నేటి పాటలు
దయచేసి ఎవరైనా ఈ పాటను నచ్చి పాడి నట్లైతే నాకు తెలపగలరు ప్రాంజలి ప్రభ నేను వ్రాసుకున్న నేటి పాట (1) ఈ పూట నీ మాట వినాలి కనక నీ తోటలో నవ్వు రావాలి చిలక మాట మాటకు ఎదురు చెప్పక మమతలను అందించు చిలక మనసునే నాకు అర్పించు ఇక బంగారు బాట చూపుతా చిలక కళ్ళ వెంబడి కన్నీరు కార్చక నాపై కనికరము చూపవా చిలక నా మాటకు కోపము తోచ్చుకొనక మనసును శాంతపరచవా చిలక ఫై పై మెరుగులకు ఆశపడక కష్టాన్ని నమ్ముకుందాము చిలక ఇద్దరం కలసి ఉందాము ఇక ప్రశ్నకు ప్రశ్న అనక రావా చిలక ఈ పువ్వులు ఆ నవ్వులు నాకు ఇక అందించగ రావా చిలక అదృష్టము కొద్ది కలిసాము ఇక ఏకమై సృష్టికి సహకరిద్దాం చిలక ఈ పూట నీ మాట వినాలి కనక నీ తోటలో నవ్వు రావాలి చిలక --(())--