ప్రేమికుల రోజు 14/2/2019
ప్రణయపు వలపు - పరవశించే నాలో
తన్మయపు తలపు - వికసించే వేళ
వయసులోని ప్రేమ - చిగురించే నాలో
యామినిలో తారలు - మెరిసే వేళ
మనసులోని ఆలోచన - వికసించే నాలో
పున్నమి వెన్నెల - విరిసేటి వేళ
యదలోని ఆశ - పులకించే నాలో
పరువాల సొగసు - పండేటి వేళ
వేచిఉన్న కళ్ళు - వికసించే నాలో
నా హృదయానందం - పండించే వేళ
సన్నాయి మేళం - సరిగమలు నాలో
తనువుల తపన - మొదలైన వేళ
శృంగార సాహిత్యం - శృతి చేసేనే నాలో
అమృత ఘడియల - ఆనంద హెళ
ఆనంద ప్రోత్సాహం - జతచేసెనే నాలో
ఇది శృంగార సాహిత్యం - ఆహ్వానించే వేళ
--((*))--
ప్రేమికుల రోజు
భార్యకు భర్త ఇళ్ళ ఉండాలని ప్రేమిసుంది
మా వారికి నామీద ప్రేమ ఎక్కువ
ఎందుకంటే కరుణానిధి కదా
అడగ కుండా పెట్టేది ఎక్కువ
ఎందుకంటే ప్రేమపెన్నిధి కదా
కోరుకున్న దానికన్నా ఇచ్చింది ఎక్కువ
మాతృత్వ సృష్టి కర్త కదా
అడగక పోయినా ఇచ్చేది ఎక్కువ
అందుకే కర్మ సాక్షి కదా
ఇవ్వాల్సి దానికన్నా ఇస్తాడు ఎక్కువ
అందుకే నాకు పరమాత్మ కదా
కుటుంబ భాదనంత భరించేది ఎక్కువ
అందుకే నాకు సూత్రధారివి కదా
ఏదైనా మాకోసం నీకు శ్రమ ఎక్కువ
అందుకే నాకు పాత్రధారివి కదా
మనల్ని అక్కున చేర్చుకునేది ఎక్కువ
అందుకే నాకు పతితపావనుడు కదా
--((**))--
నేటి కవిత
ప్రాంజలి ప్రభ (ఛందస్సు)
రచయత: రామకృష్ణ మల్లాప్రగడ
అచ్చి వచ్చిన స్తలం అడు గైన చాలు
నిత్యం సుఖాన్ని పంచే భార్య ఉంటే చాలు
ఎదురు ప్రశ్న వేయని మొగుడే చాలు
గుండెలో గాయం చేసింది నీ మాయ ప్రేమ
పువ్వు సోకగా నా సోకు కందించే ప్రేమ
కన్నీటి ధారలతో మేని పులకరింతలతో ప్రేమ
మనుషులేరగని మాయను కమ్మిన వెర్రి ప్రేమ
ప్రేమికులు విజయం పొందడం కష్టమే
చెప్పేటి మామూలు విషయం కానే కాదు
ఒకరి కొకరు దూరముగా ఉండటం
నిరీక్షన అంత తేలిక పని కాదు
ఒకరి మాట ప్రతిఒక్కరికి నచ్చటం
సరి సామాణ్య మైన విషయము కాదు
నీవు చెప్పిన సలహా ఆచరించటం
అను కున్నంత సులభము నాకు కాదు
--((**))--
నేటి కవిత UUI
ప్రాంజలి ప్రభ
రచయత. మల్లాప్రగడ రామకృష్ణ
రాజీవ నేత్రా - రమ కాంత రూపా
సంజీవ దేవా - సక లాంత దీపా
సంగీత వేదా - కమలాక్ష రావా
శృంగార వాసా - అనురాగ చక్రీ
నా మాట నీదే - మనసంత నాదే
నా పాట నీదే - గళమంత నాదే
నా ఆట నీదే - తనువంత నాదే
నా బాట నీదే - వలపంత నాదే
సాకార రూపం - వయసంత భాదే
వేదాల భావం - అనురాగ బంధం
కాలాల తత్త్వం - సమకూర్పు దీపం
మౌనాల సఖ్యం - సమశాంతి విశ్వం
కాదేల నోయి - అనుకున్న మార్గం
రాదేల నోయి - సమకూర దేహం
నేర్పేది విద్య - సమభావ స్నేహం
రక్షించు తండ్రి - సమకూర్చు ప్రేమమ్
కోరేది లేదే - అను రాగ దాహం
తీరేది లేదే - అపు రూప మొహం
తీర్చేది లేదే - అనుబంధ బంధం
చేరేది ఎలా - నవద్విప మాతా
--((*))--
ప్రాంజలి ప్రభ. నేటి కవిత : తెలుసా
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నీడను పట్టు కోవడం ఎవ్వరికైనా తెలుసా
ఎండమావుల్లో జలము ఎవ్వరికైనా తెలుసా
మృత్యువు జయించే శక్తి ఎవ్వరికైనా తెలుసా
చీకటి వెలుగు లేని ఇల్లు ఉందొ తేలుసా
వేలెత్తి చూపితే ఎవరు మారారో తెలుసా
ఎల్లలు లేని కడలిలో పొంగులు తెలుసా
మత పెద్దల మాటలలో నిజాలు తెలుసా
దేశ హద్దుల్లో ఉండే జవాన్ కష్టాలు తెలుసా
యాప్యాయత కరువైన వారెవరో తెలుసా
పురుషుని సమర్ధత ఇదేనని తెలుసా
స్త్రీ కష్టాలు లక్షణం ఇవేనని తెలుసా
స్త్రీల సౌభాగ్యం ఇంతవర కేనని తెలుసా
నవ్విన కంటిలో జలము ఎంతని తెలుసా
నిద్రలేని కంటి ఎరుపు ఎంతని తెలుసా
తండ్రి ఓర్పు నేర్పు తీర్పు ఎవరికైనా తెలుసా
తల్లి కష్టాల ప్రేమ ఎవ్వరికైనా తెలుసా
(నాకు మాత్రం తెలియదు తెలిసినవారు
ఉంటె తెలియపరచండి )
--((**))--
ప్రాంజలి ప్రభ
శ్రీర్షిక "
తనువు మనసు ఏకమై
ఒకరికి ఒక్కరై
అందుకోలేని అలలై
పట్టుకోలేని గాలి తెరలై
తోక తెగిన గాలిపటాలై
తెగి పడిన బల్లి తోకలై
నీటి కుండలో అరిచే కప్పలై
అదేపనిగా మొరిగే కుక్కలై
తిరిగే పంఖా రెక్కలై
గాలికి కదిలే ఎండు టాకులై
కలల్లో కాన రాని కన్నీరై
కడలిలో కోటుకు పోయే పడవై
ఉలి దెబ్బలకు అందమైన రూపమై
ఎవరికీ వారు యమునా తీరై
పగలంతా బేజారై
కుంపటి లాంటి ఉద్యోగాలై
పిల్లకు దూరమై
చీకటి పడ్డాక ఏకమై
మాకిద్దరు మేమిద్దరమై
ఇద్దరుకు ఇద్దరే
ఎవరు ఏదన్నా ఇద్దరూ ఒక్కటే
--((**))--
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
వదులు వదులు భామా
నన్ను వదులు వదులు
కావాలి కావాలి ప్రేమా
నిన్ను వదలా వదలా
కాలము కాదియు భామా
నాపై కోపము వదులు
రావాలి రావాలి ప్రేమా
నిన్ను వదలా వదలా
పెద్దలు ఉన్నారు భామా
నాలో రేపకు ఆశలు
ఆశలు దోషాల ప్రేమా
ఐనా వదలా వదలా
మనస్సు వేదన భామా
మమతకు కలతలు
అందాన్ని దోచేది ప్రేమ
మోము వదలా వదలా
మాట విను కష్టం భామా
వలపుల తలపులు
గుబాళింపు పీల్చు ప్రేమ
గీత వదలా వదలా
మాయను కమ్మింది భామా
ఓర్పు వహించే కళలు
ధర్మం కదలిక ప్రేమ
స్వేశ్చ వదలా వదలా
సంతోషం కల్పించు భామా
తరుణం తీర్చే ధర్మాలు
సద్వినియోగించు ప్రేమ
శక్తి వదలా వదలా
ప్రేమికుల రోజు
చిన్ని చిన్ని ఆశలు నీపైన
కన్ను మిన్ను కానక ఉన్నా
ఎన్నో చెప్పాలనుకున్నా
ఎన్నెన్నో బాసలు చేసి ఉన్నా
నడమంత్రపు సిరి వద్దన్నా
నీ ప్రేమ ఇస్తే నాకు చాలన్నా
నీవు సిరి సంపదలతో ఉన్నా
నీ ప్రేమను మరువలేకున్నా
భవిషత్తు తెలియ కున్నా
నీవు హాయిగా ఉన్నావనీ విన్నా
చిన్ననాటి విషయం రాస్తున్నా
గుర్తుంటావని అనుకుంటున్నా
కాలగమనం వేరై ఉన్నా
అందు కోలేని ఎత్తులో ఉన్నా
తీర్పు చెప్పే హోదాలో ఉన్నా
ప్రేమికుడ్ని మరవవని అనుకుంటున్నా
ప్రేమికుల రోజు అయి ఉన్నా
అందుకే నీకు గుర్తు చేస్తున్నా
అభిమానంతో వ్రాస్తున్నా
అన్యధా భావించక ఉంటావని
నమ్మి తెలియపరుస్తున్నా
--((**))--
ప్రాంజలి ప్రభ
*ఓర్పే-మందు
అమ్మా నన్ను ఒకడు వెంబడిస్తున్నాడే
అమ్మా
రోజూ కాలేజివద్ద గోల చేస్తున్నాడే
ఎన్ని గంటలైన నా కోసం ఉంటున్నాడే
బస్సు ఎక్కే కాడ కాపు కాస్తుంటాడే
వీలవేసి పిలుస్తాడే, చెయ్యి ఊపుతాడే
అమ్మా
నేను బస్సు ఎక్కగానే నాతోపాటు ఎక్కుతాడే
పక్కన నుంచొని చేయి వేసి వత్తుతాడే
ఎవరు ఎమన్నా పటించుకోడే
ఎనక ఉండి నన్ను తాకి వెనుకతోస్తున్నదంటాడే
అమ్మా నన్ను ఒకడు వెంబడిస్తున్నాడే
అమ్మా
లెగిసీ లెగ్గానే గుమ్మం ముందు టాడే
నే ముగ్గేయ్య బొతుంటే చూసి నవ్వు తాడే
నేను సూపర్ మార్కెట్ వెళ్తుంటే
సైకిలేసుకుని సిద్దంగా ఉంటాడే
నన్ను మెల్లగా పిలిచి మురిసి పోతాడే
అమ్మా నన్ను ఒకడు వెంబడిస్తున్నాడే
మెరకచేలోన కలుపుకెలతుంటే
మలుపు తిరిగేకాడ కూచొని ఉంటాడే
ఏదో ఒకటి నాతో మాటాడుతాడే
కొత్త కొత్త విషయాలు చెప్పి నవ్విస్తాడే
కుక్కపిల్లలా తోక ఊపుతు వెంట వస్తాడే
అమ్మా నన్ను ఒకడు వెంబడిస్తున్నాడే
ధైర్యమే నీకు తోడూ, కన్నెర్ర చేసావనుకో
తోక ముడిచి వెలతాడే,
పిలిచి అన్నా అన్నావనుకో
చెల్లీ నీకేం కావాలో చెప్పు అంటాడే
హనుమంతుడ్ని తలచుకో
అడుగు ముందుకు వేయాలమ్మ
వెనకడుగు వేయకు
ఓర్పుతో సాగు ముందుకూ
నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగు
తోకముడిచి వెళ్లకపోతే అడుగు
__(*)__
అద్భుతం
ReplyDelete