అక్షర గుణింత రామకృష్ణ రామాయణం


ప్రాంజలి ప్రభ  -- 2015 న రైల్లో కూర్చిని క్లుప్తంగా వ్రాసిన  
 "మల్లాప్రగడ వారిఅక్షర  గుణితం రామాయణం " 

కమ్ము కుంటున్న రాక్షస మాయను తొలగిస్తూ
కాలంతో పోటీపడ్తూ సంతానం కోసం కౌసల్య, సుమిత్ర, కైకేయిని వివాహమాడి
కిన్నర, కింపురుష, సమస్త దేవతలు దీవించగా దశరధ మహారాజు రాజ్యమేలే
కీలకమైన నిర్నయాలతో పుత్రులకోసం పుత్ర కామేష్టి యాగం చేసే
కుల పెద్దలను, బ్రాహ్మణులను పిలిపించి యజ్ణ యాగాదులు చేయించే
కూలంకుఫముగా యాగాలు చేయగా అగ్నిగుండంనుండి యజ్ణ పురుషుడు ఆవిర్భవించే
కెంపులతో నిండిన పూర్ణకుంభ పాయసము అందించే
కేక వేస్తూ పాయసాన్ని పుత్రులకోసం రాణులు సమముగా పంచుకొనె
కైక మాత్రము అతి ప్రేమ వలక పోస్తూ అక్కలతో వంత పలికే
కొంత మంది దేవతలు తమ అంశలుగా భూలోకమున జన్మించే
కోలాహలముతో అయేధ్యా నగర మంత సంబరపడే
కౌమారదశలో వారు అతి ఉత్సాహము వెళ్ళబుచ్చిరి
కందోళ రాగంలో సంగీత న్రృత్య పదర్శనలు జరిపే
కః కుః అంటూ సమస్త జన సమూహము సంబరములు జరిపె

ఇది గుణింత రామక్రృష్ణ రామాయణం

రమణీయముగా రాజ్యం యేలక
రాకసి మాటలను బట్టి రాజ్యత్యాగచేసి
రిక్తహస్తాలతో నూలు వస్త్రాలు ధరించి
రీతి ఇది అనక, సతితో, తమ్మునితో
ఋషులు నివసించే ఆశ్రమము చేరి
రూకలు కోసం జంతువులను వేటాడి
రెప రెప లాడు కంటిరెప్పలా కాపాడి
రేపు అనేది చూడక నేడే సుఖించు అని
రొఖ్ఖం జోలు పోక కందమూలాలు తింటు
రైతువలే శ్రమిస్తూ రాజునని తలపక 
రోషం తెచ్చుకోక భార్య కోరిక తీర్చుటకై
రౌతు వలే బంగారు లేడిని వేటాడి చంపి
రంజిల్లక రక్కస మాటలు వినీ యేమి న
రః కష్టములు కమ్మె అనిరి వనదేవతలు

ఇది అక్షర గుణింత రాఘవ రామాయణం

లలిత లావణ్య సుకుమారి సతి జానకి
లాలన పాలన రక్షణగా ఉన్న లక్ష్మణా విను
లిఖించి చెప్తున్న, అన్నగారి ఆర్తనాదం వినలేదా నా తను 
లీ ఆశతో నీవు నామాట పట్టించు కోవుట లేదు
లుక లుక లాడే నీ మనసు మార్చుకో నామీద ఆశ 
లూ, మానుకొని తక్షణం నా మాటలు ఆచరించు కను
లె, తిప్పుట, మాటను ధిక్కరించుట నీకు తగదు 
లే లేచి అన్నను రక్షించు, వదినా నీ కను సైగలే పల్కు
లై, నీచరణాలే పష్పాలై, నీభాష్యాలే శిరో ధారులై వల
లొ చిక్కిన చేపను నేను, నేను గీసిన రేఖలను 
లోకం కోసం యే నిముషము దాటక ఉండవలె
లౌక్యము ప్రవర్తించుట మీరు నేర్చు కోవలె
లంపటపు పలుకులు పలకక మది శాంతితలచవలె మర
లః మాటలు మన్నించి రేఖలు దాటి రావలదు ఇది నాఆన
ఇది అక్షర గుణింత రామకృష్ణ  రామాయణం

వడి వడిగా పరుగు లిడితూ అన్నను చేరె లక్ష్మణుడు
వాదన మరిచి విషయము గ్రహించి రాక్షస మాయని తలచి
వివరములను తెలుసు కొని రాక్షస మాయను 
వీడి మదిలో చేరె వింత ఆలోచనలు ఇరువురికి
వుండ బట్ట లేక అగ్రజుడు స్వరము పెంచి చెప్పిన మాట 
వూరక గాలిలా వేగముగా వచ్చి నమ్మినవారిని వదలి 
వెను తిరిగి వచ్చుట నీకు భావ్వమా, ఒంటరి స్త్రీ ని 
వేదనలో ఉంచి వచ్చుట, నీకు సంభావ్వమా
వైకల్యం వీడి ఆలోచించు, నీవు చేసిన తప్పును గ్రహించు
వొక మాట, వొక బాణం, వొక పత్ని అని 
వోర్పుతో ఉన్న నన్ను వాళ్ళ చేరి నీవు పెద్ద తప్పు చేసావు లక్ష్మణా
ఔను లక్ష్మణా విధిని యెవ్వరూ తప్పించ లేరు
వంద తప్పులు చేసిన క్షమించే గుణం పెంచు కోవాలి న
వః విధాలు ప్రకృతి మాయ నుండి తప్పించు శక్తి లేదు లక్ష్మణా

ఇది అక్షర గుణింత రామకృష్ణ రామాయణం

మమత మంజుల మనోహర వాణి
మానస మానవ సంచారి, బిక్షాం దేహి దేహి
మినుగురు పురుగులా మెరవక,
మీన వేషాలు వేయక, గీత దాటి వచ్చి
ముణి మహా ప్రవరున్ని , అడుగుతున్నా బిక్ష
మూతి బిగువులు పక్కన పెట్టి, వేగముగా తెమ్ము బిక్ష
మెదడుకు తట్టుట లేదా, నామాటలు నమ్ముట లేదా
మేరు పర్వతము వంటి ఋషి వచ్చి భిక్ష అడుగు తుంటే
మైకము కమ్మి ఉన్నదా, మాటను పట్టించు కోవాలని లేదా
మొనతేలి ఉన్నావు, మోము చూపక ఉన్నావు
మమ్ము గ్రహింప లేకున్నావు 
మౌనము వీడి గీతలు దాటి భిక్ష వేయుట ధర్మమని తెలియదా
మంగళ కరమని భావించి భిక్ష జోలిలౌ వేసె, మం
మః అంటూ రావణుడు సీతను అపహరించే

ఇది అక్షర గుణింత రామకృష్ణ రామాయణం

జటాయువను గరుడ పక్షి ధైర్యంతో యుధ్ధం చేసె రావణుని తో
జాతి అహంకారము వదలి సీతను విడిచి పెట్టుము రావణా
జిలుగు జిలుగు మెరుస్తూ శక్తి కొద్ది పోరాడే రావణునీతో
జీవితము రావణుని కరవాలమునకు చిక్కి నేలకు ఒరిగే
జుమ్ జమ్మని సీత ఆభరణములు తీసి నేలపై విసిరే
జూదము వంటి ఆటకు చిక్కి తప్పుకొనే దారిలేక విలవిల లాడే
జెపము ద్వారా శక్తిని గ్రహించిన
జేష్టుని చేష్టలు మంచవి కావని హితవు పలికే విభీఫణ
జైత్రయాత్రకాదు, ఇది లంకా నాశినని గ్రహించ లేకున్నావు
జొరబడి నా అభిప్రాయం తెలియ పరుస్తున్నా
జోలపాడి చెపుతున్నా , నీ మ్రృత్యువు నీఇంట ఉంచావు
జౌ నిన్ను ఆవహించిందీ, నిన్ను , నీవు ఆరాధించే శివకూడా మార్చలేడు
జంతువులా నీవు బలికాక తప్పదు 
జః నామాటలు అర్ధంచేసుకో, సీతను పంపి లంకను రక్షించుకో

యక్కడ అని అరవటం కాదు 
యాదృశ్యము చూసి  తెచ్చుకో 
యిలలో నీవు తెలుస్కోవలసిన విషయం రాముడ్ని చూడు 
ఈ శ్వర శక్తి కలవాడు నీభక్తిని దుర్వినియోగం చేయకు
యెల్లలు ఎప్పుడు నీవు అనుకోవద్దు  
యేకంగా మొత్తం తల్లక్రిందులు అవుతే ని బ్రతుకే ఉండదు 
ఐ న నీకే అనుభవం వస్తుంది అప్పుడే ఏడుస్తావు 
ఒ కటి అనుకోని మరొకటి చేస్తావు నీవు 
ఓ0 నమ: శవాయ జపం మంచికే ఉపయోగాపడుతుంది 
ఔను అన్న కాదు అన్నా నీ మరణం తథ్యం తథ్యం 
అం అని అందరిని మింగగలవేమోగాని హనుమంతుని కదల్చలేవు 
ఆ:అని రాముడ్ని చూసి ఆ-శ్చర్య పడటమే నీవంతు అని పలికే సీత 
ఇది అక్షర గుణింత రామకృష్ణ రామాయణం

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు