శ్లో॥సుఖస్యానన్తరం దుఃఖం దుఃఖస్యానన్తరం సుఖమ్!
ద్వయమేతద్ధి జన్తూనామలంఘ్యం దినరాత్రివత్!! ..001
సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తరువాత సుఖం తప్పకుండా వస్తుంటాయి. ఏ ప్రాణీ కూడా వీటినుండి తప్పించుకోలేదు. ఇవి దివారాత్రాలంత సహజంగా వరుసక్రమంలో వస్తూనే ఉంటాయి. విచారంనుండి తప్పించుకోవాలంటే సంతోషంలోకి వచ్చితీరాలి. సంతోషం వద్దనుకుంటే విచారం వచ్చి తీరుతుంది. ఈ ద్వంద్వాలలో దేనిని కోరినా నిరాకరించినా రెండవది తప్పకుండా ఉండనే ఉంటుంది. సముద్రంలో తిన్నగా వెళుతున్న కొద్దీ తరంగాలను తప్పించుకోలేం.
శ్లో॥ దివ్యచ్ఛాయా పథస్తత్ర నక్షత్రాణ్యను మండలం
దృశ్యతే భాసురా రాత్రా దేవీ త్రిపధగా తుసా.. ..002
ఆదియుగాలలో దేవతలు భూమి మీదకు తరచుగా వచ్చి ఎక్కువ కాలం ఉండి వెళుతుండేవారు. మొదటవారు దేవికా నదీతీరంలో దిగినారని పురాణాల ఉద్ఘాటన.హిమాలయాలు వారి నిత్యవిహార భూములు. కాళిదాస మహాకవి ఈ పర్వతాన్ని దేవతాత్మ అని వర్ణించాడు..
శ్లో॥ అస్త్యుత్తరాస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః
పూర్వాపరౌ వారినిధీ విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండ: 003
తూర్పు పడమర సముద్రాల మధ్య భూమిని కొలిచే మానదండం (కొలబద్ద వలె ఉన్నది హిమాలయం. ఆది దేవతలకు ఆత్మస్థానం. అందులోనిది మానస సరస్సు. భారతంలో ఈ సరస్సుకు బిందు సరస్సని పేరుంది.
శ్లో𝕝𝕝 నాస్తి మేఘసమం తోయం నాస్తి చాత్మసమం బలమ్|
నాస్తి చక్షుఃసమం తేజో నాస్తి ధాన్యసమం ప్రియమ్|| 004
తా𝕝𝕝 మేఘ జలముతో సమానమైన శుద్ధజలము లేదు.....ఆత్మ బలముతో సమానమైన బలము శరీరములో కాని పృథివిలో కాని రెండవది లేదు....కన్నుతో సమానమైన తేజస్సు గల యింద్రియము శరీరములో మఱొకటి లేదు..... ధాన్యముతో (అన్నముతో) సమానమైన వస్తువు మఱొకటి లేదు.
శ్లో॥ పద్మసంభవారాధితం ప్రభుం మర్మయోగినాం మంత్రసిద్ధిదం
వ్యాఘ్రవాహనం మృత్యువారణం వజ్రభైరవం దేవమాశ్రయే. 005
వజ్రయాన తాంత్రిక సాధనలలో వజ్రభైరవునకు, వజ్రయోగిని లేక వజ్రవారాహికి ప్రాధాన్యం ఎక్కువ.
వజ్రభైరవుని వలెనే మరో యిద్దరు భైరవ మూర్తులకు హిమాలయాలలో ప్రాముఖ్యo.పశుపతినాధుడు , మానస సరోవ ఆదిదేవుడు అమరభైరవుడని పేరు.
శ్లో𝕝𝕝 కిమప్యస్తి స్వభావేన సున్దరం వాప్యసున్దరమ్|
యదేవ రోచతే యస్మై భవేత్ తత్తస్య సున్దరమ్|| 006
తా𝕝𝕝 ఈ లోకంలో ఏదైనా స్వభావరీత్యా అందంగా ఉన్ననూ లేకున్ననూ, ఎవరికైతే ఏదైతే నచ్చుతుందో అది అందంగా లేకున్ననూ అదే వారికి అందంగా తోస్తుంది.
*శ్లో*గుణాః సర్వత్ర పూజ్యంతే* *పితృవంశో నిరర్ధకః|*
*వాసుదేవం నమస్యంతి* *వసుదేవం న మానవాః||* 007
*తాత్పర్యం:-*
*సద్గుణాలకు అన్నిచోట్లా గౌరవం ఉంటుంది. సద్గుణాలను సంపాదించినవారు ప్రపంచంలో విశేష గౌరవం పొందుతారు. తండ్రి గుణగానం చేసి తన పరిచయం చేయడం, తద్వారా తాను గౌరవం పొందడం నీచమవుతుంది. ప్రపంచమంతా శ్రీకృష్ణుడికి( వాసుదేవుడుకి ) నమస్కరిస్తుందే తప్ప అతడి తండ్రి అయిన వసుదేవుడికి కాదు.*
*గురుమూర్తిధరాం గుహ్యాం గుహ్యవిజ్ఞాన రూపిణీం|*
*గుహ్యభక్తజనప్రీతాం గుహాయాం నిహితం నమః॥* 008
"గురురూపమును ధరించినది, గుహ్యము, గుహ్యజ్ఞానమే రూపముగా గలది. గుహ్యమందు భక్తిగల జనులను ప్రేమించునది గుహయందున్నది. అనగా హృదయమందు దహరాకాశంలో ఉన్నదని భావము. అటువంటి దేవిని ధ్యానించుచున్నాను" అని సూతసంహితలో చెప్పిన శ్లోకమునకు భావము. జగద్బ్రహ్మలనగా జీవేశ్వరులు. పారమార్థిక దశలో అద్వైతమే సత్యము. అంటే అద్వైతము పారమార్థిక సత్యము. జగన్మాత ఇట్టి పారమార్థిక సత్యమును బోధించుచున్నది.
యథోక్త రూపిణం, శంభుం నిర్గుణం గుణరూపిణం
వేదైశ్శాసైర్యధాగీతం విష్ణు బ్రహ్మనుతం సదా
భక్తవత్సలమానందం శివమావాహయామ్యహం. 009
కైలాస పర్వతంలో శివుడుంటాడనేది సర్వ సామాన్య వచనం. తీవ్ర భక్తులు కొండమీది ప్రతిశిల శివుడే అని భావిస్తుంటారు. మహనీయుడైన పండితారాధ్యుడు శ్రీశైలం వెళ్ళి అక్కడి ప్రతిశిల శివలింగంవలె కనిపిస్తుంటే దాని మీద కాలు మోపటం పాపం గనుక కొండ ఎక్కలేదు.అయినా అతనికి ఉన్న భక్తి వల్ల మల్లికార్జునస్వామి ఆశీర్వాదం లభించింది.
శ్లో..ఛిన్నాని నో కతి శరీరభృతాం శిరాంసి
తత్ పూజ్యతే జగతి రైణుక మేవ శీర్షమ్!
కృత్తాః కళేబరవతాం కతి నాభయో న
చేతో ధినోతి సురభి ర్మృగనాభి రేకః!! 010
భావము:-
తల్లీ ! ఓ ఉమాదేవి! సృష్ఠిలో ఎన్నో జంతువుల బొడ్డులు కత్తిరింప బడినవి. కాని కస్తూరికా మృగము యొక్క బొడ్డును కోయుటచే మాత్రమననే ఇంపైన సుగంధ ద్రవ్యము లభించును.దేహాధరుల శిరస్సులెన్నో ఖండింప బడినవి. రేణుకా దేవి విషయమే లోకులచే పూజింప దగిన దైనది.
శ్లోప్రాణా వసంతి శిరసా రహితే శరీరే
లీలాసరోజతి శర స్తు కరేఽస్య కృత్తమ్!
తన్నిఘ్ను మేత దఖిలం చ ధియైవ ధీరాః
పశ్యంతు నందనగరే తదిదం విచిత్రం!! 011
భావము:-
తల్లీ ! ఓ ఉమాదేవి! రేణుకా దేవిగా , చ్ఛిన్నమస్తక గా కుండలీ పురమున విరాజిల్లు నీ శిరస్సు ఖండింప బడిననూ దేహము నందు ప్రాణము కలదు.ఆ శరీరభాగ మైన చేతిలో ఖండింప బడిన శిరస్సు చేతి పద్మము అయినది.ఈ విశ్వమంతయు ఆ శిరస్సు అందే ఉన్నది. అద్భుతము. దశ మహా విద్యలలో ప్రశస్తమైన ఈ అవతార విశేషమును ధీరులు బుద్ధిచే విచారించి తెలిసికొనుదురు కాక.
రమ్యే ధనేషు దారాదౌ శోకస్యావసరో హి కః
ఇన్ద్రజాలే క్షణాద్దృష్టే నష్టే కా పరిదేవనా. 012
(ఆపాత) రమణీయములగు ధన, భార్యా, పుత్రాదులు నశించుట వలన దుఃఖము నొందనేల? మెఱుపువలె క్షణకాలము మెఱసిపోవు ఇంద్రజాలము నశించిన దుఃఖింపనవసర మేమి?
ధనదారేషు వృద్ధేషు దుఃఖం యుక్తం న తుష్టయః
వృద్ధాయాం మోహమాయాయాం కః సమాశ్వాసవానిహ. 013
ధన, భార్యా, పుత్రాదులు వృద్ధి అయిన (దానిచే సంసార రోగమున్ను అభివృద్ధి యగుటచే) దుఃఖించుటయే తగునుగాని సంతోష మొందుట కాదు. ఏలయనిన మోహమాయ అభివృద్ధి నొందిన ఈ ప్రపంచమున ఎవడు సుఖవంతుడై యుండును?!
యైరేవ జాయతే రాగో మూర్ఖస్యాధికతాగతైః
తైరేవ భోగైః ప్రాజ్ఞస్య విరాగ ఉపజాయతే. 014
ఓం శ్రీరామ --- శ్రీమాత్రేనమ: -
నాస్తి మాతృ సమం దైవం నాస్తి మాతృ సమః పూజ్యో
సంశాన్తే చిత్తవేతాలే యామానన్దకలాం తమః
యాతి తామపి రాజ్యేన జాగతేన న గచ్ఛతి. 016
చిత్తమను బేతాళము లెస్సగ శమించిపోవ మనుజు డెట్టి యానందమును బొందునో, అట్టి యానందమును ప్రపంచమందలి రాజ్యాధిపత్యముచే గూడ నాతడు బొందజాలడు.
శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేన దానేన పాణిర్న తు కంకణేన ౹
విభాతి కాయః కారుణాపరాణాం పరోపకార్తెర్న తు చందనేన౹౹ 017
చెవులు అందంగా శోభించేది శాస్త్రాలు వినడంవల్ల కానీ ఆభరణాల వల్లకాదు.అలాగే,చేతులు దానంతో శోభిస్తాయే కానీ గాజుల వల్లకాదు.కరుణకల్గిన శరీరం శోభించేది పరోపకారంతో మాత్రమే కానీ చందన పూయడం వల్లకాదు.
యదుత్సాహి సదా మర్త్య: పరాభవతి యజ్జనాన్ ౹
యదుద్ధతం వదేద్వాక్యం తత్సవం విత్తజం బలం ౹౹ 018
మనిషి ఎప్పుడూ ఉత్సాహంతో ఉండేది, ఇతరులను అవమానించేది మరియు ఉద్ధరించినట్లు మాట్లాడేది ఇవన్నీ ధనంవల్ల వచ్చే బలమే.
యథా ప్రయాంతి సంయాంతి స్తోతోవేగేన వాలూకాహ౹
సంయుజ్యంతే వియుజ్యంతే తథా కాలేన దేహీనః౹౹ 019
ప్రవహించే ప్రవాహ వేగంలో ఇసుక రాసికూడా కొట్టుకొని పోతుంది.అలాగే మళ్ళీ ఇంకో పక్కకు చేరుకుంటుంది.అటులనే,కాల మహిమతో ప్రజలు ఒక చోట చేరుతారు మళ్ళీ ఒకేసారి విడిపోతూ ఉంటారు.
కోకిలానాం స్వారో రూపం పతివ్రత్యంతు యోషితాం
విద్త్యా రూపం విరూపాణాం క్షమా రూపం తపస్వినాం 020
అర్థము:కోకిలకు స్వరమే రూపము స్త్రీలకు పాతివ్రత్యమే రూపము. కురూపులకు విద్యయే రూపము మునులకు క్షమయే రూపము.
రూప యౌవ్వన సంపన్నా విశుద్ధ కుల సంభవా
విద్యాహీనా న శో భంతే నిర్గంధా ఇవ కింశుకాః 021
అర్థము:రూపము,యౌవ్వనము, సంపద, మంచి కుల గోత్రాలు కలిగిన వారైనను విద్య లేనివారు ప్రకాశించరు. అది ఎట్లనిన మోదుగ పువ్వులు ఎంత ఎర్రగా అందముగా ఉన్నను పరిమళము లేనందువలన నిష్ప్రయోజనము లగు చున్నవి కదా!
సర్వాశాజ్వర సంమోహమిహికాశరదాగమమ్
అచిత్తత్వం వినా నాన్యచ్ఛ్రేయః పశ్యామి జన్తుషు. 022
ఆశలను జ్వరము లన్నిటికిని కారణభూతమైన అజ్ఞానమగు మంచుయొక్క నివారణకు శరదృతువు యొక్క ఆగమనమువంటిదగు మనోనాశమొకటి తప్ప ప్రాణులకు శ్రేయః ప్రదమైన వేఱొక వస్తువేదియు నేను గాంచజాలకున్నాను.
చిత్తమర్కటసంరంభసంక్షుబ్ధః కాయపాదపః
తథా వేగేన చలతి యథాఽఽ మూలాన్నికృన్తతి. 023
కామాదులయొక్క చాపల్యముచే సంక్షుభిత మైనట్టి, చిత్తమను వానరముచే శరీరమను వృక్షము సమూలముగ పడిపోవు నంతటి వేగముగ చలించుచున్నది, ఏలయనిన అట్టి చిత్తము వివేకరహితమగు స్థావరాది యోనులందు జీవుని పడద్రోయుచున్నది.
శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతం ౹
శోకో నాశయతే సర్వం నాస్తిమ్ శోకోసమో రిపు: ౹౹ 024
శోకం ధైర్యాన్ని పోకొడుతుంది.వివేకాన్ని నాశనం చేస్తుంది.శోకం సమస్తాన్ని నాశనం చేస్తుంది.శోకలాంటి శత్రువు మరొకటి ఏదీ లేదు.
దినమపి రజనీ సాయంప్రాతః శిశిరవసంతౌ పునరాయతః|
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచాత్యాశాయుః౹౹ 025
పగలు రాత్రి సాయంకాలం,శిశిరం వసంతం మళ్ళీ మళ్ళీ వచ్చి వచ్చి వెళుతూ ఉంటాయి.అలాగే కాలము కూడా నడుస్తుంది.ఆయుష్షు తగ్గుతూ వెళుతుంది.అయినా ఆశలు వదులుకోము.
ఉజ్వలా గుణ నభ్యుదితం క్షుద్రో ద్రష్టుం న కథమపి క్షమతే౹
దగ్వా తనుమపి శలభ: దీప్తo దీపార్చిషం హరతి౹౹ 026
ఉత్తమ గుణాలతో ఉన్నత స్థానానికి ఎక్కేవారిని చూచి
క్షుద్ర మనుష్య ఏ రీతిగా సహించలేడు.మిణుగురు పురుగు తన శరీరాన్ని కాల్చుకుని వెలిగే దీపాన్ని ఆర్పివేస్తుంది.
ఆరోగ్యం విద్వత్తా సజ్జన మైత్రి మహాకులే జన్మ౹
స్వాధీనతా చ పుంసాం మహదైశ్చర్యాయం వినాప్యర్త్రుః౹౹ 027
ఆరోగ్యం,విద్వత్,సజ్జనుల స్నేహం,శ్రేష్ఠమైన వంశంలో పుట్టుక,వేరేవారి ఆధీనంలో ఉండక పోవడము...ఇవన్నీ డబ్బు లేకుండానే వచ్చే మహా సంపదలు.
మిత్రద్రోహి కృతఘ్నశ్చ యశ్చ విశ్వాసఘాతకః ౹
తే నరా నరకం యాంతి యావచ్చంద్ర దివాకరౌ ౹౹ 028
స్నేహితునికి ద్రోహము తలపెట్టిన వారు,చేసిన సహాయం జ్ఞాపకం చేసుకోనివారు,నమ్మివారికి మోసం చేసినవారు,ఇటువంటి గుణములు ఉన్న వారంతా సూర్యచంద్రువులు ఉన్నంతవరకు నరకం అనుభవిస్తారు.
న విషం విష మిత్యహు: బ్రహ్మస్వం స్వ విష ముచ్యతే
విష మేకాకినం హంతి బ్రహ్మస్వం పుత్ర పౌత్రకం . 029
అర్థము: దేవుని సొమ్ము విషము కంటే భయంకర మైనది. విషము అది తిన్నవానినే చంపుతుంది.కానీ దేవుని సొమ్ము పుత్రులను ,పౌత్రులను కూడా చంపుతుంది.
అలసస్య కుతో విద్యా అవిద్యస్య కుతో ధనం
అధనస్య కుతో మిత్రం అమిత్రస్య కుతో సుఖం 030
తా:--సోమరికి విద్య పట్టుబడదు, విద్యలేనివానికి ధనమురాదు, ధనము లేనిచో మిత్రులు దొరకరు, మిత్రులు లేనివారికి సుఖమెక్కడిది? అనగా జీవితములో సర్వసుఖములూ విద్యవల్ల కలుగుతాయని, అట్టి విద్య నిరంతర పరిశ్రమ వల్లనే సాధ్యమని భావము
దినమపి రజనీ సాయంప్రాతః శిశిరవసంతౌ పునరాయతః|
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచాత్యాశాయుః౹౹ 031
పగలు రాత్రి సాయంకాలం,శిశిరం వసంతం మళ్ళీ మళ్ళీ వచ్చి వచ్చి వెళుతూ ఉంటాయి.అలాగే కాలము కూడా నడుస్తుంది.ఆయుష్షు తగ్గుతూ వెళుతుంది.అయినా ఆశలు వదులుకోము.
ఉజ్వలా గుణ నభ్యుదితం క్షుద్రో ద్రష్టుం న కథమపి క్షమతే౹
దగ్వా తనుమపి శలభ: దీప్తo దీపార్చిషం హరతి౹౹ 032
ఉత్తమ గుణాలతో ఉన్నత స్థానానికి ఎక్కేవారిని చూచి క్షుద్ర మనుష్య ఏ రీతిగా సహించలేడు.మిణుగురు పురుగు తన శరీరాన్ని కాల్చుకుని వెలిగే దీపాన్ని ఆర్పివేస్తుంది.
ఆరోగ్యం విద్వత్తా సజ్జన మైత్రి మహాకులే జన్మ౹
స్వాధీనతా చ పుంసాం మహదైశ్చర్యాయం వినాప్యర్త్రుః౹౹ 033
ఆరోగ్యం,విద్వత్,సజ్జనుల స్నేహం,శ్రేష్ఠమైన వంశంలో పుట్టుక,వేరేవారి ఆధీనంలో ఉండక పోవడము...ఇవన్నీ డబ్బు లేకుండానే వచ్చే మహా సంపదలు.
మిత్రద్రోహి కృతఘ్నశ్చ యశ్చ విశ్వాసఘాతకః ౹
తే నరా నరకం యాంతి యావచ్చంద్ర దివాకరౌ ౹౹ 034
స్నేహితునికి ద్రోహము తలపెట్టిన వారు,చేసిన సహాయం జ్ఞాపకం చేసుకోనివారు,నమ్మివారికి మోసం చేసినవారు,ఇటువంటి గుణములు ఉన్న వారంతా సూర్యచంద్రువులు ఉన్నంతవరకు నరకం అనుభవిస్తారు.
* దినమపి రజనీ సాయంప్రాతః శిశిరవసంతౌ పునరాయతః|
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచాత్యాశాయుః౹౹ 035
పగలు రాత్రి సాయంకాలం,శిశిరం వసంతం మళ్ళీ మళ్ళీ వచ్చి వచ్చి వెళుతూ ఉంటాయి.అలాగే కాలము కూడా నడుస్తుంది.ఆయుష్షు తగ్గుతూ వెళుతుంది.అయినా ఆశలు వదులుకోము.
*. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః|
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత|| 036
తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
* జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత|| 037
తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
*. కామః క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత|| 038
తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
*. ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత|| 039
తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో, జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న
విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
*. సంపదః స్వప్న సంకాశాః యౌవనం కుసుమోపమ్|
విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత జాగ్రత|| 040
తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు. యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
*. క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత|| 041
తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
*. యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|
తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన|| 042
తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో, అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు.
*. ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాలయః|
ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన|| 043
తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు.
*. పక్వాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన|| 044
తా:- పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?
*. ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన|| 045
తా:- చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ నవసరములేదు.
*. ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|
సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన|| 046
తా - ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు
* యశోదయా సమాకాపి దేవతానాంతు భూతలే౹
ఉలూఖలే యయాబద్ధో ముక్తిదో ముక్తిమిచ్ఛతి. 047
యశోధకు సరిసాటిగా మరొక దేవతలు ఈ లోకంలో లేరు.రోలుకు కట్టినపుడు తగిలిన ప్రతి ఒక్కరికి మోక్షాన్ని ఇచ్చిన ఆ భగవంతుడు దాన్నినుంచే ముక్తి పొందాలని ఆశించాడు.
సుధాం వినా న ప్రయయు వీరామంన నిశ్చితార్థాద్విరమంతి ధీరాః౹౹ 48
అమూలమైన రత్నాలతో దేవతలకు తృప్తి అవ్వలేదు.విషానికి కూడా భయపడలేదు.అమృతం దొరికేదాకా విశ్రాంతి తీసుకోలేదు.అటువంటి ధీరులులైనవారు తాము నిశ్చయించుకున్న పనులు పూర్తి అయ్యేదాకా ఊరికే ఉండరు.
*తత్సత్యం స్వస్థే మనసి రమ్యతా౹
అచారు సుఖినా చారు చారు దుఃఖాయ దుఃఖినాం ౹౹ 049
మనస్సు అనేది బాగుంటే,అన్నీ బాగుంటాయి అనేది నిజం.సుఖంగా ఉన్నవారికి బాగోలేనిది బాగా అనిపిస్తుంది.దుఖఃలో ఉన్న మనిషికి బాగున్నది కూడా బాగాలేనట్టే కనబడుతుంది.
*యది సర్వం పరిత్యజ్య తిష్ఠస్యుత్క్రాన్త వాసనః*
*అమునైవ నిమేషేణ తన్ముక్తోఽసి న సంశయః*। 050
తా। శ్రీ వసిష్ఠమహర్షి ఓ రామచంద్రా! సమస్తమును వదలి వాసనారహితుడవై యున్నచో ఈ నిముషమందే నీవు ముక్తుడవు కాగలవు। ఇందు ఏ మాత్రము సంశయము లేదు।
*వ్యాఖ్యానము* - (శ్రీ వసిష్ఠుడు) ఓ రామచంద్రా! సమస్తమును పరిత్యజించి వాసన లేవియు లేక ఎపుడు యుందువో ఆ నిముషమందే నీకు మోక్షము కరతలామలకమగును।
మోక్షమునకు వలసిన ప్రముఖమైన సాధనలు మూడింటిలో వాసనాక్షయమను ఈ సాధన మొట్టమొదటనే చెప్పబడినది। కాబట్టి ఆత్మేతరములగు పదార్థముల యెడల భావన లేక వాటినన్నిటిని పరిత్యజించి, ఏ కోరిక లేక యుండుచో ఆ క్షణమందే జీవుడు ముక్తుడై పోవును।
అయమాత్మా బ్రహ్మ
*ఓం ఓం
సోఽహం, సోఽహం, శివోఽహం, శివోఽహం, చిదానందరూప
శ్శివోఽహం శివోఽహం*।
****
ఉపదిశతి లోకవృత్తం వితరతి విత్తం వినోదయతి చిత్తం౹
ఉత్తంభయతి మహత్వం విద్యా హృద్యా సురాజసేవేవ౹ 051
విద్య లోకం మంతటిని తెలుపుతుంది।ధనం సంపాదించి ఇస్తుంది।మనస్సుకు మంచినిచ్చి గౌరవం తెచ్చి ఇస్తుంది।హృదయ పూర్వకమైన విద్య మంచి రాజు సేవల్లా అన్ని తెచ్చిఇస్తుంది
*****
మాతా సమం నాస్తి శరీర పోషణం విద్యాసమం నాస్తి శరీర భూషణం౹
భార్యాసమం నాస్తి శరీర తోషణం చింతాసమం నాస్తి శరీర శోషణం౹౹ 052
తల్లికి సమమైన శరీరం పోషణం లేదు।విద్యకు సమమైన శరీర ఆభరణము లేదు।భార్యకు సమమైన సంతోషం లేదు।చింతలు ఉంటే శరీరాన్ని చిక్కి శల్యం చేసేదానికి సమంగా మరొకటి లేదు।
సత్యం సత్యం మునేర్వాక్యం నాదత్తముపతిష్టతే।
అంబుభిః పూరితా పృథ్వి జాతకస్య మరుస్థలీ౹౹ 053
దేవుడు ఇవ్వక పోతే ఏది మనకి దక్కదు అని ఋషులు చెప్పే మాటలు సత్యం।ఈ భూమిపైన చాలా నీళ్లు నిండి తుళ్ళి పడుతున్నా జాతక పక్షికి అది మరుభూమిగానే కనబడుతుంది।ఎందుకంటే,వాన వచ్చినపుడు మాత్రమే అది తన దాహాన్ని తీర్చుకుంటుంది కాబట్టి।
అపి చేత్పుదురాచారో భజతే మా మనన్యభాక్ ।
సాధురేవ సమంతవ్య స్సమ్యగ్వ్యవసితో హి సః ।। 054
తాత్పర్యము : ఎంత దురాచారు డైనప్పటికిని అనన్య భక్తితో నన్ను సేవించునేని అతడు స్థిరమైన మనసును బొంది క్రమముగ సత్పురుషుడుగ తలంప బడుచున్నాడు।
ఏ భోగముయొక్క ఆధిక్యతచే మూర్ఖునకు రాగము (సంతోషము) జనించుచున్నదో, ఆ భోగములచేతనే ప్రజ్ఞావంతునకు వైరాగ్య ముత్పన్న మగుచున్నది.
యశశ్చన్ద్రికయా యేషాం భాసితం జన్తుహృత్సరః
తేషాం క్షీరసముద్రాణాం మానం మూర్తౌస్థితో హరిః. 055
ఎవరియొక్క జ్ఞానయశస్సు అను వెన్నెలచే జనుల హృదయమను సరోవరము ఆహ్లాదయుక్తముగ జేయబడినదో, క్షీరసముద్రతుల్యులగు అట్టి మహనీయుల శరీరములందు సాక్షాత్ విష్ణుభగవానుడు వెలయుచుండును.
భుక్తం భోక్తవ్యమఖిలం దృష్టా ద్రష్టవ్యదృష్టయః
కిమన్యద్భవభఙ్గాయ భూయో భోగేషు లుబ్ధతా. 056
ఈ అనాదియగు సంసారమున గడిచిన అసంఖ్యేయములగు జన్మలందు జీవులు తామనుభవించదగిన విషయము లన్నిటిని అనుభవించిరి; చూడదగిన పదార్థము లన్నిటిని జూచిరి, ఇంకను మరల భోగములందు లుబ్ధత్వ మేల? గతించిన వానియందువలె భావికాలజన్మ పరంపరలందు గూడ స్వాత్మవినాశము గలుగజేసికొనుటకా యేమి?!
యథాక్రమం యథాశాస్త్రం యథాచారం యథాస్థితి
స్థీయతాం ముచ్యతామన్త ర్భోగజాలమవాస్తవమ్. 057
కాబట్టి తమతమ అధికారము, అర్హత ననుసరించియు, సచ్ఛాస్త్రము ననుసరించియు, సదాచారము ననుసరించియు, తమతమ భూమిక ననుసరించియు వర్తించుచు జీవులు మిథ్యయగు ఈ భోగజాలమును తమ యంతఃకరణము నుండి త్యజించి వేయవలెను.
దత్తే భరం కుసుమపత్ర ఫలావలీనాం ఘర్మవ్యథాంవహతి శీతభవాం రుజుంచ౹
యోదేహమర్పయతి చాన్యసఖ్య హేతో: తస్మైవాదాన్యగురువే రవే నమోసస్తు౹౹
పువ్వు,పండు,ఆకులభారాన్ని చెట్టు భరిస్తుంది.ఎండల తాపాన్ని,చలివల్ల వచ్చే కష్టాలను సహిస్తుంది.వేరేవారి సుఖం కోసం తనశరీరాన్ని అంకితం చేస్తుంది. ఇటువంటి దానవీర శిరోమణి అయిన వృక్ష దేవతకు నమస్కారములు.
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోరియం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ | 059
ఆత్మీయబంధుమిత్రులకు ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు.. ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణమూర్తి వారి అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్ఠ ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
Comments
Post a Comment