రామకృష్ణ గీత.. 01-12
రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (1)
సమస్త దేవతలు మానవులు ఏదేవునికి మొదట నమస్కరించి, తమతమ పనుల యందు కార్యసిద్ధికలవారై నారో అట్టి మహిమ గల విఘేశ్వరునికి నేను మొట్టమొదట నమస్కరించెదను
శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్ధించుకుందాం
కృష్ణం కలయ సఖిముఖారి రాగం
తాళం: ఆది ... నారాయణ తీర్ధ
22 /07 /2023
రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (2)
సమస్త దేవతలు మానవులు ఏదేవునికి మొదట నమస్కరించి, తమతమ పనుల యందు కార్యసిద్ధికలవారై నారో అట్టి మహిమ గల విఘేశ్వరునికి నేను మొట్టమొదట నమస్కరించెదను
శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్ధించుకుందాం
కృష్ణం కలయ సఖిముఖారి రాగం
తాళం: ఆది ... నారాయణ తీర్ధ
పల్లవి
కృష్ణం కలయ సఖి సుందరం బాల (కృష్ణం)
చరణం 1
కృష్ణం గతవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల (కృష్ణం)
చరణం 2
నృత్యం తమిహ ముహుర్త్యంతం అపరిమిత బృత్యానుకూలం అఖిల సత్యం సదా బాల
(కృష్ణం)
చరణం 3
ధీరం భవజల భారం సకల వేదసారం సమస్త యోగిధారం సదా బాల (కృష్ణం)
చరణం 4
శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరి కేళ సంగం సదా బాల (కృష్ణం)
చరణం 5
రామేణ జగదభిరామేణ బల భద్రరామేణ సమవాప్త కామేన సహ బాల (కృష్ణం)
చరణం 6
దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం సదా బాల (కృష్ణం)
చరణం 7
రాధారుణాధర సుధాపం సచ్చిదానంద రూపం జగత్రయ భూపం సదా బాల (కృష్ణం)
చరణం 8
అర్థం శిథిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల (కృష్ణం)
ఎప్పుడు ధర్మానికి చ్యుతి , అధర్మానికి విజ్రుంభన కలుగుతాయో అప్పుడు భగవంతుడు అవతరించి ధర్మ సంస్థాపనం చేస్తాడని భగవద్గీత చెబుతోంది . ఉపనిషత్తుల కాలం లో ఉద్భవించిన 'సత్యం , శివం , సుందరం ' ప్రేమ వచనాలు అనంతర కాలం లో ఒకే మహామహితాత్మునిలో కేంద్రీకృతమై భారత దేశాన్ని ఆధ్యాత్మికం గా , రాజకీయం గా స్పందింపజేసాయి. శ్రీ కృష్ణుడు ఒక గురువు ,నేత , రాజకీయవేత్త , మహర్షి , విశ్వసారధి , యోగేస్వరేస్వరుడు ,మహానుభావుడు అయిన ఈతని పుట్టిన రోజునే పండగ గా హిందువులు జరుపుకొంటారు .
మహాభారత యుద్ధంలో పాండవ పక్షపాతిగా నిలిచి శతసోదరులైన కౌరవులను వారి సైన్యాన్ని సంహరింపజేయడం ద్వారా లోక కళ్యాణానికి బాటలు వేసిన శ్రీకృష్ణుని దర్శిస్తే మన పాపాలు సైతం సంహరించబడుతాయి.
మీ విధేయుడు . మల్లాప్రగడ రామకృష్ణ
22 /07 /2023
రామకృష్ణ గీత .. ప్రాంజలి ప్రభ (3 )
" ఓ కృష్ణా నీవు గోవులకు ఈశ్వరుండవగుటచేత" "ఇంద్రుడవు" గా విలసిల్లితివి. ఈ కారణంగా దేవతలు నిన్ను "ఉపేంద్రః" అని పిలుతురు" అని హరివంశమునందు వర్ణింపబడి యున్నందున శ్రీహరి ఉపేమద్రు అనబడుౘున్నాడు. (హరివంశము 76_47).
ఇక ఈనామము వేదాంతపరముగా అన్వయించినచో, ఇంద్రుడనగా ఇంద్రియములకు అధిపతియగు " మనస్సు " అని అర్థము. "ఉప" అను పదముచేత మనస్సుకంటెను మిక్కిలినేని పైగా నున్నది. అనగా మనస్సు కంటెను శ్రేష్ఠమైనది ఆత్మ అగునుకదా! శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సర్వమును ఆత్మచేతనే చైతన్యము బొందుౘున్నవని ఉపనిషద్వాక్యము కనుక భగవానుడు "ఉపేంద్రః" అనబడుౘున్నాడు.
అంతటను నిండి ఉన్నట్టి ఆత్మవీపు, భద్రముల నిచ్చి కాపాడు ప్రభువు నీవు, అన్ని దిక్కుల నుండి మా కనవరతము, శుభములే కల్గునట్లు జూడవయ్య
ఓ స్వయంప్రకాశక మూర్తి! ఓ మురారి, మనుజ జన్నమ్ము నీవల్ల మాకు దొరికె, అన్ని వేళల ధర్మమ్ము ననుసరించి, నడుచుకొనజేయి నధనమ్మునిచ్చి
దేవుడా! నీవు నా కిచ్చు దేహమిదియె, కనుక నాకొక్క కోరిక గలదు సుమ్మి, దృక్కులందున ప్రేమ వర్షించుగాక, వాక్కులందున అమృతము వరలుగాక
సృష్టి గావించువాడు, పోషించువాడు, తుదకు ప్రళయమ్ము చేసియు వరులువాడు, అన్ని లోకాల కధిపతి ఐనవాడు, దైవమె, నమస్కరింపంగ దగినవాడు
మానవ లోకమంతా కూడా తమ తమ హద్దులలో, జాగ్రత్తగా, మానవీయ పరిణతితో, సృష్టి యొక్క అద్వైత మూలములతో అన్ని విధాల అమరి యుండి, ఎప్పటి కప్పుడు భావి భాగ్యోదయమును సాధించేలా ప్రవర్తిస్తూ ఉండాలి. అదియే భగవాన్ కృష్ణ సందేశం
అదే మానవ జీవనానికి సార్థకత, సామాజిక జీవనానికి పారమార్థకత
***
రామకృష్ణ గీత .. ప్రాంజలి ప్రభ (4 )
ఓం వామనః ఓం వామనాయనమః
శ్రీ మహావిష్ణువు తన ఐదవ అవతారమున పొట్టివాడై బలిచక్రవర్తిని యాచించి మూడడుగులతో ముల్లోకములను ఆక్రమించిన పౌరాణికగాథ నీ నామము చేత స్మరణీయమగును.
ౘక్కగా ఊహింౘదగిన వాడగుటచేత "వామనుడు" అనబడు ౘున్నాడు . "మధ్యే వామన మాసీనం విశ్వేదేవా ఉపాసతే". హృదయకమలము యొక్క మధ్య భాగమున విలసిల్లుౘున్న వామనుని సకలదేవతలును ఉపాసింౘు ౘున్నారు (కఠోపనిషత్తు 3_5).
" సర్వస్యచాహం హృదిసన్నివిష్టః" (గీత 15_15) అను గీతావాక్యము స్మరణీయము.
సుందర సుమధుర గోపాలా
చూపరా నాపై దయ ఈవేళా !!
అందరిలాగే పుట్టినాను నేను
అందరిలా ప్రేలిగాను,
నిన్ను వీడని ప్రేమను నాకే ఎందుకిచ్చావు నీవు..
వంకలు పెట్టే లోకంతో వంట పలకలేకున్నాను
దిక్కులన్ని నవ్వుతుంటే చెప్పలేకున్నాను
ఎక్కడా తల దాచుకోవాలో చెప్పాలి నీవు!!
నిత్యం నిన్ను వదలక పూజించే వాణ్ని నేను
నాకోసం నేను ఏనాడు ఏది కోరుకోరను
నిదర్శనభాగ్యము చాలు నాకును
నన్ను నన్ను గా కోరుకునే ఓ మిత్రుడవు నీవు
నాకు తోడుగా నుండే సహృదయుడవు నీవు
తల ఎత్తుకు తిరిగేలా నాకో స్థాయిని కల్పించావు
బాధను చెప్పుకోలేని నా స్థితి గమనించావు
సుందరా సుమధుద్ర గోపాలా
చూపరా నాపై దయ ఈవేళా ..!!
చరణం:-
***
పుట్టుకతో ప్రేమ ప్రేమ అని తిరిగాను
ఏ పాపం చేసానో నెట్టుకు రాలేకున్నాను
ఒడ్డుకు చేరే మార్గం చూపు దేవా!!
కట్టలు తెగిన దుఃఖాన్ని దూరం చేయు గోపాలా
అట్టుడుకుతున్న అంతరంగానికి అర్ధ తెలిపారా
నీ ఉన్నావనే బరోసా నివ్వరా గోపాలా
నా కోసమంటు ఒక తోడును పుట్టించరా
ఇంక మంచి లేదంటు ఎగతాళి మాటలు
ఇంటా బయట ఏవగింపు చూపులు గోపాలా !!
సుందరా సుమధుర గోపాలా
చూపరా నాపై దయ ఈవేళా ..
అర్థం లేని పుట్టుక వ్యర్థం లా బ్రతకమంటావు
నే చేసిన నేరం ఏంది నన్నిలా శిక్షిస్తావు ..
నీకిది ఏమి న్యాయం ఎన్నాళ్ళు వేడుకున్నా
కన్నీళ్ళను తుడవవు నామీద కోప మేమన్నా
ఇంకెన్నాళ్ళు ఇలాగే బ్రతకను ఇదాలన్నా
పువ్వులా పుట్టి జీవించలేక నలిగిపోతున్నా
ఒక్క పూటైనా నవ్వు లేని నా గతి యున్నా
బ్రతుకంతా దుఃఖ సాగరమేనా నిన్నే వేడుకొనుచున్నా !!
పల్లవి:-
****
సుందరా సుమధుర గోపాలా
చూపరా నాపై దయ చూపరా ఈవేళా !
***********
ప్రాంశుః ఓం ప్రాంశవేనమః
మిక్కిలి విస్తారమగు దేహము గలవాడగుటచేత "ప్రాంశుః" అనబడును. బలిచక్రవర్తి నుండి దానమును స్వీకరించిన వామనమూర్తి ఒకపాదంబున భూమి గప్పి, స్వర్గమును వేరొకపాదముచే గప్పి బ్రహ్మాండమంతయు నిండిన దివ్యవర్ణనము హరివంశములో గాననగును. మఱియు ను పోతనామాత్యుడు ఆంధ్ర భాగవతమున వామనావతార ఘట్టమున " ఇంతింతై వటుడింతై. . .నిండె
బ్రహ్మాండమున్" అని రమణీయముగా వర్ణించినాడు. అట్టి విశ్వరూప మనోజ్ఞ మూర్తియగు మాధవుడు "ప్రాంశుః" అని స్తవనీయుడు.
ఓం గోపాలా , ఓం వామనః ఓం వామనాయనమః ప్రాంశుః ఓం ప్రాంశవేనమః
సర్వం నీవే మమ్ము కాపాడే దేవా దేవా పరమాత్మా లోకనాయకా నమో నమః
మీ విదేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
...
రామకృష్ణ గీత .. ప్రాంజలి ప్రభ (5 )
శరీరాన్ని అంగీకరించడంలో యోగా అంత దూరం వెళ్లదు. ఇది మిమ్మల్ని చాలా నియంత్రణలో ఉంచుతుంది అయితే ప్రతీ నియంత్రణ ఒక విధమైన అణచివేత.
మీరు చాలా స్వేచ్ఛగా, సజీవంగా ఉంటారు. మీరు పునర్జన్మ అనుభూతి చెందుతారు, ఎందుకంటే ఇది మీ విభజించబడిన శరీరాన్ని కలుపుతుంది. ఇదే మీకు ఆధారాం, త్యాగానికి ప్రతిరూపం పరమాత్మ సన్నిధానంలో ధ్యానం చేయవచ్చు, క్షోభ తెలుపవచ్చు.
అమ్మను మించిన ప్రత్యక్షదైవం ఏది, ఆత్మను మించిన ప్రత్యక్ష సాక్షి ఏది, ఆలిని మించిన అనురాగ దేవత ఏది, ఆప్తమిత్రుని మించిన ఆపద్బంధువు ఏవరు, క్రోధాన్ని మించిన ప్రబల శత్రువు ఏది, కోరికలను మించిన పెనుముప్పు ఏది, సద్భాషణాన్ని మించిన భూషణం ఏది, విద్యా ధనాన్ని మించిన విత్త సంద ఏది .వినయ విధేయతలుగల సత్శీలాన్ని మించిన సత్ప్రవర్తన ఏది, పరిమళించెడు మానవత్త్వాన్ని మించిన కుల మతాలు ఏవి, ప్రేమ భావంతో ప్రేమించే మానవుడేడి, ప్రజలను ప్రేమతో గౌరవించు నాయకుడేడి
"శార్దూలము(పంచపాది).
----
శ్రీలక్ష్మీ కమలాయతాక్షి వరహస్తీంద్రార్చితా పద్మజా !
శ్రీలక్ష్మీ కనకాంచిత ప్రవరదాత్రీ ! విష్ణుపత్నీ!రమా!
శ్రీలక్ష్మీ యుతలక్షణాంచిత మురారీరూప పాండ్రంగ ,హే,
శ్రీలక్ష్మీ విభవాస్పదంబగుసురశ్రీరాఘవేంద్రున్ మదిన్
శ్రీలక్ష్మ్యాదుల దైవతమ్ములనుముదా రీతిన్ భజింతున్ సదా !!!"
ఉ:: శ్రీధర్ డే కరుణా కటాక్ష వినయం లోకాల పర్యంతమే
సంరక్షా పరుడే సమస్త జన సందేహాల నివృత్తుడే
ఆరాధ్యుల్కె సుఖా లిచ్చి మనసే మెప్పించె పూజార్హుడే
అందర్నీ అనునిత్య సంఘటనలే హృద్యంతొ రక్షించుటే
***
మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
రామకృష్ణ గీత .. ప్రాంజలి ప్రభ (6 )
అమోఘః ఓం అమోఘాయనమః
మల్లాప్రగడ రామకృష్ణ
రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (7)
మల్లాప్రగడ రామకృష్ణ
రామకృష్ణ గీత.. ప్రాంజలిప్రభ (8 )
ఎందాక ఈ నడక? ఈ అడుగు సాగినందాక.
ఎన్నాళ్ళు సాగుతుందీ అడుగు? ఎదురుగా లోయ నిలిచేదాక.
ఏమంటుంది ఆ లోయ? ఈడ్చుకుంటుంది అగాధందాక.
ఏమౌతుంది ఆ పైన? ఇది ప్రశ్నగా మిగిలిన ప్రశ్న.
మల్లాప్రగడ రామకృష్ణ
రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (9)
23=07=2023
మల్లాప్రగడ రామకృష్ణ
రామకృష్ణ గీత ..
దధీచి మహర్షి. .. ప్రాంజలి ప్రభ కథ (10 )
.
***
రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ ..(11 )
ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....*
***
రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (12 )
ధృతరాష్ట్రుని ప్రశ్నకు సంజయుడు సమాధానం ఇవ్వటం ప్రారంభించాడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మావారు, పాండవులు ఏంచేశారు? అని అడిగిన ప్రశ్నకు యుద్ధరంగ విశేషాలను వినిపిస్తున్నాడు సంజయుడు.
పాండవానీకం వ్యూఢం దృష్ట్వాతు :- యుద్ధభూమిలో పాండవ సేనా వ్యూహాన్ని చూచాడు దుర్యోధనుడు. అది దుర్భేద్యమైన వజ్ర వ్యూహంగా పన్నబడి ఉంది. 11 అక్షౌహిణుల తన సేనకన్నా 7 అక్షౌహిణుల పాండవసేన చిన్నదే. అయినా ఆ వ్యూహాన్ని, వ్యూహ ముఖంలో గదాదండం ధరించి నిలిచియున్న భీమసేనుని చూడగానే దుర్యోధనుని ఆత్మవిశ్వాసం సడలిపోయింది. అందుకే ఆచార్యుడైన ద్రోణుని వద్దకు చేరాడు. నేరం చేసినవాడు, పాపం చేసినవాడు, అధర్మానికి ఒడిగట్టినవాడు ఎప్పుడూ భయం భయంగానే ఉంటాడు. ధర్మాత్ములైన పాండవులను చూడగానే ఇప్పుడు దుర్యోధనునిలో అలాంటి భయమే కలిగింది. వారి సేనను చూడగానే తత్తరపాటు కలిగింది. తనకు విజయం లభిస్తుందా? లేదా? అనే ఆదుర్దా ఎక్కువైంది. తనలోని భయాన్ని, తత్తరపాటుని, ఆదుర్దాని దాచుకోవడానికి ద్రోణుని వద్దకు చేరాడు.
ఆచార్యం ఉపసంగమ్య :- తాను రాజు గదా! ద్రోణుడు ఒక అక్షౌహిణీ సేనాధిపతి మాత్రమే. అయినప్పుడు ఆయన్నే తన వద్దకు పిలిపించుకోవాలి. అలా చేయలేదు. దానికి కారణం ఆయన తన గురువు. అంతేకాదు. భీష్ముడు పాండవ పక్షపాతి. ఆయనకు వారిపై ఎనలేని ప్రేమ. అందుకే పాండవులను నేను సంహరించను అని ముందే చెప్పేశాడు. కాని ద్రోణుని విషయం వేరు. ఆయనకు తనపై అభిమానం ఉంది. ఆయన కుమారుడు అశ్వత్ధామ తనకు మిత్రుడు. పైగా పాండవుల మామగారైన ద్రుపదునితో ద్రోణునికి విరోధం. ఆ ద్రుపద పుత్రుడైన దృష్టద్యుమ్నుడే పాండవ సర్వసేనాని. కనుక ఎలాగైనా ద్రోణుని గౌరవించి, మంచి చేసుకొని పాండవులపై రెచ్చగొట్టాలి. అలా తాను ప్రయోజనం పొందాలి. అందుకే తానే స్వయంగా ఆయన వద్దకు వెళ్ళటం.
అయితే శిష్టాచార సాంప్రదాయం ప్రకారం గురువు వద్దకు వెళ్ళిన శిష్యుడు ముందుగా గురువుకు నమస్కరించాలి. కాని దుర్యోధనుడలా నమస్కరించలేదు. ఎందువల్ల? రాజుననే అహంకారమా? కాదు. అలాంటి అహంకారమే అయితే ఆయననే తనవద్దకు పిలిపించుకొనేవాడు గదా! మరి ఏమై ఉంటుంది?
--(())--
Comments
Post a Comment