*నమశ్శివాయ సోమాయ , కపర్దినే భవాయ చ !

సికత్యాయ చ ప్రవాహ్యాయ , రుద్రాయ హి నమోనమః !!! "


స్థిత్యాతిక్రాంతి భీరూణి       స్వచ్ఛాన్యాకులితాన్యపి ౹

తోయాని తోయరాశీనాం      మనాంసి చ మనస్వినామ్ ౹౹


         పెద్దవాళ్ల గంభీరమైన మనస్సు ఎల్లలు దాటడానికి భయపడుతుంది.కష్టాలు వచ్చినా నిష్కలష్మంగా ఉంటుంది.అలాగే సముద్రంలోని నీరు తీరాన్ని దాటదు.కెళికినా కల్మషం ఉండదు.


శరదంబు ధరచ్ఛాయా  త్వరయో యౌవనశ్రియా ౹

ఆపాతరమ్యా విషయా:  పర్యంతపరితాపినః ౹౹


      యవ్వన సిరులు శరత్కాలపు మేఘాల నీడల్లా స్థిరంగా ఉండవు.విషయాల సుఖాల మీదుగా చూడటానికి అందంగా ఉన్నా ఆఖరుకు దుఃఖాన్ని ఇస్తుంది.


నా ప్రాప్యమభివాంఛoతి నష్టం  నిచ్ఛoతి శోచితుం ౹

 ఆపత్సు చ న ముహ్యంతి నరాః పండిత బుద్ధయః ౹౹


  వివేకులు విద్వాంసులు ప్రాప్తం లేనిదాన్ని ఆశించరు.నాశమైన దానికి వ్యథ చెందరు.అలాగే, ,ఆపత్కాలంలోకూడా మోహం చూపరు.

****

చింతనీయా హి విపదా మాదమేవ ప్రతిక్రియా౹

న కూపఖననం యుక్తం ప్రదిప్తే వహ్నినా గృహే ౹౹


      విపత్తులు వచ్చే ముందే వాటిని ఎదురించడాని గురించి ఆలోచన చెయ్యాలి.ఇంటికి నిప్పు అంటుకున్న సమయంలో బావి తవ్వడం యుక్తము కాదు కదా.


కిమత్ర చిత్రం యత్సంతః పరానుగ్రహతత్పరాః౹

న హి స్వదేహాసౌఖ్యాయ జాయంతే చందనద్రుమాః ౹౹


        ఇతరులకు సజ్జనులు ఉపకారం చేసేదానిలో ఆశ్చర్యం ఏముంది?శ్రీగంధం వృక్షాలు తమ శరీర సుఖం కోసం పుట్టించబడలేదు.


Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు