
ప్రాంజలి ప్రభ రచయిత :మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ సమాజంలో సాహిత్యం రసజ్ఞుల ఆలోచనలు అభిరుచులుపై, ఆభరణాలపై సంస్కారం, ఔనత్యం, అడ్డులేకుండా గుండెలోని తపన తీర్చుకొ సూక్తులు ఆచరించక కుయుక్తి గా మారి ఏడిపించు మాయలో ఉంచి అందరిని దోచు సిరితో తపనలు తగ్గించు వైద్యులున్నారు త్రాగి తిరిగు దుర్మార్గానికి అడ్డు ఉండదు అడ్డు చెప్పేవారు అసలుండరు మొండి పట్టుతో బ్రతుకు ఉన్నవారిని పట్టించుకో మంచి మనుషులతో స్నేహం చేయకు విషం కక్కే వారిని చెరదీసి బ్రతుకుపై దెబ్బతగిలిన వారినే ఆదరించు పాపమని తెలిసినా అదే చేయి జిహ్వ చాపల్యాన్ని వదలుకో అద్దంలో మోఖమే చూడకు నీతులే పెద్దగా చెప్పు అవునంటే కాదను - కాదంటే అవునను ఇదే సమాజంలో సాహిత్యం --((*))-- తొంగి తొంగి చూచెదవయ్యో! దుఃఖమా! యొ కించుకైనను జాలి వహించవేమి? శివయ్యా . లోలోన ఉన్న చీకటిని తరిమి వెలుగును నింపుటకు రావేమి శివయ్యా కలుష దుర్గా0త కుహరమున బుట్టి మదియాశృ మలినధారను చేపట్టి అర్ధం ఎదో ఆత్మఎదో తెలియనట్టి నన్ను కాపాడవెందుకయ్యా శివయ్యా ...