చైతన్య గీతాలు
ప్రాంజలి ప్రభ -
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
రారా కృష్ణయ్య
రాధా కృష్ణయ్య రమా కృష్ణయ్య
రాజా కృష్ణయ్య రమ్యా కృష్ణయ్య
రాణా కృష్ణయ్య రాశి కృష్ణయ్య
రాసలీల మనసులో ప్రేరేపణ నీది
రాలేను, కలవలేను ఇది నాకు విధి
రాజ నీతిని తెలుసుకోలేని ప్రస్తుత స్థితి
కొందర్ని ప్రేమిస్తావ్,
ప్రత్యక్షంగానో, పరోక్షంగానో
అవసరంగానో, అనవసరంగానో
కారణంగానో, ఆకారణంగానో
ధర్మాధర్మాలను తెల్పుతున్నావు
నిజాలు అబద్ధాలు కల్పిస్తున్నావు
న్యాయాన్యాయాలను తెల్పుతున్నావు
మమతానురాగాలు పంచుతున్నావు
విశ్వమానవత్వం అంటున్నావు
విశ్వభోదపై విశ్వాసం ఉంచమంటున్నావు
విశ్వమంతా దైవత్వానికి అర్ధం చెపుతున్నావు
చిరునవ్వుతో, ప్రేమను పంచుతున్నావు
రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య
రాధా కృష్ణయ్య రమా కృష్ణయ్య
--((*))--
నేటి నా పాట
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
ఏందిరా మొగడా
మంచి బట్ట కట్ట మంటావు
అలంకరించు కోవద్దంటావు
ఎవ్వరిని చూసిన నవ్వద్దంటావు
ఎలాచచ్చేదిరా మొగడా,
నీమాట ఎలా ఒప్పేదిరా మొగడా
అవునా ......
అందాన్ని చూపొద్దంటావు
కవులకు సైతం అవకాసం ఇవ్వద్దంటావు
మరి నీ కైతే పూర్తిగా చూపాలంటావు
సంతకు పోయి తిరుగుదా మంటావు
పోరగోళ్ళు చూస్తె చిర్రెత్తి పోతావు
ఏల చచ్చేదిరా మొగడా,
నీమాట ఎలా ఒప్పేదిరా మొగడా
అవునా ......
భూమికి భారం కావద్దంటావు
పగలంతా రేయిలా గడపాలంటావు
ప్రేమలు పుట్టేవేళ ఏపనీ చేయ్యద్దంటావు
నీవు తోడు ఉంటె ప్రేమ పంటే పంటంటావు
అడిగంగానే ఇవ్వలేదంటే చిర్రుబుర్రులడుతావు
ఏల చచ్చేదిరా మొగడా,
నీమాట ఎలా ఒప్పేదిరా మొగడా
అవునా ......
నాలుగు రోజులు వద్దన్నానుకో ఐదవ రోజు భరతంపడతావు
నీరసంగా ఉందంటే తిండి తినమని ఎంతో వత్తిడి చేస్తావు
నెప్పిగా ఉందంటే వైధ్యున్నే ఇంటికి తెప్పించి మందిప్పిస్తావు
పుట్టింటికి పోతానంటే ఆకలికి తట్టుకొని ఉండలే నంటావు
ఏల చచ్చేదిరా మొగడా,
నీమాట ఎలా ఒప్పేదిరా మొగడా
అవునా ......
అవునన్నా కాదన్నా, నీ పంతం నన్ను నిద్రపోనియ్యవు
నీవు నిద్రపోవు
అవునన్నా కాదన్నా, నీ పంతం నన్ను నిద్రపోనియ్యవు
నీవు నిద్రపోవు
--(())--
నేటి నాపాట
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
ఆమె. కళ్ళు కళ్ళు కలపాలని చేరుకున్నా
కరునించే మనసుతో కలుసుకో నన్ను
కళ్ళు కళ్ళు కలపాలని చేరుకున్నా
అతడు.. కరునించే మనసుతో కలుసుకుంటి నిన్ను
వయసు ఉడుకును చల్లబరిచి సంతోషించు
కరునించి మనసుతో కలసుకుంటి నిన్ను
ఆమె.. మనసును జయించే మగధీర
అతడు.. అహాహాహాహా
ఆమె.. వెన్నెల గంధం అందించే నెలవంక
అతడు......అహాహాహాహా
ఉష
ఆమె.. హాయిని పంచే మన్మధ వీర
అతడు.. ఆహాహాహాహా
మనసును ఊరించే మహారాణివి నీవు,
వెలుగును ఆందించే తారవు నీవు,
ప్రేమను అందిచే తరుణివి నీవు
ఆమె.. అహాహాహాహా
మురిపించనా , ప్రేమకురిపించనా
నా కౌగిట్లో నిన్ను కరగించనా ......ఆ...
అతడు.. మురిపించి నీ ప్రేమకురిపించినా
పరవశమై మేను మరచేపోనా....ఆ..
ఆమె.. శృంగార జలధిలో ముంచి,,
ఉయ్యాల లూగించి పరవశింప లాలించనా......ఆ..
అతడు.. ప్రేమానురాగాలు అందించి
నీ బిగికౌగిలిలో బంధిస్తే చాలు .....ఆ...
ఆమె.. కళ్ళు కళ్ళు కలపాలని చేరుకున్నా
అతడు. .కరుణకు కరిగి పోవాలని చేరుకున్నా
ఆమె.. కళ్ళు కళ్ళు కలపాలని చేరుకున్నా
అతడు.. కరుణకు కరిగి పోవాలని చేరుకున్నా
ఆహాహాహాహా
ఆహాహాహాహా
--(())--
నేటి పాట
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
జజ్జనక జనారే
ఏమిటి ఈ లోకం - జజ్జనక జనారే
ఉండలేని ఈ వైనం - జజ్జనక జనారే
కాలుష్యంతో నిండుతున్న గగనం
అంర్జాలముతో కమ్ముకున్న లోకం
మనిషి మేధస్సునే పెట్టె ఇరకాటం
మమత తెలియని అయ్యోమయ్యం
ఏమిటి ఈ లోకం - జజ్జనక జనారే
ఉండలేని ఈ వైనం - జజ్జనక జనారే
భగ భగ మండుతున్న ఉష్ణగుండం
ఉన్ననీరు ఆవిరిగా మారె భూగర్భం
నీరు, తిండి కరువై కర్మల బంధం
కొందరి నడమంత్రపు సిరి ఆర్భాటం
ఏమిటి ఈ లోకం - జజ్జనక జనారే
ఉండలేని ఈ వైనం - జజ్జనక జనారే
జాతి కులం మతం లేని ఆరాటం
నీకన్నా నేను గొప్ప అని పోరాటం
వ్యంగ్య ప్రశ్నలతో పెట్టే ఇరకాటం
తేల్చుకో లేని సంసార జంజాటం
ఏమిటి ఈ లోకం - జజ్జనక జనారే
ఉండలేని ఈ వైనం - జజ్జనక జనారే
ముసుగులో నలుగుతున్న మమకారం
ధనంతో కమ్ముకుంటున్న అహంకారం
చదివానని ప్రతిదీ ఒప్పుకోక తిరస్కారం
చెప్పిందే వేదమని నమ్మమని ఘింకారం
ఏమిటి ఈ లోకం - జజ్జనక జనారే
ఉండలేని ఈ వైనం - జజ్జనక జనారే
నేటి పాట
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
ఓ చెలి.... ఒ ఓ చెలి... ఒ ఓ ఓచెలి.....
బిగి కౌగిలి అందించి ఓనామాలు నేర్పవా
ఓ చెలి ..... ఒ ఓ చెలి ..... ఒ ఓ ఓ చెలి
పలుకే బంగారాన్ని లింకు బెడితే కష్టమే
పిలుపే వయ్యారాన్ని లింకు బెడితే కష్టమే
వలపే శృంగారాన్ని లింకు బెడితే కఫ్టమే
తనువే తపిస్తుంటే పట్టించకోక పోతే కష్టమే
ఒ చెలి..... ఒ ఓ చెలి..... ఒ ఓ ఓ చెలి
బిగి కౌగిలి అందించి ఒనామాలు నేర్పవా
ఒ చెలి ..... ఒ ఓ చెలి .... ఒ ఓ ఓ చెలి
ఒ గిరి.... ఒ ఓ గిరి.......ఒ ఓ ఓ గిరి
ఈ కౌగిలి నీ సొంతమని తెలిసి యెగిరెగిరి పడతావా
ఒ గిరి ..... ఒ ఓ గిరి ..... ఒ ఓ ఓ గిరి
కష్టము నష్టము లేదులే,
ఇష్టము సోంతము అవునులే
పుత్తడి వత్తిడి వద్దులే
ఆకారములో ప్రేమ లేదులే
మమకారంలో ప్రేమ ఉందిలే
ఒ గిరి.... ఒ ఓ గిరి ..... ఒ ఓ ఓగిరి
ఒ చెలి .... ఒ ఓ చెలి ..... ఒ ఓ ఓ చెలి
చెరుకు తీపి రుచి చూడక పోతే నీకే
నష్టమే
బెరుకు తనంతో దూరంగా ఉంటే నీకే నష్టమే
గరుకు గా గుండెను మార్చు కుంటే ఇద్దరకీ నష్టమే
సరుకు ఉన్నప్పుడే తెలివితో సుఖబడపోతే నష్టమే
ఒ చెలి ..... ఒ ఓ చెలి .... ఒ ఓ ఓ చెలి
ఒ ఓ గిరి .....ఒ ఓ ఓ గిరి ..... ఒ ఓ ఓ గిరి
సంసార సుఖమలో నష్ట మనేది లేదులే
సంతాన వ్యయంలో నష్ట మనేది లేదులే
సౌభాగ్య మిచ్చుటలో నఫ్ట మనేది లేదులే
ఇద్దరం ఒక్కమాటపై ఉంటే అంతా ప్రేమలే
ఒ గిరి..... ఒ ఓ గిరి...... ఒ ఓ ఓ గిరి
ఒ చెలి..... ఒ ఓ చెలి..... ఒ ఓ ఓ చెలి
నేటి నాపాట
ప్రాంజలి ప్రభ.
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఒరేయ్ ఒరేయ్ పిచ్చి సన్యాసి
ఎందుకురా కష్ట పడతావ్
ఇతరులకు కోసం
నీవు కష్టపడదామన్నా
చేయ నివ్వరురా ఈ లోకం
పులి తోలు కప్పుకున్న మేకలురా
వెలుగు ఇవ్వని మిణుగురు పురుగులురా
చీకట్లో తిరిగే గబ్బిలాలురా
గుడ్లగూబ చూపులతో భయపెట్టేవారురా
ఒరేయ్ ఒరేయ్ పిచ్చి సన్యాసి
ఎందుకురా కష్ట పడతావ్
అరచేతిలో వైకుంఠం చుపిస్తారురా
ఆశలు తీరుస్తాము మమ్ము నమ్మమంటారురా
వినయ విధేయత చూపుతూ నమ్మ పలుకుతారురా
మంచిగా పల్కే ముసుగు కప్పుకున్న మూర్ఖులురా
ఒరేయ్ ఒరేయ్ పిచ్చి సన్యాసి
ఎందుకురా కష్ట పడతావ్
అన్నీఆధార్ అని లింక్ పెడుతున్నారురా
పెన్నుతో వ్రాయవద్దు కంప్యూటర్ లో చేయాలంటున్నారురా
అన్నీ రహస్యాలు విలువైనవి కంప్యూటర్లో ఉంచు తున్నారురా
కంప్యూటర్కీ లొంగి జీవం లేని మనుష్యులుగా మారు తున్నారురా
ఒరేయ్ ఒరేయ్ పిచ్చి సన్యాసి
ఎందుకురా కష్ట పడతావ్
ఇతరులకు కోసం
నీవు కష్ట పడదామన్నా
చేయ నివ్వరురా ఈ లోకం
మధస్సుతో పని లేదురా
ఆలోచించి వ్రాసే పని అంతకన్నా లేదురా
అంతా ట్రూ కాపీ కొట్టే స్థితికి వచ్ఛారురా
వైరస్ వస్తే విలువైనవి మాయమవు తాయిరా
జనాభా తక్కువ ఉన్న చోట పని కొస్తాయిరా
ఎక్కువ ఉన్నచోట వాడుట ఎందుకురా
మన కష్టార్జితం
ఇతరులకు ధారపోయుట ఎందుకురా
ఈ వ్యవస్థ ఇక మారదురా,
అదే అవసరమంటున్న ప్రభు త్వాలురా
నిన్ను నీవు మలచుకొని బతకాలిరా
ఉద్యోగాలకోసం తిరుగుబాటుచేసిన
ఫలితము లేదురా
క్షణంలో వచ్చే మాయా
యంత్రాలు చుట్టూ ధనం ఉందిరా
ధనం రాని, ప్రేమ లేని చోట
మొద్దు చాకిరీ చేస్తూ బ్రతకాలిరా
ఒరేయ్ ఒరేయ్ పిచ్చి సన్యాసి
ఎందుకురా కష్ట పడతావ్
ఇతరులకు కోసం నీవు కష్టపడదామన్నా
చేయ నివ్వరురా ఈ లోకం
--((*))--
నేటి పాట
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఇంతేనా మా జీవితం
మమ్ము గుర్తించే వారు లేరా
ఆదుకొని కూడు, గుడ్డ,
ఆశ్రమం, కల్పించేవారు లేరా
అభం శుభం తెలియని పసి కూనలం
అమ్మా నాన్న తెలియని పుడమి బిడ్డలం
ఆశా పాశములేని ప్రకృతి అనాధ పుత్రులం
ఆకలి తట్టుకొనే ఉండే చితికిన బతుకులం
ఇంతేనా మా జీవితం
మమ్ము గుర్తించే వారు లేరా
ఆదుకొని కూడు, గుడ్డ,
ఆశ్రమం, కల్పించేవారు లేరా
ఆదరణ కరువై భిక్షముపై ఆధార జీవులం
జక్కగా ఉన్నా సుబ్రములేని చిన్నారులం
వీధి వీధి తిరుగుతున్న దిక్కులేని ప్రాణులం
కాలవ వొడ్డున గుడిసెలలో వన్నెదగ్గిన బాలలం
తెగిన గాలిపటం వలే ఎగిరే ఎంగిలి ఇస్తరాకులం
ఇంతేనా మా జీవితం
మమ్ము గుర్తించే వారు లేరా
ఆదుకొని కూడు, గుడ్డ,
ఆశ్రమం, కల్పించేవారు లేరా
సూర్య కిరణాల వెలుగులే మాకు మార్గాలు
చంద్ర కిరణాల వెన్నెలే మాకు శయనాలు
చెట్ల ఫలాలు, గాలులు మాకు ఆహారాలు
పుడమి తల్లి మాకు నిత్యా నిత్య ఆశ్రమాలు
నీలి ఆకాశ పక్షులు మేఘాలే మాకు చుట్టాలు
మా బ్రతుకంతా నిత్య అగ్ని హోత్రాలు
ఇంతేనా మా జీవితం
మమ్ము గుర్తించే వారు లేరా
ఆదుకొని కూడు, గుడ్డ,
ఆశ్రమం, కల్పించేవారు లేరా
సూర్యుడు తూర్పునే ఉదయించు
నీరు అడ్డంకులు వచ్చిన పల్లమునకు జారు
చెట్ల గాలి సమస్త ప్రాణులను రక్షించు
పుడమితల్లి సమస్తము తనలో దాచు
పైవాటి ధర్మాలు మార్చే
వారు ఎవ్వరు లేరు
మమ్ము ఆదుకొనే వారు
అసలు ఈజగతి లో లేరా
ఇంతేనా మా జీవితం
మమ్ము గుర్తించే వారు లేరా
ఆదుకొని కూడు, గుడ్డ,
ఆశ్రమం, కల్పించేవారు లేరా
--((*))--
నేటి పాట
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఈ హృదయాన్ని మధు పుష్పంగా మార్చావు
ఓ మన్మధా తేనలనే తుమ్మెదవై తాగమంటా
తరుణం మించకుండా సంతోష పడమంటా .
నా వయసే ఉయ్యాలలా ఊగుతున్న వేళా
యవ్వన మంతా నీ పరమై దోచుకో మంటా
నా యదలో నీయద కలిపి సుఖపెట్టమంటా
సందేహమేళా ఈ మధు నీ సొంతమే నంటా
ఈ హృదయాన్ని మధు పుష్పంగా మార్చావు
ఓ మన్మధా తేనలనే తుమ్మెదవై తాగమంటా
తరుణం మించకుండా సంతోష పడమంటా .....
ఎన్నటికీ మారదు మన చిగురాకు బంధం
అది పెనవేసుకుపోయే నిత్య నూతన సుఘంధమ్
ప్రతి రోజు నిను చూసి చెలరేగి పోవాలి ఈ దేహం
నువ్వా నేనా అని పోటీ పడుతూ చెలరేగిపోదాం
ఈ హృదయాన్ని మధు పుష్పంగా మార్చావు
ఓ మన్మధా తేనలనే తుమ్మెదవై తాగమంటా
తరుణం మించ కుండా సంతోష పడమంటా .....
ఓ ప్రియా జడివానలా నన్ను చేరుకోవా
నా దాహం తీర్చి హాయిగా పవలించవా
నా సర్వస్వమ్ నీ సొంతం చేసుకొని పోవా
ఈ గుబాళింపు మధురాన్ని అందుకోవా
ఈ హృదయాన్ని మధు పుష్పంగా మార్చావు
ఓ మన్మధా తేనలనే తుమ్మెదవై తాగమంటా
తరుణం మించకుండా సంతోష పడమంటా .....
నే స్నానమాడి చుట్టుకొనే టవల్ నీవే ననుకుంటా
నా చీరలో చేరి గిలిగింతలు పెట్టే గాలి నీవే నంటా
నే సింగారించుకొనే వేళ వెనుక తట్టేది నీవే నంటా
ఓ సారివచ్చి కవ్వించి నవ్వించి వడి చేర్చుకోమంటా
ఈ హృదయాన్ని మధు పుష్పంగా మార్చావు
ఓ మన్మధా తేనలనే తుమ్మెదవై తాగమంటా
తరుణం మించకుండా సంతోష పడమంటా ..
--((*))--
నేటి నా పాట ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఓ మనిషి నీవు ఆటో ఇటో తేల్చుకో లేవురా
జగతికి ప్రాణం పోయుట ఇప్పటికీ నీవంతేరా
కాల గర్భంలో కలసిన వాటికి ఆలోచించకురా
కాలాన్ని ఎలా సద్వినియాగమొ గమనించురా
కాసుల కోసం వేటాడుట అసలు ఎందుకురా
కాంతామణి కి చిక్కి భాదను పంచుకోవటమేరా
ఓ మనిషి నీవు ఆటో ఇటో తేల్చుకో లేవురా
జగతికి ప్రాణం పోయుట ఇప్పటికీ నీవంతేరా
నీది నాదని వాదిస్తూ ఉండుటే జీవితమురా
నీకష్టం పరుల కోసమేనని తెలుసుకోలేవురా
నిన్ను నీవు తెలుసుకోనేటప్పటికీ రోగమవురా
నీ తిండి నీవు తినలేని పరిస్థితి వచ్చునురా
ఓ మనిషి నీవు ఆటో ఇటో తేల్చుకో లేవురా
జగతికి ప్రాణం పోయుట ఇప్పటికీ నీవంతేరా
వయసులో కష్టపడి విద్య ను గ్రహించాలిరా
వలపుకు చిక్కక విద్య ను పంచి బత కాలిరా
వయసు మార్పులో ఆశలు పెరిగి తిర్గునురా
విప్పుకొని కట్టుకొని నడుచుటయే జీవితమురా
ఓ మనిషి నీవు ఆటో ఇటో తేల్చుకో లేవురా
జగతికి ప్రాణం పోయుట ఇప్పటికీ నీవంతేరా
సూర్యుడిలా చంచరిస్తూ వెలుగుని పంచాలిరా
చంద్రుడిలా వెన్నెలిస్తూ చీకటి సుఖం నీదిరా
కత్రిమం జోలుకుపోక శాశ్వితమేదో తెలపాలిరా
క్షణికావేశానికి పొతే జీవితములే నాశనమవునురా
ఓ మనిషి నీవు ఆటో ఇటో తేల్చుకో లేవురా
జగతికి ప్రాణం పోయుట ఇప్పటికీ నీవంతేరా
--((*))--
నేటి పాట
ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
పరువాల పిల్లవు నీవు , పనసతొన లాగున్నావు
వజ్రంలా మెరిసావు, పక్కకు రమ్మన్నా రావు
యవ్వనాలా పిల్లోడ, యదపొంగులు చూసావు
యాతమేసి లాగుతున్నావు, పక్కకు రమ్మంటే రావు
కలువల కన్నుల్లో, కాంతులు మెరిసాయి
నిలువ లేకయే, నినుచేరి మెరవాలోయ్
పరదాలు తీసాను, మెరుపును చూపాను
పదిలంగా చూడమన్నాను, సరదాలు తీర్చుకోవోయ్
పరువాల పిల్లవు నీవు , పనసతొన లాగున్నావు
వజ్రంలా మెరిసావు, పక్కకు రమ్మన్నా రావు
యవ్వనాలా పిల్లోడ, యదపొంగులు చూసావు
యాతమేసి లాగుతున్నావు, పక్కకు రమ్మంటే రావు
వరదాయే మురిపాలు, వంపులే తాకగా
కరువంతా తీరాలి, సర్దుమణిగాక రావాలోయ్
బ్రతుకంతా నీతోనోయ్, బాధను తీరాస్తానుగా
కరువంతా తీరుస్తా సర్దుమణిగాక రావాలోయ్
పరువాల పిల్లవు నీవు , పనసతొన లాగున్నావు
వజ్రంలా మెరిసావు, పక్కకు రమ్మన్నా రావు
యవ్వనాలా పిల్లోడ, యదపొంగులు చూసావు
యాతమేసి లాగుతున్నావు, పక్కకు రమ్మంటే రావు
అనురాగ మది పొంది, ఆనందం అనుభ విస్తావు
అపరంజి బొమ్మవై, ఆకలి తిర్చగా రావోయ్
హృదయాన్ని పెనవేసుకోవోయ్ ఆకలి తీర్చుకోవోయ్
అందరూ నిదురించాక ఆవాసాలు తీర్చుకోవోయ్
పరువాల పిల్లవు, పనసతొన లాగున్నావు
పటికలా మెరిసావు, పక్కకు రమ్మన్నా రావు
యవ్వనాలా పిల్లోడ, యదపొంగులు చూసావు
యాతమేసి లాగుతున్నావు, పక్కకు రమ్మంటే రావు
--((***))--
నేటి పాట
పంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
ఓ మనిషి తెలుసుకో - నీ మనసే మార్చుకో
ఈ కలి కాలంలో - నీవు ఒక పావుగ మారిపో
మంచికి రోజులు ఎంతో కష్టం
కష్టానికి ఫలితం మరీ నష్టం
నష్టాల జీవితం కడు దుర్భరం
దుర్భరం బ్రతుకే కొందరికి ఇష్టం
ఓ మనిషి తెలుసుకో - నీ మనసే మార్చుకో
ఈ కలి కాలంలో - నీవు ఒక పావుగ మారిపో
నమ్మితే కాలం నీ చుట్టూ
చుట్టూ ఉన్నారని చేయకు తక్కువ
తక్కువ ఎక్కువ కాదు ఉండాలి మక్కువ
మక్కువలోనే ఉన్నది అసలైన ఇష్టం
మక్కువలోనే ఉన్నది అసలైన ఇష్టం
ఓ మనిషి తెలుసుకో - నీ మనసే మార్చుకో
ఈ కలి కాలంలో - నీవు ఒక పావుగ మారిపో
చెమట పట్టే దాకా కష్ట పడు
పడుతూ లేచిన తినేది గుప్పెడు అన్నం
అన్నం తిని మనిషి రోడ్డున పడు
రోడ్డు అనగా మరొకరికోసం కష్టమే ఇష్టం
ఓ మనిషి తెలుసుకో - నీ మనసే మార్చుకో
ఈ కలి కాలంలో - నీవు ఒక పావుగ మారిపో
ఈ కలి కాలంలో - నీవు ఒక పావుగ మారిపో
చుక్కాని లేని పడవ బతుకు
బతుకే గాలి వాటంగా జరుగు
జరిగిన కొద్దీ అసలుకు తెచ్చు ముప్పు
ముప్పు వచ్చినా తప్పు చేసినా తప్పదు ఇష్టం
ఓ మనిషి తెలుసుకో - నీ మనసే మార్చుకో
ఈ కలి కాలంలో - నీవు ఒక పావుగ మారిపో
ఈ కలి కాలంలో - నీవు ఒక పావుగ మారిపో
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కందిచేను వద్ద కనిపిచ్చి
కన్ను కన్ను కలిపి అంతలో మాయమయ్యావే పిల్లా
గట్టుమీద కన్నె లేడిలా గంతులు వేసి
కుందేలులా పరుగులు తీసి
నామనసు ఉడికించావు
మనసు కలిపి నా హృదయాన్ని దోచావు
నీ రూపు చూసి వచ్చానే
వచ్చేరోజు వస్తే అన్ని ఇస్తాలే
నీ పాట చూసి మెచ్చానే
పాటకు పాట పాడి మురిపిస్తాలే
ఊరించుతూ, ఉడికించుతూ
ఊయల్లో ఊగుతూ, వేధించటం న్యాయమా .....
కాటు వేసే మోటు సరసంతో
మతి పోగొట్టి మత్తులో దించుట న్యాయమా ....
కన్నె కుసుమంతో కన్ను గీటితే
తేనెళూరు పెదవులు తిప్పుట న్యాయమా
కమ్ముకున్న పొంగులు చూపుతూ
అందాన్ని ఆదుకోమని ఆరాటం న్యాయమా ......
వలపు వానలో వయసు తడిసీ
వరద పొంగుల్లా చుట్టుకోమంటం న్యాయమా....
కోరికలతో ఉర్రుత లూగుతూ
ఏరువాక లాగా సాగి రమ్మంటం న్యాయమా.........
జామురాతిరి జాబిలమ్మవు
జోలపాడగా అశతీర్చుటకు వచ్చుట న్యాయమే
తారలను మెరిపించే తారవు నీవు
నీ తమకం తగ్గించుటకు వచ్చుట న్యాయమే
కందిచేను వద్ద కనిపిచ్చి
కన్ను కన్ను కలిపి
కన్నె లేడిలా గంతులులువేసి
కుందేలులా పరుగులు తీసి
నామనసు ఉడికించావు
మనసు కలిపి నా హృదయాన్ని దోచి
నాకు న్యాయం చేయుట న్యాయమే
--((*))--
నేటి పాట
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
ఓ మనిషీ నిన్ను నీవు తెలుసుకో
నీలో ఉన్న పరమాత్మను తలచుకో......2
కాలాన్ని సద్వినియోగ పరుచుకో
నిజాయితీగా జీవించుట నేర్చుకో
తక్కువ మాటలు మాట్లాడుట నేర్ఛుకో
ఎక్కువ వినుట అలవాటు చేసుకో
చెమట నీరుచిందించి నుదుటి రాత మార్చుకో
మార్ఛ లేనిది ఏదీ లేదని గుర్తించుకో
మమత పంచి మానవత్వాన్ని నిలుపుకో
ప్రేమను పంచి బ్రతుకుట నేర్చుకో
సుఖదు:ఖాల నిలయమని తెలుసుకో
పట్టు విడుపులు గల సంసారంగా మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
మన: శాంతికి ఏమార్గమో తెలుసుకొని నడుచుకో
ఓ మనిషీ నిన్ను నీవు తెలుసుకో
నీలో ఉన్న పరమాత్మను తలచుకో...2
--((*))--
నేటి గీతం
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఒక తగినివాడు ఈ విధముగా ఉంటాడో
కవితద్వారా చెప్పదలిచాను
నాకు దారీ లేదు,
నాకు ఇల్లు లేదు
నా ఆటాకు ఎదురు లేదు,
నా మాట నిజము మారదు
నువ్వు నేను ఒకటే లె (బాటిల్ పట్టుకొని )
నిన్ను నేను త్రాగుతాలె ,
నాలో చేరి నన్ను నీవు త్రాగుతావు లె కవితా
నాలోనువ్వు సగమే లె
నాకష్టార్జితం సగం నీకే ధార పోసాలె
ఒక్క రోజు సంతోష సగము బ్లు లె
నా వళ్ళు గుల్ల ఎందుకు చేసావ్ లె
నాపెళ్లానికి దూరంగా ఎందుకుంచావ్ లె
ఎంత త్రాగిన మళ్ళీ రంమంటావ్ లె
పెళ్ళాం చీదరించుకున్నా నీవు చీదరించుకోవ్ లె
అందుకే నాకు బీజానివి నువ్వే లె
మనసు మనసు కలిసెను లె
రంగు రంగు కలిసెను లె
తడబడ్డా ఇది నిజము లె
నేను వలకు చిక్కిన ఎరను లె
నా బతుకు ఇక ఇంతే లె
మమతల పందిరి వేసెను లె
స్నేహితులతో సరదా తీరును లె
పరిమళ సుమమై పూచెనులె
నా మనసు ఒళ్ళు దోచను లె
ఇది ప్రభుత్వము వారి పుణ్యము లె
మనసు చెడిన వానికి ఇది ప్రాణ వాయువు లె
వయసు మళ్లినవానికి ఇది ఆయుధము లె
కోరికలు తీర్చుకొనే వానికి ఇది గమ్మత్తు లె
తీగపై పువ్వులా కన్పించి ఇక రాలును లె
నాకు దారీ లేదు,
నాకు ఇల్లు లేదు
నా ఆటాకు ఎదురు లేదు,
నా మాట నిజము మారదు
అప్పుడే పెళ్ళాం వచ్చి ఈ విధంగా పాడింది
లె మత్తు వదలరా,
నీవు మత్తులో చిత్తై గమ్మత్తులు చేస్తావు రా
మానకపోతే వళ్ళు గుల్లయ్ సర్వం నాశనమౌనురా
కళ్లుతెరవరా, నిజం తెలుసుకోరా,
నిన్ను నమ్మినవారిని ముంచకురా,
ఇది మానరా, మానితే అంతా సుఖమేరా
--((*))--
ఈ గీతం పై మీ అభిప్రాయాలు వ్రాయండి, నచ్చితే షేర్ చెయ్యండి
నేటి గీతం
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఓ చిలక ఇక నా వెంట పడకు
నీదైర్యం, నీ ఓర్పు నాకు లేవు
నన్ను నేనేనుగా ఒకరికి చిక్కా
ఓ చిలక ఇక నా వెంట పడకు
మాయను ఎదిరించే శక్తి నాకు లేదు
ఆత్మను రక్షించుకొనే శక్తియును లేదు
కాల చక్రాన్ని గమనించి నడిచే శక్తి లేదు
చిలకపలుకులు చిన్మయ రూపానికి చిక్కా
మనుష్యుని ప్రాణం ఏ చిలక యందు లేదు
వెన్నలా కరిగే లీలా ఘనతకు చిక్కితే చాలు
మానసోల్లాసమై హొయలుకు చిక్కి, సొబగుతో
తన్ను తాను మరచి తన్మయత్వానికి చిక్కా
ఆత్మ అదృష్టమో, పరమాత్మ అదృష్టమో
కయ్యమునకు చిక్కక, వియ్యము పొంది
నిత్యమూ జ్ఞానమనే గ్రాసం ను గ్రహించి
అజ్ఞానాన్ని తొలగించే విఙ్నానానికి చిక్కా
కల్ముష రహితునిగా, ప్రేమ అనే పంజరంలో
అనురాగం, ఆత్మీయత, బంధమనే చువ్వలమధ్య
ఉయ్యాలమీద ఊహల కందని సుందరితో
హాయిని, అనుభూతిని, పొందుటకు చిక్కా
నెయ్యమునకు ఆ పరమాత్మ అండ అవసరం
మన:శాంతికి, మనుగడకు, స్పర్సతాపము అవసరం
చిరునగవు తోడైతే చిత్ర విచిత్రాలు చూడుట అవసరం
రాధా కృష్ణులులాగా అనురాగ బంధానికి చిక్కా
ఓ చిలక ఇక నా వెంట పడకు
నీదైర్యం, నీ ఓర్పు నాకు లేవు
నన్ను నేనేనుగా ఒకరికి చిక్కా
ఓ చిలక ఇక నా వెంట పడకు
--((*))--
నేటి గీతం
ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ఓ రాధా " నీ నవ్వులు నాకే సొంతం "
నా యవ్వన మంతా " నీకే సొంతం "
నీ మూగ ప్రేమ "నాకే సొంతం "
నా ఘాటు ప్రేమ "నీకే సొంతం "........ ౨
ఓ రాధా ... రాధా ..... రాధా
ఆహా చల్లని గాలి తన్మయ పరుస్తున్నది
పున్నమి వెన్నెలను కురిపిస్తున్నది
మదిలో కోరిక నిను రా రామ్మంటున్నది
చెక్కిట సిగ్గులు పంచుకోవాలంటున్నది
ఓ రాజా నీ నవ్వులు నాకే సొంతం
నా యవ్వన మంతా నీకే సొంతం
నా మూగ ప్రేమ నీకే సొంతం
నా ఘాటు ప్రేమ నీకే సొంతం ........ ౨
సిగలో పువ్వులు నిను పిలుస్తున్నవి
మది తలుపులు ఆహ్వనిస్తున్నవి
సరసానికి సరిగమలు పల్కమన్నవి
రసమయి జగతికి ప్రాణాన్ని ఇద్దామన్నవి
ఓ రాధా నీ నవ్వులు నాకే సొంతం
నా యవ్వన మంతా నీకే సొంతం
నీ మూగ ప్రేమ నాకే సొంతం
నా ఘాటు ప్రేమ నీకే సొంతం ........ ౨
రసమయ ప్రకృతి పిలుస్తున్నది
ఈ మనసుకు ఇక అడ్డు అనవసరం
ఎదపొంగులు కలుపుకుంటూ జీవిద్దాం
ఓ రాజా నీ నవ్వులు నాకే సొంతం
నా యవ్వన మంతా నీకే సొంతం
ఓ రాజా ఈ పువ్వులు నీకే సొంతం
నా యవ్వన మంతా నీకే సొంతం
రాధా రాధా .... రాజా ... రాజా ..... లా లా ....... లా లా,,,,, లా లా ..
--((*))--
01. నేటి నేటి గీతం
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
నవ మోహిని రూపంలో కదిలిరా
నవరత్న వెలుగులతో కదలిరా
సుఘంద పరిమళాలతో కదలిరా
మనసుని రంజింప చేయుటకు కదలిరా
పరువం పదిలంగ గాలికి కదలాలి - చూపులన్నీ తరుణంతో కదలాలి
కురులు దొన్నె దొన్నెలుగా కదలాలి - సౌకుమార్యం తో మనసు కదలాలి
కుచ కుంభముల పట్టు కదలాలి - అధరంబులు అదిరిస్తూ కదలాలి
విధిశివాదులొచ్చి కదలాలి - కిరీటకోటి కాంతులు కదలాలి
నవ మోహిని రూపంలో కదిలిరా
నవరత్న వెలుగులతో కదలిరా
సుఘంద పరిమళాలతో కదలిరా
మనసుని రంజింప చేయుటకు కదలిరా
ఇంద్రుని వేయి కళ్ళు కదలాలి - తరువుల శాఖలు కదలాలి
వజ్రవైడూర్య వెలుగు కదలాలి - కర్పూరం భగ్గుమని కదలాలి
నింగి మేఘాలు అన్నీ కదలాలి - చకోర పక్షుల గుంపు కదలాలి
పృథ్వి పులక రింపుకే కదలాలి - పుప్పెడి రేణువులన్నీ కదలాలి
నవ మోహిని రూపంలో కదిలిరా
నవరత్న వెలుగులతో కదలిరా
సుఘంద పరిమళాలతో కదలిరా
మనసుని రంజింప చేయుటకు కదలిరా
కదులుతూ సౌందర్యాన్ని చూపి కదలాలి - నిన్ను చూస్తె రెప్ప వాల్చక నా మనసు కదలాలి
తుషార బిందువులు చుట్టూ కదలాలి - నీ మనసు నా మనసు ఒక్కటై కదలాలి
నవ మోహిని రూపంలో కదిలిరా
నవరత్న వెలుగులతో కదలిరా
సుఘంద పరిమళాలతో కదలిరా
మనసుని రంజింప చేయుటకు కదలిరా
రా రా అంటూ ఆ ప్రేమ పిపాసి పాడగా - ఆమె నాట్య మాడలేక తన్మయత్వం ఒరగగా
--((*))--
02. నేటి గీతం
రచయాత మల్లాప్రగడ రామకృష్ణ
నవ్వంటే నాకిష్టం - నవ్వులలో తేలిపోతాను
పువ్వంటే నాకిష్టం - పువ్వులలో నలిగిపోతాను
రవ్వంటే నాకిష్టం - కన్నులల్లో కరిగి పోతాను
మువ్వంటే నాకిష్టం - శబ్దాలతో మరచి పోతాను
మరి నేననంటే నీకిష్టం లేదా
ఎందుకు లేదూ ఇంత ఉంది
మరి చూ పించు చూద్దాం
నేచూపిస్తే నీవు తట్టుకోలేవ్ పడిపోతావ్
కోతలెన్ని కోస్తావురా కొంటేవాడ
కోరుకున్న చినదాన్ని మరిచేవాడ
కోమలత్వాన్ని విడిచిన వాడ
కోకచుట్టు తిరుగక తెరిగే వాడ
ఎం చూపిస్తావ్ , ఎలా చూపిస్తావ్
నీలో ఉన్న ప్రేమను చూపలెవ్
నీలో ఉన్న మమతను చూపలేవ్
నీలో ఉన్న ఇగో నూ చూపలేవ్
నవ్వంటే నాకిష్టం - నవ్వులలో తేలిపోతాను
పువ్వంటే నాకిష్టం - పువ్వులలో నలిగిపోతాను
రవ్వంటే నాకిష్టం - కన్నులల్లో కరిగి పోతాను
మువ్వంటే నాకిష్టం - శబ్దాలతో మరచి పోతాను
నువ్వుంటే నాకు నరకం - కష్టాలలో మునిగి పోతాను
నువ్వుంటే నాకు కోపం - కోపంతో తిట్టి పోస్తాను
నువ్వుంటే నాకు ప్రేమ - ప్రేమ ఇవ్వలేక చస్తాను
నువ్వుంటే నాకు మోసం - నా ప్రేమకు అడ్డు పడతావని
సవ్వడి చేయక సరసమాడు
నవ్వితే నలుగురుతో అనుకరించు
కవ్వించి కసి తీర అనుభవించు
మువ్వలో మువ్వలా ఆడించు
కవ్వముతో గుండెను చిలికి వేయ్
జవ్వనిగా జగడ మాడి గేలి చేయ్
రవ్వ నిప్పు కంటిని మార్చి వేయ్
నువ్వు నువ్వుగా ప్రేమను పంచేయ్
నవ్వంటే నాకిష్టం - నవ్వులలో తేలిపోతాను
పువ్వంటే నాకిష్టం - పువ్వులలో నలిగిపోతాను
రవ్వంటే నాకిష్టం - కన్నులల్లో కరిగి పోతాను
మువ్వంటే నాకిష్టం - శబ్దాలతో మరచి పోతాను
--((*)--
నేటి గీతం
ప్రాంజలి ప్రభ
03. రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నామాట, నీ పాట నా హృదయంలో వేటా
నాస్నేహం నీ వైనం నా మౌనంలో వాటా
నిన్నే వలచా, నిన్నే కోరా, నీవే దిక్కన్నది, చిన్నది
నన్నే చూడు, నన్నే కూడు, నీదే నా ప్రేమ, అన్నది
నన్ను నేను మరవక, నిన్ను నేను వదలలే, నన్నది
నన్నైనను. నిన్నైనను, కలపాల్సినది, దైవ మన్నది
నామాట, నీ పాట, నా హృదయంలో వేటా
నాస్నేహం, నీ వైనం, నా మౌనంలో వాటా
నిన్న నన్ను మెన్ను మన్ను సాక్షిగా, కలవ మన్నది
నన్ను నమ్ము మేను నుద్దరించే, సౌందర్యమున్నది
నీ వేడికి, నామేను నవ నీతం లా కరిగి, పోవా లన్నది
నిన్నోదిలి నన్ను నేను మరువలేను, అన్నది చిన్నది
నామాట, నీ పాట, నా హృదయంలో వేటా
నాస్నేహం, నీ వైనం, నా మౌనంలో వాటా
నా నామము నీ నామము, సీతా రామ మన్నది
నీ మనసు నా మనసు, ఏకీకృతమై యున్నదన్నది
నీ ప్రేమ నా ప్రేమ సంతృప్తి, సమ భావాలన్నది
నా దొండ పండు రంగు నీ కాకిరంగుకు, జోడన్నది
నామాట, నీ పాట నా హృదయంలో వేటా
నాస్నేహం నీ వైనం నా మౌనంలో వాటా
--(())--
04. ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
గంటలు గణ గణ మ్రోగే - గుండెలు దడ దడ లాడే
కాలుష్యంతో శ్వాస తగ్గే - శబ్దములతో వయసే మ్రింగే
ఏమిటి ఈ లోకం - ఎప్పుడు మారును ఈ లోకం
ఇదియేనా స్వర్గ లోకం - కాదు కాదు ఇది నరక లోకం
కులాలలో, మతాలలో ప్రతి ధ్వని
వలపులో, ధనములో ప్రతి ధ్వని
ప్రేమలో, స్నేహములో ప్రతి ధ్వని
తండ్రిలో, తల్లిలో ప్రతి ధ్వని
ఎడారులలో, సముద్రాలలో ప్రతి ధ్వని
అడవులలో, మానవులలో ప్రతి ధ్వని
మంచి చడులలో, పుట్టి గిట్టుటలో ప్రతి ధ్వని
గంటలు గణ గణ మ్రోగే - గుండెలు దడ దడ లాడే
కాలుష్యంతో శ్వాస తగ్గే - శబ్దములతో వయసే మ్రింగే
ఏమిటి ఈ లోకం - ఎప్పుడు మారును ఈ లోకం
""ఇదియేనా ""స్వర్గ లోకం - కాదు కాదు ఇది నరక లోకం
కార్యాలయములో, కారాగృహములో ప్రతి ధ్వని
శృంగారంలో, బిడియములో ప్రతి ధ్వని
దేవుని గుడిలో, విద్యార్థుల బడిలో ప్రతి ధ్వని
నీహృదయములో, నాహృదయములో ప్రతిధ్వని
ఉల్లాసములో, ఉద్రేకములో ప్రతి ధ్వని
విశ్వాసములో, ఉన్మాదములో ప్రతి ధ్వని
అనురాగములో, ఆర్భాటములో ప్రతి ధ్వని
గంటలు గణ గణ మ్రోగే - గుండెలు దడ దడ లాడే
కాలుష్యంతో శ్వాస తగ్గే - శబ్దములతో వయసే మ్రింగే
ఏమిటి ఈ లోకం - ఎప్పుడు మారును ఈ లోకం
ఇదియేనా స్వర్గ లోకం - కాదు కాదు ఇది నరక లోకం
రాజకీయములో, రాజీ వ్యయములో ప్రతి ధ్వని
భయములో, అభయములో ప్రతి ధ్వని
క్రోధములో, శాంతిమయంలో ప్రతి ధ్వని
పండితులలో పామరులలో ప్రతి ధ్వని
గంటలు గణ గణ మ్రోగే - గుండెలు దడ దడ లాడే
కాలుష్యంతో శ్వాస తగ్గే - శబ్దములతో వయసే మ్రింగే
ఏమిటి ఈ లోకం - ఎప్పుడు మారును ఈ లోకం
ఇదియేనా స్వర్గ లోకం - కాదు కాదు ఇది నరక లోకం
--((*))--
05. నేటి గీతం (ఛందస్సు (కుసుమవిచిత్రా )ప్రాంజలి ప్రభ
ఏమని చెప్పేది
ఎలా చెప్పేది ఓ మానవా
లోకం తీరు ఇంతేనని ఎలాచెప్పేది
నయనము సాగే - పదములు రాలే
ఉరుములు మెర్సే - తరువులు ఊగే
పిడుగులు వచ్చే - పవనము వీచే
సమయము రాకే - కలయను నమ్మే
అణుకువ లేకే - మనుగడ చెడే
చమటలు పట్టనులే
ఏమని చెప్పేది
ఎలా చెప్పేది ఓ మానవా
లోకం తీరు ఇంతేనని ఎలాచెప్పేది
తరుణము మించే - కరములు ఊపే
వయసును దాచే - వలపును పెంచే
సొగసును చూపే - నడుమును ఊపే
కురులను తిప్పే - వలువలు సద్దే
అనుకువగ ఉండే - అనుకరణ చేసే
మనసును ఆర్పించెలే
ఏమని చెప్పేది
ఎలా చెప్పేది ఓ మానవా
లోకం తీరు ఇంతేనని ఎలాచెప్పేది
యువతకు నేర్పూ - వనితకు ఓర్పూ
వయసుకు మార్పూ - తరువుకు దోస్తూ
మనసుకు ప్రేమా - తనువుకు శీలం
కధలకు మూలం - చరితకు గానం
కళలకు సాయం - కలువకు అందం
మధురిమ భావాలులే
ఏమని చెప్పేది
ఎలా చెప్పేది ఓ మానవా
లోకం తీరు ఇంతేనని ఎలాచెప్పేది
మరిచెను ప్రేమా - అవధులు మారే
తలవని గుర్తే - పిలవని మాయా
కొడుకుల తీరే - కలియుగ సేవా
మమతలు మారే - మనుగడ మారే
తపనలు తీరే - తనువులు సాగే
భయమును పెంచేనులే
ఏమని చెప్పేది
ఎలా చెప్పేది ఓ మానవా
లోకం తీరు ఇంతేనని ఎలాచెప్పేది
ఈ లోకం తీరు ఇంతేనని ఎలాచెప్పేది
--((*))--
06. నేటి నాపాట
ప్రాంజలి ప్రభ
చలి చలి గా ఉన్నది - చల్లగాలేస్తున్నది
జిల్ జిల్ గా ఉన్నది - జిల్లుమంటున్నది
తుంటరి గాలికి ఊహలు - ఉయ్యాలూగుతూ ఉంటె
కొంటెపిల్ల గాలికి ఆశల - ముంగురులు నలుగుతూ ఉంటె
వెచ్చని ఊపిరి కలల - గుసగుసలైయ్ పిలుస్తూ ఉంటె
నచ్చిన తనువు తపనలు - మల్లి మల్లీ పిలుస్తూ ఉంటె
చలి చలి గా ఉన్నది - చల్లగాలేస్తున్నది
జిల్ జిల్ గా ఉన్నది - జిల్లుమంటున్నది
అల్లరి పిల్ల తెమ్మరులు - సుఘంధ పరిమళాలై
ఉల్లము జల్లు తుంపరులు - సుమధురములై
పల్లము జారు నురుగులు - పద పదా గుసలై
చిల్లరగా కమ్మే సొగసులు - చిరునవ్వుల సిగలై
చలి చలి గా ఉన్నది - చల్లగాలేస్తున్నది
జిల్ జిల్ గా ఉన్నది - జిల్లుమంటున్నది
చామంతి కదలికలు - మమతలు వెల్లువై
పూబంతి పదనిసలు - ముద్దుల వెల్లువై
గులాబీ గుసగుసలు - చిందులు వెల్లువై
జిలేబి తీపి గుర్తులు - తపనలు వెల్లువై
చలి చలి గా ఉన్నది - చల్లగాలేస్తున్నది
జిల్ జిల్ గా ఉన్నది - జిల్లుమంటున్నది
--((*))--
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
07. నేటి పాట
కందిచేను వద్ద కనిపించి
కన్ను కన్ను కలిపి
కన్నె లేడిలా గంతులులు వేసి
కుందేలులా పరుగులు తీసి
నామనసు ఉడికించావు
మనసు కలిపి నా హృదయాన్ని దోచావు
నీ రూపు చూసి వచ్చానే
వచ్చేరోజు వస్తే అన్ని ఇస్తాలే
నీ పాట చూసి మెచ్చానే
పాటకు పాట పాడి మురిపిస్తాలే
ఊరించుతూ, ఉడికించుతూ
ఊయల్లో ఊగుతూ, వేధించటం న్యాయమా .....
కాటు వేసే మోటు సరసంతో
మతి పోగొట్టి మత్తులో దించుట న్యాయమా ....
కన్నె కుసుమంతో కన్ను గీటితే
తేనెళూరు పెదవులు తిప్పుట న్యాయమా
కమ్ముకున్న పొంగులు చూపుతూ
అందాన్ని ఆదుకోమని ఆరాటం న్యాయమా ......
వలపు వానలో వయసు తడిసీ
వరద పొంగుల్లా చుట్టుకోమంటం న్యాయమా....
కోరికలతో ఉర్రుత లూగుతూ
ఏరువాక లాగా సాగి రమ్మంటం న్యాయమా.........
జామురాతిరి జాబిలమ్మవు
జోలపాడగా అశతీర్చుటకు వచ్చుట న్యాయమే
తారలను మెరిపించే తారవు నీవు
నీ తమకం తగ్గించుటకు వచ్చుట న్యాయమే
కందిచేను వద్ద కనిపిచ్చి
కన్ను కన్ను కలిపి
కన్నె లేడిలా గంతులులువేసి
కుందేలులా పరుగులు తీసి
నామనసు ఉడికించావు
మనసు కలిపి నా హృదయాన్ని దోచి
నాకు న్యాయం చేయుట న్యాయమే
--((*))--
08. ప్రాంజలి ప్రభ
నాన్నా నీకు ఏమీ తెలియదు అన్న మాటకు
పౌరుషంతో మీసం తిప్పుతూ
ఎవరు, ఎవరన్నారు .. నాకు తెలివి లేదని
మంచి- చెడు మధ్య నలిగి పోతున్నాని
ఈ వయసులో పనికి రారన్న ... వారితో
అంటాను నన్ను ఉపయోగించు కోలేని
వారే .. చాతకాని వా .... రని, చాతకాని వా .... రని,
శక్తి కొరకు మధువు త్రాగుతున్నా
ప్రపంచాన్ని చుట్టివచ్చే శక్తితో ఉన్నా
కడలిని ఈదే ధైర్యంతో బ్రతుకుతున్నా
నా ఆలోచనలతో ప్రజలకు సేవలు చేస్తున్నా
ఎవరు, ఎవరన్నారు నాకు తెలివి లేదని
మంచి చెడు మధ్య నలిగి పోతున్నాని
కవితా శక్తితో సంతోషాన్నిఅందిస్తున్నా
పకృతి బట్టి కష్ట సుఖాలు హెచ్చరిస్తున్నా
నాడిని బట్టి రోగులకు మందు లిస్తున్నా
సేవా పదంలో వయసును చూడక సేవ చేస్తున్నా
ఎవరు, ఎవరన్నారు నాకు తెలివి లేదని
మంచి చెడు మధ్య నలిగి పోతున్నాని
గాలిలా ప్రజలలో స్వాసగా ఉంటున్నా
తరువులా ఒంటరినై సహకరిస్తున్నా
మనసంతా ప్రేమ నింపుకొని జీవిస్తున్నా
స్త్రీలను అగౌరపరిచే వారిని ఎదిరిస్తున్నా
ఎవరు, ఎవరన్నారు నాకు తెలివి లేదని
మంచి చెడు మధ్య నలిగి పోతున్నాని
ఈ వయసులో పనికి రారన్న వారితో
అంటాను నన్ను ఉపయోగించు కోలేని
వారే చాతకాని వారని
వారే చాతకాని వారని
వారే చాతకాని వారని
ఎవరు, ఎవరన్నారు నాకు తెలివి లేదని
--((*))--
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఓ హో రోజా...... రోజా ..... రోజా.....
నీమీద నాకుంది ఇంకా...... ఇంకా .... మోజూ.....
తినిపించవా నాకు ...... నాకు ...... కాజా
నీ చుట్టు తిరుతున్నానని ఏంతో ..... ఫోజూ .....
ఓ హో రోజా.... రోజా ..... రోజా....
ఓ హో రాజా.... రాజా.... రాజా....
నీలో ఏముంది ఆశ తప్ప అంతా బూజూ ....
తినిపించలేను నీకు.... నీకు.... కాజా
నీతో ప్రేమగా ఉన్నానని ఏంతో.... ఫోజూ ....
ఓ హో రాజా... రాజా... రోజా
ఓ హో రోజా రోజా రోజా
నీలో ఉన్న అణువంత ప్రేమ పంచు రోజూ.... రోజూ ....
నీవు నాకు చల్ల చల్లని నీటి కూజా....
నాలో ఉన్న దప్పిక తీర్చవా రోజూ .... రోజూ ...
ఓ హో రోజా రోజా రోజా
ఓ హో రాజా.... రాజా... రాజా....
నాలో ఉన్న ప్రేమంతా నీకె అందిస్తా రోజూ.... రోజూ ....
నీవు నాకు తియ్య తియ్యని నీటి కాజా......
నీలో ఉన్న దప్పిక తీరుస్తా రోజూ.... రోజూ ....
ఓ హో రాజ రాజ రోజా
ఆహా ఓహో ఎంతటి సుదినం ఈ రోజు
ఔను ఆహా ఓహో ఎంతటి సుదినం ఈరోజు
ఓ హో రోజా రోజా రోజా
నీమీద నాకుంది ఇంకా ఇంకా మోజూ
ఓ హో రాజ రాజ రాజా
ఔను నీమీద నాకుంది ఇంకా ఇంకా మోజూ
--((*))--
10. నేటి నాపాట - ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
(ఆశ్రమంలో " స్త్రీ పురుషులలో ఎవరు గొప్ప" గురించి శిష్యుడు గురువుని అడుగగా, చెప్పిన పాట సమాధానము )
తక్కువ చేసి చూడకూ,
ఎక్కువ చేసి మాట్లాడకూ,
మక్కువ చేసి అతిగా ప్రేమించకూ,
ప్రకృతి ననుసరించి ప్రేమించటం నేర్చుకో
ఓం శిష్యా, ఓం శిష్యా
ఓం గురువా, ఓం ఓం ఓం గురువా
స్త్రీ అంటే ప్రగతి, జగతి జాగృతి
పురుషుడంటే జ్యోతి, జగతికి దివ్య జ్యోతి
స్త్రీ అంటే మాతృ మూర్తి, మానవతా మూర్తి
పురుషుడంటే స్నేహసహకార ఆదర్శ మూర్తి
తక్కువ చేసి చూడకూ,
ఎక్కువ చేసి మాట్లాడకూ,
మక్కువ చేసి అతిగా ప్రేమించకూ,
ప్రకృతి ననుసరించి ప్రేమించటం నేర్చుకో
ఓం శిష్యా, ఓం శిష్యా
ఓం గురువా, ఓం ఓం ఓం గురువా
చిరునవ్వుల సొగసు స్త్రీ సహజ స్వభావం
మాటల్లోన నవ్వుల్లో వికసించే పురుష హావాభావం
బడబగ్నినైన చల్లబరిచే హృదయం ఆడతనం
నిత్యమూ సవాళ్ళను ఎదుర్కోవడం మగతనం
తక్కువ చేసి చూడకూ,
ఎక్కువ చేసి మాట్లాడకూ,
మక్కువ చేసి అతిగా ప్రేమించకూ,
ప్రకృతి ననుసరించి ప్రేమించటం నేర్చుకో
ఓం శిష్యా, ఓం శిష్యా
ఓం గురువా, ఓం ఓం ఓం గురువా
నలిగిన వేల వివేకం చూపే స్త్రీ తత్త్వం
విజ్ఞతతో ఆదుకొనే సహజ పురుష తత్త్వం
బ్రతుకు తెరువు నిత్య పోరాటం స్త్రీ మయం
సంపాదన, మమకారపు ఆరాటం పురుషమయం
మక్కువ చేసి అతిగా ప్రేమించకూ,
ప్రకృతి ననుసరించి ప్రేమించటం నేర్చుకో
ఓం శిష్యా, ఓం శిష్యా
ఓం గురువా, ఓం ఓం ఓం గురువా
స్త్రీ పురుషులలో ఉండు మానవత్వం
స్త్రీలో చక్కని సౌందర్యం గల ఆకృతి
పురుషుల్లో చాతుర్యం గల ఆకృతి
కష్ట నష్టాలలో జీవనయానం సమానం
కనుక ఓ శిష్య ఎవరికి ఎవరు తక్కువ కాదు
ఇరువురి అవసరము ప్రకృతి పరం
తక్కువ చేసి చూడకూ,
ఎక్కువ చేసి మాట్లాడకూ,
మక్కువ చేసి అతిగా ప్రేమించకూ,
ప్రకృతి ననుసరించి ప్రేమించటం నేర్చుకో
ఓం శిష్యా, ఓం శిష్యా
ఓం గురువా, ఓం ఓం ఓం గురువా
ఓం శిష్యా, ఓం శిష్యా
ఓం గురువా, ఓం ఓం ఓం గురువా
ఓం శ్రీ రామ్ , ఓం శ్రీ రామ్ , ఓం శ్రీ రామ్
ఓం శ్రీరామ్ , ఓం శ్రీ రామ్ , ఓం శ్రీ రామ్
--((*))--
Comments
Post a Comment