20/2


 


నేటి కవిత

ముడిరైక బిగువు - తెలివైన మగువ 
కలనైన కవిత  - వరసైన పడచు  

వగలైన వరుస - సొగసైన చిలుక
పదునైన పడతి - చురుకైన పొగరు  
    
ఒకటైన వనిత - మనసైన సమత
గడుసైన గిరిజ - వదులైన వనజ

చురుకైన చిరుత - కథలైన మిడత
వరుసైన రవళి - మరుపైన మురళి

వయసైన ముసలి - వలపైన మమత     
బరువైన మనసు - మితమైన వయసు


--(())--

నేటి కవిత

నా యదను తాకే
ఒక నీలి మేఘం
ఎడారిలో దొరికిన నీళ్లలా

అర్ధం కాని భావాలు
నాలో తొంగి చూసినా
నా మనసు ఎడారికాలా

ఉద్వేగం నాలో లేదు
ఉన్మాదం అసలు లేదు
ఉత్తేజం ఉంది పరుగులా

మనసు మత్తుగా లేదు
మమత చెత్తగా లేదు
సంకల్పం ఉంది ప్రగతిలా

ఆయుధము పట్టుటలేదు
ఆదర్శం విడువలేదు
హాస్యాన్ని అనుకరించే వెల్గులా

ప్రణయాగానం లేదు
ప్రతిభను మరువలేదు
ఆనందం నిగురు నిప్పులా

నిశ్శబ్దాన్ని మరువలేదు
విజయాన్ని విడువలేదు
మరచి పోలేని ప్రేమలా
--(())--


నేటి కవిత- నా ప్రేమ 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

గాలి దీపంలా ఉంది నా ప్రేమ
ఇప్పుడారునో  తెలియక  రెపరెపలాడే
పలచని అద్దం లా ఉంది నా  ప్రేమ  
ఎప్పుడు జారిపడి ముక్క ముక్కలగునో

విరజాజి పూల లా ఉంది నాప్రేమ
నిట్టూర్పులకే వడలి వాడిపోవునో
తేట నీరుగా మారుతుంది నా ప్రేమ
దాహం తీర్చలేక  ఎండి పోవునేమో

మానసిక నవ్వులా ఉంది నా ప్రేమ
నవ్వలేక ఏడ్వలేక వాడిపోయెనేమో
ఎదురుగాఉన్నా చెప్పలేని మూగప్రేమ
అందుకోలేని నక్షత్రంలా మారె నేమో

ఎదురై హృదయాన్ని తట్టిన నా ప్రేమ 
దగ్గరలో దూరమై నన్ను బాదించునేమో
మొహమాటపు మాటకు నలిగింది నా ప్రేమ
విరహం ఓర్పుతో  చెలిమి చేసి బతుకునేమో

పున్నమి పూసే వేళ పరవసించలేని ప్రేమ
వెన్నెల వికసించిన విప్పి వివరించలేనేమో  
క్షణకాలం ధైర్యంతో నీముందు పంచే ప్రేమ
సెగకే కరిగే మంచు ముక్కలా మారునేమో

కష్టాల కడలిలో ఆశలతో ఉన్నది నా ప్రేమ
సుడిగుండాలమధ్య చిక్కి విలవిల్లాడిపోతానేమో
కన్నుమూసి తెరిస్తే  మాయమయ్యే స్వప్నం నా ప్రేమ
ఈ హృదయస్పందన నీకోసమే ఆగిపోవునేమో

--((***))--
 


22నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

నేను రెండు కళ్ళ భూతాన్ని
కళ్ళతో చూసి నిజం తెల్పు లక్ష్యం 
నేను ధరిస్తా యజ్నోవేతాన్ని
అది నాకు కుల ధర్మ కవచం

నేను వ్రాసేది వైప్లవ్వ గీతాన్ని
మనసుకు కల్గించు ఉపశమనం
నేను వింటాను పద్యప్రవచనాన్ని
తెలుసు కోవటమే నిత్య ధర్మం

నేను ఉపయోగిస్తా శరళ స్వరాన్ని
మనస్సు హత్తుకొనే పద జాలం
నేను అందిస్తా సాహిత్య నైవేద్యాన్ని
అది నాకు కల్గించు ఉజ్వల తేజం

అవసరాన్ని బట్టి అస్రనైపుణ్యాన్ని
అధర్మాన్ని అరికట్ఠే తర్పణం
నేను యెప్పుడు చూపను ఉద్రేకాన్ని
నాలో శాంతి సమ్మోహ సమూహం

నేను ఏర్పరుచు కున్నా దుర్గాన్ని 
దిక్దేవతలకు నిత్యం ఆహ్వనం
నేను ఏర్పరుచు కున్నా స్వర్గాన్ని
అదినాకు నిత్య ప్రేమా దివ్య నిలయం


--((*))--


23. నేటి కవిత   
పితృదినోత్సవం సందర్భముగా 
ప్రాంజలి ప్రభ ప్రాస కవిత్వం 
రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ 

అమృతాన్ని అందించే గరళాన్ని మింగేవాడు 
ఆశ్రయం కల్పించి కల్పతరువైన వాడు 
ఇల్లు, ఇల్లాలిని ఆదరించి ఆదుకునేవాడు 
ఈశ్వరునిలాగా సర్వం త్యజించునట్లుండేవాడు

ఉజ్వల భవిషత్తుకు నాంది పలికినావాడు
ఊసర వెల్లిలా రంగులు మార్చనివాడు
ఋషి తత్త్వం హిత బోధ చేసేవాడు 
ఎన్ని అన్నా భార్య మాట దక్కించేవాడు

ఏ పరిస్థితులలో కుటుంబాన్ని విడనివాడు
ఐశ్వర్యం ఉన్నా గర్వం లేనివాడు 
ఒనమాలు దిద్దిచ్చిన గురును పూజించేవాడు 
ఓంశ్రీరాం అని జపిస్తూ దైవాన్ని కొలిచేవాడు 

ఔషధం అందించి తల్లితండ్రులను ఆదుకునేవాడు
అందరి కోసం,  దేశం కోసం బ్రతికేవాడు 
అ: అన్న ఓహో అన్న ధర్మాన్ని కాపాడేవాడు  
క్రమశిక్షణతో సమయ పాలన చేసేవాడు 

గర్వము చూపక గణపతిలా ఉండేవాడు 
చమత్కార సంభాషణలతో ఊరడించేవాడు
జయమే ధ్యేయముగా నడిపించేవాడు 
టక్కు టమారులను తరిమేవాడు

డబ్బాలుకొంటెవాడ్ని వాయించేవాడు
తరతరాల సంస్కృతిని కాపాడేవాడు
పగలనక రేయనక కష్టపడేవాడు
మనస్సును పంచి మనస్సేరిగినవాడు 

యెల్లలు లేని సముద్ర మంత కుటుంబాన్ని ఈదేవాడు
రంజింపచేసి రంజిల్లేవాడు 
లయకారుడుగా దేశసేవ చేసేవాడు 
వజ్రం కన్నా విధ్యే మెలనేవాడు

గతించిన పితృదేవతలకు శ్రాద్ధ కర్మ చేసేవాడు  
కృప,వాత్సల్యం తో పుత్త్రధర్మాన్ని నెరవేర్చేవాడు  
జన్మనిచ్చిన తల్లి దేవతైనా, జన్మకు కారకుడైన తండ్రి 
దైవాంశ సంభూతుడు, మనపాలిట పెన్నిధి
అనురాగ, ఆప్యాయత పంచేవాడు తండ్రి 
--((*))--

                        

నేటి24.  కవిత   
ప్రాంజలి ప్రభ 
మల్లాప్రగడ రామకృష్ణ 

పాపాన్ని మోసేది నేనే 
నష్టాన్ని భరించేది నేనే 
కష్టాన్ని పొందేది నేనే
సుఖాన్ని పంచేది నేనే  

ఆకులు రాలిన చెట్టును నేనే 
వసంతంతో చిగురించేదాన్ని నేనే 
ఆశలు తీర్చే బ్రతుకును నేనే 
యదను మార్చే పలుకును నేనే 

విజయానికి మార్గం నేనే
ఆశయ సాధణకు ఆసరా నేనే
స్వార్ధం ఎరుగని తలుపును నేనే     
సాయము చేసే కరమును నేనే 

పిలవక పంచే బంధం నేనే 
ప్రేమను పంచే శక్తిని నేనే 
జ్ఞానం పెంచే చదువును నేనే  
వెలుగును చూపే దీపాన్ని నేనే 

నేనే అంటే ఎవరో మీరే చెప్పండి 

 --((*))--

ఉత్పలమాల:
ఇంతుల రంగవల్లులకు నివ్వని యంతయు సంతసించఁ బూ
బంతులు మాఘ మాసమునఁ బండుగ శోభను స్వాగతించ "శ్రీ''
చెంతకుఁ జేరి ధాత్రిఁ గల చింతలఁ దీర్చెడి కాంతి వోలె సం
క్రాంతికి నిచ్చె రైతులకు గాదుల నిండుగ ధాన్య రాశులన్

మానం లెక్క చేయని వారు
స్త్రీల బ్రతుకెలాగో చెప్ప గలరా ?
సుఖంగా అనుభవిస్తున్న వారు
కఫ్ట మేమిటో చెప్ప గలరా ?
ఓ ఆమని వయ్యారం

సత్సహారిశ్చంద్రుడిలా ఉన్నవారు 
లోకంలో యెవరైనా ఉంటె చెప్ప గలరా ?
ప్రాణం లెక్క చేయని వారు
దేశంలో యెక్క డుంటారో తెల్పరా ?

పినాక పాణిం సుజనావనం తం,
వృషేంద్ర వాహం గిరిజా మనోజ్ఞమ్!
సదాశివం శ్రీధర రూపవంతం,
భజామి నిత్యం గురుమూర్తయేऽహమ్!!!"


మరచి నావా ఓ జవ్వని
కరకు మాటలతో కస్సు మనే యవ్వని
చెరకు అంటే ఇష్టమని
కురులు విప్పి నాట్య మాడుట ఎందుకని 

వగచి నావా ఓ మోహిని 
వలపు చూపులతో దివ్య కాంతి మోహిని 
వేణువు అంటే ఇష్టమని 
వలువ లిప్పి వేచి ఉండుట ఎందుకని 

మనసు చెప్పే ఓ రాగిణి 
తలపు ఎందులకో మువ్వ మోజు రాగిణి 
వెదురు అంటే ఇష్టమని 
సలప రించి కాచి నుండుట ఎందుకని 

వయసు వచ్చే ఓ భామిని 
బిగువు సిగ్గులతో మోక్ష మిచ్చు భామిని 
మగసి రంటే ఇష్టమని   
కనుల చూపు ఆశ గుండుట ఎందుకని  

--(())--


దుర్గణంలో ఉన్నవారు
ధర్మంగా ఉన్నవారెవరో  చెప్ప గలరా ?
అస్సలు పని చేయనివారు 
మొత్తం చేసానంటే నమ్మే వారెవరు ?  

అగ్నిని పట్టు కున్నవారు
ఎక్కడైనా ఉన్న వారెవరో చెప్ప గలరా ?
దోసిడిలో నీటిని పట్టుకున్నవారు 
ఎక్కడైనా ఉన్న వారెవరో చెప్ప గలరా ?

ఎడారిలో నడిచేవారు 
పాదరక్షలు లేకుండా ఉండేవారు చెప్పగలరా 
తలవెంట్రుకలు ఉన్నవారు 
వారి వెండిట్రుకలను ఎవరైనా చెప్పగలరా 
  
--((*))--




నేటి హాస్యం (4)

మీరిప్పుడు కరెంటు కుర్చీలో కూర్చున్నారు. 
మరి కొద్ది క్షణాలలో మీరు ప్రాణాలు కోల్పోతారు. 
మీ ఆఖరి కోరికేమైనా వుంటే చెప్పండి?' 

మీరు తీర్చలేరు వదిలేయండి సార్! 

నా మాట నమ్మండి... 
ఎటువంటి కోరికైనా నేను తీరుస్తాను 

అయితే సరే సార్! నేను మిమ్మల్ని నమ్ముతున్నాను 
కరెంటు ఇచ్చినప్పుడు చేతికి ఏ విదమైన తొడుగూ లేకుండా మీరోసారి నా చేతిని ముట్టుకోండి'..!

--((**))--

నేటి హాస్యం (5)

డాక్టర్ గారూ! ఏమటండీ ఇంత బిల్లు! 

ఐటమ్ టూ ఐటమ్ వ్రాసాను చదవండి, 
ఆనక అడగండి! 

Congratulation fees. 200 
Blood test. 200 
మరి ఈ మూడోది బోదపడడము లేదు, 
అంకె 5,000 అని వుంది! 

మీరిక్కడున్నంత సేపూ 8 సిగరెట్లు కాలుస్తూ మా హాస్పిటల్ సోఫా తగలెట్టారట, 
సోఫా కొన్న రసీదు నఖలు బిల్లుకు జతపరిచాను చూసుకోండి!
--((**))--

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు