శ్రీమద్భగవద్గీత... మోక్ష సన్యాస యోగము... 18 వ అధ్యాయము
శ్రీమద్భగవద్గీత... మోక్ష సన్యాస యోగము... 18 వ అధ్యాయము అంతర్యామివి వాసుదేవుడవునీవాద్యంత రాహిత్యమున్, అంతర్యామిగ త్యాగ తత్త్వమును సాధ్యా భావ ధర్మమ్మునే అంతా నేర్చిన సన్యసమ్ములగుణార్ద్రంతమ్ము సత్యమ్మునన్ అంతర్యామివి వాసుదేవుడవునీ హార్దిక్య కాంక్షమ్ము గన్(1) వేత్తలు కొందరున్ దెలుపు విద్యల కర్మలు త్యాగమేయగున్ మొత్తము వీడగా దెలుప ముఖ్యము త్యాగము నేననన్ విధిన్ వేత్తలు కర్త భావమున వీలును బట్టియె సన్య సమ్ముగన్ మొత్తము సర్వ కర్మ ఫలముం పరివర్జన త్యాగ మేయగున్(2) ప్రతి కర్మానిల దోషమేయగుటకే ప్రాధాన్య మేమివ్వగన్ మతి యందున్ గల మానవుండు కలగన్ మార్గమ్ము వెచ్చించగన్ మతి యందున్ ఫల యజ్ఞదానములుగన్ మాధుర్య మేనెంచగన్ ప్రతి కర్మాంతర వ్యా జ్యముల్ గనెడి ప్రాబల్యమ్ము కర్మమ్మగున్(3) త్యాగము, న్యాసముల్ మొదలు తామస సాత్త్విక రాజసమ్ముగన్ త్యాగము శ్రేష్టమే యను విధానము నీవన నేవచించెదన్ త్యాగము మూడుమార్గమువిధానము గావిధి సౌమ్యమేయగున్ బాగుగఁ దెల్పెదన్ వినుము బాధ్యత పర్వము వాని యందునన్(4) హోమ తపస్సుగా మనసు హోరును దానము ని...