Posts

Showing posts from September, 2019

kavitalu అముద్రిత కవితలు

Image
ప్రాంజలి ప్రభ -  rachayata Mallapragada ramakrishna  శివశివా… నీలీలలు తెలపవా శివా ఇసుక రేణువులోన దూరియుందువు శివా   బ్రహ్మాండమంతయును నిండియుందువు శివా చివురాకులాడించు  గాలిదేవర శివా ఘన కానలను గాల్చు  కారుచిచ్చువు శివా  క్రిమికీటకాదులకు  మోక్షమిత్తువు శివా కాలయమునిబట్టి  కాలదన్ను శివా పెండ్లి జేయరాగ మరుని మండించావు శివా పెండ్లియాడి సతికి సగమిచ్చినావు శివా దక్షయాగము ద్రుంచి సురలందరిని గొట్టి నావు శివా వికటాట్టహాసమున భయపెట్టినావు శివా కడలి చిలుకు వేళ కాలకూటము మింగినావు శివా  తపస్సుతో అడిగిన  వెంటనే ప్రత్యక్షమై వరములిచ్చే శివా    శివశివా… నీలీలలు తెలపవా శివా --((*))-- నేటి కవిత  (ప్రాంజలి ప్రభ ) రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ చిరునగవుల చిందులు చూపి చిరుతలా ఉరకలు పరుగులు పెట్టుట ఎందుకే పరువు పోతుందని వంకచూపి పరుల మాటవిని నన్ను మరచి పోయావెందుకే చరితను వేలెత్తి చూపి దారియేదో తెల్పి మనసు మార్చుట ఎందుకే బరిలో దిగమని ఆశ చూపి వరి కంకులా గాలికి ఉగమన్నావు ఎందుకే చిన్నదానా వలపును చూ...