయేళ్ళుదుమికిన చేరు కవిత

సరణినిజంఝాళి తంబైన కవితయే 
హృదయ వాంఛ సరళ హృద్య కవిత

వెన్నెల పూయించు వేకువ ఝాము నే
వాదన లేకుండగా వాణి కవిత

తే. గీ.అవిని లీలలు మనసు రాఁ గవిత సెప్పి
మెప్పు గైకొనగ నశక్య మాయ సమున 
దాచ నేటికి బుద్ధికి దాపరికము 
రచన  చేసెద వినరయ్య రసికులార.

జ్ఞాన పీఠవిశ్వంభరా జపము తపము
తెలుగు వచన కవిత్వము తేట పలుకు
చిత్ర గాన భరత వాక్కు చేర్చు ధరణి
పరమ పురుష సినారె శుభమ్ము మనకు

తే. గీ.రూప మేదైన శీల విశ్రాంతి సహన
సంపదయు శ్రీకరము వంశ సేవ పరము
సూర్య వెలుగు విద్య గతియు సూత్ర మౌను 
జననము సహజ మరణము జపము విద్య

తే. గీ.చదువు చదువన్నది మనసు చెలిమి ముఖ్య
మైన పరిణతి ప్రధమము యైన అదియు
దైవ సంకల్ప సిద్ధియు దీన బతుకు
విధి ప్రకృతి జయము చదువు విద్య నేర్పు

సమలంకృతం

తెలుగు భాషామ తల్లికి  యశోభూషణమా
తెలంగాణ మాగాణానికి మణిమకుటమా
గానామృతం నీవు గీతామృతం నీ వెంట
జనుల మదిలోన నిలిచిన సుకవీంద్ర సుంకిరెడ్డి!

నవతి ఒడిలోన నీ రసడోలనం సంగీత సాహిత్య సమలంకృతం
ప్రపంచ పదులు పలికించె నవజీవన సత్యం
సాహితీ కృషీ క్షేత్రాన విరిసిన విరి తావులెన్నో
నాగార్జున సాగరం రామప్ప విశ్వంభరల జయపతాక!

కళా ప్రపూర్ణ పద్మశ్రీ లెక్కకు మించిన ఆభరణాలెన్నో
మీ గీతం లేని గృహసీమ లేదు ఈ తెలుగు నేలన
పంచె కట్టుట లోనంటూ తెలుగుతనం విరిసి మురిసె
జ్ఞాన పీఠం మీ హృదయ పీఠం జన హృదిలో అజరామరం!

భాషా ప్రయోగశాలకు మీరు ప్రయోక్త
ఎన్ని శాఖోపశాఖలో ఈ భాషాతరువుకు
లేదు ప్రాంత కుల మత జాతి విబేధం
ఎల్లలు లేని హృదయ ఫలకం విస్తరించె విశ్వాంతరాళానికి! 

విశ్వంభరమే మీ విశ్వజనీనత
సాహితీ వినీలాకాశంలో మీరొక ధృవతార 
వెలుగు రేఖలు ప్రసరించు ఆ వేల్పులదాకా
మీ ఆనంద తాండవం అక్షర క్షేత్రాన అంబరచుంబనం!

ఎందరెందరికో స్ఫూర్తి మీ పదలయ విన్యాసం
ఏకలవ్య శిష్యగణమెంతో లెక్కకు మించి
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అంటూ
నాటికి నేటికి మీ మృదుమధుర గీతాలు!

భారతావని జీవనదుల సమాహారమనే జీవితసారం
జీవనదులే జీవన ప్రభవమైనవి ప్రభలైనవి
తూర్పు పడమర ఎదురెదురు అన్నట్లు 
జనన మరణాలు ఎదురెదురు
మధ్యన మిగిలేది కవివరేణ్యుని యశస్సు దశదిశల!

(సినారే జయంతి సందర్భంగా చిరు నివేదన)
 ———
మీ ప్రాంజలి ప్రభ 
29/07/2023.
సీస పద్యము

ఆకారమై త్రిగుణాకార సాకార
మై కన, నీ మది మౌనమేను 
రాకారమై మది శ్రీకారమై గతి 
హుంకారమైవిధి హాస్యమౌను 
కడలిభాంకారమై కార్యకర్తవ్యమై 
 వెలయ టంకారమై వేదనౌను 
 వెడలి ఢంకారమై విద్య ఘీంకారమై 
హంకారమైశోభ హారతౌను

తే. గీ మనసు ఝంకారమై కేకి మగ్గిపోవు 
వయసు క్రీంకారమై సిరి వడలి పోవు 
సొగసు ప్రాకారమై కళ సోకు పోవు 
 కలికి హ్రీకారమై చెలగ కాల మౌను

తే. గీ విధిగ ణాకారమై కథ విప్ప గలుగు 
లలిత క్లీకారమై కళ లయల వెలుగు
సహజ అంకారమై మది సహన పిలుపు 
కళ రసాలంకరమైన కలల పలికి

తే. గీ.వినయ శంకారమై నిత్య విజయ మేను 
ప్రణవ మోంకారమై గతి ప్రగతి జూపు 
కులికి ఆడెడి పాడెడి కూర్పు గలుగు 
విశ్వ మాయకృష్ణునిలీల విజయ మేను

శా..శ్రీదేవీ మలయప్పసామి కళలే శ్రీవిద్య శ్రీకారమే
భూదేవీ పరబ్రహ్మణే కథలుగా శ్రీ లక్ష్య శ్రీ మూర్తిగా
గోదాదే వి మనస్సు ప్రీతి శుభమై శ్రీ దివ్య శ్రీ శక్తిగా
వేదా విద్యను భోధయే మనసుగా వేదాల గోవిందుడా

తే. గీ.భక్త వత్సల  సర్వేశ   పరమ  పురుష 
పార్వతీ ప్రియా! హర!భక్త వత్సల! శివ!
శంకర!ఫణి భూష!హర!సర్వేశ!యీశ!
పావన హిమగిరి నివాస!పరమ పూజ్య!
ఆదు కోవయ్య. నందీశ!యాది పురుష!

తే. గీ. భక్త వత్సల సర్వేశ పరమ పురుష
శక్తి నివ్వుమా సుఖదుఃఖ శాసనమగు
రక్తి జనవాంఛ లోలక రమ్య మౌను
యుక్తి మాలో నిలుపు దేవ యోగ్య మోను 

రా. సత్య సౌర్యము నియమ సత్కీ లమేను
నిత్య పాండిత్య నియమ నీడలే జయము
విద్య వినయమ్ము నియమ విధిగాను తోడు
కార్యదక్షత చెలిమి కాలమౌ గుణము
నిధులు మానవ తృప్తి నిజమైన బ్రతుకు

నుదుట సూర్యోదయమగు నూతనవెలుగు 
 పెదవిపైన చంద్రోదయమ్ము వెన్నెలగు 
అణువణువు మధూదయయె ఆశలదివ్వె 
తనువు ఒకసుమానమది తపనలకళలు
 
రావణాశురా రసమయం రమ్య చరిత
నీలకంఠ తాండవ మేను నియమ చరిత
పార్వతీ పరమేశ్వర పదము చెరిత
పాప నాశన పరమాత్మ పలుకు చరిత

పార్వతీ పరమేశ్వర లీలలు 
తే. పచ్చబొట్టు చెరిగి పోదు పడచు పిల్ల
వెచ్చగా తోడు నేనుంటి విజయ మేను
మచ్చతాను మహిమగాను మనసు నీది
స్వచ్ఛత హృదయ మేనులే సఖ్యతచెలి

మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (05)
పార్వతీ పరమేశ్వర ప్రాణయలీల

గీ. మనసు మురిసియు సొగసులు మార్గమొప్ప , న్నెల తలపుల తలుపు వేగిరపడు
కనులు తెరలు కనికరము కానలగుచు, ఒడిన ఒరిగియు వలపుల వలువలూడ

గీ.భవభవ సెగలు కదలిక భాషకులుకు ,అదియిది యనక లిపియేను అలయుకథయు
నవకవన ఒరవడి నవవిధము సరయు ,సరళ విమలచరితము గుసగుసలగు

గీ.తెలిసి తెలియని తపనల తడబడుకథ, అనుకరణ ఆణువణువుగా ఆశతెలుపు
మధుర మరుమల్లె మగసిరి మాయజరుపు, అడుగడుగున ఏకము తృప్తి ఆటమలుపు 

గీ.అలికిడి అలజడులు కలలే యగుటయు, మలి మలి మనసూరట మధురతమగు
చిరు నగవులు నలిగియు విచిత్రమౌను, శుభసమయము శోభఅధరం శుభసమమగు 

గీ.సర్వలోకసమన్వయం సమయతృప్తి , సర్వ లక్ష్య ప్రభావితం సహనసృష్టి
సర్వ విద్యా సహాయమే సత్యమార్గ, సర్వదం నీలకంఠ ప్రసాదమేను

ఉ.జవ్వని జూపు జాడ్యమగు జాతక మార్పుకు జాముయీ శ్వరా 
రివ్వని గాలివీయగను రెప్పల చూపులు కళ్లుయీశ్వరీ 
రవ్వల వెల్గునీడలగు రాత్రుల వెన్నెల తీర్పు ఈశ్వరా 
గువ్వల సంతసమ్ముయు సగుర్తుగ సాగుట సత్య మీశ్వరీ 

గతమనేది వదలి యాలి గమ్య మైన చూపు యీశ్వరా , సతిగ సమయ తృప్తి పరచు సమరమేను యీశ్వరీ, పతిగచేయు మేలు ఇకను పడక తీర్పు యీశ్వరా అతిగ ఆశ లొలక వద్దు ఆట మార్పు యీశ్వరీ. 

మ.కో.  ముందు చూపును అలవర్చు ముఖ్య మౌను యీశ్వరా 
పొందు భక్తి యుక్తి శక్తి పోరు బాగు యీశ్వరీ
మందు పంచి మత్తు నిచ్చి మాయచేయు యీశ్వరా
విందు నీకు నాకు మతిగ విశ్వ మౌను యీశ్వరీ

మ.కో.నేర్చుకోవడమీను పొద్దున నీడ లగుట యీశ్వరా 
మార్చు వద్దును బుద్ధి గానులె మానసమ్మగు యీశ్వరీ
కూర్చ గలిగి నుండ గుణము కూడు నౌనను యీశ్వరా
చేర్చ గతియు  జూపు జతగ చింత వలదు యీశ్వరీ 

మ.కో.కొత్తదనము మార్పు తెచ్చును  కోరు తున్నది యీశ్వరా 
నత్త లాగను  నుండలేనులె   నాడి నడక యీశ్వరీ
వత్త వలపు ఏల నీకును పట్టు వడిసి యీశ్వరా
చెత్త ననియు తీయ కుండను  చింత మాపును యీశ్వరీ

చం.

ఉ. అభి మతమును వృద్ధిలోన అభి నయనము యీశ్వరా 
మనసులోన ఉన్న విషయ మంతయు విధి యీశ్వరీ 
పారదర్శకంగ బయట పాట మాట యీశ్వరా 
ఈగ దోమ నల్లి బల్లి ఈశ్వరాధ యీశ్వరా 
\
ఉ.బాధ్యత ప్రణమగు ళికను బంధ మౌను యీశ్వరా 
మాణయుక్తమౌను సహన మార్గ మౌను యీశ్వరీ 
తప్పైనన నిరభ్యతరము తనమన గుణ యీశ్వరా 
తప్పు నీవు నొప్పలేక తన్ను కోక యీశ్వరీ 

ఉ.బాదలోన ఉన్న వారి బాధనుంచి యీశ్వరా 
ఎంత కఠిన నిర్ణయమ్ము ఏల నీకు యీశ్వరీ 
అయిన తీసుకునెడి దైర్య ఆశ్రయమ్ము యీశ్వరా 
 గురువులాగ పెద్దదిక్కు గుర్తు చేయు యీశ్వరీ 

ఉ.మార్గదర్శకుడగు విధియు మంచి నీడ యీశ్వరా 
నవ్వు తున్న  అనుచరులకు నయన చూపు యీశ్వరీ

***

రామకృష్ణ గీత .. ప్రాంజలి ప్రభ (06 )
మనసు నిన్ను మరిచిపోదు ఓ...పిచ్చి మనసా ఎందుకే ఇలా............. 
నిదురరాదు పొద్దుపోదు తలవకుండ ఉండలేదు ఓ...పిచ్చి మనసా ఎందుకే ఇలా............. 
వేకువ వెలుగులు రాకుండా మంచులా నన్ను వెంబడించు, పువ్వుకు మధువు చేరగ చురుకుగా ఉల్లాసంగా ఉస్చాహంగా నిండిఉండు,  రేయంతా సుఖ సంతోషాలతో మేయలేని తీర్చుకోలేని ఆశల వలయాలతో  మాయా ప్రపంచములో, సమయాన్ని సద్వినియోగం చేయాలని తాపత్రయం. 

కవిత కోసం నిద్ర పోనిక్కడ, తరుణం కోసం వెలుకెక్కడ, మనిషి కోసం మార్పు ఎక్కడ, 
మనసు కోసం ఓర్పు ఎక్కడ , అన్నం కోసం ఎదురు చూపెక్కడ, ఊపిరి కోసం వలపు తట్టెక్కడ,
ప్రేమ కోసం తనువు తపమెక్కడ, ధ్యాస కోసం తలపు కల ఎక్కడ. మౌన జ్ఞాపకాలు, నయనాల మాటున ఇరుక్కొని, కన్నీరులా వాణి నినాదంలతో,  మనసు నును వెచ్చని కోరికలు తీర్చు కోవటానికే ప్రయత్నం కంటిలో చేమ్మేగా ఉంటూ, ఇంటిలో చెలిమిగా, గుండెలో శబ్దంగా ఉంటూ, తుంటరి గా కలలో ఏడిపిస్తూ, ఒంటరిదాన్ని చేసి, ప్రేమను క్రుమ్మరించి ఎడిపిస్తావా నింగిలో జాబిలివై యగయుగాలు నిలిచి ఉందువు, కలి యుగాన నా మనసులో వెలుగుల జ్యోతివై నిత్యమూ వేలుగుతూ, ఉండిపో కిరణపు వెలుగులు కరుణ చూపుతూ నన్ను ఆవహించినాయి తక్షణము తపనలు తగించే తరుణము ఇదేనని వదలక నా ఆశలు తీర్చ

మితిమీరిన ఖర్చు ...  పేదరికం పాలు చేయు, 
మితిమీరిన పొదుపు ..  కష్టాల పాలు చేయు 
మితిమీరిన సంపాదన ... మనశ్శాంతిని లేకుండా చేయు.
 మితిమీరిన కర్తవ్యం ... అగచాట్ల పాలు చేయు .
మితిమీరిన క్రమ శిక్షణ ...  రక్త సంబధీకులను దూరం చేయు
తిమీరిన బాధ్యతలు ...  అప్పుల పాలు చేయు
తిమీరిన హాస్యం ...  నవ్వుల పాలు చేయు
మితిమీరిన కోపం ... శతృవులను వృద్ధి చేయు
మితిమీరిన ఆలోచనలు ... జీవితాన్ని దుర్భరం చేయు
మితిమీరిన వ్యసనాలు ...అప మృత్యు పాలు చేయు.
మితిమీరిన స్వార్ధం ...అందరినీ దూరం చేయు
మితిమీరిన పోటీ ... నష్టాల పాలు చేయు
మితిమీరిన లాభార్జన ...వ్యాపార ఉనికికే మోసం చేయు .
మితిమీరిన వస్తుత్పత్తి ... నాణ్యతా ప్రమాణాలను దెబ్బ చేయు
మితిమీరిన గర్వాహంకారం ...  ఆపదలు కొని చేయు
మితిమీరిన అలంకారం ...  వెగటు పుట్టిచేయు
మితిమీరిన శృంగారం ... వైరాగ్యాన్ని కలిగిచేయు
మితిమీరిన కామాంధకారం ... జీవచ్ఛవాన్ని చేయు
మితిమీరిన అత్యాశ .. నేరాల పాలు చేయు
మితిమీరిన అధికార దాహం ...  హత్యా రాజకీయాలను ప్రేరేపిపచేయు
మితిమీరిన త్యాగం ... కడగండ్ల పాలు చేయు
మితిమీరిన వ్యవసాయకోత్పత్తి ... భూమిని నిస్సారం చేయు.
మితిమీరిన జనాభా పెరుగుదల ... దేశ ప్రగతిని త్రొక్కే చేయు
మితిమీరిన స్నేహాలు ...  అభిప్రాయ భేదాలను సృష్టి చేయు
మితిమీరిన గారాబం ...చెడు స్నేహాల పాలు చేయు
 మితిమీరిన వేదాంతం .. వెటకారం పాలు చేయు.
మితిమీరిన ఈర్షా ద్వేషాలు .. నిద్రా సుఖాన్ని దూరం చేయు.
మితిమీరిన భక్తి .. . మూర్ఛల పాలు చేయు.
మితిమీరిన తీర్ధ యాత్రలు ... నాస్తికత్వానికి నాంది పలుకుతుంది.
మితిమీరిన ఉపవాసాలు ...  నిస్త్రాణతకు దారి తీస్తుంది.
మితిమీరిన ప్రేమ ... అనుమానాలకు దారి తీస్తుంది.
మితిమీరిన నమ్మకం .. ద్రోహానికి దోహదం చేయు.
మితిమీరిన విశ్వాసం ..  లోకువ పాలు చేయు.
మితిమీరిన ఋణం ... మరణం పాలు చేయు.
మితిమీరిన అభిరుచి ... దుబారాకు దారి తీస్తుంది.
మితిమీరిన కీర్తి దాహం ...  ఆదాయాన్ని మింగేస్తుంది.

మధుర మోహన మురళి గానం మృదువుగా మ్రోగించి మనసు రంజిల్ల పరచి, పున్నమి చెంద్రుని చూచి పులకించె వనమ౦త తలలూపె లతలన్ని తన్మయత్వము చెందే. వేణు గానము వినగ  విరులన్ని వికశించి వెదజల్లె సుమ గంధ పుప్పొడి పరిమళాలు, పిల్లన గ్రోవి వినగ పరవసించగ తనువు పడద్రోసె నను మోహపు పాటల మత్తులోనకి  పొన్న చెట్టు నీడ పొగడ పూవులు పేర్చ సేద తీరుమా కృష్ణ సేవ చేయుదు నీకు! 
--((*))__
రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ. (07)
జగజ్జనని అయినా పార్వతి శివుడికి యిల్లాలే. జగదంబ కు ఏవేవో కోర్కెలు ఆశలు ఉంటాయి . మరి తల్లి సౌందర్యలహరి కదా .ఆది దేవుడైన.. శివుడేమో  మగవాడే కద ఆవిడ మాట వినకుండా మూడు కళ్ళు మూసుక్కూర్చుంటాడు. మరి గౌరి తల్లి గోడు  చూడండి . ఆమె సంభాషణ సీస తేటగీతి పద్యమాల స్త్రీగా శివునిపై ప్రేమకురిపించే

సీస పద్యము 
నీ వెంటనే నుండు నీదు యుక్తియు తోడు .. నీ రూపు నాలోన నిదుర పోదు
నీ తోడుయె సుఖము నీ కళ్ళు నను మార్చు.. నీ అధరామృత నిదుర పోదు
నీ ప్రతి క్షణనీడ  నిజము గుర్తును చేయు ..నీ శ్వాస నాలోన నిదుర పోదు
నీ ఊపిరి కలసె నీపైన భక్తియే .. నీ జత నిర్మలం నిదుర పోదు

ఆ.కలలు తీర్చ గలుగు కామ్య మన్మధుడవు.. సలపరింత మార్చ సహన పరుడు
హృదయ వాంఛ తీర్చ యుదయ భానుడుగాను.. ప్రణవ నాద పరము ప్రేమ చెరిత
***
సీస పద్యం 
మరువలేదు మమత మాన లేదు మనసు .. తరువులాగ బతుకు తనువు తోను
కరువుయున్న వయసు కరుగలేదు పనిగా.. కఠిన మైన కళతో కాల మందు
బరువులన్ని భరించి భయము లేని జపము .. అరువులేని తపన ఆట నాదు
చిరునగవులు పంచి చింతను తొలగించ .. చిత్తము పై వాంఛ వీడ లేను

ఆ. శాంతి కోరి జీవ సహన యాత్రలునావి .. ఆలు పిల్లలందు ఆశ తీర్చ
మనిషి గాను భక్తి మానస శంభుడై .. గాల మంత ప్రేమ గడుపు చుండు
......

గీ.పాద కమలసేవయు చేయ పాపనాశ .. భూతదయయును చూపెడి భూత నాధ
నెయ్యము సహన మార్గము నిర్ణయశివ .. దాపసుల దయ చూపెడి దాత యీశ

గీ.పట్టు పంచెలేని శివుడు పట్టు బట్టి .. పార్వతికి మంగళమ్మగు పట్టు చీర
యాస మేసి కదలె దీక్ష యోగి మల్లె .. వన్నె చిన్నెలు గలమాత భవ్య నిధిగ

గీ.నగలు మెలికల నాగులు నటన నొసగు .. మెడకు జుడ్తివయ్యొ తొడవు మేలు గాను 
బూది పూస్తివయ్య తనువు భుక్తి కోరి .. ఆశ తీర్చవేమి మమత మాత కేది 

 గీ.పేమగఫలము వెట్టినా పేగు కోరి .. బిచ్చ మెత్తు తావులె నీవు బొచ్చె పట్టి 
వల్లకాడుకు వోతివి వలదు నన్న .. ఇంట ఇల్లాలు నెత్తిన ఇష్ట గంగ

గీ.కండ్లు గప్పియే సవతిగా గంగ దెస్తి .. ఇరువురుకి బేధమవ్వక ఇష్ట పడియు 
మాయ చేసి మభ్యనుబెట్టి మనసు ఇచ్చి .. కూని రాగాలు రానట్టి కూర్పు ప్రేమ

 గీ.సరళ విమలచరితము గుసగుసలగుట .. తెలుసు కొను అభిలాషయు తిరుగబడదు
కలలు తీర్చగలుగు బుద్ధి కాల మలుపు .. లోకవిద్య నేర్ప గలుగు లోకనాధ

గీ.సంబరాలు కే చమ్కీల సీరతెచ్చి .. చంద్ర హారమడ్గ సహన సంబరమ్ము 
మంచుపర్వతమున నుంచి మంచి జేసి .. వాన కుర్సి నంతను వేడి వాక్కు నిచ్చె 

గీ.ఉల్క వేమి నీవు ఎపుడు పల్కవేమి .. ఊసు లాడ వేమిమనసు ఊహ తీర్చ
పిల్సినాక కూడ వయసు నివ్వ కుండ .. సూసి సూడ కుండేలను సూత్ర మేల 

గీ.మూడు కండ్ల తో ముల్లోకములను ముర్సు .. నట్లు చేసితి ఇంటిలో నాలి యడ్గ
కోర్కె తీర్చ కుండ నగవు గొప్ప జూపె .. బాస మర్సి పోయి వినయ బంధ మగుట

గీ.  జ్ఞాన ముద్రానినున్ గన జ్ఞాన మిమ్ము, తొలుత నజ్ఞానమున్ బాపి నిలుము మదిని,
జ్ఞానరూపివి, నీవున్న జ్ఞానమమరు, నిన్ను సేవించి సన్ముక్తి నేను కనుదు.
***

రామకృష్ణ గీత ... ప్రాంజలి ప్రభ (08 )
 
లలిత కోమల మోహన లహరి లీల, రమ్య భవ్య దివ్య చరణం రసమయమగు, నీదు అపురూప ఆనందం నిర్మల మగు, ఊహలు అనన్య లక్ష్యమై ఉజ్వల మగు 
 
 నీదు పాద దర్శనముయే నీడ నిచ్చు, మనసు పరవశము అమోఘ మార్గ మిచ్చు, జీవిత  సుకృతం విధి ధన్య జీవ మగును, నీకు శరణమ్ము  వందనం నియమ భక్తి

ఇష్ట మార్గ అంకితము గా ఇంతి సహన, పూజ అంకిత అర్పిత పుడమి నందు,  నిత్య ఆరాధన కళలు నిన్ను కోరి, హృదయ నమ్మకం జీవనమ్ము కృష్ణ

గజ్జె శబ్ద  శోభిల్లుతూ గళము విప్పి, పసుపు పారాణిల మెరియు పూత పూసి, నీదు పాద పద్మాలకు నిలకడగను, కైవల్య పదము ఇమ్మని కోరిక ఇది 

గీ. సామ్యవాద పరిపాలన తరంగ జీవ నాడి .. హృద్య వాద సమ పోషణ అనంత జీవ నాడి
మంత్రి వాద మమ కారపు విశేష జీవ నాడి .. రక్త వాద సమ సంపద సజీవ జీవ నాడి

గీ.దేహ ధాతువుల పోషణ విధాత జీవ నాడి .. ప్రేమ భుక్తి గల కారణ సేవిత జీవ నాడి
శ్రమ శక్తి గల నాటక నమ్మక జీవ నాడి .. బ్రమ నుండి తొల గించిన విస్మయ జీవ నాడి

గీ. కాల నిర్ణయ ము తెల్పెగ సత్యపు జీవ నాడి .. సంశ యమ్ములను తీర్చిన తర్కపు జీవ నాడి
ప్రశ్న ఉత్తరము కోరిన సంశయ జీవ నాడి .. వేషము భాషలను నమ్మిన శోభిత జీవనాడి

గీ. భక్తి భావములు చేరిన కర్తల జీవ నాడి .. ముక్తి కల్గుటకు చేసిన కర్మల జీవనాడి
యుక్తి పెర్గుటకు పూజలు చేసిన జీవ నాడి .. కృష్ణుని శక్తియు పంచిన జీవిత ధర్మ నాడి

అనేక నాడులు  
దివ్యచరణాలు చూడగా వినయ వాంఛ, తోను నా రెండు నయనాలు తోడు కోరె 
తనివితీరా మది అనుభూతి  కథలగుట పారమార్ధాలు లేనట్టి పాల బ్రతుకు

అక్షయముగ పుణ్య ఫలమునందు కొనగ, ఛత్ర చామర పాదుకా చయము తోడ
దధియు శాకము జలకుంభ దానములను, భక్తి తోడ నేడొసగిన ఫలము మెండు.

ఛత్రము=గొడుగు, చామరము=విసన కర్ర, పాదుకలు=జోళ్ళు, దధి=పెరుగు,
శాకము=కూరగాయలు/ఆకు కూరలు,జలకుంభము=నీటితో ఉన్న పాత్ర.

దానం భక్తితో చేస్తే ఫలం అక్షయమని శాస్త్ర వచనం.
***
రామకృష్ణ గీత .. ప్రాంజలి ప్రభ (09 )
నువ్వు నాకు ఎందుకు నచ్చావో, నా సంతోషాల వెళ్లు  వయ్యావు 
నా సౌభాగ్యానికి తోడు వయ్యావో , నా అంత రంగాలలో నిలిచావు 

అల్లకల్లోలం మదిలో రెపావో, గువ్వల రాగం మనలో నింపావు  
రాగ, శృతి, తాళం, అయి ఉన్నావో, జన్మ జన్మల సాక్షిగా నాలో ఉన్నావు 

అడుగులో అడుగువై నడిచావో, ఇసుకలో గాలి తుఫానై ఉన్నవు  
కంటికి కనురెప్పవై  కాపాడావో, ప్రేమ నందించి నాలో ఉన్నావు

ఆశయాల ఆరాట మయ్యావో, నాలో ఆలోచన శ్రుతి వయ్యావు  
సుడి గుండం నుండి రక్షించావో, ఆశలు తీర్చి ఆనంద పరిచినావు 

అందుకే 
ఓ నా ప్రేయసి రాధికా   
నా మాటలోని మర్మం తెలుసుకోలేవా 
నా ఆశలో ని ధర్మం తలచుకోలేవా 
నా మౌనంలోని వైనం మలచుకోలేవా 

అందుకే 
ఓ నా ప్రియుడా గోపాలా  
నీ మాటలోని మర్మాన్ని తెలుసుకోగలను 
నా ఆశలో ని ధర్మం తలచుకో గలను  
నా మౌనంలోని వైనం మలచుకో గలను  

పాలలో పెరుగును నేనే
పెరుగులో వెన్నను నేనే 
వెన్నలో నెయ్యి ని  నేనే 
నెయ్యి లో తీపిని నేనే 

ఓనా ప్రియాసి నీ మధురాన్ని నేనే 
అని తెలుసుకో  రాధికా  
నింగిలో మేఘాన్ని నేనే 
జలంతో నిండిన ప్రుద్విని నేనే 
ఎన్ని ఉన్నా నాకు నేనే 
సమస్తము బరించే ఓర్పును నేనే  
ఓనా ప్రియుడా నీలో మధురాన్ని నేనే గోపాలా   

చీకటిలో చందమామను నేనే 
వెన్నలను అందించేది నేనే 
చల్లని గాలితో మరిపించేది నేనే 
మనసును రంజిమ్పచేసేది నేనే
ఓనా ప్రేయసి నీ సుఖాన్ని నేనే రాధికా         

వేడికి విచ్చుకొనే కలువను నేనే 
పరిమళాలాలతో మతిపోగోట్టేదినేనే
మన్మధ సామ్రాజ్యానికి మూలం నేనే 
ఉష్ణ తాపాన్ని తగ్గించే మంచును నేనే  
 ఓనా ప్రియుడా నీ సుఖాన్ని నేనే గోపాలా  

ఓ నా ప్రేయసి 
నా మాటలోని మర్మం తెలుసుకోలేవా 
నా ఆశలో ని ధర్మం తలచుకోలేవా 
నా మౌనంలోని వైనం మలచుకోలేవా 

ఓ నా ప్రియుడా 
నీ మాటలోని మర్మాన్ని తెలుసుకోగలను 
నా ఆశలో ని ధర్మం తలచుకో గలను  
నా మౌనంలోని వైనం మలచుకో గలను  
--((*))--

రామకృష్ణ గీత ... ప్రాంజలి ప్రభ (10 )

:"మనోజ్ఞ పుస్తక రూపాం, మనవాభ్యుదయం స్ఫాటిక జప ధారిణీమ్,  
జ్ఞానాభయశబ్దదాత్రీం,  వందేऽహం వర దాయినీమ్ !!!"

"ప్రాణి వైవిధ్య సంధాత్రీం , క్షమా గుణ స్వరూపిణీమ్ !
సర్వదుష్ట విధాత్రీం తాం , ధాత్రీ దేవీం నమామ్యహమ్ !!!

నేటి పద్య పుష్పాలు - ఇలవేల్పు ఆంజనేయ స్వామి జై
జై హనుమాన్ జై జై జై వీర హనుమాన్
"మత్తకోకిల 
----
అంజనీ వరనందనుండ సుహాటకాంచిత తేజుఁడా 
అంజనీ మది సేవ భావ సమాన తేజపు భానుడా
రంజనాత్పర నమ్మి నందుకు కోర్కెతీర్చియు వీరుడా 
యోజనాలనె లెక్క చేయక రామ కార్యపు సాధకా

ప్రజ్వరిల్లిన వాయు తేజము లంఖినీ మద మడ్చెనే
ప్రజ్ణ నందన మేఘ గర్జన దుష్ట హృద్యము ఖండనే
సజ్జనాలకు శిష్ట రక్షక ధర్మపోషక శోధకా
దుర్జనా లయ భంజనమ్ముయు దుష్ట శిక్షణ ధీరుడా

ఆజవంజము లేని నట్టియు ఆత్మ తేజపు శక్తుడా
ద్విజ రాజుల సంద్ర మంతయు ఏక పక్షిగ ఎగ్గిరే
పూజనీయుడు రామ భక్తుడు ఇష్ట కోర్కలు తీర్చెనే
వాజబీ కళ నిత్య సత్యపు సేవ భావపు రక్షకా

కంజపుష్ప సుబంధు శిష్య సుకామ్యదప్రద పావనీ 
రంజనమ్ముగఁ జేసితీవయ రామకార్యమునంతయున్
భంజనమ్ము నొనర్చి రాక్షసబాధఁదీర్చినవయ్యవే 
అంజలుల్ గొనుమయ్య దేవ ! మహాత్మ ! కావుము మమ్ములన్ !!!"

ఉ.కారము లేనిదైనమమకారము చంపును జీవయాత్రలో
భారము నెంచలేక మది భక్తియు తెల్పక తోడు నుండుటే
నేరము చేయకే వినయ నీడల వెంటన కార్యదీక్షగా
తారక మంత్రమే మనసు దానము ధర్మము నీతిసాక్షిగా

ఉ.పండిన ఆకురాలుటయు పాలను నీళ్లుగ బ్రహ్మ సృష్టియే
ఎండిన కొమ్మ విర్గుటయు ఎల్లలు చూపుట ఎల్లవేళలే
మండినమంట బూడిదగు మానసబుద్దియు మార్పులవ్వుటే
వండిన వంటయేరుచియు వానలవల్లసుఖమ్ము సత్యమై

శా.ఏమాదృశ్యము పక్షులై కదిలే ఏ మైన  దాహమ్ముయే 
సామాణ్యమ్ముగ సాధనమ్మగుటే సామర్థ్య భావమ్ముయే 
ఏమా వేషము కాల ధర్మమనుటే ఏర్పాటు తత్త్వమ్ముయే 
స్వామీ నీ సృష్టిగాను భాగ్యమవుటే  సాహిత్య లక్ష్యమ్ము గా
 
రామకృష్ణ గీత ... ప్రాంజలి ప్రభ (11 )

"గురువేసాక్షాత్పితకద .. గురువే త్ర్యంబక సుమూర్తి గురువగు రూపున్!
గురుభక్తిపరాయణుఁడగు .. గురుతరశుభముల నొసంగు గోవిందుండే!!!"

"కొందఱికిఁ దెనుఁగు గుణమగుఁ; .. గొందఱికిని సంస్కృతంబు గుణమగు; రెండున్‌
గొందఱికి గుణములగు; నే .. నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్‌." 

కొందరికి తెగువ గుణమగు  .. కొందరికిని మోహతంబు గుణమగు ; రెండున్ 
కొందరికి  వినయమగు నే .. నందరి ఒప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్‌."

"ఏమా.. వేకువ సొబగులు.. రామానంద మగును కద రశ్ములఁ జూడన్!
ప్రేమాత్మకమ్ము లోకము .. కామా...జోతలి డగనల కమనీయునకున్!!!"

"స్కందుఁడ! సురసేనానీ! .. మందమతులకు మతినిడుమ మానిత దేవా!
కుందనఁపు బిడ్డల నిడుము.. సుందర..కావుమ..వరదుఁడ! 'సుబ్రహ్మణ్యా'!!!" 

"రంగుల గులాబి పువ్వులు .. హంగును సమకూర్చుచుండు హాయిని యిచ్చెన్..
చెంగావివర్ణసొబగును .. బంగరుసవురునుంగలిగినఁబ్రకృతికి యినుఁడే!!!"

"కాచిగుడలోని షాపున .. మా..చక్కనిచీరలయ్య..మనసైనవియున్
మాచింగుపోచఁపువలువ  .. నాచు నెఱుపు నలుపు రంగు ననగను కలవే!!!"

"ఎఱ్ఱని మిఱఁపల పచ్చడి .. వఱ్ఱగ నుండును విరివిగవాయినిఁబడగన్
చుఱ్ఱుమనదుమజ్జిగతో .. జఱ్ఱున తినవచ్చునగును శాకము తోఁడన్!!!"

అబ్బుర పరచెడి విధముగ  .. గొబ్బెమ్మలు గౌరి వోలెఁ గొలువై యుండన్
మబ్బులుఁ దొలఁగును గృహముల, .. మబ్బుకొనిన మంచు భోగి మంటలఁ గాలున్

జనులెల్లరు దేవతకిడి .. మినుమును దినవలయు నేఁడు మిక్కిలి భక్తిన్
కనుమనఁ గాకియు మునుఁగును .. కనుడీ రెండెడ్ల బండ్ల గ్రామము లందున్

నిన్నే నెన్నేనని నే .. నెన్నైనను నెన్నునిన్నని నేనా
ని న్నాన నూన నేనిన్ .. నన్నానును నాననాను నననీనన్నా 

నానా నాకౌకోనీ .. కేనాకన నిన్నెకాక నికనేనొకనై
నానెన్ని కినుక నూనక  .. కానుకకైకొన్న నిన్ను కన్నా నికఁనే 

నేమమ్మున నీనామము .. మామనమున నమ్మినాము మము మనుమను మో
మామానినాన నెమ్మిని .. మే మనుమానమ్ముమాన మి మ్మెన్నేమా 

దానవవనదవవనదా .. నానావిద్వన్నవీన నవననిదానా
దీనానాదీనవదా .. నానుదు నెద నీదువాదు నాదవినోదా 

"భగవంతుని లీలలనున్  .. భగవంతుని మహిమ గరిమభాసము గాదే!
భగవంతుని మనమెపుడున్  .. భగవంతుని సేవఁజేయు భక్తులఁగనమే!!!"     

సిగపట్టులు పట్టుటయున్  .. ఎగనామము తెలిపి మదికిభాధను పెంచే
తగువే తమ మనసెపుడున్  .. భగవంతుని సేవఁజేయు భక్తులఁగనమే!!!

వగలమారి చక్కదనమున్  .. సెగలాతన మనసు చిలికి చంచల మయ్యే 
వగలే వలపుల చెరువున్    .. భగవంతుని సేవఁజేయు భక్తులఁగనమే!!!

నగవుమారి మోసతనమున్ .. పగపెంచియు బతుకు చిదిమి భద్రత మార్చే
నగలు ధనమును దోచుటన్  .. భగవంతుని సేవఁజేయు భక్తులఁగనమే!!!

పలికెడి వాఁడును దానే  .. పలికించెడి ప్రభువు /తల్లి గూడ భావించఁ దనే 
కలమును గొని నే వ్రాసెద  .. నిలపయిఁ బంచంగఁ గవిత లిచ్చిన యానన్‌ 

కర్తను నేననుటెట్టుల  .. కర్తృత్వము నాది కాక కవితను దేనిన్‌ 
స్ఫూర్తిని నొసగఁగ వ్రాయుటె .. పూర్తిగ భారమ్ము నుంచి మునివందితుపై 

భక్తులకందిడ యశమును .. శక్తుల నందించు సామి.. సత్యము గాదా? 
భక్తిని వేడక యున్నను .. రక్తినిఁ జూపించి తానె వ్రాయించు సదా 

ఈ నాటి చెలిమి కాదిది .. యేనాటిదొ బంధమంచు నెప్పుడొ చెప్పెన్‌ 
వాణీ రూపుగఁ దానే  .. యీ నా మదిలోననిల్చి కృపతోఁ బలుకున్‌ 

నేర్పెను స్వయముగ ఛందము .. నోర్పుగఁ జూపించి దారి యుల్లమునందున్‌ 
కూర్పించి పాట పద్యము  .. లేర్పరచె నుపాయమొకటి యెఱిగించ నిలన్‌ 

వేసె ప్రణాళికనేదో  .. భాసురమతియై నయమిడఁ బ్రజలకుఁ బోధన్‌ 
వ్రాసెడి కవితలతో జగ  .. దీశునిపై భక్తిఁ బెంచ హితవని నుడువున్‌ 

అంకిత భావము తోడను .. శంకారహితమగు మదిని సతతము గొల్వన్‌ 
సంకట హరుడై గురుడై  .. పంకేరుహ నేత్రియు నయి, ప్రాపయి యుండున్‌ 

కారణమున్నది జన్మకు .. ధారుణిపైకంపె నిన్ను దల్లియె యనుచున్‌ 
పారించు చుండుఁ బద్యము .. ధారాళము గాఁగ పదము ధారాశుద్ధిన్‌ 

ఇరువది యేండ్లుగ నడిపెను .. సరసీజదళాక్షి పగిది సాయము నిడుచున్‌ 
వరమైన పలుకు తోడనె  .. వరలుదువీధాత్రి ననుచుఁ బలుకుచు నాతో 

భాషయు నేర్వఁగ నీయఁడు .. భాషాయోషయె యిడునని వలసిన వానిన్‌ 
పోషించి పెద్ద చేసెను .. వేషమునున్‌ మార్పుఁదెచ్చె విహితమటంచున్‌ 

ఎన్నియొ చేయఁగ నున్నవి .. యన్నింటిని సలుప శక్తి నమ్మయె యిచ్చున్‌ 
విన్నదనంబును బొందకు  .. మన్నింటికి నాదె భారమనుచును బలుకున్‌ 

ఆటల నాడును సతతము .. మాటలతో మాయ పుచ్చి మనసిది యలుగన్‌ 
పాటలతోఁ బలికి మరల .. మాటాడఁగఁ జేయుఁ బాపి మదిలోఁ గినుకన్‌ 

ఒకటా రెండా చెప్పఁగ .. బ్రకటించఁగవచ్చు వ్రాసి గ్రంథము లెన్నో! 
సకలజ్ఞుఁడు తానగుచును .. సకలాత్ముఁడు గూడనయిన స్వామివి లీలల్‌ / యాటల్‌ 

వదలఁగ నీయఁడు నన్నును .. వదలెద ననుకొన్నఁ గూడ వచ్చిన కినుకన్‌ 
కదలఁగ నీయని బంధము .. నెదలోఁ గలిపించెనకట ! యేమని చెబుదున్‌ ! 

శరణని వేడుదు నతనినె .. కరుణను జూపించి దారి కావఁగమనుచున్‌ 
చిరుచిరునవ్వుల నొలుకుచు .. మురిపించును క్షణము లోన మోహము వదలన్‌ 

ఏనాఁడును వ్రాసి యెఱుగ .. నేనొక్కటి యతఁడొసఁగక! నిక్కమె సుమ్మీ ! 
స్థాణుఁడె సాక్ష్యము దీనికి ! .. వాణినిఁ దల్లిగఁ గొలుచుచుఁ బలుకుదె కల్లల్‌! 

చేయకె నేనే వినతియు .. వ్రాయించెదఁ బద్యములను రమ్మని, వడిగా 
వ్రాయించె నివియు నాతఁడె .. సాయమ్మిడ మీకు గూడ సత్యము నెఱుఁగన్‌ 

వెలుఁగుల గుప్పెడి తల్లీ .. కలదా నీచెంతనొకటి, కందము, జార్చన్‌
పలువురు మెచ్చెడి సొబగున .. నలరించఁగ గలుగుదయిన నానందమగున్‌

ఒకటేమిటి నా తల్లీ .. నికరమ్ముగ లక్షనయిన నీకిడఁ గలనే
చకచక వ్రాయఁగఁ గలిగిన .. ప్రకటమ్మునుఁ జేతు నెన్నొ రకముల రహిమై

విసుగునుఁ బొందవు క్షణమును .. వసివాడదు మోము గూడ, వద్దనవెపుడున్‌
ముసిముసి నవ్వులె సతతము .. మిసిమించెడు పదముతోడ మేలుగ నిడఁగా

పంచఁగ వచ్చును దెరపయి .. కించయు లేకుండ నెటుల కృషి ఫలములుగా
సంచులు సంచులు గావలె .. నెంచుక నేనిచ్చువన్ని యిమ్ముగఁ బట్టన్‌

అతిశయమున నేఁ బలుకను .. వ్రతభంగము జేయఁబోను వమ్మగు పలుకున్‌
గతులునుఁ జూడఁగ నింపగు .. మతిలో నిలిచెడి పలుకయి మధురంబగుచున్‌

ఛందోవైవిధ్యమరసి .. యందరు విస్మితులగుటయె యనిశము ధరపై
నందున నుండెడి భావము .. లందరికిని ముదము గూర్చ నవనికి హితమై

లెక్కకు మించిన చుక్కలు .. చక్కఁగ వెలుఁగొందునటుల చదలను నిశిలో
మక్కువతోనిడు పద్యము .. లక్కజమయి వెలుఁగులీను నంతట తెరపై

చెప్పినదే చెప్పెదనని .. గొప్పలు వ్రాయింతుననుచుఁ గోప్పడకమ్మా
ఒప్పిదమగుదే నా నుడి .. యెప్పటికిని, నేమియన్న నెన్ని విధాలన్‌

నమ్మకమీయఁగఁ జెప్పుదు .. గమ్మఁగ నీ రీతిఁ బలికి కందములందే
నెమ్మది నుంచఁగ నీమది .. నమ్మగ నావిధియు, నటులె యవసరమంచున్‌

నమ్మకముంచక నాపయి  .. నిమ్ముగ సేవించ నన్న నిన్ని దినంబుల్‌
సమ్మతి నేర్పిన విద్యయు .. నెమ్మెయి సార్థక్యమందు నీ మహి మెచ్చన్‌ 

నేను కెరటము అయిన .. మనసు అవసర మయిన మారును ఉప్పెనగా
మనసు నరకంగా మారినను .. తనువూ ఓర్పుతో అర్పించి తెగువ బ్రతుకే

మగువ మనసు వెన్న .. తెగువ చూపి సమస్య తీర్పు చెప్పుచున్నా
చిగురు పొగరు ఉన్న .. వగరు చూపులు చూపియు మనసు తట్టిన్

మహిళ పై దాడులు .. మోహిత ప్రేరణ మోగాళ్ళ తన్మయ చేష్టల్
సహనము తగ్గును మాయ .. మోహము చెంది మనసు తపన చెందున్

ఆభరణము మాకు ఓర్పు .. నిబ్బరము, నమ్మకము, భరోస, ప్రతిభ, చూపున్
ప్రభల బ్రతుకు ప్రశ్నయె .. శుభములు కలిగి చదువులు చదువు చుండేన్



రామకృష్ణ గీత ... ప్రాంజలి ప్రభ (11 )

:"మనోజ్ఞ పుస్తక రూపాం, మనవాభ్యుదయం స్ఫాటిక జప ధారిణీమ్,  
జ్ఞానాభయశబ్దదాత్రీం,  వందేऽహం వర దాయినీమ్ !!!"

"ప్రాణి వైవిధ్య సంధాత్రీం , క్షమా గుణ స్వరూపిణీమ్ !
సర్వదుష్ట విధాత్రీం తాం , ధాత్రీ దేవీం నమామ్యహమ్ !!!
----
నేటి పద్య పుష్పాలు - ఇలవేల్పు ఆంజనేయ స్వామి జై
జై హనుమాన్ జై జై జై వీర హనుమాన్
"మత్తకోకిల 
----
అంజనీ వరనందనుండ సుహాటకాంచిత తేజుఁడా 
అంజనీ మది సేవ భావ సమాన తేజపు భానుడా
రంజనాత్పర నమ్మి నందుకు కోర్కెతీర్చియు వీరుడా 
యోజనాలనె లెక్క చేయక రామ కార్యపు సాధకా

ప్రజ్వరిల్లిన వాయు తేజము లంఖినీ మద మడ్చెనే
ప్రజ్ణ నందన మేఘ గర్జన దుష్ట హృద్యము ఖండనే
సజ్జనాలకు శిష్ట రక్షక ధర్మపోషక శోధకా
దుర్జనా లయ భంజనమ్ముయు దుష్ట శిక్షణ ధీరుడా

ఆజవంజము లేని నట్టియు ఆత్మ తేజపు శక్తుడా
ద్విజ రాజుల సంద్ర మంతయు ఏక పక్షిగ ఎగ్గిరే
పూజనీయుడు రామ భక్తుడు ఇష్ట కోర్కలు తీర్చెనే
వాజబీ కళ నిత్య సత్యపు సేవ భావపు రక్షకా

కంజపుష్ప సుబంధు శిష్య సుకామ్యదప్రద పావనీ 
రంజనమ్ముగఁ జేసితీవయ రామకార్యమునంతయున్
భంజనమ్ము నొనర్చి రాక్షసబాధఁదీర్చినవయ్యవే 
అంజలుల్ గొనుమయ్య దేవ ! మహాత్మ ! కావుము మమ్ములన్ !!!"

చం.ఎరుగుదు నీకృపారసమదెట్టుల నైనను నీమనోవిదీ
పరుగుల జీవితమ్ము సుఖపాలన నిచ్చుట నీదుశక్తియే
నెరుగుదు నెల్లవేళమది లక్ష్యమేనులెచక్క సెయ్యవా
మురిపము సత్య రాముని సమూహపు ప్రేమనుపొంద సేవలే

సీస పద్యము 

చిరునవ్వు చిన్నారి చిద్విలాసము చూడు 🌹* మరుమల్లె మధురాతి మాయ చూడు🌹
వీరజాజి వినయపు విరుపులన్నియు చూడు 🌹* అరుణోదయపు కళ ఆట చూడు 🌹
పరువాల చిన్నది పదము పలుకు చూడు 🌹*గురుగింజ మెరపుగా గుర్తు చూడు 🌹
కరుణ లీల యిదియు కళ్ళపిలుపు చూడు 🌹*పరుగు లొద్దు చినుకు పగలు చూడు 🌹

పంచ భూతములు యుపాధి ప్రేమయగుటే❤️*ప్రాణములను పెట్టి ప్రేమ పంచు❤️
హృదయ వాంఛ తీర్చ హృద్యము పొందుటే❤️*పెళ్లి సుఖము నిచ్చు ప్రేమ చూడు ❤️
...
గజిల్.. మాయా 

కలలు కల్లలగుట నిత్యము సత్యమే విధి మాయా
పలుకు కులుకు చిలికు మగువ పిలుపులేను విధి మాయా

అలక నీతి ఆటసలుపు ఆధరణయే మౌన నీతి
చిలక పలుకు చిన్నారి వేషాలు కథ విధి మాయా

నలుసు పడ్డ వీధి పడ్డ చెప్ప కుండు చేయు బుద్ది 
తులువ నేస్తమైన బంధప్రేమ చేయు విధి మాయా

కలువ అందము చుట్టు తిరిగేటి మంద బుద్ధి గాను 
వలుపు ధనము పెరిగి మనిషి అహము పెరుగు నిధి మాయా

మలుపు లున్న నీతి గాను బీద బతుకు ధర్మ మార్గ 
తలుపు జీవితం గా మనుష్యులు కలలు విధి మాయా

బలుపు పెర్గి దుష్టబుద్ది చెప్పు పలుకు విధి మాయా
తెలుపు త్రిమూర్తుల నాటకాలు జగతిన విధి మాయా


రామకృష్ణ గీత ..   సీస పద్యం (12)

మనసంత నీకిచ్చి.. మద్దెల   బ్రతుకుగా 
కొసరంత ప్రేమకై.. గొప్పగాను 

కమ్మనీ ఊసులే గాయంతొ ఊగుచూ!
తావిలా ఎదనంత తాక గలుగు 

నీ ప్రేమ జల్లుకై నీడలై ఆశగా 
రేపవలు తలప  రెచ్చి పోవు 

తీవనై అల్లుకొన తీవ్రత బంధమే 
పందిరి నీవంటు పంతమేను

తే.గీ.అవసరార్ధము తీర్చేటి అదును జూపి
సమయ మెరిగి వదలకయు సరియగుటయు
చండ మారుతమునకునె చలన మవక
ఉండు నిశ్చలమ్మై మనసు ఊహ ప్రేమ 
....
సీస పద్యము (2)
మనసుతో బంధమై మనిషినే ముడిపెట్టు
దరిజేర లేకయు ధర్మమౌను 

మాటవిన మనసు మమతకై చేజాచు
వలదన్న మొండిగా వరుస కోరు

గాయాలు గేయమై పాడినా వినదేమి
కలలోన జతజేరి కథలుగాను 

బ్రతుకులో జ్ఞాపకం బంధమై ఊతమౌ 
హృదిలోన చిందులే హృద్య తపన

తే. గీ. దారి దీపమై వెలుగంగ ధరణి యందు
ఎంత అందచందము ప్రేమ ఎల్లలగుట
అనవరతమైన కథలన్ని అమర ప్రేమ
సమ విశేషమ్ము కదలిక విశ్వ ప్రేమ

మాత భవాని మాపై కరుణించవమ్మా


జలప్రళయమా యిదీ .. జనఘోష పట్టని విదీ
కనుమరుగౌతున్న మనుష్యుల స్థితీ .. పట్టించుకోని బ్రతుకులగతీ

అయ్యో అయ్యయ్యో అంతా జలమయం .. ఏ దిక్కు చూపుటలేదు యీ ప్రళయం
గూడు గుడ్డ తిండి దొరకని అయ్యోమయ్యం .. చెప్పుకుందామన్నా దొరకని జన మౌనం.. జల 

ప్రాణాలు గుప్పెట్లో జలాల మధ్య .. హాయాల అర్థనాదాల అసహాయుల మధ్య
వానకు తడిసి చలి జ్వరాల మధ్య దిక్కు చూపమని దైవప్రార్ధనాల మధ్య... జల 

గోదావరి, కృష్ణ అన్నీ నదులు ఉప్పొంగి పొంగే .. వాగు వంక డొంక గొడ్డు గూడు నీళ్లపై సాగే
సర్వము నీటమునిగి జనులు గూడుకై పరుగే .. అర్ధము తెలుసుకోక ప్రభుత్వము సహాయపు అడుగే... జల

ఏమిచేసితిమిరా, ఏ పాపమౌనురా, పిల్ల పెద్ద గోషరా, అంతుపట్టని విధి ఆటరా
ఆదుకొనువారు లేరురా, ఆత్మలగా మారుతీరురా
అధికారి అనధికారి పట్టించుకోని జనుల బ్రతుకురా 

జలప్రళయమా యిదీ .. జనఘోష పట్టని విదీ
కనుమరుగౌతున్న మనుష్యుల స్థితీ .. పట్టించుకోని బ్రతుకులగతీ

మ.భయమౌచున్నది వర్ష తీవ్రతగను నేనేమీ మది చెయ్యాలనో
నియమాలే తెలపాలి నా కలల నిర్మాణమ్మ యే విద్యగన్
జయమేనీతిగ బుద్ధినిమ్ము మమ జాతస్యమ్ము సేద్యంబుగన్ 
దయరాదావిధి ఆడు మార్గమిది ధర్మార్ధమ్ము గానే జూపుమా


రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (21)

సీస పద్య మాల... సినారే కవితా వెల్లువ

అత్యంత గూఢమై ఆనంద దాయకం
అర్థంబుగానిసం ఆది కవిత 

దర్భంబు కవితలు ధనము కొందఱకునె
బంధమ్ము కవితలే భాగ్య కవిత

సరవి విశ్రుత పూర్వ శబ్ద ప్రయోగముల్ 
సమయ సంతృప్తియె సమర కవిత

చెరిగిన కవిత కొందఱకు  బ్రియము గాను  
మలుపులే కథలుగా మమత కవిత 

పోడిమి రెట్టింప వాడికి మాటలు
తరచైన చిత్రమే తనువు కవిత

కొందఱకు బ్రియము, కొత్త కవిత్వము 
సెలయేళ్ళుదుమికిన చేరు కవిత

సరణినిజంఝాళి తంబైన కవితయే 
హృదయ వాంఛ సరళ హృద్య కవిత

వెన్నెల పూయించు వేకువ ఝాము నే
వాదన లేకుండగా వాణి కవిత

తే. గీ.అవిని లీలలు మనసు రాఁ గవిత సెప్పి
మెప్పు గైకొనగ నశక్య మాయ సమున 
దాచ నేటికి బుద్ధికి దాపరికము 
రచన  చేసెద వినరయ్య రసికులార.

జ్ఞాన పీఠవిశ్వంభరా జపము తపము
తెలుగు వచన కవిత్వము తేట పలుకు
చిత్ర గాన భరత వాక్కు చేర్చు ధరణి
పరమ పురుష సినారె శుభమ్ము మనకు

తే. గీ.రూప మేదైన శీల విశ్రాంతి సహన
సంపదయు శ్రీకరము వంశ సేవ పరము
సూర్య వెలుగు విద్య గతియు సూత్ర మౌను 
జననము సహజ మరణము జపము విద్య

తే. గీ.చదువు చదువన్నది మనసు చెలిమి ముఖ్య
మైన పరిణతి ప్రధమము యైన అదియు
దైవ సంకల్ప సిద్ధియు దీన బతుకు
విధి ప్రకృతి జయము చదువు విద్య నేర్పు

సమలంకృతం

తెలుగు భాషామ తల్లికి  యశోభూషణమా
తెలంగాణ మాగాణానికి మణిమకుటమా
గానామృతం నీవు గీతామృతం నీ వెంట
జనుల మదిలోన నిలిచిన సుకవీంద్ర సుంకిరెడ్డి!

నవతి ఒడిలోన నీ రసడోలనం సంగీత సాహిత్య సమలంకృతం
ప్రపంచ పదులు పలికించె నవజీవన సత్యం
సాహితీ కృషీ క్షేత్రాన విరిసిన విరి తావులెన్నో
నాగార్జున సాగరం రామప్ప విశ్వంభరల జయపతాక!

కళా ప్రపూర్ణ పద్మశ్రీ లెక్కకు మించిన ఆభరణాలెన్నో
మీ గీతం లేని గృహసీమ లేదు ఈ తెలుగు నేలన
పంచె కట్టుట లోనంటూ తెలుగుతనం విరిసి మురిసె
జ్ఞాన పీఠం మీ హృదయ పీఠం జన హృదిలో అజరామరం!

భాషా ప్రయోగశాలకు మీరు ప్రయోక్త
ఎన్ని శాఖోపశాఖలో ఈ భాషాతరువుకు
లేదు ప్రాంత కుల మత జాతి విబేధం
ఎల్లలు లేని హృదయ ఫలకం విస్తరించె విశ్వాంతరాళానికి! 

విశ్వంభరమే మీ విశ్వజనీనత
సాహితీ వినీలాకాశంలో మీరొక ధృవతార 
వెలుగు రేఖలు ప్రసరించు ఆ వేల్పులదాకా
మీ ఆనంద తాండవం అక్షర క్షేత్రాన అంబరచుంబనం!

ఎందరెందరికో స్ఫూర్తి మీ పదలయ విన్యాసం
ఏకలవ్య శిష్యగణమెంతో లెక్కకు మించి
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అంటూ
నాటికి నేటికి మీ మృదుమధుర గీతాలు!

భారతావని జీవనదుల సమాహారమనే జీవితసారం
జీవనదులే జీవన ప్రభవమైనవి ప్రభలైనవి
తూర్పు పడమర ఎదురెదురు అన్నట్లు 
జనన మరణాలు ఎదురెదురు
మధ్యన మిగిలేది కవివరేణ్యుని యశస్సు దశదిశల!

(సినారే జయంతి సందర్భంగా చిరు నివేదన)
 ———
మీ ప్రాంజలి ప్రభ 
29/07/2023.

రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (22)
మీ విధేయుడు.. మల్లాప్రగడ 

తే. గీ. ధ్యాన ధరణి మాతకుధర్మ ధ్యాసమదియు
విశ్వ నాయక గతిగాను వేంకటేశ
ప్రార్ధనలు మావి దయచూడు పామరులము
దర్శన నమస్సుమాంజలు ధర్మ దాత 

తే. గీ.కష్టములు కోర్వ నాచేతకాదు నిన్ను
ఇష్టత గనునే కొలిచితి ఈశ్వరేచ్చ
నష్టమూభరించ గలిగే నమ్మకమ్ము 
స్పష్టతయు లేని బ్రతుకులో సమర భక్తి 

తే. గీ.కొంతలోకొంత చెలిమిగా కొత్తవింత
అందరూ తెలుగు బతుకు ఆర్తనాద
నాటి వెలుగు రావాలని నాదు నడక
గళముపట్టి తెలుగుచెప్ప గమన మిదియు

తే. గీ.చినుకులుకురిశాక పుడమి చింత మార్చు
గంగ పరవళ్లు కడలితో గళము కలిపి
అణువణువు కలసి అలసి ఆట మరచు
పృథ్విలో విత్తు మొలకగా ప్రకృతి పరము

తే. గీ. ఎన్ని కన్నీళ్ళు కార్చాక ఏమి చెప్ప
అనుకరణ నవ్వు మెరిసింది అలసి పోయి
కడలి కన్నీరు అలలుగా కదలు తుండు
నదియు కలవగా శాంతము నటనయేను

తే. గీ.కొన్ని కవితలు రేపటి కోరి దాచ
కొన్ని రేపటి బ్రతుకుకే కోరి దాచ
కొన్ని మరణానికి వదలి కోరి దాచ
కొన్ని నమ్మకం జన్మకు కోరి దాచ

తే. గీ.కాని వాళ్ళు నేర్పారులే పాఠములను 
అయినవాళ్ళు చేసారులే మోసములను 
నాయనా ఇదే లోకము నేటి నిజము 
సమయ అవకాశ మేజీవి సహన బతుకు

తే. గీ.లేత బుర్రల కలతలు నీడలేను
తాత చెప్పేడి కథలాన్ని తనువు తట్టు
జాతరైనవేళలు సాకు జపము కట్టు
పాత కొత్త లేదు పదును పాఠమేను

ఆ.వలక బోవు నీరు వరదలా పొంగుటే
నలక బడ్డ కన్ను నమ్మ బలుకు
పిలుపు మారి మనసు పెనవేయు బుద్దిగా
కులుకు చుండె నేడు కూలి వాడు

తే.గీ.జలజలా చినుకులు ధార జపము తీరు
గలగలలతోను పారుచూ గమ్య మౌను
కళకళ కడలి పొంగులే కానుకగుట
మిగిలె కన్నీరు జనవాహి నీన ఏల

కం.మీసాలు మెలియు కవితలు
వ్రాసిన చదివి సహనమ్ము వాసిగ లేరే
సీసా ముందుకు బానిస
సీసాలను మెచ్చిరి రససిద్ధికి లోకుల్

తే. గీ.అందమన్నది వయసుతో ఆవిరగును
నడతలు తడబడిన వేద నమ్ముగాను
కులము సంపద ప్రేమకు కూడవుటయె 
విద్య లేనిచో బ్రతుకునా విధిగ బాధ

తే. గీ.నీ మనస్సాక్షి ఎప్పుడూ నిద్రపోదు
మౌనమేనని తప్పులు మోసమేల
సాక్షి నిలదీయు గమనము సాకు యనకు
నిద్ర కరుఔను తినలేవు నీడ కొరత 

గజల్.. చెలిమి పొందు 

లేతగాలి అందించే..లీలలన్ని చెలిమి పొందు
పూలనవ్వు చిందించే..పూర్ణమైన చెలిమి పొందు

ప్రతికణమొక తృప్తిగాను పవిత్రమై దివ్యమౌను 
ప్రవహించే పసిడినదుల..పంత  మైన చెలిమి పొందు

చేదుపాల మడుగు లేదు.. చేత కాని పనిలేదు
నిత్యచైత్ర వీణాధర..చిత్రమైన చెలిమి పొందు

ప్రియమానస సరోవరపు. పరిహాసపు కథలుగా 
గోర్వెచ్చని మంచుపూల..గొప్పవైన  చెలిమి పొందు

 కోటి ఇంద్రధనువు లైన ..గొప్పకావు  నీ తలుపుకు
అంతులేని గగనాలకు..ఆత్మ సాక్ష్య చెలిమి పొందు

నీ అంతరంగమేగ..నిజమాధవ సన్నిధంటే
గంధాలకు అతీతమై..రమ్యమైన చెలిమి పొందు

కులుకు చుండె మనసు..కూలివాని చెలిమి పొందు
చేతినిండ ధనమునున్న..చింత మాపు చెలిమి పొందు

.....
మీ మల్లాప్రగడ చెలిమి పొందు

ఇదోరకం ప్రేమ సీసపద్యాలు 
రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ

సీస పద్యం (1)

మనసంత నీకిచ్చి.. మద్దెల   బ్రతుకుగా 
కొసరంత ప్రేమకై.. గొప్పగాను 

కమ్మనీ ఊసులే గాయంతొ ఊగుచూ!
తావిలా ఎదనంత తాక గలుగు 

నీ ప్రేమ జల్లుకై నీడలై ఆశగా 
రేపవలు తలప  రెచ్చి పోవు 

తీవనై అల్లుకొన తీవ్రత బంధమే 
పందిరి నీవంటు పంతమేను

తే.గీ.అవసరార్ధము తీర్చేటి అదును జూపి
సమయ మెరిగి వదలకయు సరియగుటయు
చండ మారుతమునకునె చలన మవక
ఉండు నిశ్చలమ్మై మనసు ఊహ ప్రేమ 
....

సీస పద్యము (2)

మనసుతో బంధమై మనిషినే ముడిపెట్టు
దరిజేర లేకయు ధర్మమౌను 

మాటవిన మనసు మమతకై చేజాచు
వలదన్న మొండిగా వరుస కోరు

గాయాలు గేయమై పాడినా వినదేమి
కలలోన జతజేరి కథలుగాను 

బ్రతుకులో జ్ఞాపకం బంధమై ఊతమౌ 
హృదిలోన చిందులే హృద్య తపన

తే. గీ. దారి దీపమై వెలుగంగ ధరణి యందు
ఎంత అందచందము ప్రేమ ఎల్లలగుట
అనవరతమైన కథలన్ని అమర ప్రేమ
సమ విశేషమ్ము కదలిక విశ్వ ప్రేమ

మాత భవాని మాపై కరుణించవమ్మా
****

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు