Posts

Showing posts from June, 2020
 *నమశ్శివాయ సోమాయ , కపర్దినే భవాయ చ ! సికత్యాయ చ ప్రవాహ్యాయ , రుద్రాయ హి నమోనమః !!! " స్థిత్యాతిక్రాంతి భీరూణి       స్వచ్ఛాన్యాకులితాన్యపి ౹ తోయాని తోయరాశీనాం      మనాంసి చ మనస్వినామ్ ౹౹          పెద్దవాళ్ల గంభీరమైన మనస్సు ఎల్లలు దాటడానికి భయపడుతుంది.కష్టాలు వచ్చినా నిష్కలష్మంగా ఉంటుంది.అలాగే సముద్రంలోని నీరు తీరాన్ని దాటదు.కెళికినా కల్మషం ఉండదు. శరదంబు ధరచ్ఛాయా  త్వరయో యౌవనశ్రియా ౹ ఆపాతరమ్యా విషయా:  పర్యంతపరితాపినః ౹౹       యవ్వన సిరులు శరత్కాలపు మేఘాల నీడల్లా స్థిరంగా ఉండవు.విషయాల సుఖాల మీదుగా చూడటానికి అందంగా ఉన్నా ఆఖరుకు దుఃఖాన్ని ఇస్తుంది. నా ప్రాప్యమభివాంఛoతి నష్టం  నిచ్ఛoతి శోచితుం ౹  ఆపత్సు చ న ముహ్యంతి నరాః పండిత బుద్ధయః ౹౹   వివేకులు విద్వాంసులు ప్రాప్తం లేనిదాన్ని ఆశించరు.నాశమైన దానికి వ్యథ చెందరు.అలాగే, ,ఆపత్కాలంలోకూడా మోహం చూపరు. **** చింతనీయా హి విపదా మాదమేవ ప్రతిక్రియా౹ న కూపఖననం యుక్తం ప్రదిప్తే వహ్నినా గృహే ౹౹       విపత్తులు వచ్చే ముందే వాటిని ఎదురిం...