155 -స్వర్ణ సుందరి




ప్రాంజలి ప్రభ 

మొదటిరాత్రి గుసగుసలు 


















ప్రాంజలి ప్రభ


తెలివి ఒకరి సొత్తు కాదు
తెలివి లేనివాడు మూర్ఖుడు కాదు
అవసరానికి  ఉపయోపడేదె 
తెలివైనా చీమ- బ్రిలియంట్

ఇష్టమైనది ముందు చేయి 
సమయాన్ని వ్యర్ధ పరచకు
ప్రతి పని ముఖ్యమైనదే 
ముఖ్యమైన చీమ-ఇంపార్టెంట్ 

వాసనబట్టి ఏదో చెప్పు
అతిగా వాసన పీల్చిన
మత్తుతోప్రాణానికే ముప్పు   
సువాసనగల చీమ- ప్రాజ్ఞన్ట్

లెక్క తప్పులేకుండా వ్రాయి 
డబ్బు ఖచ్చితముగా పంపు
ప్రభుత్వానికి లెక్క చూపేది
లెక్కలు చేసే చీమ- అకౌంటెంట్

బరువును మోసే రాజు
రాజును మోసే రాజు
సమారంలోకి దూకే రాజు 
జంతువే చీమ - ఎలిఫెంట్

అపపటికప్పుడు చేసేది
కావాల్సిన డ్రస్సు  అందించేది 
మనిషని హుందాగా మార్చేది 
రేడీమేడ్ చీమ- ఇన్స్టంట్

కష్టాన్ని తగ్గించేది 
అవసరానికి ఆదుకునేది 
ఇంటిని శుభ్రంగా ఉంచేది
పనిమనిషి చీమ-సర్వెంట్

చేతికి అందం చూపేది
మనిషికి గుర్తింపు ఇచ్చేది
చూసేనగానే మెరిసేది
లాకేట్ చీమ - పెండెంట్ 

అన్యాయాన్ని అరికట్టేది
న్యాయాన్ని నిలబెట్టేది
తప్పును తప్పుగా గుర్తించేది
అరెస్టు చేయగల చీమ-వారెంట్

తాళాలుంటే దొరబడేది
పంచదారిని చూస్తే ఆశపడేది
ఏమిలేదని చెప్పేది
ఖాళీ చీమ - వీకెంట్ 

ఈ కవితకు ఆధారాలు ఇంగ్లిష్ చివరి పదాలు 
 1.  brilliANT 2. importANT  3.  fragnANT 4.  accountANT 
 5.  elephANT 6.  instANT  7. servANT   8. pendANT  
 8.  warrANT   9. vacANT

  



అంతా చీమలమయం
తెలివైనా చీమ- brilliANT
ముఖ్యమైన చీమ-importANT
సువాసనగల చీమ- fragnANT
లెక్కలు చేసే చీమ- accountANT
జంతువేచీమ - elephANT
రేడీమేడ్ చీమ- instANT
లాకేట్ చీమ - pendANT
పనిమనిషి చీమ-servAN
ఖాళీ చీమ - vacANT
అరెస్టు చేయగల చీమ- -warrANT




నేటి కవిత

పిలిచిందర్రా భోగిమంట!
ఈ చలితోటి వచ్చింది మహ చెడ్డ తంటా!

ఎండుటాకులు తెచ్చి వెయ్యండి
సరసర మండేటట్టు కాస్త ఊదండి
వెదురుపుల్లలు విరిచి వెయ్యండి
బిరబిర ముదురుకట్టెలు పరచి విసరండి!

ఆహా ఓహో అంటూ చలి కాచుకోండి
ఈరోజు అందరూ కలసి చలి కాచుకుందాం రండి
అక్కడ నీటి కాగులు పెట్టండి 
ప్రఒక్కారు తలారా స్నానము చేయండి

చలిచలి చలిచల్లి దుప్పటి
తాతకి తేరా కుంపటి!
ఉహుహుహు ఉహుహుహు గొ0గళి
అవ్వకి తేరా కంబళి!

మంటకు వావి వరుస లేదు
వెచ్చదనంతో చలిని తరిమేసింది
నిప్పే కదా  అని తక్కువ చేయకండి
దాన్ని ఉపయోగించుకొనే తెలివి ఉండాలి 

కర్రి చీకట్లోన కరిచేటి చలిలోన
ఎర్రని పాముల్లాగ సర్రున చేతులు చాచి
పిలిచిందర్రా భోగి మంట!
ఇది భారతీయుల సిరులు పంట 
--((*))--

నేటి కవిత - ప్రాంజలి ప్రభ 
రచయత మల్లాప్రగడ రామకృష్ణ.కం 
b h


నింగికి తెలుసు మేఘాన్ని ఎంతవరకు మోయాలో 
గాలికి తెలుసు ఎంత వరకు తోసుకొని పోవాలో   
మేఘానికి తెలుసు ఈప్రాంతంలో కురవాలో 
చినుకుకి తెలుసు భూమిని ఎంతవరకు తడపాలో 

విత్తుకు తెలుసు నేలపై ఎలా మొలకెత్తాలొ 
మొక్కకు తెలుసు వృక్షంగా ఎలా మారాలో 
కొమ్మకు తెలుసు మొగ్గపువ్వుగా ఎలా మారాలో 
కాయలకు తెలుసు పండి ఎలా భూమికిచేరాలో 

పక్షులకు తెలుసు బిడ్డకు ఎలా ఆహారమందించాలో 
నెమలికి తెలుసు చిరుజల్లుకి ఎలా నాట్యమాడాలో   
కోకిలకు తెలుసు వసంతంలో ఎలా పాట పాడాలో
కాకులకు తెలుసు  సానుభూతి ఎలా పరచాలో 
  
సూర్యునికి తెలుసు కిరణకాంతులు ఎలా విస్తరించాలో 
చంద్రునికి ఎళుసు భూమిపైకి వెన్నెలను ఎలా పంపాలో
కమలానికి తెలుసు కిరాణా తాకిడికి ఎలా విచ్చుకోవాలో 
కలువకు తెలుసు చంద్రోదయాన్నే పువ్వు ఎలా అవ్వాలో  

గాలికి తెలుసు సకల ప్రాణులకు ఎలా సహకరించాలో  
అగ్నికితెలుసు కుంపటి నందు మంటగా ఎలా ఉండాలో  
సంద్రానికి తెలుసు తనలో ఉన్న ఆయిల్ను ఎలా కాపాడాలో  
భూమికి తెలుసు తనలో ఉన్న ఖనిజాలను ఎలా అందించాలో 

మనుష్యులకు తెలుసు మాటలతో ప్రేమను ఎలా పంచాలో 
పురుషులకు తెలుసు స్త్రీల ఆశలను ఎలా తీర్చాలో 
స్త్రీలకు తెలుసు పురుషుల బలహీనతలను ఎలా దాచాలో
నాయకులకు తెలుసు ఓట్లకోసం ప్రజలను ఎలా నమ్మించాలో        


--(())--


నేటి కవిత
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ   

ఆణువణువూ బందాల మయం 
చేధించలేరు ప్రకృతి వలయం 
గ్రద్దలా చూడలేని అయ్యో మయం 
చేపలా  ఉండలేని జీవన గమ్యం 

మార్జాలంలా నోటితో చెప్పలేని వరం 
మార్కటంలా ఆపదలో తప్పకోలేని నైజం
ఎలుకలా కలువలో బ్రతుక లేని మనం 
శాశ్వితమో అశాశ్వితమో తెలియని తనం 

సంపాదన తెస్తుంది మన: స్తాపం 
యవ్వనం కోరుతుంది వ్యామోహం 
ఆరోగ్యం పాప పుణ్యాల మయం
లోకంలో తప్పదు భ్రమరం

జీవితానికి  స్త్రీ పురుష లోలత్వం 
మనసును వేధిస్తుంది మాయాతత్వం 
ఆశా పాశాల భ్రమల  ప్రేమతత్వం 
తెలుసు కోవాలి ప్రతిఒక్కరి నిజతత్త్వం       
--((*))--

--((***))--

నేటి  కవిత 129
సంక్రాంతి శుభాకాంక్షలు  -౧ 
Image may contain: 1 person
 ఓ మనిషి తెలుసుకో - తెలుసుకొని మసలుకో 

ఓ విద్యార్థి
చదువంటే తేలికనుకోకు 
ఆటలంటే ఎగిరి పడకు 
దుష్ట స్నేహితులతో కల్వకు   
మంచి స్నేహితుల్ని వదలకు 
ఓ విద్యార్థి తెలుసుకో - తెలుసుకొని మసలుకో 

ఓ నాయకా 
పదవులంటే పరవశించకు
పదవి కోసం ద్రోహం చేయకు 
ప్రజలే దేవుళ్ళని  మరువకు 
మందిమాగధుల పొగడ్తలకు పొంగకు
ఓ నాయకా తెలుసుకో - తెలుసుకొని మసలుకో 

ఓ వకీలు 
అబద్దాలను నిజాలుగా మార్చకు 
నిజాన్ని దాచి వాయిదా కోరకు 
ఫీజు కోసం క్లయింటును తిప్పకు
నిజాన్ని నిరూపించేవరకు ఆగకు  
ఓ వకీలు తెలుసుకో - తెలుసుకొని మసలుకో 

ఓ భోగి    
అన్నీ ఉన్న ఇంకా కావలనుకోకు
ఆరోగ్యాన్ని తినేస్తుంది కొరివితో గోక్కోకు 
డబ్బుందని కొండమీద కోతికోసం తాపాత్రయం ఎందుకు  
అనారోగిగా మారితే చూసే దిక్కు ఉండదని తెలుసుకో 
ఓ భోగి తెలుసుకో - తెలుసుకొని మసలుకో 


ఓ గుండా  
అంతా నాబలమే అని అనుకోకు 
సారా నంత ఔపోసన పట్టకు
నీవారందరి జీవితాలకు చిచ్చు పెట్టకు
మనస్సును వేదనను గురిచేయుట ఎందుకు    
ఓ గుండా తెలుసుకో - తెలుసుకొని మసలుకో

ఓ వ్యాపారి 
బీదలజీవితాలతో చెరలాడకు
వడ్డీలు వసూలు చేసి కూడపెట్టకు
పాపాలు మూట కట్టుకోకు 
ఆశకు పోయాయి అభాసుపాలు కాకు  
ఓ వ్యాపారి తెలుసుకో - తెలుసుకొని మసలుకో

ఓ జూదరి 
కాసులకు కోసం జూదం ఆడకు 
కాలాన్ని జులాయిగా గడిపేయకు 
తోటివారిని చూసి సయినా బ్రతుకు
సుఖంలోనే జీవితం ఉందని అనుకోకు 
ఓ జూదరి  తెలుసుకో - తెలుసుకొని మసలుకో

ఓ ఉద్యోగి 
లంచాలకై  అంగలార్చకు
గాలిమేడలు కట్టుకోకు 
ధర్మాన్ని విడిచి బ్రతుకకు 
న్యాయాన్ని నమ్మి బ్రతుకు  
ఓ ఉద్యోగి  తెలుసుకో - తెలుసుకొని మసలుకో 
   
--((***))--

నేటి కవిత 
ప్రాంజలి  ప్రభ  
సరిహద్దు సాహిత్యం 

వాహనాల శబ్దాలు ఒకవైపు 
తుపాకి గుండ్ల మోతలు మరోవైపు 
ఎవరు ఎటు వైపునుండి వస్తారో
ఏ విధంగా ప్రవర్తిస్థారో
ఏ దుర్వార్త వినాల్సొతుందో
ఏ స్థితిలో చీకటి నీడలు వ్యాపిస్తాయి  

కాలు బయటపెట్టలేక 
కంటినిండా నిద్రలేక 
ఉన్నబట్ట కట్టుకొనలేక
కడుపునిండా తిండి లేక  
సరిఅయిన రక్షణ లేక 
పగలే చీకటి నీడలు వ్యాపిస్తాయి  

బాంబుల భయముతో 
తట్ట, బుట్ట, బట్ట, సర్దుకోవటం 
అనుబంధాలను తట్టలో పెట్టుకొని 
జ్ఞాపకాలను బుట్టలో పెట్టుకొని 
చినిగిన బట్టలు సర్దుకొని 
కోతకొచ్చిన పొలాన్ని వదిలేసి 
అనారోగ్యులను భుజాన మోసి  
క్షణ క్షణ చావుని చూసి 
ఉన్నా ఊరు వదిలేసి 
సరిహద్దు బ్రతుకు చావా 
బ్రతుకా అని మెండిగేసి 
తల్లి పిల్ల విడిపోయి ఉండలేక 
కూర్చొనక ,
భయం గుప్పెట పట్టి బయలుదేరారు  
క్షతగాత్రులను పట్టించుకొనేవారు లేరు 
తుపాకుల నీడలు కమ్ముకుంటున్నాయి


 



నేటి కవిత 
ప్రాంజలి ప్రభ  
రచయత మల్లాప్రగడ రామకృష్ణ 
Nice to meet you!













ఎదో ఎదో జరిగింది మనసులో 
అది ఎలా చెప్పాలో తెలియ కున్నది 
చెపుదామంటే నోరు వద్దన్నది
మౌనం లో మాయమౌతా నన్నది   

స్వప్నాలు నెరవేరమని 
ఆశలు తీరే సమయము కాదని 
ఓర్పు వహిస్తే శుభమని 
అదే నీ మనసుకు తృప్తి యని

నిదురరాని రాత్రుల గూర్చి
చూసిన సౌందర్యాల గూర్చి 
కలవరపెడుతున్న నిశిరాతిరి గూర్చి 
చెప్పినా ఫలితముండదని 

సౌందర్య రహస్యాన్ని కనురెప్ప మాటున 
నడిరేయి సరాగాలు పెదాలు మాటున 
చిందించిన మందహాసాలు తెరమాటున
జరిగిన మనసు కావ్యం ఒప్పని చెప్పను 
తిప్పని అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోను 

--((*))--

ప్రాంజలి ప్రభ 
నేటి కవిత - ఇంతకీ నేనెవరో చెప్పండి 

ఏమిటమ్మా ముసుగులోఉన్నారు 
నిమోఖము లో ఉన్నది నాలో లేదు అందుకని 
ఏమిటమ్మా ముసుగులో ఉన్నారు 
నీలోకన్నా నాలో ఎక్కువ ఉన్నది అందుకని 
  
ఏమిటమ్మా ముసుగు లో ఉన్నారు 
నీకన్నా నాకు ఎక్కువ ఉన్నాయని అందుకని  
ఏమిటమ్మా ముసుగులోఉన్నారు 
నీవు చూడగలవు నేను చూడలేను అందుకని  

ఏమిటమ్మా ముసుగు లో ఉన్నారు 
నన్ను చూస్తే సానుభూతి చూపిస్తావు అందుకని 
ఏమిటమ్మా ముసుగు లో ఉన్నారు 
నన్ను చూస్తే గుండె దడ పెరుగుతుంది అందుకని 

ఏమిటమ్మా ముసుగులోఉన్నారు 
నన్ను చూసి నిద్దరలో కుడా కలవరిస్తావని 
ఏమిటమ్మా ముసుగులోఉన్నారు 
నన్ను చూస్తే ఆశలు బెడిసి కొడతాయి అందుకని 


కళ, సిగ్గు, వెండ్రుకలు, కళ్లులేవు, కురూపి, దెయ్యం, అస్థిపంజరం, కొజ్జా       


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:



చేసిన మంచికి పొందేది - పురస్కారం
మనిషికి ప్రభుత్వం ఇచ్చేది - పురస్కారం
అనుభవాల పంటగా ఉండేది - పురస్కారం
ఆశయాలు కలగా గుర్తుండేది   - పురస్కారం 

చెప్పిన మాట వినకపోతే  - ధిక్కారం
చూపిన పని చేయకపోతే  - ధిక్కారం
మాటకు మాట చెపితే  - ధిక్కారం
ధర్మం తెలిసిన వాదిస్తే  - ధిక్కారం 

గర్వంతో తక్కువగా ఊహించి -  తిరస్కారం
బహుమతిని దేశానికి ఇవ్వాలని - తిరస్కారం
ఇది పేదలకు దక్కాలసినదని  - తిరస్కారం
ఎవరో ఏదో అను కున్నారని - తిరస్కారం

పువ్వుల దండలో దారం - గుణకారం
కేశాలల్లో పువ్వులు ఉండటం - గుణకారం
చెప్పుల కాళ్లతో నడవటం - గుణకారం
రెండు రెండు హెచ్చవేస్తే వచ్చేది -గుణకారం

చేయి చేయి కలిపితే - సహకారం
పనిలో పనిని కలిపితే -  సహకారం
చెప్పిన పని చేసిచూపితే -  సహకారం
మనసుకు నచ్చేటట్లు చేసితే - సహకారం

అర్ధ బలం ఉన్న చోట ఉండు - అహంకారం
అంగ బలం ఉన్న చోట ఉండు - అహంకారం
వద్దన్నా వచ్చేది కొందరికి అదే - అహంకారం
గూడు, కూడు, గుడ్డ, లేక ఉండేది - అహంకారం 
నుడికారం

కొన్ని సమస్యలకు కాలమే  పరిష్కారం
ప్రేమ సమస్యలకు  జీవమే పరిష్కారం
జన్మ సమస్యలకు  పుట్టుటే  పరిష్కారం
కాల సమస్యలకు వేదమే పరిష్కారం



 ఆవిష్కారం
 ఆ కారం
 అలంకారామ్
 ఉపకారం
 అపకారం
ఓంకారం
 శాంతాకారం
 ఘింకారం
 హుంకారామ్
 వికారం
ఆకారం
ప్రాకారం
 అంగీకారం
చీత్కారం
ప్రతీకారం
నమస్కారవం
నేటి కవిత  
ప్రాంజలి ప్రభ 

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ.కం 

నిత్యకల్యాణం - పత్స తోరణం 

సూర్యుని ఒక్క  ధర్మం తాపం,
 జలము ఒక్క ధర్మం రసం !
అగ్ని ఒక్క ధర్మం దహనం,
 జీవుని ఒక్క దర్మం ఆత్మజ్ఞానం !

కుటుంబములో  సత్యం,న్యాయం,
 ధర్మం, మార్గమే సంసారం !
మతములో ఉన్న సమస్త ధర్మాలకు 
అందరం భద్దులం !

ఎక్కడ ధర్మం ఉంటుందో,
 అక్కడ తేజస్సు విస్తారం !
ఎక్కడ  తేజస్సు విస్తారంగా ఉంటుందో,
 అక్కడ భక్తి మయం !

ఎక్కడ భక్తి ఉంటుందో,  
అక్కడ లక్ష్మి దేవి స్థిరనివాసం !
ఎక్కడ సత్సాంగత్యమ్ ఉంటుందో, 
అక్కడ ఉత్తమ గుణం !

ఎక్కడ ఉత్తమ గుణం ఉంటుందో
 అక్కడ భగవంతుని సాక్షాత్కారం !
ఎక్కడ భగవంతుని సాక్షాత్కారం ఉంటుందో,
 అక్కడ బ్రహ్మా జ్ఞానం !

ఎక్కడ బ్రహ్మా జ్ఞానం పంచ బడుతుందో,
 అక్కడ నిత్య కళ్యాణం !
ఎక్కడ నిత్య కళ్యాణం  ఉంటుందో,
  అక్కడ పత్స తోరణం !



నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 

కల్లోల మనసుకు కళ్లెం వెయ్యి
కళ్ళల్లో వత్తులు వెలిగించు 
పళ్లల్లో పక్వానివి బోంచెయ్యి  
నీళ్ళల్లో నీడలను గమనించు

పాలల్లో నీరు కలిపి తాగెయ్యి 
వేళల్లో విద్యను గ్రహించు  
నీడల్లో నిత్య సాధన చెయ్యి 
నిప్పుల్లో  దూకక నివసించు 

కాళ్ళలో బలాన్ని పెంచేయ్  
వేళల్లో ఉన్న తేడాను వీక్షించు
చేతుల్లో శక్తిని పెంచేయ్
సేవల్లో నిత్యం సహకరించు

పల్లెల్లో ప్రకృతి ప్రశాంతమోయ్ 
పిల్లల్లో చదువును పెంచు 
చేలల్లో చిందులేయకోయ్ 
తుప్పల్లో పాములు గమనించు 

మాటల్లో మర్మ తెలుకోవోయ్ 
చేతల్లో చూపి ఆచరించు 
వేషాల్లో నిజం గమనించవోయ్ 
వేదాల్లో వివరం బోధించు 

వీధుల్లో ధర్మాన్ని భోధించవోయ్ 
వింతల్లో వింతను తెలియపరుచు  
సభల్లో చేసేది చెప్పవోయ్ 
సందుల్లో తిరిగి  వివరించు 


ప్రాంజలి ప్రభ 

చిలిపితలపు కలిగే 
చిన్మయరూపం కొరకు  
రేయి వేగిరం రమ్మనే 
కవ్వములా కవ్వింపు కొరకు 

వెన్నెల తీరం చేరే  
చల్లఁగాలిలో వెచ్చదనం కొరకు 
జాబిలి కోసం వేచే
హుదయవాంఛ తీరుట కొరకు  

యామినిలో యాత్ర చేసే 

మకుట మహారాజు కొరకు 
తరుణం తపనలు పెంచే 
తపించు హృదయం కొరకు 

మౌనిక మౌనం వీడే 
మాధుర్యం పొందుటకొరకు 
గాలిలా మమత చేరే 
తన్మయత్వం తీర్చుట కొరకు  

హృదయాన్ని ఆకాశం చూసే 

మేఘం కురిపించుట కొరకు
పుడమి భరించి ఓర్పు చూపే 
ప్రేమను పంచి పొందుట కొరకు  

--((*))--

ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ.కం
నాలోకం
దు:ఖాన్ని భరించి, అందరికి సుఖాన్ని ఇచ్చే మార్గం చెబుతాను ! దుఖిమ్చే వారిని ఒదార్చి సౌఖ్యాన్ని, సంతోషాన్ని అందరికి పంచుతాను ! సుర్యుడులా తిరుగలేను, కొందరి భాదల విముక్తికోసం తిరుగుతాను ! చెంద్రుడిలా వెన్నల కురిపించలేను, సంసారములో వెన్నల నింపుతాను ! గాలి తాకిడికి ఎగిరే ఆకులా ఉంటాను, భందాలకు చిక్కక పయనిస్తాను ! పరమపద సోపాన మవుతాను, కష్టములు వచ్చినా ఓర్పుతో ఉంటాను ! విశ్రాంతి లేకుండా నిరంతరం ప్రవహించే నదిలా సమస్యలను పరిష్కరిస్తాను ! రోగానికి మందులా, హృదయానికి తగిలిన గాయాన్నితొలగిమ్చుతాను ! నా నిరంతర పయనము ఆపేవారెవరు, నన్ను అర్ధంచేసు కోనే వారి కోసం నేను ! --(*))--
నేటి కవిత - ప్రాంజలి ప్రభ

మొదటి భాగం

ఓ మనిషి తెలుసుకో 26  దివ్య లక్షణాలను
మనసా వాచా కర్మణా  ప్రేమించి ఆచరించు

నవ తేజస్సులకు ఉషోదయం
నవ సంకల్పాలకు శంఖారావం
నవ నవాభ్యుదయానికి శ్రీ కారం
నవ లక్ష్యాలకు నాందిప్రస్తావనం

1 . దయ చూపుట
సమ్మతమైనది దయార్ద్ర హృదయం
ప్రతి ఒక్కరి అభ్యుదయమే మాలక్ష్యం
సకల ప్రాణులపై ఉంచు సహృదయం
భవ భందాలను మార్చేది భగవద్దామం

2 . పోట్లాడే స్వభావం లేకుండుట
ధర్మం అనుకున్నది ఆచరించే స్వభావం
సన్మార్గలో అందరిని నడపాలని తాపత్రయం
ఇతర లోపాలను వేలెత్తి చూపని అన్య భావం
ఎవ్వరిని దూషించక కర్మలు అనుభవించటం

3 . దృఢచిత్తం ఉంచుట 
అధార్మిక పనులను చేయకుండటం
అనుకున్నది సాధించాలని సంకల్పం
ఆచార వ్యవహారాలను నిర్వహించటం
పరమాత్మునిపై దృఢ చిత్తం ఉంచడం 

4 సమభావం కలిగుండుట
సర్వమతాలలో ఉండేది సమభావం
తల్లి తండ్రులలో ప్రేమ సమభావం
అందరిలో సమభావ పరమాత్మ రూపం
అదే బద్ధజీవుల ఆధ్యాత్మిక సమభావం   .

5 దోష రహిత జీవనం గడుపుట 
ప్రేమను పొంది ప్రేమ నందించటం
మనసా వాచా కర్మణా అని నమ్మడం
స్త్రీని ప్రేమతో ఆదరించుటే ముఖ్యం
సర్వశక్తులను ధర్మానికి ఉపయోగించటం

6. దాతృత గుణం ఉండుట 


7. మృదు స్వభావంగా ఉండుట 
8. సౌచంతో ఉండుట 
9. నిరాడంబరుడుగా ఉండుట 
10. పారోపకారిగా మారుట 
11. శాంతముగా ఉండుట 
2. దైవమే సర్వస్వాన్ని భావించుట 
13. ప్రపంచంపై అత్యాశ ఆరాటం లేకపోవుట 
14. వినమ్రత 
15 స్థిరత్వం 
16. స్వీయనియంత్రణ 
17. ఎంత అవవసరం అంతే  భుజించుట 
18. బుద్ధిమంతుడు 
19. మర్యాద 
20. వినయం 
21. గాంభీర్యం 
22. కారుణ్యం 
23. స్నేహం 
24. కవితాత్మకం 
25. మౌనం 
26. నేర్పరితనం 

--((***))--

నేటి కవిత - ప్రాంజలి ప్రభ 
రచయత మల్లాప్రగడ రామకృష్ణ.కం 

నన్ను చేరే నాశ్రీమతి ఎక్కడో  

ప్రేయసి నీవు వస్తే, 
 మల్లీ నాకు వెలు గొస్తుంది 
నీకు చేసిన వాగ్దానమూ 
 నాకు ఇంకా గుర్తుంది    
   
మనిషి మనిషిగా గుర్తుకు 
స్త్రీ సహాయము కావాలంది 
మన జీవితము సుఖము 
చేయాలని దేవుడ్ని కోరాలని ఉంది

రక్తాన్ని మరగిస్తున్నాయి
 చేసిన బాసలెన్నో  
మీటిన వీణ మూగబోయే 
 అయినా అనురాగాలెన్నో 

వసంతము కరువాయి
 అయిన కోయిల కూతలెన్నో 
భయము వేమ్బడిస్తుంది 
అయిన అనుభూతులెన్నో 

చిక్కని చీకట్లో చిక్కి
 కళ్ళు కాన రాకున్నాను       
మండు టెండ లో 
 మాడి నీడనేది లేకున్నాను

హృదయమే పాషాణముగా 
మార్చి బ్రతుకు తున్నాను
ఈచీకటి ప్రాణము వెలుగును
 చూడ లేకుండా ఉన్నది

ఎకాంతము కోసం పొతే
 వినబడు తుంది గత ధ్వని
చేసిన  తప్పు పదే  పదే 
గుర్తు  చేస్తుంది ప్రతి ధ్వని
భూమి ఆకాశం ఎప్పుడూ 
కలవాలని గాలి ధ్వని
తప్పు చేసినవారిలో 
జ్వలిస్తుంది  శంఖ ధ్వని

గంప క్రింద కోడి
 అరచి మేలుకో మంది
గొంగళి ప్రక్కకు 
జరిగింది చలి లేదంది
కొవ్వొత్తి కరిగి వెలుగుని
 విరజిమ్మిది
ఎండిన చెట్టు వికసించి
 పూలు కాయలు కాసింది
నా మనసు వికసించి 
నన్ను చేరే నాశ్రీమతి ఎక్కడో     
__((*))--

153- నేటి కవిత 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 
Luctrachanh D / 500px

దివి నుంచి భువికి
దివ్య వెలుగుతో అరుదెంచే స్వర్ణ సుందరి
ధవలాన్ని ధరించి
రివ్వున ఎగిరే పక్షిలా కనబడుతున్నది

పున్నమి చల్లని గాలుల్లో
వెన్నెల వెలుగులు, తళుక్. తళుక్ మనగా
కన్నె వయసు పొంగుల్లో
వన్నె తెచ్చే జాబిల్లి కన్య చిత్ర మాలిక  

నవ వసంతము  తెచ్చినది 
నవరాగములు పల్కి మదిని దోచినది   
హావ భవాలను చూపి
అవినా భావసంభందము కల్పినది  

వయసు ఊరుకోవటం  లేదు 
మాయను చేదించి సుఖపడాలని ఉంది 
భయము మనసుకు ఆవరించిన
జయము నీకే ముందుకు దూకమంటున్నది 

ఇది కలకాదు నిజము 
మదిలో ఉత్తేజము కల్పించే ఆమె నయనాలు 
పది సంఖ్యలు లేక్కపెట్టి 
మది దోచుకొని సుఖపెట్టి సుఖపడ మన్నది  

--((*))--  


ప్రాంజలి ప్రభ - ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
 
నేటి ప్రకృతి 
పున్నమి వెన్నెల మెరుపు
నింగిన  తారల తళుకు
పృథ్విన మాయల మరుపు
గూటిలొ గువ్వల కొలుకు     

మేఘము గర్జన దడుపు
చక్కని ఆర్తితొ పిలుపు
ముత్యపు చిప్పల మినుకు
చల్లని గాలితొ తడుపు  

శోభల హాయిగ తలపు
వెచ్చని భావపు వలపు
సుందర ప్రకృతి సొబగు ,
నీటిలొ బింబము కుదుపు 

ప్రేమకు భావము కురుపు
సేవకు చిహ్నము మలుపు
ఆకలి కేకలు విరుపు
చీకటి కాంతులు తెలుపు

__((*))--


Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు