మల్లాప్రగడ సూచించిన సూత్రం —(1) “యథానుభూతానుమితశ్రుతార్థా విసంవాదివచనః పుమాన్ ఆప్తః” — సోమదేవుని నీతివాక్యామృతం, విచార సముద్దేశం, 15వ సూత్రం పదచ్ఛేదం యథా–అనుభూత–అనుమిత–శ్రుత–అర్థాః అనుభవంతో తెలిసినవి, తర్కంతో నిర్ధారించినవి, శాస్త్ర/వేద వచనాల ద్వారా తెలిసిన అర్థాలు విసంవాది–వచనః విరుద్ధం కాని, సత్యానికి తగిన మాటలే చెప్పువాడు పుమాన్ వ్యక్తి ఆప్తః ఆప్తుడు (నమ్మదగినవాడు, విశ్వసనీయుడు) సరళ భావార్థం తన అనుభవం, తర్కం, శాస్త్రజ్ఞానం — ఈ మూడు ఆధారాలపై నిలిచి, వాటికి విరుద్ధం కాని సత్యవచనాలే పలికే వ్యక్తి “ఆప్తుడు” అవుతాడు. తాత్పర్య విశ్లేషణ సోమదేవుడు ఇక్కడ ఆప్తత్వం (Authority / Trustworthiness) ఎలా ఏర్పడుతుందో స్పష్టంగా చెబుతున్నాడు. ఆప్తుడికి మూడు మూలాలు అవసరం: అనుభవం (అనుభూతి) – జీవనంలో ప్రత్యక్షంగా తెలిసిన సత్యం తర్కం (అనుమానం) – వివేకంతో పరీక్షించిన నిర్ణయం శాస్త్రం (శ్రుతి) – సంప్రదాయ జ్ఞానానికి అనుసరణ ఈ మూడు పరస్పరం విరుద్ధం కాకుండా ఒకే సత్యాన్ని సూచించినప్పుడు, అటువంటి మాటలు చెప్పేవాడే ఆప్తుడు. తే. గీ మనసు ననుభవ పదములు మలుపు గతియు చలన తర్కవితర్కపు చాప తీరు శాస్త్ర ము సమన్వయ పలుకు స...
Posts
Showing posts from December, 2025