kavialu -42
ఓం శ్రీ రామ్ - శ్రీ మాయాత్రే నమ: వాహిక - 4 ఓ మనిషి తెలుసుకో తెలుసుకొని మసలుకో ....... 1 మొగాడు నచ్చితే ప్రేమిస్తాడు ఆడది నమ్మితే ప్రేమిస్తుంది మొగవాని ప్రేమ అనంతము ఆడదాని ప్రేమ బిడ్డకు సొంతము ప్రేమంటే తీసుకోవటం కాదు జీవితాంతము ప్రేమను పంచటమే ప్రేమున్న హృదయంలో మరుపుండదు ప్రేమ లేనివారికి నిద్ర అసలుండదు పెళ్ళైన కొత్తలో జన్మజన్మల బంధం కొన్నాళ్ళకు పిల్లల పోషణతో బంధం మరికొన్నాళ్ళకు ఒకరికి ఒకరైన బంధం ఇంకొన్నాళ్ళకు ఆరోగ్యం సహకరించని బంధం కాలం నీదైతే తప్పు ఒప్పవుతుంది కాలం నీదికాకపొతే ఒప్పు తప్పవుతుంది ఒకరికి తొమ్మిది సంఖ్య అదృష్ట మవుతుంది మరొకరికి ఉల్టా ఆరు సంఖ్య అదృష్ట మవుతుంది ఓ మనిషి తెలుసుకో తెలుసుకొని మసలుకో --((*))--