
శ్లో॥సుఖస్యానన్తరం దుఃఖం దుఃఖస్యానన్తరం సుఖమ్! ద్వయమేతద్ధి జన్తూనామలంఘ్యం దినరాత్రివత్!! ..001 సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తరువాత సుఖం తప్పకుండా వస్తుంటాయి. ఏ ప్రాణీ కూడా వీటినుండి తప్పించుకోలేదు. ఇవి దివారాత్రాలంత సహజంగా వరుసక్రమంలో వస్తూనే ఉంటాయి. విచారంనుండి తప్పించుకోవాలంటే సంతోషంలోకి వచ్చితీరాలి. సంతోషం వద్దనుకుంటే విచారం వచ్చి తీరుతుంది. ఈ ద్వంద్వాలలో దేనిని కోరినా నిరాకరించినా రెండవది తప్పకుండా ఉండనే ఉంటుంది. సముద్రంలో తిన్నగా వెళుతున్న కొద్దీ తరంగాలను తప్పించుకోలేం. శ్లో॥ దివ్యచ్ఛాయా పథస్తత్ర నక్షత్రాణ్యను మండలం దృశ్యతే భాసురా రాత్రా దేవీ త్రిపధగా తుసా.. ..002 ఆదియుగాలలో దేవతలు భూమి మీదకు తరచుగా వచ్చి ఎక్కువ కాలం ఉండి వెళుతుండేవారు. మొదటవారు...