ప్రాంజలి ప్రభ (జనవరి రెండవ వారం ) సుభాషితాలు 1035 1038..న స్నానమాచరేద్భుత్త్వా నాతురోన మహానిశి ౹ న వాసోభిః సహాజస్రం నా విజ్ఞాతే జలాశయే ౹౹ భోజనం తరువాత స్నానం చెయ్యరాదు.రోగి అయినవాడు స్నానం చెయ్యరాదు.అర్ధరాత్రి వేళ స్నానం చెయ్యరాదు.కట్టిన బట్టలపైన స్నానం చెయ్యరాదు.అలాగే,ఎలా ఉందో చూడకుండా కళ్యాణికట్టలో,బావిలో కూడా స్నానం చెయ్యరాదు. 1039..షడ్దోషాః పురుషణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా ౹ నిద్రా తంద్రా భయం క్రోధః ఆలస్యం దీర్గసూత్రతా ౹౹ యశస్సు,అభివృద్ధిని ఇష్టం పడే పురుషుడు నిద్ర, మగతతో తూగేది, భయం, కోపం, సోమారితనం, ఆలస్యం ఈ ఆరు దోషాలను విడిచిపెట్టాలి. 1040..మూలచ్చేదం రిపో:, కుర్యాదథవాన ప్రకోపయేత్ ౹ అన్యథాసౌ వినాశాయ పాడస్ప్రుష్ట ఇవోరగః ౹౹ శత్రువుని వేళ్ళతో సహా నాశనం చెయ్యాలి.లేకపోతే అతన్ని రెచ్చకొట్టరాదు. అలాగేదైనా అయితే కాలితో త్రొక్కి పాములా మన వినాశనమునకు కారణం అవుతాడు. 1041..అనిత్యాని దేహాణి విభవో నైవ శాశ్వతః ౹ నిత్యం సన్నిహితో మృత్యు : కర్తవ్యో ధర్మ సంగ్రహః ౹౹ ...
Posts
Showing posts from January, 2024