అరావప్యుచితంకార్యం ఆతిథ్యం గృహమాగతే ఛేత్తుం పార్శ్వగతాం ఛాయాం నోపసంహరతే ద్రుమః. ఇంటికి శత్రువు వచ్చినా ఆతిథ్యం ఇవ్వాలి.తనను నరకటానికి వచ్చిన వానికి కూడా చెట్టు తన నీడను ఉపసంహరించుకోవటంలేదు కదా. ధృతిః క్షమా దమోఽస్తేయం శౌచమింద్రియనిగ్రహః ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్. . ధైర్యము,ఓర్పు, నిష్ఠ, దొంగతనము చేయకుండుట, శుచిత్వము, ఇంద్రియ నిగ్రహము, సద్బుద్ధి, విద్య, సత్యము, కోపరాహిత్యము - ఈ పది ధర్మలక్షణాలు. శ్లో === జాడ్యం దియో హరతి సిజ్చితి వాచీ సత్యం మనోన్నతిం దిశతిపాప మపాకరోతి .. చేతః ప్రసాద యతి దిక్షు తనోతి కీర్తిం సత్సంగతిహ్ కదయ కిం నా కరోతి పుంసామ్ ? భావము === మంచి వారితో స్నేహము వలన తెలివి తేటలు పెరుగును. బుడ్డి మాంద్యము నశించును. సత్య ము, గౌరవము, పాప చింతన లేకుండుట, మనోనిర్మలత్వము చేకూరును. కీర్తి దశ దిశలా వ్యాపించును. మంచి వారి స్నేహము వలన మనిషికి అబ్బని సుగుణ మేది? అనగా మంచి వారి స్నేహము వలన సమస్త గుణములు అలవడునని భావము. శ్లో === క్షాన్తి శ్చేత్కావ చెన కిం కిమిరభిహ్ క్రోధో స్తిచేద్దేహినాం జ...
Posts
Showing posts from April, 2025
- Get link
- X
- Other Apps
‘శ్రీలక్ష్మీ హృదయం’ 1. హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా! హార నూపుర సంయుక్తాం మహాలక్ష్మీం విచింతయేత్ భావం: తనలీలావిలాసంతో ఇరుహస్తాల్లో కమలాలు ధరించి, హారాలు, మువ్వలగజ్జలు వంటి అనేక ఆభరణాలను ధరించిన మహాలక్ష్మీదేవిని స్మరిస్తున్నాను. 2. కౌశేయ పీతవసనామరవిందనేత్రాం పద్మాద్వయాభయవరోద్యతపద్మహస్తాం | ఉద్యఛ్ఛతార్క సదృశాం పరమాంకసంస్థాం ధ్యాయేద్ విధీశనత పాదయుగాం జనిత్రీం భావం: పద్మ దళముల వంటి కన్నులు కలది, పద్మముల వంటి కోమల హస్తాలతో అభయాన్ని ఇచ్చేది, ఉదయ భానుడి వంటి ప్రకాశవంతమయిన దేహము కలది, ఎరుపు-పసుపు మేళవించిన వస్త్రాలు ధరించినది, పరమార్ధ ప్రదాయిని, లోకమాత అయిన మహాలక్ష్మీదేవి పాదపద్మములను స్మరించుచున్నాను. 3. పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తద్వయాన్వితాం లక్ష్మీం ధ్యాత్వేతి మంత్రేణ స భవేత్ పృధివీపతిః భావం: బంగారు మేనిఛాయతో , పీతవస్త్రాలను (పసుపు రంగు) వస్త్రాలను , ఇరు హస్తాలలో పద్మాలు ధరించిన లక్ష్మీదేవిని పై విధంగా ధ్యానించిన వారికి మహారాజయోగం పడుతుంది. 4. మాతులుంగ గదాఖేటే పాణౌ పాత్రంచ బిభ్రతీ వాగలింగంచ మానంచ బిభ్రతీ నృపమూర్ధని భావం: తన చేతులలో గద, డాలు,నిమ్మ పళ్ళతో నిండిన పాత్ర ధరించి, ...
- Get link
- X
- Other Apps
ఉత్తమా తారకోపేతా మధ్యమా లుప్త తారకా ౹ అధమా సూర్యసహితా ప్రాతఃసంధ్యా త్రిధామతా ౹౹ (10 ) తెల్లవారు ఝామున నక్షత్రాలుండగా ప్రాతః సంధ్యావందనానికి ముఖ్యకాలం. ఇదే సకాలం. తారకలు లేని ప్రాతఃకాలం మధ్య కాలం, సూర్యుడు ఉదయించిన తరువాత సంధ్యా వందనానికి అధమ కాలం, సకాలంలో చేయడమే సర్వశ్రేష్ఠం. అలా కుదరనప్పుడు, మానేయడం మంచిది కాదు కనుక, "ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్ధం" అధిక అర్ఘ్యప్రదానంతో సంధ్యోపాసన చేయాలి. . ఉత్తమా సూర్యసహితా మధ్యమా లుప్త భాస్కరా ౹ అధమా తారకోపేతా సాయం సంధ్యా త్రిధామతా ౹౹ (11 ) సాయంవేళ సూర్యుడుండగా చేసే సంధ్యావందనం ముఖ్యకాలం, సకాలం. సూర్యుడస్త మించినప్పుడు మధ్యమం. నక్షత్రోదయం తరువాత చేయడం అధమం. కానీ 'సకాలం' దాటిపోతే, ప్రాతః సంధ్యకు లాగానే, 'ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్ధం' అధిక అర్ఘ్య ప్రదానం చేయాలి. 'మధ్యాహ్న సంధ్య' అంటే మధ్యాహ్నం 11 గంటల తరువాత నుండి సాయంత్రం లోపల చేయాలి.... యథా పూర్వం గజః స్నాత్వా గృహ్య హస్తేన వై రజః ౹ ...
April మొదటి వారం
- Get link
- X
- Other Apps

న చ శత్రురవజ్ఞేయః దుర్బలో౽పి బలీయసా | అల్పో౽పి హి దహ్యత్యగ్నిః విషమల్పం హినస్తి చ || (మహాభారతం తానెంతో బలవంతుడైనా, శత్రువు ఎంత బలహీనుడైనాకాని వానిని కించపరచరాదు. అగ్ని కొంచెమే అయినా అంతటినీ దహించేస్తుంది. కొద్దిపాటిదైనా విషం ప్రాణాన్ని తీసివేస్తుంది . (01) శ్లో𝕝𝕝 ఏకో దేవ: సర్వభూతేషు గూఢ: సర్వవ్యాపీ సర్వభూతాంత రాత్మా కర్మాధ్యక్ష: సర్వభూతాధివాస: సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ!!!!! * (శ్వేతాశ్వతర ఉపనిషద్/౭/౨) * తా𝕝𝕝 * అన్ని ప్రాణులయందు నిగూఢంగా దాగియున్న భగవంతుడొక్కడే.... అతడే సర్వవ్యాపి.... సమస్త ప్రాణులకు అంతరాత్మ. సమస్తకర్మలకు ఫలప్రదాత.... సమస్త ప్రాణులకు అంతర్యామి... అన్నికర్మలకు సాక్షి * . జ్ఞాన స్వరూపుడు.... సజాతీయ విజాతీయ స్వగతభేదశూన్యుడు.... అంటే అతనితో సమానమైన వాడు మరొకడు లేడు.... అతని కంటే ఇతరుడు మరొకడులేడు న చ శత్రురవజ్ఞేయః దుర్బలో౽పి బలీయసా | అల్పో౽పి హి దహ్యత్యగ్నిః విషమల్పం హినస్తి చ || (మహాభారతం) తానెంతో బలవంతుడైనా, శత్రువు ఎంత బలహీనుడైనాకాని వానిని కి...