1 8 5

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయత మల్లాప్రగడ రామకృష్ణ 

ఓ విద్యార్ధి మేలుకో 
చదువే ధ్యేయమని తెలుసుకో 
కాలాన్ని బట్టి నడుచుకో 
తల్లి, తండ్రి, గురవులే 
ఉన్నతికి కారకులని తెలుసుకో

కాలాన్ని మార్చే అనసూయలా 
ఉండక్కర్లేదు      
సృష్టికి ప్రతిసృష్టి చేసే విశ్వామిత్రలా  
ఉండక్కర్లేదు 
సహస్ర కోటిలింగాలకు రావణుడిలా 
పూజచేయక్కర్లేదు 
తూర్పు,పడమర తిరిగే సూర్యుడిలా
ఉండనక్కర్లేదు 

సోమరి తనాన్ని వదులుకో 
అమృతఘడియలలో చదువుకో 
అతి నిద్ర భోజనం వదులుకో  
విద్యతో క్రీడా విద్య కూడా నేర్చుకో 
    
చదువు ల్లో ఉన్న మర్మాన్ని తెలుసుకో 
తెలియకపోతే పంతుల్నడిగి తెలుసుకో 
మనో ద్రుడ సంకల్పం తో విద్యను నేర్చుకో 
సందేహాలను తెలుసుకొని సరిదిద్దుకో 

ఓ విద్యార్ధి మేలుకో 
చదువే ధ్యేయమని తెలుసుకో 
కాలాన్ని బట్టి నడుచుకో 
తల్లి, తండ్రి, గురవులే 
ఉన్నతికి కారకులని తెలుసుకో

--((*))--

Comments

Popular posts from this blog

శార్దూల పద్యాలు

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు