నేటి కవిత -85




ఈనాటి కవితను ద్రాక్షారామంనుండి వ్రాస్తున్నందుకు యెవరికి యెరుక
ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని ఆపరమేశ్వరుని ప్రర్ధించుతానని యెవరికి యెరుక

యెవరికెవరు ఈలోకంలో యెవరికి యెరుక
యేసమయాన యేమి జరుగునో యెవరికి యెరుక
సముద్ర కెరటం తీరం దాటుతుందని యెవరికి యెరుక
నదీమతల్లి సంద్రంలో కలుస్తుందని యెవరికి యెరుక

తల్లి బిడ్డకు పంచేప్రేమని అడగదని యెవరిరకి యెరుక
తండ్రి చెప్ప లేని స్తితిలో ఉండునని యెవరికి యెరుక
గురువు చెప్పినపాఠాలు మరిచారని యెవరికి యెరుక
కన్నవారిని డబ్బుకోసం బిడ్డలే చంపునని యెవరికి యెరుక
 
ద్రాక్షరామం శివ సన్నిధినుండి వ్రాసానని యెవరికి యెరుక
కాలం గమ్యం ఆరోగ్యం యెప్పుడు మా‌రునని యెవరికి యెరుక
న్యాయం ఉండకపోయిన శిక్షిస్తారని యెవరికి యెరుక
శివుడాజ్ఞ లేనిదే చీమయినా కదలదని యెవరికి యెరుక
 
ఉన్నది పోయి ఉంచుకన్నది పోతుందని యెవరికి యెరుక
భార్యాభర్తలు ఇద్దరు కాదని ఒక్కరని యెవరికి యెరుక
అర్ధనారీశ్వర తత్వం తెలుసుకోలేరని యెవరికి యెరుక
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను
ప్రాంజలిప్రభ

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు