శ్లోకములు 

శూన్య ఏవ కుసూలే తు ప్రేక్ష్య సింహో న లభ్యతే 
తథా సంసారబన్ధార్థః ప్రేక్షితోఽసౌ న లభ్యతే. 

బాగుగ పరికించి చూచినచో గరిసెయందు సింహము లభింపనట్లు, విచారించి చూచిన ఆత్మకు సంసారబంధమున్ను తొలగుచున్నది. (ఆత్మకు అసలు ఏ కాలమందును సంసారబంధమే లేదని తెలియగలదు.) 

కాన్తైవ మాతృభావేన గృహీతా కణ్ఠలమ్బినీ 
నూనం విస్మారయత్యేవ మన్మథం మాతృభావనాత్. 

కంఠమును కౌగలించుకొనిన పత్నియు, మాతృభావనచే కామవికారమును మఱచునట్లు చేయుచున్నది. (కల్పనానుసారమే పదార్థములు అర్థక్రియాసమర్థములగునని భావము.) 

తస్మాత్సంకల్పమేవ త్వం సర్వభావమయాత్మకమ్‌ 
త్యజ రామ సుషుప్తస్థః స్వాత్మనైవ భవాత్మనః.

కాబట్టి ఓ రామచంద్రా! సర్వదృశ్య పదార్థములను గూర్చిన సంకల్పమును నీవు త్యజించి, సుషుప్తియందువలె ఏ సంకల్పమున్ను లేనివాడవై నీయొక్క పరమార్థ అత్మరూపముతో స్థితుఁడవై యుండుము.

 అరావప్యుచితంకార్యం ఆతిథ్యం గృహమాగతే

ఛేత్తుం పార్శ్వగతాం ఛాయాం  నోపసంహరతే ద్రుమః.   


ఇంటికి శత్రువు  వచ్చినా ఆతిథ్యం ఇవ్వాలి.తనను నరకటానికి వచ్చిన వానికి కూడా  చెట్టు తన నీడను ఉపసంహరించుకోవటంలేదు కదా.


ధృతిః క్షమా దమోఽస్తేయం శౌచమింద్రియనిగ్రహః

ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్.       .


ధైర్యము,ఓర్పు, నిష్ఠ, దొంగతనము చేయకుండుట, శుచిత్వము, ఇంద్రియ నిగ్రహము, సద్బుద్ధి, విద్య, సత్యము, కోపరాహిత్యము  - ఈ పది ధర్మలక్షణాలు.


శ్లో === జాడ్యం దియో హరతి సిజ్చితి వాచీ సత్యం

మనోన్నతిం దిశతిపాప మపాకరోతి   ..

చేతః ప్రసాద యతి దిక్షు తనోతి కీర్తిం

సత్సంగతిహ్ కదయ కిం నా కరోతి పుంసామ్ ?


భావము === మంచి వారితో స్నేహము వలన తెలివి తేటలు పెరుగును. బుడ్డి మాంద్యము నశించును. సత్య ము, గౌరవము, పాప చింతన లేకుండుట, మనోనిర్మలత్వము చేకూరును. కీర్తి దశ దిశలా వ్యాపించును. మంచి వారి స్నేహము వలన మనిషికి అబ్బని సుగుణ మేది? అనగా మంచి వారి స్నేహము వలన సమస్త గుణములు అలవడునని భావము.


శ్లో === క్షాన్తి శ్చేత్కావ చెన కిం కిమిరభిహ్ క్రోధో స్తిచేద్దేహినాం

జ్ఞాతిశ్చేదనలేన కిం యది సుహ్రు ద్దివ్యౌష దైహ్ కిం ఫలం

కిం సర్బైర్యది దుర్జనాః కిము ధనైర్విద్యా నవధ్యా యది

వ్రిడా చేత్కిము భూషనైహ్ సుకవితాయద్యస్తి రాజ్యేనకిమ్    


భావము === మనిషికి ఓర్పు ముఖ్యము. ఓర్పు అతనిని కవచంలా కాపాడుతుంది. మనకు కోపము ఉండరాదు. కోపమున్నచో శత్రువులున్నట్లే, జ్ఞాతియున్నచో వేరే నిప్పుతో పని లేదు, మంచి స్నేహితులున్నచో మంచి ఆరోగ్యముతో నున్నట్లే. వేరే మందులతో పని యుండదు. చెడ్డవారిని చేరదీ సినచో పాపములను మూత కట్టుకున్నట్లే. స్వచ్చమైన, లోపరహితమైన విద్య యున్నచో వేరే ధనముతో పనిలేదు. స్త్రీలకు సిగ్గే ఆభరణము. సిగ్గు ఉన్నచో వేరే నగలతో పనిలేదు. మంచి కవిత్వము ఉన్నచో రాజ్యముతో పనిలేదు. అనగా ఆయా లక్షణముల ద్వారా ఆయా పనులు సమకూరు నని యర్ధము.


శ్లో. విద్యాతపోభ్యాం సంయుక్తం సదాపి పాపకర్మాణమేనో

న ప్రతియుజ్యతే జాపినాం హోమినాం చైవధ్యాయినాం

తీర్థవాసినాం న సంవసంతి పాపాని యే చ స్నాతాశ్శిరోవ్రతైః


విద్యాతపస్సులతో గూడి జపపరాయణుడైన బ్రాహ్మణుడు పాపకర్మలు నిత్యము చేయుచున్నను అతనికి పాపములు అంటవు. మంత్రజపములు చేయువానిని,  సదా ధ్యాన నిమగ్నుడైనవానిని దివ్యతీర్థములను సేవించువానిని, శిరస్సునందు అగ్నిని ధరించునతనిని పాపములు అంటవు. మరియు పద్ళపురాణంలో,పుష్కరఖండంలో ఇలాచెప్పబడినదని సౌభాగ్యభాస్కరంలో చెప్పబడినది:


శ్లో. మేరుపర్వతమాత్రోఽపి రాశిః పాపస్య కర్మణః

కాత్యాయినీం సమాసాద్య నశ్యతి క్షణమాత్రతః॥


పాపకర్మలు చేయువాని పాపములరాశి మేరు పర్వతమంత పెద్దదైననూ, జగన్మాత దర్శనంచేత అంతపాపమూ  నశిస్తుంది.దేవీభాగవతంలో ఈ విధంగా చెప్పబడినదని సౌభాగ్యభాస్కరంలో చెప్పడంజరిగినది:


శ్లో. ఛిత్వా భిత్వా చ భూతాని హత్వా సర్వమిదం జగత్|

ప్రణమ్య శిరసా దేవీం న స పాపైర్వితిప్యతే॥


వర్ణాశ్రమ ధర్మములు విడిచినవారు, పాపకర్ములు, జగన్మాతను ధ్యానించినంతనే వారి  పాపములు నాశనమై, పుణ్యాత్ములగుదురు.ఇక్కడ ఒక విషయం మనం అర్థంచేసుకోవాలి. అదేమిటంటే చేయాలనుకున్న పాపకృత్యములు చేసేసి, అంతా ఆ దైవభారమంటూ నామజపంచేసేస్తే  పుణ్యాత్ములై పోతారనేది, పాపం పోతుందనికాదు. జగన్మాత అంతటి భక్తసులభురాలు. చేసిన పాపాలకు అనుభవం ఏనాటికైనా తప్పదు. చేసిన పాపాలు కట్టికుడుపుతాయి. కాని జగన్మాత నామ స్మరణతో మనం పాపకర్మలకు దూరంగా ఉంటాము. అదియే పాపనాశినీ యను నామ మంత్రమునకు పరమార్థము. ఆ తల్లి మనను పాపము చేయనీయకుండా, పుణ్యకర్మలనాచరించుటయంధు మనసును నిమగ్నము చేస్తుంది. ఈ పరమార్థం దృష్టిలో ఉంచుకొని జగన్మాతకు నమస్కరిస్తూ ఓం పాపనాశిన్యై నమః అని అనవలెను.


***



🌺స్థానేష్టేవ నియోక్తవ్యా
     భృత్యాశ్చాభరణాని చ |
     న హి చూడామణిః పాదే
     ప్రభవామీతి బధ్యతే ||🌺
(పంచతంత్రం, మిత్రభేదం)
        సేవకులను మరియు ఆభరణాలను వారికి తగిన స్థానంలో ఉంచాలి. తనకు సామర్థ్యం ఉంది అని చెప్పుకుంటూ ఎవ్వరూ చూడామణిని కాళ్లకు కట్టుకోరు కదా?

🌺యో న నిర్గత్య నిఃశేషాం
      విలోకయతి మేదినీమ్ |
      అనేకాద్భుతవృత్తాంతాం
      స నరః కూపదర్దురః ||🌺
(ఉపమితిభవప్రపంచ)
        _"బయట అడుగుపెట్టగానే భూమిలో ఎన్నో ఆశ్చర్యాలు నిండివున్నాయని ఆశ్చర్యంతో గమనించని వాడు బావిలోనే ఉన్న కప్పలా ఉండిపోతాడు."_
        సులభంగా లభించేదానిపట్ల నిర్లక్ష్యం పెరుగుతుంది. అయితే, మనం ప్రతిరోజూ అనుభవించే లాభాలు, సౌకర్యాల వెనుక ఎన్నో జీవుల కఠినమైన శ్రమ ఉందని సహనంతో పరిశీలించినప్పుడే మనం నమ్రతను అలవరచుకొంటాము.
         ఒక కాఫీ అభిమాని తన ముందున్న కప్పు ద్రవ్యాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు, అర్థ ప్రపంచం ఎంత విస్తృతంగా ఉందో తెలుసుకున్నాడు. దీనిని యహూదీ పురోహితుడు జెలిగ్ ప్లిస్కిన్ లిఖిత రూపంలో ఉంచాడు. ఆ కాఫీ కప్పులోని ద్రవం కాఫీ గింజలనుండి తయారైంది, అవి బ్రెజిల్ లేదా మరెక్కడినుండో వచ్చాయి. ఆ మొక్కలను నాటిన, పెంచిన, కోసిన, గింజలను సేకరించిన, అవి మాగిన తరువాత వడకట్టి, దంచి, పొట్లం కట్టి, వాహనాల్లో మోసి, దుకాణాలకు చేర్చిన ఎంతో మంది శ్రమ దానిలో ఉంది.
       ఇది కేవలం కాఫీ పొడి వరకు మాత్రమే కాదు. పొడి మన ఇంటికి రాగానే, దాన్ని తయారుచేయడానికి ఉపయోగించిన పొయ్యి, గ్యాస్ వెనుకున్న శ్రమ కూడా గణనీయమే. కాఫీకి అవసరమైన పాలకోసం పశువుల పెంపకం చేసే రైతులు ఎంతో శ్రమించారు. ఆ కాఫీని ఆస్వాదించడానికి మనం కూర్చున్న కుర్చీ, మన ముందున్న మేజా బల్ల కూడా వడ్రంగి ద్వారా... ఇలా ఎంతో మంది కష్టం వల్ల మనకు అందాయి.
      ఈ కథనం ప్రాతినిధికమే కానీ సంపూర్ణం కాదు. ఇది ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది: మనం సులభంగా పొందుతున్న సౌకర్యాల వెనుక వేలాది చేతుల శ్రమ ఉంది. దాని పట్ల మనకు కృతజ్ఞతా భావం కలగకపోవడం ఆశ్చర్యకరం. మనం ఒక్క నిమిషమైనా పరస్పర ఆధారపడకుండా గడిపామా?

న దేవాయ న విప్రాయ
     న బంధుభ్యో న చాత్మనే |
     కృపణస్య ధనం యాతి
     వహ్నితస్కరపార్థివైః ||🌺
(సమయోచితపద్యరత్నమాలికా)
         _"పిసినగొట్టువాడి ధనం దేవుడికోసం గాని, బ్రాహ్మణునికోసం గాని, బంధువులకోసం గాని, తనకోసం గాని ఉపయోగపడదు. అది చివరకు నిప్పు, దొంగలు లేదా రాజుల పాలు కావడమో జరిగి నశిస్తుంది!"_
         సంపదను కూడబెట్టడంలో ఎవ్వరూ వెనుకబడరు. ఏమైనా సరే, ధనం కూడబెట్టాలి అనే ఆలోచనలోనే ఉంటారు. అయితే, ʼఈ విధంగా ఆలోచించిన వారందరికీ ధనం చేరుతుందా?ʼ అన్నదానికి సమాధానం "కాదు", ఎందుకంటే అందరికీ సాధ్యం కాదు. కానీ, కొంతమంది మాత్రమే ఎక్కువగా ధనం కూడబెట్టగలుగుతారు. వారే పిసినారులు. ఒక్క పైసా కూడా వృథా కాకుండా భద్రంగా దాచుకుంటారు. కలిగిన ధనాన్ని లెక్కపెట్టడం, దానికి మరింత కలిపి పెద్ద మొత్తం చేయడం, దానిని మరింత రక్షించడం - ఇదే వారి పనిగా మారుతుంది. ఖర్చు చేయకుండా ఉండటమే వారి లక్ష్యం, అందుకే కేవలం పిసినారులే ధనాన్ని పెంచుకుంటారు.
        ఇతరులకు ఇవ్వడం అన్న విషయమే వారికి తెలియదు. పేదలకు, ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలనే భావన కూడా వారిలో లేదు.
        దేవునికి కానుకలు సమర్పించడం లేదా ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం అసలే ఉండదు. ఎందుకంటే, అలాంటి పనులకు ధనం ఖర్చవుతుందని వారికి భయమే! ధర్మం, పాపం, పుణ్యం అన్న విషయాలు తెలియకపోవడం కాదు, కానీ ధనం పోతుందనే భ్రమ వారిని కమ్మేస్తుంది.
         తనకే ఖర్చు పెట్టని వాడు బంధువులకు ఖర్చు పెడతాడా? అని ఊహించడమే తప్పు. తన అభివృద్ధి కోసం, భార్యా పిల్లల భద్రత కోసం కూడా ఖర్చు పెట్టని వాడు మరి బంధువుల విషయంలో ఎలా ఖర్చు చేస్తాడు? కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, బంధువులపట్ల కూడా అతను దానశీలత చూపడు. పైగా, ఇతరులకు సహాయం చేయడం తప్పే అని భావించే అలవాటు కలిగిన వాడు, పాపపరిహారం కోసం బ్రాహ్మణులకు దానం చేస్తాడని అనుకోవడమే అసంభవం.
        ఇలానే ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా డబ్బును దాచుకుంటూ చివరకు చనిపోతాడు. తాను ఉపయోగించని ధనం, ఇతరులకు ఇవ్వని ధనం చివరకు మూడో వ్యక్తులదైపోతుంది. ఎవరైనా దొంగిలించివేస్తారు, లేదా అగ్నికి ఆహుతవుతుంది. ఇవేమీ జరగకపోతే, చివరికి అది రాజుయొక్క చేతుల్లోకి వెళ్తుంది.
        కాబట్టి, సంపద కూడబెట్టడమూ ముఖ్యమే, కానీ దానిని సద్వినియోగం చేయడం మరింత ముఖ్యమైనది. దానిని ఉపయోగించకుండా కేవలం కూడబెట్టడమే చేయాలనుకుంటే, చివరికి అది ఎవరో మూడో వ్యక్తులదైపోతుంది!

న ద్విషంతి న యాచంతే
     పరనిందాం న కుర్వతే |
     అనాహూతా న చాయాంతి
     తేనాశ్మానోఽపి దేవతాః ||


🌺



***

పద్యం యద్యపి విద్యతే బహు      సతాం హృద్యం విగద్యం నతత్

గద్యం చ ప్రతిపద్యతే న విజహత్పద్యం     బుధాస్వాద్యతాం ౹

ఆదత్తే హి తయోః ప్రయోగ     ఉభయోరామోద భూమోదయం

సంగ: కస్య హి న స్వదేశ మనసే     మాధ్వికమృద్వికయోః ౹౹


పద్యం చాలా గొప్పగా ఉంటుంది,కావాల్సినంత రసం ఉంది.రసికులకు గద్యము లేక పద్యం అంతగా సౌందర్యమనిపించదు.గద్యము కూడా పద్యం లేకుండా పండితులకు ఇష్టంగా అనిపించదు.ఈ రెండూ కలుస్తేనే ఎక్కువ ఆనందమవుతుంది.తేనె మరియు ద్రాక్ష కలిసిన రుచి ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందా?

***

పద్య గద్య రసము పాఠము కష్టము 

తినగ వేప చేదు తీయ gundu   

తేనె మరియు ద్రాక్ష తీపి తెలియదేల

ఒక్క రున్న చాలు ఓర్పు తెలుగు    


భోగేషు ప్రసరో యస్యా మనోవృత్తేశ్చ దీయతే 

సాప్యాదావేవ హన్తవ్యా విషస్యేవాఙ్కురోద్గతిః। 


(భోగతృష్ణవలన) ఏ మనోవృత్తికి భోగములందు ప్రవేశ మివ్వబడుచున్నదో, దానిని విషాంకురముయొక్క గతినివలె మొదటనే ఛేదించి వేయవలెను। 


పూర్ణస్తు ప్రాకృతోఽ ప్యన్యత్పునరప్యభివాఞ్ఛతే 

జగత్పూరణ యోగ్యామ్బుర్గృహ్ణాత్యేవార్ణవో జలమ్‌ 


జగత్తును కూడ నింపుటకు యోగ్య మైనప్పటికిని సముద్రము నద్యాదుల జలమును గ్రహించుచునే యుండునట్లు నిగ్రహింపబడని పామరమనస్సు పదార్థములచే పూర్ణమై యున్నప్పటికిని ఆశవలన ఇంకను కోరుచునే యుండును।


హస్తం హస్తేన సంపీడ్య దన్తైర్దన్తాన్విచూర్ణ్య చ 

అఙ్గాన్యఙ్గైరివాక్రమ్య జయేచ్చేన్ద్రియశాత్రవాన్‌। 


చేతిని చేతితో నలిపి, పండ్లను పండ్లచే కొఱికి అవయవములను అవయవములచే నాక్రమించి ఏ విధముగ నైనను (సర్వప్రయత్నములచే) ఇంద్రియములను శత్రువులను జయించవలెను।


***


గౌర్గౌః కామదుఘా సమ్యక్ప్రయుక్తా స్మర్యతే బుధైః!

దుః ప్రయుక్తా పునర్గోత్వం ప్రయోక్తుః సై వ శంసతి!!


వాక్కు గోవు వంటిది. దానిని సదుపయోగము చేసినచో కామధేనువు వలె అభీష్టములనీడేర్చును. కానీ, దురుపయోగము చేసినచో, అట్లు చేసినవానికి గోత్వమును (పశుత్వమును) కలిగించును.

***

ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్ లేక రాకా నిశా

రాజశ్రీ సఖ మైన మోమున పటాగ్రం బొత్తి యెల్గెత్తి యా

రాజీవానన యేడ్చె గిన్నెర రాజత్కారాంభోజ కాం

భోజీ మేళ విపంచికా రవ సుధా పూరంబు తోరంబు గాన్


ఆ జాబిల్లి వెలుగుతో కలిగిన విరహాన్ని భరించలేక తన చంద్రుని లాంటి ముఖము పై చీర చెరగు యొత్తుకొని ఆ తామరపువ్వు వంటి ముఖముగల ఆమె కిన్నెరలు వీణ పై కాంభోజీ రాగమాలపించి నారో యన్నట్టుగా అమృతము చిందు నట్టుగా ఎలుగెత్తి యేడ్చేను.

ఈ ఏడుపునే రామకృష్ణుడు భట్టుమూర్తి బావురుమని యేడ్చె యని వ్యాఖ్యానించాడు.


స్నానేన సంగమేశం చ స్మృత్యం గౌరీశ్వరంశివం

పిండ ప్రదానం కర్తవ్యమ్ పితృ ణాం మోక్ష దాయకం.


అర్థము:--నదీ సంగమం లో పుష్కర స్నానం చేసి శంకరుడిని తలుచుకొనడం,పిండ ప్రదానం చేయడం పితరులకు మోక్ష దాయకము.యిది విధి.  ఈ ఉదాత్త ఆశయాన్ని అపహాస్యం చేయకుండా శ్రద్ద గా నిర్వర్తించండి. ఈ స్నానఘట్టం లోనే స్నానం చెయ్యాలి అని మూఢ నమ్మకాలు పెట్టుకోకుండా పుష్కరుడు ప్రవేశించిన నది ఎక్కడవున్నా అక్కడ స్నానం చెయ్యవచ్చు.12 దినాలలో ఏరోజైనా స్నానం చేయవచ్చు.


ఈ పద్యం ఎటువైపునుండీ చదివినా అదే వస్తుంది..

రాధా నాధా తరళిత

సాధక రధ తా వరసుత సరస నిధానా

నాధాని సరసత సురవ

తాధర కధ సా తళిరత ధానా ధారా!!


***

కోకిలానాం స్వరో రూపం  పాతివ్రత్యంతు యోషితాం

విద్యారూపం విరూపాణాం క్షమా రూపం తపస్వినాం


అర్థము: కోకిలకు స్వరమే అందము.మహిళలకు పా తివ్రత్యమే అందము.

కురూపులకు విద్యయే అందము.యతులకు(మునులకు) క్షమ,శాంతము లే అందము.(సూక్తిముక్తావళి)


విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి: పరేషాం పర పీడనాయ

ఖలస్య సాధో ర్విపరీత మేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయః


అర్థము: దుర్మార్గునికి విద్య వితండ వాదము చేయుటకును, ధనము గర్వ పడుట కును, శక్తి పరులను బాధించుటకును,ఉపయోగ పడును. అదే సజ్జనులకు విద్య జ్ఞానమునకు, ధనము దానము చేయుటకును, శక్తీ పరులను రక్షించుటకును ఉపయోగపడును


***

క్రోధో మూల మనర్థానాం ; క్రోధః సంసార బంధనం

ధర్మ క్షయకరః క్రోధః ; తస్మాత్ క్రోధం విసర్జయేత్


అర్థము:--- అనర్థము లన్నింటికి కోపమే మూల కారణము. కోపమే సర్వ బంధనములకు హేతువు. అది ధర్మమును నాశనం చేస్తుంది. కనుక ముందుగా అందరూ కోపమును విడిచి పెట్టిన సుఖపడ గలరు

.

క్రోధో వైవస్వతో రాజా ; ఆశా వైతరణీ నదీ

విద్యాం కామ దుఘా ధేను: సంతుస్టో నందనం వనం


అర్థము:-- క్రోధము యమధర్మ రాజు వంటిది (అంటే మనుష్యున్ని చంపేది)ఆశ యనునది వైతరణీ నది వంటిది(దాటడానికి సాధ్యము కానిది) విద్య అన్ని కోరికలను తీర్చు కామధేనువు వంటిది. సంతోషమే నందనవనము వంటిది (మనసుకు ఆహ్లాదము కలిగించునది)

***

ఇది ఒకచమత్కార శ్లోకం.

కేశవం పతితం దృష్ట్వా,పాండవా హర్ష మాప్నుయు:

రుదంతి కౌరవాస్సర్వే,హా,హా కేశవ కేశవ


అర్థము:-కేశవుడు (కృష్ణుడు) యుద్ధము లో పడిపోయినాడట.దాన్ని చూసి పాండవులు సంతోషం తో ఎగిరారట.కౌరవులందరూ కేశవా కేశవా అని ఏడుస్తున్నారట.ఇది అసంబద్ధంగా వుంది. పదాలు కొన్నింటికి అర్థాలు మార్చుకోవాలి.కొన్ని విడదియ్యాలి.శవం=ఒక శవమును,కే=నీటియందు, పతితం=పడిపోయి వుంటే, దృష్ట్వా=చూసి, పాండవాః=గ్రద్దలు,హర్షం=ఆనందమును, ఆప్నుయు:= పొందినవి. హా హా కేశవ =నీటిలో శవము, నీటిలో శవము అని సర్వే కౌరవాః=నక్కలన్నీ ,రుదంతి=ఏడ్చుచున్నవి


.యుద్ధసమయం లో ఒక శవము నీటిలో పడి కొట్టుకువచ్చింది. గ్రద్దలు శవాన్ని ఎక్కడ వున్నా తినగలవు కనుక అవి ఆనందించినవి,నక్కలు నీటిలోకి వెళ్లి శవాన్ని తినలేవు కాబట్టి అవి ఏడుస్తూ వున్నాయి.పాండవాః =గ్రద్దలు,కౌరవా అంటే నక్కలు అని అర్థము తీసుకుంటే సరిపోతుంది.

***

ఒకసారి విద్వాన్.కావ్యతీర్థ .మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్యం గారు యిలా అనుకున్నారు

'నీతో' 'నాతో' తనతో', మనతో అనే తెనుగు విభక్తి తో గూడిన తెనుగు పదముల నిమిడ్చి సంస్కృత శ్లోకం వ్రాయ వీలగునా యనుకొని ఇట్లు శ్లోకం వ్రాసినారు.


నీతో గురు సన్నిధి మక్షరాప్తై

నాతో ధికం వస్తు తవాస్తి కించిత్

కారుణ్య దృక్పాతనతో గురూణా

మధీహి భో రామ! నతోఖిలం త్వం


తా:--రామునితో దశరథుడు అన్నట్లు ఓ రామా!త్వం=నీవు , అక్షరాప్తై=అక్షరాప్రాప్తి కొరకు (చదువు కొరకు) గురో సన్నిధిం =గురువుగారి యొద్దకు, నీతః =చేర్పబడినావు., తవ=నీకు, అతః =యింతకంటే అధికం=అధిక మైన, వస్తు=వస్తువు, కించిత్=కొంచెము కూడా, నాస్తి=లేదు, గురూణాం= గురువులయొక్క కారుణ్య దృక్పాత నతః = వాత్సల్య పూరితమైన చూపులప్రసారము వలన నతః=నమ్రత గాల వాడవై అఖిలం =సమస్త విద్యలను,అధీహి= చదువుము


***


***

వెలయాలు శిశువ ల్లుడు

నిలయేలిక యాచకుండు నేగురు ధరలో

గలిమియు లేమియు దలపరు

కలియుగమునం గీర్తికామ! కాటయవేమా!


అతిథి ర్బాలక శ్చైవ స్త్రీ జనో నృపతి స్తధా

ఏతే విత్తం న జానంతే జామాతా చైవ పంచమః


అర్థము:--అతిథి, పిల్లలు స్త్రీలు, ప్రభువు (రాజుపన్నులు విధిస్తాడు) వీరంతా గృహస్తు దగ్గర తగిన ధనం ఉందా లేదా అని ఆలోచించరట. కోరికలు తీర్చమని

అడుగు తుంటారట. వీరిలో అల్లుడు ఐదవ వాడుగా చెప్పబడినాడు. ఇది ఎప్పుడో మనువు చెప్పినది. అయినా అందరూ అలా వుంటారని కాదు. లోక రీతి ఇలా వుంటుందని, "జామాతా దశమ గ్రహః" అనే నానుడి కూడా వుంది కదా!


***

దూష కశ్చ క్రియా శూన్యో నికృ స్టో దీర్ఘ కోపనః

చత్వారః కర్మ చండాలా జాతి చండాల ఉత్తమః


అర్థము: ఇతరులను దూషించువాడు ఏ పని చేయక సోమరిగా ఉండెడి వాడు లోభము గలవాడు దీర్ఘ క్రోధము (అంటే కోపము చాల రోజుల వరకు మనసులో పెట్టుకోనువాడు)గల వాడు వీరు నలుగురు కర్మ చండాలురు . వీరికంటే జాతి చండాలుడు ఉత్తముడు.


ఉత్తమే క్షణ కోపస్యాత్ మధ్యమే ఘటికా ద్వయం

అధమేస్యాత్ దహోరాత్రం పాపిస్టే మరణాంతకం


అర్థము:ఎవరి మీదైనా కోపము వచ్చినప్పుడు ఉత్తమునియందు ఒక క్షణ కాలము మాత్రమే ఉండును మధ్యముని యందు రెండు ఘడియలు మాత్రమే యుండును

అధముని యందు యొక ఆహోరత్రముండును (ఒక రాత్రి ఒక పగలు)

చచ్చేంత వరకు కోపము మనసులో పెట్టుకొని యుండు వాడు

పాపి స్టుడు అని అనబడుతాడు (అధమాధముడు)


ఉమాదేవి జంధ్యాల 9-8-16

అమ్మ! మీఁగడపాలు తెమ్ము లే లెమ్మని, పాణిపంకజమునఁ బైఁటఁబట్టి

తిగిచినమోము నొద్దికచూచి ముద్దాడి, గిలిగింతలిడుచుఁ గౌఁగిటను జేర్చి

ఔనుర కృష్ణ! నీ వాఁకలి గొన్నావు, బువ్వపెట్టెద నని యవ్వధూటి

మీఁగడపాలతో మేళగించినయోగి, రముఁ దవనీయపాత్రముననునిచి


చేతి కందీయ మెసఁగినకౌతుకంబుఁ

దలఁచి వర్ణింప నెవ్వరి కలవియగునె

సురుచిరాకార ఉన్నవపురవిహార

రాజగోపాల రాధామనోజఖేల


ఏమిరా కృష్ణ! మ న్నేఁటికిఁ దిన్నావు?, అమ్మ! నేఁ దినలేదు అయ్యతోడు

చిన్నవాండ్రందఱు చెప్పిరి గదవోయి, నీవు వారలమాట నిజము జేసి

విందువా నేనంతవెఱ్ఱినా శిశువునా!, ఆఁకొంటినా! చూడవమ్మ నోటి

వాసన యనుచును వక్త్రంబుఁ దెఱచి లో, నా యశోదకును బ్రహ్మాండభాండ


పంక్తులెల్లను దొంతులపగిదిగాను

బెంపుచేసిననిన్ను వర్ణింప దరమె?

సురుచిరాకార ఉన్నవపురవిహార

రాజగోపాల రాధామనోజఖేల

-------------------------------శుభోదయం -------------------------------------

పద్యమ్ము నెవడురా పాతి పెట్టెద నంచు వున్మాదియై ప్రేలుచున్నవాడు

పద్యమ్ము నెవడురా పార వేయుదు నంచు వెఱ్రివాడై విర్ర వీగు వాడు

పద్యమ్ము ఫలమురా పాతి పెట్టిన పెద్ద వృక్షమై పండ్లు వేవేల నొసగు

పద్యమ్ము నెన్నడో పాతి పెట్టితిమేము లోకుల హృదయాల లోతు లందు.

పద్యమన్నది వేయేండ్ల పసిడి పంట

పద్యమన్నది తెలుగింటి పాడి పంట

పద్యమ్ము యింటింట పండు నంట

కవిత పద్యమ్మె మీకేల కడుపు మంట


ప్రాంజలి ప్రభ 0010  9 .  


ఊహల తెమ్మెర బొమ్మై నిలిచే గృహలక్ష్మీ

ఆశ్చర్యాలే వెన్నెల ధారా గృహలక్ష్మీ


చక్కని పల్కులు జక్కని కుల్కులు మనసుదోచె 

జాణత సోకులు సంపద గమ్యము గృహలక్ష్మీ  

చుక్కల సొంపులు సుందర చూపులు మనసుదోచె 

జూపుల కన్నియ సుందరి చేష్టలు గృహలక్ష్మీ 


అక్కజమందుచు నందరి మెప్పులు మనసుదోచె

నద్భుత భాషగ అలతిగ పలుకుల  గృహలక్ష్మీ

నవ్వుల సవ్వడి మనసును తాకే మనసుదోచె

బీడుగ మారిన మదిలో మెరిసే గృహలక్ష్మీ 


నిలిచిన నీడలు కాంతులవైపుకు మనసుదోచె

తరలే సమయం వెన్నెల ధారా గృహలక్ష్మీ

మౌనం వీడుతు వాణి గ విద్యలు మనసుదోచె

కన్నుల ముందుకు చూపుల పలుకుల గృహలక్ష్మీ


నడిచే దారికి వెలుగుపువ్వులై గృహలక్ష్మీ

నిశలే చేరని హాసం చిలికే గృహలక్ష్మీ

****  


సుభాషితం - 555

--------------

🌺పాత్రాపాత్రా వివేకోస్తి

     ధేను పన్నగయోరివ ౹

     తృణాత్ సంజాయతే క్షీరం

     క్షీరాత్ సంజాయతే విషమ్౹౹🌺

           దానం ఇచ్చేటప్పుడు పాత్ర,అపాత్ర వివేచన ఉండాలి.గడ్డితిని ఆవు పాలు ఇస్తే,పాలు త్రాగి పాము విషం కక్కుతుంది.

🌺

---------------

🌺తావన్నాహతాం మహతీ

     యావత్ కిమపి హి న

     యాచ్యతే లోకయ్య బలిమను యాచన

     సమయే శ్రీపతిరపి వామనోజాతః ౹౹🌺

      బలి దగ్గరకు అడగడానికి శ్రీ మహావిష్ణువుడే వామన రూపంలో( చిన్నవాడిలా ) వెళ్ళేడు.ఇక మానవులైన మనలాంటి వారు ఇంకొకరిని అడగడం తప్పేమి?

🌺✍🏼

---------------

🌺కిం వాససే త్యత్ర విచారణీయమ్ వాసః

     ప్రధానం ఖలు యోగ్యతాయః

     పీతాంబరం వీక్ష్య దదో స్వకన్యాం

     చర్మాంబర వీక్ష్య విషం సముద్ర : ౹౹🌺

        సమాజంలో వేష భూషణములకు ఉన్న విలువ వెల ఎంత ఉన్నదో చూడండి.సముద్రంలోనుంచి పీతాంబరం కట్టుకున్న విష్ణువుకు శ్రీలక్ష్మి దొరికితే,చర్మం కట్టుకున్న శివుడికి దొరికినది ' హలాహలం' విషం.

🌺✍🏽

---------------

🌺పులాక ఇవ ధాన్యేషు

      పుత్తికా ఇవ పక్షిషు తద్విధాస్తే

      మనుష్యాణాం యేషాం

      ధర్మో నా కారణమ్౹౹🌺

      ఎవరికి ధర్మ ఉద్దేశం ముఖ్యం కాదో అటువంటివారు ,ధాన్యం పైన పొట్టులా,పక్షుల మధ్య ఆడ మిణుగురు పురుగులా చేరి ఉంటారు.

🌺✍️

---------------

🌺నయస్య వినయో మూలం వినయః శాస్త్ర నిశ్చయః ౹

      వినయోహీంద్రియ జయః తధ్యక్తః శాస్త్రమృచ్ఛతి ౹౹🌺  

(సంగ్రహము)

        నీతికి మూలం వినయం,వినయమంటే శాస్త్రాలు బాగా తెలిసి ఉండటం.వినయం అంటే ఇంద్రియముల జయముకూడ మరియు అది ఉన్నవాడు శాస్త్రాన్ని తెలుసుకుంటాడు.

🌺✍️

-----------------

🌺చింతాయాశ్చ చితాయాశ్చ 

     బిందు మాత్ర విశిష్యతే

     చితా దహతి నిర్జీవ చింతా

     దహతి జీవినామ్.🌺

        చింతకు చితికి ఒక్క బిందువు మాత్రం వ్యత్యాసం.చింత ప్రాణం ఉన్న దేహాన్ని దహిస్తే,చితి ప్రాణం లేని దేహాన్ని కాలుస్తుంది.అందుకే చింతలు వదిలి జీవితం సాగించాలి మనిషి అయినవాడు.

🌺✍️

---------------

🌺ఏక ఏవ ఖగో మానీ సుఖం 

     జీవితి చాతకః ౹

     అథిత్వం యాతి శక్తస్య న

     నీచముపసర్పతి౹౹🌺

      చాతకపక్షి మహా అభిమాని.ఉన్నదానిలో సుఖం పడుతుంది.చూసిన వారి దగ్గర నోరు విప్పదు.వాన నీటి కోసం వేచి ఉంటుందే కానీ,తనకన్నా క్రింద ఉన్న వారినుంచి ఆడిగి బాధపడదు.

🌺✍️

----------------

🌺ఉత్పన్నపి చాకాశం విశన్నపి రసాతలం

     అటన్నపి మహీమ్ కృత్న్సామ్

     నాదత్తముపతిష్టతే ౹౹🌺

      ఆకాశానికి ఎగిరినా,భూలోకానికి వెళ్లినా,భూమండలం అక్కడక్క తిరిగినా మనం ఇవ్వకుండా ఉన్నది ఏది  మనకి ఎక్కడైనా సరే దొరకదు.

🌺✍️

---------------

🌺అతికృష్ణ న కర్తవ్యం తృష్ణo

     నైవ పరిత్యజేత్.

     శనై: శనైశ్చ భూక్తవ్యం

     స్వయం విత్తముపార్జితమ్ ౹౹🌺

        ఆశలను తిరస్కరించే విపరీతమైన తమకాన్ని తప్పించుకోవాలి.స్వయంగా సంపాదించిన ఆస్తిని మితంగా అనుభవించాలి.

🌺✍️


---------------

🌺అంధా విద్వజ్జనైర్వీనా

     మూకా కవిభిరుజ్జితా౹

     బధిరా గాయనైర్హినా 

     సభా భవతి భూభృతామ్ ౹౹🌺

          విద్వాంసులు ఉండకపోతే సభా భవనం గుడ్డిదైనట్టే,కవులు లేని గుంపు మూగవాళ్ళ గుంపులాంటిది,సంగీత గాయకులు లేకపోతే మనం చెవిటివారితో సమానం.


--------------

🌺పాత్రవిశేషే న్యస్తం గణాంతరం

     వ్రజతి శిల్పమాధాతుః ౹

     జలమివ సముద్రశుక్తౌ

     ముక్తాఫలతాం పయోదస్య ౹౹🌺

           అర్హత తెలుసుకొని గురువులు నేర్పిన విద్య అత్యున్నత స్థానానికి వస్తుంది.అలాగే మేఘం కురిపించిన వర్షపు ధార సముద్రంలో ఉన్న ముత్యపు చిప్పులో పడితే అది మంచి ముత్యం అవుతుంది

---------------

🌺తృణపణోదకాహారా:

      సతతం వనవాసినః ౹

      జంబుకాఖు మృగాద్యాశ్చ

      తాపసాస్తే భవంతి కిమ్ ౹౹🌺

         ఎప్పుడూ అడవిలో ఉన్న గడ్డి,ఆకులు,నీళ్లు త్రాగుతూ ఉన్నంత మాత్రాన ఋషి అనేమాట అయితే,నక్క,ఎలుక,.మృగం మొదలైనవికూడా మునులు అని అనవచ్చు కదా?

-------------------

🌺ప్రదూషే దీపకశ్చంద్ర:

     ప్రభాతే దీపకో రవి: ౹

     త్రైలోక్యే దీపకో ధర్మః 

     సుపుత్రః కులదీపకః ౹౹🌺

      రాత్రి పూట చంద్రుడి వెలుగులు.పగలు సూర్యుడి కాంతి.మూడు లోకాలను ప్రజ్వలించేది ధర్మ.కులానికి సుపుత్రుడే వెలుగు.

🌺

---------------

🌺వ్యాధయో నాపి వా యమః

     ప్రాప్తుమ్ శ్రేయః ప్రతిష్టతే ౹

     యావదేవ భవేత్ కల్పస్తా వచ్చ్రేయః సమాచరేత్ ౹౹🌺

        రోగాలకానీ,యముడే కానీ, నువ్వు అన్ని మంచి పనులను చేసి ముగించు అని వేచి ఉండవు.అందువలన అవకాశం ఉన్నపుడు శక్తి సామర్ధ్యాలు ఉండగానే మనం సత్కార్యాలు చేస్తూ ఉండాలి.

🌺

---------------

🌺యే యాంట్యాభ్యుదయే ప్రీతం

     నోజ్జoతి వ్యాసనేషు చ౹

     తే బాంధవాస్తే సుహృదో లోకః

     స్వార్థపరోsపరః ౹౹🌺

        మనకి ప్రగతి కలిగిన సమయంలో ఎవరు సంతోషం చూపుతారో,ఆపత్తుల సమయంలో మనల్ని ఎవరు విడిచి వెళ్లరో అటువంటివారే బంధువులు ,స్నేహితులు.మిగిలినవారు శత్రువులు.

🌺

---------------

🌺నాస్థానే నిహితా కాచిత్

     క్రియా ఫలవతీ భవేత్ ౹

     న వ్యాపారాశతేనాపి

     శుకవత్పాఠ్యతే బకః ౹౹🌺

          సరియైన స్థలములలో ప్రయత్నాలు చేయకపోతే ఏ పని,కార్యాలు ఫలాన్ని ఇవ్వలేవు.కొంగకు ఎంత నేర్పిన అది చిలుకలా మాట్లాడ లేదు.

🌺

---------------

🌺విద్యాయా వర్ధతే వర్చో 

     విద్యయా వర్ధతే వపు:

     విద్యాయా వర్దతే వీర్యం

     విద్యాయా కిం న వర్ధతే ౹🌺

   విద్యతో వర్చసు వృద్ధి అవుతుంది.విద్యతో శరీర కాంతి వృద్ధి చెందుతుంది.అలాగే,విద్యతో పౌరుషం వృద్ధి అవుతుంది.ఇలా విద్య లేకపోతే ఏది వృద్ధి చెందదు కదా?

🌺✍🏽

🌺అవక్తాపి స్వయం లోకః

      కామం కావ్యాపరీక్షకః ౹

      రసపాకానాభిజ్నోsపి

      భోక్తా వేత్తి న కిం రసమ్ ౹౹🌺

      స్వతః మనిషి కవికాకపోయినా కావ్య పరీక్షకుడు అవ్వచ్చు.వంట చేయడం రాకపోయినా భోజనం చేసేవాడు రుచి చూడ వచ్చు కదా?

🌺✍🏽

🌺దుర్జనస్య శ్వపుచ్ఛస్య

     వ్యాలస్యోష్ట్రగలస్య చ౹

     న మంత్రైనౌర్షధైర్వా పి 

     ఖుజుతా జాతు జాయతే ౹౹🌺

(సంగ్రహము)

      దుర్జనుడు,కుక్క తోక,పాము,ఒంటి మెడ,వీటిని ఏ మంత్రాలవల్ల కానీ లేక ఎటువంటి మందులవల్ల కానీ నిలువుగా చేయలేము.

🌺✍🏽

---------------

🌺అర్థానామార్జనం కార్యం

     వర్ధనం రక్షణం తథా ౹

     భక్ష్యమాణో నిరాదాయః

     సుమేరూరపి హియతే ౹౹🌺

        డబ్బు గడించాలి.అలాగే వృద్ధి చేయాలి.రక్షించాలి.సంపాదన చేయకుండా ఊరికే కూర్చుని తింటూ ఉంటే బంగారు కొండలు సహితా కరిగిపోతూ ఉంటాయి.

🌺✍🏽

---------------

🌺ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్

     శ్రియ మిచ్చేద్దుతాశనాత్ ౹

     జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్

     మోక్షమిచ్చేత్ జనార్దనాత్ ౹౹🌺

        భాస్కర్ అంటే సూర్యుడు నుంచి ఆరోగ్యాన్ని పొందాలి.అగ్ని దేవుడునుంచి సిరిని ఆశించాలి.మహేశ్వరుడు నుంచి జ్ఞానాన్ని పొందాలి.అలాగే మోక్షాన్ని జనారద్దు నుంచి విష్ణువు నుంచి పొందాలి.

🌺✍🏽

---------------

🌺గంగా పాపం శశీ తాపం

     దైన్యం కల్పతరుస్తథా ౹

     పాపం తాపం చ దైన్యం చ ఘ్నంతి

     సంతో మహాశయః ౹౹🌺

       గంగ పాపాల్ని,చంద్రుడు తాపాన్ని,కల్పవృక్షం బాధలను పోగొడుతాయి.అయితే,మహాశయులు పాపం,తాపాన్ని,వేదన ఈ మూడింటిని తొక్కిపెడతాయి.

🌺✍🏽

---------------

🌺చింతనీయా హి విపదా

     మాదావేవ ప్రతిక్రియా ౹

     న కూపఖననం యుక్తం

     ప్రదీప్తేవహ్నినా౹౹🌺

     విపత్తులు అయ్యే ముందే సూక్తమైన పరిహారాలను,ఉపాయాలు గురించి ఆలోచించుకోవాలి.నిప్పుతో ఇల్లు అంటుకున్నప్పుడు నీటి కోసం నుయ్యి తవ్వేది యుక్తం కాదు కదా?

🌺✍🏽

          ------------------------

ఒక కథలో కాళిదాసుకు విద్వత్పరీక్షలో ఎదురైన ప్రశ్నలు అతడు చెప్పిన జవాబులు:-

ప్రశ్న: ద్వావేవ కోమలం పథ్యం?

జవాబు:  వార్తాక వనితాధరౌ.

 ప్రశ్న: ద్వావేవ కఠినం పథ్యం?

జవాబు: కూష్మాండ కుచమండలౌ.


రెండు మృదువులై హితములై యుండు నెవ్వి?

అవ్వి వంకాయయును వనితాధరములు.

రెండు కఠినమై హితములై యుండు నెవ్వి?

గుమ్మడి ఫలమ్ము మరియును కుచయుగమ్ము.


యస్య కస్య హి కర్యస్య
     ఫలితస్య విశేషతః ౹
     క్షిప్రప్రక్రియ మాణస్య కాలః
     పిబతి తద్రసమ్ ౹౹🌺

      చాలా ప్రముఖమైన కర్తవ్యం ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా తక్షణం చెయ్యాలి.అనవసరంగా ఆలస్యం చేస్తే కష్టపడినా ప్రయోజనం లేనట్లు అవుతుంది. ఎందుకంటే,కాలగతి ఆ శ్రమని నిస్సారం చేసి వదిలేస్తుంది.



*శ్లోకం*

*కురుతే గంగాసాగర గమనం వ్రతపరిపాలన మథవా దానమ్!*
*జ్ఞానవిహీనః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన!!*

పంచపది

గంగలో మునకేసినా సాగర స్నానము చేసినా
పూజలెన్నో చేసినా నోములు వ్రతాలుచేసినా
దానధర్మాలెన్ని చేసినా ధర్మదాతగాపేరొందినా
నిష్ఠలేక భక్తిభావములేని తంతులెన్ని చేసినా
ఆత్మజ్ఞానములేని జన్మలెన్నెత్తినా ముక్తి నొందునా కందూర్

---------------
🌺అర్థానామార్జనం కార్యం
     వర్ధనం రక్షణం తథా ౹
     భక్ష్యమాణో నిరాదాయః
     సుమేరూరపి హియతే ౹౹🌺
        డబ్బు గడించాలి.అలాగే వృద్ధి చేయాలి.రక్షించాలి.సంపాదన చేయకుండా ఊరికే కూర్చుని తింటూ ఉంటే బంగారు కొండలు సహితా కరిగిపోతూ ఉంటాయి.
---------------
🌺అర్థానామార్జనం కార్యం
     వర్ధనం రక్షణం తథా ౹
     భక్ష్యమాణో నిరాదాయః
     సుమేరూరపి హియతే ౹౹🌺
        డబ్బు గడించాలి.అలాగే వృద్ధి చేయాలి.రక్షించాలి.సంపాదన చేయకుండా ఊరికే కూర్చుని తింటూ ఉంటే బంగారు కొండలు సహితా కరిగిపోతూ ఉంటాయి.

--------------
🌺ఖలః సర్సపమాత్రాణి
     పచ్ఛిద్రాణి పశ్యతి ౹
     ఆత్మనో బిల్వమాత్రాణి
     పశ్యాన్నపి న పశ్యతి ౹౹🌺
         దుష్టుడైన వాడు ఇంకొకరిలో ఆవంత దోషం చూసినా అది ఎత్తి చూపుతాడు.అయితే,తనలోనే ఉన్న మారేడు కాయంత దోషాలు ఉన్నా చూడనట్టు ఉంటాడు.

--------------
🌺యస్య కస్య హి కర్యస్య
     ఫలితస్య విశేషతః ౹
     క్షిప్రప్రక్రియ మాణస్య కాలః
     పిబతి తద్రసమ్ ౹౹🌺
      చాలా ప్రముఖమైన కర్తవ్యం ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా తక్షణం చెయ్యాలి.అనవసరంగా ఆలస్యం చేస్తే కష్టపడినా ప్రయోజనం లేనట్లు అవుతుంది. ఎందుకంటే,కాలగతి ఆ శ్రమని నిస్సారం చేసి వదిలేస్తుంది.
----------------
🌺న యోజనశతం దూరం
     బాధ్యమానస్య తృష్ణయా౹
     సంతుష్టస్య కరప్రాప్తేsర్తే
     భవతి నాదరః ౹౹🌺
       ఆశలు ఉన్న వాడికి వంద మైళ్ళు దూరం అనిపించదు.అయితే,సంతృప్తి పొందనివారికి ధనం చేతికి దొరికినా సరే,దాన్ని చూసి ఆదరించరు.

---------------


🌺సద్భిరేవ సుహాసీత సద్భి:
     కుర్వీత సంగతిమ్ ౹
     సద్భిర్వివాద మైత్రీ చ
     నాసద్భి: కించిదాచరేత్ ౹౹🌺


        సజ్జనులతో కూర్చోవాలి.సజ్జనులతో స్నేహం చేసుకోవాలి.వివాదాలైనా స్నేహమైనా సజ్జనులతో ఉండాలి.నీచులతో ఏ పనులను చేయరాదు.వాళ్లకు దూరంగా ఉండాలి



(సుభాషితరత్నభాండాగార)
      ద్వేషించరు; యాచించరు;
ఇంకొకరిని నిందించరు;
పిలువకపోతే రారు;
ఈ కారణాలవల్ల శిలలు కూడ దేవతలే!

పుణ్యం ప్రజ్ఞాం వర్ధయతి
క్రియమాణం పునః పునః!
వృద్ధప్రాజ్ఞః పుణ్యమేవ
నిత్యమారభతే నరః!!

పుణ్యకార్యాలు చేయడం వల్ల మనిషి బుద్ధి వికసించి స్థిరంగా ఉంటుంది. అప్పుడిక పుణ్యకార్యాలు చేయడం మాననే మానడు. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు. కాన, పుణ్యకార్యాలు పదేపదే చేయాలని భావన.


Comments

  1. నమస్తే,
    మీరు వ్రాసిన పద్యాలు కొన్ని ఈరోజే చదివాను. బాగున్నాయి.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు