.(కొనసాగింపు)

(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల వాదోపవాదనలు)

చితిమత్త్వాచ్చేతనోఽ య మిచ్ఛాద్వేషప్రయత్నవాన్ ౹

స్వాద్ధర్మాధర్మయోః కర్తా భోక్తా దుఃఖాదమత్త్వతః ౹౹91౹౹

91. చైతన్యమను గుణముండుట చేత ఆత్మ చేతనము.ఆ చైతన్యము ఇచ్ఛాద్వేష ప్రయత్నములుగా అభివ్యక్తమగును.

ధర్మాధర్మములకు ఆత్మ కర్త అగును.అత్ఫలితముగ సుఖదుఃఖములకు భోక్తయగును.

యథాఽ త్ర కర్మవశతః కదాచిత్కం సుఖాదికమ్ ౹

తథాలోకాన్తరే దేహే కర్మణేచ్ఛాది జన్యతే ౹౹92౹౹

92. కర్మవశమున ఈ జన్మమున సుఖాదికములు ఆగంతుకములైనట్లే మరొక లోకమున ఇతర దేహమునందు చేసిన కర్మఫలముగ ఇచ్ఛాదులను కలుగును.(కనుక చైతన్యముతో సహా ఆత్మ యొక్క అన్ని గుణములను కదాచిత్కములే. అప్పుడప్పుడు వచ్చిపోవునవే)

ఏవం చ సర్వగస్యాపి సంభవేతాం గమాగమౌ ౹

కర్మకాండః సమగ్రోఽ త్ర ప్రమాణమితి తేఽ వదన్ ౹౹93౹౹

93. మరియు,సర్వవ్యాపియైనా ఆత్మ శరీరములలోనికి వచ్చుచు (జన్మ), పోవుచు(మరణము) ఉండును.వేదములోని కర్మకాండ అంతా తమ వాదమునే సమర్థించునని వారందురు.

ఆనందమయకోశో యః సుషుప్తౌ పరిశిష్యతే ౹

అస్పష్టచిత్స ఆత్మైషాం పూర్వకోశోఽ స్య తే గుణాః ౹౹94౹౹

94. పంచకోశములలో మొదటిదగు ఆనందమయకోశము సుషుప్తి యందును ఉండును.అది చైతన్యమును అస్పష్టముగ మాత్రమే ప్రకటించును.ఆ ఆనందమయకోశమే ఆత్మయని ప్రాభాకరులు,తార్కికులు భావింతురు.ఆత్మ యొక్క గుణములని వీరు చెప్పునవి ఈ ఆనందమయ కోశపు గుణములే.

వ్యాఖ్య: సుషుప్తిలో చైతన్యము లేక జాగ్రత్ స్వప్నములందు మాత్రమే ఉండినచో

“సుఖముగా నిద్రించితిని,నాకేమీ తెలియలేదు”అనే సుఖము,అజ్ఞానముల జ్ఞాపకము సంభవింపదు.వీనిని అనుభవించి మరల గుర్తు తెచ్చుకొను ఒక చైతన్యసత్త ఉండే తీరవలెను.

శ్రుతి కూడా ఆత్మ నిర్గుణమని వర్ణించును.

ఇచ్ఛాద్వేషాదు మనోధర్మములని బృహదారణ్యక ఉప.1.5.3 చెప్పును.దానికి తగినట్లు మనస్సు పనిచేయు జాగ్రత్ స్వప్నములందు మాత్రమే ఇచ్ఛాదులు కన్పించును కదా !

తార్కికులనునట్లు అసంఖ్యాకులగు పురుషులందరు సర్వవ్యాపులైనచో అందరును అన్ని శరీరములు కర్మలతో సంబంధపడుటచే ఏది ఎవరికి చెందునో అనే నిర్ణయము కష్టమగును.ఇతర కారణములచే కూడా ఆత్మను గూర్చి ప్రాభాకరుల,తార్కికుల వాదము అసమంజసము.ఆత్మయని వారు భ్రమపడునది ఆనందమయకోశము మాత్రమే.

ధర్మధర్మ సుఖదుఃఖాదులు బుద్ధి ధర్మాలు.నిజానికి బుద్ధి జడము. దానికి సుఖదుఃఖాది జ్ఞాన రూపధర్మములు కుదరవు.

ఆత్మ నిర్ధర్మకం గనుక వాటిని బుద్ధిధర్మాలని చెప్పవలసి వచ్చినది.

బుద్ధి,సుఖదుఃఖాలు ఇవన్నీ ఆత్మయందారోపితములు.కనుక వాస్తవముగా లేనివి.రజ్జువునందు సర్పము లేదు గదా! అలాగే ఆరోపిత వస్తువునందు మరో వస్తువు ఉండదు.

శుద్ధ చైతన్యం మీద అజ్ఞానము ఆరోపితము.ఈ ఆజ్ఞానోపహిత శుద్ధ చైతన్యము మీద అంతఃకరణము ఆరోపితం. అంతఃకరణోపహిత చైతన్యమునందు ధర్మా ధర్మ సుఖదుఃఖాదులు ఆరోపితములు. ఈ విధముగా ఆత్మయందు సుఖదుఃఖాదులను ఆరోపించుటకు ఉపాధి అయిన అంతఃకరణము కారణము కనుక సుఖదుఃఖాదులు దాని ధర్మములని చెప్పారు.

ఉపాధి=తటస్థము.వస్తువు తనతో ఉన్నా అది దానికన్నా భిన్నంగా ఉండును.

విశేషణం=తటస్థం కాదు. వస్తువును తనతో కలిపియే చూపును.

“ఉపాధి-ఉపహితం;

విశేషణం-విశిష్టం”

“అంతఃకరణాధిష్ఠాన” చైతన్యమందే అధిష్ఠాన లక్షణం ఉంది.ఈ అంతఃకరణం అజ్ఞానోపహిత చైతన్యం మీద ఉన్నది.విశిష్ఠం మీద కాదు.కాగా

ఆత్మ-అధిష్ఠానము;ధర్మము దాని మీద ఆరో పితము.

ఉపాధి-అంతఃకరణము.

కనుక ధర్మాదికము,బుద్ధి ధర్మముల మధ్య తేడా తెలియకపోవడం వలన మరియు అంతఃకరణము ఆత్మ అనే రెండింటియందు కనబడుతున్నది.

అందుచే అంతఃకరణ విశిష్టుడయిన ప్రమాత యొక్క ధర్మాలుగా ఇవి ప్రసిద్ధం.

“ఆత్మధర్మ”ములు మాత్రము కావు. ఆరోపిత పదార్ధాలు ఎప్పటికి అధిష్ఠాన ధర్మాలు కావు.కనుక “ఆత్మ” “నిర్ధర్మకం”.

గూఢం చైతన్యముత్ర్పేక్ష్య జడబోధ స్వరూపతామ్ ౹

ఆత్మనో బ్రువతే భాట్టాశ్చదుత్ర్పేక్షోత్థిత స్మృతేః౹౹95౹౹

95. భాట్ట మీమాంసకులు ఆత్మయందు చైతన్యము గూఢమై ఉన్నదనీ స్వరూపమున అది చేతనము,అచేతనము కూడా అనీ అందురు. మేలుకొనిన పురుషుడు తన గాఢనిద్రను స్మరగూఢం చైతన్యముత్ర్పేక్ష్య జడబోధ స్వరూపతామ్ ౹

ఆత్మనో బ్రువతే భాట్టాశ్చదుత్ర్పేక్షోత్థిత స్మృతేః౹౹95"...

(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల వాదోపవాదనలు)

గూఢం చైతన్యముత్ర్పేక్ష్య జడబోధ స్వరూపతామ్ ౹

ఆత్మనో బ్రువతే భాట్టాశ్చదుత్ర్పేక్షోత్థిత స్మృతేః౹౹95౹౹

95. భాట్ట మీమాంసకులు ఆత్మయందు చైతన్యము గూఢమై ఉన్నదనీ స్వరూపమున అది చేతనము,అచేతనము కూడా అనీ అందురు. మేలుకొనిన పురుషుడు తన గాఢనిద్రను స్మరించుటను బట్టి వీరిట్లు నిశ్చయింతురు.

జడో భూత్వా తదాఽ స్వాప్సమితి జాడ్యస్మృతిస్తదా ౹

వినా జాడ్యాను భూతిం న కథఞ్చిదుపద్యతే ౹౹96౹౹

96. “జడుని వలె నిద్రించితిని”అనే స్మరణ అట్టి జడత్వపు అనుభవము ఉండుట చేతనే సంభవము.కాని ఒక చైతన్యాంశము లేనిదే ఇట్టి అచేతనా అనుభవపు స్మరణ సిద్ధింపదు.కనుక ఆత్మ చేతనము అచేతనము కూడా.

ద్రష్టుర్దృ ష్టేరలోపశ్చ శ్రుతః సుప్తౌ తతస్త్వయమ్ ౹

అప్రకాశ ప్రకాశాభ్యామాత్మా ఖద్యోతవద్యుతః ౹౹97౹౹

97. నిద్రయందు ద్రష్ట గాని దృష్టి గాని లోపింపవు.(బృహదారణ్యక ఉప.4.3.23)అనే శ్రుతివాక్యమును చూపుచు వారు మిణుగురు పురుగు వలె ఆత్మ ప్రకాశము అప్రకాశము కూడా అని చెప్పుదురు.

నిరంశ స్యోభయాత్మాత్వం న కథఞ్చిద్ఘటిష్యతే ౹

తేన చిద్రూప ఏవాత్మేత్యాహుః సాంఖ్యవివేకినః ౹౹98౹౹

98. నిరవయవమగు ఆత్మ రెండూ,చేతనము అచేతనము కూడా,అగుట ఏ విధముగనైనను సంభవింపదు.ఆత్మ చిద్రూపము మాత్రమే అని సాంఖ్యులు వాదింతురు.

వ్యాఖ్య: షడ్దర్శనములలో అయిదవదగు పూర్వ మీమాంసయందు రెండు సంప్రదాయములు గలవు.

ప్రభాకర సంప్రదాయము,

కుమారిల భట్టు సంప్రదాయము. వీరినే సంగ్రహముగ భాట్టులని వ్యవహరింతురు.

ఆరవదగు ఉత్తర మీమాంసయే వేదాంతము.

కొన్ని స్థితులయందు చైతన్యము ఆవృతమై ఉండునని భాట్టుల నిర్ణయము.

ఆత్మ విజ్ఞానఘనమని శ్రుతి వాక్యము.

అందు అచేెతనమునకు స్థానము లేదు.నిద్రయందలి జడత్వమును స్మరించుట, జడమగు విషయమును,మాయను,

అనుభవించుట చేత.

ఆత్మ యొక్క జడత్వమును అనుభవించి కాదు.

కనుక భాట్టుల వాదము సమీచీనము కాదు.

ఆదిత్యుని కిరణములు చంద్రుని యందు ప్రతిఫలించి వెన్నెల కాంతి ద్వారా రాత్రుల యందలి చీకటిని పోగొట్టును.ఆ కిరణములే గృహము నందలి కంచు పాత్రపై బడి గృహమును గూడా వెలుగుతో నింపును.

అలాగే ఆత్మ చైతన్యము బుద్ధియందు ప్రతిఫలించి తద్వారా ఇంద్రియములను,ఇంద్రియముల ద్వారా బాహ్య వస్తువులను ప్రకాశింపజేయుచున్నది.

కావున జగత్తునందలి సమస్త పదార్థములను చైతన్య స్వరూపమైన ఆత్మ ప్రకాశింప జేయుట వలన ఆత్మ చిద్రూపంబని చెప్పబడుచున్నది.

అట్లే ఆత్మయైన తాను జాగ్రత్స్వప్న సుషుప్తు లనెడు త్రివిధావస్థల నెరుగు చుండుటచే తానే చిద్రూపాత్మయై యున్నాడు. జాగ్రత్స్వప్నములలో తప్ప సుషుప్తియందు ఆత్మ దేనినీ గూడ తెలిసికొనదుగాన జడమని నిశ్చయించగూడదు.

సుషుప్తి యందు ఏ వస్తువును గూడా తెలిసికొనలేదు అని తెలుపు జ్ఞానమైనను అచ్చట ఉన్నది కదా!

లేనిచో సుషుప్తి యందు ఏమియు తెలియలేదు అని తెలిసికొనిన

దెవరు?

వెలుగు చున్న దీపమును ఆకాశము వైపు తిప్పినప్పుడు అచ్చట ప్రకాశింపజేయుటకు రెండవ వస్తువు లేనప్పటికిని దీపము తనంతట తాను ప్రకాశించుచునే యుండునట్లు, సుషుప్తి యందు తెలిసికొనుటకు రెండవ పదార్థము లేకున్నను తాను మాత్రము కేవల చైతన్య స్వరుపుడై యున్నాడు. సుషుప్తియందు ఆత్మయైన తాను ప్రకాశరూపుడై యుండుటచేత అప్రకాశమైన అజ్ఞానము(తెలియని తనం) లేనే లేదు.

జ్యోతి స్వరూపుడగుటచే సూర్యునికి అంధకారములేనియట్లు,నిత్య బోధ స్వరూపుడైన ఆత్మకు అజ్ఞానము సర్వదా లేదు.

కావున అవస్థలు ఉన్నప్పుడు ఉన్నవని,లేనప్పుడు లేవని తెలియుతాను చిద్రూపుడై యున్నాడు.

అట్లే బాల్య యౌవ్వన వార్థక్యములను ప్రాతర్మధ్యాహ్న సాయంకాలములను,పగలు రాత్రి సంధ్యాకాలములను,వార పక్ష మాస బుతు సంవత్సరయుగ మన్వంతర కల్పములను,ఇంతకు ముందు ఇప్పటి రాబోవు దేహాలను,భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఈ సర్వమును ఒకే రీతిలో ఎట్టి మార్పును లేక ఆత్మ అయిన తాను తెలియు చుండుట వలన చిద్రూపుడై యున్నాడు.

కావున శ్రుతియందు

“ప్రజ్ఞానం బ్రహ్మ”

(ఐతరేయ-ఉప-3-3)మని చెప్పంబడినది.

జాడ్యాంశః ప్రకృతే రూపం వికారి త్రిగుణం చ తత్ ౹

చితో భోగాపవర్గార్థం ప్రకృతిః సా ప్రవర్తతే ౹౹99౹౹

99. జడత్వము ప్రకృతి స్వభావము.అది పరిణామ శీలము,త్రిగుణాత్మకము.

చిద్రూపుడగు పురుషుని భోగము (అనుభవము)అపవర్గము

(మోక్షము)కొరకు ప్రకృతి పనిచేయును.

అసంగాయాశ్చితేర్బంధమోక్షౌ భేదాగ్రహాన్మతౌ ౹

బంధముక్తి వ్యవస్థార్థం పూర్వేషామివ చిద్భిదా ౹౹100౹౹

100. పురుషుడు సంగరహితుడు పరిశుద్ధుడు అయినను ప్రకృతి పురుషుల భేద జ్ఞానము లేక, ప్రకృతియే తానని భ్రమపడి, పురుషుడు బంధమునకు లోనగుచున్నాడు.ఆ బేధజ్ఞానము కలిగినంతనే మోక్షము లభించును. ఈ బంధమోక్షముల వ్యవస్థ కొరకు నైయాయికులు మొదలగు వారివలనే సాంఖ్యులు అసంఖ్యాక పురుషులను ప్రతిపాదింతురు...

.

భగవద్గీత.. #జగద్గురుశంకర_భాష్యానుసారం..

కర్మణ్యకర్మ యః పశ్యే దకర్మణి చ కర్మ యః |

స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్న-కర్మ-కృత్ ||

తా: ఆత్మ, నిశ్చలము, నిష్క్రియము, కూటస్థము, నిర్వికారము అని శ్రుతి స్మృతి న్యాయములచే నిరూపింపబడినది. నిరూపింప బడబోవుచున్నది గూడ. కర్మరహితమైన ఆత్మయందు కర్మ యున్నట్లుగా విపరీత దర్శనము లోకమున అత్యంతరూఢమైనది.

అందుచే కర్మ యన నేమి? అకర్మ యన నేమి? అను విషయమై మేధావులు సైతము వ్యామోహితు లగుచున్నారు. దేహేంద్రియాదులకు సంబంధించిన కర్మను ఆత్మయందు ఆరోపించి “అహం కర్తా" నేను కర్తను "మమ ఏతత్ కర్మ" ఈ వ్యాపారము నాదే “మయా అస్య ఫలమ్ భక్తవ్యమ్ ఇతిచ.” నాచే ఈ ఫలమనుభవింప బడవలెను- అనియు “అహం తూష్ణీమ్ భవామి. యేన అహమ్ నిరాయాసః అకర్మా సుఖీ స్యామ్” నేను ఏ వ్యాపారము చేయక యూరక యుందును అందుచే నా కెట్టి ఆయాసము లేదు. సుఖముగా నుందును. అని దేహేంద్రియాదుల యొక్క వ్యాపారము లన్నియు మాని దానివలన గలుగు సుఖిత్వమును ఆత్మయం దారోపించి నే నేమియు చేయను; ఊరకయే సుఖముగా నున్నాను అని లోకము తలచుచుండును. ఇట్లు దేహేంద్రియాది

వ్యాపారములను ఆత్మయం దారోపించి దర్శించుట విపరీత దర్శనము. దానిని పరిహరించుటకై భగవానుడు " కర్మణ్యకర్మ యః పశ్యేత్" అని చెప్పవలసి వచ్చెను.

లోక వ్యవహరమునకు కారణభూతములైనవి కర్మలు. ఈ కర్మలకు సాధనములు దేహేంద్రియాదులు. లోకమున నీ కర్మను యధార్థమైనది గానే గ్రహించుచున్నారు. చదువుకొనిన పండితులు సైతము "అహం కరోమి” నేను చేయుచున్నాను అనియే తలచి వ్యవహరించుచున్నారు. వస్తుతః ఈ కర్మలను నిర్వహించుచున్నది దేహేంద్రియాదులైనను, తానే చేయుచున్నట్లే కర్మలను తనయందు -ఆత్మయందారోపించుకొనుచున్నారు. (ఆత్మసమవేతతయా).నదీతీరమున గల వృక్షాదులకు వస్తుతః చలనము లేదు. అవి కర్మలు కర్మ రహితములు. ఐనను వానియందు చలన మున్నట్లు ఆరోపించి వృక్షలతాదులు ప్రతికూలముగా పోవుచున్నవి అని వ్యవహరించినట్లే వస్తుతః అకర్మ యైన ఆత్మయందు దేహేంద్రియాదుల కర్మల నారోపించుచున్నారు. వృక్షలతాదు లందు కన్పడు గమనము వస్తుతః ‘అకర్మ' యైనట్లే, ఆత్మయం దారోపితమైన కర్మకూడ అకర్మయే. అట్లే నేనేమియు చేయుట లేదు, దేహేంద్రియాదుల వ్యాపారముల నరికట్టి నివర్తింపజేసితిని యని యహంభావ పూర్వకముగా జేయబడు నివృత్తికర్మ అకర్మగా లోకము వ్యవహరించుచున్నది. ఇది భ్రాంతి మూలకము. అహంకార పూర్వకముగా చేయబడు నివృత్తి కర్మయు కర్మయే. అహంకారాభి సంధి పూర్వకములైన కర్మ లన్నియు కర్మలే. ఈ విధముగా వాస్తవిక దృష్టితో కర్మయందు అకర్మభావమును, నివృత్తిరూప అకర్మయందు కర్మభావమును సరియైన వివేచన చేసి తెలిసికొనిన యతడు బుద్ధిమంతుడైన పండితుడు ; అతడే యోగి ; కృతకృత్యుడు, ఆత్మ స్వరూపము నెఱిగిన జ్ఞానియే యగుటచే అవిద్యాదోషము నుండి విముక్తుడై ముక్తుడగును...

****.

(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల వాదోపవాదనలు)
ప్రధాన క్షేత్రజ్ఞ పతిర్గుణేశ ఇతి హి శ్రుతిః ౹
అరణ్యకేఽ సంభ్రమేణ హ్యంతర్యామ్యుపపాదితః ౹౹103౹౹
103. ఈశ్వరుడు జీవులకు ప్రకృతికి ప్రభువనీ గుణములను కూడా నియమించుననీ శ్రుతి ప్రకటించును.అరణ్యకమున ఈశ్వరుడు అంతర్యామి అని వర్ణింపబడెను.
వ్యాఖ్య :శ్వేతాశ్వర ఉప.6.14;
బృహదారణ్యక ఉప.3.7;
కఠ ఉప.2.33.సాంఖ్యుల మతమున పురుష సాన్నిధ్య మాత్రమున ప్రకృతి పరిణామము నొందును.యోగులమతమున ఈశ్వరుడు ప్రకృతిని నియమించును.
శుద్ధ బ్రహ్మము అసంగము, అక్రియము.అది సృష్టి చేయదు అది చతుష్పాత్తు అనగా పరిపూర్ణము.అందువలన మాయా విశిష్టుడయిన ఈశ్వరుడు అవసరం.ఆయనయే జగత్కర్త.
మాయ:ఇది శుద్ధ చైతన్యము నాశ్రయించిన పాదమాత్ర ప్రమాణమయినది.
శుద్ధ చైతన్యమనగా జీవ-ఈశ్వర భేదం లేనిది.మాయ-అనాది.
దీని ప్రభావము వలననే
జీవ-ఈశ్వర భేదం సిద్ధించింది.కనుక వారినుండి మాయ పుట్టలేదు.
మిగిలినది శుద్ధ చైతన్యము.అది నిర్వికారము.దాని వలన మాయ పుట్టిందనరాదు.అంటే అది కర్తృత్వం మొదలయిన గుణాల వలన సవికారం అవుతుంది.పైగా మోక్ష సమయంలోనూ మాయ ఉన్నట్లు అవుతుంది.శుద్ధ చైతన్యం గదా మన స్వరూపము.అపుడు గూడా మాయ ఉన్నదంటే మోక్షము వ్యర్థమవుతుంది.కనుక మాయ అనాది.
నిర్వికార శుద్ధ బ్రహ్మమునుండి జగదుత్పత్తి అగుటలేదు.ఏలనగా శుద్ధ బ్రహ్మము అసంగముగను క్రియారహితముగను యున్నది.ఈ అనాది శుద్ధ బ్రహ్మములో అనాది కల్పిత మాయ ఉంది.
ఈ మాయకు బ్రహ్మముతో అనాది కల్పిత సంబంధం ఉన్నది. కేవలము ఈ కల్పిత మాయనుండియు జగదుత్పత్తి జరగదు.కాన బ్రహ్మము మాయ ఈ రెండింటి కల్పిత సంబంధముచే శుద్ధబ్రహ్మము,సర్వజ్ఞుడు మరియు ఈశ్వరుడుగా పిలవబడుచున్నాడు.
ఈ మాయావిశిష్టుడైన ఈశ్వరుని యొద్దనుండి జగదుత్పత్తియగు చున్నది.కాన మాయ -ఈశ్వరుడు-భోక్తయైన జీవుడు-సృష్టి విధానము వీని స్వరూపములను ప్రతిపాదించడం జరుగుచున్నది.
అత్రాపి కలహాయన్తే వాదినః స్వస్వయుక్తిభిః ౹
వాఖ్యాన్యపి యథాప్రజ్ఞం దార్ఢ్యాయోదాహరన్తి హి ౹౹104౹౹
104. ఈశ్వరుని విషయమున కూడా వివిధ తాత్త్వికులు తమ తమ తర్కములచే వివిధ వాదములతో కలహింతురు.తమ తమ ప్రతిభకు తగినట్లు శ్రుతి వాక్యములను కూడా దార్ఢ్యార్థము ఉటంకింతురు.
క్లేశకర్మవిపాకైస్తదాశయై రప్యసంయుతః ౹
పుంవిశేషో భవేదీశో జీవవత్సోఽ ప్యసంగచిత్ ౹౹105౹౹
105. యోగసూత్రకారుడైన పతంజలి మతమున ఈశ్వరుడు క్లేశకర్మ విపాక ఆశయములు స్పర్శింపని ఒక విశిష్ట పురుషుడు. పురుషుల వలనే ఈశ్వరుడు అసంగుడు చిద్రూపుడు.
వ్యాఖ్య: యోగసూత్రముల సమాధి పాదము సూ.24.
అవిద్యా,అస్మితా,రాగద్వేషములు, అభినివేశము అనునవి అయిదు క్లేశములు.
శుక్లము,కృష్ణము,శుక్లకృష్ణము అని కర్మ మూడు విధములు (పుణ్య,పాప,పుణ్యపాపమిశ్రమ కర్మ)
జాతి,ఆయువు,భోగము అనునవి మూడు విపాకములు.
ఆశయమనగా సంస్కారములు.
సాంఖ్యులకు యోగులకును పురుషుడు భోక్త మాత్రమే కర్తకాడు.కర్తృత్వము సుఖదుఃఖములు ప్రకృతి వికారమగు బుద్ధి లక్షణములు.
బుద్ధితో తాదాత్మ్యము వలన పురుషుడు తానే కర్తయని భ్రమించును.సమాధి ద్వారా తన భిన్నత్వమును తెలిసికొని మోక్షము నొందును.
పురుషుడు(ఆత్మ) స్వాభావికంగా
అసంగుడు.అసంగ వస్తువనగా ఏదైతే దేనియందుగూడి యున్నప్పటికీ తన అసంగత్వమును వీడదో అది అసంగవస్తు వనబడును.
స్వస్వరూపమైన ఆత్మ,
కల్పిత వస్తువులయిన అహంకారం మొదులుకొని స్థూలదేహ పర్యంతము కల్పిత అభిమానంబుతో
“నేను నేను”అని,ఉన్నప్పటికి తన అసంగత్వమును వీడలేదు.
కాన సంగత్వము మాయికమని తెలియ వలయును.
ఆత్మకు సంగత్వము సత్యమే అగుచో మోక్షము వచ్చుటకే వీలు లేదు.కాన సంగత్వము అసత్యమైనందుననే “తత్త్వమసి” ఇత్యాదిశ్రుతులు నీవే బ్రహ్మమని తేల్చుచున్నవి...
.
మనకు బ్రహ్మానుభవం  కలగజేసేదే ఈ విచారణ.
స్వామి విద్యారణ్య పంచదశిలోని పదవ అధ్యాయంలో వివరిస్తారు ఒక నాటకం జరిగి, అందులో వేసిన పాత్రధారులు లోపలికి వెళ్ళిపోయాక ఎవరైనా స్టేజీ మీద ఏం ఉందంటే, ఏమీ లేదు లేదా ఎవరూ లేరు అనేస్తాము,కాని నిజానికి అక్కడ ఒకటి ఉంది. ఏమిటది? కాంతి. ఆ కాంతి వలనే ఆ పాత్రధారుల నటనను చూడగలిగాము. ఆ కాంతి వల్లనే ఇప్పుడు ఎవరూ  అక్కడ లేరని చెప్పగలుగుతున్నాము. కాంతి అంత ప్రముఖ పాత్ర వహిస్తున్నా,దాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు? ఎందుకంటే అది మార్పులేకుండా ఒకలాగే ఉంది. 
అలాగే గదిలో ఆకాశం ఉన్నా, గదిలో ఏముంది అంటే అన్నీ చెప్తాము కాని అకాశం ఉంది అనము. సైకాలజీ ఏమిటంటే కదలకుండా మారకుండా ఉన్న దాన్ని పట్టించుకోము. కదిలే దాన్నే పట్టించుకుంటాము. 
అస్తి, భాతి, ప్రియం అనేవి బ్రహ్మరూపం. అవి కదలకుండా మారకుండా ఉంటాయి. నామరూపాల్లో ఎంతో విభిన్నత ఉంది. క్షణక్షణం అవి మారతాయి. వాస్తవం అయిన బ్రహ్మరూపాన్ని పట్టించుకోకుండా, మాయికం అయిన భిన్నత్వంలో మమేకం చెందుతాము. 
మాయ చేసే మోసం అంతా ఇక్కడే ఉంది.
బ్రహ్మ, మాయల మధ్య ఫ్యాషన్ షో పెడితే మాయే గెలుస్తుంది. ఎందుకంటే మాయ (జగత్తు)లో భిన్నత్వం ఉంది మనస్సును అలరిస్తుంది. అలా విభిన్నత్వం ఉన్నా అది శాంతిని ఇవ్వలేదు. అది మాయికం అని గ్రహించాలి. కాని మాయికం ఆకర్షించినంతగా వాస్తవం ఆకర్శించదు.
మాయ కార్డ్ బోర్డు కుర్చీ(చిత్రపు కుర్చీ) లాంటిదని మర్చిపోకూడదు. అది అన్ని విధాలా బాగుంటుంది కాని కూర్చోవటానికి పనికిరాదు. మాయకూడా అలాంటిదే. అన్ని విధాలా బాగుంటుంది కాని, దానిమీద ఆధారపడటానికి పనికిరాదు.
మాయని చూసి కేవళం ఆనందించాలి కానీ, 
మారని బ్రహ్మ మీద ఆధారపడాలి...
.
(కొనసాగింపు)
(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల వాదోపవాదనలు)
గూఢం చైతన్యముత్ర్పేక్ష్య జడబోధ స్వరూపతామ్ ౹
ఆత్మనో బ్రువతే భాట్టాశ్చదుత్ర్పేక్షోత్థిత స్మృతేః౹౹95౹౹
95. భాట్ట మీమాంసకులు ఆత్మయందు చైతన్యము గూఢమై ఉన్నదనీ స్వరూపమున అది చేతనము,అచేతనము కూడా అనీ అందురు. మేలుకొనిన పురుషుడు తన గాఢనిద్రను స్మరించుటను బట్టి వీరిట్లు నిశ్చయింతురు.
జడో భూత్వా తదాఽ స్వాప్సమితి జాడ్యస్మృతిస్తదా ౹
వినా జాడ్యాను భూతిం న కథఞ్చిదుపద్యతే ౹౹96౹౹
96. “జడుని వలె నిద్రించితిని”అనే స్మరణ అట్టి జడత్వపు అనుభవము ఉండుట చేతనే సంభవము.కాని ఒక చైతన్యాంశము లేనిదే ఇట్టి అచేతనా అనుభవపు స్మరణ సిద్ధింపదు.కనుక ఆత్మ చేతనము అచేతనము కూడా.
ద్రష్టుర్దృ ష్టేరలోపశ్చ శ్రుతః సుప్తౌ తతస్త్వయమ్ ౹
అప్రకాశ ప్రకాశాభ్యామాత్మా ఖద్యోతవద్యుతః ౹౹97౹౹
97. నిద్రయందు ద్రష్ట గాని దృష్టి గాని లోపింపవు.(బృహదారణ్యక ఉప.4.3.23)అనే శ్రుతివాక్యమును చూపుచు వారు మిణుగురు పురుగు వలె ఆత్మ ప్రకాశము అప్రకాశము కూడా అని చెప్పుదురు.
నిరంశ స్యోభయాత్మాత్వం న కథఞ్చిద్ఘటిష్యతే ౹
తేన చిద్రూప ఏవాత్మేత్యాహుః సాంఖ్యవివేకినః ౹౹98౹౹
98. నిరవయవమగు ఆత్మ రెండూ,చేతనము అచేతనము కూడా,అగుట ఏ విధముగనైనను సంభవింపదు.ఆత్మ చిద్రూపము మాత్రమే అని సాంఖ్యులు వాదింతురు.
వ్యాఖ్య: షడ్దర్శనములలో అయిదవదగు పూర్వ మీమాంసయందు రెండు సంప్రదాయములు గలవు.
ప్రభాకర సంప్రదాయము,
కుమారిల భట్టు సంప్రదాయము. వీరినే సంగ్రహముగ భాట్టులని వ్యవహరింతురు.
ఆరవదగు ఉత్తర మీమాంసయే వేదాంతము.
కొన్ని స్థితులయందు చైతన్యము ఆవృతమై ఉండునని భాట్టుల నిర్ణయము.
ఆత్మ విజ్ఞానఘనమని శ్రుతి వాక్యము.
అందు అచేెతనమునకు స్థానము లేదు.నిద్రయందలి జడత్వమును స్మరించుట, జడమగు విషయమును,మాయను,
అనుభవించుట చేత.
ఆత్మ యొక్క జడత్వమును అనుభవించి కాదు.
కనుక భాట్టుల వాదము సమీచీనము కాదు.
ఆదిత్యుని కిరణములు చంద్రుని యందు ప్రతిఫలించి వెన్నెల కాంతి ద్వారా రాత్రుల యందలి చీకటిని పోగొట్టును.ఆ కిరణములే గృహము నందలి కంచు పాత్రపై బడి గృహమును గూడా వెలుగుతో నింపును.
అలాగే ఆత్మ చైతన్యము బుద్ధియందు ప్రతిఫలించి తద్వారా ఇంద్రియములను,ఇంద్రియముల ద్వారా బాహ్య వస్తువులను ప్రకాశింపజేయుచున్నది.
కావున జగత్తునందలి సమస్త పదార్థములను చైతన్య స్వరూపమైన ఆత్మ ప్రకాశింప జేయుట వలన ఆత్మ చిద్రూపంబని చెప్పబడుచున్నది.
అట్లే ఆత్మయైన తాను జాగ్రత్స్వప్న సుషుప్తు లనెడు త్రివిధావస్థల నెరుగు చుండుటచే తానే చిద్రూపాత్మయై యున్నాడు. జాగ్రత్స్వప్నములలో తప్ప సుషుప్తియందు ఆత్మ దేనినీ గూడ తెలిసికొనదుగాన జడమని నిశ్చయించగూడదు.
సుషుప్తి యందు ఏ వస్తువును గూడా తెలిసికొనలేదు అని తెలుపు జ్ఞానమైనను అచ్చట ఉన్నది కదా!
లేనిచో సుషుప్తి యందు ఏమియు తెలియలేదు అని తెలిసికొనిన
దెవరు?
వెలుగు చున్న దీపమును ఆకాశము వైపు తిప్పినప్పుడు అచ్చట ప్రకాశింపజేయుటకు రెండవ వస్తువు లేనప్పటికిని దీపము తనంతట తాను ప్రకాశించుచునే యుండునట్లు, సుషుప్తి యందు తెలిసికొనుటకు రెండవ పదార్థము లేకున్నను తాను మాత్రము కేవల చైతన్య స్వరుపుడై యున్నాడు. సుషుప్తియందు ఆత్మయైన తాను ప్రకాశరూపుడై యుండుటచేత అప్రకాశమైన అజ్ఞానము(తెలియని తనం) లేనే లేదు.
జ్యోతి స్వరూపుడగుటచే సూర్యునికి అంధకారములేనియట్లు,నిత్య బోధ స్వరూపుడైన ఆత్మకు అజ్ఞానము సర్వదా లేదు.
కావున అవస్థలు ఉన్నప్పుడు ఉన్నవని,లేనప్పుడు లేవని తెలియుతాను చిద్రూపుడై యున్నాడు.
అట్లే బాల్య యౌవ్వన వార్థక్యములను ప్రాతర్మధ్యాహ్న సాయంకాలములను,పగలు రాత్రి సంధ్యాకాలములను,వార పక్ష మాస బుతు సంవత్సరయుగ మన్వంతర కల్పములను,ఇంతకు ముందు ఇప్పటి రాబోవు దేహాలను,భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఈ సర్వమును ఒకే రీతిలో ఎట్టి మార్పును లేక ఆత్మ అయిన తాను తెలియు చుండుట వలన చిద్రూపుడై యున్నాడు.
కావున శ్రుతియందు
“ప్రజ్ఞానం బ్రహ్మ”
(ఐతరేయ-ఉప-3-3)మని చెప్పంబడినది.
జాడ్యాంశః ప్రకృతే రూపం వికారి త్రిగుణం చ తత్ ౹
చితో భోగాపవర్గార్థం ప్రకృతిః సా ప్రవర్తతే ౹౹99౹౹
99. జడత్వము ప్రకృతి స్వభావము.అది పరిణామ శీలము,త్రిగుణాత్మకము.
చిద్రూపుడగు పురుషుని భోగము (అనుభవము)అపవర్గము
(మోక్షము)కొరకు ప్రకృతి పనిచేయును.
అసంగాయాశ్చితేర్బంధమోక్షౌ భేదాగ్రహాన్మతౌ ౹
బంధముక్తి వ్యవస్థార్థం పూర్వేషామివ చిద్భిదా ౹౹100౹౹
100. పురుషుడు సంగరహితుడు పరిశుద్ధుడు అయినను ప్రకృతి పురుషుల భేద జ్ఞానము లేక, ప్రకృతియే తానని భ్రమపడి, పురుషుడు బంధమునకు లోనగుచున్నాడు.ఆ బేధజ్ఞానము కలిగినంతనే మోక్షము లభించును. ఈ బంధమోక్షముల వ్యవస్థ కొరకు నైయాయికులు మొదలగు వారివలనే సాంఖ్యులు అసంఖ్యాక పురుషులను ప్రతిపాదింతురు...
(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల వాదోపవాదనలు)
మహతః పరమవ్యక్తమితి ప్రకృతిరుచ్యతే ౹
శ్రుతావసజ్గతా తద్వదసజ్గోహీత్యతః స్ఫూటా ౹౹101౹౹
101. అవ్యక్తమగు ప్రకృతి వ్యక్తప్రకృతియగు మహత్తు కంటే భిన్నమనీ ఆత్మ అసంగమనీ చెప్పు శ్రుతిని వారు ప్రమాణీకరింతురు. సత్త్వరజస్తమోగుణాత్మకమైన ప్రకృతి పురుషుని బంధమోక్షములను కల్పించునని సాంఖ్యవాదము.
కఠ ఉప.1.3.11;
బృహదారణ్యక ఉప.4.3.15, 4.4.22. గుణములు సామ్యావస్థయందుండుట ప్రకృతి స్వభావము.అది చెదరినపుడు సృష్టి ప్రారంభమగును.జడమగు ప్రకృతి తానంతట తానే ఎట్లు చెదరగరదు? అసంగుడగు పురుషుడు ఎట్లు ప్రకృతిని చెదరగొట్ట గలడు?
రెండవది,పురుషులు అసంఖ్యాకులై ప్రకృతి శాశ్వతమైనచో వాని మధ్య ఏదోక సంబంధము కల్పింప వలసి వచ్చును.సంబంధమేర్పడి నంతనే పురుషుని అసంగత్వము భంగపడును.ఇట్లు సాంఖ్యులవాదము కూడా సరికాదు.వేదాంతవాదమున ఆత్మ సత్ చిత్ ఆనందస్వరూపమని ప్రథమ ప్రకరణముననే నిరూపింప బడినది.(1.10)
ప్రకృతి అంటే సత్త్వం,రజస్సు,తమస్సు అనే మూడు గుణాల సామ్యావస్థ.ఈ గుణాల పరస్పర కలయిక చేత దృశ్యమాన జగత్తు ఏర్పడుతొంది. కాని అవి తెలుపు నలుపు వంటి గుణములు కావు.పాలు,ఇనుము వంటి ద్రవ్యాలు కావు.
సత్త్వమంటే జ్ఞానశీలత,రజస్సు క్రియాశీలత,తమస్సు స్థితిశీలత.
జీవుడు,జగత్తు,ఈశ్వరుడు అనే వ్యవహారానికి మూల కారణంగా ప్రకృతి ప్రతిపాదించబడుతొంది. బ్రహ్మం కంటే భిన్నమైన సత్త ప్రకృతికి లేదు.అది బ్రహ్మము నుండి పుట్టినది కూడా కాదు.కాని ప్రకృతిని తీసివేస్తే సృష్టికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు ఉత్తరం లేదు.
ఇట్టి ప్రకృతిలో బ్రహ్మం “ప్రతిబింబించుట”…అంటే ఇది ఊహకు అతీతమైన విషయాన్ని మాటలలో చెప్పే ప్రయత్నమనే గ్రహించాలి.బ్రహ్మంలో
“సృష్టింప వలెననే ఇచ్ఛ కలుగుట” మొదలైనవన్నీ ఇట్టి ప్రయత్నాలే.ఈ విషయం గుర్తించుకుంటే తత్త్వగ్రహణం సులభతరమవుతుంది.
ఆత్మ సర్వదా ఆనందస్వరూపుడు.దుఃఖము కొంచమైనయూ లేదు. విషయముల వలన కలుగు ఆనందము క్షణికమై యున్నది. విషయజనితమైన ఆనందము నిజమునకు ఆత్మదే.అయినను భ్రాంతి వశంబున విషయముల వలన ప్రతీతమై నట్లు తోచుచున్నది.
ఆత్మయొక్క పరమానంద స్వరూపం తెలిసినచో తుచ్ఛ విషయాలలో,అవి కలిగించే క్షణికానందాలలో ఎవరికీ ప్రేమ ఉండదు.
“అహం బ్రహ్మస్మి”అనెడు జ్ఞానంబు గూడా అంతః కరణ వృత్తికి సంబంధించినదే, అయినను ఇది ఆత్మ జ్ఞానంగా చెప్పబడును.
ఎట్లనగా పాదములో గ్రుచ్చుకున్న ముల్లు తీసి వేయుటకు మరియొక ముల్లు వాడుదుము.ఇవి రెండూ ముండ్లే.అయినను మొదటి ముల్లు బాధను గలిగించినది.రెండవ ముల్లు బాధను పోగొట్టినది.
అట్లే”దేహాదులే నేను”అనియెడు వృత్తి రాగద్వేష సహిత సంసారము గలిగిస్తున్నది గాన ఇది ప్రవృత్తి అని చెప్పబడుచున్నది. “బ్రహ్మమే నేను”అనియెడు వృత్తి రాగద్వేష రహితమైన “బ్రహ్మప్రాప్తి” అనెడు మోక్షంబు కల్గించుటచే నివృత్తి రూపమైన” ఆత్మజ్ఞానంబుగా” చెప్పబడుచున్నది.
స్వరూపము తెలియని అజ్ఞాన సమయంలో(స్వరూపము తెలియని కాలములో)ఆత్మయందు మిథ్యయై యుండియు సత్యముగా ఉన్నట్లు తోచెడు ఈ దేహాంద్రియాది ప్రపంచము,స్వరూపజ్ఞానము కలిగిన వెంటనే అసత్తై మిథ్యయై కనబడును.
అధిష్టానమందు తోచెడు అధ్వస్త మయినది ఏదియు ఆధిష్టానము కంటే వేరుగా ఉండుటకు వీలు లేదు అనెడు నియమము ననుసరించి అధిష్టానమైన ఆత్మయందు అధ్వస్తమై కన్పించు ఈ దేహేంద్రియాదులు ఆత్మజ్ఞానికి దగ్దపట న్యాయంగా ఉండి మరణ కాలంలో వాటికి అధిష్టానంగా తానే గా వున్న తనయందే లయించిపోవును.అంతదనుక కేవల సాక్షి మాత్రుడై యుండును.....
.....
'ద్వైత నిరోధమే మోక్షము' అంటే
సుషుప్తిలో ద్వైతనిరోధం మాత్రమే ఉంది.తామస గుణం లో పడి నిద్ర పోయే వారు అందరూ జీవన్ముక్తులు అయి ఉండాలి.
 ద్వైతనిరోధమే మోక్షం కాకూడదా అంటే సమాధిలో ఉన్న యోగికి దోమల బెడద వలన ద్వైతం అప్పుడప్పుడు స్ఫురిస్తూ ఉంటుంది కాబట్టి రాళ్లకు రప్పలకు బొత్తిగా ద్వైతము స్పురించలేదు కాబట్టి యోగి కంటే రాళ్ళు రప్పలే గొప్పవి (అని సిద్ధాంతి పరిహసించడం).... 
ద్వైత నిరోధము స్వస్వరూప జ్ఞానము కలిస్తేనే విడుదల...
.
.
.
గీతలో చెప్పిన కర్మ అనగా ఏమి? ‌
కర్మబంధకమనియు, మోచకమనియు, ననుభయాత్మకమని(ఈ రెండురకములలోఁ జేరనిది)యు మూఁడువిధ ములుగా నున్నది. అందుఫలాభిలాషతోఁ గూడినది బంధకము.నిష్కామమైనది మోచకము. బిక్షాటనాదికమగు కేవలం శారీరక కర్మ అనుభమాత్మకము. (అనగా- బద్ధకమును మోచకమునుగూడ కానిది) 
కేవళము శరీరము నిలచుటమాత్రమే ప్రయోజనముగా గల బిక్షాటన, నదీజలపానాది కర్మననుష్ఠించునట్టి యతి పుణ్యముచే గాని, పాపముచేగాని బంధింపఁబడుట లేదుగదా! కావున యిట్టి (బంధకము మోచక ముగూడకాని) కర్మ నిజముగా గర్మయేగాడు. అట్టికర్మను జేయువాఁడు నిజముగా కర్మికాడు. పరిశేషన్యాయముచే శాస్త్రవిహితమైనట్టి లేక - ప్రతిషిద్ధమైనట్టికర్మ నెనడనుష్ఠించునో, వాడే గర్మియనబడును. అందుకు "యోగఃకర్మసుకౌశలమ్" అను గీతావచనము; ననుసరించి విహిత కర్మను నిష్కామముగ ననుష్ఠించువాఁడు ‘యోగి’యని జెప్పఁబడును. ఇట్టియోగికే చిత్తశుద్ధ్యాదిద్వారమున గ్రమముక్తి లభించును.
 ఎవఁడు ఫలాపేక్షగలవాఁడై విహితకర్మ ననుష్ఠించునో, వాఁడు ధూమాదిమార్గమున చంద్రలోకమునకేగి కొంత కాలమునకు మరల భూమిపై ఁబుట్టును. ఇతఁడే కర్మియన బడును. నిషిద్ధకర్మ ననుష్ఠించువాఁడు నరకమును బొందును.
యోగియన్ననో ఇచట(ఈజన్మమున)నే పరమాత్మ సాక్షాత్కారము గలవాఁడగుచో బ్రహ్మీభూతుడేయగును. అట్లు గాక పరోక్షముగమాత్రమే బ్రహ్మవస్తువును దెలిసినవాడగుచో, నర్చిరాదిమార్గమున బ్రహ్మ (హిరణ్యగర్భ) లోకమునకేగి యచట పరబ్రహ్మసాక్షాత్కామును బడసి పరార్ధద్వయకాలపరిసమాప్తిసమయమునం దా బ్రహ్మతో ముక్తుడగును. 
 ఈవిధముగ యోగుల కర్చిరాదిమార్గమనియు, సకామకర్మానుష్ఠాతలకు ధూమాదిమార్గమనియుఁబాపులకు నరకమార్గమనియు మూడు మార్గములు శ్రుతియందు ప్రసిద్ధములై యున్నవి...
.
.
.
ప్రశ్న: జీవుడు పరమాత్ముని అంశ యని శృతి చెప్పిన విషయాన్ని ఎట్లు సమన్వయ పరచునూ?
ఉ: జీవుడు పరమాత్ముని అంశయని శ్రుతి యందును, స్మృతులయందును. చెప్పబడినది కదా! ఆమాటకు గతియేమి? అని అడుగవచ్చును 'జీవుడు పరమాత్ముని అంశము' అనిన, సూర్యుని ప్రతిబింబము సూర్యుని అంశ మన్నట్లు, మిణుగురులు అగ్ని అంశమనినట్లు, ఘటాకాశము మహాకాశము యొక్క అంశమనినట్లు అర్థము గ్రహించవలెను.
అనగా అదే జాతికి చెందినదని తెలుసుకొనవలెను. ప్రతి
బింబములు అనేక మైయున్నను బింబము ఒక్కటేయైయున్నట్లు జీవులు అనేకులైనను వారి ఆత్మ నిజముగ నొకటే; జీవుడు స్వరూపతః చైతన్యమే; మిణుగురులు నిపూ ఒకటే అయి వున్నట్లు జీవులూ బ్రహ్మమూ ఒకే చైతన్యమయ్యే ఉన్నారు, ఘుటాకాశము గృహాకాశము అని వ్యవహారములో ఆకాశములను అనేకముగా చెప్పిననూ ఆకాశము ఒక్కటే అయివున్నట్లు, జీవులు అనేకులని వ్యవహారమున్నను వారి స్వరూప మన బ్రహ్మ మొక్కటియే, ఈ విధముగ తెల్పుటయే అంశవాక్యముల ఉద్దేశము.
జీవుడు పరమాత్ముని అంశమనెడి వాక్యముల
వాచ్యార్థమునే గ్రహించినచో దోషమేమి? వినుము, అంశమనెడి మాటకు అర్థము అవయవమనియో వికారమనియో శక్తియని యో అవస్థయని చెప్పవలసియుండును, పరమాత్మ యందు అనేక భాగములున్న వనియూ వాటిలో ప్రతి యొక్కటియూ జీవుడనియు కల్పించినచో, అవయవములు చేరుకొని
ఉన్నప్పుడు మాత్రము అవయవి ఉండి, అవి విడివడిపోయినపుడు వెంటనే నశించిపోవునట్లు పరమాత్మకు కూడ అదేగతి కల్గవలసియుండును. కావున అది ఒప్పదగిన మాటకాదు. 
అందువలన జీవుడు పరమాత్ముని అవయవము కాదు. 
ఇక జీవుడు పరమాత్ముని వికారమనినచో అనగా మన్నుమారి కుండ అయినట్లు పరమాత్ముడు మార్పు చెంది జీవుడై నాడన్నచో, అప్పుడుకూడ పరమాత్మునికి నాశము ఒప్పక తప్పదు. అందువలన జీవుడు ఆత్మయొక్క వికారమును కాదు. 
సర్వశక్తుడగు యీశ్వరుడు బంధమునకు లోబడుననుట సరిగాదు కాబట్టి జీవుడు యీశ్వరుని శక్తియనుటయు ఒప్పదగినది కాదు. 
పరమాత్ముడు మొదట పరిశుద్ధుడై దుఃఖహీనుడైయుండి ఆ తర్వాత అశుచియు, దుఃఖముయమును నగు సంసారమును పొందెనని చెప్పుటయు సమంజసము కాదు కాబట్టి జీవుడు పరమాత్ముని అవస్థ అనుటయు పొసగదు. 
అందువలన 'జీవుడు పరమాత్ముని అంశ' మనెడి వాక్యమునకు అక్షరార్థము చెప్పుకొనుట పొసగదు...
.
.
.
భగవద్గీత
 అతను ఆత్మలో ఆనందం తెలుసు మరియు వేరే ఏమీ కోరుకోడు. కోరికలు హృదయాన్ని వేధిస్తాయి: అతను కోరికలను త్యజిస్తాడు. నేను అతనిని ప్రకాశవంతంగా పిలుస్తాను. (2:55)
 కష్టాల వల్ల చలించకుండా, ఆనందం కోసం వెంపర్లాడేవాడు కాదు: భయం నుండి విముక్తి, కోపం నుండి విముక్తి, కోరికల నుండి విముక్తి. నేను అతనిని జ్ఞాని అని పిలుస్తాను మరియు ప్రకాశవంతంగా పిలుస్తాను. (2:56)
 అతని శరీర బంధాలు తెగిపోయాయి. అతను అదృష్టవంతుడు మరియు సంతోషించడు: అతను దురదృష్టవంతుడు, మరియు ఏడవడు నేను అతనిని ప్రకాశవంతంగా పిలుస్తాను. (2:57)
తాబేలు దాని కాళ్ళలో గీయగలదు: చూసేవాడు తన ఇంద్రియాలలో గీయగలడు. నేను అతనిని ప్రకాశవంతంగా పిలుస్తాను. (2:58)
సంయమనం పాటించేవారు తమ కోరికల నుండి పారిపోతారు కానీ వారి కోరికలను తమతో తీసుకువెళతారు: ఒక వ్యక్తి వాస్తవంలోకి ప్రవేశించినప్పుడు, అతను తన కోరికలను అతని వెనుక వదిలివేస్తాడు. (2:59).....
.
.
.
భ. ఆత్మసాక్షాత్కారం ఎలా పొందాలి?
మ. శరీరం నువ్వు కానప్పుడు నువ్వు అత్మవై ఉండాలి. నిన్నే నువ్వు ప్రత్యేకంగా పొందడం దేనికి?
భ. ముక్తికి మార్గం ఏమిటి?
మ. ఈ ప్రపంచం నిజం అనే భ్రమ నుండి బయట పడితే అదే ముక్తి.
మహర్షి ముక్తసరిగా చెప్పినా ఇందులో అంతరార్థం చాలా కొద్ది మందికే అర్థమవుతుంది.......
....
.....నేటి చిట్టికథ
శ్రీమహాభారతం నుండి... 
పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మరచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మరచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది.
ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.
అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.
కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.
ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు.
==============================
.భగవత్తత్వం*🌸
భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది. 
ఒక ఊళ్ళో పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. జీవనోపాధి కోసం అతను మేకల్ని చంపి, వాటి మాంసాన్ని అమ్ముతూ ఉండేవాడు. ఈ క్రమంలో అతని మనసు కరడుగట్టింది. ముఖంలో క్రూరత్వం, మాటల్లో కాఠిన్యం ఉండేవి. అవి జనాన్ని అతనికి దూరంగా ఉంచేవి. చివరకు అతను అద్దంలో తన ముఖం చూసి తానే భయపడే స్థితికి చేరుకొనేవాడు. ఇంట్లో వాళ్ళు కూడా అతణ్ణి చూసి భయపడేవారు. ఈ స్థితి నుంచి బయటపడడం ఎలాగో అతనికి అర్థం కాలేదు. 
ఆ ఊరికి ఒక జ్ఞాని వచ్చాడు. పాపయ్య ఆయనను కలిసి, తన బాధంతా చెప్పుకొన్నాడు. తనకు ఓ దారి చూపించమని ఆయనను వేడుకున్నాడు.
‘‘నాయనా! నువ్వు భగవంతుణ్ణి ధ్యానించు. నీకు తప్పకుండా మేలు జరుగుతుంది’’ అన్నాడు జ్ఞాని.
‘‘అయ్యా! భగవంతుడు ఎవరు? అలా ఉంటాడు? నాకు తెలియజెయ్యండి’’ అని అడిగాడు పాపయ్య.
‘‘భగవంతుడు అంటే దయాసాగరుడు. ప్రేమ, కరుణ, శాంతి కలగలిసిన సముద్రం లాంటి రూపం ఆయనది. ఈ క్షణం నుంచీ ఆయన స్మరణలో ఉండడానికి ప్రయత్నించు. భగవంతుణ్ణి ధ్యానిస్తే  పాపకర్మలు నశిస్తాయి. అప్పుడే నువ్వు ఆ పరమాత్ముణ్ణి చూడగలవు’’ అని చెప్పాడు జ్ఞాని.
ఆయన ఆదేశం ప్రకారం పాపయ్య తన వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించాడు. భగవంతుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరాడు. ఊర్లూ, వాడలూ తిరిగాడు. అడవులన్నీ వెతికాడు. గుడులూ, గోపురాలూ సందర్శించాడు. ప్రతి మనిషినీ నిశితంగా పరిశీలించాడు. జ్ఞాని చెప్పిన భగవంతుడి రూపం జాడలు ఎక్కడా కనిపించలేదు. విసిగి వేసారిన అతను ఒక ప్రశాంతమైన స్థలంలో చెట్టు కింద కూర్చొని, భగవంతుణ్ణి తలచుకుంటూ మధనపడసాగాడు. మనసులో ఏదో ఆరాటం... ఏదో తెలియని బాధ... అతనికి తెలియకుండానే కనురెప్పలు బరువెక్కి మూతపడ్డాయి. శరీరం తేలికయింది. క్షణాలు నిమిషాలయ్యాయి. అలా ఎన్ని గంటలు గడిచాయో తెలీదు. శరీరం ఉన్నదో లేదో తెలియని స్థితికి లోనయ్యాడు. ఏదో తెలియని ఆనందం... ఒకదాని వెనుక ఒకటిగా అనుభూతుల పరంపర... అతని చుట్టూ అపరిమితమైన వెలుగు. 
ఎప్పటికో మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచాడు. అంతా కొత్తగా ఉంది. తిరిగి జ్ఞాని దగ్గరకు వచ్చి, ఆ అనుభవం గురించి చెప్పాడు.
అప్పుడు జ్ఞాని ‘‘నీలోని తపనే నీకు మార్గదర్శకం అయింది. ఇంతకాలం నువ్వు ప్రాపంచిక విషయాలతో కలిసి బతికావు. ఇప్పుడు నీకు బాహ్య విషయాల మీద వైరాగ్యం కలిగింది. అదే నిన్ను అంతర్ముఖుణ్ణి చేసింది. ఇప్పుడు నీ మనసు దానంతట అదే లోలోపల నెమ్మదిస్తుంది. ఆ నిర్మలమైన మనసు నిన్ను ప్రేమమయుణ్ణి చేస్తుంది. నీ మాట, చూపు, ప్రవర్తన అన్నీ శాంతిమయం అవుతాయి. పరమాత్మ గుణాలనూ, శక్తులనూ నీలోలోపల ధారణ చేయడమే మహోన్నతమైన తపస్సు. దాన్ని సాధన ద్వారా మాత్రమే పొందగలవు’’ అని చెప్పాడు.
భగవంతుడు ఆకాశంలోనో, గుడిలోనో... ఏదో లోకంలో సింహాసనం మీద కూర్చొనో మనల్ని పరిపాలిస్తున్నాడనుకుంటాం. అయితే భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది. భగవంతుడివైపు దారి కనిపిస్తుంది. మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. 
ఈ కథలోని పాపయ్యలాగే ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత క్రూరత్వం, కాఠిన్యం ఉంటాయి. ఆయుధాలతో బాధించేవాడే కాదు, ఎదుటి మనిషిని మాటలతో బాధపెట్టేవాడు కూడా క్రూరుడే! 
అందుకే ప్రతి మనిషీ తన అంతరంగంలోకి తొంగి చూసుకోవాలి. తనను తాను తెలుసుకోవాలి. అప్పుడే అతడిలో చైతన్య శక్తి ప్రజ్వరిల్లుతుంది. 
🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏
తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష” అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది. కౌశికుడు వృధాగా కొంగమీద సాధ్విమీద కోపగించుకొని తన తపశ్శక్తిని కోల్పోయాడు.
పతివ్రత యొక్క శక్తి అమోఘం. కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతోకానీ పొందలేని జ్ఞానాన్ని సంపాదించింది. కౌశికుడుకి హితబోధ చేసింది.
స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధుని వలన తెలిసింది. ఈతడు కసాయి వాడైనా స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు.
మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు. జన్మనిచ్చినవారికి కృతజ్ఞత చూపింటం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు
🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹
#శ్రీవేదాంత_పంచదశి 
(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల ఖండనము)
అణు వదంత్యంతరాలాః సూక్ష్మనాడీ ప్రచారతః ౹
రోమ్ణః సహస్రభాగేన తుల్యాసు ప్రచరత్యయమ్ ౹౹79౹౹
79. అంతరాలవాదుల ఆత్మ అణువు వలె సూక్ష్మమందురు. ఏలన వెంట్రుకలో వెయ్యవ భాగము వలె సూక్ష్మమైన నాడులయందు అది సంచరించును గనుక.బృహదారణ్యక ఉప.4.23. కౌశీతకి ఉప 4.19
అణోరణీయానేషోఽ ణుః సూక్ష్మాత్సూక్ష్మ తరం త్వితి ౹
అణుత్వమాహుః శ్రుతయః
శతశోఽ థ సహస్రశః ౹౹80౹౹
80. అణువు కంటే అణుస్వరూపమైనది,సూక్ష్మము కంటే సూక్ష్మతరమైనది ఇట్లు వందలకొలది వేలకొలది శ్రుతివాక్యములు ఆత్మ యొక్క అణుత్వమును వర్ణించుచున్నవి అని వారందరు తమ వాదమును సమర్థింతురు. కఠ ఉప.2.20; ముండక ఉప.3.19;
కైవల్య ఉప.20;
శ్వేతాశ్వర ఉప.3.20;
మహా నారాయణ ఉప.3.
వాలాగ్ర శతభాగస్య శతథా కల్పితస్యచ ౹
భాగో జీవః స విజ్ఞేయ ఇతి చాహాపరా శ్రుతిః ౹౹81౹౹
81. వెంట్రుక చివర యొక్క నూరవ భాగములో నూరవభాగము జీవుడు.దానిని తెలిసికొనవలెను అని మరొక శ్రుతి చెప్పును.
(ఈ శ్వేతాశ్వతర ఉప.5.9వ వాక్యము ఆ తెలిసికొనుట ఎంతకష్టమో సూచించుటకు ఉద్దేశింపబడినది గాని పరిమాణమును తెలుపుటకు గాదు.)
దిగంబరా మధ్యమత్వమాహురాపాదమస్తకమ్ ౹
చైతన్య వ్యాప్తి సందృష్టేరానఖాగ్రశ్రుతేరపి ౹౹82౹౹
82. దిగంబరులైన జైనులు ఆత్మ మధ్యమ పరిమాణము గలదందురు.అపాదమస్తకము చైతన్యము వ్యాపించి ఉండుటవలనను”గోరుల చివరల నుండి తల వరకు ఆత్మ వ్యాపించి ఉన్నది” అనే శ్రుతి వాక్య బలమునను వారట్లు చెప్పుదురు.
బృహదారణ్యక ఉప.1.4.7;
కౌషీతకి ఉప.4.20.మధ్యమ పరిమాణమనగా శరీరముతో సమానమైన పరిమాణమని అర్థము.
సూక్ష్మ నాడీ ప్రచారస్తు సూక్ష్మైరవయవైర్భవేేత్ ౹
స్థూలదేహస్య హస్తాభ్యాం కంచుక ప్రతిమోకవత్ ౹౹83౹౹
83. ఆత్మ తన సూక్ష్మమైన అవయవములచే సూక్ష్మములైన నాడులను ప్రవేశించును. సన్నవియగు చొక్కా చేతులయందు స్థూలశరీరపు చేతులు ప్రవేశించినట్లే.ఆత్మకు అవయవములు గలవని దిగంబర జైనుల సిద్ధాంతము.
న్యూనాధిక శరీరేషు ప్రవేశోఽ పి గమాగమైః ౹
ఆత్మాంశానాం భవేత్తేన మధ్యమత్వం వినిశ్చతమ్ ౹౹84౹౹
84. ఆత్మ యొక్క అవయవములు సంకోచించుట వలనను వ్యాకోచించుట వలనను చిన్నవి పెద్దవి అగు వివిధ శరీరములందు ప్రవేశింప గలుగును.ఇట్లు ఆత్మకు సాధారణ పరిమాణము మధ్యమమని వారు నిశ్చయింతురు.
సాంశస్య ఘటవన్నాశో భవత్యేవ తథా సతి ౹
కృతనాశాకృతాభ్యాగమయోః కో వారకో భవేత్ ౹౹85౹౹
85. సావయవమైన ఆత్మసావయవమగు కుండ వలెనే నశింపక తప్పదు.అట్లు ఆత్మ నాశనశీలియైనచో కృతనాశము అకృతాభ్యాగమము అనే దోషముల నెవరు వారింపగలరు?వారింపశక్యము కాదు.
వ్యాఖ్య: ఆత్మకు అవయవములు, అంశములు,భాగములు ఉన్నచో అది భాగములు గల కుండ వంటి సకల పదార్థముల వలెనే నశింపక తప్పదు.
ఈ జన్మమున శరీరముతో బాటు ఆత్మ కూడా మరణించిన,
మరు జన్మము నందలి సుఖదుఃఖములకు కారణము లేకపోవును.
గత జన్మమున ఆత్మ అప్పుడే మరణించుటచే ఆ జన్మమున చేసిన పుణ్య పాప కర్మలకు ఫలితము లేకపోవును, ఇట్లు కారణము లేకయే ఫలితము కలుగుట అకృతాభ్యాగమము.
కారణమునకు ఫలితము లేకుండుట కృతనాశము.ఆత్మచే ఈ జన్మమున చేయపడిన సుకృత దుష్కుత(పుణ్యపా)కర్మ ఫలితము లేకయే నశించును.
అట్లే అట్టి కర్మలేకయే ఈ జన్మమున సుఖదుఃఖములను అనుభవించుచున్నట్లు ఏర్పడును. ఇట్టి సంభవము ఎవరికిని సమ్మతము కాదు.
శరీర పతనం సమయంలో కర్మయే జీవాత్మకు ఆశ్రయము.శరీరం పృథివ్యాది భూతాలతో కూడుకొని ఉన్నది.ఈ పంచభూతాలు సూక్ష్మరూపంలో మోక్షము వరకు అంటే బ్రహ్మైక్యము వరకు నాశనము లేనివి కాబట్టి జన్మరాహిత్యం వరకు సూక్ష్మాంశాలతోనే ఈ శరీరం ఉద్భవిస్తూంటుంది.
సర్వేంద్రియాలకు ఆధారమైన తేజస్సు భూతాల యొక్క సూక్ష్మరూపంలో సంసారమోక్ష పర్యంతం(అంటే బ్రహ్మలో విలీనం అయ్యేవరకు)ఉంటుంది.ఇదే సూచిస్తూ శ్రుతిలో ఇలా వినబడుతున్నది:
కర్మను,విద్యా ప్రాప్తిని అనుసరించి శరీరోపాధికోసం మరో జన్మను పొందవలసి ఉంటుంది.
ఇలా స్థావర జంగముల రూపంలో జీవులకు జనన-మరణాలతో సంసారం అనే సంబంధం ఉండనే ఉంటుంది.ఇలా సంసార సంబంధం లేకపోతే మరణించిన ప్రతి సంసారి,బ్రహ్మము‌లో లీనమయి బ్రహ్మమే అయిపోవాలి.
అందువల్ల తేజో రూపమైన జీవాత్మ,ఆ పరమాత్మ యొక్క ప్రకృతి అయినా(తత్ర్పకృతత్వం కలదైనా)సుషుప్తిలో జరిగే ప్రళయంలాగే,మరణానంతరం లోనూ సంసార బీజం సశేషంగానే ఉంటుంది.
ఆత్మ సూక్ష్మంగా ఉండటం వలన దేహాది బాధలు స్థూలశరీరాన్ని పీడించినా,సూక్ష్మశరీరం నలిగి నశించడం వుండదు.దాని నిష్ర్కమణ నాడులు,రంధ్రాల ద్వారా జరగటం వలన అది సూక్ష్మాతి సూక్ష్మమని తెలుస్తున్నది.
ఆత్మ నిష్ర్కమణ మార్గంలో ఎట్టి అడ్డంకులు ఉన్నట్లు కనబడదు.దేహం నుండి ప్రాణం పైకి పోవటం ప్రక్కనున్న వారి కంటికీ కనబడదు.
మూడు శరీరాలు కనబడని అవస్థలున్నాయి కాని “ఆత్మ” లేని అవస్థ లేదు.
తస్మాదాత్మా మహానేవ నైవాణుర్నాపి మధ్యమః ౹
ఆకాశవత్సర్వగతో నిరంశః శ్రుతి సంమతః ౹౹86౹౹
86. కనుక ఆత్మ అణువు కాదు మధ్యమము కాదు.అది అనంతము ఆకాశము వలె సర్వవ్యాపి అంశములు లేనిది.ఇదే శ్రుతి సమ్మతమైన సిద్ధాంతము.
ముండ ఉప.3.1.7;
శ్వేతాశ్వతర ఉప. 6.49;
గౌడపాదకారిక 3.3
ఇత్యుక్త్వా తద్విశేషే తు బహుధా కలహం యయుః ౹
అచిద్రూపోఽ థ చిద్రూప శ్చిదచిద్రూప ఇత్యపి ౹౹87౹౹
87. ఇట్లు ఆత్మ అనంతము నిరవయవము సర్వవ్యాపియని స్థాపించి దాని లక్షణములను గూర్చి మరల పలువిధములుగ కలహింతురు.చైతన్య స్వరూపమని కొందరు కాదు అచేతనమని మరికొందరు,
కాదు కాదు అది చేతనము అచేతనము కూడా అని తదితరులు వాద వివాదములు చేయుదురు...
.
(సేకరణ)(ఆదిత్యనారాయణ)(తిప్పానా)

అధిష్టానమందు తోచెడు అధ్వస్త మయినది ఏదియు ఆధిష్టానము కంటే వేరుగా ఉండుటకు వీలు లేదు అనెడు నియమము ననుసరించి అధిష్టానమైన ఆత్మయందు అధ్వస్తమై కన్పించు ఈ దేహేంద్రియాదులు ఆత్మజ్ఞానికి దగ్దపట న్యాయంగా ఉండి మరణ కాలంలో వాటికి అధిష్టానంగా తానే గా వున్న తనయందే లయించిపోవును.అంతదనుక కేవల సాక్షి మాత్రుడై యుండును...

చిత్సన్నిధౌ ప్రవృత్తాయాః ప్రకృతేర్హి నియామకమ్ ౹
ఈశ్వరం బ్రువతే యోగః స జీవేభ్యః పరః శ్రుతః ౹౹102౹౹
102. యోగులు ఈశ్వరుని గూర్చి చెప్పుదురు.చిత్సాన్నిధ్యమున ప్రవర్తించు ప్రకృతిని నియమించునది ఈశ్వరుడే. ఈశ్వరుడు జీవులకంటే శ్రేష్ఠుడు.
వ్యాఖ్య: ఆత్మను గూర్చిన భేదాభిప్రాయములను వివరించి ఈశ్వరుని గూర్చిన అభిప్రాయములను వివరించుచున్నారు.
విభువు అంటే వ్యాపకమయిన చైతన్యము.
దానినాశ్రయించి దానినే కప్పినది మాయ.అది సదసద్విలక్షణమయిన
అద్భుత శక్తి రూపమయిన అజ్ఞానము.మాయా యుక్త చైతన్యం ఈశ్వరుడు.ఈయన జగద్ధేతువు.కనుక జగత్కర్త ఈశ్వరుడు.
జడపదార్ధము కర్త లేకుండా పుట్టదు.కర్తకు తాను చేయదలచిన కార్యమునకేది ఉపాదానమో తిలిసి యుండును.కుమ్మరికి మట్టి తెలియును గదా!కనుక అతడు ఘట సర్వజ్ఞుడు.
అలాగే ఈశ్వరుడు విశ్వసర్వజ్ఞుడు.ఆయనకు ప్రపంచోపాదానమయిన మాయ తెలుసు.ఆయన సర్వ శక్తిమంతుడు.ఆయన సర్వజ్ఞుడు.
అందుకు మాయ కారణము. అందుకు సాక్షమీ అద్భుత విచిత్ర విశ్వమే.ఆయన స్వతంత్రుడు.సర్వశక్తిమంతుడు.
కనుక ఆయన పరాధీనుడుకాడు.
ఇందుకు భిన్నంగా జీవుడు. అల్పశక్తిమంతుడు,
అల్పజ్ఞుడు,
పరతంత్రుడు,
అల్ప కార్యకర్త ఇందుకు కారణం అవిద్య.అందువలననే అతడు జీవుడని విలక్షణ నామం సంపాదించాడు.కనుక జగత్కర్త ఈశ్వరుడే.
జీవుడు కాదు.
క్షరమనగా నశించునది.ప్రధానమే క్షరము,మాయ.
హరుడనగా అవిద్యను హరించువాడు గావున పరమేశ్వరుడు.
వ్యక్తా వ్యక్తములను,
క్షరము అక్షరముగా చెప్పెదరు. ఈశ్వర భిన్నుడగు జీవుడు భోక్తృభావము వలన బద్ధుడగుచున్నాడు.పరమేశ్వరుని తెలుసికొని ముక్తుడగుచున్నాడు.
ఈ నిర్వి శేషమగు బ్రహ్మము శ్రేష్ఠమని చెప్పబడినది.బ్రహ్మము అక్షరము గూడ అయియున్నది.ఈ దేహమునందు(ప్రపంచమునందు)బ్రహ్మమును బ్రహ్మవేత్తలు అంతర్యామిగా తెలిసికొనుచున్నారు.
జ్ఞుడనగా సర్వమును తెలిసిన ఈశ్వరుడు.అజ్ఞుడనగా అల్పజ్ఞుడగు జీవుడు.ఈ జీవేశ్వరు లిద్దరును అజులు.జన్మాది వికారములు లేనివారలే.బ్రహ్మమే మాయవలన జీవేశ్వర రూపములతో గోచరించుచున్నది.
పరబ్రహ్మమునందు లీనమై,
ఆ బ్రహ్మమునందే సమాధిగలవారు జననమరణ రూప సంసారము నుండి విముక్తులగుచున్నారు.
క్షరమనగా నశించునది.ప్రధానమే క్షరము,మాయ.
హరుడనగా అవిద్యను హరించువాడు గావున పర మేశ.
వ్యక్తా వ్యక్తములను,
క్షరము అక్షరముగా చెప్పెదరు. ఈశ్వర భిన్నుడగు జీవుడు భోక్తృభావము వలన బద్ధుడగుచున్నాడు.పరమేశ్వరుని తెలుసికొని ముక్తుడగుచ.ున్నాడు.

ఆ బ్రహ్మమునందే సమాధిగలవారు జననమరణ సంసారము నుండి విముక్తులగుచున్నారు...
(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల వాదోపవాదనలు)
ప్రధాన క్షేత్రజ్ఞ పతిర్గుణేశ ఇతి హి శ్రుతిః ౹
అరణ్యకేఽ సంభ్రమేణ హ్యంతర్యామ్యుపపాదితః ౹౹103౹౹
103. ఈశ్వరుడు జీవులకు ప్రకృతికి ప్రభువనీ గుణములను కూడా నియమించుననీ శ్రుతి ప్రకటించును.అరణ్యకమున ఈశ్వరుడు అంతర్యామి అని వర్ణింపబడెను.
వ్యాఖ్య :శ్వేతాశ్వర ఉప.6.14;
బృహదారణ్యక ఉప.3.7;
కఠ ఉప.2.33.సాంఖ్యుల మతమున పురుష సాన్నిధ్య మాత్రమున ప్రకృతి పరిణామము నొందును.యోగులమతమున ఈశ్వరుడు ప్రకృతిని నియమించును.
శుద్ధ బ్రహ్మము అసంగము, అక్రియము.అది సృష్టి చేయదు అది చతుష్పాత్తు అనగా పరిపూర్ణము.అందువలన మాయా విశిష్టుడయిన ఈశ్వరుడు అవసరం.ఆయనయే జగత్కర్త.
మాయ:ఇది శుద్ధ చైతన్యము నాశ్రయించిన పాదమాత్ర ప్రమాణమయినది.
శుద్ధ చైతన్యమనగా జీవ-ఈశ్వర భేదం లేనిది.మాయ-అనాది.
దీని ప్రభావము వలననే
జీవ-ఈశ్వర భేదం సిద్ధించింది.కనుక వారినుండి మాయ పుట్టలేదు.
మిగిలినది శుద్ధ చైతన్యము.అది నిర్వికారము.దాని వలన మాయ పుట్టిందనరాదు.అంటే అది కర్తృత్వం మొదలయిన గుణాల వలన సవికారం అవుతుంది.పైగా మోక్ష సమయంలోనూ మాయ ఉన్నట్లు అవుతుంది.శుద్ధ చైతన్యం గదా మన స్వరూపము.అపుడు గూడా మాయ ఉన్నదంటే మోక్షము వ్యర్థమవుతుంది.కనుక మాయ అనాది.
నిర్వికార శుద్ధ బ్రహ్మమునుండి జగదుత్పత్తి అగుటలేదు.ఏలనగా శుద్ధ బ్రహ్మము అసంగముగను క్రియారహితముగను యున్నది.ఈ అనాది శుద్ధ బ్రహ్మములో అనాది కల్పిత మాయ ఉంది.
ఈ మాయకు బ్రహ్మముతో అనాది కల్పిత సంబంధం ఉన్నది. కేవలము ఈ కల్పిత మాయనుండియు జగదుత్పత్తి జరగదు.కాన బ్రహ్మము మాయ ఈ రెండింటి కల్పిత సంబంధముచే శుద్ధబ్రహ్మము,సర్వజ్ఞుడు మరియు ఈశ్వరుడుగా పిలవబడుచున్నాడు.
ఈ మాయావిశిష్టుడైన ఈశ్వరుని యొద్దనుండి జగదుత్పత్తియగు చున్నది.కాన మాయ -ఈశ్వరుడు-భోక్తయైన జీవుడు-సృష్టి విధానము వీని స్వరూపములను ప్రతిపాదించడం జరుగుచున్నది.
అత్రాపి కలహాయన్తే వాదినః స్వస్వయుక్తిభిః ౹
వాఖ్యాన్యపి యథాప్రజ్ఞం దార్ఢ్యాయోదాహరన్తి హి ౹౹104౹౹
104. ఈశ్వరుని విషయమున కూడా వివిధ తాత్త్వికులు తమ తమ తర్కములచే వివిధ వాదములతో కలహింతురు.తమ తమ ప్రతిభకు తగినట్లు శ్రుతి వాక్యములను కూడా దార్ఢ్యార్థము ఉటంకింతురు.
క్లేశకర్మవిపాకైస్తదాశయై రప్యసంయుతః ౹
పుంవిశేషో భవేదీశో జీవవత్సోఽ ప్యసంగచిత్ ౹౹105౹౹
105. యోగసూత్రకారుడైన పతంజలి మతమున ఈశ్వరుడు క్లేశకర్మ విపాక ఆశయములు స్పర్శింపని ఒక విశిష్ట పురుషుడు. పురుషుల వలనే ఈశ్వరుడు అసంగుడు చిద్రూపుడు.
వ్యాఖ్య: యోగసూత్రముల సమాధి పాదము సూ.24.
అవిద్యా,అస్మితా,రాగద్వేషములు, అభినివేశము అనునవి అయిదు క్లేశములు.
శుక్లము,కృష్ణము,శుక్లకృష్ణము అని కర్మ మూడు విధములు (పుణ్య,పాప,పుణ్యపాపమిశ్రమ కర్మ)
జాతి,ఆయువు,భోగము అనునవి మూడు విపాకములు.
ఆశయమనగా సంస్కారములు.
సాంఖ్యులకు యోగులకును పురుషుడు భోక్త మాత్రమే కర్తకాడు.కర్తృత్వము సుఖదుఃఖములు ప్రకృతి వికారమగు బుద్ధి లక్షణములు.
బుద్ధితో తాదాత్మ్యము వలన పురుషుడు తానే కర్తయని భ్రమించును.సమాధి ద్వారా తన భిన్నత్వమును తెలిసికొని మోక్షము నొందును.
పురుషుడు(ఆత్మ) స్వాభావికంగా
అసంగుడు.అసంగ వస్తువనగా ఏదైతే దేనియందుగూడి యున్నప్పటికీ తన అసంగత్వమును వీడదో అది అసంగవస్తు వనబడును.
స్వస్వరూపమైన ఆత్మ,
కల్పిత వస్తువులయిన అహంకారం మొదులుకొని స్థూలదేహ పర్యంతము కల్పిత అభిమానంబుతో
“నేను నేను”అని,ఉన్నప్పటికి తన అసంగత్వమును వీడలేదు.
కాన సంగత్వము మాయికమని తెలియ వలయును.
ఆత్మకు సంగత్వము సత్యమే అగుచో మోక్షము వచ్చుటకే వీలు లేదు.కాన సంగత్వము అసత్యమైనందుననే “తత్త్వమసి” ఇత్యాదిశ్రుతులు నీవే బ్రహ్మమని తేల్చుచున్నవి...
****

ప్రాభాకరాస్తార్కి కాశ్చ ప్రాహురస్యాచిదాత్మతిమ్ ౹
ఆకాశవత్ ద్రవ్యమాత్మా శబ్దవత్తద్గుణశ్చితిః ౹౹88౹౹
88. ప్రభాకర సంప్రదాయమువారు, తార్కికులు,ఆత్మ అచేతనము అందురు. ఆకాశము వలె ఆత్మయొక్క ద్రవమనీ ఆకాశమునకు శబ్దము గుణమైనట్లే ఆత్మకు చైతన్యము గుణమనీ చెప్పుదురు.
వ్యాఖ్య: తార్కికుల మతమున ద్రవ్యములు తొమ్మిది.పృథివి, జలము, తేజము(అగ్ని), వాయువు,ఆకాశము,కాలము,
దిక్కు,ఆత్మ,మనస్సు.
ఒక్కొక్క ద్రవ్యమున కొక్కొక్క విశేషగుణముండును.పృథివికి వాసన జలమునకు రుచి అగ్నికి రూపము,ఇట్లు
ఆత్మ యొక్క గుణము చైతన్యము.
ఆత్మకు సంకోచ వికాసాలంగీకరించరాదు.మధ్యమ పరిమాణం
(అణువు-వ్యపకము,కాకుండా) అయితే దీప ప్రకాశంలాగా సంకోచవికాసాలు చెప్పాలి.అపుడు ఆత్మ వినాశం గలదవుతుంది.ఈ మోక్షాది ఉపదేశాలన్ని వ్యర్ధం.
మధ్యమ పరిమాణం అనేది అనిత్య లక్షణము.ఆత్మ అనిత్యం కావలసి వస్తుంది.కనుక నవీన తార్కికమతం సమీచీనం కాదు.
ఆత్మ అనేకము.అణు ప్రమాణము అని ఇదీ కుదరదు.ఆత్మ కర్త భోక్త అన్న పక్షమున అది అణువని చెప్పినచో దాని కరృత్వము, భోక్త్వత్వము శరీరైక దేశానికి పరిమితము.
మరి వేదం కూడా ఆత్మ అణువని చెప్పింది కదా! అంటే అచ్చట గ్రహింప శక్యంకానంత సూక్ష్మ విషయమని అర్థం.సూక్ష్మమయిన అణువులు మొదలయినవి ఎలా గ్రహించలేమో అలా”ఆత్మ తత్త్వం” గ్రహించలేమని అర్థము.
ఎందుకంటే “ఆత్మ తత్త్వం” విభువని (సర్వ వ్యాపకమని) అనంతమని శ్రుతియే చెప్తున్నది గదా!
(అణు పదార్ధములందు వ్యాపకమయినది అణువంత. ఆకాశ వ్యాపకమయినది మహత్తు-ఉపాదులను బట్టి అయినా ఇలా చెప్పవచ్చును-సరళీకర్త).
కనుక ఆత్మ అణువు కాదు. మధ్యమ పరిమాణమూ కాదు.
దీపం అంటే వత్తికాదు.వెలుగే.
వ్యాపకాత్మ ఒక్కటే.దానియందు ఎట్టి ధర్మములు లేవు.
ఈ దేహమే నేను అనే భావంతో నేను అంధుణ్ణి,నేను అంధుణ్ణి కాను, నేను మూఢుణ్ణి,మూఢుణ్ణి కాను,నేను పొట్టివాణ్ణి,
నేను పొడుగువాణ్ణి ఇత్యాది భావన దేహ సంబంధమైనది.ఆత్మ సంబంధమైనది ప్రాణులందరిలో సామాన్యం.
బ్రహ్మతత్త్వం అవిద్యను నివారింపజేస్తుంది.
ఆత్మ దేహాదుల కన్నా భిన్నమైనది అని తెలుసుకున్న విద్యావంతునికి నియోగం ఉండదు.
సర్వమూ ఆత్మ స్వరూపమని ఆత్మసాక్షాత్కారంతో తెలుసుకున్న వారు జ్ఞాని(బ్రహ్మవేత్త).
ఇచ్ఛాద్వేష ప్రయత్నశ్చ ధర్మాధర్మౌ సుఖాసుఖే ౹
తత్సంస్కారాశ్చ తస్యైతే గుణాశ్చితివదీరితాః ౹౹89౹౹
89.చైతన్యము మాత్రమే గాక ఇచ్ఛ,ద్వేషము,ప్రయత్నము,
ధర్మము,అధర్మము,సుఖము,
దుఃఖము,సంస్కారములు ఇవన్నీ ఆత్మ యొక్క గుణములని వారందురు.
ఆత్మనో మనసాయోగే స్వాదృష్టవశతో గుణాః ౹
జాయంన్తేఽ థ ప్రలీయంన్తే సుషుప్తేఽ దృష్టసంక్షయాత్ ౹౹90౹౹
90. పూర్వకర్మల వలన కలిగిన అదృష్టముచే ఆత్మ మనస్సుతో కలిసినపుడు ఈ వివిధ గుణము లేర్పడును.ఈ అదృష్టము తీరగనే ఆత్మ సుషుప్తిలోనికి పోవును.ఆ గుణములును లయమునొందును.....
,,,,
6వ అధ్యాయం: చిత్రదీప ప్రకరణము.
శరీరం నుండి ఆత్మ వరుకు జీవుని ఆరోహణాక్రమం -ఆత్మ బిన్న మతాల ఖంఢన.
కూటస్థాది శరీరాంత సంఘాతస్యాత్మతాం జగుః ౹
లోకాయతాః పామరాశ్చ ప్రత్యక్షాభాసమాశ్రితాః ౹౹60౹౹
60. లోకాయుతులు (భౌతికవాదులు)పామరజనులు ఇంద్రియ గోచరమైన ప్రత్యక్షమును, మిథ్యను,మాత్రమే ఆశ్రయించి కూటస్థము మొదలు శరీరము వరకు గల సంఘాతమును ఆత్మ అందురు.
శ్రౌతీకర్తుం స్వపక్షౌ తే కోశమన్నమయం తథా ౹
విరోచనస్య సిద్ధాంతం ప్రమాణం ప్రతిజిజ్ఞిరే ౹౹61౹౹
61. తమ వాదము వేదసమ్మతమని చెప్పుటకు వారు అన్నమయ కోశమును (తైత్తిరీయ ఉప.2.1)విరోచన సిద్ధాంతమును (ఛాందోగ్య ఉప.8.8)ప్రమాణముగ ఊటంకింతురు.
జీవాత్మనిగమే దేహమరణస్యాత్ర దర్శనాత్ ౹
దేహాతిరిక్త ఏవాత్మే త్యాహుర్లోకాయతాః పరే ౹౹62౹౹
62. మరికొందరు లోకాయుతులు,జీవాత్మ శరీరమును వదలినపుడు శరీరము మరణించుట వలన,ఆత్మ నిశ్చయముగ శరీరము కంటె భిన్నమని తీర్మానింతురు.
ప్రత్యక్షత్వేనాభిమతాహం దీర్దేహాతిరేకిణమ్ ౹
గమయేదింద్రియాత్మానం వచ్మీత్యాదిప్రయోగతః ౹౹63౹౹
63. వారు
“నేను మాటలాడుచున్నాను” మొదలగు ప్రయోగముల వలన దేహము కంటె భిన్నమగు అహం బుద్ధిని సూచించు ఇంద్రియములే ఆత్మయని చెప్పుదురు.
వాగాదీనామింద్రియాణాం కలహః శ్రుతిషు శ్రుతః ౹
తేన చైతన్యమేతేషామాత్మత్వం తత ఏవ హి ౹౹64౹౹
64. వాక్కు మొదలగు ఇంద్రియముల కలహము వేదమునందు
(బృహదారణ్యక ఉప.6.1.7-14)
విందుము.కనుక ఇంద్రియములు చేతనములు. ఆ కారణముచే అవే ఆత్మయని వారి వాదము.
దేహమునందలి జీవశక్తి ఉత్తేజితమయినప్పుడు ఆలోచనకు,వాక్కునకు,క్రియకు సంబంధించిన వివిధమలగు అవయవములు తమ కార్యమును నిర్వహించును.
అవి,మనస్సునందు ప్రబలముగా (వ్యాప్తమయి)ఉండు భ్రాంతియుతభావనల వలన తమ దృశ్యవిషయములవైపు ప్రసరించును.ఈ జీవశక్తి ఆత్మలోపల వివిధ రూపములను దర్శించును.
ఈ దర్శనము స్థిరస్వభావము కలదిగానున్నట్లు కనిపించుట వలన ఇది జాగ్రద్దశ అనబడును.
బ్రహ్మమునకు ఎట్టి అంగాలు లేవు నిరవయవి.అయితే కార్యరూపంలో సమస్తమైన బ్రహ్మము పరిణామం చెందాలి.
బ్రహ్మము”నిష్కలం”,”నిష్ర్కియం,
“శాంతం”,”నిరవద్యం,నిరంజనమ”
అని శ్రుతులు నిర్దేశిస్తున్నవి.
లోకంలో సాలెపురుగు తనే దారాన్ని సృజించుకొని దానిలో సంచరిస్తూ ఉంటుంది.కొన్ని జాతి కొంగలు మేఘగర్జనతో పురుష సంయోగం లేకపోయినా
గర్భం ధరిస్తాయి. తామరతీగ(పద్మలత)ఒక సరస్సు నుండి మరో సరస్సుకు బాహ్యసాధనాపేక్ష లేకుండా విస్తరిస్తుంది.అలాగే బ్రహ్మశక్తి ఊహకందనిది.అందువల్ల జగత్ నిర్మాణము,సమస్త సృష్టికార్యము బ్రహ్మమునకు సాధ్యమేనని శ్రుతి ప్రమాణము.
ప్రకృతి-వికారరూపం రెండూ అనన్యంగా ఉంటాయనే శ్రుతిలో వినబడు తున్నది.ప్రతి ప్రాణి యొక్క హృదయస్థానంలో బ్రహ్మముంటుందని,సుషుప్తిలో జీవాత్మ-సత్సంపన్నుడౌతాడని శ్రుతి నిర్దేశం.
కార్యరూపంలోనే కాక,బ్రహ్మము అవికృత రూపంలో ఉందనే శ్రుతులు బోధిస్తున్నాయి.బ్రహ్మ నిరవయవి అనే ఉపనిషద్వాక్యాలు నిర్ధారిస్తున్నవి .శబ్ద ప్రామాణ్యంతోనే అగోచరమైన బ్రహ్మమును స్థాపించడం శక్యం. అందువల్ల నిరవయత్వాన్ని నిస్సంసందేహంగా అంగీకరించాలి.
నేను చూచుచున్నాను-మొ౹౹ ఇంద్రియములు”నేను”అనటం వలన స్థూలదేహం ఆత్మకాదు.
“నాదేహం”అనడం మమకారం. “నేను దేహం” అంటే అహంకారం. “దేహం”నేను అనటం లేదు కనుక దేహం ఆత్మకాదు.
జనన మరణాదులున్నందున “దేహం” “ఆత్మ”కాదు.
ఏది లేనందువలన శరీరమే ఉండదో అది ఆత్మ.కనుక ఇంద్రియములు కొన్ని లేకున్నా శరీరం ఉంటుంది.కనుక ఇంద్రియాలు ఆత్మకాదు.
అవిద్యా కల్పితమైన వ్యవహారంలో బ్రహ్మ పరిణామం ఎన్నో రూపాలలో కనపడవచ్చు.కాని,పారమార్థక రూపంలో బ్రహ్మ మొక్కటే. నానారూపాలు లేవు. నామరూపభేదం కేవలం వాచారంభణం
(వాక్కుతో వచ్చినది).
“నీ ఆత్మయే పరబ్రహ్మ”అని తెలుసుకోవటం వల్ల మోక్ష ఫలసిద్ధి కలుగుతుంది.      ఇంకా ఉంది.....
హైరణ్యగర్భాః ప్రాణాత్మవాదిన స్త్వేవ మూచిరే ౹
చక్షురాద్యక్షలోపేఽపి ప్రాణసత్త్వే తు జీవతి ౹౹65౹౹
65. హిరణ్యగర్భ సంప్రదాయపు వారు ప్రాణములే ఆత్మయందురు. కన్నులు మొదలగు ఇంద్రియములు లేకున్నను ప్రాణములున్నచో జీవించును అని వారు ఎత్తి చూపుదురు.
ప్రాణోజాగర్తి సుప్తేఽ పి ప్రాణశ్రైష్ఠ్యాదికం శ్రుతమ్ ౹
కోశః ప్రాణమయః సమ్యగ్విస్త రేణ ప్రపఞ్చితః ౹౹66౹౹
66. నిద్రయందు కూడ ప్రాణము మేలుకొనియే ఉండును. శ్రుతులును ప్రాణము శ్రేష్ఠమని చెప్పుచున్నవి.ప్రాణమయ కోశము సవిస్తరముగ ఉపదేశింపబడినది.
చూ.బృహదారణ్యక
ఉప.1.3.7;5.13.1 ఛాందోగ్య ఉప.5.1 ప్రశ్న ఉప.2-3(4.3)తైత్తిరీయ ఉప.2.2.1
మన ఆత్మేతి మమన్యన్త ఉపాసనపరా జనాః ౹
ప్రాణస్యాభోక్తృతా స్పష్టా భోక్తృత్వం మనసస్తతః ౹౹67౹౹
67. ఉపాసనా పరులైన జనులు మనస్సే ఆత్మయందురు. సుఖదుఃఖములను,అనుభవించే శక్తి మనస్సునకు గలదు. ప్రాణమునకు ఆశక్తి లేదని స్పష్టముగ తెలియుచున్నది గదా. కనుక భోక్తృత్వము గల మనస్సే ఆత్మయని వారి వాదము.
వ్యాఖ్య: ఇది నారద పంచరాత్ర సంప్రదాయము.ప్రాణము ఆత్మ కాదనుటకు అందు ఎన్నో కారణములు చూపబడినవి.అది వాయువు మాత్రమే.
నిద్రలో కూడా ప్రాణము పనిచేసినా అది శరీరమును గాని బాహ్య విషయమును గాని అనుభవింప జాలదు.ప్రాణము పోయినచో శరీరము మరణించును.జఠరాగ్ని లేకున్నను శరీరము మరణించును. శ్రుతి ప్రాణము యొక్క మహత్వమును వర్ణించుట ఉపాసనయందు రుచి కల్పించుటకు మాత్రమే.
ప్రాణము శరీరమును ప్రవేశించినదని శ్రుతి చెప్పుట అధిదేవతను ఉద్దేశించియే.
శ్రుతి మనస్సే ఆత్మ అని కూడా చెప్పును,
“ఆహారము లేక నా ప్రాణము పోవుచున్నది” అనుట ప్రాణమునందలి ప్రీతిని మాత్రమే తెలుపును గాని దాని ఆత్మత్వమును గాదు.
బాహ్య వాయువు వలె రాకపోకలు చేసేది ఆత్మకాదు.
ప్రాణం కనబడకపోయినా మూర్ఛాదులందు చావు లేదు.
నిద్రలో ప్రాణమున్నా పని యుండదు.కనుక ప్రాణము జడము.ఇంద్రియాదులకన్నా అది శ్రేష్ఠ మనుట కొరకే శ్రుతి ప్రాణమును ప్రధానంగా చెప్పింది.
వృక్షాదులందు ప్రాణం ఉన్నట్లు మనకు తెలియదు.అయినా అవి బ్రతికి ఉంటాయి.
మనస్సు-ఇంద్రియాలవలె సాధనం లేదా ఒక మేస్త్రీ వంటిది.సుషుప్తిలో మనస్సు లేదు.అయినా ఆత్మ పోయిందనలేదు.
నా మనస్సు-మమకారమే గాని అహం కాదు.స్థిరము-అస్థిరము.
అభాసంతో కూడితేనే మనస్సు
కర్త,భోక్త లేకుంటే జడమే.
ఆత్మకన్నా భిన్నమయినదంతయు మిధ్య.మిధ్యా వస్తువులవలన సత్యమయిన అధిష్ఠానము చెడదు.స్వప్న వృత్తాంతం వలన జాగరణ వృత్తాంతం మారదు.
మిధ్యా సర్పం వలన రజ్జువునకు విషం రాదు.స్వప్నంలో ఎండమావిలో బురద రాదు.కనుక ఆత్మ అసంగం.అది కర్తగా కనబడినా కర్త కాదు.భోక్త కాదు.
కనుక జ్ఞానాత్పూర్వమున్న ఆత్మ బ్రహ్మరూపమే కనుక ఐక్యం సిద్ధము...
మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః ౹
శ్రుతో మనోమయః కోశస్తేనాత్మేతీరితం మనః ౹౹68౹౹
68. జీవుని బంధమోక్షములకు మనస్సే కారణమని శ్రుతి చెప్పును. మనోమయకోశము కూడ శ్రుతియందు చెప్పబడినది కనుక మనస్సే ఆత్మ అని వీరందురు.
వ్యాఖ్య: అమృతబిందు (బ్రహ్మబిందు)ఉప.2;
తైత్తిరీయ ఉ.2.3.1 మనస్సు కూడ ఆత్మ కాదనుటకు చాల కారణములు గలవు.మనస్సు ఉపకారణము మాత్రమే గాఢనిద్రయందు చైతన్యము వలె మనస్సు ఉండదు.
చైతన్యపు ప్రతిఫలనము వలన మాత్రమే మనస్సు భోక్తయగుచున్నది.స్వతంత్రముగ కాదు.
“నా మనస్సు శాంతముగ ఉన్నది” అనే ప్రయోగమున జ్ఞాతయగు “నేను”మనస్సు కంటె భిన్నము.
మనోనాశము వలన మోక్షము కలుగునని శ్రుతి చెప్పును. కామనాపూర్ణమైన మనస్సు బంధమునకు కారణము.
కామనా రహితమైనచో మోక్షమునకు సహకారి.
ఆకాశములోనికి ఎగురగోరు పక్షి తన గ్రుడ్డుపెంకు(చిప్ప)ను పగురగొట్టి వెలుపలకు వచ్చు విధముగా నీవు నీ వాసనలను పరిత్యజింపుము.అజ్ఞానజనితములగు ఈ వాసనలను నశింపజేయుట కష్టము.మరియు అవి అనంతమగు దుఃఖమును కలిగించును.
అజ్ఞానముతో ఆత్మను పరిమితముగావాంచు ఈ మనోవాసనయే అపరిచ్ఛిన్నమును పరిచ్ఛిన్నముగా జూచును. అయినప్పటికి,
సూర్యుడు మంచును తోలగించు విధముగా,అత్మతత్త్వవిచారణ, అజ్జానముతోఆత్మను పరిమితముగావించు ఈ వాసనను తొలగించును.
విచారణను చేపట్టవలెనను కోరికయే మార్పును కలిగింపజాలి యున్నది.
నిత్యవర్తమానమగు ఆత్మను దేశ,కాలములు ఆవరించుట (కప్పివేయుట)యే మరణము.
దేహము పడనిమ్ము లేక లేవనిమ్ము లేక మరియొక లోకమునకు పోనిమ్ము , నేను దేహమునకు పరిమితుడను కాను.అప్పుడు ఇది అంతయు నన్ను ఎట్లు బాధించును.
దేహము పడినప్పుడు ఆత్మ నశింపదు.
మనస్సు గూడ,ఆత్మజ్ఞానాగ్నిలో దగ్ధమగునంత వరకు నశింపదు.
బాధ నిన్ను స్పృశించక పోయినను,బాధను నీవు అనుభవించుచున్నట్లు అజ్ఞానదశలో మాత్రమే భావించుచున్నావు.
ఈ విషయములు ఆత్మలో వుండవు.
నీవు బద్ధుడవు కావు,అయినను”బద్ధుడను”అని చెప్పుచు ఎందుకు వ్యర్థముగా దుఃఖించుచున్నావు?
ఆత్మతత్త్వము అనంతము;అది ఎందుకు ఎట్లు ఎవని చేత బద్ధమగును?
ఆత్మలో విభాగము లేదు,ఏల అనగా ఇది అంతయు అఖండబ్రహ్మమే.అప్పుడు దేనిని “బంధ”మందురు?,దేనిని “మోక్ష”మందురు?
భావనలు,ఆలోచనలే బంధము. అవి అంతమొందుటే మోక్షము. అందువలన వానినుండి విముక్తుడవయి చేయవలసిన దానిని యాదృచ్ఛికముగా (అప్రయత్నముగా)చేయుము.
“నేను బ్రహ్మము కాను”అను దృఢసంకల్పము వలన మనస్సు బద్ధమగును.
“నేను బ్రహ్మమే”అను దృఢసంకల్పమువలన మనస్సు ముక్తమగును.
వ్యాఖ్య: అమృతబిందు (బ్రహ్మబిందు)ఉప.2;
తైత్తిరీయ ఉ.2.3.1 మనస్సు కూడ ఆత్మ కాదనుటకు చాల కారణములు గలవు.మనస్సు ఉపకారణము మాత్రమే గాఢనిద్రయందు చైతన్యము వలె మనస్సు ఉండదు.....
(సేకరణ)(ఆదిత్యనారాయణ)(తిప్పానా)
యత్నం నా యజ్ఞం
మొసలి నోటనుబడ్డ కరిరాజు మొరలిడగ
బిరాన పరగెత్తి బ్రోచావు, వరదుడవు!
అరుపులే వినబడున? ఆర్తి కనబడదా?
ఏమాయె నీ కరుణ? ఎందుకీ జాగరణ?
ముదుసలిచ్చిన పండ్లు ముదమార తిన్నావు,
యెదలోన చోటిచ్చి ఆదుకున్నావు!
నా కర్మఫలములు పండనే లేదు,
పచ్చి కాయలు స్వామి, నీకెట్ల పెట్టేది?
పాదాల చెంతనే చిత్తాన్ని నాటాను,
పందిరై నీవుంటే పరిపక్వమౌతాను,
ఆత్మ అర్పణ చేసి సంతృప్తి పడతాను!
ఊగు సాయము సేయు ఉడుతనే గమనించి 
ఆదరించానంటూ చేవ్రాలు ఇచ్చావే!
నా లోన కదలికలు కనిపించవా స్వామి?
రాత మార్చను రాకుంటివిదియేమి?
అటుకులిచ్చిన వాడే ఆప్తుడని అంటే, 
అదేం కుదరదు, ఒప్పుకోను, నేనూ నీతో
దాగుడుమూతలాడుతూ దారి తప్పాను!
కాలం కళ్ళు కప్పి నీనుండి వేరుచేసింది,
కలి చేతుల్లోకి కర్కశంగా విసిరివేసింది!
దూరమై విలపిస్తున్నాను,
చేరువవ్వాలని తపిస్తున్నాను!
నాకు తెలిసిందొకటే వేదం, 
ఆర్తి నాదం! 
నాకు తెలిసిందోకటే మంత్రం, 
హరే రామ, హరే కృష్ణ! 
అర్థం చేసుకో తృష్ణ!
============================
🍂 🍂బ్రహ్మ విద్య🍂🍂
 ::"రాజయోగం పై శ్రీ సనారీ విశ్వేశ్వర అవధూత వివరణ"::
శిష్యుడు : గురుదేవా! మీరు వివాహమాడి రాజయోగియై గృహస్థాశ్రమ ధర్మమును
స్వీకరించమంటున్నారు. భార్యతోనే అన్ని బంధములు ఆరంభమగుననుచున్నారు.
యిందలి మర్మము నాకు బోధపడుటలేదు స్వామీ.
సనారీ ఉవాచ:
గీ॥ ఆడదానికి మగడైనవాడుజనుడు, మీసముండినశాక్తేయోపాసకుండు,
నోరుగల్గిన వాదంబు బారుయగును. యిహపరంబంత జూరువాడెందునున్న
సనారీ ఉవాచ: 
శిష్యా బ్రహ్మచర్య వ్రతమాచరించుట చాలా కష్టము. స్త్రీ సంపర్కము లేక గ
పోయిననూ, మనసు చంచలమైన వ్రతభంగమగును. కావున రాజయోగియైయూ
తామరాకు మీద నీటి చందాన సంసారమునంటీ అంటక జీవించుచూ, శక్తిని ఉపాసించి -
యోగసాధన చేసి తరించమన్నారు పెద్దలు. అంటే జనజీవనానికి ధనం కావాలి. 
 ధనాన్ని న్యాయమార్గమున కష్టించి ఆర్జించాలి . కానీ నేరాలు , ఘోరాలు , మోసాలు చేసి జీవించరాదు . భార్యను సహధర్మచారిణిగా స్వీకరించి ఆమెకై తపించరాదు . పిల్లలను -సం ప్రేమతో పెంచి పెద్దచేసి ఒక యింటివారిని చేయాలిగానీ , వారిపై ఆశలు , అతిప్రేమను పెంచుకోరాదు . భవసాగరం దాటుటకు శరీరం కావాలి . కానీ దానిపై మమకారం  పెంచుకోరాదు . అన్ని విషయములందు తామరాకు నీటిలో ఉండియూ , నీరంటుకోనట్లు  ప్రతీవారు సంసారమందుండి , అదే శాశ్వతమని భ్రమించరాదు . ఈ సంసారమనెడు  అడవిలో భార్యయే పెద్దవలగాను , పుత్రులే శత్రువులుగాను ధనమే అగ్నిజ్వాలలుగా యున్నది . ఈ ధనమువలన భార్యా , భర్తలు , తండ్రీ కుమారులు , తోడబుట్టినవారు , -సి స్నేహితులు , బంధువులు విరోధులగుచున్నారు . అజ్ఞానులు అశాశ్వతమగు ధనముకై తాపత్రయ పడుచున్నారు కానీ సత్యము శాశ్వతమగు పరమాత్మను పొందగోరకున్నారు . జ్ఞాని తన స్వజన సౌఖ్యముకై పాటుబడక తన ప్రాణ ప్రయాణమునకు ముక్తి పొందు గుర సాధనలు చేయుచూ , ఈ క్షణమో , కొంతసేపటికో , నేడో రేపో , శరీరము నశించుట తథ్యమని తలంచి మోక్షసాధనకై నిరంతరం యోగసాధనలో ఉండాలి .
 శిష్యుడు : మానవజీవితములో మానవులెట్లు ప్రవర్తించిన శ్రేష్టులగుదురు గురుదేవా ! 
సనారీ ఉవాచ: 
ఆహార నిద్ర మైధునాదులతో నాలుగు కాళ్ళ జంతువులవలే జీవించువారికంటే ,  విగ్రహారాధన చేయువారు శ్రేష్టులు . వీరికంటే నిర్మల బుద్ధిచే పరమాత్మయనెడు మును పరబ్రహ్మమును మనోవాక్కులచే ఆరాధించువారు శ్రేష్టులు , వీరికంటే అంతరాత్మలోగల భగవంతుని తెలుసుకొని ధ్యానించువారు శ్రేష్టులు , వీరికంటే సత్తు చిత్తూ ఆనందమనెడు స్నారు యోగము నెరిగి శరీర స్పృహలేక పరమాత్మలో లీనమైయుండువారు శ్రేష్టులు . వీరికంటే తన్ను తాను మరచి బ్రహ్మానందసాగరమున దేలుచూ భావోన్మతులై శీతోష్ణములనుగానీ , రాత్రింబవళ్ళను , ఎండ వానలను గమనించక ఉండిన చోటునే యుండు మహనీయులను గమనించి , వారికి ఆహారాదులను సమకూర్చి సంరక్షించువారే శ్రేష్టులు . 
 శిష్యుడు గురుదేవా ! యిట్టివారికి స్నాన సంధ్యాదులతో పనిలేదా స్వామీ . 
సనారీ ఉవాచ: 
ఏ జ్ఞానముచే జనన మరణాదులనెడు సముద్రమును దాటి మోక్షమనెడి దరిచేరుచున్నారో , . ఆ జ్ఞానమే వారికి తీర్ధము . జ్ఞానులకు గంగాజలము తీర్థము కాజాలదు . 5 లే సింగ్ జనులెల్లరు జలముచే దేహశుద్ధిచేసుకొనుచున్ననూ , వారి మనసు , బుద్ధి , జీవాత్మ ఈ జలముతో శుద్ధి కాజాలవు . జ్ఞానులకు జ్ఞానతీర్థస్నానము ఆత్మను పరమాత్మ
అందు ఉంచుట...
.
#శ్రీవేదాంత_పంచదశి 
(జీవుని ఆరోహణ క్రమం:విభిన్న మతాల ఖండనము)
మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః ౹
శ్రుతో మనోమయః కోశస్తేనాత్మేతీరితం మనః ౹౹68౹౹
68. జీవుని బంధమోక్షములకు మనస్సే కారణమని శ్రుతి చెప్పును. మనోమయకోశము కూడ శ్రుతియందు చెప్పబడినది కనుక మనస్సే ఆత్మ అని వీరందురు.
వ్యాఖ్య: అమృతబిందు (బ్రహ్మబిందు)ఉప.2;
తైత్తిరీయ ఉ.2.3.1 మనస్సు కూడ ఆత్మ కాదనుటకు చాల కారణములు గలవు.మనస్సు ఉపకారణము మాత్రమే గాఢనిద్రయందు చైతన్యము వలె మనస్సు ఉండదు.
చైతన్యపు ప్రతిఫలనము వలన మాత్రమే మనస్సు భోక్తయగుచున్నది.స్వతంత్రముగ కాదు.
“నా మనస్సు శాంతముగ ఉన్నది” అనే ప్రయోగమున జ్ఞాతయగు “నేను”మనస్సు కంటె భిన్నము.
మనోనాశము వలన మోక్షము కలుగునని శ్రుతి చెప్పును. కామనాపూర్ణమైన మనస్సు బంధమునకు కారణము.
కామనా రహితమైనచో మోక్షమునకు సహకారి.
ఆకాశములోనికి ఎగురగోరు పక్షి తన గ్రుడ్డుపెంకు(చిప్ప)ను పగురగొట్టి వెలుపలకు వచ్చు విధముగా నీవు నీ వాసనలను పరిత్యజింపుము.అజ్ఞానజనితములగు ఈ వాసనలను నశింపజేయుట కష్టము.మరియు అవి అనంతమగు దుఃఖమును కలిగించును.
అజ్ఞానముతో ఆత్మను పరిమితముగావాంచు ఈ మనోవాసనయే అపరిచ్ఛిన్నమును పరిచ్ఛిన్నముగా జూచును. అయినప్పటికి,
సూర్యుడు మంచును తోలగించు విధముగా,అత్మతత్త్వవిచారణ, అజ్జానముతోఆత్మను పరిమితముగావించు ఈ వాసనను తొలగించును.
విచారణను చేపట్టవలెనను కోరికయే మార్పును కలిగింపజాలి యున్నది.
నిత్యవర్తమానమగు ఆత్మను దేశ,కాలములు ఆవరించుట (కప్పివేయుట)యే మరణము.
దేహము పడనిమ్ము లేక లేవనిమ్ము లేక మరియొక లోకమునకు పోనిమ్ము , నేను దేహమునకు పరిమితుడను కాను.అప్పుడు ఇది అంతయు నన్ను ఎట్లు బాధించును.
దేహము పడినప్పుడు ఆత్మ నశింపదు.
మనస్సు గూడ,ఆత్మజ్ఞానాగ్నిలో దగ్ధమగునంత వరకు నశింపదు.
బాధ నిన్ను స్పృశించక పోయినను,బాధను నీవు అనుభవించుచున్నట్లు అజ్ఞానదశలో మాత్రమే భావించుచున్నావు.
ఈ విషయములు ఆత్మలో వుండవు.
నీవు బద్ధుడవు కావు,అయినను”బద్ధుడను”అని చెప్పుచు ఎందుకు వ్యర్థముగా దుఃఖించుచున్నావు?
ఆత్మతత్త్వము అనంతము;అది ఎందుకు ఎట్లు ఎవని చేత బద్ధమగును?
ఆత్మలో విభాగము లేదు,ఏల అనగా ఇది అంతయు అఖండబ్రహ్మమే.అప్పుడు దేనిని “బంధ”మందురు?,దేనిని “మోక్ష”మందురు?
భావనలు,ఆలోచనలే బంధము. అవి అంతమొందుటే మోక్షము. అందువలన వానినుండి విముక్తుడవయి చేయవలసిన దానిని యాదృచ్ఛికముగా (అప్రయత్నముగా)చేయుము.
“నేను బ్రహ్మము కాను”అను దృఢసంకల్పము వలన మనస్సు బద్ధమగును.
“నేను బ్రహ్మమే”అను దృఢసంకల్పమువలన మనస్సు ముక్తమగును.
వ్యాఖ్య: అమృతబిందు (బ్రహ్మబిందు)ఉప.2;
తైత్తిరీయ ఉ.2.3.1 మనస్సు కూడ ఆత్మ కాదనుటకు చాల కారణములు గలవు.మనస్సు ఉపకారణము మాత్రమే గాఢనిద్రయందు చైతన్యము వలె మనస్సు ఉండదు.
వ్యాఖ్య: ఆత్మను గురించి వినుటకు అనేకులకు సాధ్యము కాదు. వినినప్పటికి దానిని సరిగా అర్థము చేసికోలేరు.ఈ ఆత్మజ్ఞానము తర్కము ద్వారా పొందబడజాలదు.
“సద్గురువు”చే ఉపదేశింపబడినపుడే ఇది సులభముగా తెలియును.
క్షణికవాదుల ఈ బుద్ధి క్షణక్షణమునకు మారుచుండు అవస్థల పరంపర.అదే అర్థము చేసుకొను శక్తి.
అది ఆధారముగ మనస్సు బాహ్య విషయములను గ్రహించును.
కఠోపనిషత్తు నందు వలె ఇచ్చట కూడా బుద్ధి అనగా అహంకారము గానూ,మనస్సనగా విషయ బోధగానూ స్వీకరింపబడినవి.
నిశ్చయాత్మకమైనది బుద్ధి,సంకల్పాత్మకమైనది మనస్సు అను అర్థము ఇచ్చట గ్రహింపబడలేదు.
బుద్ధి బ్రహ్మ ప్రతిబింబము యొక్క శక్తిగలిగి యున్నది. మహాభూతంబుల సమిష్టి సత్వగుణాంశము గాబట్టి చేతన(ఆత్మ)ప్రతి బింబమును గ్రహించి చైతన్యము గలదాని వలె తోస్తూ దేహేంద్రియములపై”అహం” బుద్ధి,దేహసంబంధ వస్తువులపై”మమ”బుద్ధి గలిగి యున్నది.
జ్ఞానరూపుడగు ఆత్మ స్ఫూర్తి(ప్రకాశము)తనయందు ప్రసరించుటచేత అనగా ఆత్మ తన యందు ప్రతిబింబించి యుండుటచే,ఈ ఆత్మసాన్నిధ్య బలము వలన మిక్కిలి ప్రకాశించుచున్నది.
సూర్యరశ్మి యందున్న స్పటికము వలె ప్రకాశించుచున్నదని అర్థము. ఇట్లు ఆత్మప్రకాశ వ్యాప్తిచే కార్యకారి యగుచున్నది.
ఆత్మతో సమానముగా అంటే”ఇదియే ఆత్మ”అను బుద్ధిని జనింప జేయుచు ప్రకాశించుచున్నది.
కార్యమునుండి అనగా కర్తృత్వము నుండి,తన స్వరూపమును వేరు జేసుకొన శక్తిలేని అసమర్థులు ఈ దేహము “నేనే” యనియు,
సర్వ కర్మలకు దేహము చేత చేయబడు “నేనే” కర్తననియు భావించుచున్నారు.
ఈ ప్రకారము అంతఃకరణము యొక్క కర్తృత్వ బుద్ధి మొదలుకొని స్థూల దేహము వరకు,ఈ స్థులదేహమునకు బాహ్యమైన విషయ ప్రపంచమును ఇవన్నియును,దృశ్యములై వాటి స్థిరత్వ అస్థిరత్వములతో తెలియుచుండుటచే “నేను”దృక్స్వరూపుడననియు,ఇవి నాకు దృశ్యములనియు వివేకముతో విభజించి తెలియవలెను.
“నేను” అనెడి భావము మొదలుకొని “ఇది” అనెడు రూపంలో యుండు సమస్త దృశ్యజాలంబు
ఆత్మ కాదని(నేను కాదని) నిషేధించినప్పుడు మాత్రమే తన స్వస్వరూపంబును తెలియగలదు.
సమస్త వేదములు ఏ వస్తువును లక్ష్యంగా చెప్పుచున్నవో, తపస్సులన్నీ ఏ వస్తువును పొందుటయే ప్రయోజనములుగా గలిగి ఆచరింపబడుచున్నవో,ఏ వస్తువును కోరి బ్రహ్మచర్యము నవలంబించుచున్నారో,అట్టి
అక్షర పరబ్రహ్మమును తెలిసికొనిన వాడు జీవితమార్గము యొక్క గమ్యమగు విష్ణు పదమును (సర్వవ్యాపక బ్రహ్మపదమును) చేరుచున్నాడు...
--------------------------------------------------------
(సేకరణ)(ఆదిత్యనారాయణ)(తిప్పానా)
(కొనసాగింపు)
(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల వాదోపవాదనలు)
ప్రధాన క్షేత్రజ్ఞ పతిర్గుణేశ ఇతి హి శ్రుతిః ౹
అరణ్యకేఽ సంభ్రమేణ హ్యంతర్యామ్యుపపాదితః ౹౹103౹౹
103. ఈశ్వరుడు జీవులకు ప్రకృతికి ప్రభువనీ గుణములను కూడా నియమించుననీ శ్రుతి ప్రకటించును.అరణ్యకమున ఈశ్వరుడు అంతర్యామి అని వర్ణింపబడెను.
వ్యాఖ్య :శ్వేతాశ్వర ఉప.6.14;
బృహదారణ్యక ఉప.3.7;
కఠ ఉప.2.33.సాంఖ్యుల మతమున పురుష సాన్నిధ్య మాత్రమున ప్రకృతి పరిణామము నొందును.యోగులమతమున ఈశ్వరుడు ప్రకృతిని నియమించును.
శుద్ధ బ్రహ్మము అసంగము, అక్రియము.అది సృష్టి చేయదు అది చతుష్పాత్తు అనగా పరిపూర్ణము.అందువలన మాయా విశిష్టుడయిన ఈశ్వరుడు అవసరం.ఆయనయే జగత్కర్త.
మాయ:ఇది శుద్ధ చైతన్యము నాశ్రయించిన పాదమాత్ర ప్రమాణమయినది.
శుద్ధ చైతన్యమనగా జీవ-ఈశ్వర భేదం లేనిది.మాయ-అనాది.
దీని ప్రభావము వలననే
జీవ-ఈశ్వర భేదం సిద్ధించింది.కనుక వారినుండి మాయ పుట్టలేదు.
మిగిలినది శుద్ధ చైతన్యము.అది నిర్వికారము.దాని వలన మాయ పుట్టిందనరాదు.అంటే అది కర్తృత్వం మొదలయిన గుణాల వలన సవికారం అవుతుంది.పైగా మోక్ష సమయంలోనూ మాయ ఉన్నట్లు అవుతుంది.శుద్ధ చైతన్యం గదా మన స్వరూపము.అపుడు గూడా మాయ ఉన్నదంటే మోక్షము వ్యర్థమవుతుంది.కనుక మాయ అనాది.
నిర్వికార శుద్ధ బ్రహ్మమునుండి జగదుత్పత్తి అగుటలేదు.ఏలనగా శుద్ధ బ్రహ్మము అసంగముగను క్రియారహితముగను యున్నది.ఈ అనాది శుద్ధ బ్రహ్మములో అనాది కల్పిత మాయ ఉంది.
ఈ మాయకు బ్రహ్మముతో అనాది కల్పిత సంబంధం ఉన్నది. కేవలము ఈ కల్పిత మాయనుండియు జగదుత్పత్తి జరగదు.కాన బ్రహ్మము మాయ ఈ రెండింటి కల్పిత సంబంధముచే శుద్ధబ్రహ్మము,సర్వజ్ఞుడు మరియు ఈశ్వరుడుగా పిలవబడుచున్నాడు.
ఈ మాయావిశిష్టుడైన ఈశ్వరుని యొద్దనుండి జగదుత్పత్తియగు చున్నది.కాన మాయ -ఈశ్వరుడు-భోక్తయైన జీవుడు-సృష్టి విధానము వీని స్వరూపములను ప్రతిపాదించడం జరుగుచున్నది.
అత్రాపి కలహాయన్తే వాదినః స్వస్వయుక్తిభిః ౹
వాఖ్యాన్యపి యథాప్రజ్ఞం దార్ఢ్యాయోదాహరన్తి హి ౹౹104౹౹
104. ఈశ్వరుని విషయమున కూడా వివిధ తాత్త్వికులు తమ తమ తర్కములచే వివిధ వాదములతో కలహింతురు.తమ తమ ప్రతిభకు తగినట్లు శ్రుతి వాక్యములను కూడా దార్ఢ్యార్థము ఉటంకింతురు.
క్లేశకర్మవిపాకైస్తదాశయై రప్యసంయుతః ౹
పుంవిశేషో భవేదీశో జీవవత్సోఽ ప్యసంగచిత్ ౹౹105౹౹
105. యోగసూత్రకారుడైన పతంజలి మతమున ఈశ్వరుడు క్లేశకర్మ విపాక ఆశయములు స్పర్శింపని ఒక విశిష్ట పురుషుడు. పురుషుల వలనే ఈశ్వరుడు అసంగుడు చిద్రూపుడు.
వ్యాఖ్య: యోగసూత్రముల సమాధి పాదము సూ.24.
అవిద్యా,అస్మితా,రాగద్వేషములు, అభినివేశము అనునవి అయిదు క్లేశములు.
శుక్లము,కృష్ణము,శుక్లకృష్ణము అని కర్మ మూడు విధములు (పుణ్య,పాప,పుణ్యపాపమిశ్రమ కర్మ)
జాతి,ఆయువు,భోగము అనునవి మూడు విపాకములు.
ఆశయమనగా సంస్కారములు.
సాంఖ్యులకు యోగులకును పురుషుడు భోక్త మాత్రమే కర్తకాడు.కర్తృత్వము సుఖదుఃఖములు ప్రకృతి వికారమగు బుద్ధి లక్షణములు.
బుద్ధితో తాదాత్మ్యము వలన పురుషుడు తానే కర్తయని భ్రమించును.సమాధి ద్వారా తన భిన్నత్వమును తెలిసికొని మోక్షము నొందును.
పురుషుడు(ఆత్మ) స్వాభావికంగా
అసంగుడు.అసంగ వస్తువనగా ఏదైతే దేనియందుగూడి యున్నప్పటికీ తన అసంగత్వమును వీడదో అది అసంగవస్తు వనబడును.
స్వస్వరూపమైన ఆత్మ,
కల్పిత వస్తువులయిన అహంకారం మొదులుకొని స్థూలదేహ పర్యంతము కల్పిత అభిమానంబుతో
“నేను నేను”అని,ఉన్నప్పటికి తన అసంగత్వమును వీడలేదు.
కాన సంగత్వము మాయికమని తెలియ వలయును.
ఆత్మకు సంగత్వము సత్యమే అగుచో మోక్షము వచ్చుటకే వీలు లేదు.కాన సంగత్వము అసత్యమైనందుననే “తత్త్వమసి” ఇత్యాదిశ్రుతులు నీవే బ్రహ్మమని తేల్చుచున్నవి.
 (ఇంకా ఉంది)
.(కొనసాగింపు)
(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల వాదోపవాదనలు)
గూఢం చైతన్యముత్ర్పేక్ష్య జడబోధ స్వరూపతామ్ ౹
ఆత్మనో బ్రువతే భాట్టాశ్చదుత్ర్పేక్షోత్థిత స్మృతేః౹౹95౹౹
95. భాట్ట మీమాంసకులు ఆత్మయందు చైతన్యము గూఢమై ఉన్నదనీ స్వరూపమున అది చేతనము,అచేతనము కూడా అనీ అందురు. మేలుకొనిన పురుషుడు తన గాఢనిద్రను స్మరించుటను బట్టి వీరిట్లు నిశ్చయింతురు.
జడో భూత్వా తదాఽ స్వాప్సమితి జాడ్యస్మృతిస్తదా ౹
వినా జాడ్యాను భూతిం న కథఞ్చిదుపద్యతే ౹౹96౹౹
96. “జడుని వలె నిద్రించితిని”అనే స్మరణ అట్టి జడత్వపు అనుభవము ఉండుట చేతనే సంభవము.కాని ఒక చైతన్యాంశము లేనిదే ఇట్టి అచేతనా అనుభవపు స్మరణ సిద్ధింపదు.కనుక ఆత్మ చేతనము అచేతనము కూడా.
ద్రష్టుర్దృ ష్టేరలోపశ్చ శ్రుతః సుప్తౌ తతస్త్వయమ్ ౹
అప్రకాశ ప్రకాశాభ్యామాత్మా ఖద్యోతవద్యుతః ౹౹97౹౹
97. నిద్రయందు ద్రష్ట గాని దృష్టి గాని లోపింపవు.(బృహదారణ్యక ఉప.4.3.23)అనే శ్రుతివాక్యమును చూపుచు వారు మిణుగురు పురుగు వలె ఆత్మ ప్రకాశము అప్రకాశము కూడా అని చెప్పుదురు.
నిరంశ స్యోభయాత్మాత్వం న కథఞ్చిద్ఘటిష్యతే ౹
తేన చిద్రూప ఏవాత్మేత్యాహుః సాంఖ్యవివేకినః ౹౹98౹౹
98. నిరవయవమగు ఆత్మ రెండూ,చేతనము అచేతనము కూడా,అగుట ఏ విధముగనైనను సంభవింపదు.ఆత్మ చిద్రూపము మాత్రమే అని సాంఖ్యులు వాదింతురు.
వ్యాఖ్య: షడ్దర్శనములలో అయిదవదగు పూర్వ మీమాంసయందు రెండు సంప్రదాయములు గలవు.
ప్రభాకర సంప్రదాయము,
కుమారిల భట్టు సంప్రదాయము. వీరినే సంగ్రహముగ భాట్టులని వ్యవహరింతురు.
ఆరవదగు ఉత్తర మీమాంసయే వేదాంతము.
కొన్ని స్థితులయందు చైతన్యము ఆవృతమై ఉండునని భాట్టుల నిర్ణయము.
ఆత్మ విజ్ఞానఘనమని శ్రుతి వాక్యము.
అందు అచేెతనమునకు స్థానము లేదు.నిద్రయందలి జడత్వమును స్మరించుట, జడమగు విషయమును,మాయను,
అనుభవించుట చేత.
ఆత్మ యొక్క జడత్వమును అనుభవించి కాదు.
కనుక భాట్టుల వాదము సమీచీనము కాదు.
ఆదిత్యుని కిరణములు చంద్రుని యందు ప్రతిఫలించి వెన్నెల కాంతి ద్వారా రాత్రుల యందలి చీకటిని పోగొట్టును.ఆ కిరణములే గృహము నందలి కంచు పాత్రపై బడి గృహమును గూడా వెలుగుతో నింపును.
అలాగే ఆత్మ చైతన్యము బుద్ధియందు ప్రతిఫలించి తద్వారా ఇంద్రియములను,ఇంద్రియముల ద్వారా బాహ్య వస్తువులను ప్రకాశింపజేయుచున్నది.
కావున జగత్తునందలి సమస్త పదార్థములను చైతన్య స్వరూపమైన ఆత్మ ప్రకాశింప జేయుట వలన ఆత్మ చిద్రూపంబని చెప్పబడుచున్నది.
అట్లే ఆత్మయైన తాను జాగ్రత్స్వప్న సుషుప్తు లనెడు త్రివిధావస్థల నెరుగు చుండుటచే తానే చిద్రూపాత్మయై యున్నాడు. జాగ్రత్స్వప్నములలో తప్ప సుషుప్తియందు ఆత్మ దేనినీ గూడ తెలిసికొనదుగాన జడమని నిశ్చయించగూడదు.
సుషుప్తి యందు ఏ వస్తువును గూడా తెలిసికొనలేదు అని తెలుపు జ్ఞానమైనను అచ్చట ఉన్నది కదా!
లేనిచో సుషుప్తి యందు ఏమియు తెలియలేదు అని తెలిసికొనిన
దెవరు?
వెలుగు చున్న దీపమును ఆకాశము వైపు తిప్పినప్పుడు అచ్చట ప్రకాశింపజేయుటకు రెండవ వస్తువు లేనప్పటికిని దీపము తనంతట తాను ప్రకాశించుచునే యుండునట్లు, సుషుప్తి యందు తెలిసికొనుటకు రెండవ పదార్థము లేకున్నను తాను మాత్రము కేవల చైతన్య స్వరుపుడై యున్నాడు. సుషుప్తియందు ఆత్మయైన తాను ప్రకాశరూపుడై యుండుటచేత అప్రకాశమైన అజ్ఞానము(తెలియని తనం) లేనే లేదు.
జ్యోతి స్వరూపుడగుటచే సూర్యునికి అంధకారములేనియట్లు,నిత్య బోధ స్వరూపుడైన ఆత్మకు అజ్ఞానము సర్వదా లేదు.
కావున అవస్థలు ఉన్నప్పుడు ఉన్నవని,లేనప్పుడు లేవని తెలియుతాను చిద్రూపుడై యున్నాడు.
అట్లే బాల్య యౌవ్వన వార్థక్యములను ప్రాతర్మధ్యాహ్న సాయంకాలములను,పగలు రాత్రి సంధ్యాకాలములను,వార పక్ష మాస బుతు సంవత్సరయుగ మన్వంతర కల్పములను,ఇంతకు ముందు ఇప్పటి రాబోవు దేహాలను,భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఈ సర్వమును ఒకే రీతిలో ఎట్టి మార్పును లేక ఆత్మ అయిన తాను తెలియు చుండుట వలన చిద్రూపుడై యున్నాడు.
కావున శ్రుతియందు
“ప్రజ్ఞానం బ్రహ్మ”
(ఐతరేయ-ఉప-3-3)మని చెప్పంబడినది.
జాడ్యాంశః ప్రకృతే రూపం వికారి త్రిగుణం చ తత్ ౹
చితో భోగాపవర్గార్థం ప్రకృతిః సా ప్రవర్తతే ౹౹99౹౹
99. జడత్వము ప్రకృతి స్వభావము.అది పరిణామ శీలము,త్రిగుణాత్మకము.
చిద్రూపుడగు పురుషుని భోగము (అనుభవము)అపవర్గము
(మోక్షము)కొరకు ప్రకృతి పనిచేయును.
అసంగాయాశ్చితేర్బంధమోక్షౌ భేదాగ్రహాన్మతౌ ౹
బంధముక్తి వ్యవస్థార్థం పూర్వేషామివ చిద్భిదా ౹౹100౹౹
100. పురుషుడు సంగరహితుడు పరిశుద్ధుడు అయినను ప్రకృతి పురుషుల భేద జ్ఞానము లేక, ప్రకృతియే తానని భ్రమపడి, పురుషుడు బంధమునకు లోనగుచున్నాడు.ఆ బేధజ్ఞానము కలిగినంతనే మోక్షము లభించును. ఈ బంధమోక్షముల వ్యవస్థ కొరకు నైయాయికులు మొదలగు వారివలనే సాంఖ్యులు అసంఖ్యాక పురుషులను ప్రతిపాదింతురు...
(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల వాదోపవాదనలు)
మహతః పరమవ్యక్తమితి ప్రకృతిరుచ్యతే ౹
శ్రుతావసజ్గతా తద్వదసజ్గోహీత్యతః స్ఫూటా ౹౹101౹౹
101. అవ్యక్తమగు ప్రకృతి వ్యక్తప్రకృతియగు మహత్తు కంటే భిన్నమనీ ఆత్మ అసంగమనీ చెప్పు శ్రుతిని వారు ప్రమాణీకరింతురు. సత్త్వరజస్తమోగుణాత్మకమైన ప్రకృతి పురుషుని బంధమోక్షములను కల్పించునని సాంఖ్యవాదము.
కఠ ఉప.1.3.11;
బృహదారణ్యక ఉప.4.3.15, 4.4.22. గుణములు సామ్యావస్థయందుండుట ప్రకృతి స్వభావము.అది చెదరినపుడు సృష్టి ప్రారంభమగును.జడమగు ప్రకృతి తానంతట తానే ఎట్లు చెదరగరదు? అసంగుడగు పురుషుడు ఎట్లు ప్రకృతిని చెదరగొట్ట గలడు?
రెండవది,పురుషులు అసంఖ్యాకులై ప్రకృతి శాశ్వతమైనచో వాని మధ్య ఏదోక సంబంధము కల్పింప వలసి వచ్చును.సంబంధమేర్పడి నంతనే పురుషుని అసంగత్వము భంగపడును.ఇట్లు సాంఖ్యులవాదము కూడా సరికాదు.వేదాంతవాదమున ఆత్మ సత్ చిత్ ఆనందస్వరూపమని ప్రథమ ప్రకరణముననే నిరూపింప బడినది.(1.10)
ప్రకృతి అంటే సత్త్వం,రజస్సు,తమస్సు అనే మూడు గుణాల సామ్యావస్థ.ఈ గుణాల పరస్పర కలయిక చేత దృశ్యమాన జగత్తు ఏర్పడుతొంది. కాని అవి తెలుపు నలుపు వంటి గుణములు కావు.పాలు,ఇనుము వంటి ద్రవ్యాలు కావు.
సత్త్వమంటే జ్ఞానశీలత,రజస్సు క్రియాశీలత,తమస్సు స్థితిశీలత.
జీవుడు,జగత్తు,ఈశ్వరుడు అనే వ్యవహారానికి మూల కారణంగా ప్రకృతి ప్రతిపాదించబడుతొంది. బ్రహ్మం కంటే భిన్నమైన సత్త ప్రకృతికి లేదు.అది బ్రహ్మము నుండి పుట్టినది కూడా కాదు.కాని ప్రకృతిని తీసివేస్తే సృష్టికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు ఉత్తరం లేదు.
ఇట్టి ప్రకృతిలో బ్రహ్మం “ప్రతిబింబించుట”…అంటే ఇది ఊహకు అతీతమైన విషయాన్ని మాటలలో చెప్పే ప్రయత్నమనే గ్రహించాలి.బ్రహ్మంలో
“సృష్టింప వలెననే ఇచ్ఛ కలుగుట” మొదలైనవన్నీ ఇట్టి ప్రయత్నాలే.ఈ విషయం గుర్తించుకుంటే తత్త్వగ్రహణం సులభతరమవుతుంది.
ఆత్మ సర్వదా ఆనందస్వరూపుడు.దుఃఖము కొంచమైనయూ లేదు. విషయముల వలన కలుగు ఆనందము క్షణికమై యున్నది. విషయజనితమైన ఆనందము నిజమునకు ఆత్మదే.అయినను భ్రాంతి వశంబున విషయముల వలన ప్రతీతమై నట్లు తోచుచున్నది.
ఆత్మయొక్క పరమానంద స్వరూపం తెలిసినచో తుచ్ఛ విషయాలలో,అవి కలిగించే క్షణికానందాలలో ఎవరికీ ప్రేమ ఉండదు.
“అహం బ్రహ్మస్మి”అనెడు జ్ఞానంబు గూడా అంతః కరణ వృత్తికి సంబంధించినదే, అయినను ఇది ఆత్మ జ్ఞానంగా చెప్పబడును.
ఎట్లనగా పాదములో గ్రుచ్చుకున్న ముల్లు తీసి వేయుటకు మరియొక ముల్లు వాడుదుము.ఇవి రెండూ ముండ్లే.అయినను మొదటి ముల్లు బాధను గలిగించినది.రెండవ ముల్లు బాధను పోగొట్టినది.
అట్లే”దేహాదులే నేను”అనియెడు వృత్తి రాగద్వేష సహిత సంసారము గలిగిస్తున్నది గాన ఇది ప్రవృత్తి అని చెప్పబడుచున్నది. “బ్రహ్మమే నేను”అనియెడు వృత్తి రాగద్వేష రహితమైన “బ్రహ్మప్రాప్తి” అనెడు మోక్షంబు కల్గించుటచే నివృత్తి రూపమైన” ఆత్మజ్ఞానంబుగా” చెప్పబడుచున్నది.
స్వరూపము తెలియని అజ్ఞాన సమయంలో(స్వరూపము తెలియని కాలములో)ఆత్మయందు మిథ్యయై యుండియు సత్యముగా ఉన్నట్లు తోచెడు ఈ దేహాంద్రియాది ప్రపంచము,స్వరూపజ్ఞానము కలిగిన వెంటనే అసత్తై మిథ్యయై కనబడును.
అధిష్టానమందు తోచెడు అధ్వస్త మయినది ఏదియు ఆధిష్టానము కంటే వేరుగా ఉండుటకు వీలు లేదు అనెడు నియమము ననుసరించి అధిష్టానమైన ఆత్మయందు అధ్వస్తమై కన్పించు ఈ దేహేంద్రియాదులు ఆత్మజ్ఞానికి దగ్దపట న్యాయంగా ఉండి మరణ కాలంలో వాటికి అధిష్టానంగా తానే గా వున్న తనయందే లయించిపోవును.అంతదనుక కేవల సాక్షి మాత్రుడై యుండును.....
.
“సమాజాన్ని బంధించేది ధర్మం. సమాజాన్ని విభజించి, భాగాలుగా విడగొట్టి, ఒకరితో ఒకరు పోరాడేలా చేసేది అధర్మం (మతం). ధర్మం అంటే పరమాత్మను గ్రహించి, జీవితంలోని ప్రతి చిన్న పనిలోనూ ఆ పరమాత్మను మనస్సులో ఉంచుకుని ప్రవర్తించడం తప్ప మరొకటి కాదు. మీరు అలా చేయగలిగితే, మీరు ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. ఇతర ఆసక్తులు మీలో వ్యాపించి ఉంటే మరియు మీరు మీ మనస్సును ఇతర ప్రాంతాలకు అనువదించడానికి ప్రయత్నిస్తే, మీరు విశ్వాసి అని మీరు భావించినప్పటికీ, మీరు నిజమైన విశ్వాసి కాలేరు. నిజమైన భగవంతుడిని విశ్వసించే వ్యక్తి తన హృదయాన్ని ఎల్లప్పుడూ ధర్మం వైపు మళ్లించుకుంటాడు.
స్వామి శివానంద ప్రకారం,
“హిందూ మతం మనిషి యొక్క హేతుబద్ధమైన మనస్సుకు సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తుంది. మానవ హేతు స్వాతంత్ర్యం, ఆలోచనా స్వాతంత్య్రం, భావాలు మరియు మనిషి యొక్క సంకల్పం యొక్క స్వేచ్ఛపై ఇది ఎప్పుడూ అనవసరమైన నియంత్రణను కోరదు. హిందూ మతం అనేది స్వేచ్ఛ యొక్క మతం, విశ్వాసం మరియు ఆరాధన విషయాలలో స్వేచ్ఛ యొక్క విస్తృత అంచుని అనుమతిస్తుంది. ఇది భగవంతుని స్వభావం, ఆత్మ, ఆరాధన రూపం, సృష్టి మరియు జీవిత లక్ష్యం వంటి ప్రశ్నలకు సంబంధించి మానవ హేతువు మరియు హృదయం యొక్క సంపూర్ణ స్వేచ్ఛను అనుమతిస్తుంది. నిర్దిష్ట సిద్ధాంతాలను లేదా ఆరాధనా విధానాలను అంగీకరించమని ఇది ఎవరినీ బలవంతం చేయదు. ఇది ప్రతి ఒక్కరినీ ప్రతిబింబించడానికి, పరిశోధించడానికి, విచారించడానికి మరియు ఆలోచించడానికి అనుమతిస్తుంది...
(  ఉన్నవే కాని కనిపించకుండా ఉన్నాయి. )
( చీకటి )  ఉన్న వస్తువును కనిపించకుండా చేస్తుంది
( మాయ )
నిత్య సత్యమైన పరబ్రహ్మాన్ని తెలుసుకోకుండా అడ్డు పడుతుంది 
చీకటి పోవాలి అంటే వెలుతురు రావాలి 
వెలుతురు వస్తే తప్ప వస్తువులు కనిపించవు 
అలాగే మాయ తొలగాలి అంటే జ్ఞానం కలగాలి 
జ్ఞానం కలిగితే మాయ తొలగి 
సత్య వస్తువు దర్శనం అవుతుంది.
.
వస్తువులు ఉన్నాయి కానీ 
తెలియకుండా ఉన్నాయి  చీకటి వల్ల 
సత్య వస్తువు ఉన్నది 
తెలియకుండా ఉన్నది అజ్ఞానం వల్ల...
#శ్రీవేదాంత_పంచదశి
ఆరవ ప్రకరణము: కూటస్థ దీప ప్రకరణం
కూటస్థే కల్పితా బుద్ధిస్తత్ర చిత్ర్పతిబింబకః ౹
ప్రాణానాం ధారణాజ్జీవః సంసారేణ స యుజ్యతే ౹౹23౹౹
23. కూటస్థ చైతన్యముపై బుద్ధి ఆరోపింపబడుచున్నది.బుద్ధి యందు ప్రతిఫలించిన చైతన్యము ప్రాణములను ధరించుటచే జీవుడనబడు చున్నది.
ఈ జీవుడు జన్మమృత్యురూపమైన సంసారమున బద్ధుడగుచున్నాడు.
వాఖ్య: చైతన్యమునకు ఆద్యంతములు లేవనుట స్పష్టము. కానీ జననమరణములకు లోనగుచున్న చైతన్యమును చూడక మనకు తప్పుట లేదు. కనుక జన్మమృత్యు లక్షణమైన చైతన్యము వాస్తవ చైతన్యము కాదనీ అది చైతన్యాభాసమనీ సిద్ధాంతము చేయబడినది. ప్రాణములతో కూడిన ఈ చైతన్యాభాసకే జీవుడని పేరు.
అభాసవాదమనగా మాయకు అధిష్టానమై,మాయయందు శుద్ధ చైతన్యాభాసము జీవుడు.
నేను జీవుడను దేహము నాది కళత్ర పుత్రాదులు నావారు ఇట్టి అనాత్మపదార్థముల యధ్యాసను భ్రాంతిని మోహమును త్యజించవలెను.ఈ అధ్యాస అభాసరూపమైనది.సత్యము కాదు.
అవిద్యాకార్యమేమన,లేనిదానిని ఉన్నట్లు కల్పించుటయగును. ఇదియే అభాసమగును.ఈ అభాసమెట్టిదనగా,
ఒకానొకడు స్వగ్రామమును వదలి మరియొక గ్రామమునకు వెళ్ళేను.అచ్చట నున్న వస్తు సందోహముచేతను కొంతకాలముండుటచేతనూ జన సంసర్గము చేతను మూఢుడగుటచే తన గ్రామమును మరిచెను.
అందుచే తానెచ్చటనుండి వచ్చినదియు స్మృతికి రాకపోయెను.
తర్వాత అతని గ్రామములో నున్న యొకానొక ఆప్తుడు వచ్చి యా మూఢునికి తనగ్రామమును తన విశ్రాంతి ధామమును గుర్తుపరచెను. తర్వాత స్వగ్రామమును దెలిసికొని వాడు
సుఖి యాయెను.
గ్రామాంతరమనునది మధ్యలో వచ్చినది.ఆలాగున జీవుడను వ్యవహారము మధ్యలో వచ్చినది. ఈ జీవత్వము,నేను జీవుడను అనునది అధ్యాస(కల్పితము).
జీవేశ్వరులనగా మాయాభాసులు.
వారిద్దరిచేతనే జగదుత్పత్తి యాయెను.జీవత్వ ఈశ్వరత్వ వ్యవహారములు కల్పితములు. అభాసమనగా నిజముగా తోచునది,విచారించిన లేనిది.
పరబ్రహ్మము నిర్విషయము, నిర్వికారము కానీ స్థూల సూక్ష్మదేహములు రెండూ కూడా ఆరోపింపబడుచున్నాయి.
స్పష్టమగు దృష్టివలన అవగాహన వలన విచారణ వలన భ్రాంతితో గూడిన అవగాహన అదృశ్యమగును.
నిర్వికారమైన చైతన్యమే కూటస్థము.
పట్టువిడువని ఆలోచనవలన సూక్ష్మశరీరము స్థూలభౌతిక శరీరమగును.
దృఢమయిన జ్ఞానాభ్యాసముచేత
పదార్థము-మనస్సు,
స్థూలము-సూక్ష్మము
ఒకే అపరిచ్ఛిన్న చైతన్యమని చక్కగా అవగతమగునంతవరకు వివేకవంతుడగు సాధకుడు వానిని నిర్మలముగావించుటకు గట్టిగా ప్రయత్నింపవలెను.
దృశ్యము శుద్ధ(కేవల) చైతన్యముగా కనిపించునప్పుడు, అది స్వప్నముతో సమానమగును. అగ్నిలో వేయబడిన సమస్తము ఒకే బూడిదయగునట్లు సర్వదశలు ప్రపంచ దృశ్యముగూడ జ్ఞానాగ్నివలన ఒక్కటిగా కుదింపబడును.
చైతన్యమే ఈ స్థూలప్రపంచముగా అగుపించుచున్నది.దీనిని అవగతము గావించుకొన్నప్పుడు పదార్థమున్నదను నమ్మకము తొలగును.
అట్టి జ్ఞాని సంసారమును దాటి సర్వకర్మలను అంతమొందించుకొనును.
జలవ్యోమ్నా ఘటాకాశో యథా సర్వస్తిరోహితః ౹
తథా జీవేన కూటస్థః సోఽ న్యోన్యాధ్యాస ఉచ్యతే ౹౹24౹౹
24.జలాకాశముచే ఘటాకాశము సంపూర్ణముగా ఆవరింపబడి కనిపింప కుండునట్లు జీవునిచే కూటస్థము సర్వదా ఆవరింపబడి గోచరింపక ఉండును.వీనినే అన్నోన్యాధ్యాస అని అంటారు.
అయం జీవో న కూటస్థం వివినక్తి కదాచన ౹
అనాది రవివేకోఽ యం మూలాఽ విద్యేతి గమ్యతామ్ ౹౹25౹౹
25. ఈ అన్నోన్యాధ్యాస ఫలముగా జీవుడు ఎన్నటికిని కూటస్థమును గూర్చి వివేచింపక ఉండును.ఈ అవివేకము అనాదియైనది.దీనినే మూలావిద్య అంటారు...
నిప్పుల కొలిమి నా దేహం..
చండ్ర బొగ్గుల్లో సల సలా కాలుతుంటే
ఎగిసే అగ్గి కణాలు  కొన్ని..
రాలి బూడిదయ్యేవి ఇంకొన్ని.. ఏందిరా ఈ మాయ
ఎరిగి ఎరగనట్టు తెలిసి తెలియనట్లు...
బుర్ర తొర్రలో మోసిన పాపాలకు
చితి కాష్టమే చివరి దశా..!?
తోలు బట్ట తొమ్మిది ద్వారాల ఎముకల గూడు 
కాలి  బూడిదౌతుంటే  
చలి కాచుకునే వాడా...నిత్యాగ్నిహోత్రుడవు నీవు..
నీకు హారతేలరా శ్మశాన నివాసా..
ఎన్ని జన్మలవో నా పాపాల పుర్రెలు ఎనక్కి వెళ్లి ఏరుకొచ్చాను నీకై కఫాల మాలలు వేసేందుకు..
వరాలిచ్చే వాడివి నీకేమివ్వగలను
వీభూదితో అభిషేకించటం తప్ప..
కనక పుష్యరాగాలు కోరనిడువాడవు..
అలంకార  ప్రియుడవు అసలే కావు..
బాజా బజంత్రీలు కోరవు
ఢమరుకం నాదం చాలంటావు..నీలకంఠుడవు నీవు.
ఉదయం సాయంత్రాలు ఎక్కడున్నాయి...!?
చీకిటి పడి తెల్లారాక మరో రోజు ఉందనేది
ఎంత అబద్ధమో..! 
కాలమనే కనికట్టు చెట్టు క్రింద నీడెండల్లే
నేడు రేపు రాత్రి పగలు ..!
నిరంతరం నీ నామమే స్మరిస్తుంటే
 కాలమెక్కడుంది నాకు....!?  
అయినా యుగాలుగా ఎదురుచూస్తున్నా నీకోసం
ఇంకా రావేందుకు.. ఇది కలనా మాయా..?
చెట్టు క్రింద ఉన్న నీడ
ఆ..చెట్టు దాటాక ఉంటుందా..!?
అంటాడు నాలోని ఉన్న ఇంకొకడు..
వేలకోట్ల ప్రశ్నలు నాలోనుండే నన్ను వేధిస్తుంటే.. సమాధానం ఎక్కడ దొరుకుతుంది సమాధి అయ్యాకా..!?
ఎంతమందో అంతః శత్రువులు నాకు..
నాతో నేనే నిరంతరం  పోరాడే యోధుడిని.. 
గుణాపాలను కాల్చి గుండె పై
ఎవరో  పచ్చబొట్టు పొడుస్తున్నారు
 పరమేశ్వర అంటూ..నొప్పెక్కడిది నాకు..
నాలుక పాయసం తాకినట్లుంటే...!
నా కథ ముగిసే దాకా..!?
నాలో చిమ్ముతున్న ఆశలన్నీ
ఎండిపోని మురికి కూపాలేనా..?
నా సొద ఎన్నటికీ తీరేది కాదు
బాహ్యపు అగాధాల్లో నుండి బయట రానంత వరకు
నాలో రేగుతున్న కోర్కెలన్నీ
నవ రంధ్రాల ఊటలేనా..?
మారరా నాలో ఉన్న  ఓ మర మనిషి ఇకనైనా..
నేను నేను అంటూ నీలుగుతున్నావు 
ఆ “నేను " అనే పదర్దాన్ని నిలబెట్టింది..
వెనుకున్న వెన్నుముకేరా..
సప్త చక్ర సమూహాలకు సారథి..
నిన్ను భవ బంధాల నుండీ దాటించే వారధి..
నీలోనే ఉండే ఆ.. నిజం ఎప్పుడు తెలుసుకుంటావు..!? జ్ఞానచక్షువుతో తప్ప బాహ్య బోధనలు
ఎన్ని విన్నా  నీలో ఉన్న తేజోమూర్తిని
నీవు తెలుసుకోలేవు..
నిత్యానందమయుడు నీతోనే ఉన్నాడు చూడు..జాగురుకుడవై...
నడి రేయి ఆదమరచి నిదరోయే వేళ  దరి చేరి
కంటికి రెప్పలా నన్ను కాపలా కాసేవాడు
  జోల పాడి జొకొట్టే  వాడు 
ముల్లోకాలను ఏలె ముక్కంటిశ్వరుడు వాడే
ఒంటరితనం వేదిస్తున్నా బ్రతుకు బారమై బాదిస్తున్నా..
నీ కన్నీటి చుక్కలతో అభిషేకేస్తూ
గొంతెత్తి పిలవరా పరమేశ్వరా అంటూ..
పరిగెత్తకు వస్తాడు..నీ కోసం..
బోళాశంకరుడు వాడు..
నీలా మాయలోడు కాడు..!!
హర హర మహాదేవ్..!
.
'ద్వైత నిరోధమే మోక్షము' అంటే
సుషుప్తిలో ద్వైతనిరోధం మాత్రమే ఉంది.తామస గుణం లో పడి నిద్ర పోయే వారు అందరూ జీవన్ముక్తులు అయి ఉండాలి.
 ద్వైతనిరోధమే మోక్షం కాకూడదా అంటే సమాధిలో ఉన్న యోగికి దోమల బెడద వలన ద్వైతం అప్పుడప్పుడు స్ఫురిస్తూ ఉంటుంది కాబట్టి రాళ్లకు రప్పలకు బొత్తిగా ద్వైతము స్పురించలేదు కాబట్టి యోగి కంటే రాళ్ళు రప్పలే గొప్పవి (అని సిద్ధాంతి పరిహసించడం).... 
ద్వైత నిరోధము స్వస్వరూప జ్ఞానము కలిస్తేనే విడుదల...
.
.
.
గీతలో చెప్పిన కర్మ అనగా ఏమి? ‌
కర్మబంధకమనియు, మోచకమనియు, ననుభయాత్మకమని(ఈ రెండురకములలోఁ జేరనిది)యు మూఁడువిధ ములుగా నున్నది. అందుఫలాభిలాషతోఁ గూడినది బంధకము.నిష్కామమైనది మోచకము. బిక్షాటనాదికమగు కేవలం శారీరక కర్మ అనుభమాత్మకము. (అనగా- బద్ధకమును మోచకమునుగూడ కానిది) 
కేవళము శరీరము నిలచుటమాత్రమే ప్రయోజనముగా గల బిక్షాటన, నదీజలపానాది కర్మననుష్ఠించునట్టి యతి పుణ్యముచే గాని, పాపముచేగాని బంధింపఁబడుట లేదుగదా! కావున యిట్టి (బంధకము మోచక ముగూడకాని) కర్మ నిజముగా గర్మయేగాడు. అట్టికర్మను జేయువాఁడు నిజముగా కర్మికాడు. పరిశేషన్యాయముచే శాస్త్రవిహితమైనట్టి లేక - ప్రతిషిద్ధమైనట్టికర్మ నెనడనుష్ఠించునో, వాడే గర్మియనబడును. అందుకు "యోగఃకర్మసుకౌశలమ్" అను గీతావచనము; ననుసరించి విహిత కర్మను నిష్కామముగ ననుష్ఠించువాఁడు ‘యోగి’యని జెప్పఁబడును. ఇట్టియోగికే చిత్తశుద్ధ్యాదిద్వారమున గ్రమముక్తి లభించును.
 ఎవఁడు ఫలాపేక్షగలవాఁడై విహితకర్మ ననుష్ఠించునో, వాఁడు ధూమాదిమార్గమున చంద్రలోకమునకేగి కొంత కాలమునకు మరల భూమిపై ఁబుట్టును. ఇతఁడే కర్మియన బడును. నిషిద్ధకర్మ ననుష్ఠించువాఁడు నరకమును బొందును.
యోగియన్ననో ఇచట(ఈజన్మమున)నే పరమాత్మ సాక్షాత్కారము గలవాఁడగుచో బ్రహ్మీభూతుడేయగును. అట్లు గాక పరోక్షముగమాత్రమే బ్రహ్మవస్తువును దెలిసినవాడగుచో, నర్చిరాదిమార్గమున బ్రహ్మ (హిరణ్యగర్భ) లోకమునకేగి యచట పరబ్రహ్మసాక్షాత్కామును బడసి పరార్ధద్వయకాలపరిసమాప్తిసమయమునం దా బ్రహ్మతో ముక్తుడగును. 
 ఈవిధముగ యోగుల కర్చిరాదిమార్గమనియు, సకామకర్మానుష్ఠాతలకు ధూమాదిమార్గమనియుఁబాపులకు నరకమార్గమనియు మూడు మార్గములు శ్రుతియందు ప్రసిద్ధములై యున్నవి...
.
.
.
ప్రశ్న: జీవుడు పరమాత్ముని అంశ యని శృతి చెప్పిన విషయాన్ని ఎట్లు సమన్వయ పరచునూ?
ఉ: జీవుడు పరమాత్ముని అంశయని శ్రుతి యందును, స్మృతులయందును. చెప్పబడినది కదా! ఆమాటకు గతియేమి? అని అడుగవచ్చును 'జీవుడు పరమాత్ముని అంశము' అనిన, సూర్యుని ప్రతిబింబము సూర్యుని అంశ మన్నట్లు, మిణుగురులు అగ్ని అంశమనినట్లు, ఘటాకాశము మహాకాశము యొక్క అంశమనినట్లు అర్థము గ్రహించవలెను.
అనగా అదే జాతికి చెందినదని తెలుసుకొనవలెను. ప్రతి
బింబములు అనేక మైయున్నను బింబము ఒక్కటేయైయున్నట్లు జీవులు అనేకులైనను వారి ఆత్మ నిజముగ నొకటే; జీవుడు స్వరూపతః చైతన్యమే; మిణుగురులు నిపూ ఒకటే అయి వున్నట్లు జీవులూ బ్రహ్మమూ ఒకే చైతన్యమయ్యే ఉన్నారు, ఘుటాకాశము గృహాకాశము అని వ్యవహారములో ఆకాశములను అనేకముగా చెప్పిననూ ఆకాశము ఒక్కటే అయివున్నట్లు, జీవులు అనేకులని వ్యవహారమున్నను వారి స్వరూప మన బ్రహ్మ మొక్కటియే, ఈ విధముగ తెల్పుటయే అంశవాక్యముల ఉద్దేశము.
జీవుడు పరమాత్ముని అంశమనెడి వాక్యముల
వాచ్యార్థమునే గ్రహించినచో దోషమేమి? వినుము, అంశమనెడి మాటకు అర్థము అవయవమనియో వికారమనియో శక్తియని యో అవస్థయని చెప్పవలసియుండును, పరమాత్మ యందు అనేక భాగములున్న వనియూ వాటిలో ప్రతి యొక్కటియూ జీవుడనియు కల్పించినచో, అవయవములు చేరుకొని
ఉన్నప్పుడు మాత్రము అవయవి ఉండి, అవి విడివడిపోయినపుడు వెంటనే నశించిపోవునట్లు పరమాత్మకు కూడ అదేగతి కల్గవలసియుండును. కావున అది ఒప్పదగిన మాటకాదు. 
అందువలన జీవుడు పరమాత్ముని అవయవము కాదు. 
ఇక జీవుడు పరమాత్ముని వికారమనినచో అనగా మన్నుమారి కుండ అయినట్లు పరమాత్ముడు మార్పు చెంది జీవుడై నాడన్నచో, అప్పుడుకూడ పరమాత్మునికి నాశము ఒప్పక తప్పదు. అందువలన జీవుడు ఆత్మయొక్క వికారమును కాదు. 
సర్వశక్తుడగు యీశ్వరుడు బంధమునకు లోబడుననుట సరిగాదు కాబట్టి జీవుడు యీశ్వరుని శక్తియనుటయు ఒప్పదగినది కాదు. 
పరమాత్ముడు మొదట పరిశుద్ధుడై దుఃఖహీనుడైయుండి ఆ తర్వాత అశుచియు, దుఃఖముయమును నగు సంసారమును పొందెనని చెప్పుటయు సమంజసము కాదు కాబట్టి జీవుడు పరమాత్ముని అవస్థ అనుటయు పొసగదు. 
అందువలన 'జీవుడు పరమాత్ముని అంశ' మనెడి వాక్యమునకు అక్షరార్థము చెప్పుకొనుట పొసగదు...
.
.
.
భగవద్గీత
 అతను ఆత్మలో ఆనందం తెలుసు మరియు వేరే ఏమీ కోరుకోడు. కోరికలు హృదయాన్ని వేధిస్తాయి: అతను కోరికలను త్యజిస్తాడు. నేను అతనిని ప్రకాశవంతంగా పిలుస్తాను. (2:55)
 కష్టాల వల్ల చలించకుండా, ఆనందం కోసం వెంపర్లాడేవాడు కాదు: భయం నుండి విముక్తి, కోపం నుండి విముక్తి, కోరికల నుండి విముక్తి. నేను అతనిని జ్ఞాని అని పిలుస్తాను మరియు ప్రకాశవంతంగా పిలుస్తాను. (2:56)
 అతని శరీర బంధాలు తెగిపోయాయి. అతను అదృష్టవంతుడు మరియు సంతోషించడు: అతను దురదృష్టవంతుడు, మరియు ఏడవడు నేను అతనిని ప్రకాశవంతంగా పిలుస్తాను. (2:57)
తాబేలు దాని కాళ్ళలో గీయగలదు: చూసేవాడు తన ఇంద్రియాలలో గీయగలడు. నేను అతనిని ప్రకాశవంతంగా పిలుస్తాను. (2:58)
సంయమనం పాటించేవారు తమ కోరికల నుండి పారిపోతారు కానీ వారి కోరికలను తమతో తీసుకువెళతారు: ఒక వ్యక్తి వాస్తవంలోకి ప్రవేశించినప్పుడు, అతను తన కోరికలను అతని వెనుక వదిలివేస్తాడు. (2:59).....
.
.
.
భ. ఆత్మసాక్షాత్కారం ఎలా పొందాలి?
మ. శరీరం నువ్వు కానప్పుడు నువ్వు అత్మవై ఉండాలి. నిన్నే నువ్వు ప్రత్యేకంగా పొందడం దేనికి?
భ. ముక్తికి మార్గం ఏమిటి?
మ. ఈ ప్రపంచం నిజం అనే భ్రమ నుండి బయట పడితే అదే ముక్తి.
మహర్షి ముక్తసరిగా చెప్పినా ఇందులో అంతరార్థం చాలా కొద్ది మందికే అర్థమవుతుంది.......
.
పరశురామ గండ్ర గొడ్డలి
6వ అధ్యాయం: చిత్రదీప ప్రకరణము.
శరీరం నుండి ఆత్మ వరుకు జీవుని ఆరోహణాక్రమం -ఆత్మ బిన్న మతాల ఖంఢన.
కూటస్థాది శరీరాంత సంఘాతస్యాత్మతాం జగుః ౹
లోకాయతాః పామరాశ్చ ప్రత్యక్షాభాసమాశ్రితాః ౹౹60౹౹
60. లోకాయుతులు (భౌతికవాదులు)పామరజనులు ఇంద్రియ గోచరమైన ప్రత్యక్షమును, మిథ్యను,మాత్రమే ఆశ్రయించి కూటస్థము మొదలు శరీరము వరకు గల సంఘాతమును ఆత్మ అందురు.
శ్రౌతీకర్తుం స్వపక్షౌ తే కోశమన్నమయం తథా ౹
విరోచనస్య సిద్ధాంతం ప్రమాణం ప్రతిజిజ్ఞిరే ౹౹61౹౹
61. తమ వాదము వేదసమ్మతమని చెప్పుటకు వారు అన్నమయ కోశమును (తైత్తిరీయ ఉప.2.1)విరోచన సిద్ధాంతమును (ఛాందోగ్య ఉప.8.8)ప్రమాణముగ ఊటంకింతురు.
జీవాత్మనిగమే దేహమరణస్యాత్ర దర్శనాత్ ౹
దేహాతిరిక్త ఏవాత్మే త్యాహుర్లోకాయతాః పరే ౹౹62౹౹
62. మరికొందరు లోకాయుతులు,జీవాత్మ శరీరమును వదలినపుడు శరీరము మరణించుట వలన,ఆత్మ నిశ్చయముగ శరీరము కంటె భిన్నమని తీర్మానింతురు.
ప్రత్యక్షత్వేనాభిమతాహం దీర్దేహాతిరేకిణమ్ ౹
గమయేదింద్రియాత్మానం వచ్మీత్యాదిప్రయోగతః ౹౹63౹౹
63. వారు
“నేను మాటలాడుచున్నాను” మొదలగు ప్రయోగముల వలన దేహము కంటె భిన్నమగు అహం బుద్ధిని సూచించు ఇంద్రియములే ఆత్మయని చెప్పుదురు.
వాగాదీనామింద్రియాణాం కలహః శ్రుతిషు శ్రుతః ౹
తేన చైతన్యమేతేషామాత్మత్వం తత ఏవ హి ౹౹64౹౹
64. వాక్కు మొదలగు ఇంద్రియముల కలహము వేదమునందు
(బృహదారణ్యక ఉప.6.1.7-14)
విందుము.కనుక ఇంద్రియములు చేతనములు. ఆ కారణముచే అవే ఆత్మయని వారి వాదము.
దేహమునందలి జీవశక్తి ఉత్తేజితమయినప్పుడు ఆలోచనకు,వాక్కునకు,క్రియకు సంబంధించిన వివిధమలగు అవయవములు తమ కార్యమును నిర్వహించును.
అవి,మనస్సునందు ప్రబలముగా (వ్యాప్తమయి)ఉండు భ్రాంతియుతభావనల వలన తమ దృశ్యవిషయములవైపు ప్రసరించును.ఈ జీవశక్తి ఆత్మలోపల వివిధ రూపములను దర్శించును.
ఈ దర్శనము స్థిరస్వభావము కలదిగానున్నట్లు కనిపించుట వలన ఇది జాగ్రద్దశ అనబడును.
బ్రహ్మమునకు ఎట్టి అంగాలు లేవు నిరవయవి.అయితే కార్యరూపంలో సమస్తమైన బ్రహ్మము పరిణామం చెందాలి.
బ్రహ్మము”నిష్కలం”,”నిష్ర్కియం,
“శాంతం”,”నిరవద్యం,నిరంజనమ”
అని శ్రుతులు నిర్దేశిస్తున్నవి.
లోకంలో సాలెపురుగు తనే దారాన్ని సృజించుకొని దానిలో సంచరిస్తూ ఉంటుంది.కొన్ని జాతి కొంగలు మేఘగర్జనతో పురుష సంయోగం లేకపోయినా
గర్భం ధరిస్తాయి. తామరతీగ(పద్మలత)ఒక సరస్సు నుండి మరో సరస్సుకు బాహ్యసాధనాపేక్ష లేకుండా విస్తరిస్తుంది.అలాగే బ్రహ్మశక్తి ఊహకందనిది.అందువల్ల జగత్ నిర్మాణము,సమస్త సృష్టికార్యము బ్రహ్మమునకు సాధ్యమేనని శ్రుతి ప్రమాణము.
ప్రకృతి-వికారరూపం రెండూ అనన్యంగా ఉంటాయనే శ్రుతిలో వినబడు తున్నది.ప్రతి ప్రాణి యొక్క హృదయస్థానంలో బ్రహ్మముంటుందని,సుషుప్తిలో జీవాత్మ-సత్సంపన్నుడౌతాడని శ్రుతి నిర్దేశం.
కార్యరూపంలోనే కాక,బ్రహ్మము అవికృత రూపంలో ఉందనే శ్రుతులు బోధిస్తున్నాయి.బ్రహ్మ నిరవయవి అనే ఉపనిషద్వాక్యాలు నిర్ధారిస్తున్నవి .శబ్ద ప్రామాణ్యంతోనే అగోచరమైన బ్రహ్మమును స్థాపించడం శక్యం. అందువల్ల నిరవయత్వాన్ని నిస్సంసందేహంగా అంగీకరించాలి.
నేను చూచుచున్నాను-మొ౹౹ ఇంద్రియములు”నేను”అనటం వలన స్థూలదేహం ఆత్మకాదు.
“నాదేహం”అనడం మమకారం. “నేను దేహం” అంటే అహంకారం. “దేహం”నేను అనటం లేదు కనుక దేహం ఆత్మకాదు.
జనన మరణాదులున్నందున “దేహం” “ఆత్మ”కాదు.
ఏది లేనందువలన శరీరమే ఉండదో అది ఆత్మ.కనుక ఇంద్రియములు కొన్ని లేకున్నా శరీరం ఉంటుంది.కనుక ఇంద్రియాలు ఆత్మకాదు.
అవిద్యా కల్పితమైన వ్యవహారంలో బ్రహ్మ పరిణామం ఎన్నో రూపాలలో కనపడవచ్చు.కాని,పారమార్థక రూపంలో బ్రహ్మ మొక్కటే. నానారూపాలు లేవు. నామరూపభేదం కేవలం వాచారంభణం
(వాక్కుతో వచ్చినది).
“నీ ఆత్మయే పరబ్రహ్మ”అని తెలుసుకోవటం వల్ల మోక్ష ఫలసిద్ధి కలుగుతుంది.      ఇంకా ఉంది.....
హైరణ్యగర్భాః ప్రాణాత్మవాదిన స్త్వేవ మూచిరే ౹
చక్షురాద్యక్షలోపేఽపి ప్రాణసత్త్వే తు జీవతి ౹౹65౹౹
65. హిరణ్యగర్భ సంప్రదాయపు వారు ప్రాణములే ఆత్మయందురు. కన్నులు మొదలగు ఇంద్రియములు లేకున్నను ప్రాణములున్నచో జీవించును అని వారు ఎత్తి చూపుదురు.
ప్రాణోజాగర్తి సుప్తేఽ పి ప్రాణశ్రైష్ఠ్యాదికం శ్రుతమ్ ౹
కోశః ప్రాణమయః సమ్యగ్విస్త రేణ ప్రపఞ్చితః ౹౹66౹౹
66. నిద్రయందు కూడ ప్రాణము మేలుకొనియే ఉండును. శ్రుతులును ప్రాణము శ్రేష్ఠమని చెప్పుచున్నవి.ప్రాణమయ కోశము సవిస్తరముగ ఉపదేశింపబడినది.
చూ.బృహదారణ్యక
ఉప.1.3.7;5.13.1 ఛాందోగ్య ఉప.5.1 ప్రశ్న ఉప.2-3(4.3)తైత్తిరీయ ఉప.2.2.1
మన ఆత్మేతి మమన్యన్త ఉపాసనపరా జనాః ౹
ప్రాణస్యాభోక్తృతా స్పష్టా భోక్తృత్వం మనసస్తతః ౹౹67౹౹
67. ఉపాసనా పరులైన జనులు మనస్సే ఆత్మయందురు. సుఖదుఃఖములను,అనుభవించే శక్తి మనస్సునకు గలదు. ప్రాణమునకు ఆశక్తి లేదని స్పష్టముగ తెలియుచున్నది గదా. కనుక భోక్తృత్వము గల మనస్సే ఆత్మయని వారి వాదము.
వ్యాఖ్య: ఇది నారద పంచరాత్ర సంప్రదాయము.ప్రాణము ఆత్మ కాదనుటకు అందు ఎన్నో కారణములు చూపబడినవి.అది వాయువు మాత్రమే.
నిద్రలో కూడా ప్రాణము పనిచేసినా అది శరీరమును గాని బాహ్య విషయమును గాని అనుభవింప జాలదు.ప్రాణము పోయినచో శరీరము మరణించును.జఠరాగ్ని లేకున్నను శరీరము మరణించును. శ్రుతి ప్రాణము యొక్క మహత్వమును వర్ణించుట ఉపాసనయందు రుచి కల్పించుటకు మాత్రమే.
ప్రాణము శరీరమును ప్రవేశించినదని శ్రుతి చెప్పుట అధిదేవతను ఉద్దేశించియే.
శ్రుతి మనస్సే ఆత్మ అని కూడా చెప్పును,
“ఆహారము లేక నా ప్రాణము పోవుచున్నది” అనుట ప్రాణమునందలి ప్రీతిని మాత్రమే తెలుపును గాని దాని ఆత్మత్వమును గాదు.
బాహ్య వాయువు వలె రాకపోకలు చేసేది ఆత్మకాదు.
ప్రాణం కనబడకపోయినా మూర్ఛాదులందు చావు లేదు.
నిద్రలో ప్రాణమున్నా పని యుండదు.కనుక ప్రాణము జడము.ఇంద్రియాదులకన్నా అది శ్రేష్ఠ మనుట కొరకే శ్రుతి ప్రాణమును ప్రధానంగా చెప్పింది.
వృక్షాదులందు ప్రాణం ఉన్నట్లు మనకు తెలియదు.అయినా అవి బ్రతికి ఉంటాయి.
మనస్సు-ఇంద్రియాలవలె సాధనం లేదా ఒక మేస్త్రీ వంటిది.సుషుప్తిలో మనస్సు లేదు.అయినా ఆత్మ పోయిందనలేదు.
నా మనస్సు-మమకారమే గాని అహం కాదు.స్థిరము-అస్థిరము.
అభాసంతో కూడితేనే మనస్సు
కర్త,భోక్త లేకుంటే జడమే.
ఆత్మకన్నా భిన్నమయినదంతయు మిధ్య.మిధ్యా వస్తువులవలన సత్యమయిన అధిష్ఠానము చెడదు.స్వప్న వృత్తాంతం వలన జాగరణ వృత్తాంతం మారదు.
మిధ్యా సర్పం వలన రజ్జువునకు విషం రాదు.స్వప్నంలో ఎండమావిలో బురద రాదు.కనుక ఆత్మ అసంగం.అది కర్తగా కనబడినా కర్త కాదు.భోక్త కాదు.
కనుక జ్ఞానాత్పూర్వమున్న ఆత్మ బ్రహ్మరూపమే కనుక ఐక్యం సిద్ధము...
మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః ౹
శ్రుతో మనోమయః కోశస్తేనాత్మేతీరితం మనః ౹౹68౹౹
68. జీవుని బంధమోక్షములకు మనస్సే కారణమని శ్రుతి చెప్పును. మనోమయకోశము కూడ శ్రుతియందు చెప్పబడినది కనుక మనస్సే ఆత్మ అని వీరందురు.
వ్యాఖ్య: అమృతబిందు (బ్రహ్మబిందు)ఉప.2;
తైత్తిరీయ ఉ.2.3.1 మనస్సు కూడ ఆత్మ కాదనుటకు చాల కారణములు గలవు.మనస్సు ఉపకారణము మాత్రమే గాఢనిద్రయందు చైతన్యము వలె మనస్సు ఉండదు.
చైతన్యపు ప్రతిఫలనము వలన మాత్రమే మనస్సు భోక్తయగుచున్నది.స్వతంత్రముగ కాదు.
“నా మనస్సు శాంతముగ ఉన్నది” అనే ప్రయోగమున జ్ఞాతయగు “నేను”మనస్సు కంటె భిన్నము.
మనోనాశము వలన మోక్షము కలుగునని శ్రుతి చెప్పును. కామనాపూర్ణమైన మనస్సు బంధమునకు కారణము.
కామనా రహితమైనచో మోక్షమునకు సహకారి.
ఆకాశములోనికి ఎగురగోరు పక్షి తన గ్రుడ్డుపెంకు(చిప్ప)ను పగురగొట్టి వెలుపలకు వచ్చు విధముగా నీవు నీ వాసనలను పరిత్యజింపుము.అజ్ఞానజనితములగు ఈ వాసనలను నశింపజేయుట కష్టము.మరియు అవి అనంతమగు దుఃఖమును కలిగించును.
అజ్ఞానముతో ఆత్మను పరిమితముగావాంచు ఈ మనోవాసనయే అపరిచ్ఛిన్నమును పరిచ్ఛిన్నముగా జూచును. అయినప్పటికి,
సూర్యుడు మంచును తోలగించు విధముగా,అత్మతత్త్వవిచారణ, అజ్జానముతోఆత్మను పరిమితముగావించు ఈ వాసనను తొలగించును.
విచారణను చేపట్టవలెనను కోరికయే మార్పును కలిగింపజాలి యున్నది.
నిత్యవర్తమానమగు ఆత్మను దేశ,కాలములు ఆవరించుట (కప్పివేయుట)యే మరణము.
దేహము పడనిమ్ము లేక లేవనిమ్ము లేక మరియొక లోకమునకు పోనిమ్ము , నేను దేహమునకు పరిమితుడను కాను.అప్పుడు ఇది అంతయు నన్ను ఎట్లు బాధించును.
దేహము పడినప్పుడు ఆత్మ నశింపదు.
మనస్సు గూడ,ఆత్మజ్ఞానాగ్నిలో దగ్ధమగునంత వరకు నశింపదు.
బాధ నిన్ను స్పృశించక పోయినను,బాధను నీవు అనుభవించుచున్నట్లు అజ్ఞానదశలో మాత్రమే భావించుచున్నావు.
ఈ విషయములు ఆత్మలో వుండవు.
నీవు బద్ధుడవు కావు,అయినను”బద్ధుడను”అని చెప్పుచు ఎందుకు వ్యర్థముగా దుఃఖించుచున్నావు?
ఆత్మతత్త్వము అనంతము;అది ఎందుకు ఎట్లు ఎవని చేత బద్ధమగును?
ఆత్మలో విభాగము లేదు,ఏల అనగా ఇది అంతయు అఖండబ్రహ్మమే.అప్పుడు దేనిని “బంధ”మందురు?,దేనిని “మోక్ష”మందురు?
భావనలు,ఆలోచనలే బంధము. అవి అంతమొందుటే మోక్షము. అందువలన వానినుండి విముక్తుడవయి చేయవలసిన దానిని యాదృచ్ఛికముగా (అప్రయత్నముగా)చేయుము.
“నేను బ్రహ్మము కాను”అను దృఢసంకల్పము వలన మనస్సు బద్ధమగును.
“నేను బ్రహ్మమే”అను దృఢసంకల్పమువలన మనస్సు ముక్తమగును.
వ్యాఖ్య: అమృతబిందు (బ్రహ్మబిందు)ఉప.2;
తైత్తిరీయ ఉ.2.3.1 మనస్సు కూడ ఆత్మ కాదనుటకు చాల కారణములు గలవు.మనస్సు ఉపకారణము మాత్రమే గాఢనిద్రయందు చైతన్యము వలె మనస్సు ఉండదు.....
(సేకరణ)(ఆదిత్యనారాయణ)(తిప్పానా)
(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల ఖండనము)
అణు వదంత్యంతరాలాః సూక్ష్మనాడీ ప్రచారతః ౹
రోమ్ణః సహస్రభాగేన తుల్యాసు ప్రచరత్యయమ్ ౹౹79౹౹
79. అంతరాలవాదుల ఆత్మ అణువు వలె సూక్ష్మమందురు. ఏలన వెంట్రుకలో వెయ్యవ భాగము వలె సూక్ష్మమైన నాడులయందు అది సంచరించును గనుక.బృహదారణ్యక ఉప.4.23. కౌశీతకి ఉప 4.19
అణోరణీయానేషోఽ ణుః సూక్ష్మాత్సూక్ష్మ తరం త్వితి ౹
అణుత్వమాహుః శ్రుతయః
శతశోఽ థ సహస్రశః ౹౹80౹౹
80. అణువు కంటే అణుస్వరూపమైనది,సూక్ష్మము కంటే సూక్ష్మతరమైనది ఇట్లు వందలకొలది వేలకొలది శ్రుతివాక్యములు ఆత్మ యొక్క అణుత్వమును వర్ణించుచున్నవి అని వారందరు తమ వాదమును సమర్థింతురు. కఠ ఉప.2.20; ముండక ఉప.3.19;
కైవల్య ఉప.20;
శ్వేతాశ్వర ఉప.3.20;
మహా నారాయణ ఉప.3.
వాలాగ్ర శతభాగస్య శతథా కల్పితస్యచ ౹
భాగో జీవః స విజ్ఞేయ ఇతి చాహాపరా శ్రుతిః ౹౹81౹౹
81. వెంట్రుక చివర యొక్క నూరవ భాగములో నూరవభాగము జీవుడు.దానిని తెలిసికొనవలెను అని మరొక శ్రుతి చెప్పును.
(ఈ శ్వేతాశ్వతర ఉప.5.9వ వాక్యము ఆ తెలిసికొనుట ఎంతకష్టమో సూచించుటకు ఉద్దేశింపబడినది గాని పరిమాణమును తెలుపుటకు గాదు.)
దిగంబరా మధ్యమత్వమాహురాపాదమస్తకమ్ ౹
చైతన్య వ్యాప్తి సందృష్టేరానఖాగ్రశ్రుతేరపి ౹౹82౹౹
82. దిగంబరులైన జైనులు ఆత్మ మధ్యమ పరిమాణము గలదందురు.అపాదమస్తకము చైతన్యము వ్యాపించి ఉండుటవలనను”గోరుల చివరల నుండి తల వరకు ఆత్మ వ్యాపించి ఉన్నది” అనే శ్రుతి వాక్య బలమునను వారట్లు చెప్పుదురు.
బృహదారణ్యక ఉప.1.4.7;
కౌషీతకి ఉప.4.20.మధ్యమ పరిమాణమనగా శరీరముతో సమానమైన పరిమాణమని అర్థము.
సూక్ష్మ నాడీ ప్రచారస్తు సూక్ష్మైరవయవైర్భవేేత్ ౹
స్థూలదేహస్య హస్తాభ్యాం కంచుక ప్రతిమోకవత్ ౹౹83౹౹
83. ఆత్మ తన సూక్ష్మమైన అవయవములచే సూక్ష్మములైన నాడులను ప్రవేశించును. సన్నవియగు చొక్కా చేతులయందు స్థూలశరీరపు చేతులు ప్రవేశించినట్లే.ఆత్మకు అవయవములు గలవని దిగంబర జైనుల సిద్ధాంతము.
న్యూనాధిక శరీరేషు ప్రవేశోఽ పి గమాగమైః ౹
ఆత్మాంశానాం భవేత్తేన మధ్యమత్వం వినిశ్చతమ్ ౹౹84౹౹
84. ఆత్మ యొక్క అవయవములు సంకోచించుట వలనను వ్యాకోచించుట వలనను చిన్నవి పెద్దవి అగు వివిధ శరీరములందు ప్రవేశింప గలుగును.ఇట్లు ఆత్మకు సాధారణ పరిమాణము మధ్యమమని వారు నిశ్చయింతురు.
సాంశస్య ఘటవన్నాశో భవత్యేవ తథా సతి ౹
కృతనాశాకృతాభ్యాగమయోః కో వారకో భవేత్ ౹౹85౹౹
85. సావయవమైన ఆత్మసావయవమగు కుండ వలెనే నశింపక తప్పదు.అట్లు ఆత్మ నాశనశీలియైనచో కృతనాశము అకృతాభ్యాగమము అనే దోషముల నెవరు వారింపగలరు?వారింపశక్యము కాదు.
వ్యాఖ్య: ఆత్మకు అవయవములు, అంశములు,భాగములు ఉన్నచో అది భాగములు గల కుండ వంటి సకల పదార్థముల వలెనే నశింపక తప్పదు.
ఈ జన్మమున శరీరముతో బాటు ఆత్మ కూడా మరణించిన,
మరు జన్మము నందలి సుఖదుఃఖములకు కారణము లేకపోవును.
గత జన్మమున ఆత్మ అప్పుడే మరణించుటచే ఆ జన్మమున చేసిన పుణ్య పాప కర్మలకు ఫలితము లేకపోవును, ఇట్లు కారణము లేకయే ఫలితము కలుగుట అకృతాభ్యాగమము.
కారణమునకు ఫలితము లేకుండుట కృతనాశము.ఆత్మచే ఈ జన్మమున చేయపడిన సుకృత దుష్కుత(పుణ్యపా)కర్మ ఫలితము లేకయే నశించును.
అట్లే అట్టి కర్మలేకయే ఈ జన్మమున సుఖదుఃఖములను అనుభవించుచున్నట్లు ఏర్పడును. ఇట్టి సంభవము ఎవరికిని సమ్మతము కాదు.
శరీర పతనం సమయంలో కర్మయే జీవాత్మకు ఆశ్రయము.శరీరం పృథివ్యాది భూతాలతో కూడుకొని ఉన్నది.ఈ పంచభూతాలు సూక్ష్మరూపంలో మోక్షము వరకు అంటే బ్రహ్మైక్యము వరకు నాశనము లేనివి కాబట్టి జన్మరాహిత్యం వరకు సూక్ష్మాంశాలతోనే ఈ శరీరం ఉద్భవిస్తూంటుంది.
సర్వేంద్రియాలకు ఆధారమైన తేజస్సు భూతాల యొక్క సూక్ష్మరూపంలో సంసారమోక్ష పర్యంతం(అంటే బ్రహ్మలో విలీనం అయ్యేవరకు)ఉంటుంది.ఇదే సూచిస్తూ శ్రుతిలో ఇలా వినబడుతున్నది:
కర్మను,విద్యా ప్రాప్తిని అనుసరించి శరీరోపాధికోసం మరో జన్మను పొందవలసి ఉంటుంది.
ఇలా స్థావర జంగముల రూపంలో జీవులకు జనన-మరణాలతో సంసారం అనే సంబంధం ఉండనే ఉంటుంది.ఇలా సంసార సంబంధం లేకపోతే మరణించిన ప్రతి సంసారి,బ్రహ్మము‌లో లీనమయి బ్రహ్మమే అయిపోవాలి.
అందువల్ల తేజో రూపమైన జీవాత్మ,ఆ పరమాత్మ యొక్క ప్రకృతి అయినా(తత్ర్పకృతత్వం కలదైనా)సుషుప్తిలో జరిగే ప్రళయంలాగే,మరణానంతరం లోనూ సంసార బీజం సశేషంగానే ఉంటుంది.
ఆత్మ సూక్ష్మంగా ఉండటం వలన దేహాది బాధలు స్థూలశరీరాన్ని పీడించినా,సూక్ష్మశరీరం నలిగి నశించడం వుండదు.దాని నిష్ర్కమణ నాడులు,రంధ్రాల ద్వారా జరగటం వలన అది సూక్ష్మాతి సూక్ష్మమని తెలుస్తున్నది.
ఆత్మ నిష్ర్కమణ మార్గంలో ఎట్టి అడ్డంకులు ఉన్నట్లు కనబడదు.దేహం నుండి ప్రాణం పైకి పోవటం ప్రక్కనున్న వారి కంటికీ కనబడదు.
మూడు శరీరాలు కనబడని అవస్థలున్నాయి కాని “ఆత్మ” లేని అవస్థ లేదు.
తస్మాదాత్మా మహానేవ నైవాణుర్నాపి మధ్యమః ౹
ఆకాశవత్సర్వగతో నిరంశః శ్రుతి సంమతః ౹౹86౹౹
86. కనుక ఆత్మ అణువు కాదు మధ్యమము కాదు.అది అనంతము ఆకాశము వలె సర్వవ్యాపి అంశములు లేనిది.ఇదే శ్రుతి సమ్మతమైన సిద్ధాంతము.
ముండ ఉప.3.1.7;
శ్వేతాశ్వతర ఉప. 6.49;
గౌడపాదకారిక 3.3
ఇత్యుక్త్వా తద్విశేషే తు బహుధా కలహం యయుః ౹
అచిద్రూపోఽ థ చిద్రూప శ్చిదచిద్రూప ఇత్యపి ౹౹87౹౹
87. ఇట్లు ఆత్మ అనంతము నిరవయవము సర్వవ్యాపియని స్థాపించి దాని లక్షణములను గూర్చి మరల పలువిధములుగ కలహింతురు.చైతన్య స్వరూపమని కొందరు కాదు అచేతనమని మరికొందరు,
కాదు కాదు అది చేతనము అచేతనము కూడా అని తదితరులు వాద వివాదములు చేయుదురు...
(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల వాదోపవాదనలు)
ప్రాభాకరాస్తార్కి కాశ్చ ప్రాహురస్యాచిదాత్మతిమ్ ౹
ఆకాశవత్ ద్రవ్యమాత్మా శబ్దవత్తద్గుణశ్చితిః ౹౹88౹౹
88. ప్రభాకర సంప్రదాయమువారు, తార్కికులు,ఆత్మ అచేతనము అందురు. ఆకాశము వలె ఆత్మయొక్క ద్రవమనీ ఆకాశమునకు శబ్దము గుణమైనట్లే ఆత్మకు చైతన్యము గుణమనీ చెప్పుదురు.
వ్యాఖ్య: తార్కికుల మతమున ద్రవ్యములు తొమ్మిది.పృథివి, జలము, తేజము(అగ్ని), వాయువు,ఆకాశము,కాలము,
దిక్కు,ఆత్మ,మనస్సు.
ఒక్కొక్క ద్రవ్యమున కొక్కొక్క విశేషగుణముండును.పృథివికి వాసన జలమునకు రుచి అగ్నికి రూపము,ఇట్లు
ఆత్మ యొక్క గుణము చైతన్యము.
ఆత్మకు సంకోచ వికాసాలంగీకరించరాదు.మధ్యమ పరిమాణం
(అణువు-వ్యపకము,కాకుండా) అయితే దీప ప్రకాశంలాగా సంకోచవికాసాలు చెప్పాలి.అపుడు ఆత్మ వినాశం గలదవుతుంది.ఈ మోక్షాది ఉపదేశాలన్ని వ్యర్ధం.
మధ్యమ పరిమాణం అనేది అనిత్య లక్షణము.ఆత్మ అనిత్యం కావలసి వస్తుంది.కనుక నవీన తార్కికమతం సమీచీనం కాదు.
ఆత్మ అనేకము.అణు ప్రమాణము అని ఇదీ కుదరదు.ఆత్మ కర్త భోక్త అన్న పక్షమున అది అణువని చెప్పినచో దాని కరృత్వము, భోక్త్వత్వము శరీరైక దేశానికి పరిమితము.
మరి వేదం కూడా ఆత్మ అణువని చెప్పింది కదా! అంటే అచ్చట గ్రహింప శక్యంకానంత సూక్ష్మ విషయమని అర్థం.సూక్ష్మమయిన అణువులు మొదలయినవి ఎలా గ్రహించలేమో అలా”ఆత్మ తత్త్వం” గ్రహించలేమని అర్థము.
ఎందుకంటే “ఆత్మ తత్త్వం” విభువని (సర్వ వ్యాపకమని) అనంతమని శ్రుతియే చెప్తున్నది గదా!
(అణు పదార్ధములందు వ్యాపకమయినది అణువంత. ఆకాశ వ్యాపకమయినది మహత్తు-ఉపాదులను బట్టి అయినా ఇలా చెప్పవచ్చును-సరళీకర్త).
కనుక ఆత్మ అణువు కాదు. మధ్యమ పరిమాణమూ కాదు.
దీపం అంటే వత్తికాదు.వెలుగే.
వ్యాపకాత్మ ఒక్కటే.దానియందు ఎట్టి ధర్మములు లేవు.
ఈ దేహమే నేను అనే భావంతో నేను అంధుణ్ణి,నేను అంధుణ్ణి కాను, నేను మూఢుణ్ణి,మూఢుణ్ణి కాను,నేను పొట్టివాణ్ణి,
నేను పొడుగువాణ్ణి ఇత్యాది భావన దేహ సంబంధమైనది.ఆత్మ సంబంధమైనది ప్రాణులందరిలో సామాన్యం.
బ్రహ్మతత్త్వం అవిద్యను నివారింపజేస్తుంది.
ఆత్మ దేహాదుల కన్నా భిన్నమైనది అని తెలుసుకున్న విద్యావంతునికి నియోగం ఉండదు.
సర్వమూ ఆత్మ స్వరూపమని ఆత్మసాక్షాత్కారంతో తెలుసుకున్న వారు జ్ఞాని(బ్రహ్మవేత్త).
ఇచ్ఛాద్వేష ప్రయత్నశ్చ ధర్మాధర్మౌ సుఖాసుఖే ౹
తత్సంస్కారాశ్చ తస్యైతే గుణాశ్చితివదీరితాః ౹౹89౹౹
89.చైతన్యము మాత్రమే గాక ఇచ్ఛ,ద్వేషము,ప్రయత్నము,
ధర్మము,అధర్మము,సుఖము,
దుఃఖము,సంస్కారములు ఇవన్నీ ఆత్మ యొక్క గుణములని వారందురు.
ఆత్మనో మనసాయోగే స్వాదృష్టవశతో గుణాః ౹
జాయంన్తేఽ థ ప్రలీయంన్తే సుషుప్తేఽ దృష్టసంక్షయాత్ ౹౹90౹౹
90. పూర్వకర్మల వలన కలిగిన అదృష్టముచే ఆత్మ మనస్సుతో కలిసినపుడు ఈ వివిధ గుణము లేర్పడును.ఈ అదృష్టము తీరగనే ఆత్మ సుషుప్తిలోనికి పోవును.ఆ గుణములును లయమునొందును.....
.
.....నేటి చిట్టికథ
శ్రీమహాభారతం నుండి... 
పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మరచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మరచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది.
ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.
అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.
కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.
ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు.
==============================
*🌸భగవత్తత్వం*🌸
భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది. 
ఒక ఊళ్ళో పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. జీవనోపాధి కోసం అతను మేకల్ని చంపి, వాటి మాంసాన్ని అమ్ముతూ ఉండేవాడు. ఈ క్రమంలో అతని మనసు కరడుగట్టింది. ముఖంలో క్రూరత్వం, మాటల్లో కాఠిన్యం ఉండేవి. అవి జనాన్ని అతనికి దూరంగా ఉంచేవి. చివరకు అతను అద్దంలో తన ముఖం చూసి తానే భయపడే స్థితికి చేరుకొనేవాడు. ఇంట్లో వాళ్ళు కూడా అతణ్ణి చూసి భయపడేవారు. ఈ స్థితి నుంచి బయటపడడం ఎలాగో అతనికి అర్థం కాలేదు. 
ఆ ఊరికి ఒక జ్ఞాని వచ్చాడు. పాపయ్య ఆయనను కలిసి, తన బాధంతా చెప్పుకొన్నాడు. తనకు ఓ దారి చూపించమని ఆయనను వేడుకున్నాడు.
‘‘నాయనా! నువ్వు భగవంతుణ్ణి ధ్యానించు. నీకు తప్పకుండా మేలు జరుగుతుంది’’ అన్నాడు జ్ఞాని.
‘‘అయ్యా! భగవంతుడు ఎవరు? అలా ఉంటాడు? నాకు తెలియజెయ్యండి’’ అని అడిగాడు పాపయ్య.
‘‘భగవంతుడు అంటే దయాసాగరుడు. ప్రేమ, కరుణ, శాంతి కలగలిసిన సముద్రం లాంటి రూపం ఆయనది. ఈ క్షణం నుంచీ ఆయన స్మరణలో ఉండడానికి ప్రయత్నించు. భగవంతుణ్ణి ధ్యానిస్తే  పాపకర్మలు నశిస్తాయి. అప్పుడే నువ్వు ఆ పరమాత్ముణ్ణి చూడగలవు’’ అని చెప్పాడు జ్ఞాని.
ఆయన ఆదేశం ప్రకారం పాపయ్య తన వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించాడు. భగవంతుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరాడు. ఊర్లూ, వాడలూ తిరిగాడు. అడవులన్నీ వెతికాడు. గుడులూ, గోపురాలూ సందర్శించాడు. ప్రతి మనిషినీ నిశితంగా పరిశీలించాడు. జ్ఞాని చెప్పిన భగవంతుడి రూపం జాడలు ఎక్కడా కనిపించలేదు. విసిగి వేసారిన అతను ఒక ప్రశాంతమైన స్థలంలో చెట్టు కింద కూర్చొని, భగవంతుణ్ణి తలచుకుంటూ మధనపడసాగాడు. మనసులో ఏదో ఆరాటం... ఏదో తెలియని బాధ... అతనికి తెలియకుండానే కనురెప్పలు బరువెక్కి మూతపడ్డాయి. శరీరం తేలికయింది. క్షణాలు నిమిషాలయ్యాయి. అలా ఎన్ని గంటలు గడిచాయో తెలీదు. శరీరం ఉన్నదో లేదో తెలియని స్థితికి లోనయ్యాడు. ఏదో తెలియని ఆనందం... ఒకదాని వెనుక ఒకటిగా అనుభూతుల పరంపర... అతని చుట్టూ అపరిమితమైన వెలుగు. 
ఎప్పటికో మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచాడు. అంతా కొత్తగా ఉంది. తిరిగి జ్ఞాని దగ్గరకు వచ్చి, ఆ అనుభవం గురించి చెప్పాడు.
అప్పుడు జ్ఞాని ‘‘నీలోని తపనే నీకు మార్గదర్శకం అయింది. ఇంతకాలం నువ్వు ప్రాపంచిక విషయాలతో కలిసి బతికావు. ఇప్పుడు నీకు బాహ్య విషయాల మీద వైరాగ్యం కలిగింది. అదే నిన్ను అంతర్ముఖుణ్ణి చేసింది. ఇప్పుడు నీ మనసు దానంతట అదే లోలోపల నెమ్మదిస్తుంది. ఆ నిర్మలమైన మనసు నిన్ను ప్రేమమయుణ్ణి చేస్తుంది. నీ మాట, చూపు, ప్రవర్తన అన్నీ శాంతిమయం అవుతాయి. పరమాత్మ గుణాలనూ, శక్తులనూ నీలోలోపల ధారణ చేయడమే మహోన్నతమైన తపస్సు. దాన్ని సాధన ద్వారా మాత్రమే పొందగలవు’’ అని చెప్పాడు.
భగవంతుడు ఆకాశంలోనో, గుడిలోనో... ఏదో లోకంలో సింహాసనం మీద కూర్చొనో మనల్ని పరిపాలిస్తున్నాడనుకుంటాం. అయితే భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది. భగవంతుడివైపు దారి కనిపిస్తుంది. మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. 
ఈ కథలోని పాపయ్యలాగే ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత క్రూరత్వం, కాఠిన్యం ఉంటాయి. ఆయుధాలతో బాధించేవాడే కాదు, ఎదుటి మనిషిని మాటలతో బాధపెట్టేవాడు కూడా క్రూరుడే! 
అందుకే ప్రతి మనిషీ తన అంతరంగంలోకి తొంగి చూసుకోవాలి. తనను తాను తెలుసుకోవాలి. అప్పుడే అతడిలో చైతన్య శక్తి ప్రజ్వరిల్లుతుంది. 
🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏
తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష” అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది. కౌశికుడు వృధాగా కొంగమీద సాధ్విమీద కోపగించుకొని తన తపశ్శక్తిని కోల్పోయాడు.
పతివ్రత యొక్క శక్తి అమోఘం. కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతోకానీ పొందలేని జ్ఞానాన్ని సంపాదించింది. కౌశికుడుకి హితబోధ చేసింది.
స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధుని వలన తెలిసింది. ఈతడు కసాయి వాడైనా స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు.
మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు. జన్మనిచ్చినవారికి కృతజ్ఞత చూపింటం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు
🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹
#శ్రీవేదాంత_పంచదశి 
(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల ఖండనము)
అణు వదంత్యంతరాలాః సూక్ష్మనాడీ ప్రచారతః ౹
రోమ్ణః సహస్రభాగేన తుల్యాసు ప్రచరత్యయమ్ ౹౹79౹౹
79. అంతరాలవాదుల ఆత్మ అణువు వలె సూక్ష్మమందురు. ఏలన వెంట్రుకలో వెయ్యవ భాగము వలె సూక్ష్మమైన నాడులయందు అది సంచరించును గనుక.బృహదారణ్యక ఉప.4.23. కౌశీతకి ఉప 4.19
అణోరణీయానేషోఽ ణుః సూక్ష్మాత్సూక్ష్మ తరం త్వితి ౹
అణుత్వమాహుః శ్రుతయః
శతశోఽ థ సహస్రశః ౹౹80౹౹
80. అణువు కంటే అణుస్వరూపమైనది,సూక్ష్మము కంటే సూక్ష్మతరమైనది ఇట్లు వందలకొలది వేలకొలది శ్రుతివాక్యములు ఆత్మ యొక్క అణుత్వమును వర్ణించుచున్నవి అని వారందరు తమ వాదమును సమర్థింతురు. కఠ ఉప.2.20; ముండక ఉప.3.19;
కైవల్య ఉప.20;
శ్వేతాశ్వర ఉప.3.20;
మహా నారాయణ ఉప.3.
వాలాగ్ర శతభాగస్య శతథా కల్పితస్యచ ౹
భాగో జీవః స విజ్ఞేయ ఇతి చాహాపరా శ్రుతిః ౹౹81౹౹
81. వెంట్రుక చివర యొక్క నూరవ భాగములో నూరవభాగము జీవుడు.దానిని తెలిసికొనవలెను అని మరొక శ్రుతి చెప్పును.
(ఈ శ్వేతాశ్వతర ఉప.5.9వ వాక్యము ఆ తెలిసికొనుట ఎంతకష్టమో సూచించుటకు ఉద్దేశింపబడినది గాని పరిమాణమును తెలుపుటకు గాదు.)
దిగంబరా మధ్యమత్వమాహురాపాదమస్తకమ్ ౹
చైతన్య వ్యాప్తి సందృష్టేరానఖాగ్రశ్రుతేరపి ౹౹82౹౹
82. దిగంబరులైన జైనులు ఆత్మ మధ్యమ పరిమాణము గలదందురు.అపాదమస్తకము చైతన్యము వ్యాపించి ఉండుటవలనను”గోరుల చివరల నుండి తల వరకు ఆత్మ వ్యాపించి ఉన్నది” అనే శ్రుతి వాక్య బలమునను వారట్లు చెప్పుదురు.
బృహదారణ్యక ఉప.1.4.7;
కౌషీతకి ఉప.4.20.మధ్యమ పరిమాణమనగా శరీరముతో సమానమైన పరిమాణమని అర్థము.
సూక్ష్మ నాడీ ప్రచారస్తు సూక్ష్మైరవయవైర్భవేేత్ ౹
స్థూలదేహస్య హస్తాభ్యాం కంచుక ప్రతిమోకవత్ ౹౹83౹౹
83. ఆత్మ తన సూక్ష్మమైన అవయవములచే సూక్ష్మములైన నాడులను ప్రవేశించును. సన్నవియగు చొక్కా చేతులయందు స్థూలశరీరపు చేతులు ప్రవేశించినట్లే.ఆత్మకు అవయవములు గలవని దిగంబర జైనుల సిద్ధాంతము.
న్యూనాధిక శరీరేషు ప్రవేశోఽ పి గమాగమైః ౹
ఆత్మాంశానాం భవేత్తేన మధ్యమత్వం వినిశ్చతమ్ ౹౹84౹౹
84. ఆత్మ యొక్క అవయవములు సంకోచించుట వలనను వ్యాకోచించుట వలనను చిన్నవి పెద్దవి అగు వివిధ శరీరములందు ప్రవేశింప గలుగును.ఇట్లు ఆత్మకు సాధారణ పరిమాణము మధ్యమమని వారు నిశ్చయింతురు.
సాంశస్య ఘటవన్నాశో భవత్యేవ తథా సతి ౹
కృతనాశాకృతాభ్యాగమయోః కో వారకో భవేత్ ౹౹85౹౹
85. సావయవమైన ఆత్మసావయవమగు కుండ వలెనే నశింపక తప్పదు.అట్లు ఆత్మ నాశనశీలియైనచో కృతనాశము అకృతాభ్యాగమము అనే దోషముల నెవరు వారింపగలరు?వారింపశక్యము కాదు.
వ్యాఖ్య: ఆత్మకు అవయవములు, అంశములు,భాగములు ఉన్నచో అది భాగములు గల కుండ వంటి సకల పదార్థముల వలెనే నశింపక తప్పదు.
ఈ జన్మమున శరీరముతో బాటు ఆత్మ కూడా మరణించిన,
మరు జన్మము నందలి సుఖదుఃఖములకు కారణము లేకపోవును.
గత జన్మమున ఆత్మ అప్పుడే మరణించుటచే ఆ జన్మమున చేసిన పుణ్య పాప కర్మలకు ఫలితము లేకపోవును, ఇట్లు కారణము లేకయే ఫలితము కలుగుట అకృతాభ్యాగమము.
కారణమునకు ఫలితము లేకుండుట కృతనాశము.ఆత్మచే ఈ జన్మమున చేయపడిన సుకృత దుష్కుత(పుణ్యపా)కర్మ ఫలితము లేకయే నశించును.
అట్లే అట్టి కర్మలేకయే ఈ జన్మమున సుఖదుఃఖములను అనుభవించుచున్నట్లు ఏర్పడును. ఇట్టి సంభవము ఎవరికిని సమ్మతము కాదు.
శరీర పతనం సమయంలో కర్మయే జీవాత్మకు ఆశ్రయము.శరీరం పృథివ్యాది భూతాలతో కూడుకొని ఉన్నది.ఈ పంచభూతాలు సూక్ష్మరూపంలో మోక్షము వరకు అంటే బ్రహ్మైక్యము వరకు నాశనము లేనివి కాబట్టి జన్మరాహిత్యం వరకు సూక్ష్మాంశాలతోనే ఈ శరీరం ఉద్భవిస్తూంటుంది.
సర్వేంద్రియాలకు ఆధారమైన తేజస్సు భూతాల యొక్క సూక్ష్మరూపంలో సంసారమోక్ష పర్యంతం(అంటే బ్రహ్మలో విలీనం అయ్యేవరకు)ఉంటుంది.ఇదే సూచిస్తూ శ్రుతిలో ఇలా వినబడుతున్నది:
కర్మను,విద్యా ప్రాప్తిని అనుసరించి శరీరోపాధికోసం మరో జన్మను పొందవలసి ఉంటుంది.
ఇలా స్థావర జంగముల రూపంలో జీవులకు జనన-మరణాలతో సంసారం అనే సంబంధం ఉండనే ఉంటుంది.ఇలా సంసార సంబంధం లేకపోతే మరణించిన ప్రతి సంసారి,బ్రహ్మము‌లో లీనమయి బ్రహ్మమే అయిపోవాలి.
అందువల్ల తేజో రూపమైన జీవాత్మ,ఆ పరమాత్మ యొక్క ప్రకృతి అయినా(తత్ర్పకృతత్వం కలదైనా)సుషుప్తిలో జరిగే ప్రళయంలాగే,మరణానంతరం లోనూ సంసార బీజం సశేషంగానే ఉంటుంది.
ఆత్మ సూక్ష్మంగా ఉండటం వలన దేహాది బాధలు స్థూలశరీరాన్ని పీడించినా,సూక్ష్మశరీరం నలిగి నశించడం వుండదు.దాని నిష్ర్కమణ నాడులు,రంధ్రాల ద్వారా జరగటం వలన అది సూక్ష్మాతి సూక్ష్మమని తెలుస్తున్నది.
ఆత్మ నిష్ర్కమణ మార్గంలో ఎట్టి అడ్డంకులు ఉన్నట్లు కనబడదు.దేహం నుండి ప్రాణం పైకి పోవటం ప్రక్కనున్న వారి కంటికీ కనబడదు.
మూడు శరీరాలు కనబడని అవస్థలున్నాయి కాని “ఆత్మ” లేని అవస్థ లేదు.
తస్మాదాత్మా మహానేవ నైవాణుర్నాపి మధ్యమః ౹
ఆకాశవత్సర్వగతో నిరంశః శ్రుతి సంమతః ౹౹86౹౹
86. కనుక ఆత్మ అణువు కాదు మధ్యమము కాదు.అది అనంతము ఆకాశము వలె సర్వవ్యాపి అంశములు లేనిది.ఇదే శ్రుతి సమ్మతమైన సిద్ధాంతము.
ముండ ఉప.3.1.7;
శ్వేతాశ్వతర ఉప. 6.49;
గౌడపాదకారిక 3.3
ఇత్యుక్త్వా తద్విశేషే తు బహుధా కలహం యయుః ౹
అచిద్రూపోఽ థ చిద్రూప శ్చిదచిద్రూప ఇత్యపి ౹౹87౹౹
87. ఇట్లు ఆత్మ అనంతము నిరవయవము సర్వవ్యాపియని స్థాపించి దాని లక్షణములను గూర్చి మరల పలువిధములుగ కలహింతురు.చైతన్య స్వరూపమని కొందరు కాదు అచేతనమని మరికొందరు,
కాదు కాదు అది చేతనము అచేతనము కూడా అని తదితరులు వాద వివాదములు చేయుదురు...
.
(సేకరణ)(ఆదిత్యనారాయణ)(తిప్పానా)

***

( మానవ జన్మ ఇక  చాలద )

కుండలిని శక్తి  రాజయోగం  జన్మరాహిత్యం  

కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి .

ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారం లో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి

సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.

శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థితి శక్తి (Potential Energy), రెండవది గతి శక్తి(Dynamic or Kinetic Energy). శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది. యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయవచ్చు. కామ, క్రోధ, లోభ , మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహ శుద్ధి (purification of body), నాడీ శుద్ధి (purification of nadis/nervous system), మనో శుద్ధి (purification of mind), బుద్ధి శుద్ధి (purification of intellect) జరగాలి. నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన "సమాధి స్థితి"గా కూడా పేర్కొంటారు. ఈ స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.

చక్రాలు

వెన్నెముక లో ఉండే చక్రాలు

ప్రధాన వ్యాసము: సప్తచక్రాలు

షడ్చక్రాలు లేదా సప్తచక్రాలు మన శరీరంలోని వెన్నుపూస లోనున్న ప్రదేశాలు.

మూలాధార చక్రము (Mooladhara) : గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే

కుండలినీ శక్తి యుండును. దీని బీజ మంత్రం లం . మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.

స్వాధిష్ఠాన చక్రము (Swadhisthana) : లింగమూలమున గలదు. ఆరు దళములతో సిందూరవర్ణము గల జలతత్వ కమలము గలది. దీని బీజ మంత్రం వం .

మణిపూరక చక్రము (Manipura) : నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి, నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము. దీని బీజ మంత్రం రం.

అనాహత చక్రము (Anahatha) : హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం

యం .

విశుద్ధి చక్రము (Vishuddha) : కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి, శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము. దీని బీజ మంత్రం హం.

ఆజ్ఞా చక్రము (Ajna) : భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము. దీని బీజ మంత్రం ఓం .

సహస్రార చక్రము (Sahasrara) : బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈ స్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.

.

.

1.  (  మూలాధార చక్రము )

పిరుదుల స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. మూలాధార చక్రము న గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆలింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలి నీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.

మూలాధారచక్ర అధిష్టాన దేవత “సిద్ధవిద్యాదేవి” సాకిణీ రూపములో ఉంటుంది. ఈ దేవతకు సంబధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ “స” కార సంబంధముగా ఉంటాయి. 514 నుండి 519 వరకూ గల నామములు “సాకిన్యంబ”ను వర్ణిస్తాయి. నామములు - మూలాధారామ్భుజారూఢ, పంచవక్తాృయ, ఆస్ధిసంసితాయ, అంకుశాది ప్రహరణాయ, వరదాది నిషేవితాయ, ముద్గౌదనాసక్తాయ.

మూలాధారస్ధపద్మే, శృతి దళలసితే, పంచవక్త్రాం త్రినేత్రాం,

ధూమ్రాభా, మస్ది సంస్దాం సృణి మపి కమలం పుస్తకం జ్ఞానముద్రాం

బిభ్రాణం బాహుదండైస్సులలిత వరదా పూర్వ శక్త్యన్వితాoతం

ముద్గాన్నాసక్త చిత్తాం మధుమదముదితాం సాకినీ భావయామి:

మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము . ఇది షట్చక్రాలలో మొదటిది. ఇది నాలుగు దళాల పద్మము. ఈ మూలాధార చక్రములో ‘సాకిన్యాంబ’ నివసిస్తుంది. ఈమెకు ఐదు ముఖములు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. ఈమె ఆస్ధి సంస్దిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. వజ్రేస్వరి. ఈ దేవతకి నాలుగు చేతులు. అంకుశము, కమలం, పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.

సాకిన్యాంబ వరదాది దేవతలు : 1. వరద 2. శ్రియ 3. షండా 4. సరస్వతి ( వ, శ, ష, స అను మూలాక్షరాల) దేవతలచే కోలువబడుతూ ఉంటుంది. ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టము.

.

2. (  స్వాధిష్ఠాన చక్రము. )

.

లింగమూలమున గలదు. ఆరు దళములతో సింధూరవర్ణము గల జలతత్వ కమలము గలది.

మణిపూరక చక్రము

నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము.

లాకిన్యంబాస్వరూపిణి: - (503) (6 నామాములు) (3 వ చక్రము) (495) నుండి (502) వరకూ నామములు : మణిపూరాబ్జనిలయ, వదనత్రయసంయుతా, వజ్రాధికాయుధోపేతాయ, డామర్యాదిభిరావృతాయ, రక్తవర్ణాయ, మాంసనిష్టాయ, గుడాన్నప్రీతాయ, సమస్తభక్త సుఖదాయ.

దిక్పత్రే, నాభిపద్మే, త్రివదన విలస ద్దంష్ట్రిణీం, రక్తవర్ణాం,

శక్తిం దంభోళి దండావ భయమపి భుజైర్దారయంతీo మహోగ్రాం

డామర్యాద్త్యై: పరీతాం పశుజన భయదాం మాంసధాత్వేక నిష్టాం

గౌడన్నసక్త చిత్తాం సకల సుఖకరీం లాకినీమ్ భావయామి:

నాభిస్తానము వద్ద గల మణిపూరచక్రమున వసించునది. పది దళముల పద్మము, బీజాక్షరాలు సంస్కృతములోని “డ” నుండి “ఫ” వరకు గల అక్షరాలు. గర్భస్తశిశువు మూడవ మాసములో కాళ్ళు, చేతులు ఏర్పడడం జరుగును. మూడు ముఖములు కలది. గర్భస్ధ శిశువుకి నోరు, ముక్కు, కళ్ళు ఏర్పడతాయి. నాలుగు చేతులు కలది. వజ్రం, శక్తి, దండము, అభయ ముద్రలు ధరించింది. డామరము ఆది దేవతలచే పరివేష్టించబడింది. ఈ సమయములోనే శిశువు శబ్దాలకి ప్రతిస్పందన చూపిస్తాడు. ఎరుపు వర్ణము కలది. మాంస ధాతువుని ఆశ్రయించేది. బెల్లంతో చేసిన పాయసం, చక్రపొంగలి లాటి వానిపై ఇష్టం కలది. అన్నిరకముల భక్తులకీ సుఖసంతోషములు కలిగించేది ఈ లాకిన్యాంబ రూపిణి.

.

3  (  మణిపూరక చక్రం. )

మంత్రం : ‘ఐం హ్రీం శ్రీం వాం హం సస్సోహం మణిపూరాధిష్టానదేవతాయై లాకినీ సహిత వైష్ణవ స్వరూపిణ్యాంబాయై నమః”

మణిపూరకచక్రం :- ఈ కమలం పది దళములు గల జలతత్త్వం కలది. అధిదేవత లాకిని. ఈమె డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ అను యోగినులచే ఆరాధింపబడుచున్నది. వాహనం పొట్టేలు. 'గుడాన్నప్రీతిమానసా /సమస్త భక్తసుఖదా లాకిన్యాంబ స్వరూపిణీ/ సర్వజనులకు సుఖాలు ఇచ్చే ఈ అధిదేవతకు బెల్లపు పొంగలి ప్రీతి.

బొడ్డునకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది.ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరంనకు అందిస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో ప్రాణామయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని జీర్ణవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం నాలుక. పుట్టుట, జీవించుట, మరణించుట అను మూడు బిందువులతో కూడిన త్రికోణమే జీవసృష్టి. అట్లే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను మూడు కేంద్రాలతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. ఈ త్రికోణమే భౌతికసృష్టికాధారం. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి సహకరిస్తాయి. ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - అవయవములయందు నీరు చేరుట, నోటికి సంబందినవ్యాధులుకు కారణమౌతుంది. నియమాలు లేని ఆహారపు అలవాట్లువలన జీర్ణశక్తి మందగించి అజీర్తి, గాస్ట్రిక్ సమస్యలు కల్గుతాయి. ఉదరకోశ వ్యాధులు, గుండె బలహీనత, నిద్రలేమి, తలబరువు, కాలేయవ్యాధులు,

అతిమూత్రవ్యాధి, రక్తక్షీణత, నేత్రవ్యాధులు కల్గుతాయి.

ఈ చక్ర మానసిక స్వభావం - మూసుకుపోవడం వలన కీర్తికండూతి, పెత్తనం చెలాయించాలనే అహం, అసూయ, అసహనం, దుడుకుతనం, క్రూరత్వం, కటుత్వం, స్వలాభపరులు, స్వార్ధపరులు. తన గురించి తాను తక్కువగా ఆలోచిస్తూ కుంగిపోవడం. తెరుచుకుంటే లక్ష్యసాధన, ఆశయసిద్ధి, వ్యవహార దక్షత, ఉత్సాహం, ధనాపేక్ష, తన్ను తాను గౌరవించుకోవడం, ఆత్మవిశ్వాసం కల్గివుండడం, జీవితంలో అన్నింటా ముందడుగు. ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను అలవర్చుకుంటూ ముందుకు సాగాలి. మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే.

లక్ష్యసాధనకు ఉపయోగపడే చక్రం. లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వుంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని, నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. ఓటమి అన్నది గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి.

మరి ఈ చక్రాన్ని ఎలా శుద్ధి చేసుకోవడం? ఈ చక్రమునకు లాకిని దేవత. సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్లపు పులగాన్ని స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "రం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు. ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - అనుభూతులను (ఆనందంగానీ, విచారం గానీ, దుఃఖం గానీ, ఆవేశం గానీ...) లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్లనీయాలి. దీర్ఘంగా శ్వాసించడం చేయాలి. అలాగే ఈ చక్రానికి అధిపతి గురుడు. ఆరోగ్యంగా వుండాలన్న, సంపదలు కలిగి వుండాలన్న, సుఖంగా వుండాలన్నా, ఈ చక్రం బలంగా వుండాలి. సప్తచక్రాలలో ఈ చక్రం ప్రత్యేకంగా ప్రతిపత్తి కలది. అదే మాదిరిగా నవగ్రహాలలో గురుగ్రహం ఓ ప్రత్యేకమైన శుభగ్రహం. చెడు అలవాట్లు జోలికి పోకుండా, ముందొకటి వెనుకొకటి మాట్లాడక, నాస్తికత్వం వదిలి, చక్కటి వ్యక్తిత్త్వాన్ని అలవర్చుకుంటే ఈ గ్రహం, చక్రం సక్రమంగా పనిచేస్తాయి.

శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో చెప్పిన వర్ణన బట్టి ఇది జలతత్త్వం గలది.

తటిత్వం తం శక్త్యాతిమిర పరిపంథి స్పురణయా

స్పురన్నానారత్నాభరణ పరినద్ధేంద్రధనుషమ్

తమశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్

నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం

మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణము కలది. అనిర్వాచ్యమైనది. అంధకారాన్ని పోగొట్టు మెరుపుతో గూడినది. నానావిధ రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనస్సు కలది. ప్రళయాగ్నిచే తప్తంలైన ముల్లోకములను చల్లపరుచును

..

4  ( అనాహత చక్రము )

హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి హేమవర్ణము గల వాయుతత్వ కమలము.

రాకిన్యాంబస్వరూపిణి

- (494) (9 నామములు) (4 వ చక్రము)

అనాహతాబ్జనిలయ, శ్యామాభాయ, వదనద్వయ, దంష్ట్రోజ్జ్వలాయ, అక్షమాలాదిధరాయ, రుధిరసంస్దితాయ, కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయ, స్నిగ్ధౌదనప్రియాయ, మహావీరేంద్రవరదాయ. (485 నుండి 493 వరకూ గల నామములు)

హృత్పద్మే, భానుపత్రే, ద్వివదన లసితాం, దంష్ట్రిణీం, శ్యామవర్ణామ్

చక్రం, శూలం, కపాలం, డమరుపి – భుజైర్ధారయంతీ త్రినేత్రాం

రక్తస్దాం కాళరాత్రి ప్రభ్రుతి పరివృతాం, స్ధిగ్న భక్తైక సక్తాం

శ్రీమద్వీరేంద్ర వంద్యా మభిమత ఫలదాం, రాకినీ, భావయామః

ఈమె నలుపురంగులో ఉన్నది, రెండు వదనములు ఉన్నాయి. ప్రాణము, అపానము అనే వాయువులు నియంత్రించు రెండు ముఖములు కలది. శిశువు 2 వ మాసములో రెండవ రంధ్రము ఏర్పడుతుంది. రెండు కోరలతో ప్రకాశించునది. ‘అ’ కారాది, ‘క్ష’ కారము వరకూ గల అక్షరాలని మాలగా ధరించింది. నాలుగు చేతులలో అక్షమాలా, శూలము, కపాలము, డమరుకము, దరించునది. అనాహత చక్రము హృదయమునకు సంబంధించినది, కావున ఆమె రక్త ధాతువుని ఆశ్రయించి ఉంటుంది. అనాహతమునకు 12 దళములు. వీటిని ‘క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలచే కొలవబడింది. కాళరాత్రి మొదలగు దేవతలు. నేతితో తడిసిన అన్నము అనిన ప్రీతి కలది. మహావీరుల కోరికలు తీర్చేది. రాకిణీ దేవత సంబంది బీజాక్షరములు, కీలక, న్యాస మంత్రములు అన్నీ ‘ర’ కారము సంబంధమైనవి.

క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలు "ద్వాదశ శక్తులు". అవి 1. కాళరాత్రి 2. ఖాతీత, 3. గాయత్రి 4. ఘంటాధారిణి 5. జామిని 6. చంద్రా 7. ఛాయా 8. జయా 9. ఝుంకారి 10. జ్ఞానరూప 11. టంకహస్తా 12. ఠంకారిణి

.

5  (  విశుద్ధి చక్రము  )

కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము.

డాకినేశ్వరి: - (484) : (5 వ చక్రము) విశుద్ధి చక్ర అధిష్టానదేవత “డాకిని”. (475 నుండి 483 వరకూ డాకిని దేవత లక్షణాలు వర్ణించబడినవి.) ఆరక్తవర్ణాయ, త్రిలోచనాయ,ఖట్వాంగాది ప్రహరణాయ, వదనైకసమన్వితాయ, పాయసాన్నప్రియాయ, త్వక్ స్ధాయ,పశులోకభయంకరాయ, అమృతాధి మహాశక్తిసంవృతాయ. (8 నామములు)

గ్రీవాకూపే, విశుద్దే, నృపదళకమలే, శ్వేతరక్తాం, త్రినేత్రాం

హస్తే : - ఖట్వాంగ, ఖడ్గౌ, త్రిశిఖమపి, మహాచర్మ సంధారయంతీమ్

వక్త్రేణేకేనయుక్తాం, పశుజనభయదాం, పాయసాన్యైక సక్తాం

త్వక్ద్సా వందేహమృతాద్యై: పరివృతవపుషాం, డాకినీo, వీరవంద్యామ్.

డాకినీ దేవత బీజాక్షరాలు, కీలక, న్యాస మంత్రాలు ఆన్నీ “డ” కార సంభంధమైనవి. డాకినీ వర్ణము ఎఱుపు. ఈమె ఎఱ్ఱని ఎఱుపు కాదు. తెలుపు కలసిన ఎరుపు. జీవి పిండ దశలో ‘శుక్త + రక్త “ సమ్మేళనంతో బిందురూపముగా ఉండును. పదిహేను రోజుల పిదప బుడగ రూపము చెంది, నెలాఖరుకి గట్టిపడి, 45 రోజులకి పిండాకృతి పొందుతుంది. ఈ పిండ స్థితి డాకినీ స్థితి. ఈమె త్రిలోచన – భూత, భవిష్యత్, వర్తమానాలు చూడగలది. ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము ఆయుధములుగా గల దేవత. బీజాక్షరములు = ఖ, ఛ, ఠ, ధ, ఫ -- ఘ, ఝ, ఢ, ధ, భ.

హాకినీరూపధారిణి (527):- ( 6 నామములు) (6 వ చక్రము) 521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి. ఆజ్ఞాచక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా, మజ్జాసంస్దాయ, హంసవతీ ముఖ్యశక్తి సమన్విత, హరిద్రాన్నైకరసిక.

భ్రూమధ్యే బిందుపద్మే దళయుగ కలితే, శుక్లవర్ణాం, కరాబ్జైమ్

విభ్రాణాo జ్ఞానముద్రాం, డమరుకమలా, మక్షమాలాం, కపాలం

షట్చక్రాధారమధ్యామ్, త్రినయన లసితాం, హంస వత్యాది యుక్తాం,

హరిద్రాన్త్యైక సక్తాం, సకలశుభకరీం, హాకినీం భావయామః

ఆజ్ఞా చక్రము భ్రూ మధ్యలో అనగా రెండు కనుబొమ్మలు కలిసే ప్రాంతములో ఉంటుంది. వివేక సూర్యుని ఉదయం జరిగే ప్రదేశము. దీనికి అధిష్టానదేవత హాకిణీ. ఈమె తెలుపు రంగులో ఉంటుంది. ఈమె త్రికాలజ్ఞాని. ఈ దేవతకి ఆరు ముఖములు. ఆరు కృతికలు, కుమారస్వామి ఆరు ముఖములు ఈమె రూపములే. ఆజ్ఞాచక్రం మనస్సుకి స్ధానం. గర్భస్ధ శిశువు ఆరవ మాసములో పంచేద్రియాలతో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది. ఇది రెండు దళముల పద్మము. బీజాక్షరములు ‘హ’ ‘క్ష’ . హంసవతీ, ‘క్షమావతీ; అనే దేవతలు ఈ పద్మముని ఆశ్రయించారు. పసుపు పచ్చని అన్నమును ఇష్టపడుతుంది.

.

6   (  ఆజ్ఞా చక్రము. )

భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము.

హాకినీరూపధారిణి (527):- ( 6 నామములు) (6 వ చక్రము)

521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి. ఆజ్ఞాచక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా, మజ్జాసంస్దాయ, హంసవతీ ముఖ్యశక్తి సమన్విత, హరిద్రాన్నైకరసిక.

భ్రూమధ్యే బిందుపద్మే దళయుగ కలితే, శుక్లవర్ణాం, కరాబ్జైమ్

విభ్రాణాo జ్ఞానముద్రాం, డమరుకమలా, మక్షమాలాం, కపాలం

షట్చక్రాధారమధ్యామ్, త్రినయన లసితాం, హంస వత్యాది యుక్తాం,

హరిద్రాన్త్యైక సక్తాం, సకలశుభకరీం, హాకినీం భావయామః

ఆజ్ఞా చక్రము భ్రూ మధ్యలో అనగా రెండు కనుబొమ్మలు కలిసే ప్రాంతములో ఉంటుంది. వివేక సూర్యుని ఉదయం జరిగే ప్రదేశము. దీనికి అధిష్టానదేవత హాకిణీ. ఈమె తెలుపు రంగులో ఉంటుంది. ఈమె త్రికాలజ్ఞాని. ఈ దేవతకి ఆరు ముఖములు. ఆరు కృతికలు, కుమారస్వామి ఆరు ముఖములు ఈమె రూపములే. ఆజ్ఞాచక్రం మనస్సుకి స్ధానం. గర్భస్ధ శిశువు ఆరవ మాసములో పంచేద్రియాలతో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది. ఇది రెండు దళముల పద్మము. బీజాక్షరములు ‘హ’ ‘క్ష’ . హంసవతీ, ‘క్షమావతీ; అనే దేవతలు ఈ పద్మముని ఆశ్రయించారు. పసుపు పచ్చని అన్నమును ఇష్టపడుతుంది.

.

7.  (  సహస్రార చక్రము. )

బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈస్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.

యాకిన్యంబస్వరూపిణి:- (534) (6 నామములు) (7 వ చక్రము)

528 నుండి 533 వరకూ నామములు ఈమెను తెలెయ చేస్తాయి. (సహస్త్రదళ పద్మస్ద, స్వర్ణవర్ణోపశోభిత, సర్వాయుధధర, శుక్లసంస్దితా, సర్వతోముఖ, సర్వోదనపీతిచిత్తాయ)

ముండవ్యోమస్ధ పద్మే దశశతదళకే కర్ణికా చంద్రసంస్దామ్

రేతో నిష్టాం, సమస్తాయుధ కలితకరాం, సర్వతోవక్త్రపద్మాం

ఆది క్షాన్తార్ణశక్తి ప్రకట పరివృతామ్ స్వర్ణవర్ణాం భవానీం

సర్వాన్నాసక్తచిత్తామ్, పరశివరసికాం యాకినీ భావయామః

శిరస్సు మధ్యభాగములో సహస్త్రాకార చక్రము ఉంటుంది. ఇది వేయి దళములు కలది. యశస్వనీ దేవత ఈ చక్ర అధిష్టానదేవత. ఈ 7వ మాసములోనే గర్భస్ధ శిశువులో జీవుడు ప్రవేశించేది. ఇందు విశ్వంలోని సకల వర్ణములు, రంగులు, అక్షరములు, విద్యలు, ధ్వనులు, బీజాక్షరములు ఉంటాయి. యశస్వినీ దేవతకు లెక్కలేనన్ని చేతులు, అన్ని చేతులలో సకల ఆయుధములు ధరించునది. ఈమె సృష్టికి ఆధారభూతమైన శుక్ర ధాతువుని ఆశ్రయించునది. ఈమె సర్వతోముఖ అభివృద్ధి చేయునది. ఈమె అన్ని రకముల అన్నమునూ ఇష్టపడుతుంది.

ఇంతవరకు 'స్మరణ' యందు వివరించిన ఆరు చక్రాలను షట్చక్రములుగా పేర్కొంటారు. ఏడవది సహస్రారంగా వర్ణిస్తారు. ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది, ఏడవది యగు సహస్రారమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే నిర్వాణం. ఇదియే అద్వైతస్థితి.

ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ, అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ, స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును వ్యక్తం చేయును. తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే.

రజస్సు వలన శరీరం లోని వివిధ అవయములు పనిచేయుచున్నవి. ఇక సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. ఈ మూడును మూడు లోకములుగా అంటే, భూలోకం (తమస్సు), భువర్లోకం (రజస్సు), సువర్లోకం (సత్వం)లుగా మనదేహంనందునూ, సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి.

సహస్రారచక్రం

-

సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖా సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ

ఈ కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది. అధిదేవత యాకిని. అకారాది క్షకారంత వర్ణమాల యోగినీగణం చేత సేవించబడుచున్నది. ఈమెకు సర్వాన్నం ప్రీతి.

మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ నివాసస్థానం. పరమాత్మ స్థానం. ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం. ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం. పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం.

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - షట్చక్రాలు బలహీనపడతాయి. గ్రహణశక్తి లోపిస్తుంది. భూత వర్తమానాలోనికి పయనిస్తూ అలసిపోతుంటారు. కష్టదుఃఖాలు పొందుతుంటారు. పునర్జన్మలు తప్పవు. ఈ చక్ర మానసిక స్వభావం - ఈ చక్రం జాగృతయితే సాధకుడు అమరుడౌతాడు. పరమాత్మగా వ్యక్తమౌతాడు. తనకు తాను తెలుసుకుంటాడు. ఇది ఈశ్వరీయత స్థితి. ఈశ్వరత్వం పొందుతారు. ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే - తలపు, మాట, చేత యోగ్యంగా వుండాలి. క్రమశిక్షణ, ఆచరణ, విశ్వాసం కలిగియుండాలి. ధ్యానం, బ్రహ్మతత్త్వజ్ఞానం, స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోవడం చేయాలి. ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం 'సూర్యుడు'. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు. సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమై, తద్వారా ఈ చక్రంతో అనుసంధానింపబడియున్న షట్చక్రాలు శక్తిసామర్ధ్యాలు కలిగియుండి మనజీవితములు ఆనంద నందనవనములు అవుతాయి.

ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నానపానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి. అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్నిచక్రాలయందు నిబిడీకృతమవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంతచిత్తంతో కాసేపు ధ్యానించాలి. క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తులవుతాం. కుండలినీశక్తి స్థూల శరీరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు వ్యాపించియున్నది. ఈ శక్తిని చైతన్యవంతం చేయాలి. ఆయా చక్ర దేవతలను ప్రార్థించాలి. {ప్రార్థన అంటే దైవస్మరణ మాత్రమే కాదు, మన మనస్సును ఇహం నుండి పరం వైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధంచేసుకొని, దేహమే దేవాలయమని, అంతరాన్నే అంతర్యామి కొలువై వున్నాడని గ్రహించి అందుకు తగ్గ ప్రార్థన చేయాలి}. ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి కొంతశక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, వున్నశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించుకోగలగాలి. ఈ విధమైన సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది.

ఈ సాధన వలన ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, స్థితప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది. 'నేను' అనెడి సంకుచిత స్వాభిమానమదృశ్యమైనచో అనంతమగు 'అహంబ్రహ్మస్మి' అనెడి ఉత్తమస్థితి తనంతటదియే సాక్షాత్కారమగును. అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉండటమే. ఈవిధంగా సరైనరీతిలో సప్తచక్రాలను సాధన చేస్తే, సంసారంలో తిరిగి జన్మింపరు. మనలో వున్న సప్తచక్రాలను చైతన్యవంతం చేసే సాధనతో స్థూలంనుండి ప్రజ్ఞామయం వరకు పయనించి 'అహం బ్రహ్మస్మి' అన్న స్థితిని పొందడమే జీవన పరమావధి...

.

.....

చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే.    సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం.

శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం.

అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.

శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే…

శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు,                      శివుని పూజించే చేతులే చేతులు.            శివుని సదా స్మరించేవాడే ధన్యుడు.. 

పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు - 'చిదానంద రూపం శివోహం శివోహం' - నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ణి. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు.

అదే 'శివసిద్ధి'.

అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు.

పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు - ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.

శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే - బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు.

జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది.

అదే పరమపదం...

అజ్ఞానంలో జీవిస్తున్నప్పుడు 

ఇది అజ్ఞానపు జీవితం అని తెలియదు ఎన్నాడు 

ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం కలుగుతుందో అప్పుడే తెలుస్తుంది

ఓ ఇది అంతా అజ్ఞానపు జీవితమని అంతవరకు అజ్ఞానపు జీవితమే నిజమైన జీవితం అనిపిస్తుంది

.

ఆత్మజ్ఞానం అంటే ఆత్మను దర్శించండి అంటే చూడడం

ఆత్మను ఎలా చూడాలి

ఆత్మను లలాట  స్థానంలో చూడాలి భ్రూమధ్యస్థానంలో చూడాలి

ఆత్మ ని చూడడానికి మార్గం పతంజలి మహర్షి  రాజ యోగ మార్గం ద్వారా కుండలిని శక్తి మేల్కొల్పి షట్ చక్రాలు దాటి  సహస్రం చేరినప్పుడు ఆత్మ దర్శనం అవుతుంది దీనిని ఆత్మ జ్ఞానం అంటారు

ఈ ఆత్మ జ్ఞానం కలిగిన తరువాత ఈ దేహం నేను కాదు నేను కేవలం ఆత్మ ని అని తెలిసి వస్తోంది

ఈ దేహం నేను కాను అని తెలిసిన తర్వాత ఈ దేహంతో వచ్చే సుఖదుఃఖాలు అవి కేవలం ఇంద్రియాల వల్ల వచ్చినవే అని తెలిసి వస్తోంది అప్పుడు దుఃఖములు  అన్ని సుఖాలు అన్ని కేవలం మనస్సుకు ఇంద్రియాలకు దేహానికి సంబంధం అని అర్థమవుతుంది ఆత్మకు కు లేవు అని తెలిసి వస్తుంది నేను దేహం కాదు ఇంద్రియములు కాదు మనసు కాదు బుద్ధి కాదు ఇవేవీ కాదు దేహంలో 96 తత్వములు ఉన్నాయి అవి నేను కాదు కేవలం సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపాన్ని అని తెలిసి వస్తుంది అప్పుడు ఈ సుఖాల మీద కోరికల మీద వ్యామోహం నశించిపోయి ఏ కోరిక లేనందున మరో జన్మ ఎత్తే అవకాశం ఉండదు ఇక ఈ ఆత్మ పరమాత్మలో ఐక్యం అవుతుంది ఏ జన్మ తీసుకోనందున దీన్ని కైవల్యం అంటారు...

భక్తుడు భగవంతుని కోసం తపిస్తాడు. 

తపన పడతాడు. 

భగవంతుడు తన భక్తుడి మీద నిండుగా మెండుగా దండిగా అనుగ్రహం కురిపించేటందుకు, అనుక్షణం ఆరాటపడుతుంటాడు. 

భగవంతుడు భక్తుడు యిద్దరూ… ఒకరికి మరొకరు తోడుగా, నీడగా, జోడుగా, జోడీగా, ఉంటేనే భక్తి భగవత్‌ తత్వాలు రెండూ ఉండేవి. భక్తికో విధం, పధం, విధానం, మార్గం ఉండేది. భగవంతుడికి ఓ రూపం, స్వరూపం, గుణం, నామం ఉండేది. 

సాలోక్యత ఉండేది. 

సామీప్యత ఉండేది. 

సారూప్యత, 

సాయుజ్యం ఉండేది. అంతటి అవినా భావ అనుబంధం భగవంతుడుది భక్తుడిదీ.

అయితే భగవంతుడు భక్తుడు వీళ్ళిద్దరిలో ఎవరు

గొప్ప? అనే సందేహం సహజంగా కలిగేదే.

ఓసారి ఓ కొం-టె- శిష్యుడికి ఈ సందేహమే కలిగింది. సందేహం రావడమే ఆలస్యం, సందేహ నివృత్తి కోసం తిన్న గా గురువుగారిని ఆశ్రయించాడు. ”భగవంతుడు భక్తుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప?” అని గురువుని అడిగాడు.

వెంటనే గురువు శిష్యుణ్ణి ”పంచభూతాలు ఉన్నాయి

కదా? వాటిలో ఏది గొప్పది?” అని అడిగారు.

”నీరు మూడొంతులు ఉంటే భూమి ఒక వంతే ఉంది

కదా స్వామీ! కాబట్టి నీరే గొప్పది” అని శిష్యుడు సమాధానం చెప్పాడు.

అది విన్న గురువుగారు ”అంత గొప్పది అయిన నీటిని అగస్త్యుడు ఒక్క గుక్కలో ఔపోసన పట్టేసాడు. మరి నీరు

గొప్పదా? అగస్త్యుడు గొప్పవాడా?” అని అడిగారు.

”అంత గొప్పదైన నీటిని ఔపోసన పట్టేసిన అగస్త్యుడే

గొప్పవాడు” అని సమాధాన మిచ్చాడు శిష్యుడు.

”ఆహా! అలాగా. అంత గొప్పవాడైన అగస్త్యుడు ఆకాశం లో ఉంటాడు కదా? ఆకాశం గొప్పదా? అగస్త్యుడు గొప్ప వాడా?” అని మరో ప్రశ్న వేసారు గురువుగారు.

”గొప్పవాడైన అగస్త్యుని నివాసం ఆకాశం కాబట్టి, ఆకా శమే గొప్పది” అని శిష్యుడు బదులిచ్చాడు.

”అంతటి విశిష్టమైన ఆకాశాన్ని, భగవంతుడు వామన రూపంలో ఒక్క పాదంతో ఆక్రమించేసాడు. మరి ఆకాశం గొప్పదా? భగవంతుని పాదం గొప్పదా?” అని మళ్ళీ ప్రశ్నిం చారు గురువుగారు.

భగవంతుని పాదమే గొప్పదన్నాడు శిష్యుడు.

”భగవంతుని పాదమే అంత గొప్పది అయినప్పుడు, భగవంతుడు ఎంతటి గొప్పవాడై ఉండాలో ఆలోచించు” అన్నారు గురువుగారు.

”అవును స్వామీ! భగవంతుడు నిజంగా చాలా

గొప్పవాడు” అన్నాడు శిష్యుడు.

అపుడు గురువుగారు శిష్యుడితో ”చూడు నాయనా! అంత గొప్పవాడైన భగవంతుడు భక్తుడి హృదయంలో ఉం టాడు కదా! అపుడు భగవంతుడు గొప్పవాడా? భక్తుడు గొప్ప వాడా? అని మళ్ళీ ప్రశ్నించారు గురువు గారు.

వెంటనే ”భగవంతుడు భక్తుని హృదయంలో బందీగా ఉంటాడు కాబట్టి భక్తుడే గొప్పవాడు” అని సమాధానమిచ్చా డు శిష్యుడు.

ఇదీ భక్తుడి విశిష్టతని ఉదాహరణ పూర్వకంగా, చాకచక్యంగా చమత్కారంతో చెప్పే కథ!

భగవంతుడ్ని ఒప్పించేది, మెప్పేంచేది, బంధించేది, బంధన చేసేది, చిక్కేంచేది, చిక్కేలా చేసేది, దక్కేంచేది, దక్కే లా చేసేది భక్తి ఒక్కటే. అంతటి మహోన్నతమైన శక్తి గలది భక్తి.

అంతటి శక్తివంతమైన భక్తి కోసం తపించాలి. తపన పడాలి. వేదన పడాలి. రోధించాలి. సాధన చేయాలి. శోధన చేయాలి. అలాంటి భక్తి తత్వాన్ని సంపాదించాలి. స్వంతం చేసుకోవాలి. సాఫల్యం చేసుకోవాలి. అసలు సిసలైన భక్తి తత్వాన్ని ఆకళింపు చేసుకోవాలి. అనుభవించాలి. అనుభవం లోనికీ తెచ్చుకోవాలి.

ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రులం కావాలి. పునీతులం కావాలి.....

.

#శ్రీవేదాంత_పంచదశి 

(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల వాదోపవాదనలు)

మహతః పరమవ్యక్తమితి ప్రకృతిరుచ్యతే ౹

శ్రుతావసజ్గతా తద్వదసజ్గోహీత్యతః స్ఫూటా ౹౹101౹౹

101. అవ్యక్తమగు ప్రకృతి వ్యక్తప్రకృతియగు మహత్తు కంటే భిన్నమనీ ఆత్మ అసంగమనీ చెప్పు శ్రుతిని వారు ప్రమాణీకరింతురు. సత్త్వరజస్తమోగుణాత్మకమైన ప్రకృతి పురుషుని బంధమోక్షములను కల్పించునని సాంఖ్యవాదము.

కఠ ఉప.1.3.11;

బృహదారణ్యక ఉప.4.3.15, 4.4.22. గుణములు సామ్యావస్థయందుండుట ప్రకృతి స్వభావము.అది చెదరినపుడు సృష్టి ప్రారంభమగును.జడమగు ప్రకృతి తానంతట తానే ఎట్లు చెదరగరదు? అసంగుడగు పురుషుడు ఎట్లు ప్రకృతిని చెదరగొట్ట గలడు?

రెండవది,పురుషులు అసంఖ్యాకులై ప్రకృతి శాశ్వతమైనచో వాని మధ్య ఏదోక సంబంధము కల్పింప వలసి వచ్చును.సంబంధమేర్పడి నంతనే పురుషుని అసంగత్వము భంగపడును.ఇట్లు సాంఖ్యులవాదము కూడా సరికాదు.వేదాంతవాదమున ఆత్మ సత్ చిత్ ఆనందస్వరూపమని ప్రథమ ప్రకరణముననే నిరూపింప బడినది.(1.10)

ప్రకృతి అంటే సత్త్వం,రజస్సు,తమస్సు అనే మూడు గుణాల సామ్యావస్థ.ఈ గుణాల పరస్పర కలయిక చేత దృశ్యమాన జగత్తు ఏర్పడుతొంది. కాని అవి తెలుపు నలుపు వంటి గుణములు కావు.పాలు,ఇనుము వంటి ద్రవ్యాలు కావు.

సత్త్వమంటే జ్ఞానశీలత,రజస్సు క్రియాశీలత,తమస్సు స్థితిశీలత.

జీవుడు,జగత్తు,ఈశ్వరుడు అనే వ్యవహారానికి మూల కారణంగా ప్రకృతి ప్రతిపాదించబడుతొంది. బ్రహ్మం కంటే భిన్నమైన సత్త ప్రకృతికి లేదు.అది బ్రహ్మము నుండి పుట్టినది కూడా కాదు.కాని ప్రకృతిని తీసివేస్తే సృష్టికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు ఉత్తరం లేదు.

ఇట్టి ప్రకృతిలో బ్రహ్మం “ప్రతిబింబించుట”…అంటే ఇది ఊహకు అతీతమైన విషయాన్ని మాటలలో చెప్పే ప్రయత్నమనే గ్రహించాలి.బ్రహ్మంలో

“సృష్టింప వలెననే ఇచ్ఛ కలుగుట” మొదలైనవన్నీ ఇట్టి ప్రయత్నాలే.ఈ విషయం గుర్తించుకుంటే తత్త్వగ్రహణం సులభతరమవుతుంది.

ఆత్మ సర్వదా ఆనందస్వరూపుడు.దుఃఖము కొంచమైనయూ లేదు. విషయముల వలన కలుగు ఆనందము క్షణికమై యున్నది. విషయజనితమైన ఆనందము నిజమునకు ఆత్మదే.అయినను భ్రాంతి వశంబున విషయముల వలన ప్రతీతమై నట్లు తోచుచున్నది.

ఆత్మయొక్క పరమానంద స్వరూపం తెలిసినచో తుచ్ఛ విషయాలలో,అవి కలిగించే క్షణికానందాలలో ఎవరికీ ప్రేమ ఉండదు.

“అహం బ్రహ్మస్మి”అనెడు జ్ఞానంబు గూడా అంతః కరణ వృత్తికి సంబంధించినదే, అయినను ఇది ఆత్మ జ్ఞానంగా చెప్పబడును.

ఎట్లనగా పాదములో గ్రుచ్చుకున్న ముల్లు తీసి వేయుటకు మరియొక ముల్లు వాడుదుము.ఇవి రెండూ ముండ్లే.అయినను మొదటి ముల్లు బాధను గలిగించినది.రెండవ ముల్లు బాధను పోగొట్టినది.

అట్లే”దేహాదులే నేను”అనియెడు వృత్తి రాగద్వేష సహిత సంసారము గలిగిస్తున్నది గాన ఇది ప్రవృత్తి అని చెప్పబడుచున్నది. “బ్రహ్మమే నేను”అనియెడు వృత్తి రాగద్వేష రహితమైన “బ్రహ్మప్రాప్తి” అనెడు మోక్షంబు కల్గించుటచే నివృత్తి రూపమైన” ఆత్మజ్ఞానంబుగా” చెప్పబడుచున్నది.

స్వరూపము తెలియని అజ్ఞాన సమయంలో(స్వరూపము తెలియని కాలములో)ఆత్మయందు మిథ్యయై యుండియు సత్యముగా ఉన్నట్లు తోచెడు ఈ దేహాంద్రియాది ప్రపంచము,స్వరూపజ్ఞానము కలిగిన వెంటనే అసత్తై మిథ్యయై కనబడును.

అధిష్టానమందు తోచెడు అధ్వస్త మయినది ఏదియు ఆధిష్టానము కంటే వేరుగా ఉండుటకు వీలు లేదు అనెడు నియమము ననుసరించి అధిష్టానమైన ఆత్మయందు అధ్వస్తమై కన్పించు ఈ దేహేంద్రియాదులు ఆత్మజ్ఞానికి దగ్దపట న్యాయంగా ఉండి మరణ కాలంలో వాటికి అధిష్టానంగా తానే గా వున్న తనయందే లయించిపోవును.అంతదనుక కేవల సాక్షి మాత్రుడై యుండును...

(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల వాదోపవాదనలు)

చిత్సన్నిధౌ ప్రవృత్తాయాః ప్రకృతేర్హి నియామకమ్ ౹

ఈశ్వరం బ్రువతే యోగః స జీవేభ్యః పరః శ్రుతః ౹౹102౹౹

102. యోగులు ఈశ్వరుని గూర్చి చెప్పుదురు.చిత్సాన్నిధ్యమున ప్రవర్తించు ప్రకృతిని నియమించునది ఈశ్వరుడే. ఈశ్వరుడు జీవులకంటే శ్రేష్ఠుడు.

వ్యాఖ్య: ఆత్మను గూర్చిన భేదాభిప్రాయములను వివరించి ఈశ్వరుని గూర్చిన అభిప్రాయములను వివరించుచున్నారు.

విభువు అంటే వ్యాపకమయిన చైతన్యము.

దానినాశ్రయించి దానినే కప్పినది మాయ.అది సదసద్విలక్షణమయిన

అద్భుత శక్తి రూపమయిన అజ్ఞానము.మాయా యుక్త చైతన్యం ఈశ్వరుడు.ఈయన జగద్ధేతువు.కనుక జగత్కర్త ఈశ్వరుడు.

జడపదార్ధము కర్త లేకుండా పుట్టదు.కర్తకు తాను చేయదలచిన కార్యమునకేది ఉపాదానమో తిలిసి యుండును.కుమ్మరికి మట్టి తెలియును గదా!కనుక అతడు ఘట సర్వజ్ఞుడు.

అలాగే ఈశ్వరుడు విశ్వసర్వజ్ఞుడు.ఆయనకు ప్రపంచోపాదానమయిన మాయ తెలుసు.ఆయన సర్వ శక్తిమంతుడు.ఆయన సర్వజ్ఞుడు.

అందుకు మాయ కారణము. అందుకు సాక్షమీ అద్భుత విచిత్ర విశ్వమే.ఆయన స్వతంత్రుడు.సర్వశక్తిమంతుడు.

కనుక ఆయన పరాధీనుడుకాడు.

ఇందుకు భిన్నంగా జీవుడు. అల్పశక్తిమంతుడు,

అల్పజ్ఞుడు,

పరతంత్రుడు,

అల్ప కార్యకర్త ఇందుకు కారణం అవిద్య.అందువలననే అతడు జీవుడని విలక్షణ నామం సంపాదించాడు.కనుక జగత్కర్త ఈశ్వరుడే.

జీవుడు కాదు.

క్షరమనగా నశించునది.ప్రధానమే క్షరము,మాయ.

హరుడనగా అవిద్యను హరించువాడు గావున పరమేశ్వరుడు.

వ్యక్తా వ్యక్తములను,

క్షరము అక్షరముగా చెప్పెదరు. ఈశ్వర భిన్నుడగు జీవుడు భోక్తృభావము వలన బద్ధుడగుచున్నాడు.పరమేశ్వరుని తెలుసికొని ముక్తుడగుచున్నాడు.

ఈ నిర్వి శేషమగు బ్రహ్మము శ్రేష్ఠమని చెప్పబడినది.బ్రహ్మము అక్షరము గూడ అయియున్నది.ఈ దేహమునందు(ప్రపంచమునందు)బ్రహ్మమును బ్రహ్మవేత్తలు అంతర్యామిగా తెలిసికొనుచున్నారు.

జ్ఞుడనగా సర్వమును తెలిసిన ఈశ్వరుడు.అజ్ఞుడనగా అల్పజ్ఞుడగు జీవుడు.ఈ జీవేశ్వరు లిద్దరును అజులు.జన్మాది వికారములు లేనివారలే.బ్రహ్మమే మాయవలన జీవేశ్వర రూపములతో గోచరించుచున్నది.

పరబ్రహ్మమునందు లీనమై,

ఆ బ్రహ్మమునందే సమాధిగలవారు జననమరణ రూప సంసారము నుండి విముక్తులగుచున్నారు.

క్షరమనగా నశించునది.ప్రధానమే క్షరము,మాయ.

హరుడనగా అవిద్యను హరించువాడు గావున పర మేశ.

వ్యక్తా వ్యక్తములను,

క్షరము అక్షరముగా చెప్పెదరు. ఈశ్వర భిన్నుడగు జీవుడు భోక్తృభావము వలన బద్ధుడగుచున్నాడు.పరమేశ్వరుని తెలుసికొని ముక్తుడగుచ.ున్నాడు.

ఈ నిర్వి శేషమగు బ్రహ్మము శ్రేష్ఠమని చెప్పబడినది.బ్రహ్మము అక్షరము గూడ అయియున్నది.ఈ దేహమునందు(ప్రపంచమునందు)బ్రహ్మమును బ్రహ్మవేత్తలు అంతర్యామిగా తెలిసికొనుచున్నారు.

జ్ఞుడనగా సర్వమును తెలిసిన ఈశ్వరుడు.అజ్ఞుడనగా అల్పజ్ఞుడగు జీవుడు.ఈ జీవేశ్వరు లిద్దరును అజులు.జన్మాది వికారములు లేనివారలే.బ్రహ్మమే మాయవలన జీవేశ్వర రూపములతో గోచరించుచున్నది.

పరబ్రహ్మమునందు లీనమై,

ఆ బ్రహ్మమునందే సమాధిగలవారు జననమరణ సంసారము నుండి విముక్తులగుచున్నారు...

(జీవుని ఆరోహణ క్రమం: వివిధ మతాల వాదోపవాదనలు)

ప్రధాన క్షేత్రజ్ఞ పతిర్గుణేశ ఇతి హి శ్రుతిః ౹

అరణ్యకేఽ సంభ్రమేణ హ్యంతర్యామ్యుపపాదితః ౹౹103౹౹

103. ఈశ్వరుడు జీవులకు ప్రకృతికి ప్రభువనీ గుణములను కూడా నియమించుననీ శ్రుతి ప్రకటించును.అరణ్యకమున ఈశ్వరుడు అంతర్యామి అని వర్ణింపబడెను.

వ్యాఖ్య :శ్వేతాశ్వర ఉప.6.14;

బృహదారణ్యక ఉప.3.7;

కఠ ఉప.2.33.సాంఖ్యుల మతమున పురుష సాన్నిధ్య మాత్రమున ప్రకృతి పరిణామము నొందును.యోగులమతమున ఈశ్వరుడు ప్రకృతిని నియమించును.

శుద్ధ బ్రహ్మము అసంగము, అక్రియము.అది సృష్టి చేయదు అది చతుష్పాత్తు అనగా పరిపూర్ణము.అందువలన మాయా విశిష్టుడయిన ఈశ్వరుడు అవసరం.ఆయనయే జగత్కర్త.

మాయ:ఇది శుద్ధ చైతన్యము నాశ్రయించిన పాదమాత్ర ప్రమాణమయినది.

శుద్ధ చైతన్యమనగా జీవ-ఈశ్వర భేదం లేనిది.మాయ-అనాది.

దీని ప్రభావము వలననే

జీవ-ఈశ్వర భేదం సిద్ధించింది.కనుక వారినుండి మాయ పుట్టలేదు.

మిగిలినది శుద్ధ చైతన్యము.అది నిర్వికారము.దాని వలన మాయ పుట్టిందనరాదు.అంటే అది కర్తృత్వం మొదలయిన గుణాల వలన సవికారం అవుతుంది.పైగా మోక్ష సమయంలోనూ మాయ ఉన్నట్లు అవుతుంది.శుద్ధ చైతన్యం గదా మన స్వరూపము.అపుడు గూడా మాయ ఉన్నదంటే మోక్షము వ్యర్థమవుతుంది.కనుక మాయ అనాది.

నిర్వికార శుద్ధ బ్రహ్మమునుండి జగదుత్పత్తి అగుటలేదు.ఏలనగా శుద్ధ బ్రహ్మము అసంగముగను క్రియారహితముగను యున్నది.ఈ అనాది శుద్ధ బ్రహ్మములో అనాది కల్పిత మాయ ఉంది.

ఈ మాయకు బ్రహ్మముతో అనాది కల్పిత సంబంధం ఉన్నది. కేవలము ఈ కల్పిత మాయనుండియు జగదుత్పత్తి జరగదు.కాన బ్రహ్మము మాయ ఈ రెండింటి కల్పిత సంబంధముచే శుద్ధబ్రహ్మము,సర్వజ్ఞుడు మరియు ఈశ్వరుడుగా పిలవబడుచున్నాడు.

ఈ మాయావిశిష్టుడైన ఈశ్వరుని యొద్దనుండి జగదుత్పత్తియగు చున్నది.కాన మాయ -ఈశ్వరుడు-భోక్తయైన జీవుడు-సృష్టి విధానము వీని స్వరూపములను ప్రతిపాదించడం జరుగుచున్నది.

అత్రాపి కలహాయన్తే వాదినః స్వస్వయుక్తిభిః ౹

వాఖ్యాన్యపి యథాప్రజ్ఞం దార్ఢ్యాయోదాహరన్తి హి ౹౹104౹౹

104. ఈశ్వరుని విషయమున కూడా వివిధ తాత్త్వికులు తమ తమ తర్కములచే వివిధ వాదములతో కలహింతురు.తమ తమ ప్రతిభకు తగినట్లు శ్రుతి వాక్యములను కూడా దార్ఢ్యార్థము ఉటంకింతురు.

క్లేశకర్మవిపాకైస్తదాశయై రప్యసంయుతః ౹

పుంవిశేషో భవేదీశో జీవవత్సోఽ ప్యసంగచిత్ ౹౹105౹౹

105. యోగసూత్రకారుడైన పతంజలి మతమున ఈశ్వరుడు క్లేశకర్మ విపాక ఆశయములు స్పర్శింపని ఒక విశిష్ట పురుషుడు. పురుషుల వలనే ఈశ్వరుడు అసంగుడు చిద్రూపుడు.

వ్యాఖ్య: యోగసూత్రముల సమాధి పాదము సూ.24.

అవిద్యా,అస్మితా,రాగద్వేషములు, అభినివేశము అనునవి అయిదు క్లేశములు.

శుక్లము,కృష్ణము,శుక్లకృష్ణము అని కర్మ మూడు విధములు (పుణ్య,పాప,పుణ్యపాపమిశ్రమ కర్మ)

జాతి,ఆయువు,భోగము అనునవి మూడు విపాకములు.

ఆశయమనగా సంస్కారములు.

సాంఖ్యులకు యోగులకును పురుషుడు భోక్త మాత్రమే కర్తకాడు.కర్తృత్వము సుఖదుఃఖములు ప్రకృతి వికారమగు బుద్ధి లక్షణములు.

బుద్ధితో తాదాత్మ్యము వలన పురుషుడు తానే కర్తయని భ్రమించును.సమాధి ద్వారా తన భిన్నత్వమును తెలిసికొని మోక్షము నొందును.

పురుషుడు(ఆత్మ) స్వాభావికంగా

అసంగుడు.అసంగ వస్తువనగా ఏదైతే దేనియందుగూడి యున్నప్పటికీ తన అసంగత్వమును వీడదో అది అసంగవస్తు వనబడును.

స్వస్వరూపమైన ఆత్మ,

కల్పిత వస్తువులయిన అహంకారం మొదులుకొని స్థూలదేహ పర్యంతము కల్పిత అభిమానంబుతో

“నేను నేను”అని,ఉన్నప్పటికి తన అసంగత్వమును వీడలేదు.

కాన సంగత్వము మాయికమని తెలియ వలయును.

ఆత్మకు సంగత్వము సత్యమే అగుచో మోక్షము వచ్చుటకే వీలు లేదు.కాన సంగత్వము అసత్యమైనందుననే “తత్త్వమసి” ఇత్యాదిశ్రుతులు నీవే బ్రహ్మమని తేల్చుచున్నవి...

.....

..

#భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు చెందిన అన్ని కార్యక్రమాల ప్రారంభం లోనూ ఈ #ఏకాదశ అనువాకాన్ని పఠించి కార్యక్రమం మెదలు పెట్టడం ఆనవాయితీ.

వేదశాస్త్రాధ్యనం సంపూర్ణంగా పూర్తి చేసుకొని గురుకులాన్ని వదలి తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో శిష్యులకు #గురువు ఇచ్చే అద్భుతమైన సందేశమే స్నాతకోపన్యాసంగా ఈ అనువాకంలో చెప్పబడింది.

వేదమనూచ్యాచార్యో న్తేవాసినమనుశాస్తి –

వేదాలను నేర్పించిన తరువాత ఆచార్యుడు అన్తేవాసులకు (విద్యార్ధులకు) ఇలా ఉపదేశిస్తున్నాడు.

#సత్యం వద।

సత్యాన్నే పలకండి. సత్యసంధతతో జీవించండి.

#ధర్మం చర।

ధర్మాన్ని అనుష్ఠించండి.

స్వాధ్యాయాన్మా ప్రమదః।

చదువుకొన్న విద్యను చేజార్చుకోకండి. పునశ్చరణ

చేసుకొంటూ శిష్యులకు బోధించడంద్వారా పరిరక్షించుకొని అభివృద్ధి చేసుకోండి.

ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య –

ఆచార్యునికి ఇష్టమైన గురుదక్షిణ సమర్పించండి. గురు కృపను పొందండి.

ప్రజాతన్తుం మా వ్యవచ్ఛేత్సీః।।-

వివాహం చేసుకొని సంతాన పరంపరను కొనసాగిస్తూ వంశం విచ్ఛిన్నం కాకుండా చూచుకోండి.

సత్యాన్న ప్రమదితవ్యమ్।

నాయనా సత్య

మార్గం నుండి వైదొలగవద్దు.

ధర్మాన్న ప్రమదితవ్యమ్।

ఎట్టి పరిస్తితుల్లోను ధర్మ మార్గం నుంచి తొలగిపోవద్దు.

కుశలాన్న ప్రమదితవ్యమ్।

మానవజాతికి, మనకి మేలును చేకూర్చే పనులనుంచి తొలగి పక్కకు పోవద్దు.

భూత్యైన ప్రమదితవ్యమ్।

సత్కార్యాలు చేసే మార్గం నుంచి తొలగి పోవద్దు.

స్వాధ్యాయప్రవచనాభ్యాం న ప్రమదితవ్యమ్। నేర్చుకోవడం, నేర్పించడం అనే పనులనుండి తొలగి వెళ్లకండి.

దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యమ్।। దేవతలకు, పితృదేవతలకు చేయవలసిన కర్తవ్యాలనుండి ఏమాత్రం పక్కకు తొలగి వెళ్ళకండి.

మాతృదేవోభవ।

తల్లిని దైవంగా పూజించండి.

పితృదేవోభవ।

తండ్రిని దైవంగా స్తుతించండి.

ఆచార్యదేవో భవ।

మీకు విద్య నేర్పిన గురువును దైవంగా అర్చించండి.

అతిధిదేవో భవ।।

అతిధిని దైవముగా గౌరవించండి.

యాన్యనవద్యాని కర్మాణి। కాని సేవితవ్యాని।

నింద్యారహితములైన పనులనే చేయండి.

నో ఇతరాణి।

మిగిలిన నిందనీయమైన చెడ్డ పనులను చేయకండి.

యాన్యస్మాకగ్ం సుచరితాని।

మనకు సద్గుణాలను పెంపొందించే పనులే

తాని త్యయోపాస్యాని।

మీచే చేయబడాలి. కాని

నో ఇతరాణి।

ఇతర పనులను చేయరాదు.

యేకే చాస్మచ్ఛృేయాగ్ంసో బ్రాహ్మణాః।

ఎవరు మనకన్న శ్రేష్ఠులైన వారో, పునీతులో (పవిత్రులో) అటువంటి వారు వచ్చినప్పుడు లేచి నిలబడి

తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యమ్।।

వారికి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి వారి శ్రమని దూరంచేసే పరిచర్యలు చేయాలి.

శ్రద్ధయా దేయమ్।

శ్రద్ధతో దానం ఇవ్వాలి.

అశ్రద్ధయా దేయమ్।

చులకన భావంతో అశ్రద్ధగా ఉదాసీన వైఖరితో దానం చేయకూడదు. పాత్రమెరిగి దానం చేయాలి.

శ్రియా దేయమ్।

శక్తివంచన లేకుండా దానం చేయాలి. శక్తి మేరకు దానం చేయాలి.

హ్రియా దేయమ్।

వినమ్రతతో దానం ఇవ్వాలి. ఇక్కడ ధన్యత దాతకే కాని దానం పుచ్చుకున్న వాడికి కాదు. దాన గ్రహీత ఉండడం ద్వారా నీ ఔదార్యాన్ని, నీ దయాగుణాన్ని చూపడానికి తద్వారా నీవు పవిత్రుడు అవడానికి అవకాశం లభించిందని కృతజ్ఞుడిగా ఉండాలి.

భియా దేయమ్।

గౌరవ పూర్వకంగా దానం ఇవ్వాలి.

సంవిదా దేయమ్।।

సౌహార్దంతో దానం చేయాలి.

అధ యది తే కర్మవిచికిత్సా వా వృత్తవిచికిత్సా వా స్యాత్।

అసలు చేయ వలసిన కర్తవ్యం ఏమిటి? క్లిష్ట పరిస్తితులు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి? అనే విషయాల గురించి మీకు సందేహం తలెత్తినప్పుడు

యే తత్ర బ్రాహ్మణాస్సమ్మర్శినః। యుక్తా ఆయుక్తాః।

అలూక్షా

ధర్మకామ్యాస్స్యుః। యధాతే తత్ర వర్తేరన్।

తథా తత్ర వర్తేథాః।।

మహాత్ములను అనుసరించాలి. ప్రగాఢ చింతనాశీలురు, మనో ఏకాగ్రతను పొందిన వారు, సర్వ స్వతంత్రులు, క్రూరగుణం లేని వారు, సన్మార్గులు అయిన బ్రహ్మ వేత్తలు ఆ యా విషయాలలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరుకూడా అలాగే వ్యవహరించండి.

అథాభ్యాఖ్యాతేషు। యే తత్ర

బ్రాహ్మణాస్సమ్మర్శినః। యుక్తా ఆయుక్తాః। అలూక్షా ధర్మకామాస్స్యుః। యథాతథం క్షుద్ర వర్తేరన్।,తథా తేషు వర్తేథాః।।

దోషులుగా #సమాజం పరిగణించే వారి విషయంలో, సమాజంలోచెడ్డవాళ్ళు తారస పడినప్పుడు వారి విషయంలో – స్వతంత్రంగాను, దయతోను యుక్తాయుక్త విచారణా సమర్ధులైన యోగ్యులైన పెద్దలు ఎలా వ్యవహరిస్తారో నువ్వూ అలాగే వ్యవహరించు.

ఏష ఆదేశః। ఏష ఉపదేశః। ఏషా వేదోపనిషత్। ఏతదనుశాసనమ్। ఏవముపాసితవ్యమ్। ఏవముచైత దుపాస్యమ్।।

ఇది #ఆదేశం. ఇదే #ఉపదేశం. ఇదే #వేదరహస్యం. (దేవ రహస్యం). #దైవాజ్ఞ కూడా ఇదే. ఇదే అనుసరణీయ మార్గం. దీనిని ఈ విధంగానే చేయాలి...

.....

..

మిత్రమా....సత్యమున్న చోటే సంఘర్షణ ఉంటుంది....నీ దగ్గర సత్యముంది ..కనుకనే సంఘర్షణా ఉంది.

సత్యం లేని వాని దగ్గర ఏ సంఘర్షణా ఉండదు. మహా ఐతే శవాల లాగా బతికేస్తుంటారు.వాటిలో  ఏ సంఘర్షణ ఉంటుంది? 

దహించేతనం లేకుండా అగ్ని

చల్లదనం లేకుండా  వెన్నెల

తియ్యదనం లేకుండా తేనె

అలలు లేకుండా సముద్రం

మలయతనం లేకుండా గాలి

పల్లతనం ఎరుగని నీరు

శూన్యతనం లేని ఆకాశం

సంఘర్షణ లేని సత్యం ఎక్కడా లేవు మిత్రమా....

మొహమ్మద్ ప్రవక్తకి ( అవిశ్వాసులు నిరంతరం  తరిమి కొట్టారు)

బుద్ధుడికి(  నూబిదుందుడు నిరంతరం చంపాలని చూసాడు)

జీసస్ కి (సిలువ వేశారు )

సోక్రటిస్ కి (విషమిచ్చారు)

ఓషో కి (అమెరికన్స్ జైల్లో పెట్టి అన్నంలో విషమిచ్చి చంపారు)

రమణ మహర్షి ,రామకృష్ణ పరమహంస(చెప్పవలసిన అవసరం లేదు)

వేమన (నాగుల అనే వేశ్య విషం పెట్టి  శవాన్ని అడవుల పాలు చేసింది అక్కడే అభిరామునికి దొరికాడు)

చెప్పుకుంటూ పోతే

ఆదిశంకరాచార్య

జిడ్డుకృష్ణమూర్తి

కృష్ణుడు (పుట్టుకతోనే తల్లిదండ్రులు లేరు మామ నిరంతరం చంపాలని చూసాడు)

......మిత్రమా సత్యమున్న చోటే సంఘర్షణా ఉంటుంది.ఇది సత్యం...

పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే మనల్ని ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంచగలుగుతాయి. అయితే తరచూ అనేక ప్రభావాల వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్‌కి మనం విక్టిమ్స్‌గా మారాల్చి వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఎంత వేగంగా ఆటో కరెక్ట్ చేసుకోగలిగితే అంత మెరుగ్గా మన లైఫ్ మన కంట్రోల్‌లో ఉంటుంది. మీ వైబ్రేషన్స్‌ని గుర్తించడానికి ఈ చిన్న ప్రశ్నలు మీకు మీరు ఎప్పటికప్పుడు వేసుకోండి. పెన్నూ పేపర్ తీసుకుని పాయింట్స్ రాసుకోవడం ఇంకా మంచిది. మరింత క్లారిటీ వస్తుంది.

1. ఇప్పుడు మీరున్న సంతోషకరమైన లేదా విచారకరమైన మూడ్‌కి ప్రధానమైన కారణం ఏంటి? (కాస్త వెనక్కి వెళ్లి మూల కారణాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి)

2. ఎవరైనా వ్యక్తిని కలిశాక గానీ, తలుచుకున్నాక గానీ, ఏదైనా సంఘటన జరిగాక గానీ, ఏదైనా ఆహారం తీసుకున్నాక గానీ మీ ఎనర్జీ హరించుకుపోయినట్లు, నిస్సహాయంగా, నిస్సత్తువుగా, నెగిటివ్ ఆలోచనలతో సాగుతోందా? ఆ వ్యక్తి పేరు, ఆ సంఘటన, ఆ ఆహారం వివరాలు నోట్ చేసుకోండి. ఇకపై వాటికి దూరంగా ఉండాలి. లేదా సమర్థంగా హ్యాండిల్ చేయాలి. 

అలాగే మీకు ఇష్టమైన దేవుడినైనా, మీకు ఇష్టమైన ఏ వ్యక్తినైనా తలుచుకుంటే చాలా సంతోషం వేస్తోందా? ఆ వైబ్రేషన్ మీరు మరింత మెరుగుపరుచుకోవాలి. అదే మీ జీవశక్తిని మరింత ఇనుమడింపజేస్తుంది.

ఫుడ్ విషయానికి వస్తే నాకు కార్బొహైడ్రేట్స్ ఉన్న హెవీ మీల్స్ తీసుకున్నాక నాలుగైదు గంటల పాటు ఎనర్జీ తక్కువగా అయిపోతుంది. అదే ప్రొటీన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను నా అబ్జర్వేషన్ ద్వారా నా విషయంలో చాలా కాలం నుండి తెలుసుకున్న విషయం ఇది. ఇలా మీకూ కొన్ని ఉంటాయి.

3. ఈరోజు గానీ, ఈ వారంలో గానీ మీరు తీసుకున్న ఏ నిర్ణయాల వల్ల మీరు సంతోషంగా ఉన్నారు? లేదా బాధపడుతూ ఉన్నారు?

4. దేనివల్లయినా విచారంగా ఉంటే దాన్ని సరిచేసుకోవడానికి మీ దగ్గర ఉన్న మార్గాలేంటి? (వాటి లిస్టు రాసుకోండి)

5. రోజు మొత్తం మీద ఏ సమయంలో మీ వైబ్రేషన్ అద్భుతంగానూ, దారుణంగానూ ఉంటుంది? సమయాలు రాసుకోండి.

6. మీరు పాజిటివ్‌గా వైబ్రేట్ అవడానికి అడ్డుకుంటున్న వివిధ అంశాలు (మీ మీద మీకు నమ్మకం లేకపోవడం, ఎవరో జడ్జ్ చేస్తారన్న భయం, ఫెయిల్ అవుతామన్న ఇన్ సెక్యూరిటీ.. ఇలా) లిస్ట్ రాసుకోండి.

7. మీరు మెరుగ్గా వైబ్రేట్ అవడానికి మార్గాల లిస్ట్ రాసుకోండి (అందరితో ప్రేమగా ఉండడం, చేసే పనిలో లీనమై ధ్యానంలా పనిచేయడం, ఇతరులకి సహాయపడడం, ఇతరుల్ని ప్రోత్సహించడం, నిరంతరం నేర్చుకోవడం ఇలా)

మీరు ఓ అరగంటైనా కూర్చుని ఈ ఏడు అంశాలను పెన్నూ పేపర్ తీసుకుని రాసుకోండి. అప్పుడు మీ జీవితం పట్ల కొంత స్పష్టత వస్తుంది. దాన్ని ఎలా సరిచేసుకోవచ్చో అప్పుడు అర్థమవుతుంది. నిరంతరం సంతోషంగా ఉండడానికి పగ్గాలు మన చేతిలోకి వస్తాయి.

ఇది ఆషామాషీ లిస్ట్ కాదు. నిజాయితీగా దీనిపై మీరు వర్క్ చేస్తే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది...

సేకరణ...

 ముందు  యోగి కా

యోగి వై సన్యాసి ఉంచు

విషయాసక్తి లేకుండుటే యోగం. 

అనగా కర్మ ఫలమందు కాంక్ష లేకుండుట. 

సర్వకాల - సర్వావస్థల యందూ సమభావం కలిగి ఉండే విషయాతీత, త్రిగుణాతీత స్థితియే యోగం.’

’ అని అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించాడు. కర్మలకు మూలాలు కామనలు. వాటి స్థానంలో ధర్మానికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. ‘యద్భావం తద్భవతి’ అన్నట్టు..  ఎవరెట్టివారో భగవంతుడు వారికి అట్టివాడు. ఏ కర్మలు లౌకికాలో అవే ఆత్మానందానికి కూడా కారణాలు. సమస్త ధర్మాలకూ భగవంతుడే ఏకైక లక్ష్యం.

యోకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామో న

తస్య ప్రాణా ఉత్ర్కామంతి బ్రహ్మైవసన్‌ బ్రహ్యాప్యేతి

..అని బృహదారణ్యకోపనిషత్తులో, ‘శ్రోత్రియస్యచా కామహతస్య’ అని తైత్తిరీయ ఉపనిషత్‌లో వివరించబడింది. అకాముడు, నిష్కాముడు.. ఈ పదాలన్నీ బ్రహ్మకు, బ్రహ్మణ్యునకు పర్యాయపదాలు. నిష్కాముని యందు, నిష్కామ కర్మలందు భగవంతుడు  ప్రవేశిస్తాడు. 

జీవులు సంకల్ప త్యాగాలకు, వాంఛా త్యాగాలకు అతీతంగా ఉండడం సాధ్యమా? సుఖదుఃఖాలకు అతీతంగా ఉండగలరా? అనే విషయంలో పరమాత్మ చక్కని సందేశాన్ని అందించాడు. 

శరీరంలో ఉంటూనే శరీరానికి అతీతంగా.. సత్త్వ, రజో, తమో గుణాల్లోనే ఉంటూ వాటికి అతీతంగా.. సంకల్పం చేస్తూ అది తనది కాకుండా.. సంపారంలో ఉంటూ సన్యాసివలె జీవించే వాడే యోగి అన్నాడు. యోగి అయినవాడు సంకల్పం చేస్తాడు. సంకల్పించే ఆ మనసులో ఉన్నది దైవం అయినపుడు ఇంక ఆ భౌతిక గుణాలు జీవుని ఎలా బంధిస్తాయి.

యోగి పంచభూత శరీరంలో మనో వాక్కాయాలతో దినచర్య చేస్తూనే, నాయకుడిగా ఉంటాడు గానీ, దాసుడుగా ఉండడు. యోగికి వేటితోనూ బంధాలుండవు. ముందుకు సాగిపోవడమే అతని ధ్యేయం. వంచనలు, కల్లకపటాలు, వ్యర్థ భాషణాలు, లౌకిక విషయాల సంగ్రహనం ఉండదు. విధి నిషేధాలుండవు. ఈశ్వరుడు తప్ప తనకు వేరు రక్షకులెవరూ ఉండరనే విశ్వాసం వారిలో దృఢంగా నెలకొని ఉంటుంది.

భగవంతుడొక్కడే రక్షకుడని నమ్మి, భారమంతా దైవంపై వేసి మనసా - వాచా - కర్మణా - విశ్వసించి, కర్మలు మాత్రం చేస్తూ ఫలితాన్ని భగవంతునికి అర్పిస్తాడు. ‘‘యోగ క్షేమం వహామ్యహం’’.. అట్టివారి యోగక్షేమాలను తానే వహిస్తానని సాక్షాత్తూ ఆ జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ అభయమిచ్చాడు...

1.  శైశవత్మ బుద్ధి  (అజ్ఞాని):-

 దేవుడు ఉన్నాడా? ఉంటే  చూపించు? 'ఆధారాన్ని' చూపించు అనేవాడు.

2. బాలత్మ బుద్ధి  (విపరీత జ్ఞాని):-

 మేము చెప్పేదే కరెక్ట్.,

 అని వితండవాదం చేసేవారు.

3. యువత్మ బుద్ధి  (ప్రాపంచిక జ్ఞాని):-

 పైకి అన్నీ చెప్తాడు. కానీ ఆచరించడు.

4. ప్రౌఢత్మ బుద్ధి  (వేదాంతి):-

'అంతా దైవమే, అంతా మాయే, మనం నిమిత్తమాత్రులం' అనేవాడు.

5. వృద్ధత్మ బుద్ధి (యోగి):-

ధ్యానం చేస్తూ, దివ్య దృష్టిని  ఉత్తేజింప చేసుకున్నవాడు. కానీ దివ్య దృష్టి మాత్రం 'మనసు చేసే ట్రిక్స్' అని అనుకునేవాడు.

6. విముక్తత్మ బుద్ధి  (ఋషి/రాజర్షి):-

ఎంత మాత్రం మాట్లాడకూడదు, సాధన చేయాలి అనే వాడు.

 సాధన చేస్తూ దగ్గర వచ్చే వాళ్లకు ధ్యానం చేయండి అని చెప్తాడు.

7. పరిపూర్ణత్మ బుద్ధి (బ్రహ్మర్షి):-

అన్ని చోట్లకు తిరుగుతూ, "ప్రతిఫలాపేక్ష" లేకుండా  ఆత్మజ్ఞానాన్ని అందించేవారు.

ఎవరైతే బ్రహ్మర్షి స్థితిలో ఉంటారో-- వారు జనన మరణ చక్రమును దాటుతారు.  వారికి మరల జన్మ తీసుకునే అవసరం ఉండదు...

1  ఒక జీవి ఏ జన్మ తీసుకుంటుందో తెలియదు

2  మానవ జన్మ ఎత్తాలి అంటే ముందు ఆడ మగ కలవాలి శారీరకంగా తల్లిదండ్రులు

3.  తల్లిదండ్రులు  కలిసిన తరువాత

శుక్రకణం అండం కలవాలి 

4  శుక్రకణం అండం కలిసిన పిండం నిలుస్తుంది అన్న గ్యారెంటీ లేదు

5. పిండం నిలిచిన పుట్టేదాకా గ్యారెంటీ లేదు 

6. పుట్టిన అవయవాలు సక్రమంగా ఉంటాయి 

అన్న గ్యారెంటీ లేదు

7  సక్రమంగా ఉన్న వారికి తరించాలి అని ఆలోచన వస్తుందన్న గ్యారెంటీ లేదు  

8  ఆలోచన వచ్చిన వారికి కడదాకా తరించాలని ఆలోచన ఉంటుంది అని నమ్మకం లేదు

9. వారికి పరిస్థితులు అనుకూలించాలి 

10. కాలం అనుకూలించాలి

11. సరైన మార్గం ఎన్నుకోవాలి 

12. సరైన గురువు దొరకాలి

13  ఆ సాధన సంపూర్ణంగా గమ్యాన్ని చేరే అంత పట్టుదల ఉండాలి 

14  అష్టసిద్ధులకు  లొంగకుండా  

15  యోగ భ్రష్టత్వం పొందకుండా 

16. సహస్రారంలో లో జీవబ్రహ్మైక్య సిద్దిని పొందేవరకు

17  తన దేహంలో ఉన్న ఆత్మ తెలుసుకునే వరకు

అన్ని సహకరించాలి అనుకూలించాలి 

తాను స్థిరుడై ఉండాలి...

1 భగవద్గీత 

2 ఖూరాన్

3 బైబిల్

4 తైత్ర సిద్ధాంతం

5 బ్రహ్మంగారి కాలజ్ఞానం

6 వేమన శతకం

.

ఎందరో 

ఎందరెందరో వారి అనుభవాలు గ్రంధాలుగా రాశారు 

అందులో ఏది నిజం 

ఏది అబద్దం తెలుసుకోవడం ఎలా 

ఒకవేళ వారు రాసింది నిజమైన 

మాత గురువులు దాన్ని తిరగరాస్తారు వారికి నచ్చినట్లు

అన్ని చదవాలి నిజమైన గ్రంథం ఏదో తెలుసుకోవాలి

ఒకే గ్రంథం చదివి ఊరుకుంటే అదే నిజం అనిపిస్తుంది

.

అన్ని గ్రంథాలు చదివి 

మీరు కూడా ఒక గ్రంథాన్ని తయారు చేయవచ్చు 

మంచి మంచి విషయాలు అందులోనుండి తీసుకొని

చాలామంది గ్రంథాలు ఇలాగే తయారు చేశారు

కొత్త మతాన్ని కూడా తయారు చేయవచ్చు

రాబోయే తరానికి మీరే దేవుడు కావచ్చు

అనుచరులు ఎక్కువైతే.....

.

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు