-83రేయిలో ఏముంది

netikavita-83
ప్రాంజలి ప్రభ
మల్లా ప్రగడ రామకృష్ణ

రేయిలో ఏముంది 
- సుఖము శాంతితో నిద్ర ఉంది చూడు
అలకలో ఏముంది

 - కష్టమైనా ఆశఫలితము దాగి ఉంది చూడు
ఆలోచనలో ఏముంది

 - మెదడుకు పదును ఉంది చూడు
ఊహలలో ఏముంది 

- రాబోయే పండుగ ఖర్చు ఉంది చూడు

కళ్ళల్లో ఏముంది

 - పాప దాగి ఉంది చూడు
ఆకర్షనలో ఏముంది

 - అంతరంగంలో ఉందిచూడు
మౌనంలో ఏముంది

 - హృదయం లో ప్రేమ ఉంది చూడు
సముద్రంలో ఏముంది

 - ముత్యములో స్వాతి ముత్యము ఉందిచూడు

నింగిలో ఏముంది

 - ప్రాణాన్ని నిలబెట్టే జలం ఉందిచూడు
ప్రుధ్విలో ఏముంది

 - సమస్తము భరించే శక్తి ఉంది చూడు
అగ్నిలో ఏముంది

 - సమస్తము జీర్ణంచేసే శక్తి ఉందిచూడు
పగటిలో ఏముంది

 - భుక్తి, ముక్తి శక్తికోసం పని ఉంది చూడు

నీ మాటలో ఏముంది 
-నా మాటలో ప్రేమ ఉంది చూడు  
నీ ప్రేమలో ఏముంది 
- నిన్ను సుఖపెట్టె శక్తి ఉంది చూడు 

నీ శక్తిలో  ఏముంది 
-నా శక్తి కాలాన్ని వర్ధపరచదుచూడు 
ఈ కాలంలో ఏముంది  
-ఈ కాలంలో దైవశక్తి ఉండి చూడు 

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు