20/2

నేటి కవిత ముడిరైక బిగువు - తెలివైన మగువ కలనైన కవిత - వరసైన పడచు వగలైన వరుస - సొగసైన చిలుక పదునైన పడతి - చురుకైన పొగరు ఒకటైన వనిత - మనసైన సమత గడుసైన గిరిజ - వదులైన వనజ చురుకైన చిరుత - కథలైన మిడత వరుసైన రవళి - మరుపైన మురళి వయసైన ముసలి - వలపైన మమత బరువైన మనసు - మితమైన వయసు --(())-- నేటి కవిత నా యదను తాకే ఒక నీలి మేఘం ఎడారిలో దొరికిన నీళ్లలా అర్ధం కాని భావాలు నాలో తొంగి చూసినా నా మనసు ఎడారికాలా ఉద్వేగం నాలో లేదు ఉన్మాదం అసలు లేదు ఉత్తేజం ఉంది పరుగులా మనసు మత్తుగా లేదు మమత చెత్తగా లేదు సంకల్పం ఉంది ప్రగతిలా ఆయుధము పట్టుటలేదు ఆదర్శం విడువలేదు హాస్యాన్ని అనుకరించే వెల్గులా ప్రణయాగానం లేదు ప్రతిభను మరువలేదు ఆనందం నిగురు నిప్పులా నిశ్శబ్దాన్ని మరువలేదు విజయాన్ని విడువలేదు మరచి పోలేని ప్రేమలా --(())-- నేటి కవిత- నా ప్రేమ రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ గాలి దీపంలా ఉంది నా ప్రేమ ఇప్పుడారునో తెలియక రెపరెపలాడే పలచని అద్దం లా ఉంది నా ప్రేమ ఎప్పుడు జారిపడి ముక్క ముక్కలగునో వ...