1 8 4

నేటి కవిత 
ప్రాంజలి పభ 
మల్లాపగడ రామకృష్ణ


రాత్రి పగలు అనుభవించే వాళ్ళం
వెలుగు చూడలేని మానవులం 
రెపరపలాడే కొండగాలిని తట్టుకోలెం 
ఏ వాసనో కనుక్కోలేని మానవులం 

కాలుష్య పెనుభుతానికి చిక్కినవాళ్ళం 
వృక్ష సంపదను నరికే మానవులం 
స్థలమేలేని ఇరుకు ఇళ్ళల్లో ఉండేవాళ్ళం  
స్వచ్చ వాయువు పిల్చలేని మానవులం 

ఉదయభానుని చూడలేని వాళ్ళం 
అమావాస్య చీకటి కమ్మిన మానవులం 
పుత్తడి ఆశలో చిక్కి నలిగే వాళ్ళం 
ఖజానాకోసం మోసపోయ్యే మానవులం 

నీడ రహస్యంతో ఉనికి కోల్పోయే వాళ్ళం 
మనసు మనిషికి చిక్కి బతికే మానవులం 
జీవితాన్ననుభవించి నిష్క్ర మించే వాళ్ళం 
తెరల మాయను తప్పించుకోలేని మానవులం 

అలల్లాగా కదుల్తూ ఆటుపోటు తట్టుకోనేవాళ్ళం 
కరవ్యదీక్షతో దేశసేవకు అంకితమైన మానవులం
భవిషత్ మార్గం బంగారుబాటగా మార్చేవాళ్ళం 
నిత్యం అమ్మా అయ్యా ప్రేమను పొందే మానవులం 

జీవితాన్ని పల్లేరు నుండి నల్లేరుగా మార్చేవాళ్ళం   
కర్మభద్దులమై నిత్య దీపారాధన చేసే మానవులం 
పంచభూతాల ప్రకృతి సహాయంతో బ్రతికేవాళ్ళం 
కాలాని కనుగునంగా  ధర్మంగా ఉండే మానవులం 
--((*))--

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు