95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
828వ నామ మంత్రము 26.02.2021
ఓం ఆజ్ఞాయై నమః
విధి, నిషేధాత్మకమైన ఆజ్ఞల రూపంలో విలసిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఆజ్ఞా యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం ఆజ్ఞాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు సర్వకాలసర్వావస్థలయందును ప్రశాంతమైన జీవనము మరియు సత్కర్మఫలప్రదమును సంప్రాప్తమగును.
"ఈ దేవి ప్రకృతియు కాదు, వికృతియు కాదు. జీవుడును కాదు. సృష్ట్యాదియందు నాకు కలిగిన ఆజ్ఞాస్వరూపురాలు. నా ముఖమునుండి బయల్వెడలిన నా ఐదు ముఖములనుండి వచ్చిన పంచవక్త్ర. మహాభాగురాలు. అభయమునిచ్చునది" యని శివుడు చెప్పెనని లింగపురాణము నందుగలదు. 'శ్రీమాత రుద్రుని ఆజ్ఞాస్వరూపురాలు. ఆమెచే ముక్తి కలుగును' అని శివపురాణమునందుగూడ గలదు. దీనివలన పరమేశ్వరి భగవదాజ్ఞారూపమగు విధినిషేధ రూపురాలు అని భావింపదగును. ఆజ్ఞ అను శబ్దము నుండి జ్ఞ అను ఏకాక్షర శబ్దమును స్వీకరించినచో విరించి (బ్రహ్మదేవుడు), బుధుడు, సౌమ్యుడు అను అర్థములు గలవు. గనుక జగన్మాత బుధస్వరూపురాలు, బ్రహ్మస్వరూపురాలు అని కూడ అమ్మవారిని భావించవచ్చును.
పరమేశ్వరి శ్రీమహారాజ్ఞి, రాజరాజేశ్వరి రాజ్యలక్ష్మి, చతురంగబలేశ్వరి ఇలాంటి నామము లన్నియు అమ్మవారి జగదేకసార్వభౌమత్వమును ప్రకటించుచున్నవి. అంతటి సార్వభౌమురాలు గనుకనే ఒక్కసారి అమ్మవారి ముఖబింబమును అవలోకించితే కనబడేది ఆజ్ఞాస్వరూపమే. సకలజగత్తునకు విధినిషేధాత్మకమైన ఆజ్ఞలనిచ్చునదిగానే గోచరిస్తుంది. గనుకనే శ్రీమాత ఆజ్ఞా యని అనబడినది.
అమ్మవారికి నమస్కరించునపుడు ఓం ఆజ్ఞాయై నమః అని అనవలెను.
[04:33, 26/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
253వ నామ మంత్రము 26.02.2021
ఓం విజ్ఞానఘనరూపిణ్యై నమః
చిదేకరసరూపిణి, జీవులయొక్క సమిష్టి రూపము గలది అయిన శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి విజ్ఞానఘనరూపిణీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం విజ్ఞానఘనరూపిణ్యై నమః అని ఉచ్చరిస్తూ, ఆ అమ్మవారిని భక్తితత్పరతతో ఉపాసించు సాధకుడు బ్రహ్మజ్ఞానసముపార్జనకు వలసిన ధ్యానదీక్షా పటిమను సంప్రాప్తింపజేసికొనును.
ఘనీభవించిన చైతన్యరసమని విజ్ఞానఘనః అను పదమునకు వేదమునందు వ్యాఖ్యానింప బడినదని చెప్పబడినది.
విజ్ఞానం చైతన్యమేవ ఘనం సాంద్రం తదేకరసం రూపమస్యాః (సౌభాగ్యభాస్కరం, 419వ పుట)
పరమేశ్వరి ఘనీభవించిన (గొప్పదైన లేదా దట్టమైన) చైతన్యరస స్వరూపురాలు. యోవిజ్ఞానేతిష్ఠ అను అంతర్యామి బ్రాహ్మణమునందు గల వ్యాఖ్య ప్రకారము పరమేశ్వరి స్వప్రకాశరూపిణి. జగత్తునందలి సకలజీవకోటియొక్క సమిష్టి అభిమానదేవత అయిన జగన్మాత హిరణ్యగర్భస్వరూపురాలు. ఏతస్మాజ్ఞీవఘనాత్ అనెడి ఈ వేదవాక్యమునందలి జీవఘనశబ్దమునకు హిరణ్యగర్భయనుచు వ్యాఖ్యానింపబడినది. హిరణ్యగర్భ యను శబ్దమునకు గల అర్థములు:
1. బ్రహ్మ.
2. ఒక సాలగ్రామం.
3. సమష్టి సూక్ష్మ దేహాభిమాని చైతన్యం.
4. ఆది పురుషుడు.
5. సూర్య మండలాంతర్గతుడైన పురుషుడు.
పరమేశ్వరి సర్వమంత్రాత్మిక, సర్వతంత్రాత్రిక, సర్వయంత్రాత్మిక, సర్వదేవతాస్వరూపిణి గనుక అమ్మవారు నిఘంటువు నుండి లభించిన అన్ని అర్థములకు అన్వయించు కొనవచ్చును.
అంతటి విజ్ఞానఘనరూపిణియైన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం విజ్ఞానఘనరూపిణ్యై నమః అని యనవలెను.
7702090319, 9505813235
[20:53, 26/02/2021] +91 95058 13235: 🕉️🕉️శ్రీ దుర్గాసప్తశతి🕉️🕉️
ప్రథమాధ్యాయము 26.2.2021
🙏🙏🙏ఓం నమశ్చండికాయై🙏🙏🙏
ప్రత్యువాచ స తం వైశ్యః ప్రశ్రయావనతో నృపమ్|19|
ఆదరముగా నడుగుచున్న రాజు ప్రశ్నలకు వైశ్యుడు వినయముతో ప్రత్యుత్తరమిచ్చెను.
వైశ్య ఉవాచ॥20॥
వైశ్యుడిట్లనెను.
సమాధిర్నామ వైశ్యోఽహముత్పన్నో ధనినాం కులే|21|
"నేను సమాధియను పేరి వైశ్యుడను. ధనవంతుల యింట పుట్టితిని. నా భార్యాపుత్రులు ధనమునకాశించి దుస్స్వభావులై నన్ను నిరసించిరి".
పుత్రదారైర్నిరస్తశ్చ ధనలోభాదసాదుభిః|
విహీనశ్చ ధనైర్దారైః పుత్రైరాదాయ మే ధనమ్|22|
"నేను ధనము పోగొట్టుకొని, నా వారిచే తరమబడి ఏకాకినై యీ యడవులపాలైతిని".
వనమభ్యాగతో దుఃఖీ నిరస్తశ్చాప్తబంధుభిః|
సోఽహం న వేద్మి పుత్రాణాం కుశలాకుశలాత్మికామ్|23|
"ఇక్కడపడి, అక్కడి నా భార్యాపుత్రుల మంచిచెడ్డల సంగతులు తెలియలేకున్నాను".
ప్రకృతిం స్వజనానాం చ దారాణాం చాత్ర సంస్థితః|
కిం ను తేషాం గృహే క్షేమమక్షేమం కిం ను సాంప్రతమ్|24|
"ఇంటిదగ్గర వారిప్పుడు సుఖముగనే ఉన్నారో, కష్టములు పడుచున్నారో?"
కథం తే కిం ను సద్వృత్తాం దుర్వృత్తాః కిం ను మే సుతాః|25|
"నా పుత్రులు మంచిత్రోవలో నున్నారో? చెడుత్రోవలోనే పోవుచున్నారో"
రాజోవాచ॥26॥
రాజిట్లనెను.
యైర్నిరస్తో భవాంలుబ్ధైః పుత్రదారాదిభిర్ధనైః|27|
తేషు కిం భవతః స్నేహమనుబధ్నాతి మానసమ్|28|
"ఏమయ్యా? ధనమునకాశించి నిన్ను విడిచిన నీ భార్యాపుత్రులపై నీ మనసున స్నేహము పెట్ఠుకున్నావు".
వైశ్య ఉవాచ॥29॥
ఏవమేతద్యథా ప్రాహ భవానస్మద్గతం వచః|30|
కిం కరోమి న బధ్నాతి మమ నిష్ఠురతాం మనః|
యైః సంత్యజ్య పితృస్నేహం ధనలుబ్ధైర్నిరాకృతః|31|
పతిస్వజనహార్దం చ హార్ది తేష్వేవ మే మనః|
కిమేతన్మాభిజానామి జానన్నపి మహామతే|32|
యత్ప్రేమప్రవణం చిత్తం విగుణేష్వపి బంధుషు|
తేషాం కృతే మే నిఃశ్వాసో దౌర్మనస్యం చ జాయతే|33|
వైశ్యుడిట్లనెను. "నా మనసులోని మాటకూడ మీరిప్పుడు పలికినట్లే ఉన్నది. కాని నా మనసు కఠినము కాకున్నది. ఏమి చేయుదును? తండ్రియని, పతియని, మనవాడని స్నేహములేక నన్ను విడిచిన వారిపై మనసు తగిలియున్నది. మహారాజా! నేనీ విషయము తెలిసికూడ, నా మనసు అట్టి దుర్గుణులైన నా వారియెడ ఏల ప్రేమ చూపుచున్నదో తెలిసికొనలేకున్నాను. వారి విషయమై దుఃఖమును కలతయు కలుగుచున్నది.
(తరువాయి వచ్చే శుక్రవారం)
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
[04:17, 27/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
829వ నామ మంత్రము 27.02.2021
ఓం ప్రతిష్ఠాయై నమః
సకల జగత్తునకు ఆధారభూతురాలు (అధిష్ఠానము) అయిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రతిష్ఠా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం ప్రతిష్ఠాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ పరమేశ్వరి వారికి భౌతిక జీవన సంబంధమైన శాంతిసౌఖ్యములతోబాటు, పరమానంద భరితమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపత్తిని కూడా ప్రసాదించును.
సకల జగత్తుల యునికికి పరమేశ్వరి ఆధారభూతురాలు. సృష్టికి పూర్వము జగత్తులన్నియు దేవియందే నిక్షిప్తమై యున్నవి. గనుకనే అమ్మవారు ప్రతిష్ఠా యని అనబడినది. సర్వ విశ్వమునకు ఆధారభూతురాలు అని వేదమునందేగలదు. 'ప్రజ్ఞాస్వరూపురాలగు ఈ పరమేశ్వరి సకల వస్తువుల ఉనికికి ఆధారభూతురాలు' అని బ్రహ్మగీతలో గలదని భాస్కరరాయలువారు చెప్పారు. శివుని అష్టమూర్తులకు పురుషతత్త్వములని యందురు. ఆ తత్త్వములలో జలమందుంచిన పార్వతియొక్క ఆత్మకు ప్రతిష్ఠ యని అందురు. గనుక పరమేశ్వరి జలతత్త్వమందలి ప్రతిష్థా కళాస్వరూపురాలు అని యందురు.
ప్రతిష్ఠా ఛందస్స్వరూపురాలు జగన్మాత.
పద్యలక్షణము చెప్పెడు శాస్త్రమును
ఛందస్సు అందురు. ఛందస్సులలో 1. ఉక్త 2. అత్యుక్త 3. మధ్య 4. ప్రతిష్ఠ 5. సుప్రతిష్ఠ 6. గాయత్రి 7. ఉష్ణిక్కు 8. అనుష్టుప్పు 9. బృహతి 10. పఙ్త్కి 11. త్రిష్టుప్పు 12. జగతి 13. అతిజగతి 14. శక్వరి 15. అతిశక్వరి 16. అష్టి 17. అత్యష్టి 18. ధృతి 19. అతిధృతి 20. కృతి 21. ప్రకృతి 22. ఆకృతి 23. వికృతి 24. సంకృతి 25. అభికృతి 26. ఉత్కృతి అని ఇరువది యారు ఛందోలక్షణములు గలవు. ఈ ఇరువది యారింటిలో నాలుగవది అయిన ప్రతిష్ఠా ఛందస్స్వరూపురాలు జగన్మాత అని చెప్పబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రతిష్ఠాయై నమః అని యనవలెను.
[04:17, 27/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
254వ నామ మంత్రము 27.02.2021
ఓం ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపాయై నమః
ధ్యానము, ధ్యానించువాడు, ధ్యానింపబడునది యను త్రిపుటి తానై విలసిల్లు శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను నిశ్చలమైన చిత్తముతో ధ్యానించినట్లైనచో, ఆ ధ్యాత (ధ్యానముచేయునతడు) నిశ్చయముగా జగన్మాత అనుగ్రహముతో సర్వార్థసిద్ధిని పొందగలడు.
ధ్యాన అనగా ధ్యానము, ధ్యాత అనగా ధ్యానము చేయువాడు, ధ్యేయము అనగా ధ్యానముచేయబడు దేవత. ఈ మూడింటి సమిష్టిరూపమును త్రిపుటి యందురు. ఈ త్రిపుటి స్వరూపమే జగన్మాత. గనుక పరమేశ్వరి ధ్యానధ్యాతృ ధ్యేయరూపా యని అనబడినది.
1. ధ్యానము, 2. ధ్యాత, 3. ధ్యేయము అను ఈ మూడు రూపములు ధ్వై (చింతాయాం) అను ధాతువునుండి ఉత్పన్నమయినవి. చింత అనగా మానసికమైన జ్ఞానము. ఏవిధమైన చిత్త చాంచల్యము లేకుండా పరమాత్మను మనసునందు స్మరించుటయే ధ్యానము అనబడును. అటువంటి ధ్యానము చేయువానినే ధ్యాత అందురు. అటువంటి ధ్యాత పరమాత్మను స్మరించుచుండుటచేత, పరమాత్మను ధ్యేయము అందురు. ఈ మూడింటి స్వరూపమే శ్రీమాత. ఇక్కడ సగుణధ్యానములో ధ్యాన, ధ్యాతృ, ధ్యేయములు అను మూడు ఉండును. నిర్గుణధ్యానమని వేరొకటి ఉన్నది. అట్టి ధ్యానములో ఈ మూడూ ఉండవు. అంటే మంత్రము, మంత్రాధిదేవత, మంత్రమును జపించువాడు ముగ్గురూ ఒకటే. ఎట్టి సంకల్పములు లేక పరమాత్మ స్వరూప విషయమునకు సంబంధించినది జ్ఞానము. ఇటువంటి జ్ఞానములో గూడ జ్ఞానము అనగా తెలివి, జ్ఞాత (తెలిసికొనగోరువాడు), జ్ఞేయము (తెలియవలసినది) అను త్రిపుటి ఉండును. అటువంటి త్రిపుటిస్వరూపిణి జగన్మాత.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ధ్యానధ్యాతృ ధ్యేయరూపాయై నమః అని యనవలెను.
[05:41, 28/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
830వ నామ మంత్రము 28.02.2021
ఓం ప్రకటాకృత్యై నమః
హృదయస్థానమునందు చెయ్యి వేసి నేను అని చెప్పబడుతూ అహం అనే రూపంలో ప్రకటితమగు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రకటాకృతిః యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం ప్రకటాకృత్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి సర్వకాలసర్వావస్థలయందు నేనున్నాను అని యంటూ భక్తులయార్తిని తీర్చును.
సూతసంహితలో ఇలా గలదు:-
త మహం ప్రత్యయవ్యాజాత్ సర్వే జానంతి జంతవః|
తథాపి శివరూపేణ న విజానంతి మాయ యా॥
(సౌభాగ్యభాస్కరం, 932వ పుట)
"ప్రాణుల లోపలనున్న ఆ పరమాత్మను నేను (అహం) అను జ్ఞానముతో అందరు తెలిసికొనుచున్నారు. అది నేనే అని కూడ అనుకొనుచున్నారు. కాని నేను అనే ఆ నేను అనే ఆ రూపం నేనుకాదు. పరమశివుడను విషయం ఎవరును మాయచే తెలిసికొనలేకపోవుచున్నారు". అని సూతసంహితయందు గలదు. ఇది పై శ్లోకములోని సారాంశము.
శ్రీచక్రమునందలి ప్రథమావరణము - త్రైలోక్యమోహన చక్రము. దీనినే భూపురము అని అందురు. అందులో గల యోగినులకు ప్రకటలు అనియు. అందులో ముఖ్యయోగిని ప్రకటయోగిని. జగన్మాత ఈ ప్రకటయోగినీ స్వరూపురాలు అని భావించదగును. ముందు నామం (ప్రతిష్ఠా) తో గలిపి ప్రతిష్ఠాప్రకటాకృతిః అని యుండగా పదచ్ఛేదము చేసినపుడు ప్రతిష్ఠ + అప్రకటాకృతిః అన్నప్ఫుడు జగన్మాత అప్రకటమైన ఆకృతి గలది అనగా రహస్యస్వరూపురాలు జగన్మాత యని కూడ భావించవచ్చును. పరమాత్మగా అప్రకటాకృతిగాను, కంటికి కనిపించే రూపంలో ఉంటూ, చతుర్బాహు సమన్వితా, రాగస్వరూపపాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా, మనోరూపేక్షుకోదండా...యంటూ దృశ్యమానంగా స్తుతింపబడు ప్రకటితరూపమైన పరమేశ్వరిని ప్రకటాకృతిః యని అన్నాము.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రకటాకృత్యై నమః అని యనవలెను.
[05:41, 28/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
255వ నామ మంత్రము 28.02.2021
ఓం ధర్మాధర్మ వివర్జితాయై నమః
ధర్మము, అధర్మము అను రెండిటిని వర్జించి, వీటికి అతీతమైన నిర్గుణ స్వరూపురాలగు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలీ ధర్మాధర్మ వివర్జితా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం ధర్మాధర్మ వివర్జితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి చక్కని ధర్మప్రవర్తన గలవారిగాను, నిశ్చలధ్యాన తత్పరులగాను ప్రవర్తిల్లజేసి, శాశ్వతమైన పరమానందాను భూతులగునట్లుగా అనుగ్రహించును.
పరమేశ్వరి పరబ్రహ్మస్వరూపిణి. ధర్మము, అధర్మము అనేది లౌకికులకు మాత్రమే. పరమాత్మకు కాదు. గనుకనే ధర్మము, అధర్మము అనునవి పరమేశ్వరికి అన్వయింపబడవు. గనుక పరమేశ్వరి ధర్మాధర్మవివర్జితా యని అనబడినది. వేదశాస్త్రమునందు విధింపబడినవి ధర్మములు. నిషేధింపబడినవి అధర్మములు. "లోకముల నన్నిటిని ధరించునది మహత్వము ( గొప్పతనము) గలది, కావున ధర్మమని చెప్పబడినది. దేనిచే జీవులకు మేలు కలుగునో అది ధర్మము, దేనిచే కీడు గలుగునో అది అధర్మము. ఈ ధర్మాధర్మములు గురువులు ఉపదేశించెదరు. గురువులనగా వేదవిహితములైనవి ఆచరించి, నిషేధితములైనవి వర్జించినవారు. కొన్ని ఆచారములు వంశపారంపర్యముగా వచ్చును. అట్టి ఆచారములు వేదవిహితములైనచో అవి ధర్మములే యగును. వేదనిషేధమైనవి అయితే అధర్మములగును. యజ్ఞము చేయుట, ఆచారము, దమము, అహింస, దానము, స్వాధ్యాయాధ్యయనము (వేదాభ్యాసము) అను ఈ కర్మలే పరమధర్మమైనవి. ఇవి చేయుట వలన ఆత్మదర్శనము కలుగును.
గురువులు బోధించునవి వేదవిహితములే అయి ఉంటాయి. వేదనిషేధములు బోధించరు. ప్రతీ మానవుడు వర్ణాశ్రమధర్మములను ఆచరించునంత వరకూ వేదవిహితములైన ధర్మములను కూడా పాటించవలయును. నిషేధములు పాటించరాదు.
ధర్మం ఇది కేవలం రెండక్షరాల పదం కాదు! ముక్కోటి దేవతలూ అనుక్షణం శ్వాసించే అద్భుతం. ముల్లోకవాసుల్నీ శాసించే అక్షర సమూహం. ధారణాద్ధర్మమిత్యాహుః అని వ్యాసోక్తి. ధరించునది కావున ధర్మం అనబడిందని దీని అర్థం. ధర్మమే ప్రజలను, ప్రపంచాన్ని ధరిస్తూ ఉంది. ఏది సంఘాన్ని చక్కని కట్టుబాటులో నిలుపుతుందో అదే ధర్మం.
ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః
తస్మాత్ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్
అని మనుస్మృతి చెబుతోంది. ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మననే బాధిస్తుంది. ధర్మ రక్షణ చేస్తే అది మనను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం చేయకూడదని దీని అర్థం.. అంతరార్థం.. పరమార్థం.
ఈ ధర్మము అనేది శరీరధారులైన మానవులకే గాని అశరీరులైన దేవతలకు కాదు. జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి గనుక ఆ తల్లికి ఇవి ఏమియు అన్వయింపబడవు కావున ధర్మాధర్మవివర్జితా యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ధర్మాధర్మ వివర్జితాయై నమః అని యనవలెను
[04:27, 01/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
831వ నామ మంత్రము 01.03.2021
ఓం ప్రాణేశ్వర్యై నమః
ముఖ్యప్రాణము మరియు ఇంద్రియాలకు అధిష్ఠాన దేవతయై విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రాణేశ్వరీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ప్రాణేశ్వర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరియైన లలితాంబను ఆరాధించు సాధకులకు ఆయురారోగ్యములు, శాంతిసౌఖ్యములు, భగవదారాధనయందు ఏకాగ్రత సంప్రాప్తమగును.
ప్రాణములకు ఆధారమైనది. ప్రాణములనగా ఇంద్రియములు. అట్టి ఇంద్రియములకు అధిష్ఠాత్రి. గనుకనే ప్రాణేశ్వరీ యని అనబడినది.
ప్రాణములు అయిదు. 1. ప్రాణము (హృదయమున నుండునది), 2. అపానము (గుదమున నుండునది), 3. సమానము (నాభి మండలమున నుండునది), 4. ఉదానము (కంఠమున నుండునది), 5. వ్యానము (శరీరమంతట వ్యాపించి యుండునది).
ఉపప్రాణములు కూడా అయిదు. అవి:
1. నాగము(వాక్కు నందుండునది), 2. కూర్మము (కంటిరెప్పల యందుండునది), 3. కృకరము (నేత్రముల యందుండునది), 4. దేవదత్తము (కంఠద్వారమున నుండునది), 5. ధనంజయము (హృదయమున నుండునది).
ఈ ప్రాణములకు పరమేశ్వరి అధిష్ఠాత్రి.
వేదమునందు ప్రాణమునకే ప్రాణము అనికూడా చెప్పబడినది. అనగా ప్రాణములకు అధిష్ఠాత్రి అయిన శ్రీమాత లేకుంటే ప్రాణములుకూడా నిలువలేవు. అందుకే అంటారు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. ప్ర + ఆణ అనగా ప్రాణ. ప్రాణ అనగా శబ్దము అను అర్థము గలదు. ఇక్కడ శబ్దము అనగా వేదశబ్దము. అనగా వేదము. వేదరాశికి దేవత. అనగా వేదముచే ప్రతిపాదింప బడినది. వేదము అనగా పరబ్రహ్మము. అట్టి పరబ్రహ్మ స్వరూపిణియైన అమ్మవారు ప్రాణేశ్వరీ యని అనబడినది.
సృష్టి సకల జీవరాసులు కర్మలు చేస్తుంటాయి. ఆ కర్మలఫలితంగా పునర్జన్మలు పొందడం జరుగుతుంది. ఈ పునర్జన్మ అనేది పరమేశ్వరి ఆజ్ఞయే. అనగా సకల జీవకోటికి (ప్రాణికోటికి) అధికారిణి గనుకనే అమ్మవారు ప్రాణేశ్వరీ యని అనబడినది. శ్రీమాత ప్రాణేశ్వరి యగుట చేతనే ముక్కంటి మూడవ కంటి మంటలకు మన్మథుడు భస్మమయిపోయాడు. పరమేశ్వరి ప్రాణేశ్వరి గనుకనే మన్మథుని సజీవునిగా చేసినది. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః (84వ నామ మంత్రము) శివుని నేత్రాగ్నిచే భస్మమయిపోయిన మన్మథుని సజీవుని చేయుటకు సంజీవనౌషధిగా జగన్మాత ఒప్పారినది.
మహిషుడు, భండాసురుడు మొదలైన రాక్షసుల ప్రాణములను హరించివేసినది యంటే ఆ తల్లి ప్రాణేశ్వరి యే గదా!
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రాణేశ్వర్యై నమః అని యనవలెను.
[04:27, 01/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
256వ నామ మంత్రము 01.03.2021
ఓం విశ్వరూపాయై నమః
విశ్వ అనగా జాగ్రత దశను పొందిన, స్థూలభూతత్త్వాన్ని పొందిన చైతన్యంతో కూడిన జీవుల అర్థం. అటువంటి వైశ్వానర రూపిణి అయివున్న పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి విశ్వరూపా యను నాలుగక్షరముల(చతురక్షరీ) నామ మంత్రమును ఉచ్చరించుచూ, ఆ అఖిలాండేశ్వరిని ఉపాసించు సాధకునకు భౌతికపరమైన కోర్కెలను పరిత్యజించి, బ్రహ్మజ్ఞాన సముపార్జనకై సాధనను మరింత పటుత్వమునందజేయు దిశగా బుద్ధిని పయనింపజేయును. జన్మతరించినదను పరమానందానుభూతినందును.
ఈ నామ మంత్రము మొదలు పందొమ్మిది నామ మంత్రముల వరకూ, జీవునికి పరమేశ్వరునికి గల భేదములు తెలియుటయేగాక శ్రీమాత జీవేశ్వర స్వరూపురాలను భావముకూడా ఆవిష్కరింపబడును. సృష్టిలో ముందుగా తమస్సు అనగా అజ్ఞానము లేక అవ్యక్తము ఆవిర్భవించినది. అట్టి తమస్సునుండి మహత్తత్త్వము, దానినుండి అహంకారము పుట్టినవి. ఈ అహంకారము త్రిగుణాత్మకమైనది అనగా సత్వరజస్తమోగుణాత్మకమైనది. అహంకారము నుండి పంచతన్మాత్రలు (1. రూపము, 2. రసము, 3. గంధము, 4. స్పర్శ, 5. శబ్దము) ఏర్పడినవి. వీనినే సూక్ష్మభూతములని యందురు. వీనియందు అయిదు జ్ఞానశక్తులు, అయిదు క్రియాశక్తులు గలవు. జ్ఞానశక్తులనగా జ్ఞానతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు). ఈ జ్ఞాన తన్మాత్రలనుండి వరుసగా చెవి, చర్మము, కన్ను, నాలుక మరియు నాసిక అను జ్ఞానేంద్రియము ఏర్పడినవి. అదేవిధంగా పంచతన్మాత్రలలో జ్ణానశక్తులు అయిదుతోబాటు, క్రియాశక్తులయిదు కూడా గలవు. క్రియాశక్తులయిదింటి నుండి వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలని అయిదు కర్మేంద్రియములు కలిగినవి. ఈ క్రియాశక్తులయిదింటి సమూహంనుండి ప్రాణములు (1. ప్రాణము (హృదయమున నుండునది), 2. అపానము (గుదమున నుండునది), 3. సమానము (నాభి మండలమున నుండునది), 4. ఉదానము (కంఠమునందుండునది), 5. వ్యానము (శరీరమంతట వ్యాపించి యుండునది). సూక్ష్మభూతములయిన శబ్దాదులనుండి స్థూలములయిన పంచభూతములు (భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము) పుట్టినవి. ఇది సృష్టియొక్క యథార్థత.
ఆత్మచైతన్యము జీవులలోని స్థూలభూతములతో కలిసినప్పుడు విశ్వుడనియు, సూక్ష్మభూతములతో గలిసినప్పుడు తైజసుడనియు, కారణోపాధితో గూడినప్పుడు ప్రాజ్ఞుడనబడును. దీనినే జీవుల వ్యష్టివిషయము. ఆత్మచైతన్యము స్థూలభూత (పంచభూత) సమిష్టితో గూడియున్నప్పుడు వైశ్వానరుడనియు (విరాట్టు అనియు), సూక్ష్మభూతములయిన శబ్దాదులసమిష్టితో గూడినప్పుడు హిరణ్యగర్భుడనియు, కారణోపాధి సమిష్టితో గలిసినప్పుడు ఈశ్వరుడనియు చెప్పబడును. పరమాత్మ అంతఃకరణరూపమగు కారణోపాధితో గలసినప్పుడు హిరణ్యగర్భుడనియు (బ్రహ్మ) ప్రాణములతో గూడినప్పుడు సూత్రాత్మ (విష్ణువు) యనియు, ప్రాణాన్తఃకరణములు రెండును కలిసియున్నప్పుడు,ఆ సముదాయముతో గూడిన పరమాత్మకు అంతర్యామి (రుద్రుడు) అనియు చెప్పబడుచున్నది. ఈ విధముగా వ్యష్టి జీవాత్మ స్థులసూక్ష్మకారణ భేదములచే విశ్వ-తైజస-ప్రాజ్ఞులని మూడు విధములని చెప్పబడుచున్నది. సమిష్టి జీవాత్మ స్థూలసూక్ష్మకారణ భేదములచే విరాట్(వైశ్వానర), హిరణ్యగర్భ, ఈశ్వర నామములతో విరాజిల్లుట జరుగుచున్నది.
పరమాత్మ అంతఃకరణముతో కలసినప్పుడు హిరణ్యగర్భుడనియు, అంతఃకరణము ప్రాణసముదాయముతో కలసినప్పుడు సూత్రాత్మ యనియు, ప్రాణసముదాయము (పంచప్రాణములు మరియు పంచ ఉపప్రాణములతో) కలసినప్పుడు అంతర్యామియు అని చెప్పడం జరుగుచున్నది. ఈ పద్ధతియంతయు వేదాంతుల మతమనియు, ఈ మతమునందు జాగ్రత్స్వప్నసుషుప్తులనెడి మూడు అవస్థలును, సృష్టిస్థితిసంహారములనెడి మూడు కృత్యములు మాత్రమే గలవు. తాంత్రికుల విషయములోనయితే, జాగ్రత్స్వప్నసుషుప్తావస్థలతోబాటు తురీయము, తురీయాతీతము అను రెండు అవస్థలును, సృష్టిస్థితిలయలతోబాటు తిరోధానము, అనుగ్రహము అను రెండు కృత్యములును అధికముగా అంగీకరించబడినవి. గాన తాంత్రికుల విషయములో అయిదు అవస్థలు, అయిదు కృత్యములు చెప్పబడినవి. ఈ అయిదు అవస్థలను పొందిన జీవులు అయిదు విధములు. అలాగే పరమాత్మయు అయిదు విధములు. అలగే కృత్యములనుజేయు జీవులు కూడా అయిదు విధములు, పరమాత్మయు అయిదు విధములుగా గ్రహింపబడుటచే ఉపనిషణ్మతమునకును, తాంత్రిక మతమునకును భేదముగలదని మాత్రము భావింపకూడదు.
విశ్వరూప అనగా పదహారవ కళాస్వరూపురాలు అయిన త్రిపుర సుందరిగా చెప్పుట గలదు. శ్రీమాత షోడశకళారూపురాలని వాసన సుభగోదయమందు గలదు. దర్శ (అమావాస్య) నుండి పూర్ణిమ వరకు పదునైదు కళలు కాగా, పదహారవ కళ సచ్చిదానందరూపిణి అయిన పరమేశ్వరి. చంద్రమండలమునందు వృద్ధి క్షయములు లేకుండ సదా అను కళ గలదు. ఆ సదా కళాస్వరూపురాలైన శ్రీమాతకు చిద్రూపయను కళగూడ కలదు. ఆ చిద్రూపకళనే త్రిపురసుందరి అనియందురు. మిగిని పదునైదు కళలు తిథులు క్రమంలో కామేశ్వరి మొదలు కొని చిత్ర వ…
[05:31, 02/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
832వ నామ మంత్రము 02.03.2021
ఓం ప్రాణదాత్ర్యై నమః
జీవులకు ప్రాణములను ఇచ్చి జీవింపజేయు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రాణదాత్రీ యను నాలుగు అక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ప్రాణదాత్ర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు సాధకులకు ఆ జగన్మాత అకాలమృత్యువులనుండి, ఆకస్మిక ప్రమాదములనుండి కాపాడును. ఆయురారోగ్యములు ప్రసాదించును. భౌతిక జీవనమునందు శాంతిసౌఖ్యములు ప్రసాదించి అనంతమైన బ్రహ్మజ్ఞాన సాధన దిశగా అడుగులు వేయించును.
జీవుల శరీరంలో ప్రాణములుంటేనే ఇంద్రియవ్యాపారం కొనసాగుతుంది. ఇంద్రియముల కదలికలు గోచరమవుతాయి. దేహంలోని ప్రాణం చూడడానికి గోచరించదు. ప్రాణం యొక్క ఉనికి ఇంద్రియముల కదలికననుసరించియే తెలియుచుండును. గనుక ప్రాణము అంటే ఇంద్రియములు అని కూడా ఇచ్చట చెప్పుకొనవచ్చును. ప్రాణములుఅనగా పంచ ప్రాణములు, ఇంకను పంచ ఉప ప్రాణములను జగన్మాత జీవులకు ఇచ్చును. అలాగే జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, మనసు (వెరసి పదకొండు ఇంద్రియములను) కూడా ఇచ్చును. శరీరం పుట్టిన తరువాత పదకొండు ఇంద్రియములు ఉంటాయి. మరి అవి అమ్మవారు ఇవ్వడమేమిటి? అనే ప్రశ్న ఉత్పన్నము కవచ్చును. ఇంద్రియములకు ఆయా పనితనములను ప్రసాదించునని భావించదగును. జీవుని పాత్ర తీరిపోగానే ప్రధాన ప్రాణము పయనమై పోవును. ఆ వెంట మిగిలిన ప్రాణములు కూడా తరలిపోవును. ప్రాణములు శరీరమును విడచిన వెంటనే ఇంద్రియములు కూడా చచ్చుబడిపోవును. అప్పుడు ఆ దేహాన్ని శవము అన్నారు. ఒక్క ప్రధాన ప్రాణమును అమ్మవారు జీవునికి పోయగానే మొత్తము ప్రాణములు, ఇంద్రియముల కార్యనిర్వాహకత్వము కూడా శరీరంలో స్థాపింపబడి పంచభూతాత్మకమైన ఆ శరీరము కదలును. లోకములో తనకున్న పాత్రనిర్వహణను కొనసాగించును. అందు చేతనే ప్రాణుల చేతనావస్థకు వలసిన ప్రాణమును అమ్మవారు ప్రసాదించును గనుక ఆ తల్లి ప్రాణదాత్రీ యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రాణదాత్ర్యై నమః అని యనవలెను.
[05:31, 02/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
257వ నామ మంత్రము 02.03.2021
ఓం జాగరిణ్యై నమః
జాగ్రదావస్థను పొందిన జీవాభిన్నస్వరూపురాలు అయిన పరాత్పరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి జాగరిణీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం జాగరిణ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో పూజించు భక్తులకు, ఆ తల్లి కరుణచే అనంతమైన సుఖసంతోషములు, ఆయురారోగ్యములు సంప్రాప్తమగుటయేగాక, శాశ్వతమైన పరమానందమును పొందు ధ్యాననిమగ్నత సంప్రాప్తమగును.
మనిషి జీవితంలో అనుభవించేవి మూడు అవస్థలు. అవి 1.జాగ్రదావస్థ, 2. స్వప్నావస్థ, 3.సుషుప్తావస్థ. వీటినే అవస్థత్రయమని అందురు.
స్థూలదేహమునకు సంబంధించినవే అనగా బుద్ధిపరమైనవే గాని, ఆత్మకు సంబంధించినవి కావని విజ్ఞులు చెబుతారు. చీకటిలో నేలపై పడి ఉన్న తాడును చూసి పాము అనుకొని భయపడటం సహజం. వెలుతురులో చూసినప్పుడు- అది పాము కాదని, తాడు అని నిర్ధారించుకోవడమూ సహజమే. పాము కాని తాడు పాములా ఎలా కనపడిందో, అలాగే ఆత్మలో లేని మూడు అవస్థలు ఆత్మలో ఉన్నట్లు అనిపిస్తాయి. వెలుతురు వంటి జ్ఞానంతో చూసినప్పుడు- ఆ మూడు అవస్థలూ బుద్ధికి సంబంధించినవే గాని, ఆత్మకు చెందినవి కావని తేలుతుంది.
జాగ్రదావస్థ మేల్కొని ఉండుటనే జాగ్రదావస్ఠ అందురు.
జాగ్రదవస్థలో అంటే మేలుకొని ఉన్న వేళలో తన చుట్టూ ఉన్న వాటిని, పదార్థాలను తెలుసుకోవటానికి సూర్యుడు, దీపం, ఇంద్రియాలు, బుద్ధి తోడ్పడతాయి. అవి లేకుంటే మనిషి ఏ పదార్థాన్నీ చూడలేడు. తెలుసుకోలేడు. దీనినే ప్రబోధాత్మకమైన సర్వేంద్రియ జ్ఞానముగల విశ్వుడు అనే జీవుని అవస్థ (జాగరము). ఇటువంటి అవస్థలో పరమేశ్వరి ఉంటుంది. స్థూలశరీరాభిమాని అయిన శ్రీమాత విశ్వుని రూపంలో ఉంటుంది.
గృహస్థుడు అనగా గృహమునందు ఉండువాడు. స్థూలదేహానికి ప్రతినిధి వైశ్వానరుడు. ఆత్మ చైతన్యము జీవుల స్థూలభూతములతో కలిసినప్పుడు విశ్వుడు అని చెప్పబడును. అదే ఆత్మచైతన్యము సూక్ష్మభూతములతో కలిసినప్పుడు తైజసుడు అని చెప్పబడును. ఆత్మచైతన్యము కారణోపాధితో కూడినప్ఫుడు ప్రాజ్ఞుడు అని చెపుతారు. ఈ విషయము 256వ నామ మంత్రములో చెప్పుకోవడం జరిగినది. కాబట్టి బాహ్యముగా నుండి, అన్ని ఇంద్రియములకు గోచరించునది సర్వసాధారణమై, అందరికిని బయట ఇష్టమయిన సృష్టిని కలుగజేసెడి అవస్థ అయిన జాగ్రదావస్థలో ఉండు జీవస్వరూపురాలైన జగన్మాత జాగరిణీ యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం జాగరిణ్యై నమః అని అనవలెను.
[05:45, 07/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
837వ నామ మంత్రము 07.03.2021
ఓం వియత్ప్రసవే నమః
ఆకాశమును పుట్టించిన లేక ప్రసవించిన శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి వియత్ప్రసూః అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం వియత్ప్రసవే నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిప్రపత్తులతో సేవించు భక్తులకు ఆ జగన్మాత ఆయురారోగ్యములు, సిరిసంపదలు, పాడిపంటలు, శాంతిసౌఖ్యములు ప్రసాదించి సర్వదా ఆపదలనుండి రక్షించుచూ ఉండును.
వియతః ఆకాశస్య ప్రసూఃజనికా
ఆత్మన ఆకాశః సంభూతః (సౌభాగ్యభాస్కరం, 943వ పుట)
'పరమాత్మనుండి ఆకాశము సంభవించినది' అని వేదమునందు చెప్పబడినది.
సృష్టికి ముందునుంచి ఉన్నది ఆకాశము. అలాగే ఆత్మనుండే అన్నీ సంభవించాయి అని వేదములు అన్నవి. ఆత్మనుండి అన్నీ అంటే ఆకాశం కూడా వేదమునుండి సంభవించినదే.
పరమాత్మయే మూలప్రకృతి. అనగా సృష్టికి ఆది పరమాత్మ. అట్టి మూలప్రకృతి నుండియే మహత్తత్త్వము, అహంకారము పంచభూతాలు ఉద్భవించాయి. అందులో ఆకాశంకూడా ఉన్నది. గనుక పరమేశ్వరి వియత్ప్రసూః అని యనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం వియత్ప్రసవే నమః అని యనవలెను.
[05:45, 07/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
262వ నామ మంత్రము 07.03.2021
ఓం తుర్యాయై నమః
జీవులకు ఉన్న జాగ్రత్-స్వప్న-సుషుప్తి అవస్థలను మించిన తుర్యావస్థలో విలసిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి తుర్యా యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం తుర్యాయై నమః అని భక్తిశ్రద్ధలతో ఆ తల్లిని అంతర్ముఖంగా స్మరించు భక్తులను ఆ జగదీశ్వరి పరిపూర్ణమైన ఆయురారోగ్యములతో విలసిల్లునట్లును, నిరంతర భగవధ్యానాభిలాషులగునట్లును అనుగ్రహించును.
జగన్మాత తుర్యావస్థాస్వరూపురాలు అని స్మరించబడినది. మనసు, బుద్ధి అనగా అంతఃకరణములు నేత్రకంఠహృదయములందు ఉన్నప్పుడు జాగ్రత, స్వప్న, సుషుప్తులు అను మూడు అవస్థలు కలుగును. ఆ స్థితులలో జీవుడు విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అని పిలువబడడం జరుగుతుంది. మనసు, బుద్ధి అను అతఃకరణము సాధనలో సహస్రారము చేరితే లభించునదే తురీయావస్థ. అప్పుడు కలిగేదే శుద్ధమైన జ్ఞానము. ఈ స్థితికి వచ్చు సాధననే శుద్ధవిద్యయని అందురు. జాగ్రత్స్వప్నసుషుప్తులలోని కర్మలను, వాటి ఫలములను అనుభవించు విధానము తెలిసికొని శుద్ధజ్ఞానస్వరూపమునందిన సాధకుడు మరల ఇంకొకసారి ఆ కర్మలఫలములను పొందడు. దీనినే తురీయావస్థ యని అందురు. యోగ సాధనలో మనసు, బుద్ధి కళ్ళలోనే ఉంటే భౌతిక ప్రపంచంలో ఉన్నట్లే. అదే జాగ్రదావస్థ. బుద్ధి, ఇంద్రియములు విశ్రాంతినందుచూ, మనసు ఇంద్రియవ్యాపారమును చేపడితే అది స్వప్నావస్థ అవుతుంది. మనసు, బుద్ధి హృదయాన్నిచేరితే సుషుప్తావస్థ ఇవి అన్నియు యోగసాధనలో దశలు. చివరకు సాధనఫలితంగా మనసు,బుద్ధి సహస్రారాన్ని చేరితే ఆ అవస్థయే తురీయావస్థ సాధనలో లభించు తురీయావస్థ అత్యంత శ్రేష్ఠమయినది. ఇది యోగసాధకులకు మాత్రమే లభించును. లేదా కారణజన్ములయిన శంకరభగవత్పాదుల వారికి లభించినట్టిది తురీయావస్థ. ఈ తురీయావస్థ జీవుని ఈశ్వరతుల్యము జేయును. ఈ అవస్థలో కర్మలు ఉండవు. ఈ అవస్థలో భోగము చమత్కారరూపములో ఉండును. ఆ భోగమును కేవలానందము అనియందురు. తురీయావస్థనందినవారు తురీయజ్ఞానముతోనే జాగ్రదాదులయందు కూడా ఉందురు. జాగ్రత్స్వప్నసుషుప్తావస్థలయందలి భోగములన్నియును తురీయావస్థాభోగముతో తడిసి తరించును. తురీయావస్థనందినవారు జ్ఞానదృష్టితో ఉందురు. తురీయావస్థను పొందిన జీవుని తుర్యుడు అని వ్యవహరింతురు. ఇతడు మహాకారణ శరీరాభిమానియై ఉండును. యోగ సాధనలో ప్రాణాయామాదికమునుజేసి మనస్సును స్వాధీనము చేసికొందురు. అప్పుడుకూడ మనస్సు వికల్పమును పొందుచుండును. అనగా చంచలమై యుండును. గనుక ఈ చంచలాత్మకమైన స్థూలోపాయముతో గాక, ఆత్మజ్ఞానముతో భగవత్తత్త్వమునందు ప్రవేశించవలయును. జ్ఞానమార్గములో మనస్సునకు చంచలత్వము కలుగదు. అది ఎలాగంటే మనస్సును అంతర్ముఖముచేసి, ఈశ్వరత్వములేని తత్త్వములన్నిటిని నిషేధించి ఈశ్వరత్వమునందు ప్రవేశించవలయును. తురీయమనునది ఒకశక్తిగా అభివర్ణించారు. ఈ రకంగా జగన్మాత జాగ్రత్స్వప్నసుషుప్తావస్థలకు సాక్షీభుతురాలు యగుటచేతను, అంతటి శక్తిగలిగినది గనుకను తుర్యా యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం తుర్యాయై నమః అని యనవలెను.
[07:25, 08/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
263వ నామ మంత్రము 08.03.2021
ఓం సర్వావస్థా వివర్జితాయై నమః
సాధకుడు తుర్యావస్థను పొండిన తరువాత, ఈ తుర్యావస్థనుగూడా అధిగమించి పరమపదాన్ని పొందుతాడు. దీనినే తుర్యాతీతస్థితి యని అందురు. పంచమావస్థ యని కూడా అందురు. ఈ స్థితులన్నిటినీ అధిగమించిన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వావస్థా వివర్జితా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సర్వావస్థా వివర్జితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులకు అనంతమైన ఆధ్యాత్మికజ్ఞానము, భౌతికజీవనమునకు వలయు సుఖశాంతులు, పునర్జన్మరాహిత్యమైన మోక్షసంపద సంప్రాప్తమగును.
జీవునకు గల జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి మరియు నాలుగవది తురీయావస్థ అను నాలుగు అవస్థలు గలవు. ఈ నాలుగు మాత్రమేగాక అయిదవది కూడా ఉన్నది. దానీనే తురీయాతీత అని యందురు. ఈ తురీయాతీతమైన స్థితినే సర్వావస్థా యని చెప్పడం జరిగినది. ఈ స్థితికి చేరిన పిదప మరల వెనుకకు మరలి వచ్చేది ఉండదు. బ్రహ్మస్థానమే పరాకాష్ఠ యగుతుంది. ఈ స్థితికి జేరిన సాధకుని తురీయాతీతుడు అని యందురు. ఈ అవస్థలో వ్యష్టిభేదముగాని, సమిష్టిభేదముగాని లేని స్వరూపముతో తేజరిల్లును. తురీయావస్థను దృఢసంకల్పముతో సాధన చేయునతనికే తురీయాతీతావస్థ లభించును. తురీయావస్థలో స్థిరత్వమువలన పరమపదమైన తురీయాతీతావస్థ లభ్యమగునని చెప్పబడినది. తుర్యావస్థాభ్యాసాధిక్యముచే తురీయాతీత పదమును పొందిన యోగి లేదా భక్తుడు సర్వప్రాణులకు అంతరాత్మస్వరూపుడని, సచ్చిదానందలక్షణములు గలవాడైన శివునితో సమానుడనికూడా అభివర్ణించబడినది. ఈపంచమదశ అయిన తురీయాతీతావస్థ పొందిన సాధకుని స్వరూపము ఎలా ఉంటుందో తెలియు సూత్రములు ఉన్నవి. అవి ఏమిటంటే 1) శరీరవృత్తియే వ్రతము, 2) కథయే జపము, 3) ఆత్మజ్ఞానమే దానము శివపూజ యగును అని చెప్పారు. దీనినే ఆత్మానుసంధానమే శివపూజ యగును అని వ్యాఖ్యానించారు. అందుచేతనే శివపూజను సాధించు శరీరధారణమే ఒక వ్రతము అని కూడా చెప్పుట జరిగినది. శరీరధారణమనగా లోపల ప్రకాశించుచున్న నిర్మలశక్తియొక్క అమృతముచే పోషింపబడు శరీరమే శివపూజను చేయుటకు వినియోగింపబడును అని చెప్పబడినది. తురీయాతీత శక్తి ఏ మాత్రము ద్వైతభావము లేనిది. తురీయాతీత స్థితిలో కాలభేదముండదు. ఎల్లప్పుడును ఆనందస్వరూపమే. తురీయాతీత స్థితికి చేరిన సాధకుడు జన్మరాహిత్యమైన ముక్తిని పొందినవాడు. ఇంకను చెప్పవలెనంటే జీవన్ముక్తుడు. దేహము ఉండును. ఇంద్రియములు పనిచేయుచుండును. కాని కర్మలుచేయడు. తురీయాతీతస్థితినిగలిగినది పరమేశ్వరి గనుకనే సర్వావస్థావివర్జితా యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వావస్థా వివర్జితాయై నమః అని యనవలెను.
Comments
Post a Comment