శ్రీమద్ భగవద్గీత.. కర్మయోగము.. మూడవ అధ్యాయము *
పార్ధుని ప్రార్ధన
మ. పరమాత్మా, సచి కేశవా, కలనముల్ పాఠమ్ములే గీతగా
శరణమ్ముల్ దయలుంగనన్ పొసగదీ సంభావ్య యుద్ధమ్ము నన్
వరదాతా భగవాను కృష్ణ, తమరే వ్యాజ్యమ్ము దీర్చన్ దగున్
తరుణమ్మీ కదనమ్ము నందుతమ తత్త్వమ్ముల్ ప్రయోగమ్ముగన్ (01)
శా. నీమాటల్ సరియైన బోధలగుటన్ నిక్కమ్ము శ్రేష్ఠమ్ము గా
ప్రామా ణ్యమ్ముగనుండు నీ పరమముల్ ప్రత్యక్ష యుద్ధమ్ములన్
సామాన్యమ్మగు జ్ఞానమందు జనులీ సాపేక్ష లక్ష్యమ్ముగన్,
ఈమాయా భగవాను నిర్ణయములే నీముక్తి మార్గమ్ములన్ (02)
ఉ. చేరువ సాంఖ్యయోగులకు చిత్తము నిత్యము జ్ఞానయోగమున్
చేరువ యోగ పుంగవుల చిత్తము నిష్ఠలు కర్మయోగముల్
తీరున రెండు నిష్ఠలువిధిన్ మది వాక్కులు సర్వమేయగున్
మారెడి లోకమందున సమంజస మెంచుట కష్టమేయగున్ (03)
శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి
ఉ. నిత్యము యత్నముల్ చలిపి నిర్ణయ కర్మల దీర్పులందునన్
సత్యపు కర్మలే మరచి సాధ్యము కానివి పొందలేరనన్
నిత్యము యోగనిష్ఠ శ్రిత నిర్మల సారము సాంఖ్య నిష్ఠలన్
సత్యపు సాక్షిగా మనసు సాగును కర్మల జ్ఞానయోగముల్ (04)
ఉ. కాలమందున యేమనష్యుడు కర్మ చేయక తప్పకన్,
ఏల నన్న గుణమ్ములోబడ నెంచు కర్మలు భారమున్
మేలు కానిది వ్యక్తి బాధ్యత మిన్నగా పర ధర్మముల్
జ్వాల కాంతుల నాచరించుట జాలమైచన తప్పకన్ (05)
చం. తనమున యిన్ద్రియమ్ములను తత్త్వపు చింతన జేయు బుద్దిగన్
ఘనమున జ్ఞాన బోధనలకర్మవిధమ్ము లు దెల్పు ధర్మముల్
మననముఁ జేయు చిత్తమున మర్మము లెంచగ మంచి మార్గమున్,
అనుగు జనమ్ము లాతనిని కాలపు సంధ్యగ నెన్న సాటిగన్ (06)
మ. ఇంద్రియాను గతమ్ముగా జనులిచ్ఛ మార్గము లెంచియున్
ఇంద్రియమ్ముల కర్మ యోగము లెంతనోతరుణమ్ముగన్
ఇంద్రియమ్ముల లాలసత్వ విహీనుడై విధి విద్యలన్
ఇంద్రియమ్ముల పన్నముల్ ధరనీతివిద్యల ప్రాప్తమై (07)
చం. నియతపు కర్మ జేయ ననునిత్యము సత్యపు మార్గమే యగున్
నియమము గాను కర్మలను నీవిటు మానుటయన్న సాధ్యమే
పయనము జేయు దేహములు బాధలు పొందుటసత్య మేయగున్
లయమున సర్వ నాశమగు లాస్యపు కర్మలు కూడ నంతమౌ (08)
శా. హా పార్థా పరముల్ వరాల తరముల్ యజ్ఞార్థముల్ సత్యమే
పాపమ్ముల్ యనగా విధాత విధులన్ ప్రాధాన్య నిర్దేశముల్
చేపట్టన్ కదనాంతరార్థములుగా చిత్తమ్ము తీరేయనన్
హేపార్థా సమరమ్ములౌ క్రతువులే హెచ్చైన న్యాయమ్ము లై (09)
చం. మొదట విశిష్ట ప్రాణులకు మోక్ష మొసంగు ప్రసాద సాధనల్
కదన మనంగ క్షత్రియ ప్రకర్మ లటంచు ప్రబోధనల్ వినన్
మదిని దలంచి పార్థుడు సమాగ విశారద యుద్ధ విద్యలన్
సదరు విదార వ్యూహము లసాధ్య ములైన విధాన మెంచగన్ (1o)
శా. మాయాజాలములీ ప్రవృత్త ధరణీ మాహాత్మ్య నిర్దేశముల్
ధ్యేయమ్ముల్ విధి దేవతల్ మనసులన్ దీక్షాస మాగమ్ము గన్
ప్రాయాసా ఫలసిద్ధులే జరుగుటన్ ప్రాప్తమ్ము లేసాయముల్,
సాయుజ్యమ్ము ప్రజావలంబ వరముల్ సంభావ్య సర్వమ్ము గా. (11)
ఉ. యోగ ప్రసాదమెవ్వరు నియోగము జేయగ నెంచు చుందురో
సాగుసుఖమ్ములే ప్రభవ స్వాస్థ్యపు తీరుల సంతసమ్ములన్
త్యాగము శ్రేష్ఠమన్న గుణ ధర్మపు సారము మోక్ష మందగన్
యాగము లే ప్రయోగ ప్రియ యత్నము లౌ పరమాత్మసన్నిధిన్ (12)
ఉ. యోగ ప్రసాదమెవ్వరు నియోగము చేసియు పెట్టు చుందురో
భోగమనే సుఖమ్మున సు పుణ్యము పొందుట సంభవమ్ముగన్
భోగము పాకమెవ్వడు సుబుద్ధితొ భుక్తిని చేసే యుండినన్
యోగము చేయకే తినిన నమ్మక పాపిగ పాపమేయగున్ (13)
ఉ. ఉన్నత ధర్మయోగములు మూలవివేకపు వేదవిద్యలై
మిన్నగ సత్య ధర్మ ముల మేలును నేర్పెడు కర్మసాక్షిగా
వెన్ననుఁ దిన్న కృష్ణుడిటు వేదపు సారము వేణునాదమై
తిన్నన నూది పార్థు మది దీర్చగ విచ్చెను జ్ఞాన నేత్రముల్ (14)
మ. హిత కార్యమ్ములమెండుఁ జల్ప జనరాహిత్యమ్ము లక్ష్యమ్ముగన్
హిత శుభ్రాగత వీనులన్ గదలి సౌహిత్యమ్ముఁ జేకూర్చగన్
హిత సారమ్మగు కర్మ యోగములనే ఇచ్ఛా విధానమ్ములన్
నుత మర్మమ్ముల తత్త్వ మైన గుణముల్ నూత్నంపు నేస్తమ్ముగన్ (15)
మ. ఎవరైనన్ పరమాత్మబోధలను వైవిద్యా విధేయమ్ము లన్
వివరంగా విశదీకరించగలిగే విద్యా వివేకమ్ములన్
వివశుండై మది మార్పులన్ కదనముల్ విప్పారు మార్గమ్ముగన్
వివరమ్ముల్ నెరపించుసర్వసహ ప్రావీణ్యా పరంధాముడే (16)
ఉ. జ్ఞాని నిరంతరమ్ము గను జామును బట్టి రహించు చుండగన్
మానస మందు సత్త్వ గుణమార్గపు విద్యలఁ దెల్పగల్గగన్
మానక భ్రాంతి బంధనల మాలిమి చెంది నియోగ కర్మలన్
మానిన ధర్మమున్ విడుచు మాదిరి మేల్కొను మిప్పుడర్జునా (17)
ఉ. ధ్యానము ధర్మ కార్యముల ధ్యాసను వీడగ నెందుచేతనో
నేనను గర్వమందున వినీతిని మానిన హేయభావనల్
మానవ వర్తనా విధుల మార్గపు బాధ్యత నిశ్చయమ్ములన్
మాన, క్షయమ్ము లౌను, పరమాత్మ విధాన తదాత్వమేలగన్ (18 )
ఉ. కావున యర్జునా మనసు గాయముఁ జేసెడి బంధు ధర్మముల్
నీవిక మానివేసి పరినిష్ఠిత కర్మలుఁ సాగ నీయకన్
నీవటు లక్ష్యమున్ మరచి నెమ్మది లేని విధాన కర్మలన్
భావనఁ జేయగా నిలను ప్రత్యయ హీనము గల్గుతప్పకన్ (19 )
చం. జననము నుండి సాధ్య పరి జ్ఞానము పొందిన కర్మలందునన్
కనగ విముక్తి పంతమున కర్మల జాలము విద్య వేద్యముల్
తనవిధి కర్మలేప్రతిగ ధన్యత నించెడి భాగ్య మార్గముల్
కనుకనె లోకమాయలనుఁ గాంచెడి బుద్ధినిఁ నెంచ ముఖ్యమౌ (20)
చం. సుజనుడు నేది శ్రేష్ఠ మని సూచన జేయగ నట్టి కర్మలన్
సుజనుడు నాచరించువిధి సూత్ర విధాన విధమ్ము లెంచగన్
సుజనులుఁ జేయు కర్మలు విశుద్ధ ప్రభావమయమ్ము గానగున్
సుజనుని వాక్కు లెంతటి ప్రసూన భవమ్ము సహాయమేయగున్ (21)
శా. సాకాంక్షా పరమావధీన విధి విశ్వాసమ్ము కర్తవ్యమై
ప్రాకాశమ్ము లనన్ విహార విదితా ప్రాప్తమ్ము సంసేవనల్
స్వీకారమ్ము గనన్ విధాన విహితా స్వీకార సంస్కారముల్
స్వీకార్యమ్ము విధేయముల్ విహితమౌ స్వేచ్ఛా పునీతమ్ములౌ ( 22)
ఉ. లోకము నందుకర్మలకు లొంగని ధర్మము లేదనంగ నీ
చేకొను మిన్న బోధనలఁ జీరిన సంభవ సాధ్య సత్యముల్
తాకొన కున్న లోకమిట ధర్మము తప్పిన బేలగా ననున్
ప్రాకట మెంచతథ్య మిక బంధవిముక్తుని జేసి కావుమా (23)
ఉ. నేనిట కర్మలే సలిపి నిత్యము యోగము క్షేమమేయగున్
మానిన నష్టమున్ కలుగు మానస మెంతయు కర్మ బంధమున్
నేనుగ కారకమ్మగుట నేరుగ సర్వము చూచు వాడుగన్
నేనన యర్జునా వినుము నీదయ నాదయ కర్మలేయగున్ (24)
శా యారంభమ్ముగచేయుగల్గుటవిధిన్ నత్యాస మూలమ్ముగన్
ఏరీతిన్ గతి కర్మ మూడుడుగనే యేర్పాటు చేసేయుటన్
ఆరీతిన్ మది జ్ఞాని కర్మలుగనత్యాసక్తి పొందేమదీ
నారంభించును మేలు విద్యలగను న్ నాన్యత్వ భావమ్ముగన్ (25)
ఉ. జ్ఞాని విధుల్నుసాగుగను నాణ్యత లక్ష్యము జూపగల్గగన్
జ్ఞానులకే భ్రమల్ గలుగ సత్కవి కర్మలు వల్లనేయగున్
జ్ఞాని హితమ్ము కర్మలు నిజ్ఞానులు బుద్దిగ వృద్ది చెందుటన్
జ్ఞానము సంపదే యగుట జ్ఞాతిగ ధర్మ శుకర్మలేయగున్ (26)
ఉ. వాస్తవమే మనన్ బ్ర కృతి వార్షిక జల్లులు, తాపముల్ విధిన్
వాస్తవ ప్రాప్తముల్ మమత వాక్కుల క్షీణము లెల్లవేళలన్
వాస్తవ కర్మలే మనకు వర్ధన కారణ కర్తలే యగున్
వాస్తవ పర్వముల్ హృదయ వక్త్ర కవాట నియుక్తి మార్గముల్ (27)
ఉ. కర్మవివేక తత్త్వమున కాల విలంబముఁ జేయ కుండుటన్
ధర్మ గుణమ్ములెన్న వర ధార్మికభావ ప్రవర్తనా ప్రతుల్
మర్మముగా మహాత్ములిటు మాన్యత నెంచిన కార్యసాధనన్
నిర్మల సత్వ భావన వినీతిని జూపగ నాదువాక్కులన్ (28)
మ. త్రిగుణమ్మే పర భాగ్య తత్త్వముగ శాంతీ సహ్య జీవమ్ముగన్
సుగుణావేద్యసుకర్మలన్ చలపుటే సూక్ష్మంపు ధర్మమ్ముగన్
తగవీ జీవన కర్మ భాగ్యములు వేద్యావిద్య సారమ్ము లై
జగమందీగుణముల్ వినూత్నవిధివిజ్ఞానార్థ సాధ్యమ్ము లై (29)
శా. నీకున్నట్టి విధానబోధనననే నిత్యమ్ము నేస్తమ్ము లై
నాకేయర్పణ చేయుమా మనసుగన్ నామార్గ మేనీదిగన్
శాకాంక్షా వరధర్మ కర్మలుగనే శ్రద్ధల్ విచిత్రమ్ము గన్
నాకేక్లిష్టములేనియుద్ధ విధులన్ నారక్ష నీవేయనన్ (30)
ఉ. నీవిటు ధర్మ దృష్టి గన నివ్విధి తీరుగ శ్రద్ధజూపగన్
తావుకొనంగ మా తరపు దారులు జూపగ ధర్మ పోరులన్
కావవి కాలయాపనలు కర్తగ బోధలు నీవు జేయగన్
కావున కర్మబంధములు కాలము బట్టివిముక్తి తీర్చగన్ (31 )
మ. సమతాజ్ఞానవిధాన సత్త్వ మరయన్ సాధ్యా విభావమ్ములన్
సమరా వీక్షణ లక్ష్యతా విధుల విశ్వాసార్థ సామర్ధ్యముల్
విమతా వేదన విద్యలందుఁ గలనా విస్తార వ్యూహమ్ములన్
సమరా మానస మర్మ మార్గముల దుస్సాధ్యమ్ము సాధించగన్ (32)
మ . తమ భావాలకు లోనుగా కదులుటే తత్త్వమ్ము ధర్మమ్ముగన్
తమ కర్మానుగతమ్మునన్ మలయుటే తత్కాల ధర్మమ్ముగా
తమ విద్వత్తున ప్రజ్ఞలన్ గలిపి సాధ్యాసత్త్వ బ్రహ్మమ్ముగా
తమ ధర్మమ్మున జ్ఞాన కర్మలను ప్రాధాన్యమ్ము గావించగన్ (33)
ఉ. దాగవు కోపతాపములు తాహతు మించిన కర్మ బంధనల్
యోగికి మంచి చెడ్డలును యోగ్యత గా నవి యొక్కటే యగున్
భోగికి సౌఖ్యమే రమతి భూరిజ మందున దోష బుద్ధిగన్
జాగున తారుమారుగల చర్యలు కాగల సాధ్యమేయగున్ (34)
మ. పరధర్మమ్ముల నాచరించగలిగే భావమ్ము లెందెందునన్
సరికాదేయది భంగమే యగుటకున్ సాధ్యమ్ము తథ్యమ్ము గా
పరమోత్తమ్మగు ధర్మమే స్వయముగా ప్రాశస్త్య సత్త్వమ్ముగన్
తరుణా ప్రాప్తము లెప్పుడున్ విధులుగా దైవాంశ సంభూతమై (35)
శా. హేకృష్ణా మధుసూదనా భవ సుధీ, యెన్నంట నీవుండగన్
నాకర్తవ్య నియోగ రీతులు ప్రధానాధార సంశోధలన్
జేకూర్చే బలవంత ప్రేరితములన్ చిత్తమ్ము నింపారగన్
నాకార్యా చరణమ్ము లీ ప్రభవ విన్యాసాల సంప్రాప్త ముల్ (36)
చం. మనిషి రజోగుణమ్ముల ప్రమాద విదీర్ణ వివేద్య మాయలన్
మనిషి మరోగుణమ్మనెడి మత్సర చోద్య మనస్సు క్రుద్ధమై
మనిషికి సత్త్వ కర్మలను మన్నన జేయగ బోధ నాదిగా
మనిషి నెరుంగుటేసుగుణ మర్మపు మూలము నేనె యర్జునా (37)
మ. పొగచేనగ్నిని గుర్తు జేయు విధిగా ప్రోక్తంపు గమ్యమ్ము లన్
సెగచేవిస్తృత యుద్ధముల్ పొలుపులన్ స్వీకార సంకేతమై
తగు యుక్తమ్మగు జీవనా విధులచే తాదాత్మ్య శక్తేననున్
తెగువంజూపుట యుద్ధ జ్ఞానమగు నిర్దేశంపు కర్తవ్యముల్ (38)
ఉ. తామస మగ్నితో సమము ధారణ నాశన మార్గమేయగున్
నీ మది కోర్కెలేవిధిగ నిచ్చగ మారుట నిత్య సత్యముల్
నా మది జ్ఞానమున్ తరచి నాపర జ్ఞానము జేరగల్గుటన్
సామము నేను జెప్పవిని సర్వ జగత్తులు తీరు సత్యమై (39)
చం. మనసున నింద్రియాలను సమాన విధాన సహాయ ముండగన్
మనలను కాంక్ష భావనల మార్పులఁ ద్రిప్పుచు నుండ గల్గగన్
క్షణమగు జన్మ భంగురము క్షార గుణమ్ముల వ్యర్థ మందగన్
తనమన భేదముల్ విడచి ధర్మ సమానము వైపు తీర్పులన్ (40)
ఉ. భావన లెన్న వర్తన ప్రభావము లందున నాదు వాక్కులన్
నీవిహ బంధనా లెనయ నిత్యము నిర్ణయ ప్రజ్ఞ జ్ఞానముల్
కావున నీకు యుక్తములు కయ్యము జేయగ నేర్పు పొందగన్
సావి సుసాధ్యపాటవము సంహిత నేర్పుల తీర్పు పెంచగన్ (41)
మ. బలదేహమ్మున నింద్రియమ్ములుగనన్ బంధమ్ము చేకూర్చగన్
బలమైతీరిన శక్తి యుక్తులిటు సంభావ్యమ్ము శ్రేష్ఠమ్మగున్
తలపుల్ బుద్ధిగ సత్వతత్త్వమన ప్రాప్తామేయ మాత్రేయగున్
కలలన్నీ విధి చిత్త శుద్ధిగలుగన్ కర్మార్థ మార్గమ్ములన్ (42)
ఉ. ఈవిధి బుద్ధికంటెను మహీతల మందున మిన్న లేదికన్
కావుము సర్వ మాయలకు కర్తవు నీవుగ ధర్మ తీర్పులన్
కావు మహాత్మ నన్ననిన కవ్వడి గాంచిన గృష్ణుడిట్లనెన్
నా వశమైన మిత్రుడవు న్యాయము నీకిక మాప్తము
మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
***[7:23 pm, 23/2/2025] Mallapragada Ramakrishna: శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి.. (3,4)
సంసార సాగరాన్ని దాటించగల నావ భగవద్గీత - మూడవ, నాల్గవ అధ్యాయాలు .
భగవద్గీతా పారాయణ మహత్యాన్ని ఈ మార్గశిరమాసంలో తెలుసుకొని ఆయా అధ్యాయాలని శ్రద్ధగా చదవడం వలన ఖచ్చితంగా దుర్లభమైన భగవద్సాక్షాత్కారాన్ని , వైకుంఠ వాసాన్ని పొందవచ్చు. అసలు ఈ మాసమునకే మోక్షమాసం అని పేరు. అనంతమైన పాప రాశిని ధగ్ధం చేయగలిగిన, అనంత పుణ్య ప్రదమైన ఆ భగవద్గీతలోని మూడవ, నాలుగవ అధ్యాయ పారాయణా ఫలితాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరిస్తూ , భయంకరమైన సంసార సాగరాన్ని దాటించగల నావవంటిది ఈ అధ్యాయాల మహిమ అని వివరించారు. మొదట శ్రీమన్నారాయణుడు లక్ష్మీ దేవికి వివరించిన ఈ అధ్యాయ మహిమని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెబుతున్నారు
“దేవీ ! ఏ అధ్యాయాలు పారాయణం మహత్యం చేత రేగు చెట్ల రూపంలో ఉన్న కన్యకలు శాప విముక్తులై స్వర్గాన్ని పొందారు.
గంగాతటములో వారణాసి అనేటటువంటి పురము ఒకటి ఉన్నది. అక్కడ విశ్వనాధుని ఆలయములో భరతుడనే మహాత్ముడు యోగనిష్ట కలవాడై, ఆత్మ చింతాతత్పరుడై నిత్యము శ్రీమద్ భగవద్గీత మూడవ, చతుర్ధాధ్యాయాలను పారాయణ చేస్తూ ఉండేవాడు. కొంత కాలమునకు అతడు శీతోష్ణముల పట్ల, సుఖదుఃఖాల పట్ల సమ భావము కలవాడై, మహాత్ములని సందర్శించాలనే కోరికతో ప్రపంచ పర్యటనము చేయడానికి బయలుదేరాడు.
ఒక రోజున అరణ్యంలో ప్రయాణం చేస్తుండగా సాయం సంధ్యా సమయం అవడం చేత కాలకృత్యాలు తీర్చుకుని గీతా ధ్యాయాలు పారాయణ చేసి ఒక రేగు చెట్టు మూలంలో శిరస్సు నుంచి మరొక రేగు చెట్టు వైపుకు పాదములు చాచి నిద్రకు పక్రమించాడు. ప్రాతః కాలంలో అక్కడ నుంచి లేచి మరొక చోటకి వెళ్ళాడు. అప్పటి నుండి ఐదు రోజులు గడిచేటప్పటికీ ఆ వృక్షాలు రెండు కూడా క్రమంగా కృసించిపోయి, కాలధర్మము చెందాయి. తిరిగి ఉత్తమ బ్రాహ్మణ కులములో పూర్వజన్మ స్మృతి గల బాలికలై జన్మించారు. అలా వారికి ఏడు సంవత్సరములు నిండాయి .
దైవ వశమున ఒకనాడు ఆ భరత మునీంద్రుడు పర్యటన చేస్తూ, వారి ఇంటికి వెళ్లారు. అప్పడా కన్యలు ఆయన్ని గుర్తుపట్టి , సాష్టాంగ ప్రణామాలు చేసి, “మహాత్మా! మీ దయవలన మేము ఇద్దరమూ తరించాము. మేము అరణ్యములో రేగు చెట్ల రూపంలో ఉన్నప్పుడు మీ శరీర స్పర్శ వలన మానవ జన్మమును పొందాము.” అని సంతోషముగా విన్నవించారు. అప్పుడాయన సావధానంగా వారి చరిత్రని తెయజేయమని కోరారు. “మునివర్య గోదావరి తీరములో చినపాపము అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ సత్యతపుడు అనే తపస్వి ఉన్నారు. ఆయన గ్రీష్మ రుతువులో పంచాగ్ని మధ్యలో, వర్షాకాలంలో వర్షించే వర్షధారలలోనూ, శీతాకాలంలో కంఠము లోతు గల చల్లని నీటిలోనూ నిలిచి ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తూ ఉండేవారు.
అటువంటి తపస్సు చేత కృశించి పోయిన ఆయాన దేహం పైన చర్మం అంటా కూడా మొదలు పడిపోయింది. అయినప్పటికీ నిష్కల్మషమైన ఆయన అంతర్భాగపు తేజస్సు చేత ఆయన ప్రకాశవంతంగా కనిపించేవారు. నిత్యము ఆత్మ ధ్యాన నిమగ్నుడై ఉండే ఆతపస్వి ఉపదేశాలని వినేందుకు స్వయంగా బ్రాహామా దేవుడే అక్కడికి విచ్చేసేవారు. ఒక్కొక్కసారి ఆ బ్రాహామా వచ్చినా, సత్యతపుడు సమాధి నుండీ బయటికి వచ్చేవారు కారు. అయినప్పటికీ బ్రహ్మగారు ఆయనని కూడా పరమ మిత్ర భావంతో గౌరవిస్తూ ఉండేవారు.
అటువంటి సత్యతపుని తపస్సుని చూసి ఆయన తపోబలము తన పడడవికి ఎక్కడ చేటు తెస్తుందో నని భయపడిన ఇంద్రుడు దుష్ట పన్నాగం పన్నాడు. అప్సరా గణాలని పిలిచి, వారిలో ఉన్న మా ఇద్దరినీ , స్వర్గరాజ్యమును కోరి తపస్సు చేస్తున్న ఈ సత్యతపుని తపస్సుకు విఘ్నాన్ని కలిగించండి అని ఆజ్ఞాపించారు. దాంతో మేమిద్దరం కూడా అతని ఆజ్ఞనుసారంగా సత్య తప్పుడు తపమాచరిస్తున్న ప్రదేశానికి వెళ్లి, అక్కడ మధురముగా గానం చేయడం ప్రారంభించాము. నృత్యం చేస్తూ, ఆయన్ని ఆకర్షించి తపోభంగం చేయడానికి ప్రయత్నం చేశాము.
అప్పడా మునీంద్రుడు మాపైని కోపంతో చేతిలోకి జలాన్ని తీసుకొని ‘ మీరిద్దరూ కూడా గంగా తీరంలో రేగుచెట్లై జన్మించండి’ అని శపించారు. ఆ వెంటనే మేము మా స్వామీ ఆజ్ఞకి బద్ధులమై ఈ పాపకార్యానికి ఒడిగట్టామని గ్రహించి , మాపై దయతో ‘భరతముని మీ సన్నిధికి వచ్చేంతవరకు మీకీ శాపం ఉంటుంది. ఆ తరువాత మీరు శాప విముక్తిని పొంది పూర్వజన్మ స్మృతి కలవారై మానవలోకములో జన్మించి క్రమంగా మీ పూర్వ స్థానాలను పొందగలరు’ అని శాప విమోచనాన్ని అనుగ్రహించారు .
కాబట్టి ఓ మునిపుంగవా ! ఆ రోజు నుండీ మేము రేగు వృక్షాల రూపంలో పది ఉన్నాము. మా మీరు మా సన్నిధికి వచ్చి, గీతా తృతీయ, చతుర్ధాధ్యాయ పారాయణ చేసేంతవరకు కూడా తరు రూపంలో ఉండిపోయాము. ఆ తరువాత తరురూపము పోయి మానవత్వము సంప్రాప్తించింది.” అని చెప్పారు . అప్పుడు భారతమునీంద్రుడు, “కన్యలారా ! ఆ మహత్యము నాది కాదు . ఖచ్చితంగా భగవద్గీతలోనిమూడవ, చతుర్దాద్యాయ శ్రవణా ఫలితము. కాబట్టి ఇక మీదట మీరు గీతా చతుర్ధాధ్యాయమును పారాయణ చేస్తూ, మిక్కిలి భయంకరమైనటువంటి ఈ సంసార సాగరాన్ని దాటి ముక్తిని పొందండి” అని వారికి ఉపదేశించారు.
కాబట్టి ఓ పార్వతీ ! ఈ గీతలోని అధ్యాయాలు పారాయణ చేయడం చేత వృక్షముల కూడా తరిస్తాయి. మానవులు తమ సంసార సాగరాన్ని దాటి ముక్తిని పొందగలరు .” అని పరమేశ్వరుడు తెలియజేశారు .
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!
ప్రాంజలి ప్రభ
[7:31 pm, 23/2/2025] Mallapragada Ramakrishna:
ఇప్పుడు III IUU అమరికతో 6 అక్షరాల వృత్తమును తీసికొందామా?ఇందులో సవ్యముగా తీసికొన్నప్పుడు మనకు ఈ ఆఱు వృత్తములు లభిస్తాయి:
III IUU;
III UUI;
IIU UII;
IUU III;
UUI III;
UII IIU.
అందులో రెండు క్రింద:
*
శశివదనా - న/య IIII UU
6 గాయత్రి 16
అతికలి - త/న UU IIII
6 గాయత్రి 61
*
UU IIII - అతికలి
IIII UU - శశివదనా
*
అతికలి:
*
అమ్మా వినఁగను
రమ్మా నను గన+
కొమ్మా మనమున
సొమ్మై తనయకు ... (1)
*
ఇదే వృత్తము పద్య గర్భకవితగా:
శశివదన:
*
వినఁగను రమ్మా
నను గన+ కొమ్మా
మనమున సొమ్మై
తనయకు నమ్మా ... (2)
*
ఇదే వృత్తము పాద గర్భ కవితగా:
*
వినఁగను నమ్మా
నను గన రమ్మా
మనమున+ కొమ్మా
తనయకు సొమ్మై ... (3)
*
రెండవ, మూడవ పద్యముల గణ స్వరూపము ఒకటైనను, అవి రెండు మొదటి పద్యముపైన ఆధారపడి యున్నవైనను, పదస్వరూపములు వేఱు వీటికి.
*
అందువలన ఆవృత్త వృత్తములలోని గర్భకవిత్వము రెండు విధములు. అవి పాదములలోనివి, మొత్తము పద్యములోనిది.
*
****
ఒకపరి నియమిత విధుల నొనగొని గురిపరమెనయ
సకలము నెనరగు కథలు చకితములగువినబడగ
వికసిత విజయపు మిరలు విరుపుల విలువల తరలు
ప్రకటిత నెరవుల ప్రకర పరములు మనకు వరములు
Comments
Post a Comment