ప్రాంజలి ప్రభ 
 నేటి కవిత - 113  
."తన్మయత్వపు - చినుకు" 

 కొమ్మలపై సాగి,
ఆకులపై చేరి జారె నీటి బొట్టు 
నవనీతం లా కరిగి,
సువాసనలు వెదజల్లే నేతి బొట్టు

వళ్ళంతా కవ్వించి 
సుడులు తిరుగుతూ మతి పోగొట్టు
ఆలంబన చుంబనాలకి 
చిక్కి అమృతం పంచి పెట్టు

వానజల్లుకు మల్లెపూలను తడిపి 
నిత్యమూ సుఘంధం పంచి పెట్టు  
ఫన్నీటి జల్లు తడుస్తున్న 
ఊరపిచ్చుక రెక్కలతో పట్టు

తెనే చుక్కలను ఆస్వాదించి 
కెరటంలా ఎగసి పట్టు 
ఆత్మయతతో ఆలింగనం చేసి 
మధురాతి మధరం అని ఒట్టు

జల తరంగినిని  చేతి 
వేళ్ళతో కదిలిస్తే ఆట పట్టు 
మెత్తటి అందాలు చిత్తు 
చిత్తుగా తడుస్తూ ఒడిసి పట్టు

నింగి నెల తడుస్తు ఇంద్ర ధనుస్సు 
అందాలను చూపి రెచ్చ గొట్టు
గుండెలు సవ్వడికి వేడెక్కి
 మనసంత ఇచ్చి చమట పట్టు 

నా మదిలో ముద్రించిన ప్రకృతి
 చినుకు చిత్తరవు అయినట్టు 
కురిసిన వానజల్లు సమస్త
 కల్ముషాన్ని తుడిచి పెట్టు 

చినుకు చినుకు చేరి 
నేలనున్న విత్తనాలు మోలకెత్తినట్టు 
జల్లుకు భూమి తడిసి
 మొక్క కొత్త రూపం దాల్చినట్టు 

తనువు - తనువు - తాకట్టు -
 చినుకు - చినుకు - పృద్విపై - ఆవిరై - నట్టు


ప్రాంజలి ప్రభ  




సూర్యుణ్ణి చూసేది నేత్రం 
నేత్రాన్ని ప్రకాశింపచేసేది బుద్ధి
బుద్దిని ప్రకాశింప చేసేది ఆత్మ 
మహాత్ముల్లో వెలిగేది దివ్యాత్మ 

దివ్యాత్మను కల్పించేది పరమాత్మ 
పరమాత్మ కోరేది సర్వం జ్యోతిర్మయం 
జ్యోతిర్మయం అనగా జ్ఞానజ్యోతి 
ఇది ప్రతి ఒక్కరిలో ఉండు 

అదే అంతర్గతంగా రమింప చేస్తుంది
తెలిపేవారు తోడుతో  ప్రజ్వలిస్తుంది  
అదియే నిత్య సంకల్ప మనస్సు 
ఇదే సందేహ నివృత్తి తేజస్సు 

కల్ముషాలను, భయాలను  తొలగించి
ఆనంద అభయాన్ని అందరికి అందించి 
అహం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ, ఆత్మానందం  బ్రహ్మ
సర్వభూత హిత బ్రహ్మ సర్వభూతానాం సహృదయం బ్రహ్మ 

భగవద్ గీత ఉపదేశ మార్గం   
సర్వ మంగళం శాంతి మార్గం 
సర్వ శ్రేయస్సు మోక్ష మార్గం 
   --((*))--


ప్రాంజలి ప్రభ 


చిలిపి నవ్వులతో నన్ను పిలచి 
మనసును కవ్వింపునకు గురిచేసి 
వలపు వయ్యారానికి నాంది పలికి 
సై అంటే సై అని మక్కువ గా పిలిచే 

వయ్యారంగా ఓరకంటగా  నన్ను పిలిచి 
చీర కుచ్చిళ్ళు సవరించి మైమరచి 
అరచేతులు అందానికి అడ్డు పెట్టి    
సై అంటే సై అని మక్కువ గా పిలిచే

నవ్వులు పువ్వులుగా మనసును చేర్చి 
మల్లెల గవ్వలుగా  వయసును మార్చి
చప్పుడు ముచ్చట్లతో సొగసును కూర్చి   
సై అంటే సై అని మక్కువ గా పిలిచే

నుదుటిపై ఒక తీపి ముద్రనందించి 
చెంతకుచేరి  కరములతో బంధించి
తన్మయత్వంతో తపనను తగ్గించి  
సై అంటే సై అని మక్కువ గా చిలికే 

మదనాంతరాల భావాలను చక్కదిద్దావు      
మనసులోని మర్మాన్ని తెల్సు కున్నావు  
ముంగురులు సద్ది ముద్దు తీర్చుకున్నావు  
సై అంటే సై అని మక్కువ గా చిలికావు  
--((*))--

 ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రే నమ:

ప్రాంజలి ప్రభ - (సంపద)
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  

ప్రాపంచంలో తోలి వాకిలి
అమ్మలకు సంపూర్ణ స్తన్య సంపద
తోలి ఆరోగ్య సంరక్షణ వాకిలి
సమగ్రపోషక ఆహారం తల్లి పాల సంపద

ఆలుమగల పరమాద్భుతము అవ్వాలి
బిడ్డకు తల్లి కావటం స్త్రీజన్మ సంపద
భర్త, స్త్రీలో మాతృత్వ మార్పు చూడాలి
నలుసు కడుపులో పడితే అదే సంపద

దేవుడు మనుష్యులపై ప్రేమ చూపాలి
పిల్లలకోసం బ్రతికి గుండెధైర్యమే సంపద
కెవ్వున స్నిగ్ధమందరము కేక వినబడాలి
తల్లి ఆనందం స్తన్యాలతో పొందే సంపద

జగతికి సార్వభౌమత్వం సైతం ఆమ్మ కావాలి
మోహన కృష్ణుడు తెల్పే పాలే ఆరోగ్య సంపద
చుబుక్ చుబుక్ అని మూతిపెట్టి పాలు త్రాగాలి
నిర్జర నిర్ఘర ధారలే యాగోద్భవమృతమే సంపద

తల్లి రక్తం దారం పోసి, ప్రేమరసం రంగరించాలి
పెరిగే పాలిండ్ల సొగసు తగ్గునని అనారోగ్య సంపద
ఆలుమగల హృదయాలు పరవసించాలి
స్తన్య పాలు ఇవ్వడమే తల్లికి బిడ్డకు ఆరోగ్య సంపద

--((*))--
ప్రాంజలి  ప్రభ 
నేటి కవిత -115

నీ భక్తి కోసం యాచించా 
మానసంతో అర్చించా  
మనసును సమర్పించా 
సందేహాన్ని తెలియ పరిచా 

నీకు కోరికలన్నీ విశద పరిచా
ఒంటి కాలిపై జపం చేయదలిచా
కరుణా సముదృడవని తలిచా 
కర్మఫలదాత వని ఊహించా 

ఎన్నో మార్లు నిన్నే తలచా 
ఎన్నో సార్లు నీముందు తలవంచా 
ఎన్నో కష్టాలను భరించా 
ఎన్నో సంకటాలు రాకుండా ప్రయత్నించా 

నీకోసం విధిని ఎదిరించా  
నీకోసం ప్రాణాన్ని ఫణంగా ఉంచా
నీకోసం కర్మలన్నీ సాగించా 
నీకోసం కాలంతో నడిచా 

నా గోడు నీకు వేళ్ళ బుచ్ఛా   
నాకు శక్తి లేదని తెలియ పరిచా  
నేను మాటపై నిలబడ లేనన వచ్చు    
నాది సరిఅయిన భక్తి కాదన వచ్చు   
మనమధ్య ఉన్న ప్రేమ తగ్గ వచ్చు  
ఏది ఏమైనా నీవు నాలో ఉండి 
నన్ను ధర్మమార్గాన్ని నడిపించు హనుమా 

అంటూ ఒక భక్తుడు 
హనుమంతుని ప్రార్ధించు తున్నాడు
సీతారాములకు తెలియపరచమని 
ప్రార్ధనా వందన పూర్వకముగా తెలిపే  
--((*))--


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

ప్రాంజలి ప్రభ   
ప్రాంజలి ప్రభ

నేటి కవిత -119
ఓ మనిషి నీవెందుకు బాధ పడతావు
చేతులారా తెలుసుకొని మానక బాధ పెడతావు
 
ఆగలేక కుటిలుడిగా మారుట ఎందుకు
ధన మాన ప్రాణాలను బలి చేయుట ఎందుకు
క్షణిక సుఖం కోసం కొందరిని ఏడిపించు టెందుకు
అవమానంతో తలచూపలేక తిరుగుట ఎందుకు

ఓ మనిషి నీవెందుకు బాధ పడతావు
చేతులారా తెలుసుకొని మానక బాధ పెడతావు

పందెం ఓడేకొద్దీ పంతం పెరగటం సహజం
ముందు వెనక చూడక వ్యసనానికి బానిస అవ్వడం
వివేకమున్న ఆశకు చిక్కి బ్రష్టుడుగా మారడం
మధువును కోరి, మగువను కోరి, మనిషినే బలి గోరటం

చూసి ఓ మనిషి నీవెందుకు బాధ పడతావు
చేతులారా తెలుసుకొని మానక బాధ పెడతావు

కామక్రోధాలవల్ల కలిగే దోషం
వాక్సారప్యం వళ్ళ ముదిరిన దోషం
పౌరుషానికి చిక్కి క్రోధ జ్వాల దోషం
అనుమానానికి చిక్కి నాశనమయ్యే దోషం

ఉందని తెలిసి కూడా
ఓ మనిషి నీవెందుకు బాధ పడతావు
చేతులారా తెలుసుకొని మానక బాధ పెడతావు

దుర్జన సహవాసంబును వదలండి
దుర్జన సంభాషణలు అనుకరించకండి
సిరి పొందటానికి అడ్డదారిన పోకండి
దొరుకుతుందని మత్తును ఆహ్వానించకండి
అంటూ నీతులు చెప్పి
ఓ మనిషి నీవెందుకు బాధ పడతావు
చేతులారా తెలుసుకొని మానక బాధ పెడతావు

మూక మనస్తత్వం ఉచ్ఛం నీచం, ఎంగిలి కానరావు
సిరి అంటక పోయిన చీడ మాత్రం అంటక మానదు
ఓ మనిషి నీవెందుకు బాధ పడతావు
చేతులారా తెలుసుకొని మానక బాధ పెడతావు

--((*))--



ప్రాంజలి ప్రభ
 
నేటి నాపాట -118  వట్టి మాటలు మానవోయ్

వట్టి మాటలు మానవోయ్ - గట్టి మేలు తలపెట్టవోయ్
ఎట్టి స్థితిలో నీవు మనకోయ్ -  పరమాత్ముడే నడిపిస్తాడోయ్

కాలం కలిసొస్తుంది కల్లబొల్లి మాటలు ఎందుకోయ్
సమయాన్ని వ్యర్థం చేసే  చిందు లెందుకోయ్
నీలో ఉన్న బలహీనతను ఎవ్వరికి చూపకోయ్
నిదానంగా ఆవేశపడక నిజాలను గ్రహించాలోయ్


వట్టి మాటలు మానవోయ్ - గట్టి మేలు తలపెట్టవోయ్
ఎట్టి స్థితిలో నీవు మనకోయ్ -  పరమాత్ముడే నడిపిస్తాడోయ్

నీ చుట్టూ ఉన్నవారు ధనం ఉన్నప్పుడే వస్తారు లేకపోతె రారోయ్
నీ ప్రేమ పొందినవారు ధనం ఇస్తేనే నిన్ను గుర్తించుకున్నారోయ్
నీ భార్య అయిన పిల్లలైనా నీలో ప్రేమ ఉంటేనే గౌరవిస్తారోయ్
నీ వేష భాషలు మార్చి మనస్సివని సంపాదనలు ఎందుకోయ్

వట్టి మాటలు మానవోయ్ - గట్టి మేలు తలపెట్టవోయ్
ఎట్టి స్థితిలో నీవు మనకోయ్ -  పరమాత్ముడే నడిపిస్తాడోయ్

ప్రకృతి వనరులు ఉపయోగించుకొని ప్రశాంత పడాలోయ్
ప్రేమను పంచి ప్రేమను పొంది సుఖాలను అందించాలోయ్
నవతరానికి కష్టసుఖ అనుభవ ఫాఠములు తెలపాలోయ్
నిన్ను నీవు నమ్ముకొని నిజానమ్మకాలు తెలపాలోయ్  

వట్టి మాటలు మానవోయ్ - గట్టి మేలు తలపెట్టవోయ్
ఎట్టి స్థితిలో నీవు మనకోయ్ -  పరమాత్ముడే నడిపిస్తాడోయ్

 

నేటి కవిత - ఐక్యం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ : 

ఉదయ భానుని కిరణాల మేల్కొల్పుతొ
చంద్రుని వెన్నెల రాత్రుల చల్ల దనంతొ
నింగికి ఛత్రము వలే ఆకాశం నీడతో
ప్రృధ్విలో జల,ఖనిజాలు జగతికి ఐక్యం

పిల్లలు మేధా, సంపద, ప్రేమలతొ
కుటుంబానికి నిత్యం సహకారంతొ 
ప్రకృతి ననుసరించి ధర్మాసనం తొ
మేధావుల సహాయం జగతికి ఐక్యం

బిడ్డలు తల్లి తండ్రుల దీవెనలతొ
గురువుల విద్యా సత్యభోదనలతొ
దేశ, కుటుంబ, సేవా త్రృప్తిలతొ
భావ ప్రేమస్నేహం జగతికి ఐక్యం

మనో నేత్ర భాష్య బంధాలతొ
మమతాను రాగ ప్రేమలతొ
సర్వసమ్మోహన సద్భావముతొ
నిత్యకల్యాణంతొ జగతికి ఐక్యం 

--((***))--

 
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

ప్రాంజలి ప్రభ  
Ernest Zacharevic

పిల్లలు గోల చేస్తుంటే చూసి అదుపు చేయడమే 
పిల్లలు పెద్ద మాటలు అంటూ ఉంటే చూడటమే 
తరువుకు నీరు పోస్తే ఆకులు పూలు కాయలవడమే 
ఆకులు పువ్వులు కాయలు రాలు తుంటే చూడటమే 

వయసు వచ్చాక పిల్లలకు తప్పక పెళ్లిళ్లు చేయడమే 
లేదా విరహం మధురంగా మరుగుతుంటే చూడటమే      
సుఖ దుఃఖాలు ఇరువవురు సమానముగా పంచు కోవడమే 
లోలోపల ప్రేమను పంచుకుంటూ వెలుగును చూడటమే 

ఆశయాలు అంటూ జీవితమంతా కష్టాలు పడటమే 
సంపద తినక అంతా మిగులుతూ ఉంటే చూడటామే  
తప్పులు చేసినప్పుడు ఇతరులు నవ్వితే భాధపడటమే  
ఆశలకు చిక్కి స్వప్నాలు కరిగిపోతుంటే చూడటమే    

ధర్మంగా జీవిస్తే మరుజన్మ ఉండదని చెప్పఁడమే  
మనసును ఆకర్షిచే కొందరి రూపాలు చూడటమే 
జీవితమంతా రైలు ప్రయాణమే అని అనుకోవడమే 
జీవితము కష నష్టాలు వచ్చి సాగుతుంటే చూడటమే     

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 

Rainbow colors
కొత్తగా పెళ్ళైనవారు 
సరస సంభాషణలు (వృత్తము)
నాకీ అనుమతీ

ఉత్సాహ మనసే - ఉల్లాస సెగలే 
వాత్సల్య తలపే - సంతోష కథలే    
బంగారు తనువే -  రాగాల మదిలో
సాకార నిలయే  -  ప్రేమర్ద హృదిలో 

పొంగారు దయతో - సేమమ్ము గనవే
లాభమ్ము మనకే  - ఆమోద మనవే
సాహిశ్చ రతిలో  -  అందాలు పరిచెన్     
పల్కిమ్చు నగువే - సందేహ మడుగున్

చర్చించ మనకే - తాపంబు గనవే  
నీహాయి కొరకే  - స్నేహంబు తెలిపే 
తన్మాత్ర తలపే - భావాత్మ వెలుగే 
సద్భుద్ది తపనే - చామంతి చలువే 

అందాల లలనా - ఆధార కలువా    
దేవీమధుమతీ - నాకీ అనుమతీ
ప్రేమార్ధ తరుణం - చింతేల మదనా 
శ్రీకార పలుకూ   - జిఘ్రంగ కులుకూ 

తాత్పర్య మనసూ - ప్రోత్సాహ మియగా
మోహమ్ము విడదా - దాహమ్ము తరిగే 
చల్లాగ  పిలిచే  - వెచ్చాగ కదిలే 
సోకంత నలిపే - ప్రేమంత కరిగే 

--((*))--                   

ప్రాంజలి ప్రభ 
నేటి కవిత 
 కాలం విలువ 
Rainbow heart rays
కదిలిపోయిన కాలాన్ని 
ఏనాటికి తేలేం 
అదియొక జాగృతి 
అది కొందరిని నడిపించి
మరి కొందరిని ఏడిపించి 
సుఖదుఃఖాలు, కష్టనష్టాలు 
సమానంగా పంచి 
మీరు మరచినా వెంట ఉండి
చల్లగా జారుకుంది కాలం 
అలా అని కాలాన్ని ఆపలేం 
యవ్వనాన్ని ఎప్పుడూ నిలపలెం 
ఆయుష్షుని తిరిగి తేలేం 

కాలగమనంలో నడిచేవాళ్ళం 
నడిపించే వాళ్ళం   
కళల ఆశయాలను సాధించేవాళ్ళం  
మనకంటూ నీతి ఉన్నదని నిరూపిద్దాం 
తోటివారికి సహాయపడుతూ జీవిద్దాం                          

చిరస్మరణీయులైన వాళ్లలో 
ఒకరిగా బ్రతుకును సాగిద్దాం 
నిత్య నూతన ప్రపంచానికి 
నావంతుసహాయం చేస్తానని 
శభదం చేద్దాం  

జరిగిపోయిన కాలం లో నిజం 
ధర్మసందేశాలను గ్రహించి 
జరుగుతున్న  కాలంలో 
గుర్తుచేసుకొని జీవిద్దాం 

పెద్దలను ప్రేమిస్తూ 
గురువులను ఆశ్రయిస్తు 
కుటుంబానికి, దేశానికీ  ప్రేమ
సహాయం అందించటమే నేటికాలం  
ఇదే మన ఆశయం, కర్తవ్యం.  
భవితవ్యానికి సందేశం 
--(*))--


--((***))-- ప్రాంజలి ప్రభ - నేటి కవిత 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  

ముసలితనం వచ్చిందని అనుకోకు 
భాద్యతలు తగ్గించుకున్నానని అనుకో 
నిర్వేదం చెంది బాధపడుట ఎందుకు 
గుండె వేడి తగ్గే దాకా పనులు చేసుకో 

నేను శాపగ్రస్తుండని ఎప్పుడు అనుకోకు
కాలాల్ని బట్టి నడుచుకోవాలని తెలుసుకో  
బ్రతుకే మోయలేని భారం అనుకోకు  
భగవంతుని సన్నిధిలో ఉండటం నేర్చుకో 

చూపు అందలేదని పదే పదే అనుకోకు 
ప్రపంచ మార్పులో భాగమని తెలుసుకో 
చేవలేని చేతులు, నడవలేని స్థాయి అనుకోకు
నేను ఓపికతో సేవలందించానని అనుకో  

నడక దూరమై, గమ్యాలు భారమైనాయనకు
కంటికి జోడు, చేతికి కర్ర ఉన్నాయని అనుకో   
అంతిమ ఘడియలని ఆవేదన పడకు
దైవప్రార్ధనలో సుఖముందని తెలుసుకో 
  
నిత్యమైన నిర్లక్షాలు అని ఎప్పుడు అనకు
చేసిన మేలు ఎప్పుడు మరువరని తెలుసుకో 
నోచుకోని ఆత్మీయతలు ఉన్నాయని అణకు 
బ్రతుకులో  స్వార్ధం తొంగి చూసిందనుకో 

ఉబికిన కన్నీళ్లకు తోడు లేదనుకు 
ఏవి ఎప్పుడు శాశ్వితము కాదని తెలుసుకో 
ప్రతివిషయంలో తృప్తి పడుట ఎందుకు అనకు
మౌనాన్ని మించిన మందు లేదని తెలుసుకో 

గమ్యం ఏదైనా గుండె చప్పుడు ఆగేవరకు 
ధర్మాన్ని ఎదురించి బతుకలేరని తెలుసుకో 
ఓపికతో శ్రమిస్తూ తోడుగా నడువు ముందుకు  
మనసున్నంత వరకు బ్రతకటం నేర్చుకో 

--((*))--

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు