శ్రీమద్ భగవద్గీత...సాంఖ్య యోగం.. రెండవ అధ్యాయం
శ్రీమద్ భగవద్గీత...సాంఖ్య యోగం.. రెండవ అధ్యాయం సంజయ వ్యాఖ్యానం మ.కరుణాసాగర పూర్ణుడై పొరలుచూ కర్తవ్య సంబద్ధుడై తరుణమ్ముల్ హితబుద్ధిగన్ మరుగుటన్ ధాతృత్వ మూలమ్ములన్ పరి శ్రాంతమ్మున పార్ధునున్ గనగ సంభ్రాంత్యాద్య భావమ్ములన్ కరుణార్దమ్ముల భూపతీ, తెలుప నేకాయంగుతోనిట్లనన్ (1) శ్రీ భగవాన్ వాణి కాలము కానికాలమున కానివి వాక్కుల నేలఁ జెప్పగన్, ఏలను స్వార్థమే కలిగిహెచ్చుగ తెల్పుచు యుండుటేలనన్ బాలుడవై నివేదనల పంతము సాగిల నేల నిప్పుడున్ జాలిని జూపగా నలతి జాడ్యము సద్గతి పొందకుండుటల్ (2) పిరికితనమ్ము లన్ వదలు, పేరగ నేలనొ నీకు బుర్రలో సరియగుబుద్ధి కాదది విశారద హీనము తప్పు వాదనల్ తరుణపు యుద్ధమేగతియ తప్పుల నెంచకచూడు మిప్పుడున్ దురములఁ దీరగా తెగువ దూకుడు పార్ధ, విధాన మిప్పుడున్ (3) శా.ద్రోణాచార్యులు భీష్మ పూజ్యులుగనే *ధూకంపు వ్యూహామ్ములన్ రాణమ్ముల్ సడి జేయ యుద్ధమున ధైర్యమ్ముల్ ప్రసాదించగన్ బాణాలే యరిసూదనా విధులలో బంధుత్వ విస్మాపనల్ ...