ప్రేమికుల రోజు 14/2/2019
ప్రణయపు వలపు - పరవశించే నాలో తన్మయపు తలపు - వికసించే వేళ వయసులోని ప్రేమ - చిగురించే నాలో యామినిలో తారలు - మెరిసే వేళ మనసులోని ఆలోచన - వికసిం చే నాలో పున్నమి వెన్నెల - విరిసేటి వేళ యదలోని ఆశ - పులకిం చే నాలో పరువాల సొగసు - పండేటి వేళ వేచిఉన్న కళ్ళు - వికసించే నాలో నా హృదయానందం - పండించే వేళ సన్నాయి మేళం - సరిగమలు నాలో తనువుల తపన - మొదలైన వేళ శృంగార సాహిత్యం - శృతి చేసేనే నాలో అమృత ఘడియల - ఆనంద హెళ ఆనంద ప్రోత్సాహం - జతచేసెనే నాలో ఇది శృంగార సాహిత్యం - ఆహ్వానించే వేళ --((*))-- ప్రేమికుల రోజు భార్యకు భర్త ఇళ్ళ ఉండాలని ప్రేమిసుంది మా వారికి నామీద ప్రేమ ఎక్కువ ఎందుకంటే కరుణానిధి కదా అడగ కుండా పెట్టేది ఎక్కువ ఎందుకంటే ప్రేమపెన్నిధి కదా కోరుకున్న దానికన్నా ఇచ్చింది ఎక్కువ మాతృత్వ సృష్టి కర్త కదా అడగక పోయినా ఇచ్చేది ఎక్కువ అందుకే కర్మ సాక్షి కదా ఇవ్వాల్సి దానికన్నా ఇస్తాడు ఎక్కువ అందుకే నాకు పరమాత్మ కదా కుట...