srisri




Seneca on True and False Friendship
కొద్దీ  (ఛందస్సు )

తోమె కొద్దీ గిన్నె మెరుపు
రుద్దె  కొద్దీ సబ్బు నురగ
పిండె కొద్దీ పండు నలుగు
కొట్టె  కొద్దీ  కొండ కరుగు

తవ్వె  కొద్దీ నీరు పడుట
మెచ్చె కొద్దీ ఆశ  పెరుగు
నచ్చె కొద్దీ భాధ మిగులు
నవ్వె కొద్దీ   కళ్ళు మెరియు

ఉతికె కొద్దీ బట్ట చిరుగు
తురుమె కొద్దీ చిప్ప మిగులు
ముదిరె కొద్దీ బెండ తినరు
చితిపె కొద్దీ చీము కురియు

రాపిడి కొద్దీ వేడి కలుగు
సాధన కొద్దీ విద్య పెరుగు
సోధన కొద్దీ కొంత తెలియు 
ఇష్టము కొద్దీ కాని దవును

--((*))--
యత్నం నా యజ్ఞం ! 

మొసలి నోటనుబడ్డ కరిరాజు మొరలిడగ 
బిరాన పరగెత్తి బ్రోచావు, వరదుడవు! 
అరుపులే వినబడున? ఆర్తి కనబడదా? 
ఏమాయె నీ కరుణ? ఎందుకీ జాగరణ? 

ముదుసలిచ్చిన పండ్లు ముదమార తిన్నావు, 
యెదలోన చోటిచ్చి ఆదుకున్నావు! 
నా కర్మఫలములు ఇంక పండనే లేదు, 
పచ్చి కాయలు స్వామి, నీకెట్ల పెట్టమంటావు? 
పాదాల చెంతనే చిత్తాన్ని నాటాను, 
పందిరై నీవుంటే పరిపక్వమౌతాను, 
ఆత్మ అర్పణ చేసి సంతృప్తి పడతాను! 

ఊగు సాయము సేయు ఉడుతనే గమనించి 
ఆదరించానంటూ చేవ్రాలు ఇచ్చావే! 
నా లోన కదలిక కనిపంచదా స్వామి? 
రాత మార్చను రాకుంటివిదియేమి? 

అటుకులిచ్చిన వాడే ఆప్తుడనుకుంటే 
అదేం కుదరదు, ఒప్పుకోను! 
నేనూ నీతో దాగుడుమూత 
లాడుతూ దారి తప్పాను! 
కాలం కళ్ళు కప్పి 
నీనుండి వేరుచేసింది, 
కలి చేతుల్లోకి కర్కశంగా విసిరివేసింది! 
దూరమై విలపిస్తున్నాను, 
చేరువవ్వాలని తపిస్తున్నాను! 

నాకు తెలిసిందొకటే వేదం, 
ఆర్తి నాదం! 
నాకు తెలిసిందోకటే మంత్రం, 
హరే రామ, హరే కృష్ణ! 

అర్థం చేసుకో తృష్ణ! 
--oo0oo—

వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే 
మనసులు కలసిన చూపులె పులకించి పాడెలే 
వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే 
చరనం 1 
బరువు కనుల నను చూడకు మరులు గొలిపి మది రేపకు 
బరువు కనుల నను చూడకు మరులు గొలిపి మది రేపకు 
చెలి తలపే తెలిపెనులే సిగలోనిలే మల్లెలు 
ఓ….వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే 
చరనం 2 
ఉరిమిన జడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి 
ఉరిమిన జడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి 
నీ హృఉదయములో వొదిగినచో బెదురింక యేమ్మునది 
వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే 

చరనం 3 
తొలకరి చినుకుల చిటపటలు చలి చలి గాలుల గుస గుసలు 
తొలకరి చినుకుల చిటపటలు చలి చలి గాలుల గుస గుసలు 
పెదవులపై మధురిమలే చిలికించ మన్నాయిలే 
ఓ….వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే 

మనసులు కలసిన చూపులె పులకించి పాడెలే


మహాకవి శ్రీశ్రీ గారి కావ్యము 

ఎవరిది అహింస 
తలకాయలు దొర్లా 
లన్నాడు బిర్లా 
ఔను సత్యం తలకాయ దొర్లింది 
భాస్కరుడి తలకాయ దొర్లింది – ఇదే హింస 
బోర్లా 
పడుకున్న సంపాదకా విను 
నక్సలైట్లు భేధిస్తున్నారు గాంధీ 
విగ్రహాల శిరస్సులను – అదే అహింస 
సత్యానికి చావు లేదు 
భాస్కరుడు బతికే వుంటాడు 
ఈ లోగా 
పురాణాలు పుక్కిలించిన 
కిరాణా కవులంతా 
నక్సలైట్ నరకాసురుణ్ణెదిరించి 
సినీమాతార సత్యభామ 
ధనస్వామ్య దామోదరుణ్ణి రక్షిస్తుందని 
అమాయకంగా నమ్ముతారు.
--((**))--

 మహాకవి శ్రీశ్రీ గారి కావ్యము

కళారవి
పోనీ, పోనీ,
పోతే పోనీ!
సతుల్, సుతుల్, హితుల్ పోనీ!
పోతే పోనీ!
రానీ, రానీ,
వస్తే రానీ!
కష్టాల్, నష్టాల్,
కోపాల్, తాపాల్, శాపాల్ రానీ!
వస్తే రానీ!
తిట్లూ, రాట్లూ, పోట్లూ, రానీ!
రానీ, రానీ!
కానీ, కానీ!
గానం, ధ్యానం!
హాసం, లాసం!
కానీ, కానీ!

కళారవీ! పవీ! కవీ!

మహాకవి శ్రీశ్రీ గారి కావ్యము 

జగన్నాథ రధచక్రాలు 
జగన్నాథ రధచక్రాలు 
పతితులార! 
భ్రష్టులార 
బాధాసర్ప దష్టులార! 
బ్రతుకు కాలి, 
పనికిమాలి, 
శని దేవత రధచక్రపు 
టిరుసులలో పడి నలిగిన 
దీనులార! 
హీనులార! 
కూడు లేని, గూడు లేని 
పక్షులార!భిక్షులార! 
సఖులవలన పరిచ్యుతులు, 
జనులవలన తిరస్క్రుతులు, 
సంఘానికి బహిష్క్రుతులు 
జితాసువులు, 
చ్యుతాశయులు, 
హ్రుతాశ్రయులు, 
హతాశులై 
ఏడవకం డేడవకండి! 
మీ రక్తం, కలగి కలగి 
మీ నాడులు కదలి కదలి 
మీ ప్రేవులు కనలి కనలి 
ఏడవకం ఏడవకండి! 
ఓ వ్యధా నినిష్టులార! 
ఓ కధా వశిష్టులార! 
పతితులార! 
భ్రష్టులార! 
బాధాసర్పదష్టులార! 
ఏడవకం డేడవకండి! 
వస్తున్నా యొస్తున్నయి… 
జగన్నాధ, 
జగన్నాధ, 
జగన్నాధ రధచక్రాల్! 
జగన్నాధుని రధచక్రాల్! 
రధచక్రాల్, 
రధచక్రాల్, 
రధచక్రాల్, రధచక్రా 
లొస్తునా యొస్తునాయి! 
పతితులార! 
భ్రష్టులార! 
మొయిల్దారిని 
బయల్దేరిన 
రధచక్రాల్, రధచక్రా 
లొస్తునా యొస్తున్నాయి! 
సింహాచలం కదిలింది, 
హిమాలయం కరిగింది, 
వింధ్యాచలం పగిలింది – 
సింహాచలం, 
హిమాచలం, 
వింధ్యాచలం, సంధ్యాచలం… 
మహానగా లెగురుతున్నాయి! 
మహారధం కదులుతున్నాది! 
చూర్ణమాన 
ఘార్ణమాన 
దీర్ణమాన గిరిశిఖరాల్ 
గిర గిర గిర తిరుగుతున్నాయి! 
పతితులార! 
భ్రష్టులార! 
బాధాసర్పదష్టులార! 
రారండో! రండో! రండి! 
ఊరవతల నీరింకిన 
చెరువుపక్క, చెట్టునీడ 
గోనెలతో, కుండలతో, 
ఎటుచూస్తే అటు చీకటి, 
అటు దుఃఖం, పటునిరాశ – 
చెరసాలలు, ఉరికొయ్యలు, 
కాలువలో ఆత్మహత్య! 
దగాపడిన తమ్ములార! 
మీ బాధలు నే నెరుగుదును.. 
. వడలో, కడు 
జడిలో, పెను 
చలిలో తెగనవసి కుములు 
మీ బాధలు, మీ గాధలు 
అవగాహన నాకవుతాయి 
పతితులార! 
బ్రష్టులార! 
దగాపడిన తమ్ములార! 
మీ కోసం కలం పట్టి, 
ఆకాశపు దారులంట 
అడావుదిగ వెళిపోయే, 
అరచుకుంటు వెళిపోయే 
జగన్నాధుని రధచక్రాల్, 
రధచక్ర ప్రలయఘోష 
భూమార్గం పట్టిస్తాను! 
భూకంపం పుట్టిస్తాను! 
నట ధూర్జటి 
నిటాలాక్షి పగిలిందట! 
నిటాలాగ్ని రగిలిందట! 
నిటాలాగ్ని! 
నిటాలార్చి! 
నిటాలాక్షి పటాలుమని 
ప్రపంచాన్ని భయపెట్టింది! 
అరె ఝాం! ఝాం! 
ఝుటక్, ఫటక్ … 
హింసనచణ 
ధ్వంసరచన 
ధ్వంసనచణ 
హింస రచన! 
విషవాయువు, మర ఫిరంగి, 
టార్పీడో, టోర్నాడో! 
అది విలయం, 
అది సమరం, 
అటో యిటో తెగిపోతుంది? 
సంరంభం, 
సంక్షోభం, 
సమ్మర్దన, సంఘర్షణ! 
హాలాహలం పొగచూరింది! 
కోలాహలం చెలరేగింది 
పతితులార! 
భ్రష్టులార! 
ఇది సవనం, 
ఇది సమరం! 
ఈ యెరిగిన ఇనుప డేగ, 
ఈ పండిన మంట పంట- 
ద్రోహాలను తూలగొట్టి, 
దోషాలను తుడిచి పెట్టి, 
స్వాతంత్ర్యం, 
సమభావం, 
సౌభ్రాత్రం, 
సౌహార్దం 
పునాదులై ఇళ్ళు లేచి, 
జనవాళికి శుభం పూచి – 
శాంతి, శాంతి, కాంతి, శాంతి 
జగమంతా జయిస్తుంది, 
ఈ స్వప్నం నిజమవుతుంది! 
ఈ స్వర్గం ఋజువవుతుంది! 
పతితులార! 
భ్రష్టులార! 
బాధాసర్పదష్టులార! 
దగాపడిన తమ్ములార! 
ఏడవకం డేడవకండి!
--((*))-- 

ఆలకించి నామాట 
ఆపుమా రధమును 
విమల చరితా నీవు 
వినుము నా బాధ! 

చేయ లేనీ పోరు 
చింతించ నా మనసు 
సంధించ లేను శరము 
సవ్య సాచి నైన! 

కుర వృద్దు లోక వైపు, 
గురువులోక వైపు 
ఎటుచూచిన బంధువులే 
ఎల్లరు నా ప్రజలె! 

వధియించి రణమున 
వల్లకాటికి చేర్చి 
కుడవ లేనీ కూడు 
కొరనీ రాజ్యమును! 

బంధుడవు,హితుడవు 
చెలుడవు,కావున 
కర్తవ్యమును భోదించి 
కరుణ చూపుము కృష్ణా! 

శ్రీనివాసమూర్తి గంజాం 

స్వాతి చినుకు రాలితే 
మేయిపులకరించే 
చల్లగ ఎదనెమీటి 
పిల్లగాలెసరిగమలే పలికే 
అణువణువు అంకురించ 
కాలమెంత పయనించో 
తీయని తన పలకరింపె 
ఎన్నైన్ని అనుభూతల 
నెలానిచ్చిపోయేనో 
కాలం తో సఖ్యంజేస్తే 
మది అంతరంగంలో 
ఎంతెంతమానందమది 
పంచునో 
అది అనుభవించేవారికి 
తెలియనిదికాదే 
అందుకే పూలరాలె 
వాన సొగసుల అందమె 
చూడాలి 
పరిమళించే వనాల 
కూడలిలో ఉండాలి 
తొలకరి మట్టివాసనవీచేలా 
మనుషులు అనురాగ 
ఆత్మీయతలపరవశించి 
పరిమళించాలి ప్రణవిల్లి 
పలకరించుకోవాలి
--((*))--


మహాకవి శ్రీశ్రీ గారి కావ్యము 

ఆనందం అర్ణవమైతే, 
అనురాగం అంబరమైతే 
అనురాగపు టంచులు చూస్తాం, 
ఆనందపు లోతులు తీస్తాం. 
నీ కంకణ నిక్వాణంలో, 
నా జీవన నిర్వాణంలో 
నీ మదిలో డోలలు తూగీ, 
నా హృదిలో జ్వాలలు రేగీ 
నీ తలపున రేకులు పూస్తే, 
నా వలపున బాకులు దూస్తే, 
మరణానికి ప్రాణం పోస్తాం, 
స్వర్గానికి నిచ్చెన వేస్తాం. 
హసనానికి రాణివి నీవై, 
వ్యసనానికి బానిస నేనై 
విషమించిన మదీయ ఖేదం, 
కుసుమించిన త్వదీయ మోదం 
విషవాయువులై ప్రసరిస్తే, 
విరితేనియలై ప్రవహిస్తే 
ప్రపంచమును పరిహాసిస్తాం, 
భవిష్యమును పరిపాలిస్తాం. 
వాసంత సమీరం నీవై, 
హేమంత తుషారం నేనై 
నీ ఎగిరిన జీవవిహంగం 
నా పగిలిన మరణమృదంగం 
చిగురించిన తోటలలోనో, 
చితులుంచిన చోటులలోనో 
వలయములై చలించినపుడే, 
విలయములై జ్వలించినపుడే 
కాలానికి కళ్ళెం వేస్తాం, 
ప్రేమానికి గొళ్ళెం తీస్తాం. 
నీ మోవికి కావిని నేనై, 
నా భావికి దేవివి నీవై 
నీ కంకణ నిక్వాణంలో, 
నా జీవన నిర్వాణంలో 
ఆనందం అర్ణవమైతే, 
అనురాగం అంబరమైతే 
ప్రపంచమును పరిహాసిస్తాం, 
భవిష్యమును పరిపాలిస్తాం.



మహాకవి శ్రీశ్రీ గారి కావ్యము 

గంటలు! 
పట్టణాలలో, పల్లెటూళ్లలో, 
బట్టబయలునా, పర్వతగుహలా, 
ఎడారులందూ, సముద్రమందూ, 
అడవుల వెంటా, అగడ్తలంటా, 
ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ 
గంటలు! గంటలు! గంటలు! గంటలు! 
గంటలు! గంటలు! 
గణగణ గణగణ గణగణ గంటలు! 
గణగణ గణగణ 
గంటలు! గంటలు! 
భయంకరముగా, పరిహాసముగా 
ఉద్రేకముతో, ఉల్లాసముతో, 
సక్రోధముగా, జాలిజాలిగా, 
అనురాగముతో, ఆర్భాటముతో, 
ఒకమారిచటా, ఒకమారచటా, 
గంటలు! గంటలు! 
గంటలు! గంటలు! 
సింహములాగూ, సివంగిలాగూ, 
ఫిరంగిలాగూ, కురంగిలాగూ, 
శంఖములాగూ, సర్పములాగూ, 
సృగాలమట్లూ, బిడాలమట్లూ, 
పండితులట్లూ, బాలకులట్లూ, 
గొణగొణ గణగణ 
గణగణ గొణగొణ 
గంటలు! గంటలు! 
గంటలు! గంటలు! 
కర్మాగారము, కళాయతనమూ, 
కార్యాలయమూ, కారాగృహముల, 
దేవునిగుడిలో, బడిలో, మడిలో, 
ప్రాణము మ్రోగే ప్రతిస్థలములో, 
నీ హృదయములో, నా హృదయములో 
గంటలు! గంటలు! 
గంటలు! గంటలు! 
ఉత్తరమందూ, దక్షిణమందూ, 
ఉదయమునందూ, ప్రదోషమందూ, 
వెన్నెలలోనూ, చీకటిలోనూ, 
మండు టెండలో, జడిలో, చలిలో, 
ఇపుడూ, అపుడూ, ఎపుడూ మ్రోగెడు 
గంటలు! గంటలు! గంటలు! గంటలు! 
గంటలు! గంటలు! గంటలు! గంటలు! 
గణగణ గణగణ గంటలు! గంటలు! 
గణగణ గంటలు! 
గంటలు! గంటలు!

--((*))--
మహాకవి శ్రీశ్రీ గారి కావ్యము 

అదృష్టవంతులు మీరు, 
వెలుగును ప్రేమిస్తారు, 
ఇరులను ద్వేషిస్తారు, 
మంచికీ చెడ్డకీ నడుమ 
కంచుగోడలున్నాయి మీకు. 
మంచి గదిలోనే 
సంచరిస్తాయి మీ ఊహలు. 
ఇదివరకే ఏర్పడిందా గది. 
అందుకే వడ్దించిన విస్తరి మీ జీవితం. 
నిశ్చల నిశ్చితాలు మీవి. 
మంచిని గురించి , 
మర్యాద, మప్పితం గురించి, 
నడతా, నాణ్యం, విలువల విషయం 
నిశ్చల నిశ్చితాలు మీవి. 
మీ కన్నుల చూపులు సరళ రేఖలో! 
రేఖ చెదిరితే గొల్లుమని పోతారు. 
రేఖ కవతలి వారంతా నేరగాళ్ళు. 
రేఖను రక్షించడానికే 
న్యాయస్థానాలు, రక్షకభట వర్గాలు , 
చెరసాలలు , ఉరికొయ్యలు , 
రేఖను కాపాడక తీరదు. 
అభాగ్యులం మేము, 
సరిహద్దులు దొరకని 
సంధ్యలలో మా సంచారం. 
అన్నీ సమస్యలే సందేహాలే మాకు. 
వెలుగులోని చీకట్లే, 
ఇరులలోని మిణుగురులే చూస్తాం. 
నూరు దోషాలలోని ఒక సుగుణం, 
నూరు పుణ్యాలలోని ఒక ఘొరం! 
వ్యత్యాసాలూ, వ్యఘాతాలే 
అడుగడుగునా మాకు. 
మా వంట మేమే వండుకోవాలి . 
ఒక్కొక్కమారు విస్తరే దొరకదు , 
జీవితపు సన్నని సందులకే 
ఆకర్షణ మాకు . 
మా దృష్టిది వర్తుల మార్గం . 
ఆద్యంత రహితం . 
సంధ్యా జీవులం, సందేహ భావులం . 
ప్రశ్నలే, ప్రశ్నలే. 
జవాబులు సంతృప్తిపరచవు. 
మాకు గోడలు లేవు. 
గోడలను పగులగొట్టడమే మా పని. 
అలజడి మా జీవితం . 
ఆందోళన మా ఊపిరి. 
తిరుగుబాటు మా వేదాంతం. 
ముళ్లూ, రాళ్ళూ, అవాంతరాలెన్ని ఉన్నా 
ముందు దారి మాది 
ఉన్నచోటు చాలును మీకు . 
ఇంకా వెనక్కి పోతామంటారు కూడా 
మీలో కొందరు. 
ముందుకు పోతాం మేము. 
ప్రపంచం మా వెంట వస్తుంది. 
తృప్తిగా చచ్చిపోతారు మీరు. 
ప్రపంచం మిమ్మల్ని మరచి పోతుంది. 
అభిప్రాయాల కోసం 
బాధలు లక్ష్యపెట్టనివాళ్ళు 
మాలోకి వస్తారు. 
అభిప్రాయాలు మార్చ్గుకిని 
సుఖాలు కామించే వాళ్ళు 
మీలోకి పోతారు .


Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు