హాస్యం




పక్కిరాతేజిపై నెక్కెడునభ్యాసి, చాణూరుఁ ద్రుంచిన సత్త్వరాశి
సిరిమనోధనము మ్రుచ్చిలినకన్నపుదొంగ, గొల్లచేడెలతోడు కోడెకాఁడు
భువనమంతయుఁ గన్న పుత్త్రుఁగాచినతండ్రి, స్వర్ణాంబరముఁ గట్టు వన్నెబెట్టు
పౌరస్త్యభోగిపైఁ బవళించుసుఖవాహి, పరమపదం బేలు పాదుసాహి

మానవులకెల్ల నిజపద స్మరణమాత్ర, నైహికాముష్మికము లిచ్చు నట్టిదాత
కందపురజనార్ధనుఁడు భీకరవిరోధి, మర్ధనుడు భక్తలోకాంబు మనుచుఁగాత

కందుకూరి రుద్రకవి ప్రణితంబగు "నిరంకుశోపాఖ్యానము" నుండి విష్ణు స్తవము
--((**))--
సురుచిరనీలనీరదసిశోభితమైన మెఱుంగుభంగి శ్రీ
హరియురమందు రంజిల్లుచున్ నాశ్రితులన్ గరుణావిలోకనా
కురముల బ్రోచుపాల్కడలికూతుర! నందకపాణిరాణి! యో
సిరి! కృప మద్గృహంబున వసింపు మనారత మంబ యిందిరా

ఇందిరా శతకము - గోవర్ధనం శ్రీరంగాచార్యులు
--((**))--
neti hasyam
// భరతవాక్యం // గేయం// బాలు //

భరత ఖండపు చరిత మారిన ఘన స్వతంత్రపు దినమిదీ
నవతరమ్ముకు నడక నేర్పగ భక్తి పాడర తమ్ముడా ॥భరత॥
ఘనచరిత్రముగల్ల దేశము మరు జగమ్మున లేదనీ
గళమునెత్తియు ఘనత చాటగ భక్తి పాడర తమ్ముడా ॥భరత॥
సమత,మమతల జాతి,నీతుల సకలభావము సరియనీ
శాంతిసౌధపు నిలయమిదెయని స్వరమునెత్తియు పాడరా ॥భరత॥
కుల,మతమ్ములు కలియగలిసిన కూరిమియె ఈ నేలనీ
నవసమాజపు కలలసౌధపు ఇటుకలొకటిగ పేర్చరా॥భరత॥
ఉన్నవాడని,లేనివాడని వేరుచేయగ వద్దనీ
మనుజులందరు ఒక్కటేనని మానవత్వం చాటరా ॥భరత॥
దేశమాతకు కీడుచేయగ ఎన్ని మూకలు గూడినన్
దేశద్రోహుల కుటిల కుట్రకు భరతవాక్యం పాడరా ॥భరత॥
వెరుపులేకను మెరియుచున్నది మూడురంగుల జెండరా
జడియకను జైకొట్టి నిలిచియు జాతిగీతం పాడరా ॥భరత॥
"శక్తిని వ్యర్థమైన మాటల్లో వృథాచేయక
మౌనంగా ధ్యానం చేయండి.
మనశ్శక్తిని సమీకరించి
ఆధ్యాత్మిక శక్తిజనక యంత్రంగా అవతరించండి"
రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా....రివ్వంటుంది కోరికా..ఆ..ఆ..

--((**))--

అత్తగారు!(1)
అత్తగారు! స్వీట్ ప్యాకెట్ లో మైసూర్ పాక్ లేదు, ఏమైందత్తయ్యగారు!

ఏమోనే నాకేం తెలుసు? రాత్రి నువ్వో, మీ ఆయనో తినేసి వుంటారులే, అయినా సంసారంలో అన్ని లెఖ్ఖలేంటే కోడలా!

అత్తయ్యగారు! మీ కడుపులో చక్కెర ఫేక్టరీ వుంది, నిన్న రక్త పరీక్ష లో 450 వుంది!
మీ అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ హెచ్చరిస్తున్నారు, మీ అబ్బాయి అయితే మరో అడుగు ముందుకేసి "నీ అశ్రద్ధ తో మా అమ్మని చంపేసేలాగున్నావు" అంటారు, మీరు చూస్తే ఇలా, చావేదో నాకొచ్చినా బాగుణ్ణు!

కోడలు పిల్లా! ముందు కంటతడి ఆపి ఇలారా తల్లీ!

చెప్పండత్తయ్యగారూ!

నాకు చిన్నప్పటినుంచి మిఠాయిలంటే ప్రాణం!
మంచి వయసులో వుండి, మిఠాయిలు అందుబాటులోనున్నా తినలేకపోయాను,
కారణం
మా అమ్మ "ఒసే! నువ్విలాగ మితం లేకుండా మిఠాయిలు తింటే బాగా వొళ్ళొచ్చేసి నీకు పెళ్ళి అవకుండా పోతుందే "
శోభనముగదిలో అన్నీ వున్నా ఆయనేమనుకుంటారోనని తినలేకపోయాను,
అత్తారింటిలో వుమ్మడి కుటుంబం మూలాన
"భగవంతుడా! ఈ పనులెప్పుడు పూర్తౌతాయి, మగవాళ్ళ భోజనాలెప్పుడవుతాయి, నా కడుపులోకి పిడికెడు మెతుకులెప్పుడెళతాయి" అనిపించేది!
క్రమేపీ నా సంసారమన్నది ఏర్పడ్డాక అంతులేని భాద్యతలతో తిండి మీద ధ్యాస పోయింది!
అమ్మయ్య! కొడుకు బుద్ధిమంతుడు, కోడలు బంగారం ఇక నాకు కావలసిన మిఠాయిలు తినేయొచ్చనుకునేసరికి తోబుట్టువుల్లాగ ఈ చక్కెర, రక్తపోటూ వచ్చి పడ్డాయి, నన్నర్దము చేసుకో తల్లీ!

నిజమే అత్తగారు! ఈ విషయం లో భగవంతుడు మీకు అన్యాయం చేసాడు, ఇకమీదనుండి మీ ఇంట్లో మీరు దొంగతనం చేయాల్సిన పని లేదు, నేనే స్వయంగా నేతి మిఠాయిలు కొని తెచ్చి మీకిచ్చేస్తా, మీ కెన్ని కావాలంటే అన్ని తినొచ్చు!
అయితే మీరు నన్ననుగ్రహించి నా ప్రశ్నకు జవాబు చెప్పాలి!

ఏమిటమ్మ అది?

మీకు కడుపుతీపి అంటే ఎక్కువిష్టమా?
నోటితీపి అంటే ఎక్కువ ఇష్టమా?

కోడలా! నీ అంతరంగం నాకు అద్దంలా కనిపిస్తోంది, నా కొడుకు మీద ఒట్టేసి చెపుతున్నాను "ఇక నేను మిఠాయిలు ముట్టను " ఇదిగో నీ మైసూర్ పాక్!
--((**))--

అర్థా గృహే నివర్తన్తి స్మ శానే మిత్ర బాంధవా
సుకృతం దుష్కృతం చైవ గచ్చంత మను గచ్చతి
అర్థము:--మనము చనిపోయినప్పుడు ధనము యింటి వద్దనే వుంటుంది, బంధుమిత్రులు స్మశానము వరకే వస్తారు. మనము చేసిన పాప పుణ్యాలే మన వెంట వస్తాయి.

యౌవ్వనం ధన సంపత్తి ప్రభుత్వ మవివేకతా
ఏకైక మప్యనర్థాయ కిము యత్ర చతుష్టయః
అర్థము:-- యౌవ్వన ప్రాయము,ధనసంపత్తి,అధికారప్రాప్తి,వివేకము లేకపోవుట వీటిలో ఒకటి వుంటేనే ఎన్నో అనర్థములు కలుగును కదా! ఏ నాలుగూ ఒకే చోట వున్నచో యేమి జరుగునో చెప్పవలిసిన పనిలేదు.

అల్ప బుద్ధి వాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తా దోలగగొట్టు
చెప్పు తినేడి కుక్క చెరుకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ
--((**))--

నేటి హాస్యం (2)

"డాక్టరు గారూ....గుండె ఆపరేషన్ ని........
"బై పాస్" అని ఎందుకంటారు??" అడిగాడు "సందేహం"
"హహహ...చాలా మంచి ప్రశ్న వేసావు నాయనా....
ఆపరేషన్ విజయవంతం ఐతే...నువ్వు "పాస్" ఐనట్టు ...
లేక పొతే "బై"...అంటె గుడ్ బై అన్నట్టు!! అన్నాడు డాక్టర్ గారు!!

--((**))--
నేటి హాస్యం  (3)

"ఇదిగో అరుంధతి ....నా అనుమానం నిజమయ్యిన్దేవ్ " అంది "చంద్ర కళ"

"ఏం ? ఏమయ్యింది?" అడిగింది "అరుంధతి"

"మా ఆయన ...వాళ్ల ఆఫీసు లో అమ్మాయి కలిసి ........

నిన్న సినెమా కి వెళుతుంటే చూసాను!!" అంది "చంద్ర కళ"

"వాస్నీ..మరి నువ్వు కూడా వాళ్ల వెనకే వెళ్ల లేక పోయావా?" అంది "అరుంధతి"

"అనుకున్నానే...కానీ....
అది...
నేను చూసేసిన సినిమానే !!" అంది "చంద్ర కళ"
__((**))--

నేటి హాస్యం (4)

మీరిప్పుడు కరెంటు కుర్చీలో కూర్చున్నారు. 
మరి కొద్ది క్షణాలలో మీరు ప్రాణాలు కోల్పోతారు. 
మీ ఆఖరి కోరికేమైనా వుంటే చెప్పండి?' 

మీరు తీర్చలేరు వదిలేయండి సార్! 

నా మాట నమ్మండి... 
ఎటువంటి కోరికైనా నేను తీరుస్తాను 

అయితే సరే సార్! నేను మిమ్మల్ని నమ్ముతున్నాను 
కరెంటు ఇచ్చినప్పుడు చేతికి ఏ విదమైన తొడుగూ లేకుండా మీరోసారి నా చేతిని ముట్టుకోండి'..!

--((**))--

నేటి హాస్యం (5)

డాక్టర్ గారూ! ఏమటండీ ఇంత బిల్లు! 

ఐటమ్ టూ ఐటమ్ వ్రాసాను చదవండి, 
ఆనక అడగండి! 

Congratulation fees. 200 
Blood test. 200 
మరి ఈ మూడోది బోదపడడము లేదు, 
అంకె 5,000 అని వుంది! 

మీరిక్కడున్నంత సేపూ 8 సిగరెట్లు కాలుస్తూ మా హాస్పిటల్ సోఫా తగలెట్టారట, 
సోఫా కొన్న రసీదు నఖలు బిల్లుకు జతపరిచాను చూసుకోండి!
--((**))--



మీరిప్పుడు కరెంటు కుర్చీలో కూర్చున్నారు.
మరి కొద్ది క్షణాలలో మీరు ప్రాణాలు కోల్పోతారు.
మీ ఆఖరి కోరికేమైనా వుంటే చెప్పండి?'

మీరు తీర్చలేరు వదిలేయండి సార్!

నా మాట నమ్మండి...
ఎటువంటి కోరికైనా నేను తీరుస్తాను

అయితే సరే సార్! నేను మిమ్మల్ని నమ్ముతున్నాను
కరెంటు ఇచ్చినప్పుడు చేతికి ఏ విదమైన తొడుగూ లేకుండా మీరోసారి నా చేతిని ముట్టుకోండి'..!
--((**))--

నేటి హాస్యం

బావగారూ! ఈ సినిమాకి నిర్మాత మీరే కదా?

నీకీ సందేహమేల బామ్మర్దీ?

లేకపోతే ఏంటండీ?
ఎవరు సినిమా అవకాశాల కోసం మీ దగ్గరకొచ్చినా,
దర్శకుడిని కలవండి, హీరోని కలవండి, సంగీత దర్శకుడిని కలవండి, వారిని కలవండి, వీరిని కలవండి అంటారే గాని ఒక్కర్నైనా మీరు స్వయానా వేసుకున్న పాపాన పోలేదు!

ఓ అదా! నా అనుభవం నేర్పినట్లు నేను నడుస్తాను!

ఏమిటండీ అనుభవం,
ఖర్చు పెట్టే మీకు అధికారం లేని అనుభవం?

నా మొదటి సినిమాలో అందరినీ నేనే వేసుకున్నాను, పది రీళ్ళ సినిమా చాలా పేలవంగా వస్తే అందరూ దానికి నేనే కారణని ముక్త కంఠముతో వక్కాణించారు, రెండు కోట్లు నేలపాలయ్యాయి, అప్పుడు నాకు తత్త్వం బోదపడ్డాది!



--((**))--

శ్రీవారూ!
`లంచ్ ' బాక్సులో పెట్టమంటారా?

పెన్ డ్రైవ్ లో పెట్టియ్యవే సిస్టమ్ లో పెట్టుకుని తింటాను..

తినే ముందు ఇంకో కాపీ చేసుకోండి రేపటికుంటుంది.

--((**))--
నేటి హాస్యం
"ఇదేంటిరా ......
పిల్లలని స్కూల్ కి దలడానికి ....
వాళ్ల "మమ్మీ" లు వస్తారు !!
కానీ...
పప్పూ గాడిని ....
స్కూల్ కి వదలడానికి .....
రొజూ వాళ్ల డాడీ వస్తారు..??
ఎందుకంటావ్?" అడిగాడు "సందేహం" గాడు
"హహహ....
ఒరేయ్...
అందుకే రా, మరి వాళ్ల డాడీ వస్తున్నారు.....
నీకు ఇంకా అమాయకత్వం పొలెదురా!!!!!" అన్నాడు "పిడుగు" 'గారు


--((**))--


ఒరేయ్! మీ ఆవిడకు నీ మీద చెప్పలేనంత కోపమొచ్చి నిన్ను చడామడా వాయించేస్తూ వుంటే నువ్వేం చేస్తావురా?

నా సంగతి చెబుతా గాని ముందు నీ సంగతి చెప్పు!

ఫోన్లో ఎవరితోనో సీరియస్ గా మాట్లాడుతున్నట్లు నటిస్తా, ఫోను లాక్కుని పక్కన పడేసి మరీ వాయించేస్తూ వుంటే కొంతసేపు నేనూ వాదించి, ఓపిక లేక మౌనంగా వుండిపోతాను!
నీ సంగతి చెప్పరా?

తీవ్రంగా ఆలోచిస్తూ కాలం గడుపుతాను!

ఇంత రాద్ధాంతం జరుగుతూ వుంటే ఏమాలోచిస్తావురా?

"లాల్ బహాదుర్ శాస్త్రి గారిది సహజ మరణమేనా?

గాందీగారు భారత్ ను రెండు ముక్కలు చేసి తప్పు చేసారా?

శ్రీక్రిష్ణ దేవరాయలుగా రామారావు బదులు నాగేశ్వరరావు వేసుంటే బాగుణ్ణేమో?

సావిత్రి గారి జీవితం ఎందుకలా అయింది?

నాగేశ్వరరావు సెంచరీ కొడతానని మాటిచ్చి మనల్ని మోసం చెయ్యడానికి మనసెలా వొప్పిందో?

అల్లూరి సీతారామరాజు కనిపిస్తే బాగుణ్ణు!

సుభాస్ చంద్ర బోసి బ్రతికే వున్నారా? "
 --((**))--

 9494483093 , 9059296829  స్ఫూర్తి  ఏజెన్సీ

పి ఏ గారూ!
కార్యకర్తలందరూ వెళిపోయారా?

వెళిపోయారు సారూ!

వాళ్ళకేమేమిటిచ్చారు?

ఒక్కొక్కరికీ
క్వార్టర్ మందు, భిర్యానీ, రెండు స్వీట్ లు,
ఇంటికి పట్టుకెళ్ళడానికి ఓ క్వార్టర్ బోటల్!

సరే! ఇంకా?

రెండు లక్షల కోట్ల బేంకు రుణాలు తీసుకుని,
మన వూరి నడిబొడ్డున నూరు ఎకరాల స్థలంలో ఆరు నెలలలోపు ఫేక్టరీ కట్టి కార్యకర్తలందరికీ చీఫ్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్ పోస్ట్ లు ఇస్తానని వాగ్దానము చేసారు!

సరే గాని మీరేమైనా చెప్పదలచుకున్నారా?

ఔను సారూ!

అన్నీ పాయింట్ ల వారీగా ఒకేసారి అడగండి!

1 మన కార్యకర్తలందరికీ ఒక క్వార్టర్ మందు సరిపోతుంది కదా!
2 అసలే అప్పులెగ్గొట్టిన వారి జాబితా పెరిగిపోతుంది కష్టాల్లోనున్న బేంకులు ఏం చూసుకుని మీకింత అప్పిస్తారు?
3 వూరి నడిబొడ్డున రోడ్లు వెడల్పు చెయ్యడానికి పది సంవత్సరాలుగా మున్సిపాలిటీ వారు సాంధించలేనిది, ఫేక్టరీ మీరెలా సాధిస్తారు?
4 మన కార్యకర్తలలో డిగ్రీ చదివిన వారు ఇరవై మంది కూడా లేరు, అంతమందికీ ముఖ్యమైన వుద్యోగాలిస్తే ఫేక్టరీ పరిస్థితి ఏమిటీ?

సెక్రటరీ! ఇవన్నీ నాకు తెలీకుండానే
ఆరుసార్లు ఎమ్ ఎల్ ఏ నయ్యీనా చెప్పు?
బాంక్ రుణానికి కార్యకర్తలతో వూరేగింపుగా వెళతాను,
దానితో వాళ్ళందరూ ఆనందపడిపోతారు.
బాంక్ రుణం దొరక్కపోవడానికి నింద
ప్రతిపక్షం పై నెట్టేస్తా! క్లోజ్!
ఇక మందు విషయం!
సభ పెట్టేముందు మందు కొట్టిస్తేనే వాళ్ళు నేను చెప్పేది వింటారు!
మరో క్వార్టర్ రాత్రి పడుక్కునే ముందు తాగితే లాజిక్ గురించి ఆలోచించకుండా బంగారు కలలు కంటారు, తద్వారా నేను గెలిచేవరకూ నిరంతరం కష్టపడతారు, అంతేగాని రోజూ నేనిచ్చే
క్వార్టర్ మందు, భిర్యానీ, రెండొందలకీ
ఎవరూ లొంగిపోరు!
 --((**))--
అయ్యా! తమరే నా ప్రాణాలు కాపాడాల!

విషయం చెప్పవోయ్!

తమరికి తెలీన్దేముందీ,
ఆ మధ్య రెండు పార్టీలోళ్ళు కర్రలతో కొట్టుకు చచ్చారుగా!

ఔను! కేసు నడుస్తోందిగా!

ఔనయ్యా! కేసు రేపటితో తేలిపోతుందట!

ఇంతకీ నీ సమస్యేమిటోయ్!

ఆ కేసులో నేనొక్కడినే ప్రత్యక్ష సాక్ష్యిని!

ఔనూ! నే విన్నది నిజమేనా?
ఆ రెండు పార్టీల వాళ్ళ వాళ్ళకనుగుణంగా సాక్ష్యము చెప్పమని నీకు డబ్బిచ్చారటగా,
ఎంత ముట్టిందోయ్?

ఓ ఆరు కోట్లండీ!

సరే విషయానకి రా!

ఒక పార్టీకనుకూలంగా సాక్ష్యమిస్తే మరో పార్టీలోళ్ళు నన్ను చంపేస్తారయ్య, సాక్ష్యం ఏం చెబితే నా ప్రాణాలు దక్కుతాయో తమరే శెలవియ్యాలయ్యా!

సరే! ఓ కోటి నా మొహం మీద కొట్టు!

తెచ్చేనయ్యా, ఇందండయ్యా!

డిఫెన్స్ లాయర్ నువ్వు ఏ గ్రూప్ వాళ్ళు ముందు కొట్టారో చెప్పమంటారు

అప్పుడు నేనేం చెప్పాలయ్య?

"అయ్యా! ఇంటికి పోతుంటే దార్లో ఆ రెండు గ్రూప్ లు పరస్పరంగా నిలబడి కొట్టుకోవడానికి సిద్దంగానున్నారండి, నాకు కళ్ళు తిరిగి నేలమీద పడిపోయానండీ, కళ్ళు తెరిచేసరికి రెండు గ్రూప్ లు కర్రలతో కొట్టుకోవడము చూసానండి" అని చెప్పు చాలు!

చివరాఖరుకి కేసేటౌద్ది బాబూ?

దొమ్మీకేసు కింద కేసు కొట్టేస్తారు!
రెండు గ్రూప్ లు నీకు పార్టీ ఇస్తాయి
--((**))--
క్రికెట్ మైదానం.....
జనంతో కిక్కిరిసిపోయి వుంది.....
ప్రేక్షకులు ఆటని ఉత్కంటతో ..... చూస్తున్నారు.....

పండుగాడు .... తన బ్యాట్ తో వీరబాదుడు .... ప్రత్యర్థుల .... విల విల ....
మైదానం అంతా గోల గోల గా వుంది.
పండుగాడు .... ఓ సిక్షర్ కొట్టి. ....
35 పరుగుల వ్యక్తిగత స్కోర్ కి చేరుకున్నాడు ....స్కోర్ బోర్డ్ చూసి ......
ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపొయి ......
హేల్మెట్ తీసేసాడు. ....
బ్యాట్ ని ప్రేక్షకుల వైపు చూపించాడు. తన్మయత్మంతో .....
ఆకాశం వైపు చూశాడు.....

పండుగాడి పార్ట్నర్ కి ఏమీ అర్ధం కావటంలేదు. అందుకిలా చేస్తున్నాడొ? ....
అనుకుంటూ
ఆ పార్టనర్ ..... పండుగాడి దగ్గరగా వచ్చి ..... మెల్లగా :
" నువ్వు ఇంకా అర్ధ సెంచరీ కూడా చెయ్యలేదు..... పోనీ కొత్త రికార్డు లాంటి ఏదైనా విశేషమా అంటే అలాంటిదేమీ లేదు ......
మరి నువ్వు 35 పరుగులకే అంత ఎక్షయిట్ ఎందుకు అవుతున్నావ్? "

పండుగాడు ఆవేశముగా:-
" చదువుకునే రోజుళ్లో .....
ఆ 35 కోసం ...
నానా పాట్లు పడీ ....
పరితపించి ....
అల్లాడిపొయినోళ్లకి తెలుస్తుంది ......
ఆ 35 ఎంత విలువైందో? "
--((**))--
బార్ లో:-

తాగుబోతు-1
ఓరేయ్! రేపట్నుండి ఈ హోల్ సిటీ నాది,
నేను కోనేస్తా

తాగుబోతు-2
నేనమ్మన్రోయ్

తాగుబోతు-1
ఎందుకమ్మవ్. ఎంత డబ్బైనా ఇస్తాగా

తాగుబోతు-3
ఏహేయ్! ఆడెవడు?
ఈ సిటీ నాది
నేన్నీకిప్పుడే ఇచ్చేస్తా
ముందోక క్వార్టర్ తెప్పీయ్
--((**))--
అయ్యా! తమరే నా ప్రాణాలు కాపాడాల!

విషయం చెప్పవోయ్!

తమరికి తెలీన్దేముందీ,
ఆ మధ్య రెండు పార్టీలోళ్ళు కర్రలతో కొట్టుకు చచ్చారుగా!

ఔను! కేసు నడుస్తోందిగా!

ఔనయ్యా! కేసు రేపటితో తేలిపోతుందట!

ఇంతకీ నీ సమస్యేమిటోయ్!

ఆ కేసులో నేనొక్కడినే ప్రత్యక్ష సాక్ష్యిని!

ఔనూ! నే విన్నది నిజమేనా?
ఆ రెండు పార్టీల వాళ్ళ వాళ్ళకనుగుణంగా సాక్ష్యము చెప్పమని నీకు డబ్బిచ్చారటగా,
ఎంత ముట్టిందోయ్?

ఓ ఆరు కోట్లండీ!

సరే విషయానకి రా!

ఒక పార్టీకనుకూలంగా సాక్ష్యమిస్తే మరో పార్టీలోళ్ళు నన్ను చంపేస్తారయ్య, సాక్ష్యం ఏం చెబితే నా ప్రాణాలు దక్కుతాయో తమరే శెలవియ్యాలయ్యా!

సరే! ఓ కోటి నా మొహం మీద కొట్టు!

తెచ్చేనయ్యా, ఇందండయ్యా!

డిఫెన్స్ లాయర్ నువ్వు ఏ గ్రూప్ వాళ్ళు ముందు కొట్టారో చెప్పమంటారు

అప్పుడు నేనేం చెప్పాలయ్య?

"అయ్యా! ఇంటికి పోతుంటే దార్లో ఆ రెండు గ్రూప్ లు పరస్పరంగా నిలబడి కొట్టుకోవడానికి సిద్దంగానున్నారండి, నాకు కళ్ళు తిరిగి నేలమీద పడిపోయానండీ, కళ్ళు తెరిచేసరికి రెండు గ్రూప్ లు కర్రలతో కొట్టుకోవడము చూసానండి" అని చెప్పు చాలు!

చివరాఖరుకి కేసేటౌద్ది బాబూ?

దొమ్మీకేసు కింద కేసు కొట్టేస్తారు!
రెండు గ్రూప్ లు నీకు పార్టీ ఇస్తాయి
--((**))--
జ్యోతిష్యుడు గారూ!
ఈ ఐదువందలూ వుంచండి,
నాకు వివాహ ఘడియలు
ఎంత దగ్గరగా వున్నాయో చెప్పండీ!

.
.
.
.
.

ఏమండీ! ఏమీ చెప్పరు?

"........"

చెప్పండి ప్లీజ్!
నాయనా! జ్యోతిష్య శాస్త్రము అనుమతించిన మేర నీ మనసును కష్టపెట్టకుండా క్లుప్తంగా రెండు ముక్కల్లో చెబుతాను,
నన్నింకేమీ అడగరాదు సుమా!
సరే! చెప్పండి!
ఈ భూమి మీదున్న ఏ ఆడపిల్లకూ నీ సంపాదన అనుభవించే యోగము లేదయ్యా నాయనా!
--((**))--
బామ్మ : అమ్మాయ్..నీకు పెళ్లైందా..?
అమ్మాయి : అయింది బామ్మగారూ..
బామ్మ : మీ ఆయన ఏం చేస్తుంటాడు..?
అమ్మాయి : చేసిన తప్పుకి పశ్చాత్తాప్పడుతుంటాడు.
--((**))--
కుతూహల రావు గారు పొద్దున్నే పేపర్ తెరిచారు,

రొటీన్ వార్తలు బోర్ కొట్టడo తో ......

ప్రకటనలు చదవడం ప్రారంబిoచారు,

అందులో ఓ ప్రకటన ఆయన్ని తెగ ఆకర్షిoచిoది

ఆ ప్రకటన ఇలా వుంది... ...:

కొన్ని వందల సంవత్సరాల ముoదు కనిపెట్టబడిన అధ్బుతము!!!!!

అదృశ్య వీక్షణి !!!!!
ఇది ధరించిన వారు ఇతరులని తాము చూడగలరు, కానీ ఇతరులకు తాము కనపడరు,
ఆలశిoచిన ఆశాభంగం ,
వెల కేవలం 5 వేలు.

ఉరుకులు పరుగుల మీద ఆ ఐదు వేలు చెల్లించి కొరియర్ లో ఆ సామాను తెప్పించుకున్నారు కుతూహల రావు గారు!

రాగానే పూజ చేసి
.
పసుపు పెట్టి
.
తెరచి చూస్తే .......
.
.
--((**))--

సార్! మీరోక్కరే వున్నారు 
రెండు గ్లాసులు, రెండు షోడాలూ, రెండు క్వార్టర్ బోటల్స్ తెమ్మంటున్నారు. 

ఓ! అదా! నాకోకటి, నా స్నేహితుడికోకటి 

అయితే రెండూ మీరే తాగేసారు. మీ స్నేహితుడికో? 

వాడు చచ్చిపోయాడు. 
వాడి ఙ్ఞాపకార్దం ఇలారోజూ ఇదే పద్దతీ 

ఆర్నెల్ల తర్వాత 
అన్నీ ఓక్కోక్కటే ఆర్డర్ ఇఇచ్చాడు 

బేరర్ "మరి రెండేసి అఖ్ఖర్లేదా" అని అడిగేడు 

నేను మానేసాను డాక్టర్ మానేయమంటే 
కాని మా స్నేహితుడు మానలేకపోతున్నాడు 
అందుకే ఓక్కోక్కటీ అదీ వాడిగురించి మాత్రమే

వందేమాతరం-వంద ఏమాత్రం? 
అవి 'వందేమాతరం'ఉద్యమం జరుగుతున్న రోజులు. 

ఎవరైనా 'వందేమాతరం' అని అంటే జైల్లో వేసేవారు. 

ఒక వూర్లో ఒక అతను వుండే వాడు. 

అతనికేమో బజార్లో నిలబడి గట్టిగా 'వందేమాతరం'అని అరవాలని 

వుందట.అలా అంటే జైల్లో వేస్తారని భయ పడేవాడు. 

జైలుకు వెళ్ళకుండా వందేమాతరం అని ఎలా అరవాలని యోచన చేసే వాడు. 

ఒకసారి బజారులో వెళుతుండగా ఆయన ముందు ఒకావిడ బుట్టలో 

మామిడిపండ్లు పెట్టుకొని అమ్ముతూ వుందట 

ఆయనకు ఒక ఉపాయం తట్టింది అంతే వందేమాతరం 

వందేమాతరం అనిఅరిచాడు.పోలీసులు పట్టుకున్నారు. 

అతను భయం లేకుండా నేను ఆ మామిడి పళ్ళ అమ్మాయిని 

వంద ఏమాత్రం?అని అడుగుతున్నాను 

.అంటే వంద మామిడి పళ్ళు ఎంతకు యిస్తావని. 

తప్పేముంది?అని దబాయించి తప్పించు కున్నాడట .

ఏరా రవి! 
రోజూ వుదయాన్నే శివాలయంలో కనిపిస్తున్నావ్, 
భక్తి పెరిగినట్లుందే! 

నేను శివాలయంకి వెళ్ళేది కేవలం 
పూజ, జ్యోతి, హారతి గురించిరా! 

ఓహో! పూజా కార్యక్రమాలంటే అంతిష్టమన్న మాట! 

పూజ, జ్యోతి, హారతి మా కాలేజీ అమ్మాయిలు!!!!!

అయ్యా! మీ దంపతులిద్దరూ చాలా అన్యోన్యమైన సంసారం సాగిస్తున్నారు. ఇదెలా సాధ్యపడింది? 

అధికార వికేంద్రీకరణ వల్ల సాధ్యమయిందండీ! 

అదేలా? 

పాలసీ మేటర్స్ అనగా ముఖ్యమంత్రులు, భారత ప్రదాని, ప్రపంచ దేశాల అదిపతులు ఎవరైతే బాగుంటుంది, 
ప్రపంచ ఆర్దిక విశ్లేషణ వంటివి నేను చూసుకుంటానండీ! 
మా ఇంటి ఆర్దిక లావాదేవీలు, పాలసీ నిర్ణయాలు, ఇరుగు పోరుగు, బందుమిత్రులతో సత్సంబందాలు లాంటివన్నీ మా ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ బడ్జెట్ కి కావలసిన డబ్బు నేను సంపాదిస్తాను. 
ఒకరి విషయాలలో మరొకరం జోక్యం చేసుకోము!
గురువుగారూ! 
నేను చేసిన తప్పులను తెలుసుకోవడం ఎలా ..!? 

శిష్యా! ఎవ్వరూ వెయ్యని ప్రశ్న వేసావు, శెహబాష్! 
నీ భార్య చేసిన ఒకటి, రెండు, మూడు తప్పులను గుర్తించి , వాటిని సరిచేసుకోమని ఘాటుగా చెప్పు చాలు . 
అందుకు ప్రతిఫలంగా , 
ఆమె .. నువ్వు చేసిన అన్ని తప్పులను వెలికితీస్తుంది . 
వాటితోపాటు ... 
నీ కుటుంబానిదీ , నీ స్నేహితుల తప్పులతో పాటు , నీ వంశ చరిత్ర కూడా తెలుసుకోవచ్చు ...!!!
--((**))--
నలుగురు వ్యక్తులు మాట్లాడుకుంటుండ్రు. 

'అతడు నా మిత్రుడు. తెలిసివారి నమ్మక ద్రోహం వల్ల ఒక కేసులో ఇరికిండు.' మొదటి వ్యక్తి గంభీరంగా చెప్పిండు. 

'అవును, అతడు నాకు కూడ మిత్రుడే' రెండవ వ్యక్తి అన్నడు. 

'కేసు నా దగ్గరికి వచ్చింది. బలమైన సాక్షాలు ఉన్నయ్ . మరణ శిక్ష పడే అవకాశముంది' మొదటి వ్యక్తి బాధగా అన్నడు. 

'అవును, నిందితుని తరపున వాదించింది నేనే . కేసు బలంగా ఉంది. బయట పడే అవకాశమే లేదు'' మూడో వ్యక్తి పెదవి విరుపు. 

'మిత్రుడిని కాపాడు కోవాలె. న్యాయాన్ని కాపాడు కోవాలె. చాలా మానసిక ఘర్షణకు లోనైన' మొదటి వ్యక్తి గొంతు జీరబోయింది. 

'అవును, ఆ విషయం నేను గమనించిన' నాలుగో వ్యక్తి ... 

'చివరికి మిత్రుడి వైపే మొగ్గిన. నిర్దోషిగా ప్రకటించిన. నా మిత్రుడిని కాపాడుకున్నందుకు సంతృప్తిగా ఉంది' మొదటి వ్యక్తి గొంతులో ఆనందం. 

'మీరు గ్రేట్ . చాలా గ్రేట్. న్యాయం కంటే స్నేహమే గొప్పదని నిరూపించిండ్రు' మిగితా ముగ్గురి ప్రశంస... 
అప్పటి వరకు అక్కడ నలుగురి ముచ్చట వినుకుంట నిలబడ్డ పిలగాడు అన్నడు. 

' సార్ ! చాలా ఆలస్యమంది. కస్టమర్లంత వెళ్లిపోయిండ్రు. బారు బందు చేయాలె. పోలీసులొస్తే ఇబ్బంది అయితది' 
నలుగురు గుర్రున చూసుకుంట లేచిండ్రు. 
ఆ పిలగాడు ఉత్కంఠ ఆపుకోలేక మల్లా అడిగిండు. 
'మీరు జడ్జి ఎప్పుడయ్యిండ్రు సార్ ?' 
--((**))--

మాష్టారూ!ఐదు వందలివ్వండి సార్, 
నాలుగు రోజుల్లో ఇచ్చేస్తా 

ఇంద! ఖచ్చితంగా ఇచ్చేయాలి సుమీ! 

ఎంత మాట! మీరు నా పాలిట దేముడంటే నమ్మండి! 
********************* 

ఎక్కువ డబ్బిచ్చేసావు ఆనందం 

500 తల్లి సార్, 50 పిల్ల సార్ 

*******×***** 

మాష్టారు! 20,000 అప్పివ్వండి సార్, 
పది రోజుల్లో తిరిగిచ్చేస్తా! 

ఇంద! 
*****************×* 

ఇవిగో సార్, తల్లి 20,000, పిల్ల 2000 
**×*********** 

మాష్టారు! నెలలో ఇచ్చేస్తాను, 5,00,000 అప్పివ్వండి సార్! 

మాష్టారు తల్లి,పిల్లని ధ్రుష్టిలో పెట్టుకుని ఇచ్చేసారు 5,00,000 
********* 

ఏమయ్య ఆనందం! ఆర్నెల్ల పోద్దైంది, 
తల్లీ లేదూ, పిల్లా లేదు! 
నీకిదేమైనా ధర్మమా చెప్పు! నువ్వు అదనంగా ఇచ్చే సొమ్ముకి ఆశపడి, మా ఇంటావిడ నగలు తాకట్టు పెట్టి మరీ నీకిచ్చానే 5,00,000 

" మూణ్ణెలైంది తల్లి పోయి! 
ఆ బాదలో నేనున్నాను సార్ 
ఇంక పిల్ల వూసే లేదు సార్! "
--((**))--

అయ్యగారూ నేను తాళం తీస్తా. ఆ కీస్ ఇలా ఇవ్వండి ఫుల్‌గా తాగి ఊగుతూ తాళం తీయలేక పోతున్నారు. 
...... 
వెధవా, తాళం నేను తీస్తాకానీ బిల్డింగ్‌ను అటూ ఇటూ ఊగకుండా పట్టుకో చాలు 
--((**))--

"ఎరా అబ్బాయ్....ఈ మధ్య మనోడు .... 
రాత్రి పూట .... 
"జూ" కి వెళ్లి పడుకుంటున్నాడుట..... 
ఏందీ సంగతీ ??!" అడిగాడు "ఇన్ఫర్మేషన్ టెక్కు" 
"అవ్ మల్ల !!!!......పాపం , వాడి బీవి పుట్టింటికి పోనాది మరి.... 
రాత్రి పూట వాడికి అరుపులు , కేకలు ఇనపడక పొతే .... 
నీంద్ రాదు భై !!" అన్నాడు "కస్టమర్ కేర్!!
 --((**))--



సేకరణ

షోడశ_దానాలు


*దానాలన్నిటిలో ముఖ్యమైనవి షోడశదానాలు, అవి వరుసగా ::*

*(1) కన్యా దానం = దీనివల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.*
*(2) సువర్ణ దానం = దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.*
*(3) దాసీజనం దానం = దీనివల్ల ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది.*
*(4) వాహన దానం = దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.*
*(5) అశ్వ దానం = దీనివల్ల గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది.*
*(6) గజ (ఏనుగు) దానం = దీనివల్ల శివలోక ప్రాప్తి కలుగుతుంది.*
*(7) గ్రుహ దానం = తీనివల్ల విష్ణులోకం ప్రాప్తి కలుగుతుంది.*
*(8) నాగలి దానం = దీనివల్ల క్రుష్ణ ప్రీతి కలుగుతుంది.*
*(9) కాలపురుష దానం = దీనివల్ల కోరికల సిద్ధి కలుగుతుంది.*
*(10) కాలచక్ర ప్రతిమ = దీనివల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది.*
*(11) భూ దానం = దీనివల్ల శివలోకం నివాసం కలుగుతుంది.*
*(12) మేక దానం = దీనివల్ల శివ ప్రీతి కలుగుతుంది.*
*(13) వ్రుషభ దానం = దీనివల్ల మ్రుత్యుంజయం కలుగుతుంది.*
*(14) పాన్పు దానం = దీనివల్ల గోలోక ప్రాప్తి కలుగుతుంది.*
*(15) గో దానం = దీనివల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.*
*(16) నువ్వురాశి దానం = దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. 🙏🙏🙏


తాతగారూ! తాతగారూ!
ఒకే ఒక్క సారి ఈ బాల్టీ తన్నరా ప్లీజ్ తాతయ్యగారూ!

ఎందుకురా బడవా?

నిన్న మా నాన్నగారు అప్పుల అప్పారావు తో చెబుతా వుంటే విన్నాను!

ఏం చెప్పేడురా మీ నాన్న?

మీరు బాల్టీ తన్నేస్తే మీ కోట్ల ఆస్తి మా నాన్నగారికొస్తే, అప్పులన్నీ తీరిపోగా ఇంకా బోలెడు మిగుల్తుందట!

నేటి హాస్యం

"ఏమేవ్ తలుపు తీయ్ "పూటుగా తాగి అర్ధరాత్రి ఇంటికొచ్చి తలుపు బా ది అరిచాడు రామా రావు .
"నేను తీయను .ఇంతవరకు ఎక్కడున్నావో అక్కడికే ఫో .."అంతే స్పీడ్ గా రిప్లై ఇచ్చింది ఇల్లాలు .
"తలుపు తీయకపోతే పక్కనే ఉన్న డ్రైనేజీ లో దూకి ఛస్తా ."బెదిరించాడు .
"దూకి చావు .నేను తీయ ను ఫో ."తొణక్కుండా చెప్పింది .
వెనక్కొచ్చి రామా రావు అటూ ఇటూ చూసి ఓ పెద్ద బండ రాయి ని డ్రైనేజి లో పడేసాడు .
ఢమాల్ ....

సౌండ్ విని తలుపు తీసి పరుగున డ్రైనేజి దగ్గరకెళ్ళి చూస్తున్న ఇల్లాలి వెనుక నుంచి తుర్రు మని ఇంట్లోకి దూరిన రామా రావు తలుపు మూసి గడియ పెట్టేసాడు .

"ఓయ్ ..తలుపు తీయి " కోపంగా అరిచింది ఇల్లాలు .
"నేను తీయ ."తాపీగా రామా రావ్ .
"తీయకుంటే అరిచి గోలపెట్టి ఇరుగు పొరుగు అందర్నీ లేపి నీ సంగతి తెలుస్తా "
"అదే నాక్కూడా కావాల్సింది .అందరూ వస్తే ఇంత రాత్రి వేళ నైట్ గౌన్ వేసుకుని ఎక్కడ నుంచి వచ్చావో అడిగి సమాధానం ఇచ్చాకే తలుపు తీస్తా .అరువు ..పిలు అందరిని ."
వామ్మో ..ఎవడండీ తాగినోడికి బుర్ర బుద్ధి ఉండదని చెప్పింది .??
 --((*))--


నేటి హాస్యం

బావగారూ! మీరేమీ అనుకోనంటే ఓ మాట!

హిందీ సామెత ప్రకారం ప్రపంచమంతటికంటే బామ్మర్దే గొప్ప!
ఏమీ అనుకొనే ప్రశ్నే లేదు!
మొహమాట పడకండా అడుక్కో మరి!

మీరు పగలల్లా బుద్దిమంతులు!
సాయంత్రం మాత్రం
ఫుల్ గా మందు కొట్టి మరీ
ఘాటైన రత్నా కిళ్ళీ బిగించి ఇంటికెళతారెందుకో?

మీ అక్కయ్య గారి ఘాటుని తట్టుకొనే శక్తినొసంగే ఇందనాలురా అవి నాకు బామ్మర్దీ!
--((*))--

నేటి హాస్యం

అమ్మాయ్ దీప్తి! కవిత్రయం పేర్లు చెప్పు తల్లి!

పోసాని, బోయపాటి, సిరివెన్నెల!

టీచర్! ఆ అమ్మాయి తప్పు చెప్పింది టీచర్!
నేను చెప్తా టీచర్!

చెప్పు బంగారు తల్లీ

యద్దనపూడి సులోచనా రాణి
కోడూరి కౌసల్యాదేవి
బినాదేవి
(నన్నయ్య, తిక్కన, యర్రాప్రగడ)
--((*))--


నేటి హాస్యం
ప్రాంజలి ప్రభ

మనిషి పొతే....
కొవ్వొత్తి వెలిగిస్తారు!!!

పుట్టిన రోజు కి మాత్రం ....
కొవ్వొత్తి ఆర్పేస్తారు!!
ఎందుకు ??

ఫూలాన్ దేవి , బందిపోటు....
అయినా ఎన్నికలలో గెలిపిస్తారు

కిరణ్ బేడి....ఐ పి ఎస్ పోలీసాఫీసరు..
ఎన్నికలలో ఓడిస్తారు

నాయకుల మాట నమ్మి ఓటేస్తారు
నాయకులను కనీసం అడగలేని వారు
అవునా ..... అవునురా అవునూ
మేము గెలిపిస్తాం, ఓడిస్తాం
ఇది మా ఇష్టమ్
 అవునా ..... అవునూ  ఆ....   ఆ .....

--((*))--


నేటి హాస్యం
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఎవరైనా ఒంటరిగా కూర్చుని ...
నవ్వుకుంటూంటె....
వీడికి పిచ్చి పట్టింది రోయ్....అనేవారు !!
ఒకప్పుడు ....
ఏమిటిరా ఎవరితో పడితో వారితో చాటింగ్ చేసి
అదే పనిగా సెల్ వదలకుండా ఆడుకుంటూ నవ్వితే
వీడి దగ్గర చాలా కళలున్నాయి నేర్చు కోవాలనేవారు
ఒకవైపు
మరోవైపు వీడు ఎప్పుడు మారతాడో ఆసెల్ తీసేయండర్రా
అనేవారు మరికొందరు
ఆమాటలకే కోపం వచ్చి నెలకు కొట్టి వెళ్ళేవారు కొందరు
అవునా
అవును
అలా కొట్టకురా నాకిచ్చెయ్ నీకళ్ళు బాగు చేసుకోరా
ఆ.....   ఆ.....         ....  నీ సెల్లు ఒక సారి నాకు ఇవ్వు
 అని నవ్వుతు లాక్కున్నాడు ఆ .. ఆ...  అంటూ
సెల్ కోసం ఆ ఆయా .. అనేక తప్పలేదు
--((*))__


నేటి హాస్యం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

భర్త : ఇదిగో మీనాన్న ఉత్తరం వ్రాసారు
భార్య: నేను పుట్టింటికి వెళతాను
           కానీ ఒక షరతు .....  మీరు నన్ను దిగపెట్టాలి అన్నది
భర్త : ఊ...   సరే నది ఒక షరతు
భార్య: ఏమిటండి అది
భర్త: మల్లి నేను నిన్ను తీసుకోని వెళ్ళడానికి వచ్చేదాకా
        నీవు పుట్టింటింట్లోనే ఉండాలి
భార్య: నాది ఒక షరతు ఈరోజు నిదగ్గరనుంది ఫోన్ రాదో
        ఆ రోజే బయలు దేరి వస్తాను దానికి ఒప్పుకుంటే దించండి
భర్త : పుట్టింటిలో దించి వచ్చాడు
భార్య : రెండో రోజే తిరిగి వచ్చింది ఈషరతు మీద ?
.........................
.........................

భర్త : మాట తప్పవు నీకు ఫోన్ చెసాగా
భార్య: వేరేవారి ఫోన్ తో చేస్తే నాకు అనుమానం రాదా
భర్త : ఆ...     ఆ..   .. అంటూ బుర్ర గోకుంటున్నాడు
భార్య: బుర్ర గోక్కోకు ఆ ఉన్న జుట్టు కూడా ఊడి పోతుంది
           ఇదిగో ఫోన్ మీ లవర్ కి ఫోన్ చేయండి నీతో పనిలేదు
           మా ఆవిడ వచ్చిందని
భర్త: ఆ...       ఆ....        ఆ....           ఆ....

--((*))--


నేటి హాస్యం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఎరా మనవడా అంటూ పిలిచింది బామ్మా
ఏమిటిరా అంత దిగులుగా ఉన్నావ్
ఏమి లేదు బామ్మ ఫేస్ బుక్ లో వ్రాసే కవితలకు
ఒక్కరు కూడా లైక్ చేయుట లేదు ఎందుకు?
నీవే ఉద్యోగం సద్యోగం లేని సన్నాసివి, నీకెవరురా లైక్ చేసేది
అమ్మాయిలతో చాట్ చేస్తున్నావ్ మోసపోతావంటే
వినిపించుకోవు ...  ఈ పిల్లలు ఎప్పుడు మారుతారో
అంటూ లోపలి వెళ్ళింది బామ్మ
అబ్బా నాకు ఎన్ని లైకులో అంటూ
పెద్దగా అరిచాడు మనవుడు
....  ... .....
పిల్లల సంతోషం కోసం బామ్మలు సెల్ ఫోన్ వాడాల్సిన
పరిస్థితి వచ్చింది ఇది ఏమి లోకం
అంటూ మనవాడి తలనిమిరింది బామ్మా
ఆ ...  ఆ..      ఆ..    ఆ..

--((*))--

నేటి హస్యం

పెళ్లి జరుగుతోంది....
బ్యాండు , ఆర్కెస్ట్రా వాళ్లు ఫుల్ గా పాటలు వాయిస్తున్నారు!!
అందరూ తాగి డ్యాన్సు చేస్తున్నారు!!!
ఆర్కెస్ట్రా వాళ్లు "పెళ్లి పెద్ద" ని అడిగారు....
"ఎం సారూ ...ఇంకా ఎంత సేపు ఇలా వాయించాలి  ??" అని
"ఎంతో సేపు అక్కర లేదు....
ఇంకో 5...6 పెగ్గులు తాగేదాకా వాయించండి ....
తరువాతా , వాళ్లు "జెనరెటర్ " సౌండ్ కి కూడా డ్యాన్సు చేస్తారు...
ఎక్కడి వారు అక్కడ పడిపోతారు
ఆర్కెస్ట్రా అవసరం లేదు" అన్నాడు "పెళ్లి పెద్ద"
మరి డబ్బు
మీకు కుడా బాటిల్సు ఇస్తా త్రాగండి
ఆతరువాతే డబ్బు
ఆ.....       ఆ .....
--౯౯౮౦౦--

నేటి హాస్యం

లవర్స్ పార్కులో చేరారు
మనం స్కూటర్ మీద పోవటం చూస్తోరుట
మీనాన్న అరిచారా ఏమిటి
మరి అరవక ముద్దు పెట్టుకుంటారా
మనం పెళ్లి చేసుకుందామనుకున్నాముకదా
మా నాన్న పెళ్లి అయ్యేదాకా ఆటోమీద పో
అలా కుర్రోళ్లతో తిరగకు అని అరిచారు
అయితే ఎంచక్కా నేను ఆడ డ్రస్సు
వేసుకొని ఆటోలో వస్తాలే
ఆ ఆటో డ్రైవరుగా ఉండేది మానాన్నే
ఆ ......     ఆ ....


నేటి హాస్యం

ఆంటీ నాకు కలలు వస్తున్నాయి
"మీరు నిద్ర లో చూసెవి ...
కలలు...కలలే కావు!!
..
మరి ఏమిటి అంటి

ప్రేమ లో పడ్డవాళ్ల కి ...
రక రకాల కలలు చూపించి..
ఫోన్ రిచార్జ్ చేయించు కునేవే .........
అసలు కలలు అంటె ..
పెళ్లయ్యాక తెలుస్తుంది
ఖర్చు గురించా అంటి
ఆ ఆ అదే .....   .....

నేటి హాస్యం

ప్రపంచం లో ఎవరైనా ...
అసలు అసూయ పడని విషయం...
"ఎదుటి వాళ్లు మనకంటే సన్నగా " వున్నప్పుడు!!!
"ఎదుటి వాళ్ళు మనకంటే ఎక్కువ సంపాదన" ఉన్నప్పుడు
"ఎదుటి వాళ్ళు మనకంటే ఎక్కువ అందంగా " ఉన్నప్పుడు
" ఎదుటి వాళ్లకు మనకంటే ఎక్కువమంది పిల్లలు" ఉన్నప్పుడు
నిజమన్నా ఎవరు నమ్ముతారు ........  నాభార్య తప్పా
--((*))--

నేటి హాస్యం :

అప్పుడే ఫోన్ వచ్చింది సందేహాల రావు గారికి
వాడ్సాప్ ఓపెన్ చేసి చూడండి
"నీ భార్య ని మేము కిడ్నాప్ చేసాము ...
మేము అతి కిరాతకులం....
నీకు నమ్మకం కలగ డానికి....
ఫొటోతో సహా పంపాము
నేను నేను నమ్మను, నేను చూడను
అంత గట్టిగా ఎలా చెపుతారు
ఎందుకంటే : నాభార్య నన్నే కిడ్నాప్ చేసి అమ్మే లక్షణమ్
ఉంది కనుక
ఫోన్ కట్ ............           
ఎందుకైనా మంచిది అని వాడ్సాప్ చూసాడు
అనే ఒకటే నవ్వు ........  ...................


నేటి హాస్యం :

భార్య: ఏవండీ కొంచం డిఫరెంటుగా ఉండాలని ఉంది
భర్త : కొంపలు తీయటానికి నగ్నంగా ఉండాలను కోవటం లేదుకదా
భార్య: ఛీ పాడు అవేమాటలండీ
భర్త : నన్ను చంపక డిఫరెంట్ అంటే ఎలా ఉంటావో చెప్పవే
భార్య: బ్యూటీ పార్లర్ నుండి వచ్చాక చూసి చెప్పండి
భర్త: సరే వెళ్లి త్వరగా రా రా
        పోలీసులు ఒక పిచ్చమ్మాయిని తీసుకు వచ్చి ఈ పిల్ల మీ ఆవిడ అంటుంది
        నిజమా సార్
        ఛీ ఛీ ఈవిడ నా భార్య ఏమిటి తీసుకెళ్లి నాలుగు తన్నండి అప్పుడు నిజం చెపుతుంది
        పోలీసులు వెళ్లి పోయారు
భర్త : కొంపతీసి ఇది నా భార్య డిఫరెంట్ రోలు కాదు కదా
         అంటూ ఒకటే పరుగు పోలీసుస్టేషన్ కు .......  .......


శ్రీమతిగారు!
మీ బంధువులొచ్చారు.. కాస్త ఇలా వచ్చి రిసీవ్ చేసుకుని మర్యాద చెయ్యి..

(ఆవిడ పాపం గబ గబా వచ్చి చూసేసరికి రెండు గాడిదలు కనిపించేయి) ..

కాని ఆ ఇల్లాలు వెంటనే తడుముకోకుండా..

"రండి మావయ్య గారు! రండి అత్తయ్య గారు" అంది..

--((*))--
Photo

కావ్య తేజ గారి రచన

అ౦దరికి కనువిప్పు కలిగించే వాస్తవ కధ
ఓకొడుకు... కోడలు... వారి పుత్రుడు....
వారితో పాటు నాన్నమ్మ ఒకే ఇ౦ట్లో ఉ౦డే వారు
ఆ కోడలికి అత్తగారిని ఎలాగైనా వేరు గా ఉ౦చాలి అన్న ఆలోచన ఉ౦డేది...
ఎన్నిసార్లు భర్తను అడిగి చూసిందికాని ఆ కొడుకు ఒప్పుకోలేదు..
రోజు ఏదో వ౦క తో భర్త ను సాది౦చసాగింది....
ఒకరోజు భర్తతో మ౦చి గా ఉ౦టునే.... ఇలా అన్నది
మీ"అమ్మ ను పక్కనే ఉన్న ఇ౦ట్లో ఉ౦చి... సమయానికి వేడివేడి గా వేళ కు చేసి ప౦పుతాను
ఆమె కూడా విశ్రాంతి గా ప్రశాంతంగా ఉంటుంది కదా!..
ఒక్క సారి ఆలోచి౦చ౦డి.....
ఏదో చిరాకు లో ఉ౦డి. "సరే చూద్దాం" అన్నాడు భర్త
ఇదే అదునుగా ఆత్త గారికి ఇ౦టికి పక్కనే ఓ ఇ౦టి ని చూసి ప౦పడానికి రెడీ చేసింది ఆ కోడలు....
ఆతల్లి కూడాకొడుకు మాటను కాదు అనలేక తనవల్ల ఇద్దరి మద్య గొడవ ఎందుకు అని ఆ తల్లి
అ౦గీకరి౦చి౦ది..
కానీ కొడుకు కు తెలియకుండా ఆకోడలు అత్త గారికి ఒక షరతుపెట్టింది. ......
అదే౦ట౦టే-అత్తగారిని ఒక పళ్ళై౦ఇచ్చి భోజనానికి టిఫిన్ కు ఆ పళ్ళై౦ తీసుకుని రావలి.....
పాపం ఆతల్లి కి ఆవమాన౦ అనిపించింది అడుక్కుతినేదానిలా అలా వెళ్లడం భాదగా అనిపి౦చిన కొడుకు ను ఇబ్బంది పెట్టలేక అలాగే చేసింది ఆ అత్త గారు ఇది మనవడికి చాలా భాద గా అనిపించేది....
నానమ్మ అలా దూరంగా ఉ౦డట౦ ఆ పసిమనసుకు నచ్చలేదు ...వాళ్ళ ఆమ్మ కు తెలియకుండా
నాన్నమ్మ దగ్గరకు వెళ్లి అడుకొనేవాడు.... అలా కొన్ని స౦వత్సరాలు గడిచిపోయాయి...
మనవడికి మ౦చి ఉద్యోగం వచ్చింది మొదటిజీతం రాగానే తన తల్లి కి ఒక వె౦డి పళ్ళె౦తీసుకుని వచ్చాడు ఆ తల్లి ఆనందంతో..
"నామీద ఎంత ప్రేమ రా! నీవు నాకు వె౦డి పళ్ళె౦తెచ్చావా ! నువ్వే రా నాకొడుకు ఆ౦టే"అని కొడుకు ని మెచ్చుకొని మళ్ళీ ఇలా అ౦ది....
"ఇ౦ట్లో ఎవరికి వె౦డి పళ్ళె౦లేదు మరి నాకే ఎందుకు తెచ్చావురా కన్నా ! .అని అడిగింది దానికి ఆ కొడుకు ఇలా జవాబు ఇచ్చాడు...
"అమ్మ! రేపు నాకు పెళ్లి అవుతు౦ది.నువ్వు కూడా వేరే గా ఉ౦డాల్సివస్తు౦ది. కదా!
నాపెళ్ళ౦ నీకు కనీసం స్టీల్ పళ్ళె౦కూడా ఇవ్యడానికి ఒప్పుకోకపోవచ్చు అ౦దుకు ఇప్పుడే వె౦డిపళ్ళె౦కొనేసాను....
రేపు నువ్వు ఏ ఆకు లోనో ఆన్న౦తినడం నేను చూడలేనమ్మ !...కనీసం మాఅమ్మ వె౦డిపళ్ళె౦లో అడుక్కు౦టుదన్న తృప్తి నాకు ఉ౦డాలి కాదామ్మా ...

కాబట్టి మనము ఇతరులకు.చేసే మ౦చైన చెడైనమళ్లీ మనకి తిరిగి వస్తుంది.....
తల్లి ద౦డ్రులను భార౦గా భావించి మీరు తప్పు చేస్తూ మీ పిల్లలకు కూడా నేర్పక౦డి....

తప్పు లు ఉంటే క్షమి౦చ౦డి...

మీనేస్త౦.....కావ్య తేజ.......
--((*))--

సేకరణ

మితిమీరితే ....

మితిమీరిన ఖర్చు ... *_
పేదరికం పాలు చేస్తుంది._*

మితిమీరిన పొదుపు .. *_
కష్టాల పాలు చేస్తుంది._*

మితిమీరిన సంపాదన ... *_
మనశ్శాంతిని లేకుండా చేస్తుంది._*

మితిమీరిన కర్తవ్యం ... *_
అగచాట్ల పాలు చేస్తుంది._*

మితిమీరిన క్రమ శిక్షణ ... *_
రక్త సంబధీకులను దూరం చేస్తుంది._*

మితిమీరిన బాధ్యతలు ... *_
అప్పుల పాలు చేస్తుంది._*

మితిమీరిన హాస్యం ... *_
నవ్వుల పాలు చేస్తుంది._*

మితిమీరిన కోపం ... *_
శతృవులను వృద్ధి చేస్తుంది._*

మితిమీరిన ఆలోచనలు ... *_
జీవితాన్ని దుర్భరం చేస్తుంది._*

మితిమీరిన వ్యసనాలు ... *_
అప మృత్యు పాలు చేస్తుంది._*

మితిమీరిన స్వార్ధం ... *_
అందరినీ దూరం చేస్తుంది._*

మితిమీరిన పోటీ ... *_
నష్టాల పాలు చేస్తుంది._*

మితిమీరిన లాభార్జన ... *_
వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది ._*

మితిమీరిన వస్తూత్పత్తి ... *_
నాణ్యతా ప్రమాణాల దెబ్బ తీస్తుంది._*

మితిమీరిన గర్వాహంకారం ... *_
ఆపదలు కొని తెస్తుంది._*

మితిమీరిన అలంకారం ... *_
వెగటు పుట్టిస్తుంది._*

మితిమీరిన శృంగారం ... *_
వైరాగ్యాన్ని కలిగిస్తుంది._*

మితిమీరిన కామాంధకారం ... *_
జీవచ్చవాన్ని చేస్తుంది._*

మితిమీరిన దారిద్రయం .. *_
నేరాల పాలు చేస్తుంది._*

మితిమీరిన అధికార దాహం ... *_
హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది._*

మితిమీరిన త్యాగం ... *_
కడగండ్ల పాలు చేస్తుంది._*

మితిమీరిన వ్యావసాయకోత్పత్తి ... *_
భూమిని నిస్సారం చేస్తుంది._*

మితిమీరిన జనాభా పెరుగుదల ... *_
దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది._*

మితిమీరిన స్నేహాలు ... *_
అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది._*

మితిమీరిన గారాబం ... *_
చెడు స్నేహాల పాలు చేస్తుంది._*

మితిమీరిన వేదాంతం ... *_
వెటకారం పాలు చేస్తుంది._*

మితిమీరిన ఈర్ష్ర్యాసూయాద్వేషాలు .. *_
నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది._*

మితిమీరిన భక్తి ... *_
మూర్ఛల పాలు చేస్తుంది._*

మితిమీరిన తీర్ధ యాత్రలు ... *_
నాస్తికత్వానికి నాంది పలుకుతుంది._*

మితిమీరిన ఉపవాసాలు ... *_
నిస్రాణతకు దారి తీస్తుంది._*

మితిమీరిన ప్రేమ ... *_
అనుమానాలకు దారి తీస్తుంది._*

మితిమీరిన నమ్మకం .. *_
ద్రోహానికి దోహదం చేస్తుంది._*

మితిమీరిన విశ్వాసం ... *_
లోకువ పాలు చేస్తుంది._*

మితిమీరిన ఋణం ... *_
మరణం పాలు చేస్తుంది._*

మితిమీరిన అభిరుచి ... *_
దుబారాకు దారి తీస్తుంది._*

మితిమీరిన కీర్తి దాహం ... *_
ఆదాయాన్ని మింగేస్తుంది._*

అతి సర్వత్ర వర్జయేత్ ...
తస్మాత్ ... జాగ్రత ...
జాగ్రత ...
జాగ్రత .

*_🎨 మితా హారం ..._*
*_🎨 మిత భాషణం ..._*
*_🎨 మితమైన నిద్ర ..._*
*_🎨 మిత సంసారం ..._*
*_🎨 మిత సంపాదన_*
*_🎨 మనో కాలుష్య రహితంగా ..._*
*_🎨 జీవన యానం సాగిస్తే ..._*
*_🎨 పరిపూర్ణమైన జీవితానంద ప్రక్రియకు ... అదే రాచబాట._*

*_💦శాంత ప్రశాంత యుతమైన మనశ్శాంతికి ... అదే పూల తోట._*

*_🎯మూర్తీభవించిన మానవతా విలువలకు ... అదే పెట్టని కోట._*

--((*))--
సేకరణ

#దేవాలయం వాటి వివరాలు:

ఇవి కాపీ చేస్కుని భద్రపరుచుకోండి .. మీకు కావాల్సిన వాటిపైన క్లిక్ చేస్తే సమాచారం క్షణాల్లో ఓపెన్ అవుతుంది

దేవాలయాలలో వసతి సౌకర్యం కోసం : https://goo.gl/gDaGJ4

ఎ పి లో జిల్లాల వారి దేవాలయాల వివరాలు : https://goo.gl/Qzhzis

రాష్ట్రాల వారీగా దేవాలయాల సమాచారం : https://goo.gl/VnNaj5

జ్యోతిర్లింగాల క్షేత్రాల వివరాలు : https://goo.gl/X9NBUe

శక్తిపీఠాలు సమాచారం : https://goo.gl/LtvStS

గ్రూప్ టెంపుల్స్ : https://goo.gl/N9xD8M

ఆరుపడైవీడు క్షేత్రాల కోసం : https://goo.gl/HqGR8P

పంచారామ క్షేత్రాల వివరాలు : https://goo.gl/ygX5hW

పంచభూత క్షేత్రాల వివరాలు : https://goo.gl/pqtgxj

తిరుమల గురించి : https://goo.gl/mb2DGD

శ్రీకాళహస్తి గురించి : https://goo.gl/UJbxmF

కాశి గురించి : https://goo.gl/DZzKa1

రామేశ్వరం గురించి : https://goo.gl/yyH424

అరుణాచలం గురించి : https://goo.gl/eFbKNE

మదురై గురించి : https://goo.gl/1Ntthd

శ్రీశైలం గురించి : https://goo.gl/ZUfFHo

కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి : https://goo.gl/A5UU7v

ప్రసిద్ధ శైవ క్షేత్రాలు : https://goo.gl/mn2K3y

మహాభారతం పుస్తకాలూ : https://goo.gl/v1XuqV

భాగవతం పుస్తకాలూ : https://goo.gl/9fMcDp

టెంపుల్ క్విజ్ ఆడండి : https://goo.gl/nrhsBK

దేవాలయాలలో వసతి సౌకర్యం కోసం : https://goo.gl/gDaGJ4

ఎ పి లో జిల్లాల వారి దేవాలయాల వివరాలు : https://goo.gl/Qzhzis

రాష్ట్రాల వారీగా దేవాలయాల సమాచారం : https://goo.gl/VnNaj5

జ్యోతిర్లింగాల క్షేత్రాల వివరాలు : https://goo.gl/X9NBUe

శక్తిపీఠాలు సమాచారం : https://goo.gl/LtvStS

గ్రూప్ టెంపుల్స్ : https://goo.gl/N9xD8M

ఆరుపడైవీడు క్షేత్రాల కోసం : https://goo.gl/HqGR8P

పంచారామ క్షేత్రాల వివరాలు : https://goo.gl/ygX5hW

పంచభూత క్షేత్రాల వివరాలు : https://goo.gl/pqtgxj

తిరుమల గురించి : https://goo.gl/mb2DGD

శ్రీకాళహస్తి గురించి : https://goo.gl/UJbxmF

కాశి గురించి : https://goo.gl/DZzKa1

రామేశ్వరం గురించి : https://goo.gl/yyH424

అరుణాచలం గురించి : https://goo.gl/eFbKNE

మదురై గురించి : https://goo.gl/1Ntthd

శ్రీశైలం గురించి : https://goo.gl/ZUfFHo

కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి : https://goo.gl/A5UU7v

ప్రసిద్ధ శైవ క్షేత్రాలు : https://goo.gl/mn2K3y

మహాభారతం పుస్తకాలూ : https://goo.gl/v1XuqV

భాగవతం పుస్తకాలూ : https://goo.gl/9fMcDp

టెంపుల్ క్విజ్ ఆడండి : https://goo.gl/nrhsBK
--((*))--


సుబ్బారావు! అంతులేకుండా ప్రతి క్షణం సిగరెట్లు వూదేస్తున్నావు కదా, రోజుకి ఎన్ని పేకెట్లౌతాయోయ్?

",,,,,,"

మూడు పేకెట్లౌతాయోయ్?

ఔను సార్!

"సారూ! వాడు చెప్పిన సంఖ్య సిగరెట్లు కాదు సారూ"

మరి?

"సిగరెట్లు ముట్టించడానికుపయోగించే అగ్గిపెట్టెలు సారూ"

సుబ్బారావు! చస్తావోయ్

"Already చేస్తూనే వున్నాడు సారూ"

ఎలా?

"1 అప్పులు పుట్టక
2 దగ్గూ, కఫం, ఆంబం,............?

మరి మానేయొచ్చు కద సుబ్బారావు?

ఒక్కసారిగా మానేస్తే అందరికీ అనుమానమొస్తుందేమొనని మానటం లేదండీ!
 --((*))--

1. చంటి.....నీ పుట్టిన రోజు కి నేను గిఫ్ట్ గా ఇచ్చిన డ్రమ్స్ నచ్చాయా? నేర్చుకుంటున్నావా?' 
'   ఆరోజు నాకు వచ్చిన బహుమతులన్నింటిలోకీ నాకు బాగా నచ్చింది అదే అంకుల్' 
    ఎందుకనీ? 
'   పొద్దున్నే దాన్ని వాయించకుండా ఉండటానికి నాకు అయిదు రూపాయలిస్తున్నారు     నాన్న. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికొచ్చాక కూడా దాన్ని వాయించకుండా ఉండటానికి అమ్మ మరో రెండు రూపాయలిస్తోంది'
2. శ్రీమతిగారూ! 

    రేపు మీ పుట్టింటికి వెళ్ళి మీ నాన్నగారు ఇవ్వాల్సిన కట్నం లక్ష పట్టుకొచ్చేయ్! 

    శ్రీవారూ! మీరొక పని చేస్తే రెండు లాభాలు!!! 

    అవేమిటో? 

    రైతు ,డ్వాక్రా రుణ మాఫీ పతకం తో మన ముఖ్యమంత్రులిద్దరికీ ఎంత పేరు వచ్చిందో, 
    మీకూ అంత పేరు వస్తుంది కట్నం రుణమాఫీ చేసినట్లైతే! 

    మరో లాభం? 

    మీరు కట్నం వూసెత్తగానే గ్రుహ హింస కేసు నా చేత వేయించడానికి మా నాన్నగారు       అన్ని    కాయితాలతో సిద్దంగానున్నారు మరి!

--((*))--

3. సేకరణ 

ఈ కాలము లో 'విడాకులు' అనేది సర్వసాధారణ మయిపోయింది. 

చిన్న చిన్న విషయాలకు కూడా విడిపోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. 

ఉదయం పెళ్లి మధ్యాహ్నం సంసారం, సాయింత్రానికి విడాకులు యిదీ తంతు. 

ప్రతి చిన్న విషయానికీ గొడవ పడి స్నేహబంధాన్ని 
కబంధ బంధంగా ఊహించుకొని విడిపోయి స్వేఛ్ఛాలోకం లో విహరించాలను కోవటం వంటివి ఎంతవరకు మానసిక, సామాజిక తృప్తిని కలిగిస్తాయో ఆలోచించ లేకపోతున్నారు. 

రాక్షసత్వం,నియంతృత్వం,శాడిజం నుంచి బయట పడటం కోసం విడాకులు తీసుకోవడం 
తప్పు కాదు. 

మెరుపు నిర్ణయాలు, అసహనం, అనవసర కోపం మంచిది కాదు. 

ఎవరో ఏదో చేశారని,చేస్తారని మనం ఏర్పరుచుకున్న పవిత్ర సాంప్రదాయ మైన వివాహ వ్యవస్థ మీద 
దుమ్మెత్తి పోయటమే తప్పు. 

ఈ వ్యవస్థ లో మనకూ భాగం వున్నదని విషయం మీద అవగాహన లేకుండా కేవలం శారీరక సుఖం కోసమే సాంప్రదాయము ఏర్పడిందని అనుకోవడం పొరపాటు. 

సంసారం అనేది ఆటకాదు.ఆచారం. 

దాన్ని అనాచారంగా తూర్పారబడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడడం అవివేకం. 
ఈ విడాకుల వలన అమాయకమైన పసిపిల్లలు నలిగి పోతున్నారు. 
అమ్మనా?నాన్ననా?అని తేల్చుకోలేక సతమత మవుతున్నారు. 

ఈ విడాకులు అనే మాటమీద వివిధ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా వుంటుంది. 

పెళ్ళికాకముందు వధూవరులు విడి విడి ఆకుల్లో భోజనం చేస్తారు.అప్పట్లో మోదుగ ఆకులతో కుట్టిన విస్తరిలో కానీ,వెండి కంచం లో కానీతినేవారు. 
పెళ్లిఅయిన తర్వాత ఒకే విస్తరిలో భోజనం వడ్డించి యిద్దరి చేత తినిపిస్తారు. 
ఇది యిద్దరి మధ్య వున్న సిగ్గు,బిడియం తొలగించటానికి పెద్దలు ఏర్పాటు చేసిన ఒక తంతు మాత్రమే.ఆ దంపతులకు అభిప్రాయం భేదాలు వచ్చిగ్రామ పెద్దల సమక్షం లో ఒక ఆకులో భుజించే ఆచారం రద్దు చేసి మళ్లీ విడి విడి ఆకుల్లో తినాలని తీర్మానిస్తారు. 

ఈ విధంగా విడి విడి ఆకుల్లో తినే పద్ధతిని 'విడాకులు' అని వ్యవహరించేవారు.దీన్నే కోర్టు ద్వారా పత్రాల మీద సంతకాలు చేసి విడి విడి గా పత్రాలు తీసుకుంటే విడాకుల పత్రాలని కొందరంటారు. 

ఇంకా కొందరు భార్యా భర్తలు విడిపోవాలని అనుకున్నప్పుడు తాంబూలం లోని పోక చెక్కను తీసి,విడి ఆకులు తీసుకుంటే వివాహబంధం రద్దయినట్లని దీనినే 'విడాకులు' అంటరాని చెప్తారు.. 

ఏది ఏమైనా విడి విడి గావుంటూ విడి ఆకుల్లో తింటూ స్వీయ నిర్మిత స్వర్గం లో విహరించాలనుకునేవారి జీవితం త్రిశంకు స్వర్గాన్ని గుర్తు తెస్తుంది అనేది అనుభవిస్తున్నవారి ఉవాచ 'పెళ్లి పెటాకులు' అయింది అనే పదం కూడా విడాకుల అర్థాన్నే సూచిస్తుంది. .
--((*))--

జ్యోతిష్యం గారు! మీకిదేమైనా బావ్యమా అని నేనడుగుతున్నాను.
నాకు బహుకాలం విధ్యనభ్యసించే యోగముందని గత పది సంవత్సరాలుగా చెప్పి నూరు రూపాయల చొప్పున తీసుకున్నారు కదా!

ఔను!

కొన్ని సంవత్సరాల నుండి చదువుతున్నా కాని ఎప్పుడూ ప్యాసవలేదు గదా! ఈసారి కూడా పరిక్ష తప్పాను.
దీనికి మీ జవాబు ఇప్పుడే ఇక్కడే కావాలి

నాయనా నా జోతీష్యము నిజము కాబట్టే నువ్వు పది సంవత్సరాలుగా పదొక్లాసు చదువుతున్నావు.
పరీక్ష పాసైనవాడు ధీర్గకాలము చదవడు కదా!

--((*))--


గురువు గారూ..నాకో ధర్మసందేహం. .

అడుగు ..నాయనా..

మనిషికి భవిష్యత్తు తెలిసిపోయే శక్తి వస్తే ఏం జరుగుతూంది..?

పెళ్ళిళ్ళు జరగడము కష్టము నాయనా,
ఆశ్రమాలు కిటకిటలాడుతాయి


--((*))--


గురువు గారూ..నాకో ధర్మసందేహం. . 

అడుగు ..నాయనా.. 

మనిషికి భవిష్యత్తు తెలిసిపోయే శక్తి వస్తే ఏం జరుగుతూంది..? 

పెళ్ళిళ్ళు జరగడము కష్టము నాయనా, 
ఆశ్రమాలు కిటకిటలాడుతాయి
--((*))--

" మిస్టర్ మూర్తి! ఈ ఇంటర్వ్యూ లో మీకిది ఆఖరు ప్రశ్న, గతంలో మీరు రైల్లో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందా?" 

" ఎస్ సార్! జరిగింది. ఒక సారి అరకు రూట్‌లో సొరంగం వచ్చినప్పుడు నా ముందున్న అమ్మాయికి బదులుగా పొరబాటున వాళ్ల నాన్నగారికిచ్చాను"

"ఏమిటిచ్చారు? " 

"ప్రేమ లేఖ" 

"తరువాత ఏమైందీ" 

" అయిదు నిమిషాలు తరువాత చెంప చెళ్ళుమంది, శివలింగపురం ప్లాట్ ఫారమ్ పై పడ్డాను

--((*))--

అమ్రుతమయి అమ్మ! 

తను అస్తమిస్తాననే సంశయమును, భయమును దరిజేరనీయక మనము ఉదయించాలని కోరుకునే గొప్ప త్యాగమూర్తి తల్లి...!! 

తన ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోతున్నా సరే కలత చెందకుండా మన ప్రాణం మాత్రం ఈ గాలిలోనే ఉండాలని దీవించే దేవత అమ్మ...!! 

మన జీవితానికి బలమైన పునాది నిర్మించడం కోసం 
తను సమాధి కాబడుతున్న సరే 
సంతోషంగా భరించే సహనమూర్తి తల్లి...!! 

ఏమి ఇవ్వగలం ఆ త్యాగాలకి... 

ఎంత చెల్లించగలం ఆ గొప్పతనానికి... 

ఎలా ఋణం తీర్చుకోగలం ఆ ప్రేమకిి... 

ఇంకేమి చెప్పగలం 

కోటానుకోట్ల వందనాలు తప్ప...!!
--((*))--

అమ్రుతమయి అమ్మ! 

తను అస్తమిస్తాననే సంశయమును, భయమును దరిజేరనీయక మనము ఉదయించాలని కోరుకునే గొప్ప త్యాగమూర్తి తల్లి...!! 

తన ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోతున్నా సరే కలత చెందకుండా మన ప్రాణం మాత్రం ఈ గాలిలోనే ఉండాలని దీవించే దేవత అమ్మ...!! 

మన జీవితానికి బలమైన పునాది నిర్మించడం కోసం 
తను సమాధి కాబడుతున్న సరే 
సంతోషంగా భరించే సహనమూర్తి తల్లి...!! 

ఏమి ఇవ్వగలం ఆ త్యాగాలకి... 

ఎంత చెల్లించగలం ఆ గొప్పతనానికి... 

ఎలా ఋణం తీర్చుకోగలం ఆ ప్రేమకిి... 

ఇంకేమి చెప్పగలం 

కోటానుకోట్ల వందనాలు తప్ప...!!

--((*))--

సేకరణ 

ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి, అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు. రాత్రి 8 కావొస్తుంది.. ఇంట్లో దీపం వెలుతురు తప్ప మరో కాంతి లేదు... ఆ చీకట్లో వారిని చూస్తే పెద్దవారిలా కనిపించారు. 

దాంతో... ‘లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు’ అంటూ ఆ ఇంటావిడ ఆహ్వానించింది. 

‘మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చేయము. అతను తిరిగివచ్చిన తరువాతే లోపలికి వస్తాము’... అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటున్నారు. 

భర్త పొలం పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తుండటం గమనించి.. బయట అరుగు మీద ఉన్న వారి వద్దకు వెళ్ళి... ‘నా భర్త వచ్చాడు లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా’... అని అడిగింది. 

‘లేదు.. కాని మా ముగ్గురిలో ఒకడు మత్రమే మీ ఇంట్లోకి వస్తాడు అది మా నియమం’.... అన్నారు. 

ఆ ఇల్లాలు ఆశ్చర్యంతో చూస్తుండగా ఓ పెద్దాయన ఇలా అన్నాడు.... ‘నా పేరు ప్రేమా, ఇతని పేరు గెలుపూ, ఈయన పేరు ఐశ్వర్యం. మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్వానించు’... అన్నాడు. 

వచ్చిన వారు మాములు మనుషులు కాదని... ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న ఆశీర్వాదాలు అని తెలిసిపోయింది. 

సంతోషంతో పొంగిపోతు అమె ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. విన్న భర్త పరవశంతో.... ‘బ్రతుకులో గెలుపే ముఖ్యము కాబట్టి ఆయన్నే పిలుద్దాం’..... అని అన్నాడు. 

దానికి ఆమె... ‘ఐశ్వర్యం లేకపోతే.. గెలుపు ఒకటే ఉండి ఏమి లాభం? కాబట్టి ఐశ్వర్యంని ఆహ్వనిద్దాం’... అని అంది. 

వీరి ఇద్దరి మాటలు వింటున్న వారి కోడలు... ‘గెలుపు, ఐశ్వర్యం కంటే ప్రేమ ఉంటె భార్యా భర్తలు, పిల్లలు, అత్తా కోడళ్ళు కలిసి మెలసి ఉండగలం కాబట్టి సుఖజీవనానికి ప్రేమే మూలాధారం’.... అంటూ సలహ ఇచ్చింది. 

వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి... ‘మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు’. 

ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ప్రేమ వెనకే గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో బాటు ఇంట్లోకి వచ్చాయి. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 

ఆ ముగ్గురూ ఇలా అన్నారు.... ‘మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరి ఉంటే మిగితా ఇద్దరు ఉండిపోవాల్సి వచ్చేది. కాని ప్రేమను మీరు ఆహ్వానించడంతో... మేమూ పిలవకుండానే వచ్చాము. ప్రేమ వెన్నంటే గెలుపు, ఐశ్వర్యం అనేవి నడవాలి అని మా దేవుని ఆజ్ఞ’.... అని అన్నారు. కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటె అక్కడ ఐశ్వర్యం, గెలుపు తప్పక ఉంటాయి. 

దయచేసి ఈ పోస్టుని ఇతరులతో షేర్ చేయండి. ముఖ్యంగా మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు ఇలాంటి వాటిపై అవగాహన కలిపించండి..!
--((*))--

అయ్యా! నలభై సంవత్సరాలుగా ఘర్షణలు లేని వైవాహిక జీవితం ఎలా సాధ్యం అయింది మీకు?

నలభై ఏళ్ల క్రితం, మా పెళ్లయిన కొత్తలో..
హనిమూన్‌కు ఒక హిల్‌ సెంటర్‌కి వెళ్లాము.
నా భార్య గుర్రం ఎక్కుతా అని ముచ్చటపడింది. ఇద్దరం చెరో గుర్రం ఎక్కాం. మా ఆవిడ ఎక్కిన గుర్రం ఎందుకో భయపడి కొద్ది దూరం వెళ్లాకా ఆమెను కిందపడేసింది. ఖంగుతిన్న నా భార్య గుర్రంకేసి వేలు పెట్టి చూపిస్తూ "ఫస్ట్‌ టైమ్‌" అంది.
నా గుర్రం సాఫీగానే వెళ్తోంది.
ఓ ఫర్లాంగు వెళ్లగానే మళ్లీ ఆ పెంకి గుర్రం నా శ్రీమతిని ఒక్క ఉదుటున కిందకి తోసేసింది.
కోపంతో ఆమె గుర్రం కేసి చూపుడు వేలు చూపిస్తూ "సెకండ్‌ టైమ్‌" అంది.
ఇంక హోటల్‌కి కిలోమీటరు దూరంలో ఉన్నాం..10నిముషాల్లో వెళ్లిపోతాం అనగా మరోమారు ఒక్క గెంతు గెంతిని గుర్రం మా ఆవిడ్ని కిందకి విసిరేసింది. ఆవేశంతో ఊగిపోయిన నా భార్య "థర్డ్‌ టైమ్‌" అంటూ పర్సులో నుంచి తుపాకి తీసి దానిపై బులెట్ల వర్షం కురింపించి చంపేసింది.
అది చూసి నా మతిపోయింది.
ఎంతైనా మూగజీవం కదా! దానికేం తెలుస్తుంది. కోపం వచ్చి నా భార్యను
"నీకేమైనా మెంటాలా? సైకోవా నువ్వేమైనా? కొద్దిగ కూడా కనికరం లేదా నీకు యూ ఫూల్‌" అని తిట్టేశాను.
వెంటనే నా భార్య తన చూపుడు వేలు నాకేసి తిప్పి "ఫస్ట్‌ టైమ్‌" అంది.
అంతే ఇంక నా వైవాహిక జీవితంలో ఇప్పటిదాకా నా భార్య వేలు చూపి "సెకండ్ టైమ్" అనే మాట రాకుండా జాగ్రత్త పడేసరికే గడచి పోయాయి!

--((*))--

శ్రీమతి గారూ! నాకు మతిమరుపు అని ఎప్పుడూ
తిడుతుంటావు కదా...
చూడు ఈ రోజు ఆఫీసుకు పట్టుకెళ్ళిన సైకిల్‌ని మర్చిపోకుండా తీసుకొచ్చాను.

అయ్యో....మీకు మతిమరుపుకు తోడు మతి భ్రమణం కూడా జత కలిసిందండీ
మీరీవేళ ఆఫీసుకు స్కూటర్ పైన వెళ్ళారు కదండీ....!
--((*))--

సార్ ! 
మీరు మన ఆఫీస్ లో సింహం కదా, 
మరి ఇంట్లో ఎలా ఉంటారు, ? 

భలేవాడివేనయ్యా! 
నేను ఇంట్లోనూ సింహంలానే ఉంటాను, 
కాకపోతే దుర్గామాత సింహం మీద కూర్చొనుంటుందక్కడ.
--((*))-- 

సారూ! ఇదే కంచరపాలెం, 
దిగండి, 30 రూపాయలివ్వండి! 

సరే! ఇదిగో లిస్ట్, 
నాకివ్వాల్సిన 112 లో ముప్పై మినహాయించి తక్కిన డబ్బులు నాకివ్వు! 

ఏటి బాబూ ఈ లిస్టు!? 

నేను కొత్తవలసలో ఎక్కినప్పుడు నీకేమీ చెప్పేను? 

"రిక్షాలూ! నా దగ్గర అన్ని రకాల చిల్లర వుంది, అవసరమైనప్పుడు నన్నడుగు" అన్నారండి! 
నాకు రెండు చోట్ల రెండు ఐదులు ఇచ్చేరండి, ఆ పది మినహాయింపు చేసే తమర్ని 30 అడిగేనండీ! 

ఇలాంటి పేచీలొస్తాయనే లిస్ట్ రాశా! 
సుజాతానగర్ లో వొకావిడ పెద్దనోటిస్తే చిల్లర లేదంటే నేనే ఆవిడ తరఫున 22 నీకిచ్చానా? 

ఔను? 

వేపగుంటలోనూ ఇదే సమస్య మీద ఆసామీ తరఫు నీకు 30 ఇచ్చానా? 

ఔనూ! 

బుచ్చిరాజుపాలెం లో ఇలాగే నీకు 30 ఇచ్చానా? 

ఔనూ? 

మొత్తం 112 అయింది కదా! 

సరే! ఆ లెఖ్ఖ తేలుద్దాము గాని, ముందు ముప్పై కొట్టండీ! 

ఆ మాటన్నావ్, బాగుంది, 
ఇదిగో 30 
ఇప్పుడు నా 112 నాకివ్వు! 

బాబూ! తమరి పేరేటీ? 

పుల్లారావు! 

కొంచెం పేరు మార్చండి బాబూ! 

ఏమి పేరు నాయనా, రిక్షాలూ? 

జడ్డి పుల్లయ్య!
--((*))--

శ్రీ నవీన్ కుమార్ గారి సౌజన్యము 

ఓ ముఖ పుస్తకమా(facebook)... 
ప్రతి రోజు నిన్ను తెరవగానే 'ఇక్కడ ఏదైనా రాయండి.. 
ఇక్కడ ఏదైనా రాయండి' అని అంటావు... 
ఏం రాయమంటావ్ నన్ను? 

కుటిల కుల రాజకీయాల గురించా.. 
మరుగుతున్న మత విద్వేశాల గురించా.. 
రగులుతున్న సిరియా ఆర్తనాదాల గురించా.. 
బలవుతున్న పసిమొగ్గల మాన ప్రాణాల గురించా.. 
విసిగిపోయిన దీనుల ఆకలి కేకలగురించా.. 

ఏం రాయమంటావ్ నన్ను? 
బడుగులపై జరుగుతున్న దాడుల గురించా.. 
ఆడవాళ్లపై జరిగే అత్యాచారాల గురించా... 
ప్రశ్నించే కంఠానికి యమపాశం తగిలించే యమభటుల గురించా.. 
నీరసించి నీరుగారుతున్న నిరుద్యోగి అడియాశల గురించా.. 

రంగుల లోకపు సినీ పోకడ మీద రాయమంటావా.. 
రాజకీయ దోపిడీ మీద రాయమంటావా.. 
ఋణం తీర్చలేక మరణమే దిక్కు అని చచ్చే రైతు మీద రాయమంటావా.. 
బాకీలు ఎగ్గొట్టి బయటి దేశాలకు చొచ్చే బడా బాబుల మీద రాయమంటావా.. 
ఏం రాయమంటావ్ నన్ను? 

ఆడిగావ్ కదా అని నా గోడంతా నీతో చెప్పుకుంటే 
నాకే తెలియకుండా నా విషయాలని వివరాలని 
బయట తాకట్టు పెడుతున్న నీ గురించే రాయమంటావా... 
ఏం రాయమంటావ్ నన్ను?
--((*))--

పూర్వము అన్నీ ఉమ్మడి కుటుంబాలవడము మూలాన కొన్ని కుటుంబాలు స్వయంసమ్రుద్దిని సాదించాయి ! 

సమ్రుద్దిగా కావలసిన 
పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ల నిమిత్తము ఆవులను పెంచేవారు. 

ఆ రోజుల్లో ఉదయము ఏ ఇంట్లో చూసినా కవ్వాలతో వెన్న చిలికే గాజుల సవ్వడులే! 
అది ఒక కమనీయ ద్రుశ్యం! 

ఇంటికి కావలసిన కూరగాయలు ,దేవుడివపూజకు మరియు స్త్రీలు సిగలో ముడుచుకొనే వివిద రకాల పుష్పాలువపండించుకొనేవారు. తెల్లారగానే మగవాళ్ళందరూ కూరల తోటలోనే పని చేసేవారు! 

వేసవికాలం రాగానే ఆ సంవత్సరం అంతా సరిపోయే వివిధ రకాల ఆవకాయలు, మాగాయి, 
నిల్వా పచ్చళ్ళు, అనేక రకాల వడియాలు, అప్పడాలు, చల్ల మిరపకాయలు రోజుల తరబడి తయారు చేసి మడిగా అటకలపై నిల్వా చేసేవారు! 

మద్యాహ్నం భోజనాదులు ముగిసిన తరువాత 
ఆడవాళ్లు చుట్టుపక్కల ఆడాళ్ళతో సైతం పేద్ద నడవలో కూర్చుని వాళ్ళు ఇళ్ళల్లో దేవుళ్ళ మీద, పెళ్ళిళ్ళలో పాడుకనే కూర్చిన పాటలు పాడుకుంటూ, ఒక్కొరూ వందేసి భోజన విస్తర్లు కుట్టి పడేసేవారు! 

మరి గుండలు, పచ్చళ్ళు, రాత్రిళ్ళు బామ్మలు, వంటిపూట వారికోసం ఫలహారాల నిమిత్తము పిళ్ళు, పిల్లలకు, సాయంత్రాలు చిరుతిళ్ళకు, ఉదయం పూట దేముని నైవేద్యము గురించి చెప్పనే అఖ్ఖర్లేదు. రుబ్బురోళ్ళు, తిరగళ్ళు, రోళ్ళు, సన్నికాళ్ళకి ప్రత్యేకించి ఓ గదే వుండేది. ఇద్దరాడవాళ్ళు ఉదయాన్నే ఆ గదిలోకి దూరితే పైకొచ్చేసరికి భోజనాల వేళే. ఆ ఇద్దరు ఆడవాళ్ళ జబ్బల నొప్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే ఔతుంది! 

పండుగలు, పబ్బాలకు వారం ముందునుండే తినుబండారాల తయారీ మొదలయేది! 

మరి ఆనాటి భోజనశాల గురించి ఈనాడు చర్చించుకోవలసిందే! 
నేతితో తేలుతున్న చప్పని పప్పు, బెల్లం పప్పు, ఆకు కూరలతో కారం పప్పు, రెండు ముద్ద కూరలు, రెండు వేపుడు కూరలు, రెండు పచ్చళ్ళు, ఆవకాయలు, భగవంతుని ప్రసాదం, అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలు, పులుసు, గడ్డ పెరుగు, భోజనానంతరం ఫలం, తాంబూల సేవనం. వంటల వాసనల ఘుమఘుమల వర్ణించతరము కాదు. 
మరి అన్నేసి వంటలకు న్యాయం చేకూర్చే ఘనాపాఠీలే అందరూ. 
పుష్టికరమైన భోజనము. భోజనము చేస్తూ మగవారు విసురుకునే హాస్యోక్తులు, పద్యాలు, కొసరి, కోసరి వడ్డిస్తున్న ఆడవారి గాజుల గలగలలు అపురూపమైన పదహారణాల తెలుగు ద్రుశ్య కావ్యము!
--((*))--

పూర్వము ఆదివారపు ప్రత్యేకత 

ఆదివారం తెల్లవారి 4 అయేసరికి ప్రతి ఇంట్లోలోని, ప్రతీ గొంతుక ఆముదముతో తడిసేది, పిల్లల కడుపులతో ఇళ్ళు దద్దరిల్లేవి! 

ఆనాటి ఆహారం అమ్రుతతుల్యమవడానికి ఇదీ ఒక కారణమేమో!
--((*))--







చంటి.....నీ పుట్టిన రోజు కి నేను గిఫ్ట్ గా ఇచ్చిన డ్రమ్స్ నచ్చాయా? నేర్చుకుంటున్నావా?'

'ఆరోజు నాకు వచ్చిన బహుమతులన్నింటిలోకీ నాకు బాగా నచ్చింది అదే అంకుల్'

ఎందుకనీ?

'పొద్దున్నే దాన్ని వాయించకుండా ఉండటానికి నాకు అయిదు రూపాయలిస్తున్నారు నాన్న. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికొచ్చాక కూడా దాన్ని వాయించకుండా ఉండటానికి అమ్మ మరో రెండు రూపాయలిస్తోంది'


స్తీలోలుడు ఎంతకైనా దిగజాతారనడానికి పరాకాష్ట ఈ పద్యము! 


తాతల నాటి క్షాత్రముల నెల్ల 

తెగనమ్మి నీ ఇంట చల్లినాను 
తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు 
తెగనమ్మి నీ ఇంట చల్లినాను 
అత్తవారిచ్చిన అంటుమామిడి తోట 
నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను 
కులసతి మేని సొమ్ములు పుస్తెతో 
తెగనమ్మి నీ ఇంట చల్లినాను 
కులము వారెల్ల నీకిది కూడదు కూడదనిన 
భార్య నూతికి గోతికి పరుగులిడిన లెఖ్ఖ చేయక 
నీ ఇల్లు కాచికొని యున్నాడ కలికి నేను!


సేకరణ


అమ్మ అమ్రుతమయి


ప్రాణం పోసుకున్న ఒక చిన్నారి పాప

తనని సృష్టించిన భగవంతుణ్ణి ఇలా అడిగింది.
"అందరూ అనుకుంటున్నారు..
రేపు నువ్వు నన్ను భూమ్మీదకు పంపిస్తున్నావంట కదా!
ఇంత చిన్నదాన్ని, అసహాయురాల్ని అక్కడికి వెళ్లి నేనెలా జీవించగలను?"

దానికి భగవంతుడు చిరునవ్వుతో....

"నీ కోసం ఒక దేవత అక్కడ ఎదురు చూస్తూ ఉంది.
ఆమె నిన్ను చాలా జాగ్రత్తగా చూడటమే కాకుండా నీ కోసం ఆడుతుంది.. పాడుతుంది.
నిన్ను చూసి నవ్వుకొని మురిసిపోతుంది.
నిన్ను ఎల్ల వేళలా ఆనందంగా ఉంచుతుంది.
నన్ను గుర్తుకు రాకుండా చేస్తుంది.
అన్నీ వెరసి నీ ప్రతి అడుగులోనూ ఆ దేవత ఉంటుంది."

"మరి నాకు అక్కడ భాష రాదు కదా......

మాటలు ఎలా అర్ధం చేసుకోను?
నాకు ఏదైనా ఆపద వస్తే ఎవరు రక్షిస్తారు?"
అని అడిగింది పాప.

"నువ్వు మాట్లాడకపోయినా నీకేం కావాలో ఆ దేవతకు అన్నీ తెలుసు.

అడగకుండానే నీ అవసరాలు తీరుస్తుంది.
ఆ దేవత తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే
నిన్ను కాపాడుకొంటుంది"
అన్నాడు భగవంతుడు.

"మరి నేనెప్పుడైనా నీతో మాట్లాడాలంటే

ఏం చేయను?"
"నీ దేవత రెండు చేతులు ఒక చోట చేర్చి
కమ్మనైన పదాలతో ఆప్యాయంగా ఎలా ప్రార్దించాలో చెబుతుంది.
నీలో ఉండే నన్ను ఎలా చూడాలో కూడా చెబుతుంది" అన్నాడు. ఆ దేవ దేవుడు.

ఆ క్షణంలో స్వర్గమంతా ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంది.

భూలోకం నుంచి వేదనాద ధ్వనులు వినిపించాయి.
అప్పుడు ఆ చిన్నారి పాప హృద్యంగా
"నా దేవత పేరేమిటి" అని అడిగింది.
ఆ దేవత పేరు "అమ్మ" అని సమాధానమిచ్చాడు భగవంతుడు.

@ అవని దేవతలైన అమ్మలందరికీ అంకితం!




ఆంగ్లము నుండి మక్కీకి, మక్కీ ఆంద్రీకరణ


ఉమాపతి సెల్ మోగుతోంది.


అతను అది ఎక్కడ వుందో కనపడక వెతుకుతూ నా చరవాణి ఎక్కడ?చరవాణీ ఎక్కడున్నావే అని గట్టిగఅరుస్తూ వుంటే,కిచన్ లో కిచిడీ చేస్తున్న భార్య కనకం కోపంగా చరవాణా అదెవత్తీ? అంటూనడ్డి మీద చేతులు పెట్టుకొని చేతిలో

గరిటతో సహా వచ్చింది.

అదేనే కనకం నా సెల్ ఫోను. .


అలా అఘోరించ వచ్చుగా అని మీ చొక్కా జేబులో వుంది. అని చెప్పి వెళ్లి పోయింది.


వెంటనే తెచ్చు కొని ఆకుపచ్చ మీట నొక్కి ఎవరూ అన్నాడు?


నేను బావా రమాపతిని.మా అబ్బాయి గణపతి కి కి ఈ నెల పదో తేదీన ఉపనయనం చేస్తున్నాము. మీరూ,చెల్లి తప్పక రావాలి. ఏ ట్రైన్ కి వస్తారో చెప్తే స్టేషన్ కి కారు పంపిస్తాను.


సరే వస్తాం లే బావా అని సెల్ పెట్టేసి భార్యను

కనకం యిటు రావోయ్ అని పిలిచాడు. మీ అన్న కొడుకు ఉపనయనం అట.తప్పక రమ్మన్నాడు.
.అంచేత దరిద్ర రథం లో రెండు శయనాలు పుస్తకం చెయ్యమని సంతోషకర ప్రయాణాల
వాడికి నీ చరవాణి లో చేప్పేయ్.అన్నాడు.

కనకం నెత్తి కొట్టుకుంటూ మీ భార్య నైన పాపానికి దరిద్ర రథం అంటే గరీబ్ రథ్ అనీ శయనాలు అంటే బెర్త్స్ అనీ అర్థ మయింది

.ఆ పుస్తకం చెయ్యడమేమి టో,ఆ సంతోష ప్రయాణాల వాడెవడో మీరే వివరించండి.

.అదేనే మన వెనక వీధిలో ఆనంద్ ట్రావెల్స్ వాడికి బుక్ చెయ్యమని చెప్పు.


అధికార భాషా చైర్మన్ గారూ మీకో దండం అని రెండు చేతులూ శబ్దం వచ్చేలాకొట్టింది కనకం !


దోవకి పూరీ కూరా చేసుకొని బయల్దేరారు.


ట్రైన్ ఎక్కి సర్దుకొని కూచున్న తర్వాత .కనకం అసలే నీది ద్విగవాక్ష శయనం,మెళ్ళో నగలూ గట్రా జాగ్రత్త.అన్నాడు ఉమాపతి..ఈ ద్విగవాక్ష శయనం ఏమిటండీ ? అంటే సైడ్ లోయర్ బెర్త్.వివరించాడు. ..కనకం నిట్టూర్చి నా రవలగాజులూ, చంద్ర హారం పక్కింటి పంకజం దగ్గర జాగ్రత్త చెయ్యమని ఇచ్చి వచ్చాను,మిగతావి నా బాగు లో జాగ్రత్తగా వున్నాయి లెండి. అయ్యో ఏ లెక్కా పత్రం

లేకుండా వాళ్ళింట్లో ఎందుకు పెట్టావే? రేప్పొద్దున ఆవిడ నా దగ్గర పెట్టలేదంటే ఏమి చేస్తావే?అసలే ఆమె మొగుడు మన్మథరావు పానబోతూ,పరిభ్రమణ బోతూ నూ.
.పానబోతూ,పరిభ్రమణ బోతూ ఏమిటండీ? .అంటే తాగుబోతూ,తిరుగు బోతూ అని
.వివరించాడు ఉమాపతి. మహానుభావా! యింగ్లీషు పదాలకే అనుకున్నా తెలుగు పదాలకు కూడా పర్యాయ పదాలు కనిపెడు తున్నారా?అని తల బాదుకుంది. అది సరే కానీ మనకు ఆ తెలుగు ఖాతా కార్యాలయం లో తాళపేటిక ఒకటి విలపించింది కదా!
అందులో పెట్టి రావలిసింది. కాసేపు ఆలోచించి ఓహోఆంధ్రాబ్యాంక్ లో లాకర్ ఒకటి ఏడిచింది కదా! అని అర్థం చేసుకొని మీరే పెట్టి వచ్చి ఉండవచ్చు కదా!అని దబాయించే సరికి నోరు మూసుకొని పడుకున్నాడు. పొద్దున్నే హైదరాబాద్ చేరారు. మీ అన్న చతుశ్చక్ర వాహనం(కారు) పంపిస్తానన్నాడు పంప లేదు చూశావా?అని సరే ఈ త్రిశ్చక్ర వాహనం లో వెడదదాం అంటూ (ఆటో)మాట్లాడాడు.ఫంక్షన్ హాల్ దగ్గర దిగి లోపలికి వెళ్లి
దరిద్ర రథం లో వస్తానని దూరవాణి లో చెప్పాను కదా!చతుశ్చక్ర వాహనం పంపలేదేమిటీ? అని బావ మరిదిని నిలదీశాడు. రమాపతి తెల్లబోయి చూస్తూ వుంటే కనకం వివరించింది. సారీ బావా!మా అబ్బాయి కారు తీసుకొని వెళ్ళాడు .సమయానికి కారు యింట్లో లేదు .అన్నాడు రమాపతి .లోపల తమకిచ్చిన గదిలో సామాను సర్దేసి కనకం త్వరగా స్నానం చేసి కనకాంబరం పట్టుచీర కట్టుకొని ముస్తాబై నేను పెళ్లి మండపం లోకి
వెళ్తున్నాను త్వరగా తయారై వెళ్ళిపోయింది. ఉమాపతి తయారై అరే నా
ఉపలోచానాలు(కళ్ళజోడు) ఎక్కడ??అని కళ్ళజోడు కోసం వెతికాడు.కనపడ లేదు.అలాగే
తడుముకుంటూ మండపం లోకి వెళ్ళాడు.అంతా మసక మసక గావుంది ఎవరూ సరిగ్గా కనపడడం లేదు.భార్య కోసం వెతుకుతున్నాడు. కనకం ఎక్కడుందీ అనుకుంటూంటే అక్కడే కనకంబరం చీర కనపడింది. అదిగో కనకం యిక్కడే వుంది అనుకుంటూ వెళ్లి కొంగు పట్టుకొని లాగాడు. ఆవిడ తిరిగి చూసి ఉమాపతి గూబ గుయ్యిమని పించింది. .ఏమిటీ తిక్క తిక్కగా వుందా?అని అంటే, ఏమైందంటే నా ఉపనయనాలు కనపడ లేదు అనిఉమాపతి ఏదో చెప్పబోతూంటే ఆవిడ భర్త వచ్చి కాలర్ పట్టుకొని ఉపనయనానికి వచ్చి ఉపనయనాలు కనబడ లేదంటా వేమిటి?అంటూ కొట్టబోతుంటే కనకం చూసి
పరిగెత్తుకొచ్చి ఆపి అన్నయ్యగారూ! ఆయన మా ఆయనండీ క్షమించండి ఏదో పొరబాటు
అయింది.అంటూ ఏమిటండీ ఇదీ అంటే కనకం నీవు కనకాంబరం చీర కదా కట్టుకుంది చీర ఎప్పుడు మార్చావు? నా ఉపనయనాలు కనపడక నేను చస్తుంటే? అబ్బా ఫంక్షన్ లో గంట కొక చీర మారుస్తాము ఇంతకీ ఉపనయనాలేమిటి? అంది నా కళ్ళజోడు కనపడ లేదు అన్నాడు.ఉమాపతి. నెత్తి బాదుకొని నిన్నరాత్రి రైల్లో నా బాగు లో పెట్టారు కదా!
అని తీసి కళ్ళకు తగిలించి అందరికీ సారీ లు చెప్పి వెళ్ళింది. వూరికి బయల్దేరి వెళ్ళేటప్పుడు, రమాపతి బావ గారిని ఆట పట్టిస్తూ బావా ఈ సారి వచ్చేటప్పుడు ఉప ఉపనయనాలు దగ్గరుంచుకో.అంటే అర్థం కాలేదా?స్పేర్ కళ్ళజోడుఅన్నమాట అన్నాడు. .








వేదాలలో ఋగ్వేదము అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం ఋక్కుల రూపంలో ఉంటుంది. వేదాలలో ఋగ్వేదం మొదటిది .ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. యజుర్వేదం మానవులకు, సామవేదం పితరులకు అని మనుస్మృతి వివరిస్తుంది.శౌనక మహర్షి ఋగ్వేదంలో 10,580 ఋక్కులున్నట్లు వర్ణించాడు. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋగ్వేదానికి ఐదు శాఖలున్నాయి....1 శాకల, 2 బాష్కల, 3 ఆశ్వలాయన, 4 మాండూక్య, 5 సాంఖ్యాయన.వీటిలో శాకల తప్ప ఇంకేవీ అందుబాటులో లేవు... ఋగ్వేదం రెండు విభాగాలుగా ఉన్నాయి. ఒకటి అష్టకాలు, వాటిలో అధ్యాయాలు, వాటిలో వర్గాలూ ఉంటాయి. రెండవ విభాగం మండలాలుగా విభజింపబడింది. మండలాలలో అనువాకాలూ, వాటిలో సూక్తాలుగా విభజింపబడ్డాయి. మొత్తం 1017 సూక్తాలలో 10,580 ఋక్కులలో 1,53,826 శబ్దాలు, వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన...ఈ అక్షరాలు కలియుగం లోని సంవత్సరాలు ఒకటేనని వచనం. 




ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు 


హిందూధర్మశాస్త్రాలు 


aum symbol 


వేదములు (శ్రుతులు) 


ఋగ్వేదం · యజుర్వేదం 


సామవేదము · అధర్వణవేదము 


వేదభాగాలు 


సంహిత · బ్రాహ్మణము 


అరణ్యకము · ఉపనిషత్తులు 


ఉపనిషత్తులు 


ఐతరేయ · బృహదారణ్యక 


ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య 


కఠ · కేన · ముండక 


మాండూక్య ·ప్రశ్న 


శ్వేతాశ్వర 


వేదాంగములు (సూత్రములు) 


శిక్ష · ఛందస్సు 


వ్యాకరణము · నిరుక్తము 


జ్యోతిషము · కల్పము 


స్మృతులు 


ఇతిహాసములు 


మహాభారతము · రామాయణము 


పురాణములు 


ధర్మశాస్త్రములు 


ఆగమములు 


శైవ · వైఖానసము ·పాంచరాత్రము 


దర్శనములు 


సాంఖ్య · యోగ 


వైశేషిక · న్యాయ 


పూర్వమీమాంస · ఉత్తరమీమాంస 


ఇతర గ్రంథాలు 


భగవద్గీత · భాగవతం 


విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు 


లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు 


శివ సహస్రనామ స్తోత్రము 


త్రిమూర్తులు · తిరుమల తిరుపతి 


పండుగలు · పుణ్యక్షేత్రాలు 


... · ... 




మూస:హిందూ మతము § వర్గం:హిందూ మతము 


ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలు పురాణ గాథలుగా వర్ణించబడ్డాయి. ఋగ్వేదంలో అనేక స్తోత్రాలు ఉన్నాయి. ఋగ్వేదంలోని దశమ మండలంలోని పురుష సూక్తం విశేషంగా ప్రశంసింపబడింది. ఋగ్వేదంలో సామాజిక ప్రవర్తన గురించి చక్కగా వర్ణించబడింది... ఋగ్వేదం కామితార్థాలను తీర్చే వేదం.... వర్షాలు పడాలంటే పర్జన్య సూక్తాలు పఠించాలని సూచింప బడింది... జూదం ఆడకూడదని అనేక సూక్తాలు బోధించాయి. కొన్నిటిలో జూదమాడిన వ్యక్తి వర్ణన ఉంది... శంకరాచార్యులచే ఋగ్వేదం ప్రశంసించబడింది. "ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వత॰" అనే సూక్త పఠనం మానవులను దీర్ఘాయుష్కులను చేస్తుందని వచనం. 




ఋగ్వేదం విజ్ఞానం 


ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని అశ్వినీసూక్తంలో అశ్వినీ దేవతలు చేసిన చికిత్సలు వర్ణించబడ్డాయి... ఖేలుడు అనే రాజు భార్య, యుద్ధంలో రెండు కాళ్ళు కోల్పోగా అగస్త్యముని సలహాతో వారు అశ్వినీ దేవతలను స్తుతిచేయగా వారు ఆమెకు ఇనుప కాళ్ళను అమర్చినట్లు వర్ణించ బడింది. దధీచి మహర్షికి ఇంద్రునిచే ఉపదేశింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్వినీ దేవతలు ఆయనకు ముందుగా తల తీసి జంతువు తలను అతికించి అతని నుండి 'ప్రవర్ణ' అనే మంత్రాన్ని గ్రహించగానే ఇంద్రుడు దధీచి ముని తల నరకగానే అశ్వినీ దేవతలు వెంటనే దధీచి ముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది. ఇలాంటి అతిసూక్ష్మాతి సూక్ష్మమైన శస్త్ర చికిత్సలు ఋగ్వేదంలో వర్ణించబడ్డాయి. 




ఋగ్వేదంలో అగ్నిసూక్తంలో విద్యుత్‌ను పోలిన వర్ణన ఉంది.శుదర్ణ లో శబ్ద ప్రయోగం ద్వారా ధ్వని తరంగాల ప్రసారం గురించి వర్ణించబడింది. ఋగ్వేదంలో శ్రుధి శ్రుత్కర్ణ వహ్నిభిఃలో సంకేత పదరూపంలో నేటి టెలిఫోను ఆధారిత వర్ణన ఉంది. మేఘాలు రూపాన్ని సంతరించుకోవడం, వర్షించడం లాంటి వృష్టి సంబంధిత జ్ఞానం ఋగ్వేదంలో ఉంది. క ఇమంవో నిణ్యమా చికేత, గర్భో యో అపాం గర్బో వనానాం గర్భశ్చ స్థాతాం అనే మంత్రం జలంలో విద్యుత్ దాగి ఉన్నట్లు వర్ణిస్తుంది. మేఘాల నిర్మాణం దానికి పట్టే సమయం ఋగ్వేదంలో వర్ణించ బడింది. పర్యావరణ సంబంధిత విషయాలు ఋగ్వేదంలో ఉన్నాయి. గణితానికి సంబంధించి వ్రాతం వ్రాతం గణం గణం" మొదలైన మంత్రాలలో వర్ణించబడింది. రేఖాగణిత విషయాలూ ప్రస్తావించబడ్డాయి. 




ఋగ్వేదంలోని విశేషాలు 


ఋగ్వేదం పది మండలములు గా విభజింపబడింది. ఇందులో 10,622 ఋక్కులు, 1,53,326 పదాలు, 4,32,000 అక్షరాలూ ఉన్నాయి. ఇందులో మొదటి యేడు మండలాలు పరబ్రహ్మమును అగ్ని అనే పేరుతోను, పదవ మండలంలో ఇంద్రునిగాను, మిగిలిన గీతములు బ్రహ్మమును విశ్వే దేవతలు గాను స్తుతిస్తున్నాయి. ఎనిమిది తొమ్మిదవ మండలాల్లో ముఖ్యమైన గీతములలో పరబ్రహ్మము వర్ణన ఉంది. 8వ మండలంలో 92 గీతములు, 9వ మండలంలో 114 గీతములు ఉన్నాయి. వీటిలో కొన్ని సోమలతను ప్రార్ధిస్తున్నాయి. మొత్తానికి పదవ మండలంలో నూటికి పైగా అనువాకాలున్నాయి. వీటిలో ఆ గీతములను రచించిన ఋషులు పేర్లు, అవి ఉద్దేశించిన దేవతలు, స్తుతికి కారణం ఉన్నాయి. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణము, ఐతరేయారణ్యకము,ఐతరేయోపనిషత్తు, కౌషీతకి ఉపనిషత్తు ముఖ్యమైనవి.[1] 


శాఖలు సవరించు 




ఋగ్వేదంలోని నది పేర్లు గల భౌగోళికం; (1) శ్వాత నది మరియు లోయ, (2) హిందూ మతము శ్మశానం సంస్కృతులు, ఆ మేరకు కూడా సూచించబడ్డాయి 






ఋగ్వేదమునకు మొత్తము 21 ప్రధాన శాఖలు ఉండేవి. ప్రధాన శాఖలు అయిన 19 కాలగర్భంలో కలసి పోయాయి. ప్రస్తుతము ఇప్పుడు దొరుకుతున్నది కేవలం ఒక శాఖ మాత్రమే.((అదే శాకల శాఖ)) 


ఇంక ఉప శాఖలు ఏవీ దొరకడము లేదు. కానీ కొన్నింటికి, దాదాపుగా 20 ఉప శాఖల పేర్లు మాత్రము మిగిలాయని, తెలుస్తున్నాయని ఉవాచ. 


మండల విభాగము 


అష్టక విభాగం సవరించు 


అష్టకములు సంఖ్య 8. 


అష్టకంలోని అధ్యాయాల సంఖ్య 8. 


అధ్యాయములు సంఖ్య 64 


ఈ సంహితలో 64 అధ్యాయములు మరియు 8 అష్టకములుగా విభజించ బడ్డాయి. 


ఋగ్వేదంలో ఋక్కులు సంఖ్య = 10472 + వాలఖిల్య సూక్తాల లోని ఋక్కులు = 80 కలిపి మొత్తం = 10552 


సూక్తములు సంఖ్య = 1017 + వాలఖిల్య సూక్తాల లోని ఖిల సూక్తములు = 11 కలిపి మొత్తం = 1028. 


వర్గములు సంఖ్య = 2006 + వాలఖిల్య సూక్తాల లోని వర్గములు = 18 కలిపి మొత్తం = 2024 


ఋగ్వేదంలో అక్షరములు సంఖ్య = 3,94,221 + వాలఖిల్య సూక్తాల లోని అక్షరములు = 3,044 కలిపి మొత్తం = 3,97,265. 


వేదాలపై నిరాదరణ సవరించు 


ఒకానొకనాడు, ఆచార్యుడు గురు స్థానములో ఉండి వేద విద్యను బోధించాడు. అలా గురుశిష్య పరంపరగా వేదవిద్య వ్యాప్రి చెంది ప్రపంచ మానావాళికి సభ్యత ను, సంస్కృతిని నేర్పించింది. అంతర్జాతీయ పుస్తక భాండాగారములో మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం అని ప్రపంచములోని మేధావులు అందరు ఏకగ్రీవముగా అంగీకరిస్తారు. విదేశీయులే వేదాలు విశ్వ విజ్ఞాన భాండాగార నిధులని మన వేద విజ్ఞానాన్ని ఎంతగానో ప్రశంసించారు. వేద విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావటానికి కొందరు విదేశీ పరిశోధకులు చేసిన శ్రమ, ప్రయత్నాలు ఎంతైనా ప్రశంసనీయం. 


కొన్ని సామాజిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సాంప్రదాయకులైన వేదజ్ఞుల సంఖ్య తగ్గి, తద్వారా సరయిన ఆదరణ లభించక వేద విజ్ఞానం కొంతవరకూ జీర్ణావస్థకు చేరుకుంది. 


మండల విభాగం సవరించు 


మండలాలు మండల విభాగం సూక్తసంఖ్య ఋక్కులు 


1 191 2006 


2 43 429 


3 62 617 


4 58 589 


5 87 727 


6 75 765 


7 104 842 


8 92 1635 


9 114 1108 


10 191 1754 


మొత్తం 1,017 10,472 


వాలఖిల్య సూక్తాలు 11 80 


మొత్తం 1,028 10,552 


అష్టక విభాగం సవరించు 


అష్టకం సూక్తాలు అష్టక విభాగం వర్గలు ఋక్కులు అక్షరాలు 


1 121 265 1370 48,931 


2 119 221 1147 51,718 


3 122 225 1209 47,636 


4 140 250 1289 49,762 


5 129 238 1263 48,022 


6 124 313 1650 48,412 


7 116 248 1263 47,562 


8 146 246 1281 52,178 


మొత్తం 1,017 2006 10,472 3,94,221 


వాలఖిల్య సూక్తాలు 11 18 80 3,044 


మొత్తం 1,028 2024 10,552 3,97,265 


ఇవి కూడా చూడండి 


ఏకేశ్వర వాదం 


మూలాలు 


"అష్టాదశ పురాణములు" - రచన: వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ: సోమనాధ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007) 





 స్వర్గం -నరకం - 




👤ఒక వ్యక్తి మరణించాడు. 


అతడు చేసిన పాప పుణ్యాలకు ఒకరోజు నరకం ఒకరోజు స్వర్గం లో ఉండాలని చెప్పడం తో నరకం లోకి కాలుపెట్టాడు..🚶 




🕸అక్కడ చుట్టూ చెత్తా దుమ్ము తో చాలా మురికిగా ఉంది.🕸 


మనుషులూఅందరూ ఎక్కడంటే అక్కడ పడుకొని దొర్లుతూన్నారు. 👎 


చూడ్డానికి మాత్రమ్ బక్క చిక్కిపోయి ఉన్నారు.🕴🕴 


అన్నము తిని ఎన్నిరోజులు ఐనదో అనేలా ఉన్నారు. 🙁🙁 


ఎవరి ముఖము చూసినా విచారము తో దిగులుగా ఉంది. 😕😪 


ఆ వ్యక్తి వీళ్ళకు అన్నము పెట్టకుండా ఇలా వదిలేస్తారేమో ఆకలితో అనుకొన్నాడు.😨 


ఇంతలో ఒక గంట మ్రోగింది.🔔🙄 


వెంటనే అందరూ ఒక పెద్ద హాలు వంటి గది వైపు వెళుతున్నారు.. 🏃🏃🏃 


అతడు వెళ్ళాడు. 


వెళ్ళి నిర్ఘాంతపోయాడు. 🤔 


అది ఒక పెద్ద భోజనశాల. 


మధ్య లో చలా పొడవైన బల్ల ఉంది. 🚧🚧🚧 


దానిమీద అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నయ్. 😋😋 


శఖాహార, మాంసాహార పదార్థాలు మిఠాయిలు ఫలాహారాలు. 🤒🤒🤒 


మరి వాళ్ళు యెందుకు బక్క చిక్కి పోయారు అని ఆ వ్యక్తి కి సందేహం వచినది. 🤔🤔🤔🤔 


అందరూ బల్లలకు ఇరువైపులా కూర్చోగానే వాళ్ళ చేతులకి పెద్ద పెద్ద గరిటెలు కట్టారు. 😦😧 


అవి చాలా పొడవుగా ఉన్నాయి. 


అందరూ తినడానికి ప్రయత్నము చేసారు. 


అంత పొడవు గరిటెలతో తినడము అసాధ్యమైనది.😥 


చివరకు కొన్ని మెతుకులు మత్రమే నోటిలో పడ్డాయి.😞 


సమయము ముగియడం తో అందరూ నిరాశగా వెనుదిరిగి వెళ్ళారు..😞 




🔔ఆ రోజు రాత్రి భోజనసమయము లో కుడా అలాగే జరిగింది.😞 




🚶ఉదయాన్నే ఆ వ్యక్తినీ స్వర్గానికి తీసుకెళ్ళారు. 


స్వర్గము చాలా అందముగా,శుభ్రం గా ఉంది.😊 


అక్కడున్న వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా బలము గా ఉన్నారు. ☺ 


పరిసరాలను శుభ్ర పరుస్తూ మొక్కలకు నీళ్ళు పోస్తూ పనుల్లో ఉన్నారు. 🤔 


మధ్యాహ్నం అవుతూనే అక్కడ కూడా గంట 🔔కొట్టారు వెంటనే వాళ్ళందరూ భోజనశాల కివెళ్ళారు. 


అది కుడా నరకం లో మాదిరే పొడవుగా ఉంది. 


నరకం లో మాదిరే అన్ని పదార్ధాలు ఉన్నాయి. 🤔 


తినడానికి కూర్చోగానే వాళ్ళచేతులకూ పొడవైన గరిటెలు కట్టారు....😉 


అది చూస్తూనే ఆ వ్యక్తి కి ఏమీ అర్థము కాలేదు.. 🙁🙁 


ఇక్కడ కుడా అలాగే ఉంటే మరి వాళ్ళు యేల అంత బలము గా ఉన్నారో అనుకొంటూ ఉండగా వాళ్ళు తినడము మొదలు పెట్టారు...😋 


చూస్తుండగానే అన్ని తినేసారు......... 😇😇 




ఎవరి చేత్తో వాళ్ళు తినకుండా ఎదురుగా కుర్చున్న వాళ్ళకు తినిపించుకోన్నారు...🤒🤒 


అలా కడుపునిండా తినగలిగారు..😀😀 




👉మనము ఎదుటివారికి సహాయము చేస్తున్నాము అంటే స్వర్గము లో ఉన్నాము అని, ఆ సహాయము మనకు ఏదో ఒక రూపము లో మనకు తిరిగి వస్తుంది.😊😊 




స్వార్ధం తో నేను మాత్రమే అనుకొంటే నరకం లో ఉన్నట్లే. 


--((**))--

ఏమేవ్! టవల్ ఎక్కడ తగలడ్డాది, స్నానానికెళ్ళాలి?

ఆ చిందులు తొక్కడం ఆపి, దండెం మీద వుంటుంది, పోనీ నా రెండు కళ్ళతోనూ చూడండి!


అగ్గిపెట్టె ఎక్కడ, దీపం వెలిగించడానికి!


అయ్యో రామా! అది మీ తడిచేతిలో పడి తడిసి ముద్దయింది, వూదొత్తివ్వండి, స్టౌ మీద వెలిగించి తెస్తాను


మీవాళ్ళేం మప్పేరో నాకైతే తెలియదు

అన్నం వుడుకుతున్న స్టౌ అంటు కాదూ!

ఈ చాదస్తం మొగుడితొ వేగలేక చేస్తున్నాను, తీరామోసి కూరలు కొనడము కూడా మప్పలేదు, వేళకింత తినడం మాత్రం మప్పేరు


ఇదిగో మా అమ్మనేమైనా అన్నావా జాగ్రత్త!


అదే మాట నేనూ అంటున్నాను!


అది సరే గాని ఇవాళ శాఖపాకాలేమిటోయ్!!?


పూజ మనసు పెట్టి చేసుకోవచ్చుగా!!


చెప్పరా నా బంగారం


వంకాయ కొత్తిమీరి కారం, సాంబారు!


అనుపానం!


కొబ్బరి, మామిడి పచ్చడి

అది సరే గాని శ్రావణం వచ్చేస్తోంది

పూజలో వుండగా బుర్ర పాడయే ఆ విషయాలిప్పుడెందుకే నా హ్రుదయమా!

"ఏమేవ్...ఈ రోజు ఒక పనివాడిని మాట్లాడివచ్చాను. అతను అన్ని పనులూ చేస్తాడు.
అంట్లు తోముతాడు,
గదులు తడిగుడ్డపెడతాడు,
రుచికరమైన వంటలు చేస్తాడు,
ఉదయాన్నే వాకిలి ఊడ్చి కల్లాపి చల్లుతాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని మాటలు తిట్టినా నోరు మూసుకుని పడుండే మెత్తటి మనిషి..."

"శ్రీవారూ! అతన్ని మన అల్లుడిని చేసుకుందాము! వేరే పనివాడ్ని చూడండి!

ఇలాంటి భర్త తనకు కావాలనేది మనమ్మాయి కోరిక మరి"
"వనజ! నువ్వు చెప్పేది నిజమేనా అని"

ఔను! మా అత్తగారు నన్ను వైవిద్యమైన రీతిలో భయపెడుతున్నారు ...


"ఏమని??? "


చెప్పిన పని సరిగ్గా చేయకుంటే నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ , వాట్సప్ ఫ్రెండ్స్ అందరికీ నా ఒరిజినల్ ఫోటో పంపిస్తానని భయపెడుతుంది..

బ్రెదరూ! నేను

రెండో మర్డర్ లో దోరికిపోయి జైలుపాలయ్యా,


నువ్వెలా వచ్చావోయ్?


బేంకోళ్ళ మోసం వల్ల




హడ్డెడ్డెడ్డె


ఎట్టా ఎట్టా? చెప్పు చెప్పు


రాత్రి దోంగతనానికని బేంకుకెళ్ళాను


కేష్ తెరవడానికి తాళాల గుత్తి, సుత్తి, సానము తీస్తూ అక్కడ రాసున్న అక్షరాలు చదివేను



ఏం రాశారు?


"కేష్ సేఫ్ తెరవడానికి కష్టపడక్కర్లేదు


పక్కనున్న హేండిల్ తిప్పగానే తలుపు తెరుచుకుంటుంది" అని


ఆగాగు! కధ నాకు తెలిసిపోయింది. అక్కడ రాసున్నట్లు చేసి ఇక్కడకోచ్చావంతేనా?


నీకెలా తెల్సు?


నీ సీనియర్ని కదా


నేను కూడ నీలాగే మోసపోయాను


ఎట్టెట్టెట్టా?


ఆడ్ని చంపుతూవుంటే వీడియో తీసుకున్నాడు


సరే! చివరి కోరికని సరిపెట్టుకున్నా


అదే కోంప ముంచింది


కడేరహో బంట్రోతు


ఈ వుద్యోగాలు ఆరేడు తరాల ముందువట


--((**))--
8. . నేటి హాస్యం   ఈ విషయం చిన్ని కధ రూపములో వివరించడానికి ప్రయత్నిస్తాను:-


అమలాపురం లో నివసించే పరందామయ్య గారు, ఆకివీడులో నివాసముంటున్న పరాంకుశం గారికి కుమార్తె వివాహ నిమిత్తము రెండొందల రూపాయలు చేబదులుగా ఇచ్చారు. ఆ రోజుల్లో "వాగ్దానము" తరతరాల పంశ గౌరవానికి సంబందించిందిగా, కుటుంబ ప్రతిష్టగా తలచేవారు. ఈ సూత్రాన్ననుసరించి పరాంకుశం గారు, పరందామయ్య గారికి "వచ్చే ఫలసాయానికి చేబదులు తీర్చేస్తాన"ని వాగ్ధానము చేసేసారు.


కష్టాలకు వాగ్దానాలతో సంబందము లేదు.


మొత్తానికి వాగ్ధానము భంగపడ్డాది.


నాలుగు ఫలసాయాలైనా పరాంకుశం గారు నుండి వులుకు,పలుకు లేవు.


కొన్నాళ్ళ పాటు పరాంకుశం గారికి , పరందామయ్య గారినుండి రొక్కము విషయమై వర్తమానాలు అందుతూనే వున్నా ఫలితములో ఎటువంటి మార్పూ లేదు.


పరందామయ్య గారి ఓపిక నశించడముతో పాటు, పైకము అవసరము కూడా పడింది.


అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ఇక మరే గత్యంతరమూ లేదు.


పరందామయ్య గారు కడేరహో బంట్రోతు ని పిలిపించారు, విషయము వివరించారు, పరాంకుశం గారికి లేఖ రాసిచ్చారు, చిరునామా లేఖలో పొందు పరిచారు, కడేరహో బంట్రోతు ధానా, గుర్రము ధానా నెలకు సరిపోయేంత ఇచ్చారు, పావలా ఇచ్చారు.


కడేరహో బంట్రోతు గుర్రము మీద ఆకివీడు చేరాడు.


వూరి పొలిమేరలనుండీ కనిపించిన ప్రతీవారికీ లేఖ చూంపించి చిరునామా అడిగాడు. మొత్తానికి పరాంకుశం గారిని కనుగొని, లేఖ అందించాడు. ఇంటి వీది గుమ్మం దగ్గర గుర్రాన్ని కట్టేసాడు, ఇంటి వారిని భియ్యము, పప్పు, వుప్పు, కట్టెలు అడిగి, మూడు పేద్ద రాళ్ళు తెచ్చి వంట చేసుకుని తినేసాడు. గుర్రానికి ధానా కూడా ఇంటివారి దగ్గరే తీసుకుని దానికి మేపి వీది గడప మీదే పడుక్కుండిపోయేవాడు. రెండు రోజులయేసరికి గుర్రము, కడేరహో బంట్రోతు చేసిన గలీజు కి వీదంతా కంపు కొట్టేది. పరాంకుశం గారి పరువు మంట గలిసేది.


ఆఖరుకి పరాంకుశం గారి నుండి పైకము, దారి ఖర్చులు పుచ్చుకుని, పరందామయ్య గారికి చేరవేసేవాడు.


పరాంకుశం గారు మళ్ళా పావలా ఇచ్చేవారు


ధన్యవాదాలు


8. . నేటి హాస్యం  


వాయ్యో వామ్మో నాయనో నాకు చెముడు వచ్చింది


ఏహే! ముందు ఏడుపు ఆపు!


ఇప్పటి దాకా బాగున్నావు ఏమొచ్చిందిరా?


ఇందాకటి నుంచి నువ్వు మాట్లాడు తున్నావు ,


ఒక్క మాట వినపడటం లేదు నాకు!


ఏడ్చినట్లుంది .... ఇందాకటి నుంచి నేను మాట్లాడటం లేదు ఒక్కపొడి నములుతున్నా


--((**))--
8. . నేటి హాస్యం  


నాన్నారూ... నాకు అర్జెంటుగా వెయ్యి రూపాయలు కావాలి. కళ్ళజోడు కొనాలి.


దూరంగా ఉన్న వస్తువులు అస్సలు కనబడట్లేదు.


ఒకసారి వీదిలోకి రా సుపుత్రా!


చెప్పండి నాన్నారూ!


ఆకాశం లో కనిపిస్తున్నారు కదా... అదేమిట్రా?


చంద్రుడు నాన్నారూ!


ఇంతకంటే దూరం చూడాల్సిన అవసరం నీకు ఎందుకొస్తుంది చెప్పు!!!


--((**))--


8. . నేటి హాస్యం   "దెయ్యం మొహమా! డెబ్బైరెండు ఏళ్ళోచ్చినా ఇంకా తప్పులు చేస్తూండడమే! నీకెన్నిసార్లు చెప్పానే, కళ్ళజోడు పెట్టుకొని వంట చేయమని, కూర, పప్పునిండా అన్నీ వెంట్రుకలే "


"నేనూ మీకెన్నిసార్లు చెప్పాను?


కళ్ళజోడు లేకుండా అన్నానికి రావద్దని, అవి కొత్తిమీర కాడలు, చూసి అగోరించండి"


--((**))--
8. . నేటి హాస్యం  
 ఏమే కోడలుపిల్లా! మీ ఇంట్లో కుళాయి వుండి కూడా మరో కుళాయి వేయిస్తున్నారు! ఏమిటి కథ?


ఏమీ లేదు అత్తయ్య గారు! ఆయన ఈ నెల


పదవీ విరమణ చేస్తారు!


ఆ వచ్చే డబ్బులతో పాల వ్యాపారం పెడతాము !


ఆ అవసరానికే ప్రత్యేకంగా ఈ కొత్త నీటి కుళాయి!


8. . నేటి హాస్యం  
గురువుగారూ! హోటల్ లో భోజనం చేసి వస్తూ రిలయన్స్ మాల్ లో మీ కోసం ఈ పళ్ళు తెచ్చాను, దయచేసి స్వీకరించండి!


తీసుకుంటాను గాని ఓ షరతు.........


నువ్వు న్యాయ శాస్త్ర విధ్యార్దివి కాబట్టి ఆ భాషలోనే నాకు పళ్ళు ఇవ్వాలి.


8. . నేటి హాస్యం  


మాష్టారు!


న్యాయపరమైన నా పిత్రార్జితముతో, నేను ఈ పళ్ళను, చట్టప్రకారం వ్యాపారం చేయుచున్న వ్యాపారి దగ్గర కొన్నాను. మా నాన్నగారు నా పోషణ నిమిత్తము పంపుచున్న పైకముపై నాకు క్రయ, విక్రయ, ధాన, వితరణాది హక్కులను ప్రసాదించినారు. ఈ పళ్ళు న్యాయ వ్యతిరేక సొత్తు గాని, ఱుణగ్రస్తమైనవి గాని కావని నిరూపించు నిమిత్తం దుకాణదారుడిచ్చిన కొనుగోలు రశీదును పొందుపరచుచున్నాను.



8. . నేటి హాస్యం  


ఈ పళ్ళు మీకు ఇచ్చుటలో కేవలం గురుభక్తి తప్ప, "క్విడ్-ప్రో-కో" వంటి న్యాయ వ్యతిరేక దురాశతో కాదని ప్రకటిస్తున్నాను. నేను మీకు సమర్పించుకుంటున్న ఈ పళ్ళపై మీరు క్రయ, విక్రయ, ధాన, వితరణాది సర్వ హక్కులు కలిగి వుంటారు.


ఈ పళ్ళను మీరు నోటితో కొరికి గాని, ఏ విదమైన ఆయుధముతోనైనను మీకు నచ్చిన భంగిమలో, పరిమాణముులో కోసుకొని తినే హక్కు కలిగి వుంటారు. ఈ పళ్ళలో ఏ విదమైన నిధి, నిక్షేపాలు, బంగారు, వెండి, వజ్ర, వైఢూర్యాలు, రతనాలు, ఖనిజం మొదలైన సంపద నిక్షిప్తమై వున్ననూ మీరు, మీ వారసులు మాత్రమే హక్కుదారులు. ఈ పళ్ళలోని పిక్కలు విత్తనములుగా రూపాంతరము చెంది, ఫలములు తద్వారా సంక్రమించిన ఆస్తులకు కూడా మీరూ, మీ వారసులు మాత్రమే హక్కుదారులు. ఈ పళ్ళద్వారా సంక్రమించే ఆస్తులలో నాకు గాని, నా వారసులకు గాని ఏ విదమైన హక్కు వుండదని ప్రకటిస్తున్నాను.


దయవుంచి గ్రహించ ప్రార్ధన


8. . నేటి హాస్యం   ఏమేవ్!


నా బంగారం కట్టుడు పళ్ళు కనిపించి చావట్లా


అలమారులో పెట్టా, చూసి చచ్చావా?


ఆఁ! నల్లపూసలు వున్నట్టుండి పేరుకుపోతే అమంళమేమైనా జరుగుతుందేమేనని హడలిపోయి కంసాలిని పిలిస్తే బంగారం కావాలన్నాడని అవిచ్చేసానండి


నీ పిండాకూడు కాకులకెట్టా


ఆ పళ్ళు లేకపోతే రాత్రి నువ్ పెట్టే వుప్పుపిండం కడుపులోకి దిగక నువ్ అనుకొనే అమంగళం జరిగే తీరుతుందే


మధు! కాఫి ఏదోయ్?


హమ్మయ్య! లేచారా! గంటబట్టి ఎదురు చూస్తున్నాను స్వామీ!


కాఫి కలిపి 50-50 న 60-40 న అన్నది తేల్చుకుని నా వాటా నాకిచ్చి, మీ కాఫి మీరు తాగండి ముందు!


అసలేమౌతోందో నాకిప్పుడే తెలియాలి!


--((**))--



8. . నేటి హాస్యం  


నాకు మూడు రోజులు విరామం!


మీ భాషలో శెలవు!



ఏమిటీ! చెప్పా పెట్టకుండా శెలవా?


మాకు వారం ముందు చెబితే గాని PL దొరకదు, ముందు రోజు చెబితే గాని CL దొరకదు,


దొరికినా ఆకస్మిక పని భారం పడితే రద్దైపోతాయి, అటువంటిది నువ్వు చెప్పా పెట్టకుండా శెలవ్ ప్రకటించేసుకుంటావా?


అందునా పళ్ళై పదారో రోజు పండగ కూడా కాలేదు,


రేపు హానీమూన్ కి రిజర్వేషన్ అయిపోయినది, అప్పుడే శెలవా?


అవన్నీ నాకు తెలవదు శ్రీవారూ!


అత్తయ్య గారు మరీ మరీ ఈ విషయంలో వక్కాణించారు మరీనూ,


ఈ మూడు రోజులు అన్ని పనులు మీరే చూసుకోవాలి,


నా దరి చేరరాదు సుమండీ!


సరే! ఇప్పుడు నేనేం చెయ్యాలి?


"నవ్వూ, పువ్వూ లేకుండా ఏమిటా ఆముదం తాగిన ముఖం నువ్వూను " అని నన్ను నిన్న అన్నారుగా, అదే మాట ఇప్పుడు మీకు వర్తిస్తుంది!


ఏదీ ఒక నవ్వు నవ్వండి!


************


14.. నేటి హాస్యం  
"ఏమిటా గావు కేకలు? నువ్వు చెప్పినట్టుగానే చారు పెట్టానుగా!


మూడు గ్లాసుల నీళ్ళు, పిడికెడు పసుపు, చిటికెడు చారుపొడి, చెయ్యినిండా వుప్పు, క్రికెట్ బంతి సైజులో చింతపండు, పోపులో ఆవాలు చారెడు చొప్పున పుంజెడు సార్లు, పుంజెడు అంటే నాలుగు సార్లే కదా!


13. . . నేటి హాస్యం  
చూడండి శ్రీవారూ! నేన్నదానికి, మీరు విన్నదానికీ సంబంధం లేదు!


ఓహో! తమది స్టెనో వుద్యోగం కదా!


పుస్తకం తెచ్చుకోండి డిక్టేషన్ ఇస్తాను!



12 . నేటి హాస్యం   "మర్యాదగా మీ పర్సు ఇవ్వండి!

లేకపోతే నా చేతిలోనున్న ఈ గన్ను పేలుద్ది"

"దొంగగారూ మన మధ్య ఆ గన్నువగొడవలొద్దు!ఇదిగో పర్సు"


"హహ్హహ్హహ్హా! ఇందులో ఒక్క బుల్లెట్ కూడా లేదు"


"పోనీలే! పర్సు పారేద్దామనుకున్నాను చిరిగిపోయిందని. నువ్వడిగేవు కదాని ఇచ్చేసాను" పర్సులో ఒక్క రూపాయి కూడా లేదులే"



11. నేటి హాస్యం  
మాష్టారూ! మీరొక్కరేగా స్టేషన్ ప్లాట్ ఫారమ్ మీద వున్నది?


ఔను సారూ!


అయితే నాలుగు ప్లాట్ ఫారమ్ టిక్కెట్లు ఎందుకు కొన్నట్టో?


ఏమీ లేదు సారూ!

ట్రైన్ నాలుగు గంటలు ఆలస్యం!
టిక్కెట్ కాల పరిమితి కేవలం రెండు గంటలే,
ఎనిమిది గంటలు ప్లాట్ ఫారం పై ఉన్నా పర్వా లేదనే వుద్దేశం తో నాలుగూ ఒకేసారి కొనేసాను!

హహ్హహ్హహ్హా!!!!!!!!!


10 . నేటి హాస్యం  


పాల వాళ్ళు ధర్నా చేస్తే పాలు రోడ్ మీద పార పోస్తారు .. 


కూరగాయల వాళ్ళు ధర్నా చేస్తే కూరగాయలు అన్ని తెచ్చి రోడ్ మీద పడేస్తారు . 


ఈ బ్యాంక్ వాళ్లు ఎప్పుడు మారుతారో ఏమో...... 


ఉట్టి ధర్నాలు మత్రమే చేస్తారు...... 


బ్యాంకుల సమ్మె.నాడు నోట్ల కట్టలు ఎప్పుడు పారేస్తారో



--((*))--


9. . నేటి హాస్యం  


రావే కోడలా! ఈ నరకలోకంలో నేనొక్కర్తినే నరకయాతన పడుతున్నానంటే నమ్ము, 

పోనీలే నా నరకయాతనలో నువ్వు కూడా కొంత పంచుకొని నాకు వెసులుబాటు కలిగిద్దువు! 

అత్తయ్యగారు! ఈ నరకలోకంలో 

గతజన్మ వావి వరుసలుండవస్సలు, 
అయినా మీరు నన్ను కాల్చుకుతిన్నది చాలలేదా? 
అయినా నేనిక్కడుండేది మూడు రోజులే, 
ఆ తరువాత స్వర్గానికే! 

నిజమేనే! నిన్ను రాచి రంపాన పెట్టిన పాపం నన్నిక్కడ నరకయాతనలకు గురి చేస్తోందనుకో! 

అది సరే గాని కోడలి వల్ల బాహా సుఖపడ్డావా? 

అయ్యో రాత! 

మా తరం వాళ్ళము రెండిందాలా బాదలనుభవించామనుకో అత్తయ్య! 
నా పెళ్ళయ్షాక అత్తగారి ధాష్టీకం 
కొడుకు పెళ్ళి చేసుకున్నాక కోడలి ధాష్టీకము!
 --((*))--

8. . నేటి హాస్యం  

"ఏమండీ ..కోడల్ని చూసారా .ఏమి సంస్కారం ..ఏమి ఒద్దిక ,పొందిక .ఈకాలంలో కూడా ఇలా గంటల తరబడి తలొంచుకుని పెళ్ళి పీఠలపై కూర్చునే ఆడపిల్ల దొరకడం మన పూర్వజన్మ సుక్రుతము, అదృష్టమే " 


........................కళ్ళద్దాలెట్టుకుని జాగర్తగా చూడవే 

చేతుల్లోనున్న మొబైల్ పని చేస్తోంది
ఆ .....      ఆ...  

--((*))--


7. నేటి హాస్యం  


"తల్లీ! మీ ఆయన అడుగుజాడల్లో నువ్వు నడవడం లేదని మీ అత్తగారు ఒక్కటే పోరు పెడుతున్నారు" 


"అమ్మా! ఆయన అడుగుజాడల్లో నడవాలంటే నేను కూడా రోజూ బార్‌కు, పేకాటకు వెళ్లాలి"


ఆ ......      ఆ......  


--((*))--


6. నేటి హాస్యం  
MOBILES తో జనబాహుళ్యం ... 

*నిద్ర*= కళ్ళు ముసుకుంటే రాదు 

*Net* Off చేస్తే వస్తుంది 

ఆకలితో ఉన్నవాడికి అన్నం, 

Android ఫోన్ వున్న 
వాడికి charger ఇవ్వడం పుణ్యకార్యం 

కోన్నిరోజుల ముందు వరకు 

అందరు *బేటా* కొరకు ఎదురుచుశాం, 
ఇప్పుడేమొ *Data* కొరకు 

Phone పాడైతే పిల్లలు చేసారంటాం, 

పిల్లలు పాడైతే Phone కారణం అంటాం. 

ఒకప్పుడు ఇంట్లో నుండి 

బయటకు వెళ్ళేటప్పుడు
 *పెద్దవాళ్ళ ఆశీర్వాదం* తీసుకుని వెళ్ళేవాళ్ళం, 

ఇప్పుడేమొ *ఫోన్ బ్యాటరీ ఫుల్* చేస్కోనీ వెళతాం 


Suddenly phone balance ఐపోతే, 

మనం మాట్లాడాల్సిన ఆవతలి వ్యక్తి 
భూమ్మీద దొరుకుతాడో లేదో అనేంత కంగారు పడిపోతాం 

Battery low అయి 1%లేదా 2% మీద ఉందనుకోండీ అప్పుడు చూడాలీ, 

చార్జర్ వైపు ఎలా పరుగెడతామంటే 
ఉహించుకోండి.... 

కొందరు phone pattern password ఎలా set చేస్తారంటే, 

వామ్మొ..... 
దాంట్లో ఎదో ISI పత్రాలు దాచుకున్నట్టు.. 

అనుకోకుండా ఫోన్ మిత్రుల దగ్గర మరిచిపోయినమనుకో..... 

మన అమాయక ప్రేయసీనీ శక్తీమాన్ దగ్గర వదిలేసినట్టు అన్పిస్తుంది.. 

Mobile company వాళ్ళతో ఒక request ఏంటంటే pls phone back side లో ఒక చిన్న lunch box తయారు చేసేయ్యండీ 

--((**))--

    

5. నేటి హాస్యం 


దేముడికి తనవాటా రాబట్టుకోవడం తెలుసు - 


ఒక పిసినారి గుడికి వెళ్లి జేబులన్నీ కెలికి ఒక చిరిగిపోయిన పదిరూపాయల నోటు హుండిలో వేసి ప్రసాదం కోసం చూస్తున్నాడు.


 అంతలో వెనుక ఉన్న ఒక మహిళ ఇతనికి ఒక 50 రూపాయాల నోట్ల కట్ట అందించిది .


 ఈ పిసినారి ఆమెకు హుండీ అందదేమో అనుకుని ఆ కట్ట హుండిలో వేసి బయటకు వస్తు కంగారుగా జేబులు తడుముతున్నాడు -


 ఆ మహిళ ఏమిటి ఈ కంగారు అనడిగింది, నా జేబులో ఒక నోట్లకట్ట ఉండాలి, అది లేదు అన్నాడు. మీరు హుండిలో వేసినప్పుడు కింద పడిపోతీ మీకు అందించాను కదా అదీ హుండిలో వేసారు కదా అందా అమ్మడు - పిసినారి తలతిరిగి క్రింద పడిపోయాడు


--((*))--

3. . నేటి హస్యం 
శ్రీమతి గారూ!

ఎదురింటి బామ్మగారు ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ?

ఏమీ లేదండీ!


రోజూ రాత్రి దోంగవాడు వాళ్ళ చెట్టెక్కి రెండు, మూడు కొబ్బరి బోండాలు పట్టుకుపోతున్నాడట.

వీడికిలా కాదని ఆవిడ మడి చీర తడిపి రాత్రి చెట్టు చుట్టూ కట్టేరట. ఆ దొంగ ఏకంగా ఏబై బోండాలు మడిచీరెలో మూట కట్టుకుని చక్కా పోయాట్ట.

అవునా .....   అవునండి ..... 


ఏమి వదల్లేదా 


--((**))--


2. . నేటి హస్యం 

డాక్టర్ గారూ!
ఆ పేషెంట్ కుట్లు విప్పనివ్వట్లేదు సర్.

డాక్టర్ : ఎందుకు ?


పదివేలు ఇచ్చి కష్టపడి వేయించుకున్న కుట్లుని విప్పుతారెందుకు అని అంటున్నాడు.

--((**))--


1. నేటి హస్యం 


గురువు :పిల్లలు నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాదానము చెప్పండి 

            
             దేవుడు చేసే పని ఏమిటి ? 
పిల్లలు

1 . గురువు స్థానంలో ఉండి బోధ చేయటం  కదా మాష్టారు

2.  జనన మరణాలు సృష్టించటం కదా మాష్టార్  
౩. ప్రళయాన్ని శృష్టించి ఆడుకోవటం కదా సార్ 

గురువు: రేపటి లోపు సమాధానములు వ్రాసు కొని రండి 


మరునాడు : అందరు తమకు తెలిసినవి వ్రాసుకొని వచ్చారు. 


గురువు:: ఎం రామకృష్ణ నీవు సమాధానము ఏమి వ్రాసుకు రాలేదు ఏమిటి ? 

ముందు మీరు సమాధానము చెప్పండి తర్వాత నేను చెపుతాను అన్నాడు అందరి ముందు 

గురువు : ఎం చెప్పాలో తెలియక ఒక్క అరుపు అరిచి పిల్లలకు పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి అన్నాడు . 

రామకృష్ణ : నేను చెపుతాను గురువుగారు నాకు అనుమతిస్తే 

గురువు : చెప్పు 


ఏమీ లేదు నేను సమాధానము చెప్పే వాడ్ని కనుక ఒక్క క్షణం గురువు స్థానంలో ఉంటా అన్నాడు 


గురువు : సరే అట్లాగే అని పిల్లల మధ్య కూర్చున్నాడు. 


రామకృష్ణ : దేవుడు చేసే పని అహంకారులను క్రింద కూర్చో పెట్టడం , అనుకువగా ఉన్న వారిని అందలం ఎక్కించటం .


ఆ..........                 ఆ.....................  


--((**))--


Comments

Popular posts from this blog



నేటి కవిత

Image

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు