నేటి కవిత -84

క్రిష్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలుKali Yantra Outline
కాళీమాత యంత్రం 


ఓ మాతా నామనసులో భాధను
ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి

భాధ పెట్టేది నువ్వు
ఒదార్చేది  నువ్వు
కష్టపడమన్నది నువ్వు
ఓర్పుగా ఉండమన్నది నువ్వు

ప్రేమే బ్రతుకన్నావు నువ్వు
ప్రేమే శాశ్వితమ్మన్నావు నువ్వు
ప్రేమని కలిగించేది నువ్వు
ప్రేమే సుఖమన్నది నువ్వు

ప్రేమకు విజయమన్నావు నువ్వు
ప్రేమకు మరణం లేదన్నావు నువ్వు
ప్రేమతో బ్రతకమన్నావు నువ్వు 
ఆ ప్రేమకు మరణాన్ని శాసించేది నువ్వు

జీవితాన్ని నిలబెట్టేది నువ్వు
జీవితంలో ఆశలు కల్పించేది నువ్వు
మరుక్షణం విరక్తి కలిగించేది నువ్వు
హృదయాన్ని పదిలంగా ఉంచాలన్నదే నువ్వు

ఉప్పొంగుతుంది ప్రేమసాగరమన్నావు నువ్వు
చల్లదనానికి వెచ్చదనం తోడన్నావు నువ్వు
పగటికి రేయిలా, ఒకరికి ఒక్కరన్నావు నువ్వు
వసంతాన్ని చూడమని అఘాతంలో నెడుతున్నావు నువ్వు

బిడ్డల సృష్టికి మార్గం చూపుతావు నువ్వు
బిడ్డలు పెట్టె కష్టాలు భరించమన్నావు నువ్వు
ప్రేమ ద్వేషంగా మారకుండా చూడమంటావు నువ్వు 
కోప తాపాలు భరించి బ్రతకాలంటావు నువ్వు

మంచుకి అగ్నికి సఖ్యత కల్పిస్తున్నావు నువ్వు
మంచినీటిని ఉప్పుతో కల్పి దోబూచు లాడుతున్నావు నువ్వు 
పాము ముంగిసను కల్పి బ్రతకమంటున్నావు నువ్వు
ఆవు సింహాన్ని చెలిమిలా ఉండమంటున్నావు నువ్వు
 

కాలగమనాన్ని అనుకరించామన్నావు నువ్వు
ప్రకృతి బిడ్డలను ప్రేమించ మన్నావు నువ్వు 

సమయాన్ని వ్యర్ధపరచక పర్మించమన్నావు నువ్వు 
ప్రేమే లోకం, ప్రేమే జీవం, ప్రేమేశాశ్వితమన్నావు నువ్వు

ఓ ప్రభువా నామనసులో భాధను
ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి

ప్రాంజలి ప్రభ - 
Ramakrishna Mallapragada

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు