ప్రాంజలి ప్రభ  
     దీనశరణ్య మహాను భావా
     శోభన కీర్తి  శుభాల భావా
     రాజ్యసునేత్ర సుమాల భావా
     శ్రీకర పాద  విహార  భావా
     కౌస్తుభ వక్ష అకార భావా
     విశ్వాస సేన విశాల భావా
     యోగసునంద సమాన భావా
     శ్రీ విద్య విధాత విలోల భావా
     సమయస్పూర్తి సహాయ భావా 
     వినయవిధేయత ముభావ భావా 
     నిస్వార్ధ సేన తత్పర  భావా 
     ప్రేమ పూర్వ  దర్శక భావా 
     త్రికాల దీక్షరూప కాంతి భావా 
      విలాసవైభవ మనోహర భావా
      ప్రసన్న చమత్కార  భావా  
      విశాల దృష్టి విశ్వాస భావా   
      --((**))--
ప్రాంజలి ప్రభ 

నేటి కవిత (ప్రాంజలిప్రభ )
పువ్వు
రచయత: మల్లప్రగడ రామకృష్ణ

అకుచాటున పిందె అంకురించే  
కొమ్మ రెమ్మలకు ప్రేమను పంచే  
ప్రకృతి బలంతో పువ్వుగా విరిసే  
అతిశయం తోనే  ఆద మరిచే 
పువ్వుగా మారి జ్వాలగా వేలిగే  

పెనుగాలికి,పెనవేసి ఉండే  
మకరందంతంతో మిడిసిపడే 
తుమ్మెద కోసం ఎదురు చూస్తుండే 
సుతిమెత్తగా ఉండి  తన్మయమే

తుమ్మెద మకరందాన్నికి దారే 
సూదిలాంటి పెదాలతో హరించే 
పువ్వు పరవశించి ఆనందించే   
పరమాత్ముని లీలా మాధుర్యమే 

పరమపదించుటకు మార్గమే 
పెనవేసుకొని ఉండే బంధమే 
నూతన తేజస్సే నిదర్శనమే 
--((**))--
నేటి కవిత (ప్రాంజలిప్రభ )
కలం 
రచయత: మల్లప్రగడ రామకృష్ణ

గళంతో వ్రాస్తుంది కలం 
కలం వ్రాతలు చూపు గమ్యం 
గమ్యంలో కనిపించు కలం అనుభవం 
అనుభవంతో వ్రాసే కలం నైపుణ్యం
కల్పనా కవితల ప్రావిణ్యం 
శాంతికి ఆయుధం కావాలి కలం   
ప్రజా చైతన్యం కలంతో తేవాలి 
ప్రపంచాన్ని నడిపించేది కలం 
అ శాంతి నుండి శాంతిని కల్పించేది   

కలానికి తెలుసు కాలం విలువ 
మంచిని పెంచి చెడును శాసించేది కలం  
కలముతో వ్రాసారు భారతం 
భవిషత్తు కు ఇది ఒక నిర్వచనం 

ఎంతో మంది పుణ్యపురుషులను
వీర వణితలను
కలం పరిచయం చేసింది
అందుకే కవితకు మూఉలం కలం 
కలకాలం ఉండేది కలం 
కలం వ్రాతలు నింపుతాయి మన: శాంతి 
మహానుభావులుగా మార్చేది కలం 
నిగ్రహశక్తి ని పెంచేది కలం

అలాంటి కలమే
యిప్పుడు నాకు కవిత 

--((**))--
నేటి పాట- ప్రాంజలి ప్రభ  
( అబ్బాయి )

కోపమా, తాపమా, లోపమా .....
ఏదైనా చెప్పు మా  మందార మధు బాలా .... 
వెన్నెలబాణాలు గుచ్చుతూ 
చందమామలా చక్కగా ఉన్నవే బాలా ..... 2 
    
గులాబిగా ఉన్నవే మత్తు పెంచకుమా ....
గుచ్చుకున్నా పర్వాలేదు హద్దుకుంటా బాలా .... 
మౌనంగా ఉండి గుచ్చి గుచ్చి చూసినా  
గోలచేసినా పర్వాలే హద్దుకుంటా బాలా ...... 2  
మాటలన్నీ లెక్కగట్టి, నవ్వులన్నీ మూటగట్టి  
నీకు చెప్పి ఆనందపరచాలని ఉంది బాలా .... 2 
(అమ్మాయి )

కోపం లేదు తాపం లేదు......  
నిన్ను చూస్తే నాకు వళ్ళు మంటా పో పోరా పోకిరోడా ... 
జాలువారు జలపాతంలా వస్తావు 
అబద్దాల జల్లుతో ముంచేస్తావు, పో పోరా పోకిరోడా ... 2
అదేపనిగా వేధించి బాధ పెట్టకుమా .....

నన్ను వదలి వెళ్ళరా పోకిరోడా 
మౌనంగా ఉండి గుచ్చి గుచ్చి చూసినా  
గోలచేసినా నిన్ను నమ్మలేను, పో పోరా పోకిరోడా ... 2
మాటలన్ని చేష్టలన్ని నమ్మి   
మోసపోయే పిచ్చిదాన్ని, కాదురా పోకిరోడా ... 2
మాటలన్నీ మాయలనుకోకు బాలా ..... 2

మచ్చలేని మనసును చూడు బాలా ..... 2
కాలం కలిసొచ్చేదాకా ఆగాలిరా పోకిరోడా ....2
దేవుడు కలిపితే కలుద్దాం పోకిరోడా .....2
వినవే బాలా ..... వినవే బాలా ..... 

విన్నా పోకిరోడా.....విన్నా పోకిరోడా
వినవే బాలా ..... వినవే బాలా ..... 
విన్నా పోకిరోడా.....విన్నా పోకిరోడా .... 
ఆ ........   ఆ .....     ఆ ......  ఆ..... 
అంతేనా బాలా .......
అంతే పోకిరోడా .......  
--((**))--

ప్రేమికుల రోజు సందర్భముగా

ప్రేమికుల రోజు సందర్భముగా
ప్రాంజలి ప్రభ కవిత (ఛందస్సు)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

మనసా వాచా - మహిపైన నిన్నే
నిజమే చెప్పే - మనోరమ నీకే
బదులే పల్కే - మనోహర నీకే
మనసే విప్పా  - మనోహర మొన్నే

మనమో నీకై - మఱువంగ నౌనా
పుడమే వల్లి - వినయంగా నౌనా
తరువే మల్లి -  విరయంగా నౌనా
మెరిసే జల్లు - కురవంగా నౌనా
   
వినుమా చేరన్ - బ్రియ దల్చుచుంటిన్
దినముల్ రాత్రుల్ - తిరుగాడుచుండున్
సుఖముల్ లేకే  - మనువాడు చుంటిన్
గలమున్ విప్పే - సమయాన ఉండెన్

యమునా తీర - మ్మల సంధ్యవేళన్
రమణుల్ బాడన్ - రసవంతమయ్యెన్
గమనీయమ్మై - కమలాక్షుఁ డూఁదన్
రమణీయమ్ము  - రసరాసకేళుల్

జలజాక్షీ నన్ - జదివించు తల్లీ
పలు ఛందమ్ముల్ - వడి వ్రాయ నెంతున్
మలయై నాకున్ - మహి నుండు మమ్మా
వెలుఁగుల్ నీవై - వెలయంగ రమ్మా

--((**))--

ప్రాంజలి ప్రభ


ప్రాంజలి  ప్రభ
రచన మల్లాప్రగడ రామకృష్ణ
ఎమన్నా కాదన్న నేను చేయాల్సింది చేస్తున్నా

 సూర్యకిరణాలను పట్టుకొని ఇంధనంగా మార్చాలనుకున్నా
 కిరణాలవల్ల వచ్చే కలువపూలపై ప్రయోగాలు చేయాలనుకున్నా
 కిరణాలతో క్రిమికిటకాలను కాలుష్యాన్ని తరిమేయాలనుకున్నా
 నీటిని ఆవిరిగామార్చి, కృత్రిమ మేఘాలును సృష్టించాలనుకొన్నా   
                                                                           
 ఎవరెంత ఎగతాళి చేసిన నా బ్రతుకింతేనని చెప్పాలనుకున్నా
 అమ్మ నాన్నలకు సేవలు చేస్తూ  రుణపడి ఉండాలనుకున్నా
 అనారోగ్యులను ఆరోగ్యులుగామార్చుకు నావంతు కృషి చేస్తున్నా
చేతనైనంత సహయము చేస్తూ,  స్త్రీలను గౌరవిస్తూ బ్రతుకుతున్నా 

మితిమీరిన సంపాదన మనశ్శాంతిని లేకుండా చేస్తుందని చెపుతున్నా
మితిమీరిన క్రమ శిక్షణ రక్త సంబధీకులను దూరం చేస్తుందని చెపుతున్నా
మితిమీరిన కోపం  శతృవులను వృద్ధి చేస్తుందని చెపుతున్నా
మితిమీరిన ఆలోచనలు  జీవితాన్ని దుర్భరం చేస్తుందని చెపుతున్నా
                                                           
మితిమీరిన వ్యసనాలు అప మృత్యు పాలు చేస్తుందని చెపుతున్నా
మితిమీరిన స్వార్ధం  అందరినీ దూరం చేస్తుందని చెపుతున్నా
మితిమీరిన లాభార్జన వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది దని చెపుతున్నా
మితిమీరిన వస్తుత్పత్తి  నాణ్యతా ప్రమాణాలను దెబ్బ తీస్తుందని చెపుతున్నా

మితిమీరిన గర్వాహంకారం  ఆపదలు కొని తెస్తుందని చెపుతున్నా
మితిమీరిన అలంకారం  వెగటు పుట్టిస్తుందని చెపుతున్నా
మితిమీరిన శృంగారం  వైరాగ్యాన్ని కలిగిస్తుందని చెపుతున్నా
మితిమీరిన కామాంధకారం జీవచ్ఛవాన్ని చేస్తుందని చెపుతున్నా

మితిమీరిన అత్యాశ  నేరాల పాలు చేస్తుందని చెపుతున్నా
మితిమీరిన అధికార దాహం  హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుందని చెపుతున్నా
మితిమీరిన త్యాగం  కడగండ్ల పాలు చేస్తుందని చెపుతున్నా
మితిమీరిన వ్యవసాయకోత్పత్తి భూమిని నిస్సారం చేస్తుందని చెపుతున్నా

మితిమీరిన జనాభా పెరుగుదల దేశ ప్రగతిని త్రొక్కేస్తుందిదని చెపుతున్నా
మితిమీరిన స్నేహాలు  అభిప్రాయ భేదాలను సృష్టిస్తుందని చెపుతున్నా
మితిమీరిన గారాబం చెడు స్నేహాల పాలు చేస్తుందని చెపుతున్నా
మితిమీరిన వేదాంతం  వెటకారం పాలు చేస్తుందని చెపుతున్నా

మితిమీరిన ఈర్షా ద్వేషాలు  నిద్రా సుఖాన్ని దూరం చేస్తుందని చెపుతున్నా
మితిమీరిన భక్తి  మూర్ఛల పాలు చేస్తుందని చెపుతున్నా
మితిమీరిన తీర్ధ యాత్రలు  నాస్తికత్వానికి నాంది పలుకుతుందని చెపుతున్నా
మితిమీరిన ఉపవాసాలు  నిస్త్రాణతకు దారి తీస్తుందని చెపుతున్నా

మితిమీరిన ప్రేమ అనుమానాలకు దారి తీస్తుందని చెపుతున్నా
మితిమీరిన నమ్మకం  ద్రోహానికి దోహదం చేస్తుందని చెపుతున్నా
మితిమీరిన విశ్వాసం  లోకువ పాలు చేస్తుందని చెపుతున్నా
మితిమీరిన ఋణం మరణం పాలు చేస్తుందని చెపుతున్నా

మితిమీరిన అభిరుచి  దుబారాకు దారి తీస్తుందని చెపుతున్నా
మితిమీరిన కీర్తి దాహం ఆదాయాన్ని మింగేస్తుందని చెపుతున్నా

నీటిలో కొట్టుకొని పోవు వానికి తీరమును వలె సహకరిస్తా
శ్రమచెందిన బాటసారికి చెట్టు నీడను వలె సహకరిస్తా
వాన వలన భయపడే వాడికి సుఖకరమైన ఇంటిని వలెసహకరిస్తా
అతిథికి గృహస్థుని వలెసహకరిస్తా

ఆర్తుడైన దరిద్రునకు ధనిక ప్రభువును వలె సహకరిస్తా
చీకటిచే ఆవరింప బడ్డవాడికి దీపమునువలె సహకరిస్తా
ౘలిచే బాధ పడువాడికి అగ్నిని వలెసహకరిస్తా

సర్వ భయములనూ పోగొట్టునట్టియూ సహకరిస్తా
సౌఖ్యకర మైనట్టియూ, సహకరిస్తా
శివుని పాద పద్మములను చేరుకొని సహకరిస్తా

సహకరిస్తూ  జీవించాలని ఆశిస్తున్నా
నేను చెప్పినవి విన్న ఆచరించిన
ఆ పరమాత్ముడు ఆడుకుతాడని నమ్మకం ఉందన్నా

--((**))--


అముద్రిత కవితలు - 1000
అమ్మనే అడుగుతున్నా బిడ్డా 

చెల్లెలుకు రాఖి కట్టి రక్షకుడౌతావురా 
రోడ్డుమీద స్త్రీలను రోత కూతలు కూస్తావురా  
నిద్రలేవగానే తల్లికి దండం పెడతావురా 
మరి పిల్లనిచ్చిన అత్తను ఎందుకు తిడతావురా 

తల్లి చెప్పిన మాట వింటా నంటావురా
మరి పెళ్ళాన్ని కట్నం తేలేదని వేదిస్తావురా 
అపురూపమైనది ఆడజన్మ అని అంటావురా  
పుట్టిన ఆడబిడ్డను చెత్తకుప్పలో పడేస్తావురా 

స్త్రీల ఆకర్షణకు లోనై పాడౌతున్నావురా 
ప్రేమిస్తున్న భార్యను గుర్తించి బతకరా 
వెలయాలికి లొంగి అనారోగిగా మారకురా 
భార్యే నీకు సంతృప్తి కలిగించే దేవతరా    

అందుకే నే చెపుతున్న తల్లిగా

నక్క వినయాలు దేనికిరా 
కుక్కలా విశ్వాసంగా ఉంటె చాలురా 
గుడ్లగూబలా నిద్ర మానకురా
పక్షిలా హాయిగా నిద్రపోతే చాలురా

గాడిదల మోతబరువు దేనికిరా
ఏనుగులా శ్రమిస్తే మనకు చాలురా 
కప్పలా ఉండుట దేనికిరా    
చాపలా బతుకుట చాలురా 

--((***))--

అముద్రిత కవితలు 
చిగురించాల్సిందే  -1001  

నిన్నటి సశేషానికి నేటి తరువాయిలా 
శశిరం ఖాళీచేసి వసంతాన్ని ఆహ్వానించేలా 
ఉషోదయ కిరణాలు కిటికీల నుండి వచ్చేలా 
మనసు దుప్పటి తెరను తొలగించే కాలం రావాలి   

వక్షోజాల పాలతో బిడ్డ ఆకలి తీరినట్టులా 
పుడమితల్లి సమస్త లోకాల్ని భరించునటులా 
అనారోగ్యం తరిమే ధన్వంతరి ఔషదములా
మనసును కమ్మిన మాయ తరిమే కాలం రావాలి 

కాలమార్పుకు సహకరించే శరీరములా 
మానవత్వాన్ని బతికించే మేధావిలా 
అందరికి ఉల్లాస ఉత్షాహాల పండుగలా
మనస్సు కమ్మే ఆలోచనలను తరిమే కాలం రావాలి 
      
ఉషోదయానికి ఉద్భవించే పుష్పములా 
స్త్రీ పురుష సంయోగంతో వచ్చే మార్పులా 
బంధాల ప్రేమను పటుత్వ పరిచేలా బంగారమా 
మనస్సు మాట స్వశ్చత ఉండే కాలం రావాలి    


--((***))--

బంగారమా .... నీకో నమస్కరామ్ (1002) 

మగువలను మత్తెక్కించింది 
మనసును మురిపింపచేసేది 
రంగు ఎప్పటకీ తగ్గనటువంటిది 
ఆర్ధికమాంద్యం అనేది లేనిది 

బంగారం బరువెక్కుతుంది 
కనకం కవ్విస్తూ ఉన్నది 
స్వర్ణం సరసాలాడుతుంది 
పట్టిందల్లా బంగారమవుతుంది

పుత్తడి బొమ్మ మా పాప 
బంగారు కొండ మా బాబు 
సువర్ణ ఛాయ నా శ్రీమతి 
నేను మాత్రం నల్ల బంగారం 

ఏడుకొండస్వామివారి వైభవం 
అనంతపద్మనాభుని వైభవం 
కనకమహాలక్ష్మి వైభవం 
సువర్ణ దానం నిత్యవైభవం 

స్వర్ణం కోసమే రాజ్యాలు పతనం 
పుత్తడి ధరలు ఆకాశం 
వెలుగంతా స్వర్ణమయం 
బంగారమా .... నీకో నమస్కరామ్ 

--((***))--


సాగిపో  1003 


అర్దార్ది అభిష్టాలను తీర్చి, సంతోషం పంచి సాగిపో
ఆర్తుల ఆలాపననుండి రక్షించి ముందుకు సాగిపో

వయసును బట్టి శక్తిని పెంచుకొని శక్తి హీనులకు
శక్తినిపెంచుకొనే మార్గాలు చూపి, ఆదుకొని సాగిపో

శరణు శరణు అన్న వానిలోని తప్పులు ఎంచకు
పశ్చాతాపముతో ఉన్నవానికి సహకరించి సాగిపో

అర్ధాని అపేక్షించి ఆరాదించే నమ్మి ఉన్నవారకు
దుర్మార్గులైన అర్ధాన్ని అర్ధిస్తే ఆదుకొని సాగిపో

ధర్మాన్ని వదలక నిత్యమూ భరించే భాదలకు
ఓర్పుతోజీవించే వారికి ఆర్ధికసహాయం చేసి సాగిపో
       
మాయ, మోహ, పాశాలకు చిక్కి ఉన్న మానవులకు
భగవత్ గీత జ్ఞాన మార్గాన్ని భోధించి ముందుకు సాగిపో

 --((***))--


నెమ్మదిగా  1004

ప్రయాణానికి సహకరిస్తూ కదులుదాం నెమ్మదిగా 
ప్రమాణానికి అనుకరిస్తూ మెదలుదాం నెమ్మదిగా 

చేయాలన్నవి చేయలేనివి ప్రయత్నిస్తూ చేరువుగా
విమర్శలు రాకుండా పనులన్నీ చేద్దాం నెమ్మదిగా

బ్రతుకు భారమన్న వారికి సహకరిస్తూ ఓదార్పుగా
చేయూత నిచ్చి ఆదుకుంటూ కదులుదాం నెమ్మదిగా
   
తెలుగు తల్లి, బాష ,ను గౌరవిస్తూ, స్వచ్చమైన తేటగా
మంచిని పెంచుదాం కలసి మెలసి సాగుదాం నెమ్మదిగా

రోగులకు సహకరిస్తూ, కలాన్ని అనుకరించే గాలిలాగా
కదులుతూ మానవత్వాన్ని బ్రతికించుదాం నెమ్మదిగా

శతృభావం వదలి అందరిపై కరుణ భావం చూడాలిగా 
సాటి మానవులపై స్నేహభావంతో కదలాలి నెమ్మదిగా  

--((***))--

ప్రాంజలి ప్రభ - నేటి కవిత
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

నీకుంది మనసు మంచి చెడు తెలుసుకో
నిగ్రహించి, ఓర్పుతో, మనిషిగా నడుచుకో

సంతృప్తి అనుకున్నవాడికి రోజు పండగే
ఎం తృప్తి అనుకున్నవాడికి రోజు రోగమే

తోలి చినుకు మట్టికి పరిమిళం, ఇది రాజకీయం
మలి చినుకు బురద రాజకీయం, ఇదే రాజ్యాంగం

భక్తులు వేస్తారు దేవుని హుండీలో డబ్బు
ఆ డబ్బు తో చేస్తారు కొందరు వ్యాపారం

పుస్తకం జ్ఞానానికి సంపూర్ణ మార్గం
మస్తకం అర్ధాన్ని ఆరాధన మార్గం

మత్తు మందు బాబులతో ప్రభుత్వమే వ్యాపారం
ప్రభుత్వమేఅంటుంది మందు ఆరోగ్యానికి హానికరం

ఒక ఉద్యోగి సమర్ధత కలవాడంటారు ముందు
భజన చేయలేదని అసమర్ధు డంటారు తర్వాత

హంగులతో అలరారే రాజధాని నిర్మాణం
జన వాసానికి కరువైపోతున్నది ఆ ప్రాంతం     

--(())--

ప్రాంజలి ప్రభ - నేటి కవిత
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

చక్కని చుక్కా ప్రక్కన ఉంటె
మక్కువ పెరిగి మమతను పంచాలని
పక్కకు చేరి మక్కువ తీర్చాలని
ఒక్క నిముషమైనా సంతోషపెట్టాలని
నీ ప్రేమా కృపకు  పాత్రుడవ్వాలని 
క్షణ కాలమైన ఆశ తీర్చాలని     
ఆగక గేలి చేసిన ఓర్పు వహించాలని
ఆగిన ఆనందంతో ముంచి వేయాలని
తెచ్చిన కానుక లందించాలని
ఉర్రుతలూగుతున్నాను ఓ  చక్కని చుక్కా

ఏమిటి ఈ యాగము ప్రేమను పంచవే చుక్కా
నీ మీద ముచ్చడి పడి పద్యాలు వ్రాయాలని
కోమలమైన అంగాంగ సౌష్ఠవాలాను వర్ణచాలని
నయనాల చూపులను, మూతి విరువులను
వక్షోజాల కదలికలను, నితంబాల మెరుపులను
వాలు జడ కదలికలను, పావడా గాలి రెపరెపలను 
కనిపించి కనిపించని నాభి అందాలను
ముఖవర్ఛస్సులో మారుతున్న రూపు రేఖలను
చూసి ఉండలేక వర్ణించాలని ఉంది చక్కని చుక్కా

మాటలతో నిటు గడుపుటయేన అనకు 
స్వశ్చపు తలపుల స్వామిని నేను     
అందరి మేలుని చూసేవాడను నేను
మాటలు కాదు చేతలతో చూపే వాడను నేను
కర్మ ననుసరించి నడిచే వాడను నేను
పుడమి తల్లిని, ప్రకృతి మాతను,
తల్లి తండ్రులను, గురువులను
ప్రేమతో పలకరించి ఆదరించేవాడను
అయినా నీ అందాలకు లొంగిపోయాను
అధరాలను అందుకోవాలని ఆశపడుతున్నాను
ఇద్దరమొకటై ప్రపంచ వింతలను
చూసి పెద్దలకు, దేశసేవకు సహకరిస్తూ
క్రొత్తసృష్టిని చేయాలని ఉంది చుక్కా
నీమాటే నామాట అన్నది చుక్కా
పక్కా పక్క చేరి నవ్వుకున్నాయి చుక్కలు


--(())--



ప్రాంజలి ప్రభ - నేటి కవిత 
"  తేడా "

ఎవరి పుట్టుకలో తేడా ఉండదు 
ఆలోచించగా దృక్పధాలలోనే ఉన్నది తేడా 
పెంపకంలో ఎక్కడ తేడా ఉండదు 
ప్రేమను అర్ధం చేసుకోవడంలోనే ఉన్నది తేడా

లక్ష్యాలలో ఎక్కడ తేడా ఉండదు 
లక్ష్యానికి తగ్గ గురువు దొరకటంలోనే ఉన్నది తేడా
బాధ్యతలలో ఎక్కడ తేడా ఉండదు 
ప్రేమ స్నేహం నమ్మించటం లోనే ఉన్నది తేడా


నేటి కవిత - ప్రాంజలి ప్రభ
రచయిత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

ఈదురు గాలికి అడ్డు ఆపు లేదులే
కల్లోల హోరుకు వావివరుస లేదులే
సాగర ఘోషకు అర్ధం పర్ధం లేదులే
కారుచిచ్చకు కారణమనేది లేదులే 

కొమ్మల ఆకులు కదల లేదులే
మొగ్గల పువ్వుల మెదల లేదులే
మేడల మధ్య గాలికి సందు లేదులే
ఆశలకు అంత మనేది లేదులే

కళ్ళల్లో వెతుకు లాటకు దారి లేదులే
కాళ్లల్లో నడక వేటకు మార్గం లేదులే
నీళ్ళల్లో చాపల ఈతకు హద్దు లేదులే 
పళ్లతో కోరుకుటకు వీలుకానివి లేదులే

మనిషి వైకృత క్రీడలో భాగమనేది లేదులే
అస్తవ్యస్త వాతావరణంలో బతుకు లేదులే
ఆరాటం మనుషుల్లో మార్పనేది  లేదులే
కలలు జీవితంలో కధలు మారుట లేదులే

--((***))--



ఉద్యమాలలో ఎక్కడ తేడా ఉండదు 
ఊపిరిపోయినా వెనకాడనివారి మధ్య ఉన్నది తేడా
సమయంలో ఎప్పుడు తేడా ఉండదు 
అనుకరించి సద్వినియాగం చేసుకోవటంలోనే ఉన్నదితేడా

ఆశయాలలో ఎప్పుడు తేడా ఉండదు 
ప్రోత్సాహం, సహకారం కొరతవల్ల ఉంటుంది తేడా 
జీవితంలో ఎప్పుడు తేడా ఉండదు 
బ్రతికి బ్రతికించుటలో ధనం కోసం ఉంటుంది తేడా

సంచలనాన్ని సృష్టించేది మనుష్యుల్లో తేడా 
మన ఆలోచనాలన్ని పంచె మమతల్లో తేడా       
అవకాశవాదులకు చిక్కి మనిషి ఆశల్లో తేడా 
అత్యాశతో వితండవాదంతో పోరాటాల్లో తేడా 

__((*))-- 
   

నేటి కవిత - ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగఢ రామకృష్ణ
ఓ మనిషి తెలుసుకో - తెలుసుకొని మసులుకో
కాలాన్ని బట్టి నడుచుకో - ఆశకు పోక జీవించటం నేర్చుకో

చీకటిలో ఉన్నానని చింతించకు
చీకటిని తరిమే వెలుగు ఉంటుంది భయపడకు
విజయం చెందలేదని దిగులు చెందకు
అపజయం వెనుక న్యాయం ఉందని బతుకు

కాలం నీకు సహకరించుట లేదనుకోకు
ఓర్పే ధ్యేయంగా సమస్య పరిష్కారం కోసం వెతుకు
నాకు ఎవ్వరు సహాయం చేయుటలేదని అనుకోకు
ఈ క్షణం నీ సహనంతో నిరీక్షించి బతుకు

స్నేహం ద్రోహం గా మారిందనుకోకు
చేసిన కర్మానుసారమని అనుకోని బతుకు
ధనం లేదని ఎవరినీ యాచించకు
మనస్సుకు శాంతి నిచ్చే కృషితో బతుకు

స్త్రీ ప్రేమధ్యేయమని  అంతా భూటకమని అనుకోకు
నీ ప్రవర్తన బట్టి మారునని తెలుసుకొని బతుకు
దేశం నాకు సహాయం చేయుట లేదని అనకు
నీ ఉనికి ఆవరమో కాదో తెలుసుకొని బతుకు   
   
పూజలు వల్ల పిల్లలు పుడతారని అనుకోకు
ప్రేమ అనురాగంతో పుడతారని తెలుసుకొని బతుకు
బ్రతికి బ్రతికించుటే ధ్యేయంగా బతుకు
మనోవాంఛాఫలసిద్ధి కొరకు మార్గాలు వెతుకు 

ఓ మనిషి తెలుసుకో - తెలుసుకొని మసులుకో
కాలాన్ని బట్టి నడుచుకో - ఆశకు పోక జీవించటం నేర్చుకో

--(())--




నేటి నా కవిత - ప్రాంజలి ప్రభ
రచయత : మల్లపగడ రామకృష్ణ

దోమలు, నల్లులు చీకట్లో ఏడిపిస్తాయి
ఈగలు, యాచకాలు, పగలు ఏడిపిస్తారు
చీమలు, భార్య, రాత్రిమ్బవళ్లు ఏడిపిస్తారు
మూర్ఖులు, బంధువులు, నిరంతరం ఏడిపిస్తారు.

తల్లి తండ్రులను, పిల్లలు ఏడిపిస్తారు
పిల్లల చేష్టలు చూసి పెద్దలు, బాధపడతారు
పెద్దలు మామాట వినుటలేద,ని బాధపడతారు
స్నేహితులు సహాయం చేయలేకపోయామని బాధపడతారు 

చావక బ్రతికున్నారే అని, ఏడుస్తారు కొందరు
చచ్చాకన్నా సుఖముంటుందని, ఏడుస్తారు కొందరు
జీవితంలో సుఖం లేదు ఇంకా ఎందుకున్నాడని ఏడుస్తారు
 కట్టుకున్నందుకు జీవితాంతం తప్పఁదంటారు కొందరు

అనారోగ్యులు జిహ్వచాపల్యంతో బాధపడతారు
యుక్త వయస్సులు ప్రేమపొందలేదని బాధపడతారు
రైతులు గిట్టుబాటు ధర లేదని బాధపడతారు
ప్రేమించినవాడు పొందక, పొందిన వాడు ప్రేమించక బాధపడతారు ,           

దృశ్య శ్రవణం చూసి లీనమై ఏడుస్తారు
వినకూడని మాటవిని తట్టుకోలేక ఏడుస్తారు
సుఖాన్ని భరించలేక, తట్టుకోలేక కూడా ఏడుస్తారు
నామాట వినమని, నాకళ్ళు చూడమని చేప్పేవారు.   

--((***))--


నేటి కవిత - ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
   
పిచ్చి మనసు తనువునే - కూర్చియు వలపు తలపే
ఏకము అగుట కొరకే - ప్రేమను తెలుపుట కదా

ఈ చిలక కల వెలుగే   - రంగుల కథల మలుపే 
హంగుల తెలుపు వగలే - పొంగులు కలసి సెగలే 

వేడి వలపు సొగసులే - వేకువ పలుకుల వలే 
శోభల తలపు తెలిపే - మాటలతొ చిరు నగవే

హృదయ తపన తెలిపే - శృతి పలుకులు చిలికే
ప్రీతి కొరకు నటననే - చూపియు నగువు లొలికే

తామర లతల సెలయే - రూ పరిమళము చిరుదీ
పం వెలుగులతొ మమతా - నందము శుభము కలిగే

తురుపు కిరణ వెలుగూ - పొద్దు తిరుగు లతలకూ
వేకువ సరయు నది కీ   - పొంగు కడలి ఉరకలే

 వాంఛ ఫలితము తరుణా - నంద సుమధుర మధురా
నంద భవ బగ తలపే - స్వర్గ సుఖ కల ఒకటే

ప్రతి అణువు కదలికే - ప్రీతి గొనుట మధురమే
శృతులు గొలుపు గళమే - ఒక్క నిముషము సుఖమే 
  
జీవితమునకు సమభా - వాల మగువకు మగడే
సంత మవుటకు మదనా - నంద సుఖము కొరకే   

--(())--









Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు