ఓషధ విజ్ఞానము
ప్రాంజలి ప్రభ.. అంతర్జాల పత్రిక - ఆరోగ్య ప్రభ ఓషధ విజ్ఞానము .. తేటగీత పద్యాలు రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 1 ) దాల్చీ చెట్టు ముక్క మెత్తగా నూరియు నుదుట పైన పూత పూసి నంత లేపన ప్రభా వము తీవ్ర మైన బాధ, తల నెప్పి తగ్గి హాయి ఇచ్చు ....1 2) శొంఠి జీలకర్ర సయింధవ లవణ వాము నూరి వస్త్ర గాళ బట్టి ముద్ద చేసి చెప్ప రించిగా త్రేల్పులు తగ్గి జీర్ణమగుట హాయి గొలుపు ....... .. 2 కొద్ధి ఆవాల చూర్ణము పగలు రాత్రి నీళ్ల లోపొడిని కలిపి రెండు మాత్ర లల్లె ఇస్తే పక్క తడిపే పిల్ల లలకు కొన్ని రోజులు ఇస్తేను తగ్గి హాయి ...... ... 3 మూత్ర పిండపు నెప్పికి కంది గింజ అంత ముసాంబరము గింజ, మరియు ఎండు ద్రాక్ష కలివి మెత్తగా నూరియు దాన్ని మింగి తేను నెప్పి తగ్గు ..... 4 జీల కర్ర నమిలి మింగితెను హాయి జీర్ణమగుఁ ను తిన్న ఆ హార మంత ఉదర సంబంధ రోగము తగ్గు చుండు తేపు లన్ని...