నేటి కవిత
ప్రాంజలి ప్రభ నేటి కవిత (ప్రాంజలిప్రభ ) పువ్వు రచయత: మల్లప్రగడ రామకృష్ణ అకుచాటున పిందె అంకురించే కొమ్మ రెమ్మలకు ప్రేమను పంచే ప్రకృతి బలంతో పువ్వుగా విరిసే అతిశయం తోనే ఆద మరిచే పువ్వుగా మారి జ్వాలగా వేలిగే పెనుగాలికి,పెనవేసి ఉండే మకరందంతంతో మిడిసిపడే తుమ్మెద కోసం ఎదురు చూస్తుండే సుతిమెత్తగా ఉండి తన్మయమే తుమ్మెద మకరందాన్నికి దారే సూదిలాంటి పెదాలతో హరించే పువ్వు పరవశించి ఆనందించే పరమాత్ముని లీలా మాధుర్యమే పరమపదించుటకు మార్గమే పెనవేసుకొని ఉండే బంధమే నూతన తేజస్సే నిదర్శనమే --((**))-- నేటి కవిత (ప్రాంజలిప్రభ ) కలం రచయత: మల్లప్రగడ రామకృష్ణ గళంతో వ్రాస్తుంది కలం కలం వ్రాతలు చూపు గమ్యం గమ్యంలో కనిపించు కలం అనుభవం అనుభవంతో వ్రాసే కలం నైపుణ్యం కల్పనా కవితల ప్రావిణ్యం శాంతికి ఆయుధం కావాలి కలం ప్రజా చైతన్యం కలంతో తేవాలి ప్రపంచాన్ని నడిపించేది కలం అ శాంతి నుండి శాంతిని కల్పించేది కలాన...