లలిత శృంగారం




నేటి కవిత - ప్రాంజలి ప్రభ
(లలిత శృంగారం)

సిగ్గు ఎగ్గూ లేక
ఆగ్గి బొగ్గని తెలి  సి
తగ్గీ తగ్గక ముగ్గు లోకి లాగి
ఒగ్గు, పొంగులు ఎగచూపి
నుగ్గు నుగ్గు చేయకు

బుగ్గా బుగ్గా కలిపి
సొంగా సొంగా చూపి
కంగా రలా లంగా ఊపి
నంగనాచి పంగలెత్తి
దగ్గి దగ్గక దగ్గుతో పిలిచి
సిగ్గు ఎగ్గూ లేక మంచు చేరే   

తగ్గు తగ్గు అంటూ తగ్గక
ఒగ్గు ఒగ్గు అంతా  నీదే ముగ్గు
ఈ సిగ్గు ముగ్గు నీ సొంత మగు
చెంగు చెంగున దూకి
మగ్గం తిప్పి అగ్గిని చల్లార్చు 

ప్రాంజలి ప్రభ 
లలిత శృంగారం (8 )

కళ్ళల్లో కళ్లెట్టి  
కళలన్ని పసికట్టి 
కనుపాపలు చూపెట్టి 
కలలు తీర్చే చదువును కనిపెట్టె 

పై యదపై గురిపెట్టి 
పైట చాటు పరువాలు పసికట్టి 
చిరునగవును చూపెట్టి 
తులతూగె కన్నె సొగసును కనిపెట్టె

ఓరకంటగా పసికట్టి 
గుండెలోని విషయాన్ని గుర్తుపట్టి 
ఆకర్షించే నెరజానిని చేపట్టి
కిర్రెక్కించే మనిషి వయసు కనిపెట్టె 

చిత్ర విచిత్రాలు కనిపెట్టి
కులుకుల సొబగును పసికట్టి  
వణికే పెదవులను అదిమి పెట్టి 
దొరికిన చోట ముద్దులతో పనిపెట్టె

కన్నె యదను దోచినట్టి 
నీ చూపులతో తాకినట్టి 
నా సరి నీవని నీ గరి నానైనట్టి 
మరులూరించే మగువ పనిపట్టె 

కదలకతో సొగసు పుట్టి 
ఉప్పొంగే కెరటానికి దారిచూపెట్టి 
ఒకరికొకరు పరువాన్ని బిగపట్టి 
క్షణం సొగసరి గడసరి ఒక్కటైనట్టె     
       
--((***))--

--((***))-- ప్రాంజలి ప్రభ - నేటి కవిత  
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

పర హితము పై ఫలం నాశించకు  
పర జపము పై  మదం చూపించకు 
పర నామము పై వరం ఆశించకు 
పర మాటల  పై  గళం గుర్తించకు  

క్రియాజ్ఞానము పై విమర్శించకు 
ఇచ్చా జ్ఞానము పై  సమర్ధించకు 
సృష్టి జ్ఞానము  పై  ప్రస్నాలేయకు   
పూర్ణ జ్ఞానము పై  ప్రస్తుతించకు  

శృంగార రసము పై ద్వేషించకు 
వ్యక్త, అవ్యక్తము పై ఆలోచించకు 
హిత, అహితము పై విచారించకు 
సూక్షము స్తూలము పై వ్యక్తపరచకు

ఎక్కువ, తక్కువ పై వేదించకు 
నిత్య, అనిత్యము పై పోరాడకు 
పరువు ప్రతిష్ట పై పాకులాడకు 
ప్రేమ ఆనందము పై జాలిచూపకు 

--((***))--     


ప్రాంజలి ప్రభ
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

వలపు వద్దన్నా వెంబడించు
వర్షం వద్దనకుండా వర్షించు
కళ్ళల్లోన మాయ వహించు
చూపుల్లో అనురాగం చిందించు

కష్టంలోనే ఇష్టాన్ని తపించు
నవ్వల్తో మాటల్ని జయించు
ప్రేమతో వలపునే చిగురించు
పరవశంతో కలసి తరించు

కళ్ళు కలిపి తోడు నందిచు
నిత్యం సద్వినియోగ పరచు
నిర్మల మనస్సు వ్యక్త పరచు
నిండుయవ్వనం జత పరచు

నిప్పుని చల్లార్చి శాంత పరచు
మగవ మనసే మురిపించు
మగని కోరికే పరిమళించు
మమతల కళలు వరించు

వశీకరణంతో  మోనం వహించు
వయసు ఉడుకు చల్లబరుచు
ఉన్న తరుణం తో విహరించు
ఇర్వురు సంతోషంతో తరించు

--((*))--




ప్రాంజలి ప్రభ 

లలిత శృంగారం (8 )

కళ్ళల్లో కళ్లెట్టి 

కళలన్ని పసికట్టి 
కనుపాపలు చూపెట్టి 
కలలు తీర్చే చదువును కనిపెట్టె

పై యదపై గురిపెట్టి 

పైట చాటు పరువాలు పసికట్టి 
చిరునగవును చూపెట్టి 
తులతూగె కన్నె సొగసును కనిపెట్టె

ఓరకంటగా పసికట్టి 

గుండెలోని విషయాన్ని గుర్తుపట్టి 
ఆకర్షించే నెరజానిని చేపట్టి
కిర్రెక్కించే మనిషి వయసు కనిపెట్టె

చిత్ర విచిత్రాలు కనిపెట్టి

కులుకుల సొబగును పసికట్టి 
వణికే పెదవులను అదిమి పెట్టి 
దొరికిన చోట ముద్దులతో పనిపెట్టె

కన్నె యదను దోచినట్టి 

నీ చూపులతో తాకినట్టి 
నా సరి నీవని నీ గరి నానైనట్టి 
మరులూరించే మగువ పనిపట్టె

కదలకతో సొగసు పుట్టి 

ఉప్పొంగే కెరటానికి దారిచూపెట్టి 
ఒకరికొకరు పరువాన్ని బిగపట్టి 
క్షణం సొగసరి గడసరి ఒక్కటైనట్టె

--((***))--


ప్రాంజలి ప్రభ - నేటి కవిత 

మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

పర హితము పై ఫలం నాశించకు

పర జపము పై మదం చూపించకు
పర నామము పై వరం ఆశించకు
పర మాటల పై గళం గుర్తించకు

క్రియాజ్ఞానము పై విమర్శించకు

ఇచ్చా జ్ఞానము పై సమర్ధించకు
సృష్టి జ్ఞానము పై ప్రస్నాలేయకు
పూర్ణ జ్ఞానము పై ప్రస్తుతించకు

శృంగార రసము పై ద్వేషించకు

వ్యక్త, అవ్యక్తము పై ఆలోచించకు
హిత, అహితము పై విచారించకు
సూక్షము స్తూలము పై వ్యక్తపరచకు

ఎక్కువ, తక్కువ పై వేదించకు

నిత్య, అనిత్యము పై పోరాడకు
పరువు ప్రతిష్ట పై పాకులాడకు
ప్రేమ ఆనందము పై జాలిచూపకు

--((***))--



లలిత శృంగార సాహిత్యం (4) Pranjali Prabha 

రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

నను నమ్మవే సతీ - నను చూడవే గతీ 

- నను కావవే మతీ - నను తాకవే రతీ 
చిరునామ చెప్పఁవే - చిరునవ్వు చూపవే 
-చిరుహాస పంచవే - మురిపాలు ఇవ్వవే

కలకాదులే వతీ - నిజమాయలే జతా

- మన మాయలే పతీ - మానతాపమే రతీ 
మన సంఘమే గతీ - మన కామమే యతీ
కళ కాదులే పతీ - ప్రకృ తీ కళ ఇదీ

వయసే కదా మడీ - మనసే కదా బడీ 

వలపే కదా వడీ - సొగసే కదా సడీ 
తలపే కదా జడీ - పరువే కదా తడీ
చిగురు కదా చడీ - చమటే కదా పడీ

మనసుందిలే ప్రియా - మమతుందిలే ప్రియా 

భయమెందుకే ప్రియా - దడుపెందుకే ప్రియా 
చనువుందిలే ప్రియా - మది పంచుతా ప్రియా 
నవనవ్వులే ప్రియా - పవళింపులే ప్రియా

--((***))--



లలిత శృంగార సాహిత్యం

రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

పున్నమి రేయి పూసిన చోట

మల్లెల వాన కుర్శిన చోట
తుమ్మెద కోర్క వచ్చిన చోట
అక్కర తీరు చేరిన చోట

కన్నులు చూసె గారడి వేట

చూపులు కల్పె తుమ్మెద వేట
ఆశలు తీర్చె ఊపిరి వేట
జిల్లన జల్లు తడ్సిన వేట

కళ్ళలొ కైపు చూపిన ఆట

ముద్దుతొ కైపు ఇచ్చిన ఆట
సర్దుకొ కైపు పొందిన ఆట
ఇష్టమె కైపు చిందిన ఆట

మబ్బులొ నీరు కార్చెటి మాట

పృధ్విలొ నీరు పొందెటి మాట
ఋడ్గల నీరు కర్గెటి మాట
తన్మయ చెంది తీర్చెటి మాట

--((***))--



లలిత శృంగార సాహిత్యం - Pranjali prabha

రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

కలవాలి కోర్కతో - నడవాలి ఆశతో -

తడవాలి తృప్తిగా - చిరుగాలి వేడితో
పరువంలొ పండగే - తరుణంలొ దప్పికే
- ప్రణయంలొ సేవలే - వినయంలొ సందడే

విధిరాత వింతలే - వినయాన మోతలే

- మదిలోన మాటలే - కదలల్లె అల్లెనే
జతకూడి జాతరే - జపతాప తగ్గుటే
- సమయాన ఇష్టమే - సమజోడి చిందులే

--((***))--



* ప్రాంజలి ప్రభ (వెలుగు రేఖలు )
రచయత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

స్వచ్చమైన వెలుగు రేఖలు
- మనసులో విచ్చుకున్న కధలు
విచ్చుతున్న సుమ దళమ్ములు
.- ఉల్లాసానికి మార్గాలు

వెచ్చనైన స్నేహ మధువులు
 - మనసుకు నచ్చే కవితలు
మచ్చ లేని పసి మనస్సులు.
- మాట తప్పని మనస్సులు

కల్లలెరుగని కనుల మెరుగులు
- ఒకరి కొకరు కలసే తలపులు 
ఇంటి ఇంటికి కాంతి దివ్వెలు.
.- మణి పూసల  వంటి  పిల్లలు

కపటమెరుగని మట్టి ప్రమిదలు
- అంటి అంటని కొందరి బ్రతుకులు
స్పటిక వర్తన.. దీప కళికలు..
 -  కోపస్వభావపు మెరుపులు

కల్మషమ్మెరుగని.. కoటి పాపలు.
 - ధర్మమార్గంలో నడిచే మనుష్యులు
.జాతి ఘనతకు జాడ కందురు....
 - ప్రకృతికి తలవంచే మనుష్యులు

--((*))--


తెలుగు భాష నేర్చుకుందాం
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
హరవిలాస - ర/జ/ర/జ/న/గ
UI UI UI UI - UI UI III U
16 అష్టి 31403

కల్వ లేదు, పిల్వ లేదు, మర్వ లేదు  మనసులో
చెప్ప లేదు, ఒప్ప లేదు, మెచ్చ లేదు మనసుతో
మంచి లేదు, చెడ్డ లేదు, మాయ లేదు వయసులో
వింత లేదు, పొంత లేదు, వంత లేదు వయసుతో 

తగ్గ లేదు, వెల్గు లేదు, ఒగ్గు లేదు సొగసులో
మాట లేదు, పాట లేదు, వేట లేదు  సొగసుతో 
మార్పు లేదు, నేర్పులేదు, కూర్పులేదు చిగురులో
తాళి లేదు, గాలి లేదు, మాలి లేదు చిగురుతో

కాల మాయ వేచి చూడు - దీప వెల్గు తరుమురా
పాప భీతి మాని చూడు - మార్పు తెచ్చి తరుమురా
సేవ చేసి కూర్పు చేయి - తీర్పు ఇచ్చి తరుమురా
మిన్ను మన్ను నమ్మి చేయి - కల్సి ఉంచి తరుమురా

అంద మైన చంద మామ - యాక సాన వెలుగురా
అంద మైన సూర్య మామ - నింగి లోన వెలుగురా
పిల్ల పాప లందు మామ  - తల్లి తండ్రి వెలుగురా
సంత సంతొ సంబరంగ - అంద నంత వెలుగురా





--((**))--

ప్రాంజలి ప్రభ
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
   
ఆదర్శం అణకువ ఆత్మీయతా భావాలను
భారతీయ స్త్రీల నుండే నేర్చుకోవాలి
సంస్కృతి సంప్రదాయాలను
భారతీయ మహిళల నుండే నేర్చుకోవాలి
   
ఆచారవ్యవహారాలను తెల్పేది   
భారతీయ వనితలు మాత్రమే
కట్టు బొట్టుతో సౌదర్య విషయాలను 
భారతీయ విద్యార్థుల నుండి నేర్చుకోవాలి

చెక్కు చెదరని సంస్కృతిని
భారతీయ మగువలనుండి నేర్చుకోవాలి
భక్తి శృంగార పారవస్యాలను
భారతీయ తరుణీల నుండి నేర్చుకోవాలి

నమస్కారములు ప్రతి నమస్కారములను
భారతీయ పడచులనుండి నేర్చుకోవలెను
సంస్కారముతో కూడిన అలంకారణలను
భారతీయ మనోహరి నుండి నేర్చుకోవాలి

ఆనందం ఆరోగ్యం ఆద్యాత్మికం కోసం
భారతీయ సుహాసిని నుండి నేర్చుకోవాలి
కోప తాపాలు లేని సుఖం కోసం
భారతీయ స్త్రీలనుండి అన్నీ నేర్చుకోవాలి

--((**))--         
         


ప్రాంజలి ప్రభ
నేటి కవితా నందం
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

సమాజం నీ ఆలోచనకు అందదు
ఆలోచనలన్నీ నదిలా సముద్రంలో కలవడమే
ప్రపంచమే ఒక సాలే గూడు
అందులో చిక్కినవారు గిలగిలా కొట్టుకోడమే

చిత్తశుద్ధి కర్రలున్నా
బుర్రలు బూజు పడితే ఉపయోగం ఎవ్వరికి
ఎదుర్కొనే సత్తా ఉన్నా
కుంజుకొనే మనస్సు ఉన్న ఉపయోగం ఎవ్వరికి

ఆశయాలు ఎన్ని ఉన్నా
విమర్శనాస్రం ఉంటె ఉపయోగం ఎవ్వరికి
బాధలు తీర్చాలని ఆశ ఉన్నా
భవిషత్తు గురించి ఆలోచిస్తే ఉపయోగం ఎవ్వరికి

కాగితపు రాతలే కదా అని ఉన్నా
నిర్లక్ష్య0 నిదానంగా తెలిస్తే ఉపయోగం ఎవ్వరికి
చిన్న బూతు మాటేకదా అని ఉన్నా
కొందర్ని అగ్నిలా దహిస్తే ఉపయోగం ఎవ్వరికి

కాలం నాదే అని మొండిగా ఉన్నా
నిగ్రహమ్ లేకపోతె ఉపయోగం ఎవ్వరికి
తోడు అక్కర్లేదు అనుకోని ఉన్నా
అహంకారపు బతుకు ఉపయోగం ఎవ్వరికి

నిజాయితీకి విలువ ఇవ్వకున్నా
ధనమే దైవమని ఉన్నా ఉపయోగం ఎవ్వరికి
ఆరోగ్యంతో ఏమీ లోటులేదనుకున్నా
దేవుడ్ని దూషించి ఉన్నా ఉపయోగం ఎవ్వరికి





--((**))--

Comments

Popular posts from this blog

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు