srisri
కొద్దీ (ఛందస్సు ) తోమె కొద్దీ గిన్నె మెరుపు రుద్దె కొద్దీ సబ్బు నురగ పిండె కొద్దీ పండు నలుగు కొట్టె కొద్దీ కొండ కరుగు తవ్వె కొద్దీ నీరు పడుట మెచ్చె కొద్దీ ఆశ పెరుగు నచ్చె కొద్దీ భాధ మిగులు నవ్వె కొద్దీ కళ్ళు మెరియు ఉతికె కొద్దీ బట్ట చిరుగు తురుమె కొద్దీ చిప్ప మిగులు ముదిరె కొద్దీ బెండ తినరు చితిపె కొద్దీ చీము కురియు రాపిడి కొద్దీ వేడి కలుగు సాధన కొద్దీ విద్య పెరుగు సోధన కొద్దీ కొంత తెలియు ఇష్టము కొద్దీ కాని దవును --((*))-- యత్నం నా యజ్ఞం ! మొసలి నోటనుబడ్డ కరిరాజు మొరలిడగ బిరాన పరగెత్తి బ్రోచావు, వరదుడవు! అరుపులే వినబడున? ఆర్తి కనబడదా? ఏమాయె నీ కరుణ? ఎందుకీ జాగరణ? ముదుసలిచ్చిన పండ్లు ముదమార తిన్నావు, యెదలోన చోటిచ్చి ఆదుకున్నావు! నా కర్మఫలములు ఇంక పండనే లేదు, పచ్చి కాయలు స్వామి, నీకెట్ల పెట్టమంటావు? పాదాల చెంతనే చిత్తాన్ని నాటాను, పందిరై నీవుంటే పరిపక్వమౌతాను, ఆత్మ అర్పణ చేసి సంతృప్తి పడతాను! ఊగు సాయము సేయు ఉడుతనే గమనించి ఆదరించాన...