828. ఓం ఆజ్ఞాయై నమః విధి, నిషేధాత్మకమైన ఆజ్ఞల రూపంలో విలసిల్లు పరమేశ్వరికి నమస్కారము. శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఆజ్ఞా యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం ఆజ్ఞాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు సర్వకాలసర్వావస్థలయందును ప్రశాంతమైన జీవనము మరియు సత్కర్మఫలప్రదమును సంప్రాప్తమగును. "ఈ దేవి ప్రకృతియు కాదు, వికృతియు కాదు. జీవుడును కాదు. సృష్ట్యాదియందు నాకు కలిగిన ఆజ్ఞాస్వరూపురాలు. నా ముఖమునుండి బయల్వెడలిన నా ఐదు ముఖములనుండి వచ్చిన పంచవక్త్ర. మహాభాగురాలు. అభయమునిచ్చునది" యని శివుడు చెప్పెనని లింగపురాణము నందుగలదు. 'శ్రీమాత రుద్రుని ఆజ్ఞాస్వరూపురాలు. ఆమెచే ముక్తి కలుగును' అని శివపురాణమునందుగూడ గలదు. దీనివలన పరమేశ్వరి భగవదాజ్ఞారూపమగు విధినిషేధ రూపురాలు అని భావింపదగును. ఆజ్ఞ అను శబ్దము నుండి జ్ఞ అను ఏకాక్షర శబ్దమును స్వీకరించినచో విరించి (బ్రహ్మదేవుడు), బుధుడు, సౌమ్యుడు అను అర్థములు గలవు. గనుక జగన్మాత బుధస్వరూపురాలు, బ్రహ్మస్వరూపురాలు అని కూడ అమ్మవారిని భావించవచ్చును. పరమేశ్వరి శ్రీమహారాజ్ఞి, రాజరాజేశ్వరి రాజ్యలక్ష్మి, చతురంగబలేశ్వరి ఇలాంటి నామము ...
Posts
Showing posts from March, 2021