Posts

Showing posts from March, 2023
.(కొనసాగింపు) (జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల వాదోపవాదనలు) చితిమత్త్వాచ్చేతనోఽ య మిచ్ఛాద్వేషప్రయత్నవాన్ ౹ స్వాద్ధర్మాధర్మయోః కర్తా భోక్తా దుఃఖాదమత్త్వతః ౹౹91౹౹ 91. చైతన్యమను గుణముండుట చేత ఆత్మ చేతనము.ఆ చైతన్యము ఇచ్ఛాద్వేష ప్రయత్నములుగా అభివ్యక్తమగును. ధర్మాధర్మములకు ఆత్మ కర్త అగును.అత్ఫలితముగ సుఖదుఃఖములకు భోక్తయగును. యథాఽ త్ర కర్మవశతః కదాచిత్కం సుఖాదికమ్ ౹ తథాలోకాన్తరే దేహే కర్మణేచ్ఛాది జన్యతే ౹౹92౹౹ 92. కర్మవశమున ఈ జన్మమున సుఖాదికములు ఆగంతుకములైనట్లే మరొక లోకమున ఇతర దేహమునందు చేసిన కర్మఫలముగ ఇచ్ఛాదులను కలుగును.(కనుక చైతన్యముతో సహా ఆత్మ యొక్క అన్ని గుణములను కదాచిత్కములే. అప్పుడప్పుడు వచ్చిపోవునవే) ఏవం చ సర్వగస్యాపి సంభవేతాం గమాగమౌ ౹ కర్మకాండః సమగ్రోఽ త్ర ప్రమాణమితి తేఽ వదన్ ౹౹93౹౹ 93. మరియు,సర్వవ్యాపియైనా ఆత్మ శరీరములలోనికి వచ్చుచు (జన్మ), పోవుచు(మరణము) ఉండును.వేదములోని కర్మకాండ అంతా తమ వాదమునే సమర్థించునని వారందురు. ఆనందమయకోశో యః సుషుప్తౌ పరిశిష్యతే ౹ అస్పష్టచిత్స ఆత్మైషాం పూర్వకోశోఽ స్య తే గుణాః ౹౹94౹౹ 94. పంచకోశములలో మొదటిదగు ఆనందమయకోశము సుషుప్తి యందును ఉండును.అది చైతన్యమును అస్పష్ట...