15 4 - నేటి - స్త్రీ తత్వ పద్యాలు
3. ప్రాంజలి ప్రభ - నేటి పద్యం ప్రేయసి తో ప్రియుడు పల్కిన ఛలోక్తి పద్యం రచయత : మల్లాప్రగడ రామకృష్ణ ఓం శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ: 1. శా: అన్వేషి స్త్రికతా అనంత మలుపే ఆదర్శ సాహిత్యమే ఇష్టంల్లో సఖిలా ఓదార్పు మెరుపే మంత్రోదయామృత్వమే కష్టంల్లో ప్రభలా సుసేవ తలపే ప్రభుత్వ బాంధవ్యమే నష్టంల్లో కరుణా దయాసుఖలయే ఓర్పు స్త్రి ప్రేమార్పనే స్త్రీ కధను ఆదర్శ సాహిత్యముగా అనేక మలుపులుగా సాగుతుంది, ఇష్టంలో సఖిగా, కష్టాలలో ఓదార్పు అందిచే ఇల్లాలుగా, తనకర్తవ్యముగా భావించి వెలుగును పంచెడి స్త్రీ ఆమె మాట ఒక మంత్రముతో కుఉడిన అమృతం, తను యజమానిగా నిర్వహిచి కరుణతో, దయతో ప్రేమతో ఓర్పుతో సుఖములందించేది స్త్రీ మాత్రమె. 2. శా : వాత్సల్యం తనలో పరంపరముగా సంఘర్షతత్వాలయం కారుణ్యాలయమే సుఖాల నిలయం సంతృప్తి సంభావ్యమే ...