Posts

Showing posts from March, 2026
Image
  పుష్పంబు పత్రంబును, స్పష్టంబు సత్రంబును, ఇష్టంబు గత్రంబుగనున్  భక్తిత్వ శక్తిత్వము, యుక్తి రక్తిత్వము, ముక్తిత్వ మోక్షత్వ ముగన్  పాదంబు సామాన్యము, వేదంబు ధర్మార్ధము,  మోదంబు మాధవ్యముగన్  పాండిత్య ప్రావీణ్యము, దండత్వ సామణ్యము, తాండత్వ తన్మయత్వమున్  🌿 సరళ భావం🔹 పువ్వు–ఆకు సహజసౌందర్యం, స్పష్టత–సత్సంగం, ఇష్టం–శరీరం — ఇవన్నీ జీవనంలో సహజ భాగాలు.🔹 భక్తి శక్తిని ఇస్తుంది; యుక్తి (సరైన మార్గం) ఆసక్తిని కలిగిస్తుంది; చివరికి ముక్తి–మోక్షం లక్ష్యం.🔹సాధారణ జీవనం (పాదం) కూడా వేద ధర్మంతో నడిస్తే ఆనందమయమవుతుంది.🔹 పాండిత్యం నైపుణ్యాన్ని ఇస్తుంది; నియమం సమతుల్యతను ఇస్తుంది; తాండవంలా తన్మయత్వం పరమ స్థితి. ****** *గడిపే సిన కాలగణంబుగనే    అడుగేసిన ప్రేమగణంబుగనే  దడిపిస్తున్న త్యాగధనంబుగనే  నడిపిస్తున్న న్యాయననంత ముగన్  సరళ భావం 🔹 గడిచే కాలం అన్నది లెక్కలాగే ఉంటుంది; కానీ ప్రతి అడుగూ ప్రేమతో నిండాలి. 🔹 త్యాగమే నిజమైన సంపద — అది మనసును కదిలిస్తూ ఉంటుంది. 🔹 న్యాయం, ధర్మం మన జీవితాన్ని సరిగా నడిపిస్తాయి. *కాలం గడుస్తూనే ఉంటుంది; ప్రేమ, త్యా...

ద్విపద

Image
  ద్విపద మెరమెర మెరసేది మేధసు హర్ష జలజల కురిసేది జీవన వర్ష గలగల పారేది గుణముల హర్ష తలతల తాకేది తరంగాల వర్ష కలకల లాడేది కరుణల హర్ష పలపల జారేది పరిమళ వర్ష మిలమిల మెరసేది మానస హర్ష జలజల కురిసేది జగతి వర్ష వెలవెల బోసేది వెలయని హర్ష పలుకుల తడిసేది పరమ వర్ష తళతళ మెరసేది తత్త్వపు హర్ష జలజల కురిసేది జీవన వర్ష భగభగమండేది భాగ్యపు హర్ష నిగనిగ లాడేది నిప్పుల వర్ష వచ్చినా..జనగణ వాక్కుల  హర్ష మచ్చికా.. గుణగణ మానస వర్ష  పెలపెలమంటుండ పిలుపుల హార్ధ కలత తుపానుగ కాలపు వర్ష వెనుకడుగేయక విలువల హర్ష తనువున తాకేడి తపనలా వర్ష వడగళ్ళ వొర్వది వనికేది హర్ష దడ దడ గుండెలో దడమంటూ వర్ష ***** *స్త్రీ హృదయం లో ఆరని జ్వాలా* గుండెలో రేగెనే గుర్తుగా మంట మెండుగా నస్త్రముల్ మేళమై మంట -- కెంజడల్ దాల్చెనో క్ష్వేళకాలంబు మంజులా వాతమే మంచమై మంట -- జీరగా రాత్రిలో+ చీల్చుగా మంట దూరమందెఱ్ఱఁగా ధూమమై మంట -- భగ్న మీకోర్కెలే బద్దలై మంట నగ్నమై రాక్షసానందమై మంట -- శ్వేతవస్త్రమ్ములో చిన్నిగా మంట ఘాతమై యాదలో గాయమై మంట -- క్షాంతి కంపించెనే శాంతిగా మంట కాంతి కన్పించదే గాలమై మంట -- క్షామ మీభూమి దుస్స్వప్న మై ...

అనుష్టుప్

Image
నిత్యలోకసమస్తసౌహృదభావః సత్యహృదయానందమహీప్రకాశః । సర్వార్థసాధ్యాసాధ్యవిశ్వాసధాతా నమామి తం వేంకటనాయకం సదా ॥         001 సరళ భావం సర్వలోకాలలో సౌహార్దభావాన్ని నింపువాడై, సత్యమయ హృదయానందాన్ని ప్రకాశింపజేయువాడై, సాధ్యాసాధ్యాలన్నింటిలోనూ భక్తులకు విశ్వాసాన్ని ప్రసాదించువాడైన వేంకటనాయకునికి నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను. *******  విశ్వకల్యాణార్థ ధర్మాధర్మపరః । వాగ్దేవీవిధాతా మిత్రసత్య సేవః । శివపార్వతీహృదయానందభావః । నమామి తం వేంకటనాయకం సదా ॥        002 భావం  – ధర్మాధర్మ వివేచన ద్వారా విశ్వకళ్యాణాన్ని కోరువాడు. వాగ్దేవీవిధాతా  – వాగ్దేవి అనుగ్రహంతో సత్యసేవను మిత్రభావంతో ఆచరించువాడు.– శివపార్వతుల హృదయానందానికి కారణమయ్యే మంగళభావస్వరూపుడు. – అట్టి వేంకటనాయకునికి ఎల్లప్పుడూ నమస్కరిస్తాను. ****  చిదేకరూపం కమలాప్త లోచనం, హృదంతరే పద్మ నివాస భాసితం। మదీయ భాగ్యేష్ట వరప్రదాయినం, నమామి తం వేంకట నాయకం సదా॥     003 భావం చైతన్యస్వరూపుడై, కమలమువంటి సుందర నేత్రాలు కలవాడై, హృదయపద్మములో ప్రకాశిస్తూ నివసించువాడై, నా భాగ్యకామ్య వరాలను ప్...

తత్వ భావాలు

[ *++++ 24/04, 05:39] Sridevi Mallapragada: కర్మ రహస్యం మీకు కొద్దిపాటి కల్పనాశక్తి లేకపోతే, మార్గదర్శకమైన ఆదర్శం లేకపోతే, మీరు కేవలం పశుతుల్యులే. కాబట్టి మీ ఆదర్శాన్ని తగ్గించుకోకూడదు, అలా అని అసాధ్యమైన దాన్ని ప్రయత్నించరాదు ఈ రెండూ విసర్జనీయాలే! ఉన్నత ఆదర్శంతో ఉత్తమ ఆచరణాన్ని మీ జీవితంలో సమన్వయపరచడానికి ప్రయత్నించండి. ****** 1. ఖాళీ కుండలో ఆకాశం ఉంటుంది. 2. అందులో నీటిని నింపాక,  నీటితో కలిసిన ఆకాశం ఉంటుంది. 3. ఆ నీటిలో ప్రతిబింబాకాశం ఉంటుంది. మొదటి ఆకాశం -  పరమాత్మ. రెండవ ఆకాశం - జీవాత్మ. మూడవ ఆకాశం - మాయ జగత్తు. ***:* ఇతర సత్సంగాలు భగవంతుణ్ణి ఘనపరుస్తాయి. మన సత్సంగం 'నేను'ను ఘనపరుస్తుంది. ***** [24/04, 05:43] Sridevi Mallapragada: లౌకిక సుఖాలే మన గమ్యమై, వాటిని పొందేందుకు భగవంతుని ఆశ్రయిస్తే అదింకా ప్రాపంచికతే. కానీ భగవంతుడనే గమ్యాన్ని చేరేందుకై ఈ లోకం ఓ సాధనమైతే అది ఆధ్యాత్మికతకు నాంది. *విజయ రహస్యం సహనం లేనివాడు విజయం పొందలేడు. *మాధవులుగా 'దిగి' వచ్చిన  మనం మానవులు గా 'ఎదిగి' వెళ్లాలి. ****** * శిష్యుడు:- సృష్టి, స్థితి, లయాలెందుకు? సద్గురు:- ఇదంతా మాయమయి ...

అష్ట పది

Image
  వచ్చేది పరాభవ. చెప్పేది సుఖీభవ..కప్పేది జయప్రద చెప్పమని విజయీభవ.. ఉండాలి పవిత్రంగా, ఉండాలి నమ్మకంగా, ఉండాలి పటిష్ఠంగా, ఉండాలి శాశ్వతంగా కోపం  చేటుగా , పాపం  వేటుగా , శాపం  మాటుగా ,దీపం  మెర్పుగా  అల్లన అలరించు, మెల్లగ   మురిపించు, అల్లరి   మరిపించు, ఉల్లము   చిగురించు ఉన్నంతలో ఎదుగు, ఉన్నతంగా ఒదుగు, ఉన్నంతగా పొదుగు, ఉన్నతంగా  నిత్యమున్       మనకెందుకు గొడవ,నడవొద్దని నడవ, నీటితోనింపు కడవ పడవప్రయాణం సత్యమున్  ఎంతున్నా కరువు, నీతితో నడువు, తడువుకోకు బరువు అరవుజోలుకు పోకునిత్యమున్  ముందుగవచ్చు ఉషోదయం విందులుచేసె వసంతoఅందముగా ముఖమయం నందనందనం ప్రతినిత్యమున్ పలుకుల తీరం కులుకులు వైనం అలకలు దాహం మలుపుల సత్యమున్ అంగారంలో కాలితే, బంగారానికి తళతళ, సింగారంతో మగువలు నలిగితే కిలకిల. అజ్ఞాన  తిమిరంపై, విజ్ఞాన వీచికలై, సుజ్ఞాన సమరమై శాస్త్రీయప్రజ్ఞత నిత్యమున్  కూతురుతో కుశలతలు కూతురుతో కమనీయతలు కూతురుతో అనుబంధాలు కూతురులో ఆత్మీయతలు తల్లి తండ్రులకు సేవలు  తల్లి తండ్రులతో బాసలు  తల్లి తం...

కంద

* ఆశ.. పాశం. * పద్యం: 001. కం. పాశభ్రమలేకదలే ఆశగల నరుడు అణుకువ ఆయువు తోడన్ ధ్యాస కుటుంబము ననుచూ ఆశ యనే కుక్కగాను ఆనతి కాలమ్ సరళ భావం మనిషి బంధాలనే (పాశాలు) నిజమని భావించి వాటి భ్రమలో జీవిస్తాడు. ఆశలతో నిండిన వాడు తన జీవితకాలమంతా వినయంతోనే కాక, కొన్నిసార్లు బలహీనతతో కూడా వాటి వెంట నడుస్తుంటాడు. "నా కుటుంబం, నా బాధ్యతలు" అనే ధ్యాసతో జీవిస్తూ, ఆశ అనే కుక్క తనను ఎప్పుడూ ముందుకు లాగుతూనే ఉంటుంది. ఫలితంగా జీవితకాలమంతా ఆశల వెంట పరుగెత్తడంలోనే గడిచిపోతుంది. ***** 002 * మానసిక వైనం * కం. తమ తండోపసిరి కలలు తమ తప్పులెరుగరు గాంచ తప్పును తెలపా మమ జనఘోషగ తప్పులు విముఖత సముఖతయె తప్పు విద్యల తీరున్ సరళ భావం తమ గొప్పతనాల మత్తులో ఉన్నవారు తమ తప్పులను గుర్తించరు. ఎవరైనా చెప్పినా వినరు. ఇతరుల తప్పులను మాత్రం పెద్దగా ప్రచారం చేస్తారు. ఇష్టం–అనిష్టాల ఆధారంగా తప్పు–ఒప్పులను నిర్ణయించడం నేటి విద్యా విధానంలోని ఒక లోపంగా మారింది. ***** 003..* గుట్టు పట్టు * కం. పట్టవలయు గుట్టుకళే పట్టు విడుపు లన్ని పట్టు పట్టుట యేలా పట్టువిడుచుటేచచ్చుట గుట్టువిధియె రట్టు పట్టు గుర్తుగ మేళా సరళ భావం...