Posts

గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2  సాహితీమిత్రులారా!  గణపతి: అంతు చిక్కని వింత దేవుడు రెండవభాగం ఆస్వాదించండి-  (డిన్నరును ముగించిన పిమ్మట ప్రమదామణియైన సతీదేవి ‘వేద వాఙ్మయంలో ఏ మాత్రమున కనిపించని గణేశుడు పురాణకాలం నాటికి దేవ గణంబుల నాయకుడిగా ప్రఖ్యాతి పొందిన తెఱంగు తేటపడ వినం గుతూహలంబై యున్నది, వినిపింపు’మని యడిగిన సుఖాసీనుడైన సురేశ్వరుండు, గజముఖుడైన వినాయకుండు విఘ్ననాయకుండై దేవగణంబున జేరి గణాధిపతియైన కథాక్రమంబును ఈ ప్రకారంబుగా చెప్పదొడంగెను!)  వేదసాహిత్యంలో గణపతి  వేదసాహిత్యం అంటే నాలుగు వేదాలే కాదు, ఈ నాలుగు వేదాలలోని శ్లోకాల అర్థాన్ని వివరించడానికి తరువాతి కాలంలో వివిధ వేదపాఠశాలల్లో చెప్పుకున్న వ్యాఖ్యానాలను కూడా వేదవాఙ్మయంలో భాగంగానే పరిగణిస్తారు. బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు ఇవి వేదాలకు అనుబంధాలుగా వచ్చిచేరాయి.  వేదపాఠానికి తొలినాళ్ళలో రాసిన వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలు అంటారు. ప్రతి వేదశాఖకు (పాఠశాలకు) సొంత బ్రాహ్మణాలు ఉన్నాయి. ఉదాహరణకు ఋగ్వేద సంహితకు 21 శాఖలు ఉన్నట్లుగా చెబుతారు కాని, మనకు ఆరు బ్రాహ్మణాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. ఇందుల...

అక్షర గుణింత రామకృష్ణ రామాయణం

ప్రాంజలి ప్రభ  -- 2015 న రైల్లో కూర్చిని క్లుప్తంగా వ్రాసిన    "మల్లాప్రగడ వారిఅక్షర  గుణితం రామాయణం "  కమ్ము కుంటున్న రాక్షస మాయను తొలగిస్తూ కాలంతో పోటీపడ్తూ సంతానం కోసం కౌసల్య, సుమిత్ర, కైకేయిని వివాహమాడి కిన్నర, కింపురుష, సమస్త దేవతలు దీవించగా దశరధ మహారాజు రాజ్యమేలే కీలకమైన నిర్నయాలతో పుత్రులకోసం పుత్ర కామేష్టి యాగం చేసే కుల పెద్దలను, బ్రాహ్మణులను పిలిపించి యజ్ణ యాగాదులు చేయించే కూలంకుఫముగా యాగాలు చేయగా అగ్నిగుండంనుండి యజ్ణ పురుషుడు ఆవిర్భవించే కెంపులతో నిండిన పూర్ణకుంభ పాయసము అందించే కేక వేస్తూ పాయసాన్ని పుత్రులకోసం రాణులు సమముగా పంచుకొనె కైక మాత్రము అతి ప్రేమ వలక పోస్తూ అక్కలతో వంత పలికే కొంత మంది దేవతలు తమ అంశలుగా భూలోకమున జన్మించే కోలాహలముతో అయేధ్యా నగర మంత సంబరపడే కౌమారదశలో వారు అతి ఉత్సాహము వెళ్ళబుచ్చిరి కందోళ రాగంలో సంగీత న్రృత్య పదర్శనలు జరిపే కః కుః అంటూ సమస్త జన సమూహము సంబరములు జరిపె ఇది గుణింత రామక్రృష్ణ రామాయణం రమణీయముగా రాజ్యం యేలక రాకసి మాటలను బట్టి రాజ్యత్యాగచేసి రిక్తహస్తాలతో నూలు వస్త్రాలు ధరించి రీతి ఇది అనక, సతితో, తమ్మునిత...

యోగ వాశిష్ట సారము

వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము 14. దృశ్య జగుత్తు ఉద్భవించుట పరమ పవిత్రమైన బ్రహ్మము నుండె, ఈ దృశ్యజగత్తు ఎట్లు యుత్పన్నమగు చున్నదో తెలుసుకొనుము. ఈ విశ్వము అనంత ప్రకాశ స్వరూపమగు పరమాత్మ స్వరూపమే. ఈ బ్రహ్మం ఆకాశము కంటె సూక్ష్మం. ప్రథమమున అహం జ్ఞానముతో కూడి, అందుండి జ్ఞాన సంస్కారములన్నియు వెడలుచున్నవి. తదుపరి చిత్త వృత్తులతో కూడి క్రమముగా సంవేదనలు ఉత్పన్నమై ఆత్మభావము విస్మరించి, సంసార ఉపాధితో కూడిన జీవభావము పొందును. కాని బ్రహ్మ భావము తొలగిపొదు. క్రమముగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పదార్ధములతో పంచభూతము లేర్పడినవి. ఆకాశము నుండి తన్మాత్ర అయిన శబ్ధము ఉద్భవించినది. ఆ శబ్ధమే వేదములుగా వికసించినది. ఆ వేద శబ్ధముల అర్ధములే ఈ జగత్తు రూపములు. అందులో వాయువు ఏర్పడి, అందుడి చతుర్దశభువనములు, ప్రాణి స్వరూపములు జన్మించినవి. ఈ వాయువే స్పర్శ తన్మాత్రగ రూపొంది సర్వభూతములు స్పందన కార్యము. ఈ వాయువుచే నిర్వహించబడుచున్నది. ఈ వాయువు నుండి ప్రకాశాత్మకమైన తేజస్సు, తేజస్సు నుండి సూర్యుడు, అగ్ని, విద్యుత్తు మొ|| తేజోపదార్ధములు ఉత్పన్నమగుచున్నవి. ఈ తేజస్సు నుండి జలము ఉత్పన్నమై రుచి అను తన్మాత్ర ఏర్పడుచు...