ఓషధ విజ్ఞానము
ప్రాంజలి ప్రభ.. అంతర్జాల పత్రిక - ఆరోగ్య ప్రభ
ఓషధ విజ్ఞానము .. తేటగీత పద్యాలు
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
1 ) దాల్చీ చెట్టు ముక్క మెత్తగా నూరియు
నుదుట పైన పూత పూసి నంత
లేపన ప్రభా వము తీవ్ర మైన బాధ,
తల నెప్పి తగ్గి హాయి ఇచ్చు ....1
2) శొంఠి జీలకర్ర సయింధవ లవణ
వాము నూరి వస్త్ర గాళ బట్టి
ముద్ద చేసి చెప్ప రించిగా త్రేల్పులు
తగ్గి జీర్ణమగుట హాయి గొలుపు ....... .. 2
కొద్ధి ఆవాల చూర్ణము పగలు రాత్రి
నీళ్ల లోపొడిని కలిపి రెండు మాత్ర
లల్లె ఇస్తే పక్క తడిపే పిల్ల లలకు
కొన్ని రోజులు ఇస్తేను తగ్గి హాయి ...... ... 3
మూత్ర పిండపు నెప్పికి కంది గింజ
అంత ముసాంబరము గింజ, మరియు
ఎండు ద్రాక్ష కలివి మెత్తగా నూరియు
దాన్ని మింగి తేను నెప్పి తగ్గు ..... 4
జీల కర్ర నమిలి మింగితెను హాయి
జీర్ణమగుఁ ను తిన్న ఆ హార మంత
ఉదర సంబంధ రోగము తగ్గు చుండు
తేపు లన్నియు తొలగియు హాయి గుండు ... 5
జీర్ణమగుఁ ను తిన్న ఆ హార మంత
ఉదర సంబంధ రోగము తగ్గు చుండు
తేపు లన్నియు తొలగియు హాయి గుండు ... 5
అలసట జలుబు దాహము దగ్గు తగ్గు
వ్యర్ధ వాయువు తగ్గుటకు ప్రేగు మంట
తగ్గుటకు తిన్న ఆహార మంత జీర్ణ
మగును ధనియాల రసము శ్రేష్ఠ మగును .. 6
వ్యర్ధ వాయువు తగ్గుటకు ప్రేగు మంట
తగ్గుటకు తిన్న ఆహార మంత జీర్ణ
మగును ధనియాల రసము శ్రేష్ఠ మగును .. 6
--(())--
ప్రాంజలి ప్రభ.. అంతర్జాల పత్రిక - ఆరోగ్య ప్రభ
ఓషధ విజ్ఞానము .. తేటగీత పద్యాలు
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నడుము నొప్పియు కీళ్లకు నొప్పి వచ్చి
మరియు మధు మేహమును మెంతు లు అరిగట్టు
ఆక లిని పుట్టించియు జీర్ణ క్రియ పెంచు
నోటి అరుచిని పోగొట్టు ఆవపిండి ..... .. 7
చింత పువ్వులు మూత్రాల వ్యాధులన్ని
చింత చిగురును తామర వ్యాధులన్ని
చింత కాయ పచ్చి దియురక్త శుద్ధి చేయు
కఫము అరిగట్టు పైత్యము చంపు చుండు ... 8
చింత పచ్చడి పాతది చాల మేలు
గుండె బలమిగా కీళ్లవా పులును తగ్గు
దగ్గు, ఆమ్లపు , పైత్యము తగ్గు చుండు
శుద్ధి అవునుక్రమము జీర్ణ మవ్వు చుండు ..... 9
ఓషధ విజ్ఞానము .. తేటగీత పద్యాలు
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నడుము నొప్పియు కీళ్లకు నొప్పి వచ్చి
మరియు మధు మేహమును మెంతు లు అరిగట్టు
ఆక లిని పుట్టించియు జీర్ణ క్రియ పెంచు
నోటి అరుచిని పోగొట్టు ఆవపిండి ..... .. 7
చింత పువ్వులు మూత్రాల వ్యాధులన్ని
చింత చిగురును తామర వ్యాధులన్ని
చింత కాయ పచ్చి దియురక్త శుద్ధి చేయు
కఫము అరిగట్టు పైత్యము చంపు చుండు ... 8
చింత పచ్చడి పాతది చాల మేలు
గుండె బలమిగా కీళ్లవా పులును తగ్గు
దగ్గు, ఆమ్లపు , పైత్యము తగ్గు చుండు
శుద్ధి అవునుక్రమము జీర్ణ మవ్వు చుండు ..... 9
అల్లము చిగుళ్ళు గాయాలు మాన్పు చుండు
అల్లము ఆకులు వాంతులు ఆపు చుండు
అల్లము రసము చెవి లొ పోటు తగ్గు చుండు
అల్లము పైత్యము తొలగించి హాయి నిచ్చు ... 10
చిన్న ఉల్లి ర సము చర్మ వ్యాధి తగ్గు
నీళ్ల తో వాడి తే అల్స రు అరి గట్టు
చిన్న ఉల్లి ప ర కడుపు తింటె మంచి
చిన్న ఉల్లి కా రంపొడి జీర్ణ మవ్వు ... ... 11
చిన్న ఉల్లి కా రంపొడి జీర్ణ మవ్వు ... ... 11
చిన్న ఉల్లితో జీర్ణ క్రి యలను పెంచు
చిన్న ఉల్లి ఆకులు ఆస్తమా వ్యాధి ఆపు
చిన్న ఉల్లి స హజ ఆంటి సెప్టిక్ సుమ్మీ
చిన్న ఉల్లి నోటిదుర్వాసన తగ్గి ఉంచు .... 12
--(())--
తులసి, అల్లము, తేనెతో ఉల్లి సమము
మూడు చెంచాలు రెండు పూ టలును సమము
వాడితే విరే చనములు తగ్గి శుభము
అల్ల పు రసము లో తేనె కల్పి త్రాగ
జలుబు దగ్గులు హరించు ఖచ్చితంగ ... 13
అల్ల పు రసము లో తేనె కల్పి త్రాగ
ఉబ్బసము తగ్గియు తేలిక సులభముగాను
సమము పిప్పళ్ళు చూర్ణము చేసి తేనె
కలిపి సేవించి నా ఎక్కిళ్ళ బాధ తగ్గు .... ... 14
కలిపి సేవించి నా ఎక్కిళ్ళ బాధ తగ్గు .... ... 14
ఆముదపు వేరు నూరియు తేనె తోను
లేద మజ్జిగ తోఉత్త రేణు వేరు
నూరి తేనెతో వాడిన ఖచ్చి తంగ
కామెర్ల రోగ ముయు తగ్గి శుభము కూర్చు .... .. 15
కామెర్ల రోగ ముయు తగ్గి శుభము కూర్చు .... .. 15
నూరి నట్టి పత్తి చెట్టాకు మజ్జి గతొను
లేదా మజ్జిగ తో విష్ణు క్రాంత వేరు
నూరి తేనెతో వాడిన ఖచ్చి తంగ
కామెర్ల రోగ ముయు తగ్గి శుభము కూర్చు .... .. 16
కామెర్ల రోగ ముయు తగ్గి శుభము కూర్చు .... .. 16
తాని కాయ, క రక్కాయ, ఉసిరి కాయ
ఈత్రి ఫలములు కాషాయ మంత తేనె
తిప్ప తీగెను దెచ్చి క షాయ జేసి
కటుక రోహిణి తెచ్చియు మెత్త నూరి
చక్కెర గలిపి వెచ్చటి నీరు తోను
బెల్లము, అల్లపు రసముయు కుంటె
ప్రాతఃకాలము తీసుకున్న కామెర్లాగు .... .... 18
31) మండూర భస్మము, కటుక రోహిణి, పసుపు
త్రిఫల, మ్రాను పసుపులు చూర్ణము చేసి
కామెర్ల వ్యాధి లో తిన్న లాభమవును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము
32) వెల్లుల్లి పాయలు మెత్తగా నూరి ముద్దగా
సైంధవ లవణము, నువ్వుల నూనె గలిపి
విషమ జ్వరములో ప్రొద్దున దిన్న లాభము
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా.ప్ర.)
శంఖం
33) నువ్వుల నూనెలో సైంధవ లవణము
ముద్దగా నూరిన వెల్లుల్లి పాయలు
సమస్త వ్యాధుల్లో ఉదయము తినుము
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా.ప్ర.)
34) పెద్ద జీలకర్ర మందంగా వేయించి
దానిలో సమముగా బెల్లము గలిపి
విషమ జ్వరము తగ్గు దినములొక తులమివ్వ
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా.ప్ర.)
35) శొంఠి, బెల్లము, జీలకర్రలు సమముగా
నూరి వేడి నీళ్లలో లేదా మజ్జిగలో
త్రాగినా శీత జ్వరము నశించురా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా.ప్ర.)
36) తులసి ఆకు రసములో మిరియాల చూర్ణము
అందులో కలపండి నెయ్యి గూడా
ప్రభల వాతముల వ్యాధులకిది భక్ష్యము
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (లో.రా.)
37) ఆముదపు వేరు, శొంఠి, ధనియాలు దెచ్చి
మంచిగా కాశాయము గాచి సేవించినా
ఆమ వాతములోన రోగికి లాభము
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (శా.సం.)
38) ధనియాలు, శొంఠిలను దెచ్చి
కాషాయము గాచి సేవించినా
దీపనము, పాచనములో లాభమవును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (శా.సం.)
39) చేదుపుచ్చ వేరు, పిప్పళ్ళు, బెల్లము
ఒక తులము చొప్పున సేవించినట్టైతే
శమించును సంధి గత వాతము
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా.ప్ర.)
40) కానుగ విత్తులు, పిప్పళ్ళు దెచ్చి
వేడి నీళ్లు కలిపి నూరి తాగు
మూర్ఛలు తగ్గించడములో లాభమిచ్చు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (బ.రా.)
41) పనస పండు నరిగించు నరటి పండు
అరటి పండు నరిగించు నెయ్యి
నెయ్యి నరగించుటకు నిమ్మ రసమురా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా. ప్ర.)
42) జాజికాయ లేక లవంగ కషాయము
లేకపోతే భద్రముస్తల కషాయము
ఆజీర్ణము, దాహాము, వాంతుల మందు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా. ప్ర.)
43) బూడిద గుమ్మడి వేరును చూర్ణము చేసి
వేడి నీళ్లలో గలిపి తాగించి నట్టైతే
ఆయాసము శమించు, దగ్గు అరిగట్టును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా.ప్ర.)
44) తుంగ గడ్డలు, కరక్కాయబెరడు, శొంఠి
సమభాగముచూర్ణములో రెండింతలు బెల్లము
నీడలో ఎండిన రేణు గింజలంత మాత్రలు
ఉదయము సాయంత్రము మూడు రోజులు
చప్పరించి ఉబ్బసము దగ్గు తగ్గును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (లో.రా.)
45) హిక్క రోగములో శొంఠి బెల్లముతో తినుము
తేనెతో కలిపి యష్టిమధు చూర్ణము తినుము
పంచదారములో కల్పి పిప్పలి చూర్ణము తినుము
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము
46) భారంగి మూలము, శొంఠి సమముగా దెచ్చి
కాషాయము గాచి సేవించి నట్టైతే
ఉబ్బసము నిశ్చితముగా హరించురా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (లో. రా.)
47) పిప్పలీ పొడి, త్రిఫల చూర్ణము
తేనెలో కల్పి భోజనము వేళలో తిన్న
క్షయ, జలుబు,జ్వర మాయసము తగ్గు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (రా. మా.)
48) మిరియాలు, పిప్పలి, శొంఠి చూర్ణము సమముగా
బెల్లము, నెయ్యితో తిన్న దగ్గు హరించును
తానికాయ రసము ఉబ్బసము, దగ్గులకు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (లో. రా.)
49) బెల్లము జీలకర్ర, శొంఠి సమముగా నూరి
మజ్జిగతో లేక వేడి నీళ్ళతో త్రాగినా
శీత జ్వరము ఎంత తీవ్రమైన తగ్గు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా. ప్ర.)
50) కటుక రోహిణి, తుంగ ముస్తలు, శొంఠి, దేవదారు, సుగంధిపాల
నేల ములక, కచ్చూరములునెలవేము, పర్ఫాటకములు
జ్వరములోన దంచి గాచి తేనె పిప్పలి చూర్ణముతో తినుము
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (లో. రా.)
51) వేప చెక్క, చెదుపొట్ల, తిప్పతీగే
కొడిసె విత్తులు నేల ములక సమము కాచి
విష జ్వరములో కాశాయము తేనె కల్పి త్రాగు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (లో. రా.)
52) తిప్ప తీగె కాశాయములో పిప్పలి చూర్ణము కల్పి
త్రాగ వలెను జీర్ణ జ్వరములోన
పిత్త జ్వరములో పర్ఫాటక కషాయము తో
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (శా. సం.)
53) ఉసిరికాయ, చిత్రమూలము, పిప్పళ్ళు, సైంధవ లవణము, కరక్కాయ
వీటి చూర్ణము దీపనము, పాచనములకు మరియు అరుచి పోగొట్టును
మల బద్దకము, శ్లేష్మ రోగము, సమస్త జ్వరముల మందు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (శా. సం.)
54) తిప్ప తీగె, శొంఠి, నేలవేము, వాకుడు, పుష్కర మూలమయ్యా
ఈ ఐదు ద్రవ్యాల కాషాయము త్రాగితే
జ్వరములెన్ని ఉన్న నిశ్చితముగా తగ్గు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము
55) తిప్ప తీగె, శొంఠి, నేలవేము, వాకుడు, పుష్కర మూలమయ్యా
ఈ ఐదు ద్రవ్యాల కాషాయము త్రాగితే
చికన్గున్యా ఆధునిక రోగములో లాభము
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము
56) పిప్పళ్ళు, త్రిఫల చూర్ణము తేనెతో తిన్న
జ్వరము, ఆయాసము, దగ్గులు తగ్గును
మల బద్దకము మాన్పి ఆకలి పుట్టించు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (యో. ర.)
57) వావిలి ఆకు రసము తేనెతో కల్పి తినిన
తులసి రసము మిరియాల చూర్ణముతో తినిన
జ్వరములు విషమ జ్వరములు నశించును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము
58) తిప్ప తీగె కాశాయమును చల్లార్చి
నాల్గు వంతుల తేనెతో కల్పి తాగిన
పాత జ్వరములు తగ్గును సమూలముగా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము
59) నేలవేము, శొంఠి, ముస్తలు సమ ఫలము*లో గాచి
కాశయమిచ్చిన కఫ దోషము, ఆమ దోషము లుండవు
మంచి పాచనము, కీళ్ల వాతపు జ్వరములో మందు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (చా. ద.)
(*ఫలము=50 గ్రాములు)
60) పిప్పలి చూర్ణములో రెట్టింపు బెల్లము దిన్న
ఆకలి పెరుగు, జ్వరమాగు,దగ్గు, ఆయాసము తగ్గు
క్రిములు నశించు, హృదయ రోగములో లాభము
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా. ప్ర.)
61) కటుకీ, తిప్ప తీగెల కాశాయము చల్లార్చి
తేనె తగినంత గలపి తాగినట్టైతే
జ్వరము నందు వచ్చే వాంతులు తగ్గును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా. ప్ర.)
62) ఎండు లేత తామరపు ఆకు చూర్ణము
పంచదార కలిపి తినగా సుమ్మీ
అతి సారము తగ్గును సత్యముగా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా. సం.)
63) మామిడి జీడి, మారేడు పిందెల కాషాయము
తేనె, పంచదారలు కల్పి సేవించిన
వాంతులు, విరేచనములు తగ్గునయ్యా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా. సం.)
64) మర్రివేర్ల చూర్ణము మజ్జిగతో త్రాగిన
బబ్బులాకులు* నీటిలో కల్పి తాగిన
అతి సారము వ్యాధి తగ్గు నిశ్చయముగా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (రా. మా.)
(• బబ్బులాకు = తుమ్మలాకు)
65) జాజికాయలు, నల్లమందు, ఖర్జూరములు సమము
తమలపాకులో మర్దించి గురువింద గింజంత
మాత్రలు చేసి తిన్న అతిసార మాగును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (వై. చి.)
66) మారెడు పిందెలు, నువ్వులు ముద్దగ నూరి గలిపి
పెరుగు పై మీగడలో కల్పి తింటే
జిగట విరేచనాలు నశించురా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (యో. రా.)
67) కొంచెము వేడి చేసిన కరక పిందెలు, జీలకర్ర
చూర్ణము చేసి బియ్యపు కడుగు నీటిలోతాగితే
విరేచనములు తగ్గి లాభమవును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (యో. రా.)
68) మామిడి, నేరేడు, ఉసరికల చిగుళ్ల రసము
తేనె, నెయ్యి, పాలు దేనితోనైన తిన్న
ప్రభలమైన రక్త సారములు గూడ తగ్గు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా. సం.)
69) కరక్కాయ, శొంఠి, తుంగ ముస్తలు దెచ్చి
బెల్లముతో నూరి ఉండలు చేసి తిన్న
అతిసారములు తగ్గి లాభమవును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (వైధ్య చింతామణి)
70) ధనియాలు మరియు శొంఠి రెండు గలిపి
కాశాయము గాచి పుచ్చుకొనగా
కడుపు నొప్పి తగ్గు, ఆజీర్ణము హరించు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా. ప్ర.)
71) ఉత్తరేణు వేరును మెత్తగ నూరి
నీటిలో గలిపి త్రాగినట్టైతే
కడుపు నొప్పి, ఆజీర్ణములు దూరమగును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా. ప్ర.)
72) బియ్యము కొబ్బరికాయ, తాటి పండు నరగించు
మామిడి పండును పాలు అరగించును*
దోస కాయను గోదుమలరగించును*
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (* భా. ప్ర.)
73) ఎండ రావి చెక్క కాల్చి బూడిద చేసి
నీళ్లలో కలిపి నీళ్లు వడగట్టి త్రాగిన
వాంతులు తగ్గును నిశ్చయముగా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా. ప్ర.)
74) శొంఠి కషాయముతో శ్లేష్మము, వాతము, పడిశెము తగ్గు
దృష్టి రోగము, ఉబ్బసము తగ్గు రొమ్మునొప్పాగు
అతిసారములు, అగ్ని మాంద్యములు పోవును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (లో. రా.)
75) శొంఠి చూర్ణము, బెల్లమిచ్చిన ఆమము తగ్గు
పిప్పలి చూర్ణము, బెల్లమిచ్చిన ఆజీర్ణము తగ్గు
కరక చూర్ణము, బెల్లమర్శమొలలో లాభము
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (చ. ద.)
76) దానిమ్మ బెరడు చూర్ణము చేసి
బెల్లములో కల్పి తిన్నట్టైతే
మల బంధము దూర మగునురా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (చ. ద.)
77) మారేడు పిందెలను మెత్తగా నూరి
అతివస, శొంఠిపొడి,బెల్లము, మజ్జిగతో తాగ
జిగట రక్త విరేచనాలు తగ్గునయ్యా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (అ. భూ.)
78) కరక వలుపు, లవంగాలు గాచి
కాశాయములో సైంధవ లవణము గల్పి తాగ
ఆజీర్ణము నశించి లాభమవును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము
79) మారేడు ఆకుల స్వరసము, మిరియాల చూర్ణము
కల్పి తాగిన ఆజీర్ణము, కామెర్లాలాగు
మూలవ్యాధులు గూడ దీనితో నయమవును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (యో. రా.)
80) పిప్పళ్ళు, శొంఠి, బెల్లము సమము మూడు
కలిపి తినగ ఆజీర్ణము నశించును
ఆజీర్ణములో వచ్చే నొప్పి మాయమగును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (యో. రా.)
81) నల్లని నువ్వులు ఒక ఫలము* చన్నీళ్లతో తిన్న
ఆర్షమొలలు నశించును** ఇంతే గాదు
దంతములు గట్టి గవును గూడ
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (50 గ్రాములు *చ. ద. )
82) కరక్కాయ చూర్ణము బెల్లము సమముగా తిన్న
పిత్త, కఫములు తగ్గు, కడుపు నొప్పాగును
దురదలు తగ్గును, మొలలు నశించురా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా. ప్ర.)
83) కటుక రోహిణి, అతి మధురము, కరక్కాయ
మూడింటి చూర్ణము పటిక బెల్లముతో తింటే
మొలలు నశించి ఆరోగ్యము కలుగు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (ఆ. భూ.)
84) నాగ కేసరములు, పంచదార, వెన్న
మూడు గలిపి నిత్యము సేవించిన
ఆర్షమొలలు తగ్గు ఇది సత్యమయ్యా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా. ప్ర.)
85) బెల్లము, శొంఠి చూర్ణములు సమముగా
నిత్యము తిన్న ఆజీర్ణముండదు
మొలలు, గుదామయము నశించును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (వృం. మా.)
86) శొంఠి, వాము ఈ రెండింటి చూర్ణము
మజ్జిగలో కలిపి త్రాగించి నట్టైతే
మూల వ్యాధిలో మల బద్దకముండదు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (యో. ర.)
87) మొలల్లో నువ్వులు, వెన్న గలిపి తినుము
మొలల్లో బెల్లము, కరక్కాయ చూర్ణము సమము
మొలల్లో నువ్వులు చన్నీళ్లతో తినుము
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము
88) మూడు గ్రాముల కటుక రోహిణి చూర్ణము
మూడు గ్రాముల కరక్కాయ చూర్ణము
పంచదారతో తిన్న కామెర్లు నశించును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (అ. భూ.)
89) కామలలో శొంఠి చూర్ణము ఆవు పాలతో*
కామలలో తిప్ప తీగ రసము తేనెతో**
కామలలో తిప్ప తీగేలాకు కల్కము మజ్జిగతో*
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (లో.రా. *భా.ప్ర. *భా. ప్ర.)
90) త్రిఫల, అడ్డసరము, నేలవేము, తిప్పతీగ
కటుక రోహిణి, మ్రాను పసుపు సమము గాచి
కాశాయము ఒక ఫలము కామల పాండుపుల పై
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (లో. రా.)
91) మంచి పసుపు కొంచెము
ఆవు పెరుగు లో కలిపి
పరి గడుపున తిన్న కామెర్లు తగ్గురా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము
92) నేల ఉసరికలు, జీలకర్ర, ఏలకులు దెచ్చి
ఆవుపాలలో నూరి చక్కెరలో ప్రొద్దున తిన్న
కామెర్లు తగ్గును, చప్పిడి పిండి పథ్యము
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (యో. ర.)
93) పూలవాకు, దాల్చిన చెక్క, ఏలకులు
బెంగల్వ కోష్టు, వెలిగారము, తేనెతో తిన్న
ఎక్కిళ్ళు అగును, హిక్కరోగము తగ్గు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (బ. రా.)
94) శ్వాస, కాస రోగములో బెల్లము ఆవ నూనెతో*
విషముష్టి చెక్క రసము ఒక చెంచా ఆయాసములో**
కాస**రోగములో చిల్లగింజ నీటిలో అరగదీసి తినుము
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (లో. రా. *అ. భూ. *దగ్గు)
95) తిప్పతీగె నేతిలో తిన్న వాతము తగ్గు
బెల్లముతో తిన్న మలబంధము తగ్గురా
పంచదారతో తిన్న పిత్తమును తగ్గించు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా. ప్ర.)
96) తిప్పతీగె తేనెతో తిన్న కఫమాగును
ఆముదముతో తిన్న తీవ్ర వాత రక్తమాగు
శొంఠితో తిన్న ఆమ వాతములు పోవురా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (భా. ప్ర.)
97) తులసి ఆకుల రసము మరియు నెయ్యి
మిరియాల చూర్ణములో కలిపి బక్షించినా
ప్రభలమైన వాత రోగములు నశించును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (లో.రా.)
98) శొంఠి, తిప్పతీగె కాశాయము గాచి త్రాగితే
వాతములు తగ్గును, కీళ్ల నొప్పులాగు
కీళ్ల అరిగి పోవుటలో గూడ లాభమే
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (యో. రా.)
99) రావిపట్ట రసములో పిప్పళ్ళ పొడి తింటే
మూతి వంకర పోవుటములో లాభము
మెడలు పట్టడములో కూడ లాభమగును
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (యో. రా.)
100) నీరు గొబ్బి, తిప్పతీగె తెచ్చి కలిపి
కాశాయము గాచి రెండు రోజులు త్రాగ
వాత రక్తము నశించు నిశ్చితముగా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (యో. రా.)
27) ఐదు చుక్కలు నల్ల ఉమ్మెత్త ఆకుల రసము
ఐదు రోజులు పర గడుపున మజ్జిగతో
వరుసగా ఇస్తే పచ్చ కామెర్లు తగ్గురా
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (అ. భూ.)
28) ఐదు గ్రాములు కామంచి ఆకు ఐదు గ్రాములు గలిజేరు
ఐదు గ్రాముల ఆముదము ఆకులు ముద్దగా నూరి
చప్పిడి పద్యములో ఏడు రోజులు కామెర్లకు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (అ. భూ.)
29) ఐదు గ్రాముల ఉసిరిక మూడు మిరియాలు
ఒక రేక తెల్ల గడ్డ గలిపి నూరి
పచ్చ కామెర్లకు మూడు రోజులు తినుము
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (అ. భూ.)
30) పిప్పళ్ళ పొడి మండూర భస్మము దెచ్చి
చింతాకు రసములో నలుబది రోజులు దిన్న
రక్తలేమి, వాపు, కామెర్లు, క్షయ దగ్గు
అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము (వై. చిం.)
ఈ కవితలు నా స్వంతం అని హామీ ఇస్తున్నాను.
నోట్ : ఇది ఔషధాల ప్రాథమిక జ్ఞ్యానము మాత్రమే, రోగులు వైద్యుల సలహా తోనే ఔషధాలు వాడాలి
సమాప్తము
మొ. ష. జాఫరీ (బహు భాషిక కవి)
మొహమ్మద్ షకీల్ జాఫరీ
మంచర్ (పూణే) మహారాష్ట్ర,
భారత్ 410 503
Mob : 9867929589
Email : shakiljafari@gmail.com
నమస్కారమండీ, "అపూర్వ జ్ఞ్యానమిది ఔషధ విజ్ఞ్యానము" అంశంపై నేను వ్రాసిన రచనలు pranjali prabaha news లో చేర్చినందుకు ధన్యవాదాలు
ReplyDelete- మోహమ్మద్ షకీల్ జాఫరీ