శ్రీమద్భగవద్గీత... మోక్ష సన్యాస యోగము... 18 వ అధ్యాయము

శ్రీమద్భగవద్గీత... మోక్ష సన్యాస యోగము... 18 వ అధ్యాయము


శా. అంతర్యామివి వాసుదేవుడవు నీవాద్యంత రాహిత్యమున్,   

అంతర్యామిగ త్యాగ తత్త్వమును సాధ్యా భావ ధర్మమ్మునే 

అంతా నేర్చిన సన్యసమ్ములగుణార్ద్రంతమ్ము సత్యమ్మునన్ 

అంతర్యామివి వాసుదేవుడవునీ హార్దిక్య కాంక్షమ్ము గన్              (01)


ఉ. వేత్తలు కొందరున్ దెలుపు విద్యల కర్మలు త్యాగమేయగున్ 

మొత్తము వీడగా దెలుప ముఖ్యము త్యాగము నేననన్ విధిన్ 

వేత్తలు కర్త భావమున వీలును బట్టియె  సన్య సమ్ముగన్ 

మొత్తము సర్వ కర్మ ఫలముం పరివర్జన త్యాగ మేయగున్        (02)


మ. ప్రతి కర్మానిల దోషమేయగుటకే  ప్రాధాన్య మేమివ్వగన్ 

మతి యందున్ గల మానవుండు కలగన్ మార్గమ్ము వెచ్చించగన్ 

మతి యందున్ ఫల యజ్ఞదానములుగన్ మాధుర్య మేనెంచగన్ 

ప్రతి కర్మాంతర వ్యాజ్యముల్ గనెడి ప్రాబల్యమ్ము కర్మమ్మగున్    (03)


ఉ. త్యాగము, న్యాసముల్ మొదలు తామస సాత్త్విక రాజసమ్ముగన్ 

త్యాగము శ్రేష్టమే యను విధానము నీవన నేవచించెదన్ 

త్యాగము మూడుమార్గమువిధానము గావిధి సౌమ్యమేయగున్ 

బాగుగఁ దెల్పెదన్  వినుము బాధ్యత పర్వము వాని యందునన్  (04)


ఉ.హోమ తపస్సుగా మనసు హోరును దానము నిశ్చ యమ్ముగన్ 

క్షేమముఁ  గోరు మార్గమున జేయ నెఱుంగుట విద్యలేయగున్ 

నేమము విశ్వమేయగును నీడల మాదిరి రక్షయేయగున్ 

సామము నీశ్వరేచ్ఛ యన సాధ్యము మూడుగ సర్వవేళలన్        (05)


ఉ. కార్యమనేదియేది యనకర్తలకాంక్ష యు లేక జీవమున్ 

సర్వ తలంపుతోకదల సాధన యాసలు లేక జీవమున్ 

సర్వ సుఖమ్ముకోరుటయు సాక్షిగ యుత్తమ యాసయమ్ముగన్ 

కార్యమవశ్యమా చరణ కాలము బట్టియు నిశ్చయమ్ముగన్.          (06)


ఉ. గర్వ మనంగనేది యనగర్తలకాంక్షయు లేక జీవమున్ 

సర్వ తలంపుతోకదల సాధన యాసలు లేక జీవమున్ 

సర్వ సుఖమ్ముకోరుటయు సాక్షిగ యుత్తమ యాసయమ్ముగన్ 

నిర్వహణాధికారణము నేమము లెన్నగ నిశ్చయమ్ములన్           (07).


శా. వేదోక్తమ్మగుకర్మలున్ విహితమున్ విశ్వాస లక్ష్యమ్ముగన్ 

స్వాధీనమ్ముగలన్ త్వజింప నుచితాస్వాస్థ్యమ్ము మోహమ్ముగన్ 

భాధే తామసమేగుణంబుచరితమ్ బాంధవ్య కర్మాచరణ్ 

యీదివ్యమ్ముగనన్ నిషిద్ద విధిగన్ యీతామసా త్యాగమున్        (08)


శా. కర్తవ్యమ్మున కర్త కర్మల కళే కాలమ్ము తీర్మానమున్ 

కర్తవ్యమ్ములు దుఃఖకారకములే గాయమ్ము  సౌఖ్యమ్ముగన్ 

కర్తవ్యమ్ములు సత్య త్యాగములనే కర్మార్థ మోక్షమ్ముగన్

కర్తవ్యమ్ము శరీరమౌను విధిగన్ కామ్యమ్ము త్యాగమ్ముగన్..         (09)


ఉ. కీర్తినిగోరకెన్నడును, కిమ్మన కర్మలు జేయ నెంచితిన్, 

ఆర్తినిజూపి సజ్జనుల కాఫలశక్తులనే త్యజించెగన్ 

మూర్తిగనిల్పు ధర్మముకు,మూలము సాత్త్విక సంస్కృతీ లనన్  

స్ఫూర్తిగ తానుసర్వులకు పూర్ణయశస్సునొసంగ వేడెదన్            (10)


చం. సకలముశుద్ధ సత్త్వ గుణసంశయమేల? మహత్మ్య మేయగున్ 

ముకులిత కర్మలేయనుగు ముఖ్యపథమ్ము సమమ్ము త్యాగమున్ 

వికలత నొందకేమనసువిద్యల విస్మయమందు జాలమున్

అకుశల కర్మలే నెరవు నాశలనేవియెలేని జీవముల్                   (11)


చం. నడవడియందు ధర్మమును నాలుగు ప్రక్కల నిల్పు జేయగన్

తడబడడెప్పు డాతడుసుధర్మ విధానవిధమ్ము లందునన్ 

వడివడి సాగుచుండగ నపార వివేకత కార్యమేయగున్ 

విడువక కర్మలన్ విధిగ వేడుక ధ్యానము  త్యాగమేయగున్          (12)


ఉ. కర్మలు మంచిచెడ్డవిగ కాలము నందున మిశ్రితమ్మ గున్ 

కర్మలు దానమున్ మరచి కార్యము జేసెడి శుద్ధులేయగున్ 

కర్మలు దానమున్ సలుపుఁ గారణ లక్ష్యము క్షేమమేయగున్ 

కర్మల బంధమే ఫలిత కాలము నందున  త్యాగమేయగున్          (13)


ఉ. కర్మల సిద్ధి పొందగలఁ గర్తల సక్తుల మార్పుఁ జేరగన్ 

మర్మము లెల్లఁ దెల్పితి సమానత తోడుగ స్పష్టమేయగన్ 

ధర్మము హేతువేయగుట దారులవైనము కాలమేయగున్ 

మర్మము సంఖ్య శాస్త్రమున మార్గముఁ దెల్పెద ముందు నేనుగన్  (14)


ఉ. అల్పము గాదె మా బ్రతుకు నాయువు దాత యెరుంగలేకనా  

దెల్పుము మాకు జ్ఞానమును దేవ, సనాతుని ప్రీతి తోడుగన్ 

సల్పగ నీదు మార్గములు సద్గతి నిచ్చెడి హేతువేయగున్ 

కల్పన వృద్ధియే నరుడుఁ గామిత మీయుము నీవు నీవుగన్         (15)


చం. మరువగబోములే మదిని, మక్కువ వాక్కులు హేతువేయగున్

తరచుగ గుర్తుకొచ్చెనిక, తప్పులు, నొప్పులు సద్విమర్శకై  

పరువు మిగిల్చగానిటను, పాలను నీళ్లను చేర్చు చిత్తమున్ 

వెరువ శరీర కర్త కళ వేగమెనీదరి శాస్త్ర కర్మలున్                       (16)


ఉ. దారులు సర్వకర్మలకు ధర్మము తోడగు శుద్ధ యాత్మగన్ 

చేరిన కర్తగా భవము చేరువ వాక్కులు చేష్టలేయగున్ 

కారణ జన్మమై తమ ప్రకారము బోధల పెంపు దప్పునే 

దారుణ మైనబుద్ధిచిత దాస్యవిమోచన కర్మయేయగున్             (17)


శా. తానే కర్తననే ముభావమున యంతా తానె కష్టమ్ముయున్ 

జ్ఞానేనేనను వాక్కుగానుతెలిపే జ్ఞానమ్ము నాదేయనున్ 

కానేకాదును కర్మలంటమనసే కర్తుత్వ భావమ్ముగన్,  

ఆనాడీ విధిలీలదాన గుణమున్ ప్రాయమ్ము పాపమ్ము నన్        (18)


శా. జ్ఞాతాజ్ఞానమునేర్పగామనసునే జ్ఞానమ్ము బోధించగన్ 

ఈతీరే జపయోగ భాగ్యముగనే నిచ్ఛా వికర్మమ్ముగన్ 

ఆతీరే కరణమ్ము కర్త క్రియలే నాశ్చర్య వైనమ్ముగన్ 

ఆ తీరేసహజమ్ము కర్మ కళలే నాశ్రేయ మేనేయగున్                  (19)


మ. గుణ సంఖ్యా విధి శాస్త్రమున్ గణములే గుర్తుండు బేధమ్ముగన్ 

గుణభేదమ్ముల కోవిదత్వమున సంకోచమ్ము  సాధ్యమ్ముగన్  

గుణముల్ జ్ఞానముఁ సాటి కర్తలగుటన్ కోర్కెల్ ప్రకాశమ్ముగన్ 

గుణముల్ మూడును కర్తకర్మ  క్రియలున్ గుర్తింపు జీవమ్ముగన్  (20)


మ. సమభావస్థితి శాశ్వతమ్మున సమస్తమ్ముస్వభావమ్ముగన్ 

సమ మోహమ్మువిభాగమున్ జరుపుటన్ సాధ్యమ్ము జ్ఞానమ్ముగన్ 

సమలక్ష్యమ్మగు సాత్త్వికమ్ము కళలున్ సామర్ధ్యమే జీవమున్ 

సమదేహమ్మున జీవయాత్రలనువిశ్వాసమ్ము జీవాత్మగన్          (21)


ఉ. నా మదిలోన భావనలు నాట్య విధానము కాంతిశోభ గన్ 

 నా మదిరోదనల్ వినుచు నన్ననులాపము సేయు జ్ఞానమున్ 

 నామది మోదముల్ వినుచు నాదగు కర్మల సేవ నేస్తమున్ 

 ప్రేమగ  పొందగల్గెవిధి పెన్నిధి భావము నేను నేనుగన్           (22)


శా. ఈ దేహమ్మున సౌఖ్యమే ఫలితమై నిచ్ఛాను గమ్యమ్ముగన్, 

ఈ దేహమ్మున నిచ్చిపుచ్చు గుణమే నిష్టమ్ము ప్రాప్తమ్ము గన్, 

ఏదైనా మదిమార్పుసల్పు విధమే నేకైక తోడేయగున్ 

ప్రాదేశమ్మగు శాంతసంతసముగన్ ప్రాముఖ్య డెందమ్ముగన్     (23)


మ.మనకీ కర్మలు శాస్త్రమేనగుటకున్ మార్గమ్ము ధర్మమ్ముగన్ 

మనమేకర్తగ భావమంతటనసమ్మానమ్ము సత్యమ్ముగన్ 

మన కాంక్షా క్రియ లేకమైన విధులన్మాయా సమాగమ్మునన్   

మనమే కర్మలు జేయ సాత్త్వికమునన్ మర్మమ్ము జీవమ్ముగన్     (24)


శా.ఏకర్మల్ సహ భోగి చేయు విధిగన్ యేమాయ మార్గమ్ముగన్, 

ఏ కర్మల్ ఘనకార్యముల్ సలుపగా నేడేడు జన్మమ్ములన్,  

ఏ కర్మల్ పెను గర్విజేయగలుగన్ నీమాయ సర్వమ్ముగన్, 

ఆకర్మల్ మహ రాజసమ్మగుటలో నాశ్చర్య లక్ష్యమ్ముగన్             (25)


ఉ.హానిని జేయ నెంచకయె హాయినిఁ బెంచెడి కర్మలేయగున్ 

వేనినిఁ బంచగా మనసు విఘ్నత శక్తియు కాలమేయగున్ 

ప్రాణిగ కర్మఁ జేయబడు పాలన గమ్యము మంచిచెడ్డలున్ 

వానిని సాధ్యమం దెరుగు వాదము విందగు తామసమ్ముగన్        (26)


మ.ఎవడాసక్తిని వీడునో విలువలే నేర్పాటు వీలున్ గనున్, 

ఎవడాగర్వము వీడునో నతడునీవెంచన్ పరీక్షించ గన్, 

ఎవడున్ హర్షము, శోకముల్ దెలియ నేడీవిశ్వ మందున్ సుధీ, 

ఎవడాసిద్ధిని పొందగల్గకళలేనిచ్ఛా ప్రధానమ్ము లై.                   (27)


ఉ. మోసము జేయు వాడగుట మోహపు నొత్తిడి జేయుచుండగన్ 

పాసము కర్మమే యనుచు పాలన ద్వేషిగ మారియుండుటన్ 

రోసము కష్టపెట్టగ విరోధ ముఁ గల్గగ శోకమేయగున్ 

ధ్యాస దురాశతో సతత దారిగ రాజస భావమేయగున్                   (28)


ఉ.ధూర్తుడు శిక్షితుండగును దూరగ సోమరి చింతలే యగున్ 

కర్తగ శుంఠగన్ తలపు కాల విఘాతక కోప భావమున్, 

ఆర్తి నుపేక్షతోఁ బనులు నాదర లేకయ పాప బుద్ధిగన్ 

స్ఫూర్తిగ లక్షణమ్ములవి సూత్రము లేకయె వ్యర్థమే యగున్        (29)


శా. నీవే కర్తగ నీ సహాయ మెరుగన్  నీప్రేమ వాశ్చల్యమున్ 

నీవే నావచనమ్ములన్ వినగ నే నీబోధనా విద్యగన్ 

నీవే ధైర్యముతోను బుద్ధి గనుమా నీదర్మమే నాదిగన్ 

నీవే న్యాయముగాను మూడు విధముల్ నీశక్తి తెల్పేమదిన్         (30)


చం. అవని ప్రవృత్తి మార్గమున నాశ నివృత్తి భయమ్ము తెల్పగన్  

వివరములన్ని కార్యములు వేదనభావపు లక్ష్య మేయగున్ 

వివిధ విధాన బంధమున  విశ్వము మోక్షపు శక్తి యుక్తిగన్ 

నవ విధ ముక్తి చిత్తములు నర్తన సత్త్వ యధార్ధ బుద్ధిగన్           (31)


ఉ. ధర్మములేవిజేయకనె ధర్మము వెంబడి పర్గులెత్తగన్

కర్మలు లెక్కజేయకనె కాలము దారిని పాప పుణ్యముల్

మర్మము నీతిగాఁ దెలియు మానవ ధర్మము గొప్పదేయగున్,

ఓర్మిని రాజసమ్మనుట నొప్పదు నూహల నెల్ల వేళలన్              (32)


చెo. తలచినధర్మ మేమనసు తత్త్వము మారి జయమ్ము ప్రశ్నగన్

తలచును కర్త యేదియన తామసమౌను ననాది బుద్ధిగన్

గలుగు విరుద్దభావములు గమ్యము మార్పునుఁ గోరు వైనమున్

విలువలు తామసమ్మనెడి విద్యను వింతగ బోధఁ జేయగన్         (33)


చెం. ఎవడు సృజించగా మనుజు లెంచెడి ధర్మము ధారణమ్ముగన్,

ఎవడు సహాయ విద్యలకు నెప్పుడు బోధలుఁ జేయు కర్తగన్,

ఎవడు ధనమ్ము ధారణల నెంచెడు సేవలుజేయ బుద్ధిగన్,

ఎవడిటు సాత్త్వికమ్ము నిటు నెల్లర మేలుగ నిశ్చయమ్ముగన్      (34)


చెo. ఎవడిటు చండ శాసనుడు నేగతి ధైర్యము తోను మాటలై,

ఎవడెటు చెప్ప ధర్మముగ నేగతికామము మోక్ష మాటలై,

ఎవడటు రాజ్య భోగముల నెంచెడు సంగమ కోర్కెలెంతగా 

సువిదుని నన్ను రాజసముఁ జూపెడు కాంక్షలుగాను జీవమున్    (35)


చెo. భయమును నిద్ర చింతయును బంధము ధారణ జేయు మౌనిగన్

నయముగమానవుండు విధి నాట్య ముఁ జేయగఁ గష్టమే యగున్

నియమము లేక సత్యములు నిత్యము ధారణ తాముఁ జేయుచున్

నియమము తామసమ్మదియు నీడగ ధైర్యము తాను జీవమున్    (36)


చెo. వినయము శీలమున్నను సవిద్యయులేక విధీ విధాన మున్

నయముగ విద్య నేర్ప గురునాడిని నిత్యము సత్య వాక్కుగన్

నియమము గాను మూడుగుణ నీతుల భవ్యముగానుఁ జెప్పెదన్

పయనము లక్ష్మి, వాణి తమ పాత్రల దెల్పెద నేను నేనుగన్      (37)  


మ. మరి దుః ఖాంతము సౌఖ్యమున్ జరుగుటన్ మార్గమ్ము ప్రేమమ్ములన్

నరుడే శాంతము నేస్తమున్ సుఖమునన్ నర్తించు జాడ్యమ్ముగన్

పరి నామమ్మున దుఃఖ, సౌక్యములనే ప్రాధాన్యతల్ మార్చియున్

పరమాత్మా గుణ సాత్త్వికం వినయమై పాధ్యమ్ము జీవమ్ముగన్      (38)


ఉ. సమ భాగ్యమ్మగు సంపదే సుఖముగన్ సాధ్యమ్ము సంతోషమున్

సమ లక్ష్యమ్ముల దుఃఖమున్ సమయమున్ సామర్థ్య తుల్యమ్మగున్

సమ భోగమ్మున రాజసమ్మగుటగా సారూప్య భావమ్ముగన్

సమ దేహమ్మున  దుఃఖ, సౌఖ్యమగుటన్ సాయమ్ము దైవమ్ముగన్  (39)


ఉ. ఏ సుఖమున్ జనించు సుర నేస్తము తోడగు వింత మార్పుకున్,

ఆ సుఖమున్ మనో మయము నంతట బిడ్డల బంధమేయగున్,

ఏ సుఖ మెన్న సోమరిగ నేయముఁ జెప్పక మౌనమేయగున్, 

ఆ సుఖ సంతసమ్ములను తామస మేయగు నిత్య జీవమున్         (40)


ఉ. ఏదియు భూమినిన్ జననమేయగు భాగ్యము దేని కోసమున్

ఏదియు యంబరమ్ముజల మేయగు యోగ్యత దేనికోసమున్,

ఏదియు దేవతా కృపయు నేలెడి భావము దేని కోసమున్,

ఆదియు నంతముల్ రహిత మాశయ సిద్ధిగ నేను నేనుగన్            (41)


ఉ. మంచితనాన బ్రాహ్మణుడు మార్గ సమర్ధత తెల్ప గల్గగన్

సంచిత ధైర్య సంపదల సాధ్యము ధర్మము క్షత్రియమ్ముగన్,

ఎంచిన విద్య వైశ్యులగు నెల్లర నాకలి తీర్చ గల్గగన్,

అంచన సూద్ర కర్మలుగ నాశయ సిద్ధిగ వారి జీవమున్                 (42)


మ. వెలుగుల్ నీడల జీవితమ్మగుటయే విద్యా సమర్థత్వముల్

విలువల్ కన్నుల మాయగా గదలగన్ విజ్ఞాన మేకాలమున్

మలుపుల్ సౌఖ్యము సర్వమే యగుటలో మానమ్ము జీవమ్ముగన్

తలపుల్ భావములందు జీవమగుటన్ తత్త్వమ్ము లక్ష్యమ్ముగన్   (43)


ఉ. స్వామి మహస్సు సమ్మతిగ సాధ్యపు మార్గము శక్యమైఁ గనన్ 

ధామపు భావముల్ బ్రతుకు ధర్మపు దారుల తీర్పులే యగున్ 

సామము దక్షతన్ నిలుపు సాయము నిత్యము సత్యమే యగున్

ప్రేమను జూప గల్గు విధి ప్రేరణ చిత్తముఁ గూర్పు సూత్రముల్     (44)


మ. వ్యవసాయమ్ములు విక్రయమ్ములను నీ వైశ్యా వివేకమ్ము లన్

వివరమ్ముల్ జయరూపసత్య కళలే విశ్వాస వ్యాపారముల్

వివిధాచారపు వర్ణ సేవకులుగన్ వీరత్వ మే సూద్రులన్

సువిధాకర్మల నెల్లజేయ విధిగన్ సూత్రమ్ము పాటింపగన్            (45)

       

శా. స్వాభావమ్మగు కర్మలే పరమ విశ్రాంతస్వభావమ్ముగన్,

ఏభావమ్మును లేకఁ జేయు నెరుగన్ నిత్యమ్ము సందేహమున్, 

ప్రాభాతమ్మున పూజ జేసి నను సంప్రాప్తించు సంరంభముల్,  

ఈభావమ్మున సిద్దిపొందగలుగన్ హేరంబ మూలమ్ముగన్          (46)


ఉ. ఏ భగవంతుడో గనుము యే దియు యో ప్రభవమ్ము జూపగన్

ఈభవ భూతముల్ పరగు నీశ్వర కల్పన వ్యాప్తి యేదియో

వైభవమున్ జనుల్ విధిని వైదిక విద్యలు విస్తరించగా

స్వాభవ మై భజించుటకు సాధన భక్తికి దైవ ప్రార్ధనల్                (47)


మ. పరధర్మమ్ సరికాదనన్ మనసునన్  పాఠ్యమ్ముఁ గష్టమ్ముగన్

సరిగా ధర్మము నాచరించుట సదా సాధ్యమ్ము సంయుక్తమున్

నర జాతీవరదాంచితానుగల విన్యాసమ్ము  మర్మమ్ముగన్

స్వర కర్మల్ విధి గాస్వధర్మముగనే సామర్ధ్య మే సౌఖ్యముల్      (48)


మ. నగుపించే గుణ కర్మలన్ వదలకన్ నారామమేజీవమున్

పగ కర్మల్ స్వగుణో విధమ్మగుటయే పాశమ్ము గాభావమున్

పొగచేనగ్నియు కమ్మియుండ విధిగాపోరాట సర్వమ్ముగన్

సుగుణోపేతము కర్మదోషములుగా సూత్రించు ధర్మమ్ముగన్      (49)


శా. ఈమాయాప్రభవమ్ముగా బరుగుటన్ హేరంబ మేలేకయున్,

ఏమాలోకములందు సాగు కథలే యేర్పాటు వాదమ్ముగన్

సీమావేషముగన్ గుణాల సహమున్ శీఘ్రమ్ము నేమమ్ముగన్

క్షేమమ్మున్ యనగాస్వపోరుజయమున్ కేదారమే సౌఖ్యమున్      (50)


శా. అన్నాదమ్ములుయాలు బిడ్డలుగనే యాపన్ను లీలోకమున్,

ఉన్నాలేకయుసాగుబుద్ధిగనుమా యుద్ధమ్ము సంసారమున్, 

మూన్నాళ్ళే సుఖముల్ వివేక ముగనేమూర్ఛిల్లు వైనమ్మునన్, 

ఎన్నాళ్ళైననుకాటికేపరిమితం యియ్యాస నేనేయనన్              (51)


ఉ. పావన చిత్తమున్ దెలుపు పాఠ్యపు నీడలు వెంట వెంటనే

కావల భాజనంబుగతి కాలము తీర్చును యెల్లవేళలన్,

ఆవల నెట్టుచూ నొకడు నానుడి దైవము చెంత ప్రార్ధనన్

దేవుని స్థానమున్ వశముఁ దెల్పగ జూపుచు సాత్వకమ్ముగన్      (52)


చం. పలువిధమౌ సరాగములు పాలను నీళ్లనుఁ గూర్చి జూడగన్

పలు పనులౌను యాశ్రయము పాశముగున్న బలమ్ము మార్చుటన్

వలపులు పాశబంధములు వాక్కుసమర్ధత భావమేయగున్

తలపులుసర్వధా మరచి తాపము మోయు విధాన చిత్తమున్     (53)  


ఉ. పాత్రుడు ధ్యానయోగముల బంధపు దర్పము లేనివాడుగన్

సూత్రములన్ని తెల్పగల సూక్ష్మము లన్ని నిరంతరమ్మునన్

గాత్రము నెన్న  ప్రార్ధనల కాలము తీర్పుల సేవభక్తిగన్

ధాత్రియు పుష్కరాక్షుని నిధాన్యముఁ జూపెడి కాలమేయగున్   (54)


ఉ. నేర్పును జూపి శాంతమున నీడల సామ్యము నెంచగల్గగన్

ఓర్పున కార్య సర్వమును నొప్పుగ తీర్పుల సాగ నంపుచున్

కూర్పున శోక కామనలు కూడుకు, గుడ్డ, గృహమ్ము గానగున్

తీర్పులు జీవ నిర్ణయము తీరులు జూపెడి సూచనా సరుల్      (55)


ఉ. నేనను వానియందు తన నెంతటి శక్తియు యుక్తియేయగున్

వానిని భక్తిగా తలచి వ్యాహృతి శాంతిగ నేన గూర్చెదన్

నా నిజ తత్త్వముల్  నెరుగ నాదగు వాటినిఁ జేరి నేర్పగన్,

ఈ నరజాతి సంస్కృతిని నిశ్చయ మెచ్చిన భక్తి భావమున్         (56)


ఉ.  రూపమనంత మై విధికి రుద్రుని కల్పనలద్ది నిత్యమున్,

ఈ పదమిష్ట భాగ్యముల నివ్విధ కారణ రూప కర్తగన్,

ఈ పలు వైభవాద్య ముల నీశ్వర సూత్రపు పొంగులే యనన్

నీ పలుకౌను సర్వమయ నిశ్చిత మీప్సిత  మైన నేనుగన్            (57)


మ. మురిపాలేవిధి కృష్ణమౌసమయమేముఖ్యమ్ము ప్రేమమ్ముగన్

సుర రక్షా కళ మార్గమై పెరుగుటే శోభిల్ల నేకమ్ముగన్

విరి మల్లీ యన వెన్నముద్దలగు నీ విశ్వమ్ము నేఁ జూచెదన్

సరియోగ్యమ్ముల యుక్తనేయి గనుటన్ సాధ్యమ్ము జీవమ్ముగన్   (58)


శా. చాలాసంతసముల్ సుధీ బ్రతుకులన్ సమ్మోహ మార్గమ్ముగన్

జ్వాలా తీతమయమ్ముజీవ మగుటన్ జాతస్య కర్తవ్యముల్

మాలాధారిగ సర్వ శోభలుగనన్ మాధుర్య నేయమ్ముగన్

పాలూనీళ్ళనుసంగమమ్ము బ్రతుకుల్ పాఠ్యమ్ము సంసారమున్   (59)


శా. హే పార్ధా నువు క్షాత్ర మొందిటుల దౌహిత్రాద్య పోరాటముల్

నీ పోరే జయమౌను చేయననినన్ నీభ్రాంతి వ్యర్థమ్ముగన్

హే పార్ధా గుణమేను ముఖ్యమగుటన్ యీతీరు వేదమ్ముగన్

యీ పోరే పురికొల్పుమేలు గుణముల్ హీరాను సారమ్ముగన్         (60)


ఉ. కర్మలు నీవు నిచ్చ బడి కాదని జేయక మోహమేయగున్

మర్మము మోహ మాయలను మానస ధైర్యముఁ జేయకున్ననున్

ధర్మము నీ పురాకృత విధానము వల్లన తత్ప్ర భావమున్

నిర్మల లక్ష్యమున్ విధివినీతిగఁ జేయును నేను నిన్నుగన్          (61)   


ఉ. జీవ మనమ్మె దైవమను జీవిత లక్ష్యము తెల్పగల్గగన్

జీవమనంగ దేహములుఁ జేసెడి యాత్రలు దాహతత్త్వముల్

జీవులు కర్మ న్యాయమున జేయుచు సత్యము పల్క గల్గుటన్

జీవుల వర్తనే బ్రతుకు జేయుచు సర్వము నేను నేనుగన్            (62)


చం. నవనవ నాడిరమ్యతలు నాందిగుణాల సయోధ్యమేనగున్

భవవరభావ సామ్యమున బంధన వృత్తి ప్రవృత్తి తేయగున్

శివ మహదేవలీలలగు చిన్మయ జీవ పరంపరమ్ముగన్,

అవసర వాక్కు మాన్యతయె యవ్యయ సంపద యౌను జీవికిన్   (63)


ఉ. మిక్కిలి యోగ్యతై పలుకు మీరక నాత్మ ప్రబోధనమ్ములన్

మక్కువ తోనునీకు పలుమార్లుగ మంచిని బోధఁ జేసితిన్,

ఎక్కువ నాలసించకము, ఏది శుభమ్మగు నిర్ణ యమ్మునన్

దక్కిన విద్యతో కదలు ధర్మపు యుద్ధముఁ జేయగా నిటన్          (64)


శా. నాయందే మదినిల్పి నన్నుఁ దలచన్ నామాట వేదోక్తిగా

నాయందే కడు శ్రద్ధగా నుతులతో నాస్పర్శ సత్యమ్ముగా

నాయందే వసియించిసర్వవిధులన్ నాకర్పణల్ జేయగా

నాయానందములన్ విశాలకతనన్ నామార్గమేధర్మమున్           (65)


శా. నాయందే మదినిల్పి నన్నుఁ దలచన్ నామాట వేదోక్తిగా 

నాయందే కడు శ్రద్ధగా నుతులతో నాస్పర్శ సత్యమ్ముగా 

నాయందే వసియించిసర్వవిధులన్ నాకర్పణల్ జేయగా 

నాయానందములన్ విశాలకతనన్ నామార్గమేధర్మమున్          (66)


చం. విడువుము ధర్మ కర్మలను విశ్వములెల్లనునీవు నేనుగన్

పడయుచు నాదుపాపములు వాక్కుగ నీశరణంబు నాకుగన్

విడువగ జేయు ముక్తిగను విద్యల నేస్తముగాను నేనుగన్

వడలగ జేతుబాధగను వాక్కుల లీల మనస్సు శాంతిగన్           (67)


శా. ఇక్కాలమ్మున భక్తిలేని యెడలన్,  ఇచ్ఛాను సారమ్ముగన్,

ఇక్కాలమ్మున తెల్పబోకు మనసా గీతా రహస్యమ్ములన్,

ఇక్కాలమ్ముకుతూహలమ్ముగనియేయీ వాక్కులర్థమ్ముగన్,

ఎక్కాలమ్మున దోష దృష్టిగలుగన్, యేమాత్రమున్ దెల్పకన్      (68)


శా. నాయందున్ కడుభక్తితోహృదయమున్ నాకేసమర్పించగన్

సాయాగూఢమనంగ మర్మములనే సాయమ్ము ప్రేమమ్ముగన్

మాయాదేహములందు ధర్మముఁగనే మార్గమ్ము నేఁ జూపెదన్

న్యాయమ్ముల్ సహవాంఛతీర్చగలగన్ నాదౌను సర్వమ్ముగన్    (69)


ఉ. భక్తితొ నన్నుఁ జేరగల భ్రాంతిని మార్చెద నేనె నిప్పుడున్

భక్తుడుగాను నాకృపల బంధము బాధ్యత నాది యేయగున్

భక్తుని క్షేమమే నరత భావము నంతయు తీర్చ గల్గగన్

ముక్తినొసంగునామదికి ముఖ్యము ధారుణి లోన నేనుగన్           (70)


మ. ఎవరే ధర్మము నెంచి నన్నుగనగా నీ మాయ మోహమ్ములన్

నవవిద్యాధరయైననేస్తమగుటే నాధర్మ జ్ఞానమ్ముగన్

అవనీజ్ఞానము పొందు శక్తిగనునేనాయుక్తి తెల్పేందుకే 

భవబంధమ్మున నన్నుగాంచుటకు నీభక్తీ వితమ్ముల్ సుధీ       (71)


చం. ఎవరతి శ్రద్ధభక్తిగన నేది మనస్సును జెర్చ గుండుటన్

ఎవరు నసూయ తాపమున నెంచక సఖ్యత కోరుకుందురో 

ఎవరనుగీతశాస్త్రముల నెంచక నిత్యము దోష మెంచునో 

నవవిధ లోక మాయలగునట్టి జనమ్ము ల నేను మార్చెదన్        (72)


శా. హేపార్థా, ఇవిపల్కులేయనకుమా యియ్యోగ్య భాగ్యమ్ములన్

హేపార్థా, ఇదిగీత పెంపు నిడగన్ హేరంబ ప్రాధాన్యతన్

హేపార్థా, వినుమోహముల్ పరుగగా హృల్లాస దేహమ్ముగన్

హేపార్థా, ఇది ధైర్యముల్ నిలుపగన్ యీభాగ్య సందేశముల్      (73)


శా. నీయాజ్ఞా భర మానసమ్మగుటతో నీవాక్కు ప్రాధాన్యతన్  

నీయాజ్ఞా స్మృతులందు చిందిన కళల్ నీమాయ తాపమ్ముగన్

నీయాజ్ఞా ప్రియతమ్ములే మిగులుగా నీశక్తి నే పొందగన్

నీయాజ్ఞల్ తలదాల్చెదన్ వినతలే  నీయాత్మ బోధమ్ములన్       (74)


చం. ఇరువురి మధ్యనున్నది ప్రహేళి ప్రయోక్త భవమ్ము నేర్పులన్

పరిపరి నేర్పులం దెలుపు పాటినిజమ్ము మనమ్ము మధ్యనన్

చెరిసగమైనయాత్మపర చింతల గీతనుయోగ ప్రాప్తముల్  

దరిహృదయాంత రంగవర ధర్మ బలమ్ము విధాత చేతలే          (75)


మ. ఇది గీతామృత  వ్యాస వృష్టి గనుమా యీసాను సారమ్ముగన్ 

మది వేద్యస్వరముల్ సుధాకరుణలన్ మాయాత్మ బోధమ్ములన్ 

విధియోగీశ్వర లీలలే తెలుపగా విద్యా ప్రభోదమ్ముగన్,  

ఇదకృష్ణుండు ఘనాఘనార్థ భవమే యిష్టమ్ము  వ్యాసార్జితమ్     (76)


శా. హేరాజా ధృతరాష్ట్ర,  గీత తెలుపన్ హేమాంగ  బోధామృతమ్ 

హేరాజా, కదనమ్ము నందునిటులన్, ఇందీవరా పార్థులే  

నీ రాజాద్య ప్రయాస పాశ తతులన్ నీచమ్ము గానెంచగన్,  

యీ రాజ్యేచ్ఛ విధాన మేనిముషమున్ యీడేరు వైవిధ్యమున్     (77)


చం. స్థలమున కృష్ణభక్తి గను సాధ్యము మంగళమౌను సత్యమున్ 

గళమును విప్పివేడుకొను గమ్యము నానతిపొంద దైవమున్ 

ఫలమునుఁ గోరకేమనసు పాఠ్యము తెల్పెడి సద్వివేకముల్ 

తలచిన దివ్యరూపమున  ధ్యాన పరమ్ము విధాన తృప్తిగన్          (78)


ఉ. ఎక్కడ కృష్ణ లీల కళలేర్పడ నిచ్ఛను కల్గి యుందురో 

నెక్కడ పార్ధ లీలకళ లేర్పడ నిచ్ఛను కల్గి యుందురో 

నక్కడ నిత్యసత్యములు, ఆలన పాలన ధర్మమేయగున్, 

దక్కును గీతబోధనలు దాగని తీరుల మానసంబునన్       


ప్రాంజలి ప్రభ .. శ్రీకృష్ణ వాణి .. శ్రీమద్భగవద్గీత అనువాద పద్యాలు  

మోక్ష సన్యాస యోగము... 18 వ అధ్యాయము సమాప్త:


శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి .. (18 )

 

కలియుగంలో మనుష్యుల్ని తరింపజేసే ఉత్తమ సాధనం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయ పారాయణం మహత్యం .  


భగవద్గీతలోని చివరి అధ్యాయం , పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగము. ఈ అధ్యాయంలో భగవానుడు అన్ని సంశయములను పరిత్యజించి, తన పైనే  మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని అర్జనునికి చెబుతారు . ఇక్కడ అర్జనుడు మానవుడు, కృష్ణుడు పరమాత్ముడు, చేస్తున్న యుద్ధం సంసారం అనే కర్మ . మనకి విధించిన కర్మాణి ఫలితం ఆశించకుండా చేయాలి . ఆ ఫలితాన్ని పరమాత్మకే వదిలేయాలి . భగవంతునిపై పూర్ణమైన విశ్వాసంతో ఉండాలి . అప్పుడు చేసిన కర్మ ఫలితం మనకి అంటుకోదు. ఈ ఉపదేశాన్ని విన్నతర్వాత  అర్జునుడు మోహ విరహితుడయ్యాడు. ఈ అర్జున, కృష్ణ సంవాదాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తూ ఉన్నారు . ఆ క్రమంలోనే “యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని” సంజయుడు వ్యాఖ్యానించారు. భగవద్గీతలోని ఈ అద్భుతమైన అధ్యాయానని ఎవరైతే నిత్యమూ పారాయణ చేస్తారో , వారికి కలిగే ఫలితాలని గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా వివరిస్తున్నారు .  

“ఓ గిరినందినీ! చిన్మయానంద సుధా రసం ప్రవహింప చేసేటటువంటి అష్టదశాధ్యాయము వేదాలలో ఉత్తమమైనది. ఇది సర్వశాస్త్ర సారము. సంసార బంధనాలని సులభంగా ఛేదించగలిగిన దివ్య  పారాయణము. సిద్దులకు మాత్రమే తెలిసిన పరమ రహస్యము.  అవిద్యను నాశనం చేసేటటువంటిది.  శ్రీమహావిష్ణువుకు నిలయమైనటువంటిది.  కామ కామము క్రోధము మొదలైన అరిషట్ వర్గాలని నాశనం చేయగల శక్తిని కలిగినది.  ఈ అధ్యాయాన్ని చదివినంత మాత్రంచేత, ఎవరైనా చదువుతుంటే, విన్నంత మాత్రం చేత  యమబాధలు తొలగిపోతాయి. 

ఓ పార్వతి! ఇంతకంటే అధికమైనటువంటి పరమ రహస్యము ఇంకొకటి లేదు.  దీనివలన త్రివిధ తాపముల చేత దహించబడేటటువంటి మనుషుల తాపము కూడా తొలగిపోతుంది.  దేవతలతో ఇంద్రుడిలాగా, రసములలో అమృతము లాగా, పర్వతములలో కైలాసము లాగా, నక్షత్రాలలో చంద్రుడిలాగా, తీర్థములలో పుష్కరము లాగా, పుష్పములలో పద్మము లాగా, పతివ్రతలలో అరుంధతి లాగా, క్రతువులలో అశ్వమేధము లా,గా ఉద్యానవనములలో నందనోద్యాన వనము లాగా, ఏకాదశ రుద్రులలో వీరభద్రుడి లాగా, కాలములలో పరమేశ్వరుడిలాగా, పశువులందు కామధేనువు లాగా , మునులలో బ్రహ్మ వేత్త అయినటువంటి వ్యాసుని లాగా , దానములలో భూదానము లాగా, లోకములందు వైకుంఠము లాగా,ఈ పద్దెనిమిదవ  అధ్యాయము లోకోతరమైనది.  

సర్వతీర్థముల యొక్క పుణ్యము ఇందులో ఇమిడి  ఉన్నది. ఇది పర్వతముల లాగా పెరిగి ఉన్న పాప రాశులను కూడా క్షణకాలంలో నశింప చేస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక పురాతన ఇతిహాసాన్ని నీకు తెలియజేస్తాను. సావధానంగా విను” అంటూ పరమేశ్వరుడు చెప్పసాగారు. 

“భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయాన్ని విన్నంత మాత్రము చేతనే జీవులన్నీ కూడా సర్వపాపాల నుండి విముక్తిని పొందుతాయి . పూర్వము మేరు పర్వత శిఖరము పైన వినోదార్థమై సృష్టికర్త చేత అమరావతి అనే పట్టణము నిర్మించబడింది.  అక్కడ సమస్త దేవతల చేత కీర్తింపబడుతూ సచీదేవితో కూడా కలిసి ఇంద్రుడు పరిపాలకుడిగా సర్వభోగాలూ అనుభవిస్తూ ఉండేవాడు .  ఒక రోజున విష్ణు దూతల చేత సేవించబడుతూ, తన సన్నిధికి వస్తున్నటువంటి ఒక పురుషున్ని ఆశ్చర్య చకితుడై చూశాడు. ఆ నూతన పురుషుని తేజము చూడలేక, సింహాసము నుండి కింద పడిపోయాడు. 

అప్పుడు దేవతలు, దేవదూతలు కలిసి ఆ పురుషుణ్ణి ఆ సింహాసనము మీదే ఎక్కించి ఆ స్వర్గ రాజ్యానికి పట్టభద్రుడిని చేశారు.  దేవాంగనలు దివ్య గానము చేస్తూ, రత్న హారతులు ఇస్తున్నారు.  ఋషి సంఘములన్నీ కూడా వేదాశీర్వచనాల్ని చెబుతూ ఉన్నాయి.  రంభ మొదలైన అప్సరసలు ఆ నూతన పురుషుని ఎదుట నృత్యం చేయసాగారు.  గంధర్వులు మంగళ గానాన్ని చేస్తూ ఉన్నారు. పూర్వము ఇంద్రుడు అనుభవించిన భోగములన్నీ కూడా అతడు అనుభవించసాగాడు. 

 

 ఈ చిత్రాన్ని చూసి మహేంద్రుడు ఈ విధంగా ఆలోచించాడు.  ‘ఆహా ఇతనిది ఎంతటి అదృష్టమో ఇటువంటి మహా భోగమునకు కారణం ఏమై ఉంటుంది? ఇతడు నా లాగా 100 క్రతువులు గాని చెయ్యలేదు కదా! బాటసారుల సౌకర్యార్థం చెట్లని నాటించడం ,  బావులు తవ్వించడం,  ఆకలిగా ఉన్నవారికి పట్టెడన్నము పెట్టడం, ధర్మశాలలు స్థాపించడం, తీర్థయాత్రలు చేయడం కానీ ఆచరించినట్లుగా లేదే! అటువంటిది, ఇతనికి ఇటువంటి భాగ్యము ఏ విధంగా చేకూరింది? అని ఆలోచిస్తూ’,  క్షీరసముద్రంలో యోగనిద్రలో  ఉన్నటువంటి మహావిష్ణువును ఆశ్రయించాడు.  

ఆయనకీ నమస్కరించి ఈ విధంగా పలికాడు.  “ఓ లక్ష్మీనాథ! పూర్వము నేను మీ ఆజ్ఞానుసారముగా నూరు యజ్ఞములు చేసి ఈ ఇంద్ర పదవిని సంపాదించుకున్నాను ఇప్పుడు మరొక పురుషుడు వచ్చి,  నా సింహాసనాన్ని అధిష్టించి, ఇంద్ర భోగాలని అనుభవిస్తున్నాడు.  ఇంతకీ అతడు ఎవరు? అతనికి ఈ ఇంద్ర ఆధిపత్యం ఏ విధంగా లభించింది? ఈ విషయాన్ని తెలియజేయండి” అని కోరాడు.  

అప్పుడు శ్రీహరి ఈ విధంగా చెప్పారు . “ ఓ ఇంద్రా, ఆ పురుషుడు ప్రతి  రోజు భగవద్గీతలోని అష్టదసాధ్యాయములోని ఐదు శ్లోకాలను భక్తితో పఠిస్తూ ఉన్నాడు.  దాని వలన అతనికి ఈ ఇంద్ర పదవి లభించింది.  ఈ అష్టదశాధ్యాయ పారాయణ  అనేది పుణ్యములకు శిరోమణి వంటిది.  నీవు కూడా దానినే  ఆశ్రయించి, మళ్లీ నీ స్థానాన్ని పొందు” అని వివరించారు. 

 అది విని ఇంద్రుడు “మంచి తరుణోపాయం దొరికిందని బ్రాహ్మణ వేషాన్ని పొంది భూలోకము చేరుకున్నారు .  కాలిక అనే గ్రామానికి వెళ్ళాడు.  అక్కడ గోదావరి తీరంలో ఒక ధర్మాత్ముడు ఉన్నారు . వేద వేదాంగ కోవిదుడు, దయాసముద్రుడు, జితేంద్రుడు అయిన ఆ బ్రాహ్మణుడు నిత్యము భగవద్గీతలోని అష్టదశాధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉన్నాడు. ఇంద్రుడు ఆ విప్రుని దగ్గరకు వెళ్లి ప్రణామాన్ని ఆచరించి, అతని చేత అష్టదసాధ్యాయాన్ని ఉపదేశము పొంది భక్తితో పారా యణం చేయసాగారు . 

 

మహావిష్ణువు అనుగ్రహించినట్టు, చివరికి  దానివల్లనే ఆ  ఇంద్రుడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు.  కాబట్టి ఈ అష్టదశాధ్యాయము మహర్షుల పరమతత్వం అని చెప్పబడుతోంది.  ఓ పార్వతీ ! అపార మహత్యపూర్ణమైనటువంటి ఈ అష్టదసాధ్యాయ మహత్యము పూర్తయింది.  ఈ అధ్యాయమును శ్రవణము చేసినంత మాత్రము చేతనే సమస్త సమస్తమైనటువంటి కష్టాలు నశించిపోతాయి.  పాపములన్ని తొలగిపోతాయి.  ఈ విధంగా నీపై ఉన్న ప్రేమతోటి పాప నాశనమైనటువంటి గీతా మహత్యాన్ని అంతా కూడా ఉపదేశించాను.  ఈ అధ్యాయాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రవణము చేస్తాడో, అతడు సర్వ యజ్ఞములను చేసినటువంటి ఫలాన్ని పొందుతాడు.  

కలియుగంలో  మానవజన్మకు తరుణోపాయములు అనేకమైనవి ఉన్నాయి.  అందులో ఏ ఉపాయాన్ని అనుసరించినా కూడా, మానవుడు తరించగలుగుతాడు.  శ్రీకృష్ణ ముఖారవిందము నుండి వెలువ వెలువడిన ఈ గీత అనే  గంగోదకాన్ని పానము చేయనివాని జన్మ జన్మమే అనిపించుకోదు . మానవ జన్మకు పరమావధి ముక్తిని పొందడమే అటువంటి తరుణాన్ని పోగొట్టుకున్నట్లయితే తిరిగి ఈ మానవ జన్మ లభించడం చాలా కష్టమైన పని.  

కలియుగంలో జనులు అల్ప వయస్కులు.  వారిని ఉద్ధరించడానికి భగవంతుడు ఈ గీతని సృష్టించారు.  అందులో గీతలోని ఒక అధ్యాయాన్ని కానీ, ఒక శ్లోకాన్ని కానీ, శ్లోకార్ధ భాగాన్ని కానీ, శ్లోకములోని ఒక పాదమును కానీ, భక్తితో పఠించినట్లయితే మనిషి ఉత్తమ గతిని పొందగలుగుతాడని స్వయంగా చెప్పి ఉన్నారు భగవానుడు.  కాబట్టి ఈ గీతా మహత్యాన్ని ఎవరు వర్ణించగలడు? కలి ప్రజలు తరించడానికి  గీతా పారాయణాన్ని కలి బాధ నుంచి ప్రజలు తరించడానికి గీతా పారాయణాన్ని మించినటువంటి సాధనము మరొకటి ఏదీ లేదు. 

 

సర్వ ధర్మాన్ పరిత్యజ్య మా మేకం శరణం ప్రజా,

 అహం త్వా సర్వపాపేబ్యో మోక్ష ఇష్యామి మాశుగః 

సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!

ప్రాంజలి ప్రభ

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు