Posts

Showing posts from November, 2023

తృణకంకణము

  తృణకంకణము (శ్రీ రాయప్రోలు సుబ్బారావు.)  తృణకంకణము రాయప్రోలు సుబ్బారావు రచించిన సుప్రసిద్ధమైన ఖండకావ్యం. 20వ శతాబ్దపు తెలుగు కవిత్వంపై గొప్ప ప్రభావాన్ని ప్రసరించిన భావకవిత్వ యుగంలో మొదటి రచనగా చారిత్రిక ప్రాధాన్యత కలిగివుంది. 1913లో విడుదలైన ఈ రచన ప్రబంధ బంధురమైన తెలుగు సాహిత్యాన్ని ఇతివృత్తం, శైలి, శిల్పం పరంగా గొప్ప మార్పు సూచిస్తూ నూతన యుగానికి నాంది పలికింది.  .  రాయప్రోలు సుబ్బారావు రచించిన తృణకంకణము అనే ఖండకావ్యం 1913లో తొలిముద్రణ పొందింది.  ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో దీనిని రచించారు. ఇటువంటి కథాంశం, ఆ కథాంశం క్లుప్తత వంటివి ఒక వినూత్నమైన, ఆనాటి ప్రబంధ యుగంలో కొత్తది. *శ్రీ సాగరం గంగ సంగమం* గెలలు దిగిన మవ్వపు నారికేళతరులు,  పూలగుత్తులు వ్రేలాడు పొన్నచెట్లు,  మృదురవమ్ముల పిలిచెడి వెదురుపొదలు,  కన్నెగందపుమాకులున్‌ కలవు మఱియు.  ఫలాలతో నిండిన మామిడి చెట్లు, పుష్పగుచ్ఛాలతో అలరే పొన్నచెట్లు, సుమధురమైన ధ్వనులతో వెదురుపొదలు, కన్నెగంధమ...