15 4 - నేటి - స్త్రీ తత్వ పద్యాలు

3. ప్రాంజలి ప్రభ - నేటి పద్యం
ప్రేయసి తో ప్రియుడు పల్కిన ఛలోక్తి పద్యం
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

ఓం శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ: 


1. శా: అన్వేషి స్త్రికతా అనంత మలుపే ఆదర్శ సాహిత్యమే
     ఇష్టంల్లో సఖిలా ఓదార్పు మెరుపే మంత్రోదయామృత్వమే
     కష్టంల్లో ప్రభలా సుసేవ తలపే ప్రభుత్వ బాంధవ్యమే
     నష్టంల్లో  కరుణా దయాసుఖలయే ఓర్పు స్త్రి ప్రేమార్పనే              


స్త్రీ కధను ఆదర్శ  సాహిత్యముగా అనేక మలుపులుగా సాగుతుంది, ఇష్టంలో సఖిగా, కష్టాలలో ఓదార్పు అందిచే ఇల్లాలుగా, తనకర్తవ్యముగా భావించి వెలుగును పంచెడి స్త్రీ ఆమె మాట ఒక మంత్రముతో కుఉడిన అమృతం,  తను యజమానిగా నిర్వహిచి కరుణతో, దయతో ప్రేమతో ఓర్పుతో సుఖములందించేది స్త్రీ మాత్రమె. 
      

2. శా : వాత్సల్యం తనలో పరంపరముగా సంఘర్షతత్వాలయం 
           కారుణ్యాలయమే సుఖాల నిలయం సంతృప్తి సంభావ్యమే 
           లావణ్యం లలితం సుమాల సుఖసౌందర్యాలయం ఆకర్షణే
           ప్రావిణ్యం తరుణం స్వభావ మదిలో మాధుర్య మాంగల్యమే 

తా : మాంగళ్య బలంతో మదిలో భావాలను  సమయం వ్యర్థం చేయక లావణ్య రూపంతో పువ్వుల మాలగా ఆకర్షణగా సుఖం అందించేది స్త్రీ స్వభావమే.  ప్రేమ  ఉండటంవల్ల, ప్రేమను పరంపరంగా అందించుటవల్ల, కారుణ్య స్వభావమువల్ల, సుఖాలను అందించుట వల్ల సంఘర్ష నిలయాన్ని సుఖాల నిలయంగా మార్చే లక్ష్యం స్త్రీ స్వభావమే. 

3 శా:  మంధవ్యం మదిలో భ్రమించి తనువే దీపంగ వెల్గించు టే
     ఆనందా  లయమే శ్రమించి మరుపే తప్పించె సంతోషమే
     స్వర్గంగా తలపే తపించి తరుణం తన్మాయ ఇష్టానులే
     ఆకాశం  పుడమీ అనుంగ కలలే ప్రేమాలయానందమే
 


4 . శా: నీ నవ్వే కలగా అనంత సుఖమే ఆద్యంత ఆనందమే
     నీ చూపే కలలో గులాబి మెరుపే దివ్యంగ సౌందర్యమే     
    నీ గాణం శృతిగా సమంత ప్రణయం సత్కార్య సౌకర్యమే
    నీ పల్కే వినయం విధేయత దయా మాధుర్య సాహిత్యమే            


5 . శా. చామంతీ సుఖలాశ్యవంతి కదిలే పూబంతి రారమ్మనీ
     సంపెంగా లతలా సుఘంధ పవనం వీక్షించి రారమ్మనీ
     మల్లే పువ్వు గుణోనెత్రంగ మదితో చర్చించి రారమ్మనీ
     లిల్లీ పువ్వు నెనీ క్షెమంగ మనసే కాంక్షించి రారమ్మనీ

ఒక ఇల్లాలు కుక్కవెళ్ళిపోయినది పట్టితెచ్చిన వారికి బహుమతి అని ప్రకటన ఇచ్చింది ఇకచదవండి.

6 శా: అయ్యయ్యో సునకంని మఛ్ఛికముతో పెంచానులే
   .   కళ్ళె గప్పిమరీ మజాగ వదలీ కక్కేడొ తిర్గేనులే
     ఫోన్ కాలొచ్చె మికుక్క ఆశ్రమునే వచ్చి ఉన్నదిలే
     అత్తమామలతో పిలిస్తే కడకూ వస్తాను పల్కేనులే

అత్తమామలను తరిమి,  కుక్కను మచ్చికతో పెంచింది ఒక ఇల్లాలు, అది యునినుని పారిపోయినది గత్యంతరం లేక కుక్కను తీసుకొచ్చినవారికి బహుమతి ప్రకటించినది 
ఒక ఫోన్ వచ్చింది మీ అత్తమామలు ఆశ్రమం నుండి ఇంటికి వస్తేగాని కుక్క వెనక్కు రాదుట  ఏమి చేయ మంటారు ?   

7.  శా: మృదంగం మదిలో తపింప తరుణం ఉస్చ్వాస నిశ్వాసకే
     విశ్వాసం తలపే విహంగ పవనం  ఉద్యుక్త  ఉత్తేజమే
     కల్లోలం కలిసే వరించు సమయం తన్మాత్ర తద్భావమే
     ఉల్లాసం మెరుపే  మనస్సు  కలిపే తత్భోద సాధ్యమునే   

8 . శా: కారుణ్యా లయమే సమగ్ర చరితా ప్రేమా సమాకృతమే
      శ్రీవిద్యా లయమే ప్రభాత సమయం ఆరోగ్య సంతోషమే
       సౌజన్యా లయమే  సుదీర్ఘ భగ ధన్యోన్మత్త విద్యుక్తయే
       ప్రావిణ్యా లయమే  ప్రతిజ్ఞ ప్రతిభా దివ్యాను భావాత్మమే 
   
 ఇది నా ఆలోచన భావము
ప్రేమ సమానముగా ఉండి, పూర్తి చరిత్ర తెలుసుకొని కనికరము చూపే నిలయము
తెల్లవారుజామున ఆరోగ్యంతో సంతోషం పంచుకోవటమే శ్రీ విద్యా నిలయము
మంచి తనంతో విధి నిర్వహించు వారు పూర్తి వెలుగుతో  కనిపించే నిలయము
ప్రతిజ్ఞ చేసి ప్త్రాతిభతో దివ్య భావాలను చూపి  ప్రావిణ్యతను  చూపే నిలయము


9.  శా:  సంకల్పం హృదయానికీ తెలుగుతల్లీ నిత్య శోభాయయే
      పున్నాగం  విరజాజి శోభలవనం ఆనంద  ఆహ్లాదమే
      ప్రేమాలంకరమే సమాన అభిమానంతొ ఆహ్వానమే
      ఆరోగ్యాల వనం ఆనంత కళలే విస్తీర్ణ విద్యాలయే 

(పున్నాగము= ఇంద్రుని ఏనుగు, తెల్లగలువ )
నేటిపద్యం నగణం
లత కులుకుకు నయనము కదులటయు
సరిగమలకు పెదవులు కదులటయు
తమకముకు కణములు కదులటయు
కరములు మమత కలుపు కొనుటయు


నేటి కవిత - ప్రాంజలి ప్రభ 
ఛందస్సు -   బ్రమరం
రచయత - మల్లాప్రగడ రామకృష్ణ 

మనసా సంగీతమే - మమతా సాంగత్యమే 
వయసా ఉల్లాసమే - సొగసా సౌందర్యమే 
వలపే వయ్యారమే - కులుకా శృంగారమే 
తనువా జవ్వారమే - మలుపే మాధుర్యమే

అలకా సాహిత్యమే - ఆధరం ఆనందమే
నడకే నాట్యాలమే - నడుమే సమ్మోహమే 
సహనం సాహిత్యమే - తమకం తాత్పర్యమే    
తరుణం తాత్కాలమే - చలణం చాతుర్యమే 

కథనం కాందోళమే - చరితం యవ్వారమే 
పలుకే ఆంతర్యమే - గళమే గాంధర్వమే 
జలజే జవ్వనమే - బ్రమరం బ్రహ్మాండమే 
మధురం మాంగల్యమే -  శపధం ఔన్నత్యమే    
    

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు